రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరింది. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతల బ్లడ్‌షుగర్, సోడియం లెవల్ తగ్గాయని, దీక్షను ఇంకా కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డిల చేపట్టిన ఆమరణ దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ జిల్లా వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలను సమైక్యాంధ్రవాదులు కొనసాగిస్తున్నారు