వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసించాడు. అసలు కోహ్లీ అంటే ఒక్క క్రికెటర్ కాదని.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ ల కలబోతే కోహ్లీ అంటూ కొనియాడాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ భీకర ఇన్నింగ్స్ లు ఆడినా అతడి కంటే టెక్నికల్ గా కోహ్లీనే బెటర్ అని చెప్పాడు. భవిష్యత్తులో అందరూ ఆసీస్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ కంటే ముందుగా కోహ్లీని కొలమానంగా చూస్తారని అభిప్రాయపడ్డాడు.