జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సుధాకర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ మా నాయకుడు జగన్‌పై చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.