వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలసి నడవాలనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.