family dispute
-
పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదాల్లో అతిగా జోక్యం వద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. మొదట సమస్యను పరిష్కరించుకునే అవకాశం వారికి ఇవ్వాలని... అది సాధ్యం కాకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ సాధ్యం కాకుంటే.. ప్రతి రెండు గంటలకోసారి భద్రత పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మోహన్‌బాబు, విష్ణులకు రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మోహన్‌బాబు పిటిషన్‌తో..: తనపై దాడి చేశారంటూ మోహన్‌బాబు కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు.. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని.. ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పరస్పర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు. ఇక మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి మోహన్‌బాబు ఇంట్లో తగాదా సృష్టిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఎన్ఎస్ఎస్, సెక్షన్ 126 ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాచకొండ పోలీసుల ఎదుట మోహన్‌బాబు, విష్ణు హాజరుకావాలన్న నోటీసులను నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మోహన్‌బాబు ఇంటి చుట్టూ నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఇక కుటుంబ వివాదంలో మీడియా ఎందుకింత హంగామా సృష్టిస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో పరువుకు నష్టం కలిగించొద్దని సూచించారు. -
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. -
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. -
భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు
సాక్షి, చెన్నై: బిర్యానీ పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో భర్త భార్యకు నిప్పటించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన చెనైలోని ఠాగూర్‌నగర్, అయనవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరణ్ (75), పద్మావతి (66) దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఎవరికి వారు భార్యబిడ్డలతో విడిగా ఉంటున్నారు. కరుణాకరణ్, పద్మావతి మరో చోట నివాసమంటున్నారు. ఒంటరిగా ఉండటం, వయసురిత్యా కారణాలతో పద్మావతి కొద్ది నెలలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈక్రమంలోనే ఆ వృద్ధ భార్యభర్తలమధ్య సఖ్యత కొరవడింది. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. పిల్లలతో కూడా వారికి విభేదాలున్నాయి. ఇక మనస్పర్థల కారణంగా కరుణాకరణ్ కూడా భార్య బాగోగులు సరిగా చూసుకునేవాడు కాదు. ఆమెకు భోజనం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కరుణాకరణ్ మంగళవారం రాత్రి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆయనొక్కడే ఆరగించాడు. దీంతో రగిలిపోయిన పద్మావతి తనకు కూడా బిర్యానీ కావాలని ఆయనతో గొడవపడింది. (చదవండి: ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఆవేశానికి లోనైన కరుణాకరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను పద్మావతిపై పోసి నిప్పటించాడు. ఆమె హాహాకారాలు చేస్తూ భర్తను పట్టుకుంది. ఇద్దరూ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు తలుపులు బద్దలు కొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకరణ్‌కు 20 శాతం, పద్మావతికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పద్మావతి మరణించారు. కరుణాకరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయనవరం పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ) -
పక్కా ప్లాన్! జెండా వందనం చేశాక మాట్లాడాలని పక్కకు పిలిచి..
చిగురుమామిడి(హుస్నాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్ డిగ్రీ, శిరీష(27) ఇంటర్ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్ ఉన్నారు. 2018లో శిరీష అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. (చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..) పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్‌కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్స్టేషన్లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్‌పై అంగన్వాడీ సెంటర్‌కు వస్తోంది. అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. శిరీషను చంపాలని ప్రవీణ్ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్వాడీ సెంటర్ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు చంపవద్దని బతిమిలాడినా వినలేదు సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. (చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి) -
ఆస్తి పంచాయితీ.. రూ.50 వేలు సుపారీ ఇచ్చి సొంత తమ్ముడినే..
యశవంతపుర: అక్క సొంత తమ్మున్ని హత్య చేయించిన ఘటన కలబురిగిలో జరిగింది. నగరంలోని గాజీపూర లేఔట్‌కు చెందిన నాగరాజ్ మటమారి జులై 28న కలబురిగి నగరం నుండి ఆళంద వెళ్తూ మార్గమధ్యలో కెరెభూసగా గ్రామం వద్ద శవమై తేలాడు. దుండగులు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆస్తి కలహాలతో నాగరాజ్ అక్క సునీత రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయిందని చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి
వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్(7)పై చూపుతూ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం. -
భార్యపై కోపంతో.. ఎనిమిదేళ్ల కుమారుడికి నిప్పుపెట్టిన తండ్రి!
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మనసులు కలిసి, మనుషులు ముడిపడే వరకు ఎంతకైనా తెగిస్తుంది. తల్లిదండ్రులను ఎదురిస్తుంది.. బంధుత్వాలను దూరం చేస్తుంది.. కల సాకారం చేసుకున్నా, ప్రేమను గెలిపించుకున్నా.. కొన్ని జీవితాలే కలకాలం నిలుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచేకొద్దీ బలహీనపడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఈ కోవలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పెరిగి పెద్దదైన అనుమానం వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కన్న కొడుకునే మంటల్లోకి నెట్టడం ప్రేమ‘కులం’లో కలంకం. భార్యపై కోపం కొడుకుకు శాపమైంది. ఈ రోజు చంపేస్తానని ఉదయం నుంచీ తిట్టిపోశాడు. పోలీసుల భయంతో పినాయిల్ తాపించాడు.. తాగిన మైకంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఒళ్లంతా కాలిన గాయాలు.. ఒకటే మంట.. ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు.. ఇప్పుడు కూడా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికంటే ఆ చిన్నారి మనసు నాన్ననే కోరుకుంటోంది.. చంపేందుకు యత్నించినా ఆ పసి హృదయం నాన్నను చూడాలి, ఎక్కడని రోదిస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అతను డిగ్రీ పూర్తి చేస్తే.. ఆమె ఇంటర్ చదివింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గం ఒకటే కావడం.. పైగా బంధువులు, ఇరువైపులా ఎలాంటి పట్టింపులు లేకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కోరుకున్న జీవితం సాకారం కావడంతో ఆ ఇద్దరికీ మరో ఇద్దరు పిల్లలు.. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుమానం పెనుభూతమైంది.. తాగుడు తోడై ఆ కుటుంబంలో చిచ్చు రగిల్చింది.. ఏకంగా కన్న కొడుకునే బలితీసుకునే వరకు వెళ్లింది.. ఈ హృదయ విదారక ఘటనకు బట్టికండ్రిగ( నారాయణపురం) పంచాయతీ ఆదిఆంధ్ర వాడ మౌన సాక్ష్యంగా నిలిచింది. వడమాలపేట: బట్టికండ్రిగ(నారాయణపురం) పంచాయతీ, ఆదిఆంధ్ర వాడకు చెందిన చెంగల్రాయుడు, లక్ష్మమ్మ కుమారుడు రమేష్ పుత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన బుల్లయ్య, రమణమ్మ కుమార్తె ఐశ్వర్య తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఒకే సామాజిక వర్గం, పైగా బంధుత్వం ఉండడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు భవనశ్రీ(9), మహేష్(7) సంతానం. పాప నాలుగో తరగతి చదువుతుండగా, బాబు రెండో తరగతి. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో రమేష్ కళ్లను అనుమాన భూతం కమ్మేయగా.. తాగుడుకు బానిసయ్యాడు. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. ఒకానొక సమయంలో ఆమె ఈ బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు సర్దిచెప్పి పంపడం.. ఆ తర్వాత పలుమార్లు వేధింపులతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. భార్య కనిపించకపోవడంతో.. వారం రోజుల క్రితం రమేష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆమె చేయి విరిగింది. నొప్పికి తాళలేక విషయాన్ని అదే ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లి చెప్పుకుంది. ఆమె కూతురిని ఓదార్చి పుత్తూరు సమీపంలోని ఈశలాపురంలో కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్లింది. ఎంతైనా భర్త, పిల్లల మీద ప్రేమ.. ఆదివారం తిరిగి మెట్టింటికి చేరుకుంది. అయితే సోమవారం ఉదయాన్నే రమేష్ ఫూటుగా మద్యం సేవించి ఇంకా వంట చేయలేదని చేయి చేసుకున్నాడు. తన చేయి విరిగిందని, నిదానంగా చేసి పెడతానని బతిమాలినా మద్యం మత్తు చెలరేగింది. విధిలేని పరిస్థితుల్లో కుమార్తెను తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదుతో.. తన కుమార్తెను అల్లుడు తరచూ చితకబాదడాన్ని తట్టుకోలేకపోయిన ఐశ్వర్య తల్లి జరిగిన విషయాన్ని వడమాలపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు రమేష్‌కు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. ఉదయం భార్య వెళ్లినప్పటి నుంచి ఈ రోజు నిన్ను చంపుతానని కొడుకుపై ప్రతాపం చూపించిన రమేష్.. ఇదే సమయంలో పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడని అప్పటికప్పుడు పినాయిల్ తాపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి పుత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇద్దరూ ఇంటికొచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో స్కూటర్‌పై పిల్లాడితో కలిసి పెట్రోల్ బంకులో ఓ బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి సమీపంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమారునిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమీప బంధువు నాగరాజు తేరుకొని తన లుంగీతో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు తోడై మంటలను అదుపుచేసి 108లో బాలుడిని తిరుపతి రుయాకు తరలించారు. ప్రాణాప్రాయ స్థితిలో నాన్న కోసం.. భుజాలపై మోస్తూ.. బండిపై తిప్పుతూ.. అడిగిందల్లా కొనిస్తూ.. కోరిందల్లా తినిపిస్తూ ఎంతో ప్రేమ చూపించిన నాన్న, ఆ రోజు ఎందుకలా చేశాడో ఆ పసి హృదయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. పినాయిల్ తాపించినా తాగేశాడు.. పెట్రోల్ పోసినా ఎందుకని అడగలేదు.. చివరకు నిప్పు పెట్టినా బెదరలేదు.. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఇప్పటి కీ నాన్ననే కలవరిస్తున్నాడు. నాన్న కావాలి, ఎక్కడ ని రోదిస్తున్న తీరుతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. మెరుగైన చికిత్సకు మంత్రి రోజా ఆదేశం ఈ హృదయ విదారక ఘటనతో మంత్రి రోజా చలించిపోయారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై రుయా వైద్యలతో ఆరా తీశారు. శరీరం బాగా కాలిపోయిందని, కొద్ది రోజులు గడిస్తే కాని ఏమీ చెప్పలేమనడంతో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్ రోశయ్య కూడా బాధిత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన విషయమై ఎస్ఐ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కేవలం భార్యపై అనుమానంతోనే ఇలా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
ఇద్దరు పిల్లలను బావిలో పడవేసి హత్యచేసిన తండ్రి
-
పిల్లల్ని బావిలోకి తోసి.. తానూ రైలు కిందపడి
సాక్షి, వరంగల్/మహబూబాబాద్: తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలను కల్లు తాగిస్తానని తీసుకెళ్లిన తండ్రి.. ఇద్దరినీ వ్యవసాయ బావిలో తోసేశాడు. నీట ముని గి వాళ్లిద్దరూ చనిపోయారు. అక్కడి నుంచి వెళ్లి తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసు కున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీ పంలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది. మరో వారంలో పుట్టిన జరుపుకోవాల్సిన బాలుడిని విగతజీవిగా చూసిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలతో ఆట ఆడినట్టు నటించి.. మడ్డిగూడెంతండాకు చెందిన భూక్య రాంకుమార్ (31), అదే తండాకు చెందిన శిరీష 9 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అమీజాక్సన్ (7), కుమారుడు జానీ బెస్టో (3) జన్మించారు. రాంకుమార్‌కు సీఐఎస్ఎఫ్లో ఉద్యోగం రావడంతో ఆరేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. రాంకుమార్, శిరీషల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో భార్య శిరీష.. పిల్లలను విడిచిపెట్టి అదే తండాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. తండ్రి రాంకుమార్ ఇద్దరు పిల్లలను తన ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకొని కల్లు తాగిస్తానని తండాకు దూరంగా ఉన్న వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు పిల్లలతో ఆట ఆడినట్లు నటించి ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి తాను కూడా బావిలో దూకాడు. తర్వాత పిల్లలను బావిలోనే విడిచి పెట్టి తాను మాత్రం పైకి ఎక్కి ఏడ్చుకుంటూ తడి బట్టలతో బైక్‌పై పారిపోయాడు. దగ్గర్లో పని చేస్తున్న వాళ్లు ఇది గమనించి బావి దగ్గరకు వచ్చి చూడగా పిల్లల చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి గాలించగా ఇద్దరు పిల్లలు బావిలో విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో కేసు నమోదు చేశారు. పిల్లలు లేని జీవితం నాకెందుకు.. భార్యతో గొడవ పడి ఇద్దరు పిల్లలను బావిలో పడేసి వాళ్ల మరణానికి కారణమైన తండ్రి రాంకుమార్.. పిల్లలు లేని జీవితం తనకెందుకని ఎస్సీ గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని భార్య శిరీష, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 17న జానీ పుట్టినరోజు ఈ నెల 17న చిన్నారి జానీ బెస్టో పుట్టిన రోజు. పండుగకు, పుట్టినరోజుకు బట్టలు కొనేందుకు బుధవారం మహబూబాబాద్ వె ళ్లాలనుకున్నారు. ఇంతలోనే తండ్రి, ఇద్దరు బిడ్డలు కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్థికపరమైన గొడవలే కారణమా? ఏడాది నుంచి ఇంటి ఖర్చులకు కూడా రాంకుమార్ డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య నిలదీయసాగింది. శిరీషకు చెందిన 18 తులాల బంగారు ఆభరణాలు కూడా ఆయన తాకట్టుపెట్టాడు. జీతం రావడం లేదా అని భార్య అడిగితే బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని చెబుతూ వచ్చాడు. సమాధానం దాటవేస్తూ వస్తుండటం తో తన తమ్ముడు ధరావత్ సిద్ధు ద్వారా శిరీష బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. దీంతో రాంకుమార్ రూ.15 లక్షలు బ్యాంకులో రుణం తీసుకున్నట్లు, రూ.40 వేల జీతంలో రూ.35 వేలు రుణం కింద కట్ అవుతున్నట్లు ఆమె తెలుసుకుంది. రుణం ఎందుకు తీసుకున్నట్టు? రాంకుమార్ బ్యాంకులో రూ.15 లక్షల రుణం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇటు భార్యకు, అటు తల్లిదండ్రులకు కూడా రుణం విష యం చెప్పలేదు. అంతపెద్ద మొత్తం డబ్బు అతడికి ఎందుకు అవసరమైంది, ఎన్ని రోజులుగా బ్యాంకులో డబ్బు కట్ అవుతుందో స్పష్టత లేదు. భార్య కు అనుమానం వచ్చి ఆరా తీస్తే గానీ రుణం విషయం బయటపడలేదు. -
Karimnagar: ‘ఖాకీ’ దిద్దిన కాపురం
‘కరీంనగర్‌కు చెందిన యువకుడికి పక్కజిల్లాకు చెందిన యువతితో రెండేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఎక్కువైంది. చిన్న విషయాలకే పెద్దగొడవలు జరిగాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా సమస్య సద్దుమణగకపోవడంతో మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు.’ సాక్షి, కరీంనగర్: మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ జంటలు విడిపోతామంటూ ఠాణామెట్లు ఎక్కుతున్నారు. చిన్నగొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ.. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఠాణా మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు జిల్లా మహిళా పోలీసుస్టేషన్ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్తజీవితాలను అందించారు. వేరు కాపురాల్లోనే ఎక్కువ.. ► ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా.. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు. ► అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్యం పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు, మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ► తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్యబంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇద్దరికి ప్రశాంతంగా సర్దిచెప్పాలని చెబుతున్నారు. ► దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాల్సింది పోయి, అనుమానం పెంచుకోవడం, పట్టించుకోకపోవడం కాపురాల్లో చిచ్చుపెడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిసకావడం, వివాహేతర సంబంధాలు సరికాదని అంటున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఉంటున్నారని ఎస్సై సురేందర్ తెలిపారు. ► దంపతులు గొడవలతో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు.స్టేషన్‌లోని కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు. సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని మార్గం చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటు అత్తింటివారు, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలి. ఇలా ముందకుసాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుంది. గొడవలు పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్ ఇస్తూ.. దంపతులను కలుపుతున్నాం. – శ్రీనివాస్, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
పెళ్లై 15 నెలలు.. పిల్లలు పుట్టడం లేదని కానిస్టేబుల్..
సాక్షి,రాజేంద్రనగర్: వివాహం జరిగి 15నెలలు గడుస్తున్నా సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేషనల్ పోలీస్ అకాడామీలో వాసు(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వాసుకు 15నెలల కిందట నీలిమతో వివాహం జరిగింది. సంతానం కలగడం లేదని తరుచూ భార్యాభర్తల మధ్య గొడవజరుగుతుంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవయింది. రాత్రి 9గంటల ప్రాంతంలో ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.11గంటల ప్రాంతంలో నీలిమకు మెలుకువ రావడంతో బెర్రంలో చూడగా వాసు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యు కు, చుట్టు పక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా.. టీవీ నటుడిపై కేసు -
భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!
జోధ్‌పూర్: కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని మొబైల్లో వీడియో గేమ్ ఆడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. విక్రమ్ సింగ్(35) అనే వ్యక్తి, భార్య శివ కన్వర్ (30)తో కలసి బీజేస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విక్రమ్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో భార్యతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపం పట్టలేని విక్రమ్ సింగ్ ఇంట్లోని కత్తెరతో భార్యను పదే పదే పొడుస్తూ హత మార్చాడు. అనంతరం పోలీసులు, అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే నిందితుడు వీడియో గేమ్ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు ఉన్నట్లు, సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని సీనియర్ పోలీస్ అధికారి కైలస్దాన్ వెల్లడించారు. -
అంతరాలను పెంచుతున్న ఆస్తులు
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆయన ఆరేళ్లక్రితం చనిపోయారు. బతికి ఉండగా సంపాదించిన ఏడు గుంటల స్థలం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వత అగాధాన్ని పెంచింది. పాతికేళ్లక్రితం పెళ్లై, కట్నం కింద కొంతనగదు, ఇంటి స్థలాన్ని కూడా పొందిన ఆమె తల్లిదండ్రుల మరణానంతరం వాళ్ల ఆస్తిలో వాటాకావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆస్తి పాస్తులు అయిన వాళ్ల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. రక్త సంబంధాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇపుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినవాళ్ల మధ్య అగాధాలు ఆస్తి పంపకాల సమయంలో వాటాలు కావాలని వివాదాలకు దిగుతున్న ఆడపిల్లల విషయంలో.. బంధుత్వాలు భారంగా మారుతున్నాయి. కొద్దిపాటి ఆస్తిలో కూడా వాటా కావాలని భీష్మించుకున్న సందర్భాల్లో విధి లేక వాటా అంటూ ఇస్తే ఇకపై రాకపోకలు బంద్ అని, ఏ రకమైన శుభకార్యాలకు ఆహ్వానాలు ఉండవు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఒçకే రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వతమైన అగాధానికి ఈ ఆస్తి వివాదాలు కారణమవుతున్నాయి. తండ్రి మరణించినా సరే... సవరణ తేదీ నాటికీ కూతురు తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా... ఆమె సంతానం ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. దీంతో ఈ తీర్పు హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆడ పిల్లలకు సమాన వాటా ఉంటుందని ఆ చట్టం చెబుతోంది. చట్టం కావాలంటోంది.. సంప్రదాయం వద్దంటోంది ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలోనే తండ్రి తనకున్న దాంట్లో ఘనంగా వివాహం చేస్తూ కట్న కానుకలను సమర్పించుకుంటాడు. ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యాల సమయంలో కూడా కూతురుకు కట్నాల పేరుతో కొంత సమర్పిస్తారు. ఆస్తిలో వాటా అడగరు అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేస్తారు. ఆస్తుల విభజన సమయంలో ఆడపిల్లల కంటినీళ్లు శుభం కాదనే సెంటిమెంట్‌తో శక్తి మేరకు నగదునో, బంగారాన్నో కానుకగా ఇచ్చి అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటూ ఉండడం ఇప్పటివరకు వస్తున్న సామాజిక సంప్రదాయం. ఆస్తి హక్కులో ఆడపిల్లలకు వాటా అన్న నియమం వచ్చింతర్వాత కట్న కానుకలు తీసుకున్న వాళ్లు కూడా ఆస్తిలో వాటా సమయానికి వివాదాలకు తెరలేపడం, చట్టాన్ని కారణంగా చూపడం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది. సుప్రీం ఏం చెప్పిందంటే.. కొడుకులతోపాటు కూతుర్లకు సమాన ఆస్తి హక్కు ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కుపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పునిచ్చింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దాఖలు అవుతుందని 2005 సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును సవరించింది. 2005 కన్నా ముందే తండ్రి లేదా తల్లి మరణించినా వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంపై అవగాహన పెంచుకోవాలి ఆస్తి హక్కుపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నది నిజమే. అవగాహన లేని కారణంగానే దగ్గర వాళ్లు కూడా చూసుకోలేనంతగా దూరం అవుతున్నారు. సమాన హక్కు అనే చట్టంపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటే అంతరాలు తగ్గుతాయి. ఆడపిల్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వదల్చుకున్న ఆస్తిపై స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు చేసుకుంటే అనంతర కాలంలో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. – ఆవునూరి రమాకాంత్‌రావు, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల బాధ్యతల్లోనూ సమానమని గుర్తించాలి వారసత్వపు ఆస్తిలో మాత్రమే ఆడపిల్లలకు హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు నిర్వహించాలనే కనీస జ్ఞానం కూడా ఉంటే సమాజానికి క్షేమం. రక్త సంబంధీకులు ఆర్థికంగా చితికిపోతే ఆదుకున్న ఆడపిల్లల సంఖ్య అరుదు అనే చెప్పాలి. కొడుకులతోపాటు కూతుర్లు సమానమే..కాదనం.. అది పంపకాల్లో మాత్రమే కాదు బా«ధ్యతల్లో కూడా ఉంటే ఇలాంటి కేసుల ప్రస్తావనే ఉండదని నా అభిప్రాయం. – చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల -
పైశాచికత్వం : భార్యను వివస్త్రను చేసి..
సాక్షి, కామారెడ్డి : భిక్కనూరులో ఓ భర్త పైశాచికత్వం సంచలనం సృష్టించింది. భార్యను చితకబాదిన సదరు ప్రబుద్ధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపైకి గెంటేశాడు. బంధువులు, పరిచయస్తులు ఆమెకు దుస్తులు అందించారు. తీవ్ర అవమానాల నేపథ్యంలో ఆమె నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త పైశాచికత్వంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం మండలం సార్వా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గల్ఫ్‌లో ఉన్న భార్య ఫోన్ చేయలేదనే కోపంతో భర్త అలీష తన ఇద్దరు పిల్లలను చితకబాదాడు. దాంతోపాటు ఆ దృశ్యాల్ని వీడియో రికార్డు చేసి.. తనకు ఫోన్ చేయకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ భార్యపై బెదిరింపులకు దిగాడు. వీడియో వైరల్ కావడంతో పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు అలీష ఇంటికి వెళ్లారు. అయితే, వీడియో చూసిన వారి బంధువులు అప్పటికే పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. పరారీలో ఉన్న నిందితుడు అలీష కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని సంతపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంతపేటలోని ఓబులంపల్లి కాలనీలో రవి భార్య భువనేశ్వరి, కూతురు గాయిత్రి (9), తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఓ స్థలం విషయంలో కుటుంబంలో రెండు మూడు నెలలుగా గొడవ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని రవి, భువనేశ్వరి, గాయత్రి ప్రాణాలు తీసుకున్నారు. అయితే, స్థలం విషయంలో గొడవతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారా.. మరేదైనా కారణముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కుటుంబలో ముగ్గురి ఆత్మహత్య
-
అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి
సాక్షి, జనగామ : జిల్లాలోని నర్మెట్ట మండలం శివభూక్య తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత కన్న బిడ్డల్ని నరికి చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడింది. భానోతు రమ పిల్లలు భాను శ్రీ (4), వరుణ్ (3)ను అతి దారుణంగా కత్తితో నరికి చంపింది. అనంతరం మెడ కోసుకుని తనూ చనిపోయేందుకు యత్నించింది. కొన ఊపిరితో ఉన్న రమను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె భర్త చెప్తుండగా.. భర్త వేధింపుల కారణంగానే రమ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతితో తండా వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పోలీస్‌స్టేషన్‌పై మహిళ దాడి
-
భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!
టెక్కలి : పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే కోపంతో ఓ వివాహిత వారికి చుక్కలు చూపెట్టింది. అరెస్టైన భర్తను బెయిల్‌పై విడుదల చేయడంతో వీరంగం సృష్టించింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేసింది. ఈ ఘటన టెక్కలి పోలిస్‌స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పాతపట్నానికి చెందిన వందనాదేవి, భవానీపురానికి నాగరాజు దంపతులు. వీరి మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ వివాదాల కేసు నడుస్తోంది. ఈకేసులో నాగరాజుకు అరెస్టు వారెంట్ జారీ చేసి టెక్కలి పోలిస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే, అరెస్టు చేసిన వెంటనే నాగరాజును విడిచిపెట్టారనే కోపంతో దేవి రెచ్చిపోయింది. పోలిస్‌స్టేషన్ అద్దాలు పగులగొట్టి రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది. -
గుంటూరు జిల్లా మోతుకూరులో దారుణం
-
కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్..
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రాణం తీసిన చికెన్ గొడవ
చెన్నారావుపేట(నర్సంపేట): కొడుకే కాలయముడయ్యాడు.. చికెన్ కూర విషయంలో గొడవపడి చితకబాది తండ్రిని హత్య చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తుల ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన మేర్గు సంజీవ(58), పద్మ దంపతులకు కుమారుడు నర్సయ్య ఉన్నాడు. గ్రామంలో సంజీవ నీరటిగా పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురు మూడు నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో పనిచేసేందుకు వెళ్లారు. నర్సయ్య మూడు రోజుల క్రితం పాపయ్యపేటకు రాగా, గురువారం సాయంత్రం సంజీవ, పద్మ కూడా వచ్చారు. జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్న నర్సయ్య తాను మూడు రోజులుగా అన్నం తినలేదని, వండి పెట్టాలని తల్లిని అడిగాడు. దీంతో తల్లి తన భర్త సంజీవకు చికెన్ తీసుకురమ్మని పంపింది. బయటికి వెళ్లిన సంజీవ రెండు గంటలు దాటిన తర్వాత చికెన్ తీసుకొని వచ్చాడు. తనకు ఆకలి అవుతోందని, చికెన్ ఎందుకు వండలేదని తల్లిని అడుగుతుండగా సంజీవ కల్పించుకుని కొడుకుపై కోపం చేశాడు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్లావని కొడుకు తండ్రిని నిలదీయడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసుకుంటూ వచ్చారు. ఇంతలో నర్సయ్య గుడిసెలో ఉన్న పారను చేతిలోకి తీసుకొని తండ్రి తలపై కొట్టాడు. దీంతో అతడు పక్కనే ఉన్న రాళ్లపై పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ సునీతామోహన్, నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై కూచిపూడి జగదీష్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. జరిగిన ఘటన విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. నిందితుడు నర్సయ్య పరారీలో ఉన్నాడు. -
గన్నుతో భర్త చెవులు కాల్చేసి..
కోల్‌కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్‌ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు. తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్‌పుర్‌కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
జంబలకడిపంబ: భర్తకు భార్య వేధింపులు!
సాక్షి, బెంగళూరు: భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంత మంది ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు మనం భార్యలను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసే భర్తలను చాలా మందిని చూసుంటాం. అయితే ఇటీవల దీనికి భిన్నంగా ఓ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో తన భార్య అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్య వేధింపులకు గురిచేస్తోందని మహదేవపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నెక్లెస్ కోసం రూ. 30 లక్షలు, ఆమె చెల్లెలి పెళ్లి కోసం రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ వేధిస్తోందని పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిగుడ్డు కూర వండలేదని భార్యపై కాల్పులు
లక్నో: కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో మూర్ఖుడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన నవనీత్(33)కు 12 ఏళ్ల క్రితం మంగేశ్ శుక్లా(30) తో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన నవనీత్ గురువారం పీకలదాకా మద్యం తాగి ఇంటికొచ్చాడు. అనంతరం తనకు కోడి గుడ్డు కూర వండాలని భార్యతో ఘర్షణ పడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవనీత్ ఇంట్లో ఉన్న తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని, తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందకు యత్నించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. శుక్లా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నవనీత్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. శుక్లా ముగ్గురు పిల్లలను నవనీత్ తల్లిదండ్రులకు అప్పగించారు. -
మిత్రుడిపై అనుమానం.. బండరాయితో బాది..
పుణె : భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మిత్రుడి తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడో వ్యక్తి. ఈ సంఘటన సోమవారం మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె జిల్లాకు చెందిన మందర్ షిండే, అదే ప్రాంతానికి చెందిన యోగేష్ హరిభౌ దోనే మంచి మిత్రులు. యోగేష్ తరుచూ మందర్ షిండేను ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఓ రోజు యోగేష్ అందరి ముందు మందర్ భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో మందర్ అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. యోగేష్‌ను మందు తాగటానికి పిలిచి మద్యం మత్తులో ఉండగా అతని తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేశాడు. ఈ హత్య చేయటానికి గణేష్ కవాలే, భూషణ్ గైక్వాడ్ అనే ఇద్దరి మిత్రుల సహాయం తీసుకున్నాడు. హత్య అనంతరం ఆ ముగ్గురు శవాన్ని పన్షత్ సమీపంలో పడవేశారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్ కవాలేపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. యోగేష్‌పై ఉన్న కోపంతోనే మందర్ అతన్ని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
వీడసలు మనిషేనా... పసికందుని ఆటోకేసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచోసుకుంది. భార్యభర్తల గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణ కోల్పొయి రాక్షసుడిగా ప్రవర్తించాడు. తన భార్యపై కోపాన్ని పసికందుపై చూపించాడో కసాయి తండ్రి. ఓ వ్యక్తి నెలల పసికందుని అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. పోలీసుల ఎదుటే ఈ దాష్టికానికి ఒడిగట్టడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా శివగౌడ్ తన భార్య దుర్గాను వేధిస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడగా.. ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకొచ్చి శివగౌడ్ అక్కడే ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివగౌడ్ పరారీలో ఉన్నాడు. -
భార్య కాపురానికి రాలేదని.. బావమరిది కొడుకును..!
సాక్షి, హైదరాబాద్ : భార్య కాపురానికి రావడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా బావమరిది కొడుకును ఎత్తుకెళ్లాడు. 20 నెలల చిన్నారిని అపహరించి.. తన భార్యను కాపురానికి పంపిస్తేనే బాలుడిని తల్లిదండ్రులకు ఇస్తానని బెదిరింపులకు దిగాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీజ్ నగర్ గేట్ సమీపంలోని గోల్డెన్ ఫామ్‌లో ఉంటూ కూలి చేసుకునే యాలాల మండలానికి చెందిన కృష్ణకు, భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భాగ్యలక్ష్మికి కృష్ణ గతంలో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి తన అన్న దగ్గర ఉంటున్నారు. భాగ్యలక్ష్మికి ఆమె అన్న దగ్గర ఉండటంతో ఆగ్రహించిన కృష్ణ.. 20 నెలల అన్న కొడుకును ఎత్తుకెళ్లాడు. ‘మీ చెల్లెల్ని నాతో కాపురానికి పంపిస్తేనే.. కొడుకును ఇస్తాను’ అంటూ అతను భాగ్యలక్ష్మి అన్నకు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కృష్ణ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భాగ్యలక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేప్ కేసులో బాలీవుడ్ నటుడి కుమారుడికి బెయిల్
న్యూఢిల్లీ : రేప్ కేసులో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిలకు ఢిల్లీ కోర్టు శనివారం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించడంతో జడ్జి అశుతోష్ కుమార్ బెయిల్ ఇచ్చారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని నీల్గిరి జిల్లా ఊటీలో మహాక్షయ్ చక్రవర్తి పెళ్లి, హీరోయిన్ మదాలసా శర్మతో జరగాల్సి ఉంది. ఈ ఘటనతో పెళ్లి రద్దు అయింది. తనకు మహాక్షయ్‌తో నాలుగు సంవత్సరాలుగా ఫిజికల్ రిలేషన్ ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడని రేప్ ఆరోపణలు చేసిన మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహాక్షయ్ వల్ల తాను గర్భవతిని అయ్యాయని, ఈ విషయం తెలిసి తనకు తెలియకుండా మాత్రలు మింగించి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో తెలిపింది. యోగితా బాలి తన చంపుతానని బెదిరిస్తోందని, మహాక్షయ్‌తో సంబంధం పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిందని కూడా ఫిర్యాదులో వెల్లడించింది. తనకు యోగితా బాలి, మహాక్షయ్‌తో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా కోరింది. ప్రాథమిక వివరాలను బట్టి యోగితా బాలి, ఆమె కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిలపై చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని, ఆ ప్రకారం దర్యాప్తు చేపట్టవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. -
శాడిస్ట్ కానిస్టేబుల్ భార్య మృతి
సాక్షి, కృష్ణా : విజయవాడలో ఈ నెల ఒకటో తేదిన ఓ కానిస్టేబుల్, తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్రగాయాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసన్న ఈ రోజు ఉదయం( శనివారం) మృతిచెందింది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. నిత్యం భర్త మురళీ వేధింపులకు గురిచేయడంతో విసుగెత్తిన భార్య జులై 1న కిరోషిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నాం చేసింది. 90 శాతం కాలిన గాయాలతో లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాటం చేసి మరణించింది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. తన కూతురిపై అల్లుడు మురళీ కృష్ణనే కిరోషిన్ పోసి నిప్పు పెట్టాడని ప్రసన్న కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెజవాడలో శాడిస్ట్ కానిస్టేబుల్ -
తాగుడుకు డబ్బులివ్వలేదని..
దతియా(మధ్య ప్రదేశ్): తాగుడుకు డబ్బులివ్వలేదని భార్యపై కాల్పులు జరిపి పిల్లలను కత్తితో పొడిచాడో భర్త. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లా ఇంద్రగడ్ గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మోను జా(32), జ్యోతి(30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. మోను జా నిత్యం తాగుతూ భార్యాపిల్లల్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. మద్యానికి డబ్బులు కావాలని కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు. శుక్రవారం ఉదయాన్నే వచ్చి మద్యానికి డబ్బులు కావాలని భార్యను బెదిరించాడు. డబ్బులు ఇవ్వడానికి భార్య నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న దేశీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఐదేళ్ల, ఆరు నెలల కూతుళ్లపై కత్తితో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న మిగతా కుటుంబసభ్యులు గాయపడిన వారిని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరు నెలల చిన్నారి మృతిచెందింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడు మోనుజా పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
భార్య బతికుండగానే దశదిన కర్మ అంటూ..
-
బెజవాడలో శాడిస్ట్ కానిస్టేబుల్
కృష్ణా జిల్లా : విజయవాడలో ఓ కానిస్టేబుల్, తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల ఒకటో తేదీని జరిగింది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. నిత్యం భర్త మురళీ వేధింపులకు గురిచేయడంతో విసుగెత్తిన భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాడుతోంది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
గోవిందరావుపేట: గోవిందరావుపేట మండలకేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. ఆతుకూరి ప్రసాద్(45), స్వరూప(38)లకు 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె నందిని, కుమారుడు అజయ్ సంతానం. కుమార్తెకు మూడేళ్ల క్రితమే పెళ్లి కాగా కుమారుడు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. భర్త ప్రసాద్ నిత్యం తాగుతూ ఇంటికి వచ్చి భార్యతో గొడవలు పెట్టుకునే వాడని స్థానికులు తెలిపారు. ప్రసాద్ వెల్డింగ్ పనులు చేసుకుంటుండగా, స్వరూప రోజూ కూలిపనికి వెళుతూ జీవిస్తున్నారు. నిత్యం గొడవలతో గతంలో పలుమార్లు పెద్ద మనుషుల మద్య పంచాయతీలు జరిగాయి. కానీ ప్రసాద్ తీరు మార్చుకోకుండా తాగి నిత్యం గొడవలు చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తాగి ఇంటికి వచ్చిన ప్రసాద్ మళ్లీ భార్యతో గొడవకు దిగాడు. ఇదే సమయంలో కోపంతో ఇంటిపై ఉన్న సిమెంట్ రేకులను ధ్వంసం చేశాడు. దీంతో విసిగిపోయిన స్వరూప ఇంటి ముందు ఉన్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుంది. ఆమె చనిపోయిన విషయం గ్రహించిన ప్రసాద్ తనను అంతా కలిసి ఏం చేస్తారోనని భయపడి ఇంట్లోకి వెళ్లి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి పస్రా పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
కేబీఆర్ పార్కులో ఐపీఎస్ అధికారి భార్యపై దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి భార్యపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితికి గురైన ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్చారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్లో నివసించే ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ భార్య సుజాత మంగళవారం సాయంత్రం 5:30 ప్రాంతంలో కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారు. గౌని వెంకటరమణ (40) అనే వ్యక్తి ఆమెను అనుసరిస్తూ ఓ కర్రతో తలపై బలంగా కొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయమై, ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే చుట్టుపక్కల వాకర్లు బాధితురాలిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో అక్కడి నుంచి పరారవుతున్న వెంకటరమణను వాకర్లతో పాటు సెక్యూరిటీ గార్డులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వాకర్లను భయాందోళనకు గురిచేసింది. కర్రతో పరుగులు తీస్తున్న వ్యక్తిని చూసి కొందరు వాకర్లు బయటకు పరుగులు తీశారు. కాగా బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితుని మానసిక స్థితిపై బంజారాహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు గత 20 రోజుల నుంచి రెక్కీ నిర్వహించి ఆమెను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడని వారి విచారణలో తేలింది. ఘటనాస్థలాన్ని పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటి వేధింపులతో యువకుడు ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. ‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్... ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక పోలీసులు గురువారెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సెల్ఫీ సూసైడ్: నా చావుకి వాళ్లే కారణం
-
అద్దెకు భార్యలు!!
స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది. పురాణాలు, ఇతిహాసాల్లో సైతం వారికి పెద్దపీటనే వేశాయి. అలాంటి ఈ దేశంలో నేడు స్త్రీ అంగడిలో ఆటబొమ్మగా, ఒక వస్తువుగా మారిపోయింది. ఎంతలా అంటే అద్దెకు అమ్ముడుపోయేంతగా. సమాజంలో అన్ని వస్తువులు అద్దెకు తెచ్చుకునే సంస్కృతి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లో సమాజం తలదించుకొనేలా మహిళలను అద్దెకు ఇస్తారు. ఇలాంటి దారుణాలు మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్, గుజరాత్లో తరచూ జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వొచ్చట. స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలబెడతారు. గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. -
భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య
-
దారుణం : అనుమానంతో భార్యకు గుండు కొట్టించి..
సాక్షి, చీమకుర్తి : భార్య.. రెండు అక్షరాల పదం.. భర్తతో మూడు ముళ్లు వేయించుకొని.. ఏడడుగులు నడిచి.. తల్లి దండ్రలను విడిచి, తాళి కట్టిన వాడితో కష్టసుఖాల్లో తోడుగా నిలిచేదే భార్య. అలాంటి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురిచేశాడో భర్త. అనుమానం పెంచుకొని ఊరందరి ముందు భార్యను దారుణంగా అవమానించాడు. నాగరికత రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నకాలంలో అనాగరిక చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అమానవీయ చర్య చోటుచేసుకంది. సమాజం సిగ్గుతో తలదించుకొనే రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మిలకు ఎనిమిదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస రావు భాగ్యలక్ష్మిని వేధించడం మొదలు పెట్టారు. మంచీ చెడు చెప్పాల్సిన శ్రీనివాస రావు తండ్రి, కొడుకును సమర్దిస్తూ వేధింపుల్లో వాట పంచుకున్నాడు. ప్రతి గుడికి తీసుకెళ్తూ.. మరోసారి ఆ పని చేయనంటూ ఆమె చేత చెప్పిస్తూ చెంపలేయించారు. ఇంత దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు ఆమెకు మద్దతుగా రాలేదు. అనంతరం కాపురం చేయలేనంటూ పుట్టింటికి పంపించాడు. అయితే బంధువులు వత్తడి తీసుకురావడంతో భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చాడు. కానీ వేరే గదిలో ఉండాలంటూ హెచ్చరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి భాగ్యలక్ష్మిని విచారించగా.. ఫిర్యాదు ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. చివరకు కుటుంబ సభ్యుల మద్దతుతో మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గోడవతలి పాట
ఇంటì కెళ్లకుండా కొన్ని గంటలుగా బయట బయటే తిరుగుతున్నాడు ఖడ్గధారి. ఇంటికెళితే భార్య ఏడుపు చూడలేడు. అందుకే బయట తిరుగుతున్నాడు. అతడితో పాటు అతడి ఆలోచనలూ తిరుగుతున్నాయి. భర్త చనిపోతే భార్య ఎందుకు ఏడుస్తుందో అతడికి అర్థం కావడం లేదు! కడుపున పుట్టినవాళ్లు చనిపోతే ఏడ్వడంలో అర్థం ఉంది. కట్టుకున్నవాడు కడుపున పుట్టినవాడు కాదు. మరెందుకు ఏడుస్తారు ఈ ఆడవాళ్లు?! భర్తనేవాడు ఎక్కడో బయటి నుంచి వస్తాడు. ఎప్పుడో చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. మధ్యలో కొన్నాళ్లు కలిసి ఉన్నందుకేనా ఇంత దుఃఖం! భార్య మీద కోపం వచ్చిందతడికి. పెద్ద పిల్లే కదా. చావులు చూడకుండానే పెరిగిందా! ఇదేమైనా చావులు లేని లోకమని ఎవరో చెబితే నమ్మి వచ్చేసిందా! చికాకేసింది ఖడ్గధారికి. భార్య అమాయకత్వం అతడిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఎట్లా బతుకుతుందీ అనుకున్నాడు. ఆ వెంటనే మళ్లీ అనుకున్నాడు. తను ఆమెను బతికించిందేమీ లేదు కనుక, ఎలా బతుకుతుందన్న చింత తనకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఆమె ఏడుపే! ఎవరూ పట్టలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటోంది. స్పృహ తప్పి పడిపోతోంది. ముఖం మీద నీళ్లు చల్లుతున్నారు. కళ్లు తెరిచి చూసి, మెడలో మంగళసూత్రాన్ని రెండు గుప్పెళ్లతో బిగించి పట్టుకుని, దేవుణ్ణి శాపనార్థాలు పెడుతోంది! రోజూ పూజ చేసే దేవుణ్ణేనా తను ఇంతగా తిట్టగలుగుతోంది?! ఖడ్గధారి చనిపోయి అప్పటికి కొన్ని గంటలే అయింది. ఆ ఉదయం నోట్లో బ్రష్ పెట్టుకుని పళ్లు తోముకుంటూ, కళ్లు మూసుకుని పక్కింట్లోంచి టీవీలో వస్తున్న డైలాగులేవో వింటూ అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. అవేమీ గుండెను ఆపేంత బరువున్న డైలాగులు కావు. వాటికి సంబంధం లేకుండా గుండె తనకై తాను ఆగిపోయింది. తను విన్న ఆ చివరి డైలాగ్ ఖడ్గధారికి గుర్తుంది. ఏ సినిమాలోనిదో మరి. రాజేంద్రప్రసాద్ అంటుంటాడు.. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అని. ఆ మాట.. కోట శ్రీనివాసరావుతోనో, మరెవరితోనో అంటున్నట్లున్నాడు. ఖడ్గధారికి ఓ అలవాటుంది. మాట గానీ, పాట గానీ ఏదీ పూర్తిగా వినడు. టీవీ అయినా అంతే. సినిమా అయినా అంతే. మనుషులైనా అంతే. వినకూడదనేం కాదు, కొంత విన్నాక, కొంత చూశాక తనకు తెలియకుండానే ఆ విన్నదాన్ని, ఆ చూసినదాన్ని పట్టుకుని తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోతాడు. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అన్న మాటను పట్టుకున్నాయి అతడి ఆలోచనలు. అసలు ఆడవాళ్లు ఇప్పుడైనా, ఎప్పుడైనా అమాయకంగా ఎందుకుండాలి? ఉంటారని ఎందుకనుకోవాలి? ఒకవేళ ఆడవాళ్లు అమాయకులే అయితే, వాళ్లను అమాయకులుగా ఉంచేసింది మగవాళ్లే కదా.. ఇలా ఆలోచనలు సాగుతూ ఉండగా.. నోట్లో బ్రష్షు నోట్లో ఉండగానే టప్పున ఎగిరిపోయాడు ఖడ్గధారిలోని జీవుడు! ఖడ్గధారి కుప్పకూలిన విషయం లోపల ఉన్న భార్యకు తెలీదు. ఎప్పట్లా అతడు బయట సింకు దగ్గర నిలబడి గోడవతలి నుంచి వచ్చే పాటల్ని, మాటల్ని వింటూ కాలకృత్యాలను మెల్లిగా కానించుకోవడం ఆమెకు తెలియని సంగతేం కాదు. ప్రతి ఉదయం అతడికి అదొక ఇష్టమైన వ్యాపకం.పక్కింట్లోంచి వినిపించే పాటే.. వీళ్లింట్లోనూ వస్తుంటుంది. అయితే అది అతడి గమనింపులో ఉండదు! అటువైపు నుంచి వచ్చే పాటలకు, మాటలకు మాత్రమే అతడు ట్యూన్ అవుతాడు. ఆ అలవాటు అతడికి ఎలా అయిందనే మాట అటుంచితే.. అది ఎంతలా అయ్యిందంటే.. పక్కింటివాళ్లు ఓసారి నాలుగు రోజులు ఊరెళ్లినప్పుడు ఖడ్గధారి బాగా ఇబ్బందిపడిపోయాడు. ఆ సంగతిని అతడి భార్య ఏదో సందర్భంలో పక్కింటి వాళ్లతో చెప్పింది కూడా. అందుకు వాళ్లు ఎంతగానో సంతోషించారు. తిరిగినంతా తిరిగి, ఇంటివైపు నడుస్తున్నాడు ఖడ్గధారి. తన భార్య ఇంకా గుండెలు బాదుకుంటూనే ఉంటుందా? ఏడిచే ఓపిక కూడా లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుందా? చీకట్లో నడుస్తూ ఆలోచిస్తున్నాడు. దారి మధ్యలో శ్మశానం ఉంది. అది దాటుకుని కిలోమీటరు దూరం వెళితే ఖడ్గధారి ఇల్లు వస్తుంది. నడక మధ్యలో ఓ మనిషి ఖడ్గధారికి తగిలాడు. ఖడ్గధారిని అతడు అనుమానంగా చూశాడు. ‘‘ఏంటలా చూస్తున్నావు?’’ అడిగాడు ఖడ్గధారి. ‘‘ఈ దారిన, ఈ సమయంలో వెళ్లేవాళ్లందర్నీ నేను ఇలాగే చూస్తాను. నన్ను ఈ శ్మశానం నుంచి దాటిస్తారా?’’ ప్రాధేయపడినట్లుగా అడిగాడు ఆ వ్యక్తి. ‘దెయ్యాలంటే ఈ మనుషులెందుకు ఇంత భయపడి చస్తారో’ అనుకున్నాడు ఖడ్గదారి. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ‘‘ఎప్పుడో గానీ ఈ దారి గుండా రాను. కానీ నేనెప్పుడు ఇటువైపు వచ్చినా ఒక చితి కాలుతూ ఉంటుంది’’ అన్నాడు ఆ వ్యక్తి. ఖడ్గదారి అతడివైపు, చితివైపు చూశాడు. దూరంగా కాలుతున్న చితి మంటల వెలుగులో అతడి ముఖంలోని భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చితిలో మండుతున్నది తనేనని అతడికి చెప్తే! ‘‘ఏమైనా మాట్లాడండి.. మౌనంగా ఉంటే నాకు అదోలా ఉంది’’ అన్నాడు ఆ భయపడుతున్న మనిషి. మాట్లాడే మూడ్‌లో లేడు ఖడ్గధారి. ‘నువ్వే మాట్లాడొచ్చు కదా’ అనొచ్చు. కానీ అతడు మాట్లాడినా వినే మూడ్ ఖడ్గధారికి లేదు. భార్య గురించి ఆలోచిస్తున్నాడతడు. తనిక్కడ చితిలో ఉంటే తనక్కడ కాలిపోతూ ఉంటుంది. త్వరగా ఇంటికి చేరుకుని, ‘ఇలాగైతే ఎలా! ధైర్యంగా ఉండలేవా?!’ అని ప్రేమగా మందలించాలని అతడి మనసు ఆరాటపడుతోంది. ఖడ్గధారి, ఆ వ్యక్తి.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే కొంత దూరం నడిచారు. చితిని కూడా దాటుకుని ముందుకు నడిచారు. ‘‘ఒక్కటే అనుకున్నాను’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘ఏంటి.. ఒక్కటే ?’’ అని అడిగి, సమాధానం వినకుండా మళ్లీ ఆలోచనల్లో పడిపోయాడు ఖడ్గధారి. మరికొంత దూరం కలిసి నడిచాక, ఇద్దరూ విడిపోయారు. ఖడ్గదారి నేరుగా తన ఇంటివైపు వెళ్లాడు. ఇంటి దగ్గర వీధిలో మాటలు వినిపిస్తున్నాయి. ‘‘ఇద్దర్నీ పక్కపక్కనే పేర్చారు. ఎంతైనా భార్య కదా. పాడెను లేపుతుంటే చూళ్లేక అక్కడే కుప్పకూలిపోయింది’’.‘‘పక్కింటి వాళ్లతో ఏవేవో ఆలాపనగా మాట్లాడిందట. ‘ఆయన చనిపోలేదు, ఉదయాన్నే టీవీ పెట్టడం మర్చిపోకండి’ అని అంటుంటే వాళ్లకు కన్నీళ్లు ఆగలేదట’’. ఖడ్గధారి గుండె ముక్కలయింది. తిరిగి అతడు చితి వైపు గాలిలోకి లేస్తుండగా ఎవరో అంటున్న మాట చెవులకు సోకింది – ‘‘ఈ భార్యలు ఇంత అమాయకంగా ఉంటారెందుకో!’’ - మాధవ్ శింగరాజు -
అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలు అమ్మకానికి..
-
భార్యాపిల్లలు అమ్మకానికి..
సాక్షి, నంద్యాల : చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో.. రెండో కుమార్తె(13)ను రూ.1.50 లక్షలకు తన దూరపు బంధువుకు అమ్మేశాడు. అంతటితో ఆగకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని జులాయిగా తిరుగుతూ సుమారు రూ.15 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి తన భార్యను సైతం రూ.5 లక్షలకు తన చిన్నన్నకు అమ్మకానికి పెట్టాడు. ‘నువ్వు సంతకం చేస్తే మా అన్న నాకు డబ్బులు ఇస్తాడు’ అంటూ భార్యను వే«ధించసాగాడు. దీంతో ఆమె కోవెలకుంట్ల నుంచి నంద్యాలలోని తన తల్లి వద్దకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినా మద్దిలేటి పిల్లలను తన వెంట పంపించాలని వేధించసాగాడు. దీంతో బాధితురాలు వెంకటమ్మ, ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారదకు విషయం తెలిపింది. తన రెండో కుమార్తెను బంధువులకు అమ్మాడని, ఆ పత్రాలు బుజ్జి అనే వ్యక్తి వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పించాలని బాధితురాలు కోరింది. ఈ మేరకు బాధితురాలితో రాత పూర్వకంగా రాయించుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ పదిరోజుల క్రితం తన భర్త, బావ వేధిస్తున్నారని వెంకటమ్మ ఫిర్యాదు చేసిందని, ఈ విషయం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఉందని చెప్పారు. బాధితురాలి భర్త, బావలను పిలిపించి విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
తండ్రిని హత్య చేశాడని పగతో భర్తను చంపేసిన భార్య
-
ఎనిమిదేళ్ల పగతో భర్తను..
గొల్లపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌లో దారుణహత్య జరిగింది. కుటుంబ కలహాలతో భార్య భర్తను సిమెంటురాయితో మోది, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు తన పిల్లల సహకారం తీసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. దట్నూర్ గ్రామానికి చెందిన అలిశెట్టి రమేష్(50)కు భార్య రమ, కుమార్తెలు నాగరాణి(17), నవ్య(13), కొడుకు గవాస్కర్(15) ఉన్నారు. రమేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రమేశ్ కుటుంబ సభ్యు లు అందరూ కలిసి మంగళవారం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. అందులో పసుపు కొమ్ములు నాటి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో వం టకోసమై కోడిగుడ్లు తీసుకురావడానికి రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోగానే చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో భార్య రమ, కూతురు నాగమణి కలిసి రమేశ్‌పై దాడికి దిగారు. రమ సిమెంట్ ఇటుకతో రమేశ్ తలపై మోదింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో దగ్గరికి వస్తే తమనూ చంపేస్తానని రమ హెచ్చరించడంతో వెనకడుగు వేశారు. ఇంతలో కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌పై మరోసారి మారణాయుధాలతో దాడి చేసింది రమ. దీంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నిందితురాలు పరారీలో ఉందని గొల్లపల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. తండ్రి హత్యే కారణమా..? అయితే రమేశ్ హత్య వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేశ్ తన మామ(భార్య రమ తండ్రి) కొండి మల్లయ్యను 2010లో గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి నుంచి పగ పెంచుకున్న రమ ప్రతీకారంగానే తన భర్తను చంపినట్లు తెలుస్తోంది. -
చచ్చినట్లు నాటకమాడి.. భార్య, అత్తమామలను..
లక్నో : భార్య, అత్తమామలపై ప్రతీకారం తీర్చుకోవటానికి చచ్చినట్లు నాటకమాడాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాకు చెందిన పన్నెలాల్ యాదవ్‌ను కొన్ని సంవత్సరాల క్రితం భార్య , అత్తమామలు వేధింపుల కేసుకింద జైలులో పెట్టించారు. కొద్ది రోజుల తర్వాత ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకుని అతన్ని బయటకు రప్పించారు. అప్పటి నుంచి భార్య, అత్తమామలపై క్షక్ష్య పెంచుకున్న యాదవ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యాదవ్‌కు ఓ ఉపాయం తట్టింది. తాను చనిపోయినట్లు నాటకమాడి భార్య కుటుంబాన్ని హత్య కేసులో ఇరికించాలని అనుకున్నాడు. 2016 అక్టోబర్ నెలలో అత్తమామలను కలవటానికి వారి ఇంటికి వెళుతున్నానని చెప్పి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. నెలలు గడుస్తున్నా యాదవ్ ఆచూకీ లభించకపోయే సరికి అతని కుటుంబ సభ్యులు భార్య, అత్తమామలే చంపి, శవాన్ని కనపడకుండా చేసుంటారని భావించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోకపోవటంతో యాదవ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతని భార్య, అత్తమామలపై హత్య, ఆధారాలను చెరిపివేశారన్న కారణాలతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ముంబైలోని మీరా రోడ్లో ఓ వ్యక్తిని రెండు సంవత్సరాలుగా మారు వేశాలతో తిరుగుతున్నాడన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆవ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన పన్నెలాల్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్య కుటుంబాన్ని ఇరికించాలనే.. యాదవ్ తన కుటుంబం సహాయంతో నాటక మాడాడని తేలింది. భార్య కుటుంబాన్ని ఇరికించాలని చూసిన యాదవ్‌ను అతని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చూపున్న కాళ్లు.. నడకనేర్పుతున్న కళ్లు !
సూర్యాపేట : నడవ లేని ఆమె కాళ్లు చూపులేని ఆయనను నడిపిస్తున్నాయి... అలాగే చూపులేని ఆయన కళ్లు ఆమెకు దారిచూపుతున్నాయి. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. కాళ్లు లేని ఓ మహిళ మూడు చక్రాల రిక్షాపై కూర్చొని కళ్లు లేని తన భర్తసాయంతో ఆ రిక్షాను నడిపిస్తూ బతుకుబండిని లా గిస్తోంది. సూర్యాపేట పట్టణానికి చెందిన శోభ– సత్తయ్య దంపతులకు ఎవరూ లేకపోవడంతో పొట్ట కూటికోసం స్థానిక పాత శివాలయం వద్ద ఇలా యా చిస్తూ సాక్షి కెమెరాకు చిక్కారు. అయితే సత్తయ్యకు రెండు కళ్లు కన్పించవు.. శోభకు కాళ్లు కదలలేని పరిస్థితి. కాగా వీరి ప్రయాణం మాత్రం భర్త మూడు చక్రాల బండిని తోసుకుపోతుండగా.. భార్య దారి చూపుతోంది. వీరిని చూసేవారు అయ్యో పాపం అనుకుంటున్నప్పటికీ ఈ వృద్ధ దంపతుల అనోన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు. -
ఆర్మీ అధికారి భార్య హత్య కలకలం
-
అప్పులతోనే చిన్నాభిన్నం
జయనగర : వ్యాపారంలో వచ్చిన నష్టాలతోనే పారిశ్రామికవేత్త గణేశ్ సహనం కోల్పోయి భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. హాసన్ జిల్లాకు చెందిన గణేశ్ కాఫీ తోటలు విక్రయించి వచ్చిన డబ్బుతో కెంగేరిలో హెర్బల్ ఉడ్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కావడంతో రిసార్టు అమ్మకానికి పెట్టాడు. ఇదే సమయంలో భార్య సహాన ఆస్తి విక్రయానికి సమ్మతించకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన గణేశ్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరి పాడు. తనకు హత్య చేసే ఉద్దేశ్యం లేదని, క్షణికావేశంలో జరిగిన హత్యతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కారులో పారిపోతూ పిల్లలతో పాటు తాను ఆత్మహత్యకు యత్నించడంలో భాగంగా పిల్లలపై కూడా తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా సహనా, గణేశ్‌లది ప్రేమ వివా హం. గురువారం ఉదయం 11.30 గంటలకు సహనాను హత్య చేసి, స్కూల్లో చదువుతున్న పిల్లలను తీసుకుని కారులో ఉడాయించాడు. పిల్లలను రాత్రంతా రిసార్టులో ఉంచుకున్నాడు. శుక్రవారం పిల్లలను కారులో తీసుకుని వెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పిల్లలు సిద్ధార్థ (15), సాక్షి (9)లు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుని..
ఇల్లందకుంట(హుజూరాబాద్) : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ఆపై అనుమానంతో భార్యను హతమార్చిన భర్త ఆపై తానూ ఉరేసుకుని, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట స్వామిమల్లయ్య (48), పుట్ట రాధ(45) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు శ్రీకాంత్, రాజు , కూతురు స్వప్న సంతానం. వీరికున్న ఎకరంతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని.. సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఇద్దరు కొడు కులు చదువుల నిమిత్తం హన్మకొండ వెళ్లారు. స్వప్న కొడుకులు శ్రావణ్, మనోజ్ వీరితో నే ఉంటున్నారు. అనుమానం.. వేధింపులు రాధపై అనుమానం పెంచుకున్న మల్లయ్య భార్యను వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసి.. ఇంటికొచ్చిన దంపతులు మరోసారి గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన మల్లయ్య కర్రతో భార్యపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయానికి గురైన మల్లయ్య ముందుగా క్రిమిసంహారక మందుతాగాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి తలుపులు తెరిచిచూడగా.. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. పక్క గదిలో పడుకున్న చిన్నారులు అరుస్తూనే ఉన్నారు. పరిశీలించిన ఏసీపీ సిరిసేడు గ్రామంలో దంపతులిద్దరూ మృత్యువాతపడిన సంఘటన తెలుసుకున్న హుజూరాబాద్ ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్, సీఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఈర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్కుమార్ తెలిపారు. -
భర్తకు ఆరు నెలల గృహ నిర్బంధం!
అల్లవరం (అమలాపురం): రోజూ తనతో గొడవ పడుతూ హింసిస్తున్న భర్తను మరో ఇద్దరి సాయంతో భార్య తీవ్రంగా కొట్టి, ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచింది. విషయం వెలుగులోకి రావడంతో అల్లవరం పోలీసులు ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై డి. ప్రశాంత్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొక్కిరిగడ్డ వీర వెంకట సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మండలంలోని కొమరగిరిపట్నం శివారు మిలటరీ కాలనీలో నివశిస్తున్నారు.సత్యనారాయణ చాలాకాలం దుబాయ్‌లో పనిచేసి తిరిగి వచ్చాడు. అతడు తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను హింసించేవాడు. దీంతో విసిగిపోయిన సూర్యకుమారి ఈ ఏడాది జనవరి ఐదో తేదీన సంగాని రాంబాబు, పొనమండ శ్రీనివాసరావు అనే మరో ఇద్దరితో కలిసి రాడ్డులతో భర్త సత్యనారాయణపై దాడి చేసింది. గాయపడిన అతడిని గృహంలోనే నిర్బంధించింది. విషయం బయట పడింది ఇలా.. ఐదు నెలలు పైబడినా తన అన్న సత్యనారాయణ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సఖినేటిపల్లిలో నివసించే అతడి సోదరుడు కొక్కిరిగడ్డ నాగమలేశ్వరరావుకు అనుమానం వచ్చింది. దీంతో అతడు అన్నను చూసేందుకు కొమరగిరిపట్నం శివార్లలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాయాలతో బాధపడుతూ జీవచ్ఛంలా పడి ఉన్న సత్యనారాయణ కనిపించాడు. దీంతో నాగమల్లేశ్వరరావు పోలీసుల సహకారంతో అన్నను గృహ నిర్బంధం నుంచి విడిపించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. శనివారం ఉదయం నాగమల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమారిని అరెస్టు చేశామని ఎస్సై ప్రశాంత్‌కుమార్ తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పీఎంపీతో చికిత్స చేయించారే తప్ప పెద్దాస్పుత్రిలో చికిత్స అందించలేదు. ప్రస్తుతం అతడి చేతులు విరిగి వేలాడుతున్నాయని, మోకాలి చిప్ప పగిలిపోవడంతో నడవలేకపోతున్నారని ఎస్సై తెలిపారు. -
కంటోన్మెంట్ ఏరియాలో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని శివారులో కలకలం రేగింది. ఓ ఆర్మీ అధికారి భార్య హత్య ఉదంతం కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. నైరుతి ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో మృతి చెందింది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించారు. దీంతో హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 30 ఏళ్ల సదరు మహిళ స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి ఫిజియోథెరపీ సెషన్ కోసం వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద డ్రాప్ చేశాడు. అయితే అరగంట తర్వాత ఆమె ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. ముందు ఆమెను హత్య చేసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మేజర్‌కు సమాచారం అందించిన పోలీసులు.. మృత దేహాం ఆయన భార్యదేనని నిర్ధారించారు. ఆపై పోస్టు మార్టానికి మృతదేహాన్ని తరలించి కేసును నమోదు చేసుకున్నారు. ఫోన్ కాల్ లిస్ట్, సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. ఆర్మీ మేజర్ అరెస్ట్... ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందింది. ఈ కేసుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ మేజర్ నిఖిల్ హందాను మీరట్‌లోని దౌరాలాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
భర్తను ఆరు నెలలుగా ఇంట్లో నిర్బంధించి..
-
భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి!
సాక్షి, రాజమండ్రి: భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమయింది. మొదట్లో బాగానే నడిచిన వీరి కాపురం, తర్వాత గొడవలకు దారి తీసింది. ఒక రోజు గొడవ పెరిగి కోపోద్రిక్తురాలైన భార్య సత్యనారాయణ కాళ్లు, చేతుల విరగొట్టింది. బయటకు పొక్కకుండా ఆరు నెలలుగా అతడిని ఇంట్లోనే బంధించి, ప్రతిరోజు అతడిని చిత్రవదలకు గురిచేసింది. భార్య చెర నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించి సత్యనారాయణను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భీమా డబ్బు కోసం భర్తను చంపేందుకు కుట్ర
-
భార్య కొట్టిందని భర్త ఆత్మహత్య
-
‘మోదీకి పెళ్లయ్యింది.. ఆయనే నా రాముడు’
అహ్మాదాబాద్, గుజరాత్ : కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ప్రధాని మోదీ అవివాహితుడు’ అనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్త ఇంత క్రేజ్ రావడానకి కారణం ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇంతకు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే కొంత కాలం క్రితం వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి..ప్రస్తుతం మధ్య ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందిబెన్ పటేల్. ఒక మీడియా సమావేశంలో ఆనందిబెన్ పటేల్ ‘నరేంద్ర భయ్యా(ప్రధాని నరేంద్ర మోదీ)కు పెళ్లి కాలేదు’ అని ప్రకటించారు. దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే మోదీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య యశోదాబెన్ పటేల్ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. మోదీ ప్రధాని కావాలని తాను తీర్థయాత్రలు చేస్తున్నట్లు స్వయంగా యశోదాబెన్నే ప్రకటించింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ సమయంలో యశోదాబెన్ తనకు, మోదీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో ఆనందిబెన్ పటెల్ ‘మోదీ అవివాహితుడు’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మరోసారి మోదీ భార్య యశోదాబెన్ మరోసారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ వియషం గురించి యశోదాబెన్ ఎన్డీటీవీతో ‘ఆనందిబెన్ వ్యాఖ్యలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్‌లో స్వయంగా మోదీయే తనను తాను వివాహితుడునని పేర్కొనడమే కాక..నా పేరును కూడా ఆ పత్రంలో తెలిపార’న్నారు. అంతేకాక మొదట సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను తాను నమ్మలేదని తెలిపారు. కానీ తరువాత ఇదే విషయం ఒక ప్రముఖ దిన పత్రికలో కూడా వచ్చిందని, అందుకే తాను ఈ విషయం గురించి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన ఆనందిబెన్ లాంటి ఒక మహిళ తనలాంటి సాధరణ పాఠశాల ఉపాధ్యాయురాలి గురించి ఇలా మాట్లడటం సరికాదన్నారు. ఆమె బాధ్యాతరహిత ప్రవర్తన వల్ల మోదీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతే మోదీ అంటే తనకు చాలా గౌరవం అని ఆయన తన పాలిట రాముడన్నారు యశోదాబెన్. -
ప్రేమ పెళ్లి..బయటపడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగోతం
-
అనుమానంతో భార్య గొంతు కోసేశాడు..
సాక్షి, కర్నూలు: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని పగిడ్యాల మండలం వనములపాడులో గురువారం చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రోజు రోజుకు ఆమెపై అనుమానం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బుధవారం వారి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విచక్షణ కోల్పోయి భర్త రుతమ్మను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జంట హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
సాక్షి, హసన్‌పర్తి : పట్టణంలో కలకలం రేపిన వృద్ద దంపతుల హత్య మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడి బుధవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తికి చెందిన గడ్డం దామోదర్(58), పద్మ(49) దంపతులు సోమవారం రాత్రి గుర్తు దారుణ హత్య గురయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హసన్పర్తికి చెందిన కిరాణ దుకాణం యజమాని కామారపు ప్రశాంత్(32)గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.4,75,863 విలువ చేసే బంగారాన్ని, 356.240 గ్రాములు వెండి అభరణాలు, ఒక కత్తి, సెల్‌ఫోన్‌తో పాటు 6,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దామోదర్ పొరుగింట్లోనే ఉంటున్న ప్రశాంత్ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. -
దంపతుల దారుణ హత్య
హసన్‌పర్తి : దంపతుల దారుణ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కొందరు దుండగులు భార్యాభర్తల గొంతులు కోసి ఘాతుకానికి పాల్పడ్డారు. డాగ్‌స్క్వాడ్‌కు చిక్కకుండా ఉండేందుకు నిందితులు సంఘటన స్థలంలో కారంపొడిని చల్లారు. దీనిని బట్టి .. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన గడ్డం దామోదర్(58), పద్మ(49) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశారు. పెద్ద కుమార్తె ఉదయశ్రీ, హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్న కూతురు కరుణశ్రీ యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కుమారుడు పున్నంచందర్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు.కాగా ఆరు నెలల క్రితం దామోదర్ ఇంటో జారిపడగా కాలు విరిగింది. ప్రస్తుతం కోలుకుని కర్ర సాయంతో నడుస్తున్నాడు. దామోదర్ దంపతులు తమ ఇంటిలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ ఇంటిలో భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. రాత్రి ఏడు గంటల లోపు షాపు మూసి వేస్తారని, దామోదర్ వివాదరహితుడని స్థానికులు పేర్కొన్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు సంఘటన స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలించగా జాగిలాలు దామోదర్ ఇంటి నుంచి చిన్నంగి చెరువు సమీపంలో ఉన్న వైన్స్‌షాపు వద్దకు వెళ్లి తిరిగి సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పద్మపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పద్మ బాత్రూంలో వివస్త్రగా పడి ఉండడంతో.. లైంగిక దాడి జరిగి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథరవీందర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. అదుపులో అనుమానితులు? కాగా, స్థానికంగా చెందిన కొంతమంది యువకులను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లో విగతజీవులుగా..ఉదయం ఆరుగంటల వరకు దామోదర్, పద్మ ఇంటి బయటికి రాకపోవడం, గేటు వద్ద కారంపొడి కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో పద్మ మృతదేహం కనిపించడంతో దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో దామోదర్ ఇంటి నుంచి రేకుల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దామోదర్ కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా పడి ఉండగా, పద్మ బాత్రూంలో మెడపై గాయాలతో మృతిచెంది ఉంది.పద్మను హత్య చేశాక ఆమె మెడలోని రెండుతులాల నల్లపూసల గొలుసును ఎత్తుకెళ్లారు. బీరువాలోని దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా లాకర్ కూడా తెరిచి ఉంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. హత్య వెనుక అనుమానాలెన్నో? వరంగల్ క్రైం: హసన్‌పర్తి బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దంపతుల దారుణ హత్య హసన్‌పర్తిలో సంచలనం సృష్టించింది. దంపతులను అతికిరాతకంగా హత్య చేసి ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చివరకు డాగ్ స్క్వాడ్‌కు కూడా ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లి హంతకులు పరారు కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. గడ్డం దామోదర్(58), గడ్డం పద్మ(49) హత్య ఘటన ఎలా జరిగింది? ఎంత మంది పాల్గొన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు మాత్రం.. పరిచయస్తులు లేదా ఇంటి పరిసరాలపై అవగాహన కలిగినవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారనే కోణంలో విచారిస్తున్నారు. రెండు నిమిషాల వ్యవధిలోనే .... గడ్డం దామోదర్, పద్మల సెల్ఫోన్లు రెండు నిమిషాల తేడాతో స్విచ్ ఆఫ్ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి 11.46 గంటలకు పద్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ తర్వాత 11.48 గంటలకు దామోదర్ ఫోన్ స్విచ్ఆఫ్ అయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అర్ధరాత్రికి ముందే హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సినిమాను తలపించేలా.. సినిమాలో చూపినట్లు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు కనిపిస్తోంది. ఇంటి గేటుకు గడియ పె ట్టి ఉంది. పద్మను బాత్రూంలో హత్య చేసి బ యట గొళ్లం పెట్టారు. ఇంట్లో బెడ్‌ఫై దామోదర్ ను హత్య చేసి బెడ్‌షీట్ కప్పి తలుపులు దగ్గర పెట్టి వెళ్లారు. బాత్రూం దగ్గర, గేటు దగ్గర ఆనవాళ్లు దొరకకుండా కారంపొడి చల్లారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్ ఇటుకను బావిలో పడేశారు.దీంతో పాటు హత్య చేసే సమయంలో చేతికి అంటిన రక్తం మరకలను అక్కడే కడుక్కుని నిందితులు వెళ్లినట్లు తెలుస్తోంది. గడ్డం దామోదర్, పద్మ దంపతుల హత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన నిందితులు గోడ దూకి లోపలికి చొరబడి మాటు వేసి హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. హంతకుల కోసం పోలీసులు నాలుగు ఐదు బృందలుగా విడిపోయి గాలిస్తున్నారు.గడ్డం దామోదర్ పలువురికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడని, దానికి సంబంధించిన అనేక రకాల డాక్యుమెంట్లు సంఘటన స్థలంలో లభించాయి. ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకులో సోమవారం రూ.6వేలను దామోదర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. పోపుల పెట్టెలో దొరికిన బంగారం... పద్మ వంటగదిలో పోపుల డబ్బాలో బంగారం, డబ్బులు దాచుకోవడం అలవాటు. హత్యకు గురైన దంపతుల పెద్ద కూతురు ఉదయశ్రీ చెప్పిన సమాచారంతో పోలీసులు వంటగదిలో ఉన్న పోపుగింజల డబ్బాను చూడగా అందులో ఒక నల్లపుసల గొలుసు, ఒక ఉంగారం, సుమారు రూ.2వేల నగదు లభించాయి. -
చిన్నాకు పెద్ద మనసు
(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు. ఆ మేరకు విశాఖలోని ప్రేమసమాజంలో ఉంటున్న ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా సాదాసీదా కాకుండా అనాథ పిల్లల మధ్య ఈనెల 21న చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారస్తుడైనా..ఉద్యోగస్తుడైనా..పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత కట్నం ఆశిస్తాడు. ఉద్యోగస్తుడైతే సుమారుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు..వ్యాపారస్తుడైతే..రూ.15 నుంచి రూ.20లక్షలు కట్న రూపంలో గానీ...ఆస్తుల రూపంలో గానీ ఆశించడం సహజం. చిన్నా మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. కట్న కానుకలు వద్దనుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : మమతల కోవెలలో పెళ్లి సందడి. వేద మంత్రాలు..పచ్చని తోరణాలు..బాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..దాతల దీవెనలు..విందు భోజనాలు. కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడుతోంది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి..పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట పుత్రుడు వెంకట సత్యనారాయణ(చిన్న)కు ఈ నెల 21న పెళ్లి జరగనుంది. అందుకు ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. అనాథ పిల్లలే పెద్దలను కల్యాణానికి ఆహ్వానించనున్నారు. 21 ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇరవై ఏళ్లుగా ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మకు పాయకరావుపేటకు చెందిన యువ వ్యాపారి వెంకట సత్యనారాయణతో వివాహం కానుంది. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం, కార్యదర్శి మట్టుపల్లి హనుమంతరావు పాలకవర్గం సమక్షంలో ఈ వివాహం జరగనుంది. మమతల కోవెల ప్రేమసమాజంలో ఇది 110 వివాహం. ప్రేమ సమాజంలో పెళ్లి రాట ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మను, పాయకరావుపేటకు చెందిన కక్కిరాల సత్యనారాయణతో ఈ నెల 21న ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియంలో జరగనున్న వివాహంలో భాగంగా సోమవారం ప్రేమసమాజంలో పెళ్లిరాట వేశారు. పలువురు ముత్తైదువులు పద్మను పెళ్లి కుమార్తెను చేసి ఆశీర్వదించారు. ప్రేమసమాజం పూర్వపు కార్యదర్శి పి.గణపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమసమాజం కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, సహాయ కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్ ప్రేమసమాజం సిబ్బంది పాల్గొన్నారు. ముందుకొచ్చిన దాతలు..పెద్ద ఎత్తున కానుకలు.. ప్రేమసమాజం అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు కన్యాదాతగా నిలిచారు. ప్రేమసమాజం మాజీ కార్యదర్శి గణపతిరావు దంపతులు దగ్గరుండీ పెళ్లి కుమార్తెను చేశారు. ఇదిలా ఉండగా..ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ కల్యాణ్‌కుమార్ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ.5వేలు, ఏ.కె.చైతన్య రూ.5వేలు, కటిల్, జగన్ పటేల్ రూ.6,500, సీహెచ్ శేఖర్ రూ.15వేలు, కిరణ్ రూ.6,500, టి.వినీష్ రూ.10వేలు ఇవ్వగా అగర్వాల్ మహాసభ ప్రతినిధులు పుస్తుల తాడు, చెవి రింగులు, పుస్తులు, సంపతి గొట్టాం, పట్టీలు, కాళ్ల మెట్టెలు వంటి పెళ్లి సామాన్లు, అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. ఆదర్శ వివాహమే చేసుకోవాలనుకున్నా.. తల్లిదండ్రులు మంచివారు. ఇద్దరు అక్కలు, బావలు చాలా మంచివారు. అన్నయ్య ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు చనిపోయాడు. నేను..నాన్న ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. పాయకరావుపేటలోనే మా ఇల్లు. వ్యాపార నిమిత్తం తుని వెళ్తుంటాం. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను, నాన్నను, అక్కలు, బావల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నా. అందుకు ఆదర్శ వివాహమైతే బాగుంటుందని అనుకున్నా. ప్రేమసమాజంలో అమ్మాయిని చూశాను. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకున్నా. అటువంటి అమ్మాయికి జీవితం ఇచ్చిన వాడినవుతానని అనుకున్నా. వెంకట సత్యనారాయణ(చిన్నా), పెండ్లి కుమారుడు ప్రేమసమాజమే అమ్మా..నాన్న తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. ఐదేళ్ల వయస్సులో నన్ను, అన్నయ్య లక్ష్మణ్‌ను బంధువులు ప్రేమసమాజంలో చేర్పించారు. అప్పటి నుంచి మా ఇద్దరికి అమ్మా..నాన్న అంటే ప్రేమసమాజమే. చిన్నప్పటి నుంచి మా ఇద్దర్ని ప్రేమసమాజం ఎంతగానో ఆదుకుంది. తల్లిదండ్రులు లేని మా ఇద్దరికి ప్రేమసమాజమే దైవం. ఇంటర్మీ డియట్ వరకు చదివించారు. అధ్యక్షుడు రాంబ్రహ్మం, కార్యదర్శి హనుమంతరావు ఇక్కడి పిల్లల శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు. పదిహేడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. కొత్త జీవితంలో అడుగుపెడతున్నాను. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఆదర్శ వివాహంచేసుకుంటున్న..కాబోయే భర్త సత్యనారాయణ(చిన్న), అందుకు సహకరించి ముందుకొచ్చిన మావయ్య వెంకటరమణకు కృతజ్ఞతలు. వారికి మంచిపేరు తెస్తాను. –పద్మ, ప్రేమసమాజం పుత్రిక..పెళ్లి కుమార్తె కుమారుడి అభీష్టం మేరకే.. భార్య సత్యవతి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయింది. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేసేశాను. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు ఐదేళ్ల కిందట వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయాడు. చిన్నోడు వెంకటసత్యనారాయణ(చిన్నా)ఇంటర్మీడియట్ వరకు చదివాడు. నాతోనే తునిలో కారం(మసాల సామాన్లు విక్రయం) పనులు చేస్తుంటాడు. ప్రేమ సమాజం అమ్మాయిని చేసుకుంటే ఒకరికి దారి చూపిన వాడినవుతానని చెప్పడంతో సరేనన్నా. నాలుగేళ్ల కిందట రూ.25 లక్షలతో ఇల్లు నిర్మించాను. 300 గజాల ఖాళీ స్థలం ఉంది. నా కుమారుడికి ఆదర్శ వివాహమంటే ఇష్టం. అందుకే ప్రేమసమాజం అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నాం. – కక్కిరాల వెంకటరమణ, పెళ్లి కుమారుడు తండ్రి -
భార్యను కడతేర్చేందుకే..
సూర్యాపేట క్రైం : భార్యను అడ్డుతొలగించుకోవాలని.. ఓ భర్త ఆమె తాగేనీటిలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు అల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మట్టపల్లి సత్యనారాయణ– మాధవి దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనూషను పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మాధవి సొంత సోదరుడు అల్లి వరప్రసాద్ కుమారుడు సాయిశివకు ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేశారు. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త సాయిశివ అనుషతో కాపురం చేయకుండా అనుమానంతో వేధించసాగాడు. కొద్దిరోజుల నుంచి సైకోలాగా మారి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. తమ కొడుకు చేష్టలు అత్త కౌసల్య, వదినలు శ్వేత, శృతికి చెప్పినా పట్టించుకోలేదు. పైగా అనూషపైనే ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో గురువారం సాయిశివ ఆవేశం తారస్థాయికి చేరుకుని భార్యపై బ్లేడు దాడిచేసి గాయపరిచాడు. అప్పటికీ సంతృప్తి చెందని సాయిశివ శుక్రవారం రాత్రి ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని తాగేనీళ్లలో నిద్రమాత్రలను పొడి చేసి కలిపి అనూషతో తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అనూష తల్లిదండ్రుల సాయంతో స్థానిక ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు అనూష నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పట్టణ ఎస్ఐ పి.శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య చేతిలో భర్త దారుణ హత్య
పాలకుర్తి టౌన్ : పాలకుర్తిలో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన వాసూరి చిన కొంరయ్య (65) కుటుంబ కలహాల కారణంగా భార్య లక్ష్మితో 30 సంవత్సరాలుగా దూరం ఉంటున్నాడు. కుమారుడు రవి టీచర్ ఉద్యోగం చేస్తూ తల్లి లక్ష్మితో కలిసి పాలకుర్తిలో నివాసం ఉంటున్నాడు. చినకొంరయ్య పేరు మీద 1.18 ఎకరాల భూమి ఉంది. తల్లిదండ్రులు కలిసి ఉండాలని కుమారుడు రవి ప్రయత్నాలు చేశాడు. ఈ మేరకు గ్రామస్తులు మూడు నెలల క్రితం చినకొంరయ్యను వారితో కలిసి ఉండాలని ఒప్పించారు. అప్పటి నుంచి కొంరయ్య తన భార్య, కుమారుడితో కలిసి పాలకుర్తిలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్యతో ఆయన గొడవ పడ్డాడు. ఆగ్రహి ంచిన లక్ష్మి రోకలి బండతో చినకొంరయ్య తలపై కొట్టగా ఆయన మృతి చెందాడు. మృతుడి సోదరి ముణెమ్మ ఫిర్యాదు మేరకు సీఐ కరుణాసాగర్ రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన భర్త
జయపురం: భార్య తనతో రావడం లేదని కోపోద్రిక్తుడైన ఓ భర్త.. భార్య గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మరకోట్‌లోని డెప్పగుడలో ఉంటున్న స్వామినాథ్ హరిజన్, రుబిణ హరిజన్లు భార్యాభర్తలు. అయితే వారి మధ్య కలహాల వల్ల ఎనిమిదేళ్లుగా రొబొణి హరిజన్ భర్తను విడిచి రాయిఘర్‌లో విడిగా ఉంటోంది. తనతో వచ్చి ఉండమని భర్త ఎప్పటికప్పుడు ఆమెను బలవంతం చేస్తున్నా వెళ్లేందుకు అంగీకరించడంలేదు. దీంతో చివరిసారిగా శుక్రవారం సాయంత్రం మరోసారి తనతో రమ్మని భార్యను భర్త అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన స్వామినాథ్ హరిజన్ బ్లేడుతో భార్య గొంతును కోశాడు. ఆమె హాహాకారాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆమెను వెంటనే ఉమ్మరకోట్ సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భార్యే నిందితురాలిగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం జిల్లాలోని కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన తన భర్త కావలి మల్లయ్య కనిపించడం లేదంటూ పార్వతమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భార్య పార్వతమ్యే తన భర్తను చంపినట్టు బయటపడింది. పార్వతమ్మకి రాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఇరువురు.. మల్లయ్యను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి భర్తను హత్యచేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలో కట్టేసే జిల్లాలోని నాగనూల్ చెరువులో పడేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పార్వతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు పార్వతమ్మే హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
పెళ్లి ఇష్టం లేదని బ్లేడ్‌తో కోసి..!
సాక్షి, సూర్యాపేట : పట్టణంలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి ఇష్టం లేదంటూ భార్యపై బ్లేడ్‌తో దాడి చేసి వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అల్లీ అనూషను, రాజీవ్‌నగర్‌కు చెందిన సాయి శివకు ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ 29న వివాహం చేశారు. అయితే పెళ్లైన కొంత కాలానికే సాయి సైకోలో ప్రవర్తిస్తూ అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. బ్లేడ్‌తో కోయడం, కొడుతూ శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచులు సైతం అనూషను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి అనూషను హత్య చేయాడానికి మంచినీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆమె తప్పించుకొని తల్లిదండ్రులకు వద్దకు చేరింది. శనివారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు జరిగిందంతా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూషకు సాయి శివ సొంత మేనబావే కావడం గమనార్హం. -
చనిపోయిన భార్యపై ప్రేమతో గుడి కట్టించిన భర్త
-
పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను..
లండన్ : పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను తృణప్రాయంగా వదిలేసిందో భార్య. 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని కాదని భర్తని విడిచి పెంపుడు కుక్కలతో ఇంటి బయటకు నడిచింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని సఫోక్ కౌంటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సఫోక్ కౌంటీకి చెందిన లిజ్ గ్రూ(45) మైక్ అస్లామ్(53) భార్యాభర్తలు వీరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లిజ్ గ్రూకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే పెళ్లైన తర్వాత కూడా ఇంటిని మొత్తం మూగజీవాలతో నింపేసింది. ఇంటిని మొత్తం కుక్కలు ఆక్రమించేయడంతో భర్త మైక్‌కు కోపం వచ్చింది. ఈ విషయమై ఇరువురికి తరుచూ గొడవలు జరిగేవి. కుక్కలను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఆమె ససేమీరా అనటంతో మైక్ తీవ్రంగా కోపగించాడు. కుక్కలు కావాలో తాను కావాలో నిర్ణయించుకోమని తేల్చిచెప్పాడు. లిజ్ మాత్రం 25 ఏళ్ల దాంపత్య జీవితం కంటే పెంపుడు కుక్కలే ముఖ్యమని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడామె వద్ద మొత్తం 30 కుక్కలు ఉన్నాయి. వాటిలో 5 కుక్కలకు చెవుడు కాగా మరో రెండు కుక్కలకు ఒక కన్ను మాత్రమే ఉంది. వాటిలో మిగిలినవి వేటకుక్కలు వీటిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. లిజ్ గ్రూ మాట్లాడుతూ.. తన తండ్రికి జంతువుల ఆహారం తయారుచేసే వ్యాపారం ఉండేదని, చిన్నప్పటి నుంచి కుక్కల మధ్యే ఎక్కువగా తన జీవితాన్ని గడిపానంది. ఈ మధ్యే కుక్కల సంరక్షణ కోసం ‘‘బెడ్ఫర్ బుల్లీస్’’ అనే స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేసానంది. భర్త తన పనిలో బిజీ ఉండటం వల్ల ఒంటరిగా ఉన్న తాను కుక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టినట్లు తెలిపింది. పెళ్లైన నాటి నుంచి భర్త మైక్‌కు తానేంటో తెలుసని, మరి ఎందుకు ఇలా అన్నాడో తెలియదని వాపోయింది. కుక్కల పెంపకం అన్నది టైం పాస్ కోసం చేసే పని కాదని, అంకిత భావంతో.. ప్రేమతో వాటిని చూసుకోవాలని తెలిపింది. -
దంపతుల దుర్మరణం
సత్తుపల్లిరూరల్ : లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. బైక్‌పై వెళుతున్న యువ దంపతులను బలిగొంది. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద సోమవారం మధ్యాహ్నం ఇది జరిగింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దంపతులు వాడపల్లి గాంధీ(28), వెంకటేశ్వరమ్మ(23), తమ పిల్లలు నాలుగేళ్ల మనీషా, మూడేళ్ల మానసతో కలిసి బైక్‌పై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. అక్కడ చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించాలనుకున్నారు. మార్గమధ్యలోగల మేడి శెట్టివారిపాలెం సమీపంలోకి రాగానే, ఎదురుగా అశ్వారావుపేట వైపు వేగంగా వెళ్తున్న లారీ.. వీరి బైక్‌ను ఢీకొని ఆగకుండా వెళ్లింది. ఈ ప్రమాదంలో వాడపల్లి గాంధీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరమ్మ.. 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది. బైక్‌పై ఉన్న చిన్న కుమార్తె మానస.. ఎగిరి, పక్కనున్న చెత్తపై పడిపోయింది. ప్రాణాపాయాన్ని తప్పించుకుంది. పెద్ద కుమార్తె మనీషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద స్థలాన్ని సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొద్దులగూడెంలో విషాదం దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన దంపతులు వాడపల్లి గాంధీ(యాకోబు), వెంకటేశ్వరమ్మ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. అప్పటివరకు తమ కళ్లెదుటే తిరిగిన దంపతులు.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్లారన్న వార్తను మొద్దులగూడెం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. విగతులుగా మారిన అమ్మా,నాన్నను చూసి ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండడంతో చూపరులు కంట తడి పెట్టారు. అనాథలుగా మారిన ఆ చిన్నారులకు నాయనమ్మ, తాతయ్యే పెద్ద దిక్కయ్యారు. -
ఎలుగు బంటి దాడి మృతుల అంత్యక్రియలు పూర్తి
సోంపేట: ఎలుగుబంటి దాడిలో మృతిచెందిన యర్రముక్కాం గ్రామానికి చెందిన దంపతులు బైపల్లి తిరుపతి, ఊర్మిళ అంత్యక్రియలను గ్రామస్తులు సోమవారం అశ్రునయనాలతో నిర్వహించారు. పలాస సామాజిక ఆస్పత్రి నుంచి ఊర్మిళ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్త తిరుపతి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ నుంచి సోమవారం సాయంత్రం యర్రముక్కాం తీసుకొచ్చారు. వీరికి విషణ్ణవదనాలతో గ్రామస్తులు, బంధువులు ఖననం చేశారు. దీంతో యర్రముక్కాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడంతో కుమారుడు శ్యామ్ ఒంటరిగా మిగిలాడు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ పొట్టి రాజేశ్వరి, జెట్పీటీసీ చంద్రమోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. వైద్యనిపుణుల పర్యవేక్షణలో దుర్యోధనరావుకు చికిత్స పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామంలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన దుర్యోధనరావు కేజీహెచ్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ జి.అర్జునతో పాటు వైద్య నిపుణుల బృందం సోమవారం ఆయనను పరీక్షించింది. అర్జున మాట్లాడుతూ దుర్యోధనను అత్యవసర సేవల విభాగం నుంచి ప్రత్యేక వైద్య సేవల నిమిత్తం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించామని చెప్పారు. కాగా.. మరో బాధితుడు అప్పలస్వామికి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
నిత్యానంద నుంచి నా భార్యను విడిపించండి
టీ.నగర్: నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలని భర్త కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు. దీనిపై నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు బెంగళూరుకు వెళ్లి తన కుమారుడు పళనిస్వామిని విడిపించి తనకు అప్పగించినట్లు తెలిపారు. అయితే అత్తాయి రాలేదని, ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. తన భార్య పేరిట వడుకం ఇండియన్ బ్యాంకులో రూ.5లక్షలు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.5లక్షలు, నగల రుణం రూ.30 వేలు, బయటి వ్యక్తుల రుణాలు రూ.11 లక్షల వరకు ఉన్నాయని, ఈ నగదును ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని కోరుతున్నారని, ఎనిమిది నెలలుగా మానసిక క్షభకు గురవుతున్నట్లు తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, తన భార్యను నిత్యానంద ఆశ్రమం నుంచి విడిపించాలని కోరారు. -
గుంటూరు జిల్లాలో దారుణం: భార్యను చంపిన భర్త
-
కర్నూల్: భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త
-
భార్యపై అనుమానంతో వికృత చేష్టలు
సాక్షి, కర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె శరీర భాగాలపై కత్తితో దాడి చేసి, గాయాలపై కారం చల్లి.. చెప్పలేని రీతిలో ఆమెను నరకమాతనకు గురిచేశాడు. దీంతో భర్త పెట్టె హింసలను తట్టుకోలేక అతను ఇంట్లో లేని సమయంలో పారిపోయి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త రాజు కోసం గాలింపు చేపట్టారు. -
నడిరోడ్డులో భార్యపై హత్యాయత్నం..
ఖబరోవ్స్క్, రష్యా : భార్యపై కోపంతో రగిలపోయిన ఓ భర్త ఆమెపై హత్యాయత్నం చేశాడు. విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసి కారు దిగి వెళ్లిపోతున్న భార్యను కారుతో తొక్కించి చంపబోయాడు. ఈ ఘటన రష్యాలోని ఖబరోవ్స్క్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌లో ఆగివున్న కారులోంచి భార్య, భర్త గొడవపడుతున్న శబ్దాలను చుట్టుపక్కల వాహనదారులు విన్నారు. వివాదం మరింత ముదరటంతో భార్య తనకు విడాకులు కావాలని భర్తను డిమాండ్ చేసింది. ఆ తర్వాత కారు దిగి వెళ్లిపోయింది. అయితే, భార్య ప్రవర్తనతో కోపాన్ని అదుపు చేసుకోలేని భర్త కారును వెంటనే యూ టర్న్ తీసి ఆమెపైకి పోనిచ్చారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. అదృష్టవశాత్తు ఆమె గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. వాహనదారుల సమాచారంతో అక్కడిచేరుకుని భార్యను ఆసుపత్రిలో చేర్పించి, భర్తను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
అనుమానంతో..భార్య గొంతుకోసి తానూ...
కర్నూలు(హాస్పిటల్) : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె గొంతు కోయడంతోపాటు తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల వివరాల మేరకు.. మిడుతూరుకు చెందిన ఎస్తేరి(30)తో గార్గేయపురానికి చెందిన కృష్ణ(35)కు పదేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ సెంట్రింగ్ పనికి, భార్య కూలీకి వెళ్లేవారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 8 నెలల నుంచి వీరు కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని ఎస్తేరి తల్లి సుంకులమ్మ ఇంట్లో ఉంటున్నారు. కొద్దికాలంగా భర్త.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోందని భావించి వేధించేవాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో కృష్ణ చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతుకోశాడు. అదే సమయంలో కత్తితో తానూ గొంతు కోసుకున్నాడు. వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులు వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గొంతు వద్ద గాయాలు లోతుగా కాకపోవడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. ఈమేరకు కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్యపై అనుమానంతో చిన్నారిని చంపిన తండ్రి
-
భార్యను ‘నల్లమబ్బు’ అన్నాడని కోర్టు..
చండీగఢ్ : విడాకుల కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. నల్లగా ఉన్నావంటూ వేధిస్తున్న కారణంగా భర్త నుంచి విడిపోవాలనుకున్నట్లు చెప్పిన భార్యకు చండీగఢ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్యను నల్లమబ్బు అనటమే కాకుండా, ఆమె చేసిన వంట కూడా తినకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలోకి వెళితే.. హర్యానాలోని మహేందర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె నల్లగా ఉన్న కారణంగా భర్త తరుచూ నల్లమబ్బు అంటూ వేధించేవాడు. ఆమెను దూరంగా పెట్టడమే కాకుండా వంట కూడా చేయనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఆమె వంట చేసినా భర్త తినేవాడు కాదు. దీంతో విసుగు చెందిన ఆమె కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. వివాహితురాలి తండ్రి తమ అల్లుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అతనికి రెండో పెళ్లి చేస్తామని వారు బెదిరించటంతో ఇక కలిసుండి లాభం లేదనుకున్న ఆమె విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. భర్త ఆమె శరీర రంగును కించపరుస్తున్న తీరును కోర్టుకు వివరించింది. మానసికంగా, శారీరకంగా భర్త వేధించిన విధానం, క్రూరత్వం ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు ఆమెకు విడాకులు మంజూరు చేశారు. -
భర్తపై దాడిచేసిన నవ వధువు అరెస్టు
సంతబొమ్మాళి/కాశీబుగ్గ : మనసులో ఒకరు... మనువు మరొకరితో జరగడం వల్లే భర్త నవీన్‌కుమార్‌పై దాడికి ప్రేరేపించిందని భార్య నీలిమ పోలీసుల సమక్షంలో ఒప్పుకుంది. స్థానిక ఎస్ఐ రామారావు మంగళవారం చెప్పిన వివరాలు ప్రకారం... మూలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్‌కుమార్‌పై భార్య నీలిమ చాకుతో సోమవారం దాడి చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. నవీన్‌కుమార్ అత్తవారి గ్రామమైన గొలదాం నుంచి సోమవారం సాయంత్రం బైక్‌పై వస్తున్న సమయంలో మూలనర్సాపురం గ్రామ సమీపంలోని తోటల వద్దకు వచ్చేసరికి నీలిమ ఈ అఘాయిత్యానికి పాల్పడిన విషయం విదితమే. అయితే వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడంతో నీలిమ ఈ దారుణానికి పూనుకుందన్నారు. ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో మూలనర్సాపురం సమీప తోటల్లో దాడి చేసిందన్నారు. నేరం ఒప్పుకున్నందున కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ ఎస్.రాఘవ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో తెలిపారు. నీలిమను అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టులో మంగళవారం హాజరుపరిచామన్నారు. 307 సెక్షన్ కింద ఈమెపై కేసు నమోదు చేశామన్నారు. -
ఘాతుకం : పెళ్లయిన 20 రోజులకే భర్తపై కత్తితో దాడి
సాక్షి, శ్రీకాకుళం(సంతబొమ్మాళి): వీరఘట్టం మండలానికి చెందిన నవ వరుడు హత్య ఘటన సంచలనం కలిగించిన విషయం విదితమే. భార్య పన్నిన కుట్రతో భర్త ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లా ప్రజలు మరువక ముందే.. అచ్చం ఇలాంటి ఘటనే సంతబొమ్మాళి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. భార్య బరితెగించి భర్తపై చాకుతో దాడి చేసి గాయపరిచింది. పెళ్లయిన 20 రోజులకే తాళికట్టిన భర్తపైనే భార్య దాడి చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మాలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్‌కుమార్(23)కు గొదలాం గ్రామానికి చెందిన సబ్బి నీలిమ(19)తో ఈ నెల 9వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అయిన రోజు నుంచి సరదాగా ఉన్న ఈ నవ దంపతులు నాలుగు రోజుల క్రితం నవీన్‌కుమార్ అత్తవారి గ్రామమైన గొదలాం వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మాలనర్సాపురం బయల్దేరారు. ఈ క్రమంలో వడ్డివాడ రైల్వేగేటు వద్ద భర్త తలపై నీలిమ చేతితో గట్టిగా కొట్టింది. ఏంకొట్టావు అని భర్త నవీన్ అడగ్గా సరదాగా కొట్టానని చెప్పడంతో నిజమేననుకొని ప్రయాణం కొనసాగించారు. అయితే మాలనర్సాపురం సమీపంలో తోటలు వద్దకు రాగానే నీలిమ వెంట తెచ్చుకున్న చాకుతో భర్త నవీన్‌కుమార్ మెడపై పొడిచింది. దీంతో ద్విచక్ర వాహనం ఆపాడు. వెంటనే భర్త పీక పిసికేందుకు నీలిమ ప్రయత్నించింది. దీంతో భయాందోళనకు గురైన నవీన్‌కుమార్ అక్కడ నుంచి తప్పించుకొని పెద్దగా కేకలు వేశాడు. దీంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఏంజరిగిందోనని ఆరాతీశారు. మెడపై గాయం కావడంతో రక్తం మడుగులో ఉన్న నవీన్‌కుమార్‌ను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై భార్య నీలిమను పలువురు ప్రశ్నించగా ఏం జరిగిందో తెలియలేదని, తాను చాకుతో పొడవలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. సంతబొమ్మాళి ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నారు. -
భర్తపై చాకుతో నవవధువు దాడి
-
భార్య మోసం.. భర్త సెల్ఫీ సూసైడ్
భోపాల్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేసిందని సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛటర్‌పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఛటర్‌పూర్ జిల్లా గంజ్ గ్రామానికి చెందిన తులసీదాస్ పాటిల్(28) పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడికల్ క్లీనిక్ పెడతానంటే ఇంటిని అమ్మి 2లక్షల డబ్బు సహాయం చేశాడు. ఏమైందో ఏమో కొద్ది రోజుల తర్వాత ఆమె అతనితో తెగదెంపులు చేసుకుని ఆమె విడిపోయింది. దీంతో మనస్తాపానికి గరైన తులసీదాస్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను తెలుపుతూ వీడియో సెల్ఫీ తీసి దాన్ని అతని బావకు పంపాడు. ‘‘ ప్రాణంగా ప్రేమించిన ఆమె నన్ను దూరంగా పెడుతోంది. ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేయడానికి సిద్దపడుతున్నారని తెలిసింది. ఆమె బంధువలతో గొడవపడేంత దమ్ము నాకు లేదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇంట్లో భద్రపరిచిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్లు పోలీసులు చూడాలి’’అని ఆ సెల్ఫీ వీడియోలో తులసీదాస్ కోరాడు. ఆలస్యంగా వీడియో చూసిన తులసీదాస్ బావ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం బిలాస్పూర్లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
-
శాడిస్ట్ భర్త చేతిలో భార్యకు చిత్రహింసలు
హైదరాబాద్ : షేక్‌పేటలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ప్రశాంత్, జ్ఞానజ్యోతి భార్యభర్తలు. అదనపుకట్నం కోసం భార్య జ్ఞానజ్యోతిని భర్త ప్రశాంత్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. జ్ఞానజ్యోతి కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి షేక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు జ్ఞానజ్యోతి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రశాంత్, అతని తల్లి, అన్నలపై జ్యోతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్తకు చెప్పుతో దేహశుద్ధి చేసిన భార్య
-
మోసం చేసిన భర్తకు చెప్పుతో ‘సన్మానం’
సాక్షి, మహబూబాబాద్ : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి స్థానికులు, బంధువులతో కలిసి దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. వివరాల్లోకెళితే.. కేసముద్రం మండలం మహబూబ్‌పట్నంకు చెందిన శాలిని అనే గిరిజన మహిళకు అదే తండాకు చెందిన వీరన్న అనే వ్యక్తితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహమైన ఆరు సంవత్సరాల వరకు వీరి కాపురం సజావుగానే గడిచింది. అనంతరం వీరన్న మరో పెళ్లి చేసుకుని శాలినికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లిచేసుకుందే కాక, తనపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలంటూ వీరన్న బెదిరించసాగాడు. దీంతో విసుగెత్తిన ఆమె స్థానికుల సాయంతో భర్తకు దేహశుద్ధి చేసింది. అందరూ చూస్తుండగా అతడిని వెంబడించి మరీ చెప్పుతో కొట్టింది. బట్టలు చించేసి చితక్కొట్టింది. -
దారుణం : మరిగే నూనెలో చేతులు పెట్టించి!
అహ్మదాబాద్ : భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్ పర్మార్, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది. దీనికి అంగీకరించని యువతి, తన భర్తతో బలవంతంగా సలసల కాగే నూనెలో చేతులు పెట్టించింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతులిద్దరినీ అరెస్టు చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాహుల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సదరు యువతి పోలీసులకు తెలిపింది. -
నిషేధం తర్వాత వార్నర్ ఇంట్లో విషాదం
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, బ్యాట్‌మెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్ సతీమణి కాండిష్ వార్నర్ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఆ విషాదం నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడని ఆమె తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి తాము వచ్చిన తరువాత తమ జీవితంలో మరిచిపోలేని విషాద సంఘటన చోటు చేసుకుందని అన్నారు. ఒకరోజు తాను బాత్రూమ్లో ఉండగా తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, సహాయం కోసం డేవిడ్‌ను పిలిచినట్లు తెలిపారు. అయితే తీవ్ర రక్త స్రావం జరగడంతో తన గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా ప్రయాణం చాలా కష్టంగా ఉంటుందని, పర్యటనకు ముందే తాను గర్భం దాల్చానని, వార్నర్ చాలా సురక్షితంగా తనను ఇంటికి తీసుకెళ్లాడని గుర్తు చేసుకున్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిషేధం కారణంగా తీవ్రంగా కుంగిపోయన వార్నర్‌ను తన గర్భస్రావం మరింత కలచివేసిందన్నారు. -
భర్తపై హత్యాయత్నం
అన్నానగర్: కలియక్కావిలై సమీపంలో భర్తపై అనుమానంతో అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కుమరి జిల్లా కలియక్కోవిలై సమీపం మరియగిరి తెంగువిలైకి చెందిన షర్జిన్ (28) కేరళలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కేరళకు చెందిన బబితను(27)ప్రేమించి 2010లో వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత భార్య బబితతో కలిసి సొంత ఊరు తెంగువిలైలో షర్జిన్ నివసిస్తున్నాడు. వీరికి ఏంజల్ (05) అనే కుమార్తె ఉంది. ఇటీవల షర్జిన్ తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. వేరే మహిళతో భర్త షర్జిన్కి సంబంధం ఉందని బబితకి అనుమానం ఏర్పడింది. ఈ విషయాన్ని ఆమె షర్జిన్ను అడగడంతో వారికి మధ్య తగాదా ఏర్పడింది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి షర్జిన్ ఇంట్లో నుంచి కేకలు వినబడ్డాయి. వెంటనే స్థానికులు వెళ్లి చూడగా షర్జిన్ తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. సమీపంలో ఓ ఇనుప రాడ్‌తో బబితా నిలబడి ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే స్థానికులు షర్జిన్ను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బబితాని అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో భర్త షర్జిన్కు వేరే మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో అతన్ని హత్యచేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బబిత పోలీసులకు తెలిపింది. -
నేను సూపర్ విలన్ భార్యను
మనీలా : పాపులారిటీ ఉన్న వాళ్ల పేర్లను వాడుకుని ప్రచారం పొందడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కామిక్ విలన్‌ను కూడా వదలటం లేదు కొందమంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయపథంలో దూసుకుపోతున్న అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లోని విలన్ థానోస్ తన భర్తంటూ ఫిలిప్పీన్స్ సెనేటర్ ట్విటర్లో పోస్టులు పెట్టారు. వివరాలలోకి వెళితే.. మే 5న ఫిలిప్పీన్స్ సెనేటర్ నాన్సీ బినయ్ ఇన్ఫినిటీ వార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మాయోయావోలో ఫోటోలు దిగి ట్విటర్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీలో పాల్గొన్న ఆమె తలపై వైకింగ్స్ కిరీటాన్ని ధరించి థానోస్ భార్యను తానే అని ప్రకటించుకున్నారు. మరి ఆమె అవెంజర్స్ సినిమా చూసి ఇలా మాట్లాడారా? లేదా ఫిలిప్పీన్స్ పర్యాటక రంగాన్ని పాపులర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారో అని తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్కడి వారు. కామిక్ విలన్ మనిషిని ఏట్లా పెళ్లి చేసుకుంటాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “I am the wife of Thanos,” Sen @nancybinay exclaims in jest as well-wishers sing “Happy birthday” | via @sherieanntorres pic.twitter.com/ez9oa2bjhy — ABS-CBN News (@ABSCBNNews) May 10, 2018 -
పని వదిలి రానా?!
పైకి కనిపించని ప్రేమను గ్రహించకుండా, ‘ప్రేమ ఉంటే అది కనిపించాలి కదా’ అనుకోవడం వంటిదే దైవసాక్షాత్కారాన్ని కోరుకోవడం కూడా. ‘నీకు నా మీద ప్రేమ లేదు’ అని ఎప్పటిలా ఆమెను నిందించాడు అతడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘ఉంది అని నిరూపించుకునేంత సమయం నాకు లేదు’ అంది. ‘సమయం లేదా? ప్రేమ లేదా?’.. వ్యంగ్యంగా అన్నాడు. ‘ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం కూడా నాకు లేదు’ అంది ఆమె. అతడికి కోపం వచ్చింది. ‘అవును. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నావు కదా, సమయం ఉండదులే’ అని మళ్లీ విరుపుగా అన్నాడు. మనసు నొప్పించాలని అతడు అలా అనలేదని, మనసు నొచ్చుకుని అలా అన్నాడని ఆమె అర్థం చేసుకుంది. ప్రేమగా దగ్గరకు వెళ్లబోయింది. దూరంగా జరిగాడు. ‘ముందు చెప్పు, నీకు నా మీద ప్రేమ ఉందా? లేదా’ అన్నాడు. ‘ఆ సంగతి చెప్పాలంటే నేనిప్పుడు చేస్తున్న పనిని ఆపి రావాలి. ఆపి రానా మరి?’ అని అడిగింది. ‘ఏంటా పని, నా కన్నా ముఖ్యమైనది?’ అన్నాడు. ‘నీకన్నా ముఖ్యమైన పనే. నిన్ను ప్రేమిస్తూ ఉండటం. దాన్ని ఆపి రావడం అంటే.. నిన్ను ప్రేమించడం ఆపి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీ దగ్గరికి రావడం’ అంది. అతడు వింతగా చూశాడు. ‘నేను వేరు, నాపై నీ ప్రేమ వేరు ఎలా అవుతుంది? మాటలతో మాయ చేస్తున్నావు గానీ!’ అన్నాడు. ఆమె ఎప్పటిలా నిశ్చలంగా నవ్వింది. ‘నువ్వు వేరు, నీపై నా ప్రేమ వేరు కానప్పుడు – నీకు నాపై ప్రేమ ఉందా – అని నువ్వెలా అడుగుతున్నావు?’ అంది నవ్వుతూ. అతడు ఆలోచనలో పడ్డాడు. ‘నీపై నాకు ప్రేమ ఉంది అని చెప్పే ఆ కొన్ని క్షణాల సమయాన్ని కూడా నేన్నిన్ను ప్రేమిస్తూ ఉన్న క్షణాల్లోంచి తీసివ్వలేను’ అంది అమె. అతడింకా ఆలోచిస్తూనే ఉన్నాడు. నిరంతరం దైవధ్యానంలో ఉండే మనిషి కూడా దైవదర్శనాన్ని కోరుకోవడం సహజమే. ధ్యానమే దైవమని తెలుసు. అయినా దర్శనధ్యానాన్ని వదిలి పెట్టలేడు. కొండలెక్కి దిగుతాడు. నుదుటిని నేలకు ఆన్చుతాడు. మోకాళ్లపై కూర్చొని ఆకాశంలోకి చేతులు జోడిస్తాడు. ధ్యానం కన్నా దర్శనం ముఖ్యం అనుకుంటాడు కానీ, ధ్యానం కూడా దర్శనంలో ఒక భాగమే అనుకోడు. పైకి కనిపించని ప్రేమను గ్రహించకుండా, ‘ప్రేమ ఉంటే అది కనిపించాలి కదా’ అనుకోవడం వంటిదే దైవసాక్షాత్కారాన్ని కోరుకోవడం కూడా. దేవుడి దర్శనానికి దైవధ్యానాన్ని వదిలి వెళ్లాల్సిన పనేముంది?! – మాధవ్ శింగరాజు -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించిన సంఘటన నామక్కల్‌లో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పల్లిపాళయం ఆండికాడు ప్రాంతానికి చెందిన ఆనందన్ అద్దకం పట్ర నడుపుతున్నాడు. ఇతని భార్య జయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అద్దకం పట్రలో ఆనందన్ తీవ్రగాయాలతో శవంగా పడి ఉన్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లిపాళయం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ లోపు కార్తికేయన్ (సెంట్రింగ్ కార్మికుడు) పల్లిపాళయం వీఏఓ గోవిందరాజ్ వద్ద ఆనందన్‌ను హత్య చేశానని లొంగిపోయాడు. దీంతో గోవింద్రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో కార్తికేయన్‌కు ఆనందన్ భార్య జయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి ఆనందన్ భార్యను మందలించాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఆనందన్‌ను హత్య చేయడానికి జయలక్ష్మి కార్తికేయన్ పథకం వేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న ఆనందన్ తలపై బండరాయి వేసి హత్య చేసినట్టు తెలిసింది. -
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపేశాడు
సాక్షి, కర్నూలు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి కొట్టి హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలులోని ఎన్టీఆర్ బిల్డింగ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. తెలుగు రఘు, స్వాతి దంపతులు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాలతో భర్తమద్యం సేవించి భార్యపై దాడి చేసి కిరాతకంగా కొట్టాడు. తీవ్రగాయాలతో స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది. రఘు మూడు సంవత్సరాల క్రితం స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వాతికి తల్లిదండ్రులు లేరు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పోలీసు వివాహేతర సంబంధం.. చితకబాదిన భార్య
-
వివాహేతర సంబంధం.. అడ్డంగా దొరికిన పోలీస్
సాక్షి, చేర్యాల: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ కానిస్టేబుల్ ఆయన భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన చేర్యాల మండలంలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గూడెళ్లి రమేష్, మమతలు 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావూజీగూడెం. 2011లో రమేశ్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే కొంతకాలంగా భార్యా, పిల్లలకు దూరంగా ఉంటూ చేర్యాలలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసి మమత ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కోపంలో ఇరువురిపై దాడి చేసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
బందిపోటు రాణి
సాక్షి,సిటీబ్యూరో: పాతబస్తీ పేట్లబురుజు ప్రాం తంలోని నిథాయి దాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కార్ఖానాలో జరిగిన బందిపోటు దొంగత నం కేసులో ప్రధాన సూత్రధారి అమ్జద్ భార్య సైతం నిందితురాలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. ఈమె చిక్కితేనే బంగారం రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందం ముంబై సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఆమె కోసం గాలింపు చేపట్టిం ది. ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ తరచూ నిథాయిదాస్‌కు చెందిన కార్ఖానాలకు వచ్చి కొత్త గా మార్కెట్లోకి వచ్చిన, తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే అత ను పేట్లబురుజులోని కార్ఖానాలకు అనేకసార్లు వ చ్చాడు. అక్కడ జరుగుతున్న లావాదేవీలు, సె క్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించిన అతను ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్ ఖాజాకు చెప్పాడు. అప్పటికే దాదాపు 40 దోపిడీలు, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్ జ్యువెలరీ డిజైనర్ ఇచ్చిన సమాచార ంతో గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేప థ్యంలో ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లతో ముఠా ఏర్పాటు చేశాడు. వీరు అమ్జద్ ఇంట్లో నాలుగైదుసార్లు సమావేశమయ్యా రు. ఈ సమావేశాల్లో పాల్గొన్న అమ్జద్ భార్య సైత ం బందిపోటు దొంగతనం చేయడానికి కొన్ని సలహాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత అరెస్టు చేసిన అమ్జద్ తన భార్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయ టపెట్టలేదు. అయితే ఆపై చిక్కిన మరో ముగ్గురు నిందితులు షాకీర్, జాకీర్, మసూద్ చెప్పిన వివరాలతో అమ్జద్ భార్యను నిందితుల జాబితాలో చేర్చారు. మార్చ్ 5న ముంబై నుంచి బయలుదేరిన అమ్జద్ నేతృత్వంలోని ముఠా వేర్వేరుగా ఆ మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంది. మార్చ్ 6న బంగారు నగల కార్ఖానాను కొల్లగొట్టి దాదాపు 3.5 కేజీల బంగారం ఎత్తుకుపోయింది. మరుసటి రోజు షోలాపూర్ చేరుకున్న వీరు అక్క డే సొత్తును అమ్జద్‌కు అప్పగించారు. నగలను ఓ బ్యాగ్‌లో పెట్టుకున్న అతను థానేలోని తన ఇంటి కి చేరుకున్నాడు. అమ్జద్ భార్య కోసం అక్కడకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయగా, మార్చ్ 7న అమ్జద్ బ్యాగ్‌తో ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అమ్జద్ అరెస్టు తర్వాత ఆ బ్యాగ్‌తో పాటు అతడి భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో అది నగల బ్యాగ్ గా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులు, చోరీ సొత్తు పై దృష్టి కేంద్రీకరించారు. -
భార్యను చంపిన భర్త అరెస్టు
సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల) : భార్యను హత్య చేసిన కేసులో భర్తను శ్రీరాంపూర్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సీతారాములు వివరాలు వెల్లడించారు. శ్రీరాంపూర్ గాంధీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికు డు ఉగ్గ కొమురయ్య కూతురు శారదకు, ఆర్కే 6 కొత్తరోడ్‌కు చెందిన కాళీ పోశం కుమారుడు కాళీ మహేందర్‌తో 6 నెలల క్రితం వివాహమైంది. ఈ దంపతులిద్దరు ఇక్కడి కటిక దుకాణాల వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి తాగి ఇంటికి వచ్చిన మహేందర్ భార్యతో కట్నం విషయమై గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేందర్ అక్కడున్న డంబెల్‌ను తీసి శారద మొఖంపై మోదడంతో తీవ్ర రక్తంస్రావం జరిగి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం తన ఇంటికి సమీపంలో తిరుగుతుండగా అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన డంబెల్‌ను స్వాధీన పరుచుకున్నారు. నిందితున్ని ఘటన స్థలం వద్దకు తీసుకెళ్లగా ఎలా హత్య చేశాడో పోలీసులకు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహేందర్‌తోపాటు కట్నం కోసం వేధించిన కేసులో అతని తల్లిదండ్రులు కాళీ మల్లక్క, పోశం, అతని బావ పెగిడి బాపుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చూపించారు.. సమావేశంలో సీఐ ప్రవీణ్‌నాయక్, ఎస్సై రవిప్రసాద్ పాల్గొన్నారు. -
అనుమానంతో..భార్యతొ పాటు కడుపులో పెరుతున్న బిడ్డను...
కర్నూలు : అమె 8 నెలల గర్భ వతి.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త అనుమానం పెంచుకున్నాడు. నిత్యం సూటిపోటి మాటలో వేధించేవాడు. గురువారం క్షణికావేశంలో కత్తితో కట్టుకున్న భార్యనే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువునూ హతమార్చాడు. ఈ ఘటన కర్నూలులో సంచలనంగా మారింది. వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కల గ్రామానికి చెందిన సంధ్యారాణికి అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్‌తో వివాహమైంది. ఇన్వర్టర్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంధ్యారాణి ఎనిమిది నెలల గర్భవతి కాగా..ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదు. విశ్వనాథ్ చెల్లెలు సుధ కర్నూలులోని మాంటెస్సోరి స్కూల్ వద్ద ఉన్న అగ్రసేని అపార్ట్మెంట్లో నివాసముంటోంది. విశ్వనాథ్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వైద్యునికి చూపించుకునేందుకు భార్య సంధ్యారాణితో కలసి రెండు రోజుల క్రితం చెల్లెలు ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం చెల్లెలు సుధ బాత్రూమ్లో ఉండగా సంధ్యారాణి వరండాలో కూర్చుని ఉంది. కొంతకాలంగా భార్యపై అనుమానంగా ఉన్న విశ్వనాథ్ అకస్మాత్తుగా కత్తితో దాడిచేసి ఆమెను గాయపరిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా..వైద్యులు సిజేరియన్ చేసి శిశువును తీశారు. చికిత్స పొందుతూ సంధ్యారాణి (34) గురువారం రాత్రి మృతి చెందింది. కొద్ది సేపటికే శిశువు కూడా శ్వాస విడిచింది. విషయం తెలిసిన వెంటనే సంధ్యారాణి కుటుంబ సభ్యులు కర్నూలుకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటికి రానా? బ్రిడ్జిపై నుంచి దూకి చావనా?
రాజమహేంద్రవరం క్రైం: భార్య వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన పిరియ కరుణ కుమార్(32) పదేళ్ల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అడ్రస్ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కరుణకుమార్‌ను వెతుక్కుంటూ రాజమహేంద్రవరం వచ్చారు. కరుణకుమార్ తండ్రి ధవళేశ్వరం గ్రామంలో టైలరింగ్ పని చేసుకుని జీవిస్తుండగా, కరుణకుమార్ కార్లు అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేసుకుంటున్నాడు కరుణ కుమార్, రమ్యలకు ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్య రమ్యతో మనస్పర్థలు ఉన్నట్టు మృతుడి సోదరుడు మనోజ్, బంధువులు పేర్కొంటున్నారు. ప్రతీ విషయానికి గోడవలు పడడంతో మద్యానికి బానిసైన కరుణకుమార్ జీవితంపై విరక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. కార్ల అమ్మకాలు లేకపోవడం, భార్యతో గొడవగా ఉండడంతో మంగళవారం కరుణకుమార్ తనతో కలిసి కార్లు వ్యాపారం చేసే వీరేంద్రను మోటారు సైకిల్‌పై కొవ్వూరులో కారు ఉంది కొందామని తీసుకువెళ్లాడు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద ఫోన్లో మాట్లాడేందుకు మోటారు సైకిల్ ఆపాడు. భార్యతో ఫోన్లో మాట్లాడినట్టు స్నేహితులు పేర్కొంటున్నాడు. భార్యతో ఫోన్లో మాట్లాడి.. భార్యతో ఫోన్లో మాట్లాడే సందర్భంలో కరుణకుమార్ ‘‘ఇంటికి రానా? లేక బ్రిడ్జి మీద నుంచి దూకి చావనా?’’ అంటూ భార్యతో అన్నట్టు స్నేహితుడు పేర్కొంటున్నారు. దీనికి భార్య ‘‘దూకి చావు నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి స్నేహితుడు ఫోన్లో భార్య రమ్యకు చెప్పగా ‘‘అతడికి, తనకు ఏ విధమైన సంబంధం లేదని, అతని తల్లిదండ్రులకు చెప్పండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. వెంటనే స్నేహితుడు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గోదావరిలో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాస మరచి.. తుది శ్వాస విడిచి
భీమవరం టౌన్ : ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన కొడుకు. దేశం కాని దేశంలో కష్టపడుతున్నాడని.. నాలుగురాళ్లు వెనుకేసుకుని అతడు సుఖంగా ఉంటే చాలనుకుంది ఓ తల్లి! ముద్దులొలికే ఇద్దరు మగ పిల్లలు. వారి భవిష్యత్తు కోసం తన భర్త దూర దేశంలో కష్ట పడుతున్నా త్వరలోనే అప్పులు తీర్చి కుటుంబం చీకూచింతా లేకుండా ఆనందంగా బతకొచ్చని అనుకుంది ఓ భార్య !. వారి ఆశలకు, ఊహలకు భిన్నంగా.. పరాయి దేశం వెళ్లి సంపాదిస్తున్న ఆ వ్యక్తి తిరిగి మరొక యువతి, ఆరునెలల పాపతో తిరిగొచ్చాడు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుని రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చాడు. వివరాలలోకి వెళితే.. రామపూడి యేషయ్య(28)ది ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామం. తండ్రి చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి ఉన్నంతలోనే కష్టపడి పెంచింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన తరువాత యేషయ్యకు పెళ్లి చేసింది. భార్య సుధారాణి, ఇద్దరు మగపిల్లలతో కుటుంబాన్ని కష్టపడి పోషించేవాడు. పెద్ద కుమారుడికి 7 ఏళ్లు, చిన్న కుమారుడికి 4 ఏళ్లు. పిల్లలను బాగా చదివించాలి, కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో యేషయ్య తన భార్య, పిల్లలను కాళ్ల మండలం దొడ్డనపూడిలోని అత్తింటికి పంపి.. తల్లిని స్వగ్రామంలోనే ఉంటున్న సోదరికి అప్పగించి 2015లో కువైట్ వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా సమీపంలో ఉంటున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం సమీపంలోని పల్లెపాలెం గ్రామానికి చెందిన సముద్రమ్మ అనే యువతితో పరిచయమైంది. ఇరువురు ఆ దేశంలో సహజీవనం చేశారు. ఫలితంగా ఇప్పుడు వారికి 6 నెలల పాప. ఈనెల 6వ తేదీన యేషయ్య సముద్రమ్మ, పాపతో స్వదేశానికి వచ్చాడు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వీళ్లతో ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు. 17వ తేదీ అర్ధరాత్రి యేషయ్య వంటగదిలోని పదునైన చాకుతో గుండెల్లో పొడుచుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్సై జి.కాళీచరణ్ బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యేషయ్య ఇక్కడికి వచ్చిన తరువాత కాళ్ల గ్రామం వెళ్లి భార్య సుధారాణిని కలిశాడు. అప్పులు తీరాక వస్తానని చెప్పి వెనుకకు వచ్చేశాడు. రాయలం గ్రామం వెళ్లి సముద్రమ్మతో ఘర్షణ పడ్డాడు. డబ్బులు ఎక్కువ ఖర్చుపెడుతున్నావంటూ ఆమెతో గొడవపడి మనస్తాపం చెంది చాకుతో గుండెల్లో పొడుచుకున్నాడు. 108 వాహనానికి సమాచారం అందడంతో వచ్చేసరికే యేషయ్య మృతిచెందాడు. భార్య సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జీవితంలో చేసిన చిన్న పొరపాటు రెండు కుటుంబాలను విషాదంలోనికి నెట్టింది. పిల్లలు తండ్రిలేని వారయ్యారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
కాశీబుగ్గ : భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన బుధవారం పలాస మండలం రంగోయి గ్రామంలో చోటుచేసుకుంది. రంగోయికి చెందిన గేదెల జనార్దనరావు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా, పెద్ద కుమారుడు హేమేశ్వరరావు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీగ్రామ్‌లో కర్రల మిల్లులో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. తండ్రి మృతి చెందాడన్న వార్త విని ఇద్దరు కుమారులు బయలుదేరినప్పటికీ స్వగ్రామం వచ్చేటప్పుడు రెండు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో జనార్దనరావు భార్య భాగ్యవతి బుధవారం గ్రామ శ్మశానవాటికలో భర్త చితికి తలకొరివిపెట్టింది. ఇద్దరు కుమారులు ఉండికూడా తాను తలకొరివి పెట్టి అనాథగా మిగిలిపోయానంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కలచివేసింది. -
బావ ఆటోకు నిప్పు పెట్టిన బామ్మర్ది
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : భార్యను వేధించకుండా కాపు రం చక్కగా చేసుకోమని మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి తన బావ ఆటోకే నిప్పు పెట్టిన ఘటన కండ్రిక ప్రాంతంలో చోటు చేసుకుంది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కండ్రిక కాలనీకి చెందిన చిందిపిల్లి సింహాచలం (44) ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తన చెల్లెలికి వాంబే కాలనీకి చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే మల్లేశ్వరరావు తరచూ భార్యతో గొడవపడడం, ఆమెను తిట్టడం, కొట్టడం చేస్తుండడంతో సింహాచలం అతన్ని పలుమార్లు మందలిస్తూ వచ్చాడు. దీంతో సింహాచలంను మల్లేశ్వరరావు కూడా బెదిరించడం ప్రారంభించాడు. ఆదివారం కూడా ఇదే విధంగా తన చెల్లిని వేధిస్తున్నాడని తెలియడంతో సింహాచలం వెళ్లి గట్టిగా మల్లేశ్వరరావును మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకున్న మల్లేశ్వరరావు ఆదివారం రాత్రి కండ్రిక కాలనీలోని సింహాచలం ఇంటికి వెళ్లి ఇంటి ముందు నిలిపిన ఆటోపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా తుళ్లిపడి నిద్రలేచిన స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధితుడు సింహాచలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ భార్య ఆత్మహత్య
రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ ఎస్ఐ మహేశ్‌నాయుడు భార్య సౌజన్య (26) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసుస్టేషన్ ఎదురు వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. సౌజన్యది నెల్లూరు జిల్లా కావలి కాగా, ఎస్‌ఐది చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని వరదయ్యగారిపాళెం. ఐదేళ్ల కిత్రం వీరికి వివాహమైంది. వీరికి పూర్ణేష్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. ఎస్ఐ ఏడాదిన్నర క్రితం మన్నూరు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. భార్యభర్త ఇక్కడే ఉంటున్నారు. కాగా ఎస్ఐ ఉదయం నుంచి ప్రత్యేకహోదా బంద్‌లో విధులు నిర్వర్తించారు. సాయంకాలం ఊటుకూరు గ్రామసభలో విధులు నిర్వర్తించే క్రమంలో ఎస్ఐ వెళ్లిపోయారు. పోతూ పోతూ తన బిడ్డను పోలీసుస్టేషన్లో ఓ కానిస్టేబుల్‌కు అప్పగించి వెళ్లినట్లు సమాచారం. పిల్లవాడిని చూసుకుంటుండాలి.. విధులు ముగించుకొని వచ్చేటప్పుడు తీసుకెళతానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇతను విధుల్లో ఉండగానే ఇంటికి రావాలని భార్య నుంచి ఫోన్‌కాల్ రాగా.. తాను గ్రామసభలో ఉన్నానని.. ఆ తర్వాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈలోగా పిల్లవ్లాడిని ఓ కానిస్టేబుల్ ఇంటి వద్దకు తీసుకెళ్లి చూడగా, తలుపు వేసి ఉందని వెనక్కి వచ్చి ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. అయితే మరో కానిస్టేబుల్ మళ్లీ ఇంటికి వద్దకు వెళ్లి బలవంతంగా తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఎస్ఐ భార్య ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేçసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఎస్ఐకు సమాచారం అందచేశారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని, భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ మన్నూరు ఎస్ఐ భార్య ఆత్మహత్య సంఘటన పోలీసువర్గాలను కలవరపాటుకు గురిచేసింది. సంఘటన స్ధలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారని పలువురు పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కేసు విషయంపై పరిశీలిస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ రాజగోపాల్(టౌన్), రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నరసింహులు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. -
కుటుంబంపై కర్కశత్వం
కొండగట్టు (చొప్పదండి) : కొండగట్టు దర్శనానికి వెళ్లిన కుటుంబ సభ్యులను పథకం ప్రకారం హతమార్చేందుకు యత్నించాడో కర్కోటకుడు. రెండేళ్ల కూతురును చంపి.. అనంతరం రెండో కూతురు, భార్యను హత్య చేసేందుకు యత్నించగా.. భార్య తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం భర్తతో పాటు రెండో పాప ఆచూకీ లభించడం లేదు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొగ్గులకుంట వద్ద సోమవారం వెలుగు చూసింది. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం శివపురి గ్రామానికి చెందిన అశోక్ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలసి శనివారం కొండగట్టు దర్శనానికి వచ్చాడు. రాత్రి ఇక్కడే నిద్రించి ఆదివారం మధ్యాహ్నం భార్యా పిల్లలను తన వెంట బొగ్గులగుంట వైపు తీసుకెళ్లాడు. భర్త వ్యవహారశైలిపై శంకించిన భార్య.. అటువైపు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే.. కోనేరు ఉందని, అక్కడ స్నానం చేద్దామని వారిని నమ్మబలికాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత చిన్న కూతురు అక్షిత (2)ను గొంతు నులిమి చంపాడు. పెద్దమ్మాయి అంజలి (4)ని చంపేందుకు యత్నించగా.. భార్య అడ్డుకోబోయింది. దీంతో ఆమె మెడకు వైరు బిగించి హత్యాయత్నం చేయగా.. స్ఫృహ కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె లేచి చూసేసరికి భర్త, పెద్దపాప కానరాలేదు. వెంటనే ఇంటికి చేరుకున్న లక్ష్మి.. తన తల్లిదం డ్రుల సహాయంతో వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొడిమ్యాల, మల్యాల ఎస్ఐలు సోమ సతీష్‌కుమార్, నీలం రవి అడవిలో వెతకగా రాత్రి చిన్నారి అక్షిత శవం లభ్యమైంది. అశోక్‌తోపాటు మరో కూతురు అంజలి ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది..
ఉద్యోగరీత్యా ఆయన వేరే రాష్ట్రంలో స్థిరపడ్డారు.. సొంతూరిపై మమకారం, బంధువులను చూసేందుకు ఏడాదికోసారి ఇక్కడికి వస్తుంటారు. నాలుగురోజులు ఇక్కడే సరదాగా కుటుంబసభ్యులతో గడిపి తిరిగి వెళుతుంటారు. ఈ ఏడాది కూడా అలా సరదాగా భార్య, కుమార్తెతో ఆయన తన స్వగ్రామానికి రైలులో బయల్దేరారు. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. రైలు రూపంలో మృత్యువు వారిని వెంబడించింది. పట్టాలు దాటుతుండగా ఢీకొట్టింది. దీంతో భార్యతోపాటు మృత్యువాత పడ్డారు. తీవ్ర విషాదకర సంఘటన కన్నకూతురుతో పాటు, బంధువులను శోకసంద్రంలో ముంచింది. పిఠాపురం టౌన్ : పిఠాపురం మండలం విరవాడ గ్రామానికి చెందిన గురుజు సూర్యనారాయణ(45) త్రిపురలోని రైల్వే ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నారు. చాలా ఏళ్లుగా అక్కడే భార్య వెంకటలక్ష్మితో కలసి నివాసం ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఒక కుమార్తె థెరిస్సాకి వివాహం చేశారు. ఆమె పిఠాపురంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటుంది. మరో కుమార్తె చంద్రకళ(20), కొడుకు నాని(18) తనతో పాటే త్రిపురలో ఉంటున్నారు. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. ఏటా త్రిపుర నుంచి పిఠాపురం వచ్చి తన పెద్దకూతురు థెరిస్సా ఇంటికి, అలాగే విరవాడ గ్రామంలోని తన సొంతిల్లు చూసుకుని బంధువులతో గడపడానికి వస్తుంటారు. ఈ ఏడాదీ సూర్యనారాయణ తన భార్య వెంకటలక్ష్మి, చిన్నకుమార్తె చంద్రకళతో కలసి త్రిపుర నుంచి బయల్దేరి సూపర్ ఫాస్ట్ రైలులో విశాఖపట్నంలో దిగాడు. అక్కడి నుంచి పిఠాపురం రావడానికి గురువారం రాత్రి రాయగడ పాసింజర్ ఎక్కి అర్ధరాత్రి పిఠాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ వరకు ప్రయాణం బాగానే సాగింది. రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలో దిగిన వీరందరూ బయటకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌పాత్ బ్రిడ్జిని ఆశ్రయించకుండా ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫారం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం వైపు వెళ్లే ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో ఢీకొట్టింది. అప్పటికే చిన్నకుమార్తె చంద్రకళ ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారం మీద కు ఎక్కేయగా ప్రాణాలతో బయటపడింది. తన భార్య వెంకటలక్ష్మి పట్టాల మీద నుంచి ప్లాట్ఫారం మీదకు ఎక్కేందుకు సూర్యనారాయణ సహకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. చెల్లాచెదురుగా పడిన మృతుల శరీర భాగాలను పోగు చేసి పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. -
భార్యపై భర్త హత్యాయత్నం
మక్తల్: పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం దాదన్‌పల్లికి చెందిన కన్యాకుమారి (35), ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సాతన్‌కోటకు చెందిన రమణారెడ్డి భార్యాభర్తలు. కాగా, కన్యాకుమారి మక్తల్ మండలం ముస్లాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. కొన్నేళ్లుగా వీరి నడుమ భేదాభిప్రాయాలు ఉండగా బంధువులు సర్దిచెపుతూ వస్తున్నారు. అయితే, భార్యకు ఉద్యోగం ఉండగా.. రమణారెడ్డి ఖాళీగా ఉండడంతో తనను చిన్నచూపు చూస్తోందని భావించి బుధవారం ఉదయం తమ పిల్లలు జసిక, అనన్యతో కలసి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఓ గదిలో మాట్లాడుకుంటుండగా.. కోపోద్రిక్తుడైన రమణారెడ్డి, భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా మిగతా ఉపాధ్యాయులు రావడంతో రమణారెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లిలో బుధవారం మహిళా హెడ్మాస్టర్పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. పాఠశాలలోనే జరిగిన ఈ ఘటనలో హెడ్మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం. -
భర్తను చంపిన భార్య
రామగుండం: నిత్యం భార్యను వేధింపులకు గురి చేయడంతో ఓ భార్య భర్తను హతమార్చిన ఘటన రామగుండం పట్టణంలో జరిగింది. రామగుండం సీఐ సాగర్, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆయలం ఎదుట ఎత్తరి మల్లేశ్–సరిత దంపతులు నివసిస్తుంటారు. వీరికి కుమారుడు భాస్కర్, కూతురు సరిత ఉన్నారు. ఇతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వీరి ఇంటి పక్కనే తమ్ముడు విజయ్‌కుమార్ నివాసం ఉంది. కాగా మల్లేశ్ తరచూ వివిధ కారణాలతో భార్య సరితను వేధిస్తుంటాడు. భార్య సరిత తల్లిగారు వరంగల్ జిల్లాలోని మడికొండ మండల పరి«ధిలో రాంపూర్ గ్రామంలో ఒక ఆస్తిని రాసిచ్చారు. దానిని విక్రయించి డబ్బులు తీసుకురమ్మని భార్య సరితపై చేయి చేసుకుంటూ అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీంతో భార్య సహనం కోల్పోయి తన మరిది విజయ్‌తో కలిసి ఆదివారం రాత్రి మల్లేశ్ నిద్రిస్తున్న సమయంలో విచక్షణారహితంగా కత్తులు, గడ్డపారతో పొడిచి హతమార్చారు. స్థానికులు గుర్తించి రామగుండం పోలీసులకు సమాచారమివ్వడంతో గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి, రామగుండం సీఐ, ఎస్సైలు ఘటన స్థలిలో విచారించారు. అక్కడే ఉన్న గడ్డపార, రెండు కత్తులను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య సరిత, మృతుడి తమ్ముడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్య అంటే వస్తువు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: భార్య అంటే వస్తువు కాదనీ, ఆమెకు ఇష్టం లేకున్నా కలిసి జీవించాల్సిందిగా భర్త ఆమెను బలవంతపెట్టకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అర్ధాంగితో కలిసి ఉండాలని భర్తకు మాత్రమే ఉంటే సరిపోదనీ, భార్య కూడా కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొంది. తన భర్త తనను హింసిస్తున్నాడనీ, విడాకులు ఇప్పించాలంటూ ఓ వివాహిత కోర్టును ఆశ్రయించిన కేసును జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ‘ఆమె వస్తువు కాదు. నీతో కలిసి జీవించాల్సిందిగా ఆమెను నువ్వు బలవంతపెట్టకూడదు. ఆమెకు నీతో ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు మాత్రం నీ భార్యతో కలిసే ఉంటానని ఎలా కోరుకోగలవు? నీ నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది’అని న్యాయమూర్తులు భర్తకు సూచించారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 8కి వాయిదా వేసింది. -
భర్త హత్యకు రూ.లక్ష సుపారీ..
పత్తికొండ టౌన్:మానవ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కుట్ర పన్ని అంతమొందించింది ఓ మహిళ. గత నెల 10న తుగ్గలి మండలం మీటేతండా సమీపంలో పొత్తూరు కమ్మ నారాయణస్వామి(55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణలో భార్యే కుట్రపన్ని చంపేసినట్లు పోలీసులు తేల్చారు. ఈమేరకు భార్యతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పత్తికొండలో సీఐ బివి.విక్రంసింహ, పత్తికొండ, జొన్నగిరి ఎస్ఐలు శ్రీనివాసులు, నజీర్‌అహ్మద్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. పత్తికొండ మండలం రామచంద్రాపురం కొట్టాల గ్రామానికి చెందిన పొత్తూరు కమ్మ నారాయణస్వామికి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్ద చిన్న ప్యాపిలి(పీసీ ప్యాపిలి)కి చెందిన ఉమాదేవితో 1997లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణస్వామికి వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించేవాడు. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గ్రామంలో బంధువుల మధ్య పరువు పోతుందని పత్తికొండకు మకాం మార్చాడు. తర్వాత గుంతకల్లులో నివాసముండేవారు. భార్య మద్దికెర మండలం బురుజులకు చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉండేది. ఈక్రమంలో నారాయణస్వామి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రెండేళ్ల క్రితం అతడికి దీర్ఘకాలిక వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఆమె అతడిని శారీరకంగా దూరంగా ఉంచడంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. తనకు పరిచయమున్న వన్నూర్‌స్వామి అనే మంత్రగాడితో ఆమె తన సమస్యను చెప్పుకుంది. అతడి సలహా మేరకు భర్త హత్య చేయించేందుకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రాజశేఖర్‌తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసేందుకు గోవా టూర్‌కు.. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం ఆమె తన భర్తను రాజశేఖర్ వెంట మార్చి 4న రైలులో గోవా టూర్‌కు పంపింది. హుబ్లి సమీపంలో మద్యం మత్తులో ఉన్న నారాయణస్వామిని టవల్‌తో గొంతు నులిమి చంపేందుకు రాజశేఖర్ యత్నించాడు. మత్తులో ఉన్న ఆయన ఒక పక్కకు ఒరిగిపోవడంతో చనిపోయాడని భావించిన రాజశేఖర్ అక్కడ నుంచి పారిపోయి గుంతకల్లుకు వచ్చాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన నారాయణస్వామి మళ్లీ తిరిగివచ్చి రాజశేఖర్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్‌కు ఫోన్ చేసి ‘నా భర్త నీకోసం వెదుకుతున్నాడు, నువ్వు చంపకపోతే ఆయన చేతిలో చస్తావు’ అని పలుసార్లు బెదిరించింది. తనను ఎక్కడ చంపుతారో అని భయపడిన రాజశేఖర్.. నారాయణస్వామిని చంపాలని నిశ్చయించుకున్నాడు. బైక్‌ను వెంబడించి.. ఎలాగైనా నారాయణస్వామిని హత్య చేయాలనుక్ను రాజశేఖర్ ఇందుకు తన సోదరుడు అనంతపురం జిల్లా తోపుదుర్తిలో జీపుడ్రైవర్‌గా ఉంటున్న సుధాకర్, అదే జిల్లా తగరకుంటకు చెందిన ఆటోడ్రైవర్ బాలునాయక్ సాయం కోరాడు. ఉమాదేవి సమాచారం మేరకు..గత నెల 9న గుంతకల్లు నుంచి ప్యాపిలి వెళ్తున్న నారాయణస్వామిని ముగ్గురూ బైక్‌పై వెంబండించారు. గత నెల 10 తెల్లవారుజామున బోడబండ పక్కీరప్ప ఆలయానికి వెళ్లి వస్తున్న నారాయణస్వామిని మీటేతండా సమీపంలో గొంతుకు టవల్ బిగించి హత్యచేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా నమ్మించేందుకు మృతుడి పక్కనే బైక్‌ను పడవేసి అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, నిందితుల ఫోన్ డేటా ఆధారంగా హత్యకేసుగా తేల్చారు. ఈమేరకు నిందితులు ఉమాదేవి, వన్నూర్‌స్వామి, రాజశేఖర్, సుధాకర్, బాలునాయక్‌లను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
రెండో పెళ్లి కోసం భార్య, కూతుర్ని చంపి..
లాతేహార్(జార్ఖండ్) : ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే దురాలోచనతో భార్య, కూతుర్ని కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి. అనంతరం పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని లాతేహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇస్రాఫిల్ అన్సారీ గత సంవత్సర కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై అన్సారీ దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా ఈ నెలలో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అన్సారీ రెండో పెళ్లికి సిద్ధపడ్డ విషయం అతని భార్య షమీనా బేగం, కూతురు ఆస్మా పర్వీన్‌లకు తెలియడంతో అందుకు అడ్డుచెప్పారు. బుధవారం రాత్రి ఈ విషయంపై భార్య భర్తల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఉన్మాదిగా మారిన అన్సారీ గొడ్డలితో భార్య, కూతుర్ని విచక్షణారహితంగా నరికి చంపాడు. కొద్ది సేపటి తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. -
టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకవైపు పేదరికం.. మరోవైపు జీవితంలో ఇంకా స్థితపడలేదనే మనోవేదనకు గురైన ఓ యువకుడు మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంటి సమీపంలోనే ఉన్న సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభం గోవర్ధన్(22) అనే యువకుడు డిగ్రీలో ఫేయిల్ అయిన సబ్జెక్టులను ఇటీవలే రాశాడు. మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం సెల్ టవర్ కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా దుర్వాసన వెదజల్లడంతో లోపలికి వెళ్లి చూసే సరికి కుల్లిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రశేఖర్ చేరుకుని మృతుడి జేబులోని పర్సు, ఫోన్‌ను పరిశీలించగా కుంభం గోవర్ధన్ మృతదేహంగా గుర్తించారు. పేదరికం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి చంద్రమౌళి, ఇద్దరు సోదరులున్నారు. సోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి పీఏ మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద పీఏగా పని చేస్తున్న చంద్రకంటి బాలగంగాధర్(61), ఆయన సతీమణి విజయ(55) గురువారం సిద్దిపేట్ జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న బాలగంగాధర్ దంపతులు తమ కారులో గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌కు బయలు దేరారు. ప్రజ్ఞాపూర్‌లో బంధువుల ఇంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే యాదగిరి గుట్టలో జరిగే శుభకార్యానికి పోవాలని వారు నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ శివారులోకి చేరుకోగానే రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీ కిందకు వీరు ప్రయాణిస్తున్న కారు చొచ్చుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న బాలగంగాధర్, ఆయన సతీమణి విజయ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కిలోమీటరు ప్రయాణిస్తే వారు బంధువుల ఇంటికి చేరుకునేలో పే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. ధ ర్పల్లి మండల కేంద్రానికి చెందిన బాలగంగాధర్ 1998లో ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగంలో చే రారు. అనంతరం ఇరిగేషన్ విభాగంలో పని చేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వద్ద పీఏగా సుధీర్ఘ కాలం పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ ఎమ్మె ల్యే గంగారాం వద్ద పీఏగా పని చేశారు. 2014 నుంచి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద పీఏగా పని చేస్తున్నా రు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అం దరితో కలుపుగోలుగా ఉండే బాలగంగాధర్ మృతి చెందడంపై రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలగంగాధర్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్య
రామాయంపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఝాన్సిలింగాపూర్‌లో బుధవారం జరిగింది. ఎస్ఐ మహేందర్ కథనం మేరకు..గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ఇంటర్ చేస్తుండగా, రెండో కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. కొంత కాలంగా శ్రీనివాసరెడ్డి ఏ పని చేయకపోవడంతో కుటుంబం గడవడం, పిల్లల చదివించడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మనోవేదన చెందిన రేణుగ ఉదయం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్య, తల్లి గొడవలతో వేగలేక యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నంరూరల్: తల్లి, భార్య నిత్యం గొడవలు పడుతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఆదిబట్ల ఎస్సై మోహన్‌రెడ్డి కథనం ప్రకారం.. రాగన్నగూడలోని ఎన్ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న ఆరగంటి వెంకటయ్య కుమారుడు సుధాకర్(25) సూర్యపేట్‌లోని ఓ బోరుబండిపై పని చేస్తుండేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. సంవత్సరం క్రితం నగరంలోని ఖాజాగూడకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా సుధాకర్ భార్యతో అతని తల్లికి నిత్యం గొడవలు అవుతుండేవి. తన తల్లితో గొడవ పెట్టుకోవద్దని సుధాకర్ తన భార్యకు చెప్పినా వినకపోవడంతో మంగళవారం సుధాకర్ బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి నేను అత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. సాయంత్రం ఎన్ఎస్ఆర్ నగర్‌లోని శ్మశాన వాటిక వద్దకు బైక్ పై వెళ్లి బైక్‌లోని పెట్రోల్ తీసి శరీరంపై పోసుకోని నిప్పంటిచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కుటుంబ కలహాలతో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతుడి భార్య గర్భవతి కావడంతో సోమవారం తల్లిగారింటికి వెళ్లింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. -
దొంగచాటుగా ఫోన్ చూస్తే జైలుకే...
రియాద్ : ఇటీవలి కాలంలో మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ ఫోన్లే సాక్ష్యధారాలుగా నిలుస్తుండటంతో కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, 5లక్షల సౌది రియోల్(దాదాపు రూ. 86.5 లక్షలు) జరిమానా విధించనున్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. -
మారిటల్ రేప్ నేరం కాదు: గుజరాత్ హైకోర్టు
గాంధీనగర్ : భార్యతో భర్త చేసే శృంగారాన్ని రేప్(అత్యాచారం)గా పరిగణించలేమని, మారిటల్ రేప్ నేరం కాదని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. అసహజ పద్ధతుల్లో శృంగారం, ఓరల్ సెక్స్‌ను మాత్రం క్రూరత్వానికి సమానమని పేర్కొంది. ఓ మహిళా డాక్టర్, ఆమె భర్తపై చేసిన ఫిర్యాదు విచారణకు వచ్చిన సమయంలో ఈ విధంగా కోర్టు వ్యాఖ్యానించింది. తన భర్త బలవంతంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగికంగా వేధిస్తున్నాడని.. కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు కేసు పెట్టింది. దీంతో భర్త గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని రేప్‌గా పరిగణించలేమని జస్టిస్ జేబీ పార్డివాలా వ్యాఖ్యానించారు. అలాగే భార్య వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా లేనందున భారత శిక్షా స్మృతిలోని 375 కింద రేప్‌గా పరిగణించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కానీ ఐపీసీ 377 కింద అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తున్న విషయం మీద కేసు వాదనలు సాగించవచ్చునని ఆమెకు సూచించారు. సక్రమంగా పెళ్లి చేసుకున్న భార్యతో శృంగారం జరిపే హక్కు భర్తకు ఉన్నదని పేర్కొంటూనే.. భార్య, భర్త ఆస్తి కాదని, ఆమె ఇష్టం లేకుండా శృంగారం జరపకూడదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. వరకట్నం, లైంగిక వేధింపులను తీవ్రంగా పరగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసు సీబీఐ లేదా సీఐడీ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. మహిళా డాక్టర్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. -
నా పిల్లలను ఇప్పించండి సారూ..!
నల్లమాడ: భార్య తనవెంట తీసుకెళ్లిన పిల్లలను తనకు ఇప్పించాలని సి.రెడ్డివారిపల్లికి చెందిన ఎస్.రమణానాయక్ వేడుకొంటున్నాడు. ఆదివారం ఎస్ఐ సత్యనారాయణను కలసి పిల్లలను తన వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇటీవల తన భార్య జయమ్మ పదేళ్ల కుమారుడు ప్రదీప్‌నాయక్, ఆరేళ్ల కుమార్తె లాస్యాబాయిని తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోయిందన్నాడు. ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదన్నాడు. గతంలో కూడా తన భార్య ఇంటినుంచి వెళ్లిపోగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి మందలించి ఇంటికి పంపినట్లు చెప్పాడు. తన భార్య పిల్లలను తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడం వెనుక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హస్తం ఉందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు గతంలోనే పోలీసులకు దొరికాయని బాధితుడు తెలిపాడు. పోలీసులు స్పందించి పిల్లలను తన వద్దకు చేర్చాలని కోరాడు. ఈ మేరకు కలెక్టర్‌కు కూడా విన్నవించినట్లు చెప్పాడు. -
వీడిన శ్రీశైలం యువకుడి హత్య కేసు మిస్టరీ
పెద్దదోర్నాల: మండల పరిధి ఐనముక్కల సమీపం తీగలేరు కాలువ వద్ద గత నెల 24వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసి నేలటూరి శ్రీనివాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదు రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు శ్రీరాంశెట్టి భాస్కరరావుతో పాటు, హత్యను ప్రోత్సహించిన మృతుడి భార్య నేలటూరి మల్లేశ్వరిని మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు అరెస్టు చేసి వారిని శనివారం విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీకి చెందిన నేలటూరి శ్రీనివాసులు, శ్రీరాంశెట్టి భాస్కరరావులు సహ వ్యాపారులు. కాలనీలో పండ్లు, పూలు అమ్ముకుంటూ స్నేహంగా ఉండేవారు. మద్యానికి అలవాటు పడిన శ్రీనివాసులు అప్పులపాలై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న అతడి భార్య మల్లేశ్వరితో చనువు పెంచుకున్న భాస్కరరావు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కాలక్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు శ్రీనివాసులు తిరిగి ఇంటికి చేరాడు. భార్య వివాహేతర సంబంధంపై అనుమానం వచ్చి ఆమెతో ముభావంగా ఉంటున్నాడు. తమ వివాహేతర సంబంధానికి భవిష్యత్తులో అడ్డం వస్తాడన్న కారణంతో ఎలాగైనా అతడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్న భాస్కరరావు గత నెల 24వ తేదీన తన సొంత ఆటోలో కొబ్బరి చిప్పలు నింపుకుని శ్రీనివాసులుతో కలిసి పెద్దారవీడు మండలం కుంట చేరుకున్నాడు. వేరే వాహనంలో కొబ్బరి బోండాల లోడుతో తిరుగు ప్రయాణమయ్యారు. దోర్నాల చేరుకున్న భాస్కరరావు అక్కడ ఓ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసి శ్రీనివాసరావుకు మోతాదుకు మించి తాగించాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాసరావును తన ఆటోలో వేసుకుని ఐనముక్కల వద్ద తీగలేరు కాలువ వద్దకు చేరుకున్నాడు. అక్కడే తువాలుతో గొంతు బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌తో కాల్చి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీకి చేరుకున్నాడు. దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన మృతుని తండ్రి పెంచలయ్య హత్యకు గురైన వ్యక్తి తన కుమారుడేనని గుర్తించడంతో పోలీసులు దర్యాన్తును వేగవంతం చేశారు. బంధువులు వ్యక్తం చేసిన అనుమానంతో భార్య మల్లేశ్వరి, భాస్కరరావు కదలికలపై నిఘా ఉంచారు. వీరి ఫోన్‌కాల్స్ డేటా పరిశీలించడంతో పాటు, మండల కేంద్రంలోని సీసీ కెమోరాల్లో భాస్కరరావు వాహనం ఎటువైపు ప్రయాణించిందన్న సాక్ష్యాలు సేకరించారు. తమపై అనుమానం ఉందని పసిగట్గిన వీరి ఆటోలో గుంటూరు పారిపోతుండగా కుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించడంలో చరుగ్గా వ్యవహరించిన సీఐలు భీమానాయక్, మల్లికార్జునరావు, ఎస్ఐ రామకోటయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు. -
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ..
మందస: దాంపత్య జీవితం ప్రారంభమైననాడే భర్త జీవితంలో భార్య సగమవుతుంది. కష్టాల్లో, సుఖాల్లో తోడు ఉంటానని ఒకరినొకరు నమ్ముకుని సాగించిన జీవితంలో అర్థాంతరంగా ఒకరు దూరమైతే ఆ వేదన వర్ణనాతీ తం. భర్త మృతిచెందడంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర సంఘటన మందస మండలంలోని మఖరజోలలో శుక్రవారం జరిగింది. మఖరజోల గ్రామానికి చెందిన కంచరాన దుర్యోధన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం కష్టాల్లో నెట్టుకొస్తోంది. భార్య సుధారాణి భర్తకు తోడుగా శ్రమిస్తోంది. భార్య, భర్తలిద్దరూ ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులను దాటుకొస్తున్నారు. వీరి శ్రమైక జీవనాన్ని చూసి, ఓర్వలేక విధి ఆగ్రహించింది. మృత్యు‘తీగ’ పాశాన్ని విద్యుత్ రూపంలో దుర్యోధనపై విసిరింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. కష్టాల కడలి నుంచి నెట్టుకొస్తున్న ఆ కుటుంబం అనాథగా మారింది. కుమా ర్తె నీహారిక, కుమారుడు భార్గవ్‌తో పాటు భార్య సుధారాణి దిక్కులేనివారయ్యారు. దుర్యోధన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి.. భర్త మృతదేహానికి తలకొరివి పెట్టడానికి సుధారాణి ముందువచ్చింది. బాధను పెదవిన బిగపట్టి, అంత్యక్రియలు నిర్వహించింది. పిల్లల ఆక్రందనను ఆపలేక.. అంత్యక్రియలు నిర్వహించే దిక్కులేక.. చివరికి అన్ని తానై.. భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన సుధారాణి దీనస్థితి చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించాయి. -
ఉలిక్కిపడ్డ నిమ్మనపల్లి
పెద్దపల్లి: మాయలు లేవు.. మంత్రాలు లేవు.. భూతా లు దయ్యాలు అసలే లేవు.. అంటూ మేథావులు ఎంత మొత్తుకుంటున్నా.. అజ్ఞానాన్ని వీడని కొందరు ప్రాణా లు తీస్తున్నారు. ఇదే కోవలో మరో సంఘటన జరిగింది. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి తమ్ముడి చేతిలో అన్నావదినలు దారుణంగా హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తూముల నంబయ్య(60), కమల (53)లను నంబయ్య తమ్ముడు శంకర్ గొడ్డలితో నరికి చంపాడు. కొంతకాలంగా తగాదాలు.. నంబయ్య సోదరులు ఐదుగురు ఒకే చోట పక్క పక్కనే నివాసముంటున్నారు. ఇరువురు అన్నదమ్ముల మధ్య భూ తగాదాల ఉన్నాయి. అలాగే కొంతకాలంగా తన అనారోగ్యానికి అన్నావదినలే కారణమని శంకర్ పగ పెంచుకున్నాడు. దీంతోనే వారిని చంపాలని నిర్ణయించుకున్న శంకర్ అదను కోసం చూసి చీకటి పడ్డాక ఇద్దరిపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం శంకర్ పరారయ్యాడు. మూఢ నమ్మకాలతో శంకర్ అత్యంతకిరాతకంగా వ్యవహరించాడని గ్రామస్తులు ఆవేదన చెందారు. సంఘటన జరిగిన గంట తర్వాత కూడా విషయం వెలుగులోకి రాలేదని తెలిపారు. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ నరేందర్, ఎస్ఐ జగదీశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలు నేడు తరలింపు నంబయ్య, కమలలను హతమార్చిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకుడు శంకర్ గొడ్డలిని ఉపయోగించాడా.. పదునైన ఆయుధాన్ని ఉపయోగించాడా.. అనేది మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారని, కుమారుల సమక్షంలో మృతదేహాలను తరలించి పరీక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో..
తిరువొత్తియూరు: చెన్నై, టీనగర్లో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో 170 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చెన్నై టీ.నగర్ సౌత్ పార్కు రోడ్డులో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య గృహలక్ష్మి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈమె అడయారులో నివాసం ఉంటున్నారు. వారం వారం ఇక్కడికి వచ్చి బస చేసి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి కిటికీలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 170 సవర్ల నగలు, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది.దీనిపై ఫిర్యాదు అందుకున్న మాంబలం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దొంగలకు దేహశుద్ధి: తాంబరం పడప్పై నీలమంగళంకు చెందిన శ్రీనివాసులు ఆడిటర్. శ్రీనివాసన్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇతని ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన వారు షోలింగనల్లూరుకు చెందిన రమేష్, ఆనంద్ అని తెలిసింది. దొంగను పట్టించిన ఇంజినీర్ చెన్నై కన్నగినగర్ కారపాక్కం భారతీయార్ వీధికి చెందిన అబుదాగిరి (23) ఇంజినీర్. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న హోటల్‌కు వెళ్లాడు. తరువాత 1.30 గంటల సమయంలో ఇంటికి రాగా ఆసమయంలో ఇంట్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే బయట తలుపులకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చోరీకి ప్రయత్నిస్తున్న మణికంఠన్ (26), కార్తికేయన్ (27)లను అరెస్టు చేశారు. -
తోపులాటలో కిందపడి భర్త మృతి
విశాఖ క్రైం: పూటుగా మద్యం సేవించి భార్యతో గొడవ పడిన సంఘటనలో భార్య ఒక్కసారిగా తోయడంతో కిందపడి భర్త మృతి చెందాడు. ఈ ఘటన నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం చిన్నూరు మసీదు వద్ద భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఏలూరు గణేష్ (33) నివాసముంటున్నాడు. గణేష్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి రావడంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గణేష్ పూటుగా మద్యం సేవించి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయకపోవడంతో... తలుపు తీయకపోతే నిన్ను చంపేస్తానని కేకలు పెట్టాడు. దీంతో లక్ష్మి తలుపులు తీసింది. కోపంతో రెచ్చిపోయిన గణేష్ భార్యను చంపేస్తానంటూ గ్యాస్ సిలిండర్ పైపు తీశాడు. ఇద్దరి మధ్య తెల్లవారిజాము 2 గంటల వరకూ గొడవ కొనసాగింది. లక్ష్మి భయపడి భర్తను గట్టిగా తోసి ఇంటి నుంచి బయటకు వచ్చి తాళం వేసి అదే ప్రాంతంలో ఉంటున్న అత్త త్రినాథమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అత్తకు జరిగిన సంఘటన పూర్తిగా వివరించింది. అత్తతో కలిసి ఉదయం 7.30 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లి తాళం తీసి చూసేసరికి భర్త మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. తల భాగం నుంచి రక్తం రావడాన్ని గురించారు. వెంటనే మృతుడి తల్లి త్రినాథమ్మ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తిరుమలరావు ఆదేశాల మేరకు ఎస్ఐ శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. -
భార్యాబిడ్డలను జూదమాడిన భర్త
న్యూఢిల్లీ : ద్వాపర యుగంలో ధర్మరాజు ద్రౌపదిని జూదమాడాడని మహాభారతంలో విన్నాం. కానీ ఆధునిక యుగంలో మనుషులు సిగ్గుతో తలదించుకునేలా చేసాడు జూదానికి బానిసైన ఓ వ్యసనపరుడు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్షార్లో జరిగిందీ ఘటన. భార్యని జూదమాడి ఓడిన మోహిసిన్ అనే వ్యక్తి తన ఆరు, ఏడేళ్ళ కొడుకులిద్దరినీ వదల్లేదు. చిన్నారులను సైతం జూదంలో పెట్టాడు. భార్య, బిడ్డలిద్దర్నీ మోహిసిన్ జూదంలో ఓడిపోవడంతో జూదంలో గెలిచిన ఇమ్రాన్ నేరుగా మోహిసిన్ ఇంటికి వెళ్ళి మోహిసిన్ భార్యను తనతో రమ్మని బలవంత పెట్టిన ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. మోహిసిన్ భార్య దీనికి నిరసనగా ఆందోళనకు దిగడంతో పంచాయితీ నిర్వహించారు. మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే మోహిసిన్ భార్య జూదగాడితో వెళ్ళేందుకు నిరాకరించడంతో కనీసం ఇద్దరు పిల్లల్లో ఒకరినైనా జూదంలో గెలిచిన ఇమ్రాన్ వెంట పంపాలని పంచాయితీ తీర్పునిచ్చింది. దీంతో మోహిసిన్ ఇద్దరు పిల్లల్లో ఒకరిని జూదంలో గెలిచిన ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్ళడం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం తనను జూదమాడిన భర్తకు విడాకులిచ్చేసిన భార్య తన భర్తతో పాటు, తనను బలవంతంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్ సహా మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అనేకసార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుని ఆశ్రయించారు. మోహిసిన్ భార్య పిటిషన్‌పై స్పందించిన చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆలస్యంగా వేట మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనలో భార్యాబిడ్డల్ని జూదంలో పెట్టిన మోహిసిన్ తొలి ముద్దాయి అయితే, వాళ్ళ కొడుకుని జూదగాడితో పంపిన పంచాయితీ సైతం నేరంలో భాగం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. -
భర్త ఇంటిఎదుట బైఠాయింపు
కాసిపేట(బెల్లంపల్లి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో తనకు న్యాయం చేయాలని రెండోపెళ్లి చేసుకున్న భర్త ఇంటిఎదుట మహిళ న్యాయపోరాటానికి దిగింది. రెండవ వార్డుకు చెందిన బోగె అంకుమల్లు, గౌరక్క దంపతుల కూతు రు భవాని, అదేగ్రామానికి చెందిన ముంతమల్ల స్వామి ప్రేమించుకున్నారు. ఒకేకులం వారు కావడంతో పెద్దల అంగీ కారంతో 2004లో వివాహం జరిపించారు. మొదటి ఏడాదిలో నే దంపతులకు కుమారుడు పుట్టి చనిపోయాడు. రెండోసారి మహిళ గర్భం దాల్చడంతో భర్త బలానికి ఇచ్చిన మాత్రలు వేసుకోవడంతో అబార్షన్ అయ్యింది. అప్పటి నుంచి మహిళకు వేధింపులు మొదలయ్యాయి. మూడేళ్లక్రితం తనతండ్రి చనిపోవడంతో ఇంటినుంచి వెళ్లగొట్టారు. అప్పటినుంచి ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈవిషయమై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నడుస్తోంది. ఈక్రమంలో స్వామి బెల్లంపల్లికి చెందిన మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకుని భర్త ఇంటికి వెళ్లగా ఇంటినుంచి వెళ్లగొట్టారు. చిన్నతనంలోనే తల్లిచనిపోయిందని, మూడేళ్లక్రితం తండ్రి చనిపోయాడని ఎవరూ లేని నన్ను మోసంచేసి మరోపెళ్లి చేసుకున్నాడని మహిళ వాపోయింది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటోంది. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
దత్తిరాజేరు : మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని టి. బూర్జివలసలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్సై నాయుడు అందించిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వై. రామునాయుడి (32) భార్య చిన్నమ్మడు కొద్ది రోజుల కిందట కన్నవారింటికి పాతినవలస వెళ్లింది. నెలలు గడుస్తున్నా చిన్నమ్మడు ఇంటికి రాకపోవడంతో రామునాయుడు మనస్తాపం చెంద తన ఇంటి సమీపంలోని పశువుల శాలలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దాంపత్యానికి పనికిరాడని..
యలమంచిలి:తన ఫోన్ నంబర్ కాకుండా తల్లి ఫోన్ నంబర్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. సీఐ కె.వి.విజయనాథ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పాతవీధిలో నివాసం ఉంటున్న అతికిన శెట్టి నాగేశ్వరావు అనే ఉల్లిపాయల వ్యాపారి ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య వీరలక్ష్మి ఫోన్ నంబర్‌ను పోలీసులు తీసుకున్నారు. అయితే ఆమె తన ఫోన్ నంబర్ కాకుండా తన తల్లి ఫోన్ నంబర్ ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె వినియోగిస్తున్న ఫోన్ నంబర్ తీసుకుని కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. భార్యే నిందితులురాలని నిర్ధారించుకుని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. తానే తన భర్తను చంపినట్టుగా వీరలక్ష్మి అంగీకరించినట్టు సీఐ తెలిపారు. హత్యకు దారితీసిన పరిస్థితులు .. నాగేశ్వరావు, అతని భార్య వీరలక్ష్మికి మధ్య మూడేళ్లుగా విభేదాలున్నాయి. తన భర్త వల్ల తనకు ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతోపాటు నిత్యం వేధిస్తుండేవాడని వీరలక్ష్మి పోలీసులకు తెలిపింది. తనకు గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తితో పరిచ యం ఉందని చెప్పింది. 7వ తేదీ రాత్రి రోజూలాగే తన భర్త తాగి ఇంటికి వచ్చాడని, అతనితో వాగ్వాదం జరగడంతో గట్టిగా నెట్టినట్టు ఆమె చెప్పింది. పడిపోవడంతో గాయాలు తగిలాయని తెలిపింది. అనంతరం మంచంపై పడుకున్న నాగేశ్వరావు గొంతుకు రెండు పేటలుగా చేసిన పురికోస తాడుతో బిగించానని, అప్పటికీ ప్రాణంతో ఉండడంతో ముక్కు,నోరుమూసి హత్యచేశానని నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఈ హత్యతో ఎవరికీ సంబంధంలేదని తెలిపినట్టు సీఐ చెప్పారు. నిందితురాలిని కోర్టుకు హాజరపరుస్తామని ఆయన తెలిపారు.కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు.తల్లి అనారోగ్యంతో మంచంపై ఉండగా, ఇద్దరు పిల్లలు చాలా కాలంగా వారి అమ్మమ్మ వద్దే ఉంటూ చదువుకుంటున్నారు. ఈకేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తామని సీఐ కె.వి.విజయనాథ్ తెలిపారు. -
‘ఆత్మ’ బంధమై...
కష్టాలు వెంటాడాయని.. కన్నీటి సుడుల్లో చిక్కుకున్నామని.. రాత మారే దారి కనిపించలేదని.. ఓ దంపతుల జంట. ప్రేమకు పరాకాష్ట వెదకాలని.. ఏకం కాలేని పరిస్థితులు ఎదురునిలిచాయని.. ఓ ప్రేమికుల జంట. క్షణిక నిర్ణయాలతో మరణ శాసనాలు రాస్తుండటం వేదన కలిగించే అంశం. విజయవాడకు చెందిన గూడూరు కృష్ణ కష్టాలు చుట్టుముట్టాయని ఆత్మహత్య చేసుకోగా, అది చూసి జీర్ణించుకోలేక మరణంలోనూ తోడుగా అంటూ భార్య సత్యవతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమికులైన నందిగామ మండలం పెద్దవరానికి చెందిన ఉప్పులూరి ప్రియాంక, చందర్లపాడు మండలం రామన్నపేటకు చెందిన కర్ల రవీంద్ర కలసి జీవించలేమని నిర్ణయానికి వచ్చి మరణంలో ఏకమవ్వాలని తిరిగిరానిలోకాలకు చేరిపోయారు. పెళ్లినాటి ఊసులు 30 ఏళ్లుగా వారి దాంపత్యంలో మధురంగా మెదిలాడుతూ ఉండేవి. ఆనాటి బాసలు వారి అడుగుజాడల్లో అణువణువునా తొణికసలాడేవి. అందుకే ఆయన కంట్లో నలకపడితే ఆమె చెంపలపై కన్నీటి చుక్క జాలువారేది. ఆమె సంతోషపడితే ఆయన పెదవులపై చిరునవ్వు పూసేది. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అప్పుల తుఫాన్ చిచ్చురేపింది. ఆయనను ఆత్మాభిమానం కుంగదీయడంతో ఇక బతకలేనంటూ అప్పుల ఉరికొయ్యకు అర్ధంతరంగా ప్రాణాలు బలిపెట్టాడు. పది నిమిషాల ముందు కళ్ల ముందు కదిలాడిన భర్త కానరానిలోకాలకు వెళ్లడంతో ఆమె గుండె బద్దలైంది. భర్త లేని జీవితం తనకొద్దంటూ ఆమె కూడా అదే ఉరికొయ్యకు వేలాడింది. శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ దంపతుల ఆత్మహత్య ప్రతి హృదయాన్ని కన్నీటితో తడిపింది. చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమలవిలాస్ కొండ అడ్డరోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కాలనీలోని సింహాద్రి వీధిలో భార్యాభర్తలు గూడురు కృష్ణ(56), సత్యవతి(49) నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేశారు. కుమారుడు సాయి బెంగళూరులో సీఏ చదువుతున్నాడు. కృష్ణ సామారంగం చౌక్‌లో కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. కొబ్బరి కాయలు పెట్టుకుని వ్యాపారం చేసే చోట భవనం నిర్మిస్తుండటంలో షాపు బ్రహ్మణ వీధిలోకి మార్పు చేశాడు. కృష్ణ భార్య సత్యవతి బ్రహ్మణ వీధిలోనే ఇటీవల దుస్తుల షాపు పెట్టింది. అయితే కొద్ది రోజుల కిందట కృష్ణకు షుగర్ వ్యాధి రావడంతో పాటు వ్యాపారాల అవసరాల కోసం కొద్దిగా అప్పులు చేశారు. అప్పుల విషయమై భార్యా భర్తల మధ్య మనస్పార్థలు వచ్చాయి. పూజలు చేస్తుండగా.. కృష్ణ, సత్యవతిలు ఇద్దరు శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్నారు. ఆమె దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసింది. వంట చేసేందుకు గదిలోకి వెళ్లింది. భర్త మాట్లాడం లేదని అనుమానం వచ్చిన ఆమె ఆయన ఉన్న గదిలోకి వెళ్లింది. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఊరి వేసుకుని భర్త వేలాడుతూ కనిపించాడు. కంగారుగా మంచం ఎక్కి భర్త ఊరి వేసుకుని చీరను కత్తెరతో కట్ చేసింది. కిందకు జారిన ముఖంపై వాటర్ బాటిల్లోని నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేసింది. అప్పటికే భర్త మరణించాడని గ్రహించింది. తనువు చలించి.. భర్త ఇక లేడని నిర్ధారించకున్న సత్యవతి కన్నీటి పర్యంతం అయింది. అంతే క్షణంలో నిర్ణయం తీసుకుంది.. మరణంలోనూ ఆయనకు తోడుగా ఉండేందుకు భర్త ఉరి వేసుకున్న ఫ్యాన్‌కే లుంగీతో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్క గదిలో అద్దెకు ఉండే బేగం లోపలకు వచ్చి పరిశీలించింది. ఇద్దరు మృతి చెంది ఉండటంతో కృష్ణ అల్లుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాంది. అందరికీ పెద్ద తలకాయగా ఉండే కృష్ణ, సత్యవతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ ఏసీపీ జీ రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పో స్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికితరలించారు. ప్రేమ జంట ఆత్మహత్య.. నందిగామ: నిండు నూరేళ్లు కలసి బతుకుదామనుకున్న ఓ ప్రేమ జంట బలవంతంగా తనువు చాలించింది. ప్రేమికులు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నందిగామ శివారు హనుమంతుపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి చెందిన ఉప్పులూరి ప్రియాంక(20) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. చందర్లపాడు మండలం రామన్నపేట గ్రామానికి చెందిన కర్ల రవీంద్ర(24) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. దూరపు బంధువులే. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం పరీక్ష రాసేందుకు ప్రియాంక నందిగామ వచ్చింది. వారిరువురు హనుమంతుపాలెం వెళ్ళే దారిలో పంట పొలాల్లోని ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం పొందారు. శుక్రవారం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రేమించుకున్న వీరి వివాహానికి పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
మదనపల్లె క్రైం: పెళ్లైన ఐదు నెలలకే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. ఆమె తీసుకురాకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీనా(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లుకు చెందిన ఎస్కె ఇస్మాయిల్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఐదు నెలలకే ఆమెపై అత్తవారి వేధింపులు మొదలయ్యాయి. భర్త ఇస్మాయిల్, ఆడ బిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని షమీనాను వేధిస్తున్నారు. ఆమె తీసుకురాలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంటిలో గొడవ పడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. దీంతో షమీనా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షమీనాను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వివాహేతరం సంబంధం.. చేతులు నరికేసిన భర్త
విజయనగరం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంలో ఓ వ్యక్తి, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులు నరికేశాడు. కొత్తగూడ గ్రామానికి చెందిన నరేష్, సుహాసిని(పేరు మార్చాం) భార్యభర్తలు. సుహాసినితో అదే గ్రామానికి చెందిన బిడ్డిక ధనుంజయ్ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి మహిళ భర్త పథకం ప్రకారం మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో ధనుంజయ్‌ను గ్రామం బయటికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి కత్తితో ధనుంజయ్ రెండు చేతులూ నరికేశారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ధనుంజయ్‌ను దగ్గరిలోని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు భరించలేక..
నిత్యం భర్త పెడుతున్న వేధింపులను పంటి బిగువున భరించింది. తాగొచ్చి అనుమానంతో సతాయించినా సహించింది. చేతికి అందిన వస్తువులతో ఇష్టమొచ్చినట్టు కొట్టినా కన్నీటితో సరిపెట్టుకుంది. ఎప్పటికైనా మారకపోతాడా అని ఆశపడింది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఏళ్లు నెట్టుకొచ్చింది. అతను మారలేదు సరికదా వేధింపులు తీవ్రం చేశాడు.. గురువారం రాత్రి కూడా తాగొచ్చి కొట్టాడు... క్షణికావేశానికి లోనైన ఆమె చేతికందిన రాయితో తలపై మోదడంతో భర్త అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ఈ ఘటన గురువారం రాత్రి గుంటూరు వెంకటరమణ కాలనీలో జరిగింది. లక్ష్మీపురం (గుంటూరు) : భర్త వేధింపులు భరించలేక భార్య సిమెంటు రాయితో అతడి తలపై మోది హత్య చేసిన ఘటన గురువారం రాత్రి వెంకటరమణ కాలనీలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి బంగారురాజు (50), విజయలక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. బంగారురాజు గుంటూరు నగరంలోని వెంకటరమణ కాలనీ 2వ లైనులో నూతనంగా నిర్మిస్తున్న అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. ఇటీవల ఓ కుమార్తెకు వివాహం చేశాడు. కొడుకు మాచర్లలో బేల్దారు పనులకు వెళుతూ వారంలో ఒకరోజు వచ్చి వెళుతుంటాడు. భార్య విజయలక్ష్మి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త బంగారురాజు నిత్యం మద్యం తాగి ఆమెను అనుమానిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి భార్యను తీవ్రంగా కొట్టి దుర్భాషలాడాడు. భర్త వేధింపులు భరించలేక విజయలక్ష్మి సిమెంటు రాయితో అతడి తలపై కొట్టింది. దీంతో బంగారురాజు అక్కడిక్కడే మృతి చెందాడు. విజయలక్ష్మి కుమారుడు నాగరాజుకు సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేరుకుని నగరంపాలెం పోలీసులకు సమాచారం తెలిపాడు. సీఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. బంగారురాజు మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం : పెళ్ళిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపేశారు!
సాక్షి, కోల్‌కతా : ఓ భర్త వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిందనే అక్కసుతో తన భార్యను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అనంతరం తల్లితో కలిసి సుబీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. కొపం తట్టుకోలేక తల్లితో కలిసి స్వప్నను గొంతు నులిమి చంపేశాడు. ఆపై తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే స్వప్న తల్లిదండ్రులు సుబీరే తమ కూతురిని హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి. దీంతో సుబీర్, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
విడవలూరు: నిత్యం తాగుతున్నావని భార్య మందలించిందని మనస్థాపానికి గురైన ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. మండలంలోని వీరారెడ్డిపాళెంకు చెందిన ఏకొల్లు జనార్ధన్ (35) ఇటీవల మద్యానికి బానిసైపోయాడు. దీంతో భార్య ఇలా మద్యం తాగితే పిల్లల భవిష్యత్ ఏమి కావాలని ప్రశ్నించి పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి అలిగి వెళ్లింది. తన భార్య పిల్లల ముందు మందలించిందని మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించి జనార్ధన్ కుమారులు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. -
బీమా కోసం భర్తను హత్య చేయించిన భార్య
సాక్షి, కర్నూలు : బీమా మొత్తం కోసం భర్తనే హత్య చేయించిన భార్య ఉదంతమిది. హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం కర్నూలులో డీఎస్పీ ఖాదర్‌బాషా, తాలూకా సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య రమాదేవి, ఆయన బావమరిది రమేష్ కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు. రమాదేవికి చోలవీడు సర్పంచు మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రమాదేవి, మధుసూధన్‌రెడ్డి, రమేష్, ఆయన భార్య శివప్రణీత కలిసి శ్రీనివాసులును హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. భర్తతో కాపురం చేయటం ఇష్టంలేని రమాదేవి, డబ్బుపై దురాశగల రమేష్, శివప్రణీత దంపతులు కలిసి శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించి, వాటిపై రుణాలు పొందారు. ఈ మేరకు ఆయనపై వేర్వేరు చోట్ల బీమా చేయించారు. అతన్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.2కోట్ల దాకా బీమా మొత్తం వస్తుందని వారు అంచనా వేశారు. ఈ మేరకు శ్రీనివాసులుకు మాయమాటలు చెప్పి రమేష్ తన వద్ద పనిచేసే రమణ, మొయిన్‌బాషలతో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. జనవరి 25వ తేదీన వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓర్వకల్లు సమీపంలో ఆపి రోడ్డుపై మాట్లాడుతున్నట్లు నటించారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీని గమనించి దాని కిందకు శ్రీనివాసులును తోసేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మొయిన్‌బాషా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శ్రీనివాసులును గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాసులు మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రమణ, మొయిన్‌బాషాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, శ్రీనివాసులు భార్య రమాదేవి, బావ మరిది రమేష్, మధుసూదన్‌రెడ్డి, శివప్రణీత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్తే కాలయయుడు
మంథని: అదనపు కట్నం కోసం కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. తల్లితో కలిసి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఐదు రోజులుగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్య ఈనెల 10 తుదిశ్వాస విడిచింది. సంధ్య మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ మృతురాలి బంధువులు దాదాపు 20 గంటల పాటు ఆందళన చేశారు. ఎస్సై, ఇరు గ్రామాల పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఆరెళ్ల క్రితం పెళ్లి మంథని మండలం అడ్య్రాల గ్రామానికి చెందిన మల్లవేన సంతోష్(చంటి)తో కాల్వశ్రీరాంపూర్ మండలం పాతమడిపెల్లికి చెందిన సంధ్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రణీత్(5), ప్రణయ్(3) కొడుకులు. అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడని సంధ్య తల్లి నరెడ్ల స్వరూప తెలిపారు. ఈక్రమంలోనే వేధింపులు ఎక్కువైతే తనకున్న 24 గుంటల భూమి అమ్మి రూ.8లక్షలు, బంగారం ముట్టజెప్పానని రోదిస్తూ తెలిపింది. మనుమడి పుట్టిన రోజున బంగారం కావాలంటే అప్పగించానని చెప్పింది. ఈనెల 5న భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త సంతోష్, తన తల్లితో కలిసి తమ కూతురు చేతులు వెనక్కి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించారని రోదిస్తూ వివరించింది. తమకు మాత్రం గ్యాస్‌స్టౌవ్ అంటుకుందని తెలిపారని కన్నీటిపర్యంతమైంది. కాలిన గాయాలతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన కూతురు అసలు విషయం చెప్పిందని పేర్కొంది. ఈనెల 10న తుదిశ్వాస విడిచిన సంధ్య మృతదేహానికి 11న పోస్టుమార్టం నిర్వహించి గ్రామానికి తీసుకొచ్చారు. సంధ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. మంథని ఎస్సై ఉపేందర్‌రావు గ్రామానికి చేరుకుని ఇరు గ్రామాల పెద్దలు కలుగజేసుకోవడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
సాక్షి, ఒడిశా : ఓ వ్యక్తి ఏడడుగులు వేసి వివాహం చేసుకున్న ఆరు రోజులకే తన భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి వివాహం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందర్‌ఘడ్ జిల్లాలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో(28) అనే వ్యక్తి జార్సుగూడ ధేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ఈ నెల 4న వివాహం చేసుకున్నాడు. తన భార్య వేరే యువకుడిని ప్రేమిస్తుందని తెలుకున్న టప్పో వారిద్దరిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. గ్రామ సర్పంచ్ సమక్షంలో వారికి మళ్లీ వివాహం జరిపించాడు. ఈ పెళ్లి జరగకుంటే ముగ్గురి జీవితాలు నాశనం అయ్యేవని టప్పో చెప్పాడు. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
వైఫై ఆఫ్ చేసిందన్న కోపంతో భార్యను...
-
హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
సాక్షి, హైదరాబాద్ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది. సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కుటుంబాన్ని గాలికొదిలేశాడని..
దేవరకొండ : అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మరో మహిళ మోజులో పడి కుటుంబాన్ని వదిలేశాడు... ముగ్గురు పిల్లల పెంపకాన్ని పట్టించుకోలేదు. పిల్లల చదువులు, బాధ్యత ఆ తల్లిపై పడింది... ఇదేమిటని భర్తను నిలదీసినా, పెద్ద మనుషులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఇక చావే శరణ్యమని భా వించి ఇద్దరు కూతుళ్లతో సహా ఆ తల్లి ఆత్మహత్యకు పా ల్పడింది.. ఈ ఘటనలో తల్లి కూతురు మృతిచెందగా, మరో కూతురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన దేవరకొండలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు... నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన బొమ్ము అచ్చయ్య మాజీ ఉప సర్పంచ్. ఆయనకు పదహారేళ్ల క్రితం రాములమ్మ అనే మహిళతో వివాహామైంది. వారికి పదిహేనేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు, తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారు. అచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అచ్చయ్యకు గ్రామంలో ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కాస్తా రెండో వివాహం చేసుకోవడానికి దారితీసింది. దీంతో ఆమెను అచ్చయ్య నాలుగేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అచ్చయ్య మొదటి భార్యని పట్టించుకోకపోవడం, పిల్లల ఆలనా, పాలనను చూడకపోవడంతో రాములమ్మ మానసికంగా కుంగిపోయింది. ఎన్నిసార్లు ఇదేమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా పట్టించుకోని రాములమ్మ పిల్లలను అచ్చయ్య దూరం చేస్తుండడం, వారి చదువు, పెంపకం, బాధ్యతను కూడా మరవడంతో జీర్ణించుకోలేకపోయింది. తరచూ అచ్చయ్యను నిలదీస్తోంది. ఇదే క్రమంలో పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ము గ్గురు పిల్లలను చదివించలేని రాములమ్మ ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించింది. కొడుకును దేవరకొండలోని రాములమ్మ చెల్లెలి ఇంట్లో ఉంచుతూ చదివిస్తోంది. అచ్చయ్య కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో పాటు పట్టించుకోకపోవడంతో మంగళవారం భర్త దేవరకొండలో ఉన్నాడని తెలిసి కలిసేందుకు వచ్చింది. దేవరకొండలో భర్తను కలిసి మాట్లాడింది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియరానప్పటికీ తన ఇద్దరు కూతుళ్లతో సహా సీపీఐ పార్టీ కార్యాలయం సమీపంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సను అందించే క్రమంలో రెండో కూతురు ప్రియాంక(11), రాములమ్మ(30) మృతిచెందారు. మొదటి కుమార్తె లతమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అచ్చయ్య పిల్లలను పట్టించుకోకపోవడం, వల్లనే రాములమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని రాములమ్మ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. -
వివాహిత బలవన్మరణం
ఆత్మకూర్ (కొత్తకోట): కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మండలంలోని ఆరేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ రమేష్‌కు కర్నూలుకు చెందిన సంధ్య(22)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ మధ్య కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రియుడితో కలిసి..భర్తను చంపింది
బూర్గంపాడు: ఓ ఇల్లాలు, తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. వీరిద్దరూ కలిసి మృతదేహాన్ని గోదావరి ఇసుకలో పాతిపెట్టారు. భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి, బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాలు.... భద్రాచలం పట్టణానికి చెందిన ఐతంరాజు కొండలరావు(35)కు భార్య ముక్తేశ్వరి, కుమార్తె సంధ్యారాణి ఉన్నారు. కుమార్తె ఓణీల వేడుక ఇటీవలే జరిగింది. కొండలరావు, సీపీఎం పట్టణ కార్యాలయ బాధ్యుడిగా, రజక సంఘం జిల్లా నాయకుడిగా ఉన్నాడు. ముక్తేశ్వరికి, నాని అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ ఇద్దరి మధ్య సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను చంపేందుకు ముక్తేశ్వరి పథకం వేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో కొండలరావును అతని భార్య ముక్తేశ్వరి, ఆమె ప్రియుడు నాని, అతని స్నేహితుడు శివ కలిసి గొంతు నులిపి చంపారు. ఆ సమయంలో అక్కడ ముక్తేశ్వరి అక్క కొడుకు రుద్రబోయిన గోపి ఉన్నాడు. హత్య చేయడాన్ని అతడు చూశాడు. ఇక్కడ చూసిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని గోపిని వారు ముగ్గురూ కలిసి బెదిరించారు. ఆ తరువాత, మృతదేహాన్ని ఆటోలో వేసుకుని ముక్తేశ్వరి, నాని, శివ, గోపి, సం«ధ్యారాణి(కుమార్తె) కలిసి భద్రాచలం నుంచి బూర్గంపాడు మండలంలోని పాతగొమ్మూరు ఇసుక రేవుకు తీసుకొచ్చారు. గోదావరిలోకి దిగి, ఇసుకలో గోయి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అక్కడి నుంచి ఆటోలో నాని, శివ పరారయ్యారు. ముక్తేశ్వరి, సంధ్యారాణి కలిసి ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం ముక్తేశ్వరి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లిన గోపి, తాను చూసిన విషయాన్ని తన కుటుంబీకులతో చెప్పాడు. వారు సీపీఎం నాయకులకు సమాచారమిచ్చారు. కొండలరావు సోదరి కొక్కిరేణి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. శవ పంచనామా కోసం భద్రాచలం ఆస్పత్రికి పంపించారు. పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం నాయకులు పరిశీలించారు. -
భార్యను చంపిన భర్త
మణుగూరుటౌన్: కట్టుకున్న భార్యకు తోడు నీడగా ఉండాల్సిన భర్తే ఆమెపాలిట కాలయముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇది సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన నోముల లింగయ్య, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తన భార్య నాగమణి(50)ని సోమవారం రాత్రి అడిగాడు. ఆమె నిరాకరించడంతో బీరువాలో ఉన్న నగదును తీసుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన లింగయ్య, పక్కనే ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోఆమె మృతిచెందింది. నాగమణిని ఆమె భర్త నోముల లింగయ్య, కోడలు నోముల అరుణ కలిసి హత్య చేశారంటూ మృతురాలి అక్క కొండ వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో మణుగూరు సీఐ మొగిలి, కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. -
భార్యతో గొడవ..ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
బొబ్బిలి: భార్యతో గొడవ పడిన భర్త ఇంటికి నిప్పంటించిన సంఘటన బొబ్బిలిలోని ఇందిరమ్మకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాలనీలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సురేష్, తన భార్య స్వాతితో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఇంటితో పాటు సామాన్లు కాలిబూడిదయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఇంటిలోని సామన్లు కాలిపోవడంతో బాధితురాలు స్వాతి లబోదిబోమంటోంది. -
డీసీపీ బాబురావుపై డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నగర కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీగా పనిచేస్తున్న బాబురావుపై అతడి మొదటి భార్య వేదశ్రీ డీజీపీ మహేందర్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేసింది. తనతో 25ఏళ్ల పాటు కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయిన బాబురావు విడాకులివ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తమకు తెలియకుండానే మతం మార్చుకున్నాడని, చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ.5 లక్షలు తీసుకుని విడాకులకు ఒప్పుకోవాలని వేధిస్తున్నాడని తెలిపింది. విజయవాడలో తనకు సంబంధించిన రూ.కోటి విలువ చేసే భూమిని, తానే వేదశ్రీ అని చెప్పుకుని బాబురావు రెండో భార్య అమ్మకుందని ఆరోపించింది. బాబురావు వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.