Industries Department
-
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయంలో గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా కూడా.. ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినపుడు చాలా మంది సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎంగా నేను దావోస్‌లో రెండుసార్లు పర్యటించి భారీ పెట్టుబడులు సాధించా.. తొలి ఏడాది రూ.41వేల కోట్లు, రెండో సారి రూ.1.78లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకాలు జరిగాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీనితో హైదరాబాద్ రైజింగ్ ఇకపై ఆగదని ప్రపంచం మొత్తం నమ్ముతోందని చెప్పారు. సీఎం గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ‘హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెలివరీ సెంటర్’ను ప్రారంభించి మాట్లాడారు. పెద్ద కల అవుతుందన్నారు... ‘‘మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు కొంతమంది అది పెద్ద కల అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాం. రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మాన్యుఫాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తున్నాం. కేవలం ఏడాదిలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. ఉద్యోగ కల్పనలో నంబర్ వన్‌గా నిలిచాం..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇక్కడ దగ్గర అత్యధిక కృత్రిమ మేధ వినియోగం, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయన్నారు. 60 దేశాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్ టెక్ 2007లో భారత్‌లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగిందని చెప్పారు. హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. గ్లోబల్ వ్యాల్యూ సెంటర్లుగా జీసీసీలు: శ్రీధర్‌బాబు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా జీసీసీలను గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. ‘‘ఏఐ, మెషీన్ లెరి్నంగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీలలో తెలంగాణను హబ్‌గా మార్చి పెట్టుబడులను ఆకర్షిస్తాం. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. నైపుణ్య శిక్షణ కోసం నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం వహించాలి. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ సి.విజయ్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: పల్లెల్లో ఇథనాల్ చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది. పెట్రోల్‌లో కలిపేందుకు అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలే మొలాసిస్, ధాన్యం నుంచి అవి ఇథనాల్‌ను తయారు చేస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం నారాయణపేట జిల్లా చిత్తనూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో.. పనులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్య రహితంగా (జీరో లిక్విడ్ డిశ్చార్జి) ఏర్పాటు కావాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు వాయు, జల కాలుష్యానికి కారణమై తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చిత్తనూరు, దిలావర్పూర్ ప్రాంత వాసులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో 28 సంస్థలకు గ్రీన్ సిగ్నల్ విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి ఏటా 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించింది. ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’ కింద వడ్డీ రేటులో 4 శాతం నుంచి 50శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు 31 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2018 నుంచి 2022 మధ్యకాలంలో 28 సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా రోజుకు 5,256 కిలోలీటర్ల (కేఎల్‌పీడీ) ఇథనాల్ తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిలో నారాయణపేట జిల్లా చిత్తనూరులో వీటిలో ప్రస్తుతం 400 కేఎల్‌పీడీ సామర్థ్యమున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్ ఒక్కటే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో మరో ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే కేంద్రం నుంచి ఆమోదం పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెప్తున్నారు. అనుమతులపై అధికారుల మౌనం నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ కింద ఇథనాల్ తయారీ యూనిట్లకు ఇచ్చిన అనుమతులతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఐడీఆర్ యాక్ట్) కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్లిపోయిందని... దీంతో అందులో అంతర్భాగమైన ఇథనాల్ తయారీపై తమకు సమాచారం లేదని అంటున్నాయి. నిజానికి ఐడీఆర్ యాక్ట్ కేంద్ర జాబితాలోకి వెళ్లడాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఆమోదించగా.. తెలంగాణ, ఏపీ మాత్రం దూరంగా ఉన్నాయి. మరోవైపు ఇథనాల్ తయారీని ఉమ్మడి కోటాలో చేర్చి పర్యవేక్షక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సుప్రీంకోర్టు పది రోజుల క్రితమే ఆదేశించింది. కానీ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇథనాల్ యూనిట్లకు నిర్మాణ అనుమతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని... లైసెన్సు, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో రాష్ట్రానికి సంబంధం లేదని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో టీజీఐపాస్ కింద ఎన్ని సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటనే సమాచారం తమ వద్ద లేదనే పేర్కొంటున్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 1,213 సంస్థలకు 1,37,342 కేఎల్‌పీడీ సామర్థ్యం కలిగిన ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందులో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయి. అవగాహన లేకనే వ్యతిరేకత అంటున్న పరిశ్రమలు ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తున్నట్టు పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. ఇథనాల్ తయారీ యూనిట్లను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు, స్థానికులు ఇటీవల హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుపై ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అనుమతులను తిరిగి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అనుమతులిచ్చింది నాటి సర్కారేగత సర్కారు దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు అంటోంది. కేంద్రం కోరిన ఇథనాల్ ఫ్యూయల్ తయారీకి బదులుగా.. ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కాహాల్ వంటి ఇతర ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం 2022లో అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసీ, పర్యావరణ అనుమతులు, ఇతర ఉత్పత్తులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ అంశాల్లో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. -
కాసులిస్తేనే నచ్చిన చోటు
రాష్ట్రంలో అధికారికంగా బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసినప్పటికీ పరిశ్రమల శాఖలో కీలక పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. పైసలు ఇస్తేనే బదిలీ ఆర్డర్లు ఇస్తామంటూ కీలకస్థాయి అధికారి బేరం పెట్టడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. జనరల్ మేనేజర్ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల బదిలీల వరకు ఎన్నడూ లేనివిధంగా గడువు ముగిసినా ఆర్డర్లు జారీ చేయకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించిన వారికి నచ్చిన చోటకు బదిలీ చేస్తూ పాత తేదీ (బ్యాక్ డేట్)తో ఉత్తర్వులు ఇస్తామంటూ ఉద్యోగులతో నేరుగా బేరాలు సాగిస్తుండటంతో జిల్లాస్థాయి అధికారులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఎప్పటినుంచో బదిలీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆర్డరు కాపీని తొక్కిపెట్టారంటూ ఒక ఉద్యోగి వాపోయారు. ఈ విధంగా పైస్థాయి అధికారి నేరుగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్లు చేసి అడగడం ఇప్పటివరకు ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి నేరుగా ఆయనే ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. సాక్షి, అమరావతిగృహ నిర్మాణ శాఖలో కాసుల పంట గృహ నిర్మాణ శాఖలో సాధారణ బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండించాయి. సీనియారిటీ, స్పౌజ్ వంటి నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ సిఫార్సులు, వసూళ్లకు పెద్దపీట వేశారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తన ఓఎస్డీ ద్వారా కీలక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపారు. ఓఎస్డీ నేరుగా డీఈ, ఈఈ, ఎస్ఈలకు ఫోన్లు చేసి వసూళ్ల వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆపైన ముట్టచెప్పిన వారికే కోరిన స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు, డబ్బు ఇవ్వని వారికి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టింగ్ కావాల్సిన చోట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు తీసుకోవడం కోసం అక్కడ కూడా రూ.లక్షల్లోనే ఉద్యోగులు ముట్టజెప్పారు. రాజకీయ సిఫార్సులు, డబ్బు చెల్లించిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడం కోసం ఏడాది, రెండేళ్ల క్రితం నియమించిన వారిని వేరే చోటకు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆదివారంలోగా బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే, సిఫార్సులు, వసూళ్ల ఆధారంగా కోరుకున్న చోట ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో సోమవారానికి తుది జాబితా గృహ నిర్మాణ శాఖకు అందినట్టు తెలిసింది. పోరుబాటలో ఇంధన శాఖ ఉద్యోగులు! విద్యుత్ సంస్థల్లో బదిలీలకు ముందే సిఫారసు లేఖలు ఇచ్చిన వైనం బయట పడటంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు కనీస అర్హత ఉన్నవారికే సిఫారసులను అన్వయించేలా తీవ్రంగా కసరత్తు చేశారు. అయినప్పటికీ.. తాము అనుకున్న విధంగానే బదిలీలు జరగాలని, తమ సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి నేతలు పట్టుబట్టారు. ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ వారిని ప్రతిపాదించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో 22వ తేదీకే పూర్తవ్వాల్సిన బదిలీలు 23న కూడా కొనసాగాయి. డిస్కంలలో జూనియర్ లైన్మెన్ స్థాయి నుంచి డిప్యూటీ ఇంజనీర్ స్థాయి వరకూ వందల మందిని బదిలీ చేశారు.రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. బీసీ, ఓసీ సంఘాల నేతలకు బదిలీ నుంచి మినహాయింపు (ప్రొటెక్షన్) ఇవ్వలేదు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రెండు సంఘాల ఉద్యోగులు సోమవారం ప్రకటించారు. -
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న విధానాల కంటే మెరుగైన విధానాలను అమలు చేయాలని యోచిస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన టీజీ ఐపాస్ (గతంలో టీఎస్ ఐపాస్) చట్టంలో సమూల మార్పులు చేస్తూ కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. రెండు పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సర్కార్ నూతన పాలసీలో ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం టీజీ ఐపాస్‌ను అమలు చేసింది. మరోవైపు పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేసింది. టీ ఐడియా (జనరల్ కేటగిరీ), టీ ప్రైడ్ (ఎస్సీ, ఎస్టీ) స్కీమ్‌ల కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ, సేల్స్ టాక్స్ తదితరాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని, నూతన పారిశ్రామిక విధానంలో తాము వీటికి పెద్దపీట వేస్తామన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. పేరుకు పోయిన బకాయిలు కొత్త ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.3,736.67 కోట్లు. వీటిలో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఇచి్చన రూ.684 కోట్ల విలువైన చెక్కులు చెల్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు చెల్లించేలా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇక సులభంగా ఎంఎస్ఎంఈ వివాదాల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈల వివాదాల పరిష్కారానికి కొత్తగా నాలుగు చోట్ల ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాత్రమే ఉండటంతో వివాదాల పరిష్కారానికి ఇంత దూరం రావడానికి ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ప్రాంతీయ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. కన్సిలేషన్స్ (ఇరు పార్టీలను కూర్చొపెట్టి మాట్లాడి పరిష్కరించడం) స్థాయి వివాదాలను ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేలా, ఆర్బిట్రేషన్ స్థాయి వివాదాలను రాష్ట్రస్థాయి కౌన్సిల్లో పరిష్కరించేలా చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) సూచించిన ప్రతినిధి, ఏపీఎస్ఎఫ్సీ జిల్లా బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసీ సూచించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ కౌన్సిల్‌కు ఉంటాయి. ప్రభుత్వ అండతో వేగంగా పరిష్కారం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. మరోపక్క ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల బకాయిలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. బకాయిల కోసం కౌన్సిల్‌ను సంప్రదించే పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. ఈ సంఖ్య పెరుగుతుండటంతో వివాదాలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పరిధి, విధివిధానాలను నిర్దేశించింది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎస్ఎంఈ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ కౌన్సిళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ.. విశాఖపట్నం ప్రాంతీయ కౌన్సిల్: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలు విజయవాడ కౌన్సిల్: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తిరుపతి కౌన్సిల్ : ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు కర్నూలు కౌన్సిల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్‌ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్‌లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో ‘ఎంఎస్ఎంఈ’ల రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి. 2023–24లో ఎంఎస్ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ పోర్టల్ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండు రెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. 2022–23లో ఎంఎస్ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని దాటేసిన తొమ్మిది జిల్లాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్‌లో కనీసం 1.50 లక్షల ఎంఎస్ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశి్చమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. -
జీఐఎస్ ఒప్పందాల్లో మరో 36 కార్యరూపంలోకి తేవాలి
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు (జీఐఎస్)లో పరిశ్రమల శాఖకు చేసుకొన్న అవగాహన ఒప్పందాల్లో మరో 36 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలని, వాటికి డిసెంబరు నెలాఖరులోగా శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. జీఐఎస్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి రూ. 3.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 2.38 లక్షల మందికి ఉపాధి కల్పించే 107 ఒప్పందాలు జరగ్గా, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాలన్నీ త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగంగా ఏర్పాటవ్వాలని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను ఆదేశించారు. వీటిపై నెలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. అంతకు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల ఏర్పాటుపై ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయండి పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై కూడా పరిశ్రమలు, ఏపీఐఐసీ తదితర విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను వేగవంతం చేయాలని, గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపేట, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ పవర్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య రంగానికి దిక్సూచి.. మెడ్‌టెక్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్.. వైద్య ఉపకరణాల తయారీలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు, సంస్థలకు కూడా కేరాఫ్‌గా మారింది. వైద్య రంగానికే దిక్సూచిలా మారుతోంది. కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ని తయారు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న మెడ్ టెక్ జోన్ అదే జోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ఇటీవల ఇక్కడ ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ కూడా ప్రారంభమైంది. ఇలాంటి విప్లవాత్మక సంస్థలు ఎన్నో ఈ జోన్లో చోటు కోసం క్యూ కడుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో.. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన కిట్లు, ఉపకరణాలను మెడ్‌టెక్ జోన్ అందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోల్బియో డయాగ్నోస్టిక్స్ కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది. ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను అందించింది. ప్రతి రోజూ 100 వెంటిలేటర్లు, 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసేది. దీంతో ప్రపంచం దృష్టి మెడ్‌టెక్ జోన్‌పై పడింది. పరిశోధనలు, ఆవిష్కరణలు: ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100 సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు, ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ జోన్ ముందు వరసలో నిలుస్తోంది. ఎమ్మారై పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాల్ని తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఇటీవలే తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 టెస్లా ఎమ్మారై కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ మాత్రం మరింత శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేస్తున్నారు. ఎమ్మారైని తయారు చేసే సంస్థకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుండటం విశేషం. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు టెలీ రేడియాలజీ సొల్యూషన్స్ (టీఆర్ఎస్) కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 70 శాతానికిపైగా గ్రామీణ ప్రాంత ప్రజలు రేడియాలజీ సేవల కోసం పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) మార్గదర్శకాల మేరకు మెడ్ టెక్‌లో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్‌ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక రేడియేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. వైద్యం, వ్యవసాయం, సీ ఫుడ్‌లో నాణ్యమైన ఎగుమతులకు గామా రేడియేషన్ సేవల కేంద్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం కోబాల్ట్–60ని ఉపయోగించనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు. దిగుమతుల నుంచి ఎగుమతులకు.. గతంలో భారత్.. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది. ఎప్పుడైతే.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరందుకుందో.. ఈ పరిస్థితి మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కోట్లాది రూపాయల విలువైన అత్యాధునిక యంత్రాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఎమ్మారై యంత్రాలను దిగుమతి చేసుకోవాలంటే రూ.4.5 కోట్లు ఖర్చవుతుంది. మెడ్‌టెక్‌లో కేవలం రూ.98 లక్షలకే వీటిని తయారు చేస్తున్నారు. దీనివల్ల అత్యాధునిక ఎమ్మారై స్కానర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక్కో యంత్రానికి దాదాపు రూ.3.5 కోట్లు ఆదా అవుతుంది. తద్వారా ఎంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మరిన్ని ఆస్పత్రులు ఎమ్మారై యంత్రాలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కలిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా.. హెల్త్ క్లౌడ్ వైద్య పరికరాల పరిశ్రమల అవసరాల్ని తీర్చేందుకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్‌టెక్ జోన్ మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్‌తో కలిసి కొద్ది నెలల క్రితం ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించి హెల్త్ క్లౌడ్ని రూపొందించింది. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అలయన్స్, రేడియాలజీ ఇమేజింగ్ సర్వీసులు, హెల్త్ డిజిటల్ డేటా.. ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానించేలా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు హెల్త్ కేర్ సౌకర్యాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ హెల్త్ క్లౌడ్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందనున్నాయి. ఎంఎస్ఎంఈతో ఒప్పందం ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్ఎంఈతోనూ మెడ్‌టెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలోని ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయుక్తం కానుంది. ఇలా.. విభిన్న రీతుల్లో విప్లవాత్మకమైన వైద్య పరికరాల్ని ప్రపంచానికి అందించేలా.. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్‌టెక్ జోన్ కృషి చేస్తోంది. -
ఫార్మాసిటీ మృతులకు.. రూ.25 లక్షలు చొప్పున పరిహారం
మధురవాడ (భీమిలి)/పరవాడ (పెందుర్తి)/మహారాణిపేట : అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేశామని, సేఫ్టీ ఆడిట్స్ చేయాలని ఆదేశించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 80–90 వరకు ప్రమాదకర పరిశ్రమలున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో భద్రతాపరమెన ఆడిట్స్ చేయాలని ఆదేశించినట్లు అమర్నాథ్ చెప్పారు. పరవాడ ఫార్మాలో ప్రమాద ఘటన ఎందువల్ల జరిగింది? అందులో ఎవరి తప్పిదం ఉందో సమగ్రంగా విచారణ జరిపించాలని అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం ఇక ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్‌బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడ్ల సతీష్ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం మరోవైపు.. దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. -
పెట్టుబడుల్లో ఫస్ట్.. దేశంలోనే మొదటి స్థానం
సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్కో సోలార్, ఇసుజు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్ లాంటి సంస్థలున్నాయి. సింగిల్ విండోలో అనుమతులు.. ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన! రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
దేశంలో రిటైల్ పరిశ్రమ జోరు..19 శాతం వృద్ధితో
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ పరిశ్రమ తన జొరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనాకు ముందు 2019 సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి కనిపించింది. క్యూఎస్ఆర్, పాదరక్షల విభాగాలు ఈ కాలంలో బలమైన పనితీరు నమోదు చేయడం ద్వారా వృద్ధికి మద్దుతుగా నిలిచినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఈ రెండు విభాగాల్లో అమ్మకాల వృద్ధి 30 శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు భారత్‌లో రటైల్ పరిశ్రమ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతంలో 19 శాతం వృద్ధి కనిపించగా, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. సౌందర్య, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమల్లో వృద్ధి 2019 ఇదే కాలంతో పోల్చినప్పుడు కేవలం 7 శాతం నమోదైనట్టు రాయ్ తెలిపింది. వినియోగదారులు తిరిగి స్టోర్లకు వచ్చి షాపింగ్ చేస్తున్నారని, ఆన్లైన్లో కొనుగోళ్లను సైతం వారు ఆస్వాదిస్తున్నారని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో భారత రిటైల్ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్టు రాయ్ చైర్మన్ బిజో కురియన్ తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైలర్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం పెద్ద ఎత్తున పెరిగినట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతర మార్కెట్ల కంటే భారత్‌లో రిటైల్ పరిశ్రమ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఓమ్నిచానల్ రిటైల్ (ఆఫ్‌లైన్, ఆన్లైన్) అన్నది రిటైలర్లకు సాధారణ నియమంగా మారింది’’అని కురియన్ వివరించారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) వల్ల లక్షలాది చిన్న వర్తకులు సైతం డిజిటల్ కామర్స్‌లో భాగస్వాములు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి
సాక్షి, అమరావతి: ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటాలు, బిర్లాలు, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతుంటే టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం పారిశ్రామిక ప్రగతి క్షీణించిందంటూ దుష్ప్రచారం చేయటాన్ని పరిశ్రమల శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో వీసమెత్తు నిజం లేకపోగా పారిశ్రామిక ప్రగతిలో కేంద్రం కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనపరుస్తోందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్న ఆరోపణలు అబద్ధమని, రూ.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయనడం నిరాధారమని పేర్కొంది. కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పరుగులు తీస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంఎస్ఎంఈలు రెట్టింపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన జూన్ 2019 నుంచి నేటి వరకూ రాష్ట్రానికి 107 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఎంఎస్ఎంఈలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటయ్యాయి. గత మూడున్నరేళ్లలో 1,06,249 ఎంఎస్ఎంఈలు ఏపీకి రావడం ద్వారా రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా మరో 57 మెగా పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చెందిన నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. కియా అదనపు పెట్టుబడులు.. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ తరలనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయి. కియా అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖ మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్ (ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ / బిజినెస్ పార్క్) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ రుషికొండ ఐటీ సెజ్ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదు. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు రూ.వేల కోట్ల విలువైన భూములను తీసుకుని గడువులోగా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి వెనక్కు తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్స్ పేపర్ పరిశ్రమ ఒప్పందం సాంకేతిక కారణాలతో రద్దయింది. కొత్తగా మూడు పారిశ్రామిక నగరాలు విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్, ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను కల్పించింది. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలను కల్పించింది. అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 6,740 ఎకరాలను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేసింది. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళుతోంది. రూ. 2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం పూర్తయింది. తద్వారా రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. గత సర్కారు బకాయిలూ చెల్లింపు.. పారదర్శకంగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020 – 23 తెచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం‘ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.3409 కోట్ల ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి రూ.1324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిలు (7,039 ఎంఎస్ఎంఈలకు మంజూరు) కూడా అందచేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్ చేసింది. వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్టైల్ యూనిట్లకు రూ.242.13 కోట్లు విడుదల చేసింది. కేంద్ర సగటు కంటే అధికంగా.. గత సర్కారు హయాంలో 2018–19లో పరిశ్రమల రంగం జీవీఏ వృద్ధి రేటు (స్థిరమైన ధరల వద్ద) 3.17% మాత్రమే ఉంది. 2020–21లో లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికోత్పత్తి ఆగిపోయింది. ఆ ఏడాది కేంద్రం జీవీఏ –3.33 శాతం నమోదు కాగా రాష్ట్రంలో వృద్ధి రేటు 0.33%గా నమోదైంది. 2021–22లో కేంద్ర పారిశ్రామికోత్పత్తిలో 8% శాతం వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం రెండంకెల వృద్ధి 11% సాధించింది. కోవిడ్ సంక్షోభం వచ్చినా రెండేళ్లు కేంద్ర సగటు కంటే రాష్ట్రం మెరుగైన పనితీరును కనపరచింది. ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక నగరం చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ను తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాలలో క్రిస్ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం రూ.1,448 కోట్లను వెచ్చిస్తూ టెండర్లను పిలిచింది. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించడమే కాకుండా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దావోస్ పర్యటనతో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనలో అదానీ, అరబిందో, గ్రీన్కో గ్రూప్, ఏస్ అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్, సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టŠస్ నెలకొల్పేలా రూ. 1,26,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా రాష్ట్ర యువతకు 38 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో 25 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గత మూడేళ్లలో 107 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వచ్చే మూడు నెలల్లో మరో 25 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటైన బ్లూస్టార్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు చెందిన ఎయిర్ కండీషనర్స్, దేశంలోనే తొలి లిథియం బ్యాటరీ తయారీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. రూ.6,700 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అన్‌రాక్ అల్యూమినియం, కర్నూలు జిల్లాలో రూ.2,938 కోట్లతో ఏర్పాటైన స్టీల్ పరిశ్రమ, అనకాపల్లి జిల్లాలోని రూ.2,000 కోట్లతో స్థాపించిన సెయింట్ గోబిన్, రూ.1,500 కోట్లతో నెలకొల్పిన శారద మెటల్స్ ఫెర్రో అల్లాయిస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం 25 యూనిట్ల ద్వారా రూ.16,148 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపంలోకి రానున్నాయని, వీటి ద్వారా 19,475 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటవుతున్న అసాగో బయోఇథనాల్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజ జరగనుంది. వీటితో పాటు త్వరలోనే విశాఖలో రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ సౌర విద్యుత్‌కు చెందిన ఉపకరణాల తయారీ యూనిట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడుల ప్రవాహం గత మూడేళ్లలో 107 పెద్ద యూనిట్లు ప్రారంభం కావడం ద్వారా రూ.46,002 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇదే సమయంలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా మరో రూ.91,243.13 కోట్ల విలువైన 57 ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ పూర్తయితే 1,09,307 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలోకి టాటా, బిర్లా, అదానీ, సంఘ్వీ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, యాసెంచర్ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల యూనిట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉత్తుత్తి పెట్టుబడుల ఒప్పందాలు కాకుండా వాస్తవం రూపం దాల్చేలా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
అంతర్జాతీయ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న కీలక రంగాలపై భారీ సదస్సులను నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉండటంతోపాటు ఒకేసారి 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా నవంబర్ 18న విశాఖలో మారిటైమ్ సదస్సు నిర్వహించనున్నారు. అలాగే, వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ వివరాలను తెలియచేసేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో అగ్రి ఎక్స్పోను నిర్వహించనున్నారు. డిసెంబర్లో ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ అలాగే రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి అనేక ప్రోత్సహకాలిస్తూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రాయితీలు విడుదల చేస్తుండటంతో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ను డిసెంబర్ మూడో వారంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టం చేయడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్స్, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ కాలేజీలు, తిరుపతి, చెన్నైలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధిలోని అవకాశాలను వివరించే విధంగా స్కిల్ ఆంధ్రా పేరుతో మరో కాన్క్లేవ్ను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న మారిటైమ్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ వెల్లడించారు. వీటితో పాటు హైదరాబాద్, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్‌పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం విజయవంతం అయ్యేందుకు దేశవిదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలతో పాటు తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్, దావోస్‌ల్లో రోడ్‌షోలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. దేశంలో జరిగే రోడ్‌షోల్లో మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొనిసుదీర్ఘ తీరప్రాంతంతో పాటు మూడు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధిచేస్తున్న పారిశ్రామిక పార్కులు, ప్రభుత్వ కల్పిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడి ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అందించే హ్యాండ్ హోల్డింగ్ వంటి వివరాలను తెలియజేయనున్నారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాలతోపాటు జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వేదికగా వినియోగించుకోనున్నారు. ఇక అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర అధికార బృందం వెళ్లి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్‌షోలను పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నిర్వహించనుంది. రోడ్‌షోల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను సిద్ధంచేశామని, వచ్చే మూడునెలల్లో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ఎస్. ప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా.. మరోవైపు.. కేవలం రోడ్‌షోలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలనూ ప్రచారానికి వినియోగించుకోనున్నారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటుచేసిన వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. అలాగే, పెట్టుబడుల సదస్సుకు ప్రచారం కల్పించేందుకు వివిధ రాష్ట్రాల పత్రికలు, జాతీయ ఛానల్స్‌లో కూడా ప్రచారం కల్పిస్తారు. -
కడప స్టీల్‌కు ఇనుప గనుల కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. -
పర్యావరణహిత ఇంధన వినియోగం పెరగాలి: నితిన్ గడ్కరీ
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని పెంచేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీర్లకు సూచించారు. ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల సూచనలను తెలుసుకునేందుకు ’మంథన్’ పేరుతో బెంగళూరులో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో–ఆపరేషన్, కమ్యూనికేషన్, కో–ఆర్డినేషన్‌తో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్ఫ్రా ఫోకస్’ అవార్డు
సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్నాథ్ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. సముద్ర వాణిజ్యంపై దృష్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్: మంత్రి అమర్నాథ్ 974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
భారీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడిదారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణపై సోమవారం సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు. ఈ రంగాలే కీలకం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగావాట్లకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 12 వేల మెగావాట్లకు ఈ సదస్సులో పెట్టుబడులు తేవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు సూచించారు. ఫార్మా పరిశ్రమలకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6 వేల ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబుకు సూచించారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను ఆహ్వానించాలని ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తొలుత సీఐఐ ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సదస్సు ప్రయోజనాలు, లక్ష్యాలు, ఫలితాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐటీ కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత పాల్గొన్నారు. -
Andhra Pradesh: పెట్టుబడుల ప్రవాహం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాలనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వీటి ద్వారా రూ.20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానాసోనిక్ లైఫ్ సైన్స్సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా 2021లో రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ.40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో చేయూత పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇదే విషయాన్ని పలు కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రకటించడమే కాకుండా రెండో దశ విస్తరణ పనులకు కూడా శ్రీకారం చుట్టడం తెలిసిందే. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం సింగిల్ డెస్క్ విధానంలో వేగంగా మంజూరయ్యాయని తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిచినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామని, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సులభతర వాణిజ్యంలో మూడో ఏడాదీ మొదటి స్థానం గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ.5856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ డెస్క్ విధానంలో అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాదీ ఏపీ మొదటి స్థానంలో నిలబడటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఎంఎస్ఎంఈలతో కలిపి 28,343 యూనిట్లు ప్రారంభం భారీగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవి కాకుండా సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి. -
ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. 2020–21లో రూ.1,24,744.46 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల విలువ 2021–22 నాటికి 15.31 శాతం పెరిగి రూ.1,43,843.19 కోట్లకు చేరుకుంది. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా.. అందుకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తోంది. పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్(ఎగుమతులు) జీఎస్ రావు మాట్లాడుతూ.. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఎగుమతులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆక్వా, ఫార్మా, రసాయనాలు, బియ్యం, ఉక్కు తదితర రంగాల్లో ఎగుమతుల వృద్ధికి మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా ఎగుమతుల వృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎగుమతికి అవకాశమున్న ఉత్పత్తులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీనిపై అధికారులు ఉత్పత్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. దీని తర్వాత తుది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి.. వాటికి బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. ఎగుమతుల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమల శాఖ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఒక్క క్లిక్‌తో సమాచారమంతా..
మీరు ఏదైనా పారిశ్రామిక పార్కులో యూనిట్ ఏర్పాటుకోసం స్థలం ఎక్కడ ఉంది? ఎంత విస్తీర్ణం ఉంది? సరిహద్దులు ఏంటి? ప్రధాన రోడ్డుకు ఎంత దూరంలో ఉంది? ఇటువంటి వివరాల కోసం నేరుగా పారిశ్రామిక పార్కుకు వెళ్లాల్సిన అవసరంలేదు.. మొబైల్లో సింగిల్ క్లిక్ చేస్తే చాలు!! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు సమస్త సమాచారాన్ని మొబైల్ యాప్ రూపంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) పోర్టల్ ఆధారిత మొబైల్ యాప్‌ను తయారుచేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిస్థితిని మొబైల్ యాప్‌లో పక్కాగా చూపించేందుకు డ్రోన్ సహాయంతో కూడా సర్వేచేసి.. ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెన్సీని ఎంపికచేసే పనిలో ఏపీఐఐసీ పడింది. మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఇంటి నుంచే పారిశ్రామిక పార్కుల్లో ఎక్కడెక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి? వాటి ధర ఎంత అనే వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. పరిశ్రమల అనుమతుల కోసం ఇప్పటికే సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింత సులభంగా వారికి సమాచారం చేరవేసేందుకు ఈ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ అవకాశంలేదు వాస్తవానికి ఏపీఐఐసీకి చెందిన సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో లభిస్తోంది. పారిశ్రామిక పార్కుల వారీగా ఖాళీ ప్లాట్ల వివరాలు లభించడంతో పాటు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, పక్కాగా ఆ ప్లాటును నేరుగా ఆన్లైన్లోనే చూసేందుకు మాత్రం అవకాశంలేదు. దానిని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాల్సిందే. ఆ ఖాళీ ప్లాటు విస్తీర్ణం ఎంత? ధర ఎంత అనే వివరాలు ఉంటున్నాయి. అయితే, నిర్దిష్టంగా సరిహద్దులు ఏమిటనే వివరాలు అందుబాటులోలేవు. అయితే, కొత్తగా తయారుచేయనున్న యాప్‌లో మాత్రం సమస్త సమాచారం.. కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఏపీఐఐసీ సమాయత్తమవుతోంది. యాప్‌తో ఇవీ ఉపయోగాలు.. ఏపీఐఐసీ తయారుచేస్తున్న మొబైల్ యాప్ ద్వారా సింగిల్ క్లిక్‌లో సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. అవి ఏమిటంటే... ► పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలు. ► ఆయా ప్లాట్ల సరిహద్దులు, విస్తీర్ణం, ధర వగైరా అన్ని అంశాలు. ► సదరు ప్లాటుకు రోడ్డు, రైల్వే మార్గం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. ► ఖాళీ ప్లాటును కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ► భవిష్యత్తులో ప్లాటు కొనుగోలు ధరను కూడా ఆన్లైన్లో చెల్లించే ఆప్షన్ వచ్చే అవకాశముందని సమాచారం. అన్ని వివరాలు ఒకే యాప్‌లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పారిశ్రామిక పార్కులు ఉన్నాయనే వివరాలతో పాటు వాటి వాస్తవ భౌగోళిక స్థితిని తెలుసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుంది. పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మొబైల్ యాప్ తయారుచేస్తున్నాం ఇప్పటికే ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన సమాచారం వెబ్ ఆధారిత పోర్టల్‌లో లభిస్తోంది. కానీ, ఒక యాప్ రూపంలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందులో పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఖాళీలు.. వాటి ధరల వివరాలతో పాటు దగ్గరలోని రైల్వేస్టేషన్, రోడ్డు మార్గం వివరాలన్నీ లభిస్తాయి. వాటి ఫొటోలు, సరిహద్దులు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. – సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ -
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) మధ్య పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ నగరంలో ‘వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’ శనివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన, గుడివాడ హాజరుకాగా.. పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్, అంతర్జాతీయ విద్య, కల్చరల్ మంత్రి డేవిడ్ టెంపుల్మేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీని సిస్టర్ స్టేట్‌గా గుర్తించడంతోపాటు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం.. పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సహకారం, నైపుణ్యం అందించే అంశాలపై ఇరు ప్రాంతాల ప్రతినిధులు చర్చించారు. ముందుగా.. పరిశ్రమలు, అంతర్జాతీయ విద్య, గనులు మొదలైన అంశాలపై వేర్వేరుగా సెషన్లు నిర్వహించారు. ఏపీ, ఆస్ట్రేలియాలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం జరిగిన వ్యూహాత్మక సదస్సులో పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన, గుడివాడతోపాటు ఆస్ట్రేలియా ప్రతినిధి రోజర్ కుక్ మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి దిశగా ఏపీ.. బుగ్గన ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ జరిగితే.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మల్టీనేషనల్ ఏజెన్సీల సహకారంతో అడుగులు వేస్తున్నాం. అంతర్జాతీయ విద్య విషయంలోనూ రాష్ట్రం పురోగమించింది. గడిచిన మూడేళ్ల నుంచి రాష్ట్ర జీడీపీ రేటు వృద్ధి చెందుతోంది. వాణిజ్య రంగంలో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఆధునీకరించుకుంటూ అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా వివిధ కీలక రంగాల్లో సాంకేతికతని అందిపుచ్చుకుంటున్నాం. ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదు. దేశంలోకంటే ఎక్కువమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇక్కడ ఉన్నారు. వొకేషనల్ ట్రైనింగ్ అందితే విద్యార్థులు మరింత నైపుణ్యవంతులవుతారు. ఈ దిశగా పశ్చిమ ఆస్ట్రేలియా ఆలోచన చేయాలి. అదేవిధంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి. ఏపీ–ఆసీస్ బంధంతో మార్కెట్ వృద్ధి.. మంత్రి గుడివాడ ఏమన్నారంటే.. వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ద్వారా భారత్–పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఇదే గొప్ప అడుగు. రాబోయే ఇరవై ఏళ్లలో ఇరు ప్రాంతాల మధ్య మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాల్లో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య కార్యకలాపాల వృద్ధి 69.08 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లని ఏర్పాటుచేస్తున్నాం. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. కార్గో హ్యాండ్లింగ్లోనూ ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఐటీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి. భూములూ సిద్ధంగా ఉన్నాయి. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఐటీ పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాం. కలిసి పనిచేసి చరిత్ర సృష్టిద్దాం : రోజర్కుక్ సోదర రాష్ట్రంతో కలిసి పనిచేసి చరిత్ర సృష్టించేందుకు, సరికొత్త ఆలోచనల్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ సదస్సుతో రెండు ప్రభుత్వాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగానికి ఏపీ నిలయంగా ఉంది. పాడి, మత్స్య సంపద, ఆక్వాకల్చర్ రంగాల్లో ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ విద్య, పరిశోధనల్లో అవకాశాలను అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలతో ఇరు దేశాలు అనేక రంగాలలో అవకాశాలను పెంపొందించుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌తో సుసంపన్నమైన భవిష్యత్తును పశ్చిమ ఆస్ట్రేలియా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ, డబ్ల్యూఏ మధ్య ఎనిమిది ఒప్పందాలు.. ఏపీలో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఎనిమిది అంశాలపై రోజర్ కుక్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం.. ఏపీ మంత్రుల సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఒప్పందాల వివరాలివీ.. ► అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఏఐసీఎస్) డైరెక్టర్ పర్సెస్ ష్రాఫ్‌తో ఒప్పందం. ► విద్యుత్‌కు సంబంధించిన సవాళ్లను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు కోసం ‘ఫ్యూచర్ బ్యాటరీ’తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. ► ఏరో స్పేస్ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం కోసం ‘స్పేస్ ఏంజిల్’ సంస్థతో ఏపీఈడీబీ ఎంఓయూ. ► విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘విలేజ్ ఎనర్జీ’ సంస్థ సీఈఓ వేన్ లూబిస్ కాస్తో ఎంఓయూ. ► నైపుణ్యం, వొకేషనల్ ట్రైనింగ్‌కి సంబంధించిన సహకారం కోసం ‘ఫినిక్స్ అకాడమీ’తో ఒప్పందం. ► పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్ రంగానికి సంబంధించిన ‘ఆస్ట్రేలియన్ ఎనర్జీ స్టోరేజ్’ కంపెనీతో అవగాహన. ► వైద్య పరికరాల తయారీ సంస్థ ‘హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్’తో అత్యాధునిక పరికరాల తయారీకి ఎంఓయూ. ► ‘హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్’ అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. పలు కీలక అంశాల్లో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం. ► మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పనిచేయడానికి వీలుగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ‘ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ’ (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్ మైకేల్ కార్టర్‌తో ఏపీఈడీబీ ఒప్పందం. ఇక ఈ సదస్సులో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జేఎండీ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బాలయ్య, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్‌బాబు, ఆంధ్రప్రదేశ్ సీఐఐ చైర్మన్ నీరజ్ శారద, ఇండియ గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్–ట్రేడ్ కమిషనర్ నషిద్ చౌదరి, ఏపీ ఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం ఏపీ
సాక్షి, అమరావతి: మూడు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీసీ) అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశం గురువారం ఢిల్లీ వేదికగా జరిగింది. డీపీఐఐటీ, నిక్‌డిక్ట్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎన్ఐసీడీసీ ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏపీ పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ), విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌బీఐసీ)లలోని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్, కొప్పర్తి, శ్రీకాళహస్తి – ఏర్పేడు, ఓర్వకల్ నోడ్లలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిక్‌డిక్ట్ నిధుల ద్వారా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతాయన్నారు. ఇవి పూర్తయితే 2040 కల్లా ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, 5.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో నక్కపల్లి క్లస్టర్, గుట్టపాడు క్లస్టర్లను కూడా పారిశ్రామికంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు కారిడార్లకు ప్రణాళికాబద్ధంగా నిధులను సమీకరించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. భూ సమీకరణ, ప్రాజెక్టుపై పూర్తి నివేదిక తయారు చేయడం, నీరు, విద్యుత్ సరఫరా, టెండర్లు సహా కీలకమైన పనులను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిక్‌డిక్ట్ (ఎన్ఐసీడీఐటీ) నిధులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో కారిడార్ల అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని మంత్రి కోరారు. ఈ సమావేశంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ బేరీ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం నుంచి మంత్రితోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతిలో తెలంగాణ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు సాగుతూ తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబడే స్థాయికి చేరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర పురోగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోపాటు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు ఆశించిన గౌరవం లభించడం లేదని, కానీ తెలంగాణలో పారిశ్రామికవేత్తలను సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా గుర్తిస్తున్నామని అన్నారు. ఒక్కటీ లాకౌట్ పడలేదు.. అందరి అంచనాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉండగా, ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందన్నారు. పరిశ్రమల శాఖలో ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు రాష్ట్రంలో రిపీట్ పెట్టుబడులు 24 శాతం ఉండటమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం రికార్డుస్థాయిలో కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 184 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు అభివద్ధి చెందనున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినందున త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తోపాటు ఎఫ్‌టీసీసీఐకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాకతీయ వైభవ సప్తాహంపై సమీక్ష కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల్లో అన్ని పార్టీలు, అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి వారంపాటు జరిగే ఈ కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్షించారు. -
ఎంఎస్ఎంఈలతో భారీ ఉపాధి
రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం. అదే చేస్తున్నాం. మనం చేసే పనుల్లో నిజాయితీ ఉంది కాబట్టే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ, ఇథనాల్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త పారిశ్రామిక విధానాలు రూపొందించాలని కోరారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పరిశ్రమలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందువల్లే పారిశ్రామిక వేత్తలు చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో నీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తద్వారా వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై కారిడార్‌లో నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు అత్యుత్తమ సేవలు ► రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకని ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు వారికి సకాలంలో అందేలా చూడాలి. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. ► గత ప్రభుత్వం పెట్టిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్లస్టర్ పద్ధతిలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి. ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అత్యుత్తమ సేవలు అందాలి. కాలుష్య నివారణకు ఊతమివ్వాలి ► పరిశ్రమల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పారిశ్రామిక వాడల్లో పనిచేసే వారంతా మన కార్మికులే. వారి ఆరోగ్యాలను, పరిసరాలను, పరసరాల్లో నివాసం ఉండే వారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ► ఇందుకోసం పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. అవి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేదా? అన్నది చూడాలి. అవసరమైతే పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలి. ► ఎంఎస్ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కాలుష్య నివారణలో ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. అప్పుడే పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతాం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో భారీగా ఉపాధి ► గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభించనుంది. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు 66 వేల ఎకరాలకుపైగా భూమిని వినియోగించాల్సి ఉంటుంది. ► అర హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా, ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న వారు 70 శాతం ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుంది. ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ఏటా ఎకరాకు దాదాపు రూ.30 వేలు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నాం. ► రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేల మందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పంప్డ్ స్టోరేజ్ పవర్‌కు వ్యాల్యూ అడిషన్ చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టిపెట్టాం. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తాం. పర్యావరణానికి కూడా మంచిది. దీనికి సంబంధించిన పాలసీ తయారు చేయాలి. ► రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారు. బియ్యాన్ని వాడుకుని ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలి. ఆయిల్ ఫాం ప్రాసెసింగ్ యూనిట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనిపై మంచి విధానాలు తీసుకురావాలి. ► ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ మూడేళ్ల ప్రగతి -
ఎంఎస్ఎంఈ లపై ప్రత్యేక దృష్టి సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై స్పెషల్ ఫోకస్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. అలాగే, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. కాగా, దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్ఎఈలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చిందని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే ఒరవడి కొనసాగాలన్న సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ ఏటా.. క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణ.. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలి. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో పంప్డ్ స్టోరేజీ పవర్ ద్వారా వాల్యూ అడిషన్ చేస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. దీనివల్ల గ్రీన్ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: (AP: భూమన నేతృత్వంలో పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ) -
పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే రంగాల వారీగా రౌండ్ టేబుల్ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గురువారం ఏపీఐఐసీలోని మంత్రి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు, వాటి తదనంతరం శాఖాపరమైన కొనసాగింపు చర్యలపై మంత్రి అమర్నాథ్ దిశానిర్దేశం చేశారు. ప్రధాన పారిశ్రామికవేత్తలు, సంఘాలతో రంగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా వాస్తవరూపం దాల్చడానికి జిల్లాకొక పరిశ్రమల సంబంధాల అధికారిని నియమించాలని చెప్పారు. దావోస్‌లో కలిసిన ప్రతినిధులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆహ్వానిస్తూ పది రోజుల్లోగా లేఖలను రాయాలని ఈడీబీ అధికారులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన వారితో సంప్రదింపులు జరపాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. అదే విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40, అంతర్జాతీయంగా 10 రోడ్‌షోలను నిర్వహించే విధంగా తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు ఏవీ పటేల్, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా దేవి, వీఆర్ నాయక్, ఈడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నైపుణ్యం ఉన్నోళ్లకు 21 వేల ఉద్యోగాలు సిద్ధం
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మీ చేతుల్లో ఉంటే తక్షణం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ ఏడాదికి ఏయే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరుల్ని అందించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘స్కిల్ హబ్స్’ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛంద శిక్షణకు ముందుకొచ్చిన 68 కంపెనీలు కాగా, రాష్ట్రంలో 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చినట్లు నాయక్ తెలిపారు. మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ), నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ, ఐటీ ఈ–సీ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
‘కొప్పర్తి’లో కేంద్ర బృందం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్–జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రతినిధులు హెచ్‌కే నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందుకాంత్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఏపీఐఐసీ అధికారుల బృందం శనివారం పర్యటించింది. ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు గల అనుకూలతలు మౌలిక వసతులను కేంద్ర బృందం పరిశీలించింది. పార్క్ అభివృద్ధికి అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలను సైతం వీక్షించింది. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి, టెక్స్టైల్స్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కేంద ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. పక్కనే విమానాశ్రయం ఉండటం.. కడప, తిరుపతి, బెంగళూరు విమానాశ్రయాలు సమీపంలోనే ఉండటం.. కృష్ణపట్నం, చెన్నై పోర్టులు సైతం అందుబాటులో ఉండటంతో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు మరింత అనుకూలమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. కృష్ణాపురం నుంచి కొప్పర్తి వరకు రైల్వేలైన్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు. ఇక్కడి నుంచి ఎగుమతుల కోసం ఏవియేషన్ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని సూచించారు. 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 1,186 ఎకరాల్లో ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద కొప్పర్తిలో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.1,100 కోట్లతో కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం మిత్ర కింద కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ విభాగం నుంచి పార్క్ అభివృద్ధికి 30 శాతం ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో జిల్లా పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి పేర్కొన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల 10 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. -
కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి: ఏపీలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐహెచ్)లో 1,186 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 2,698 టెక్స్టైల్ యూనిట్లు పీఎం మిత్ర పథకంపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కరికాల వలవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్‌లో పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలతో పాటు టెక్స్టైల్ అప్పెరెల్ పాలసీ కింద మరిన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగానికి కీలకమైన పత్తిని ఏటా 2.2 మిలియన్ బేళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని.. అంతేకాక, సిల్క్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్ క్లస్టర్లు ఉన్నాయని.. విశాఖలోని బ్రాండిక్స్ అప్పెరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, గుంటూరులోని టెక్స్టైల్ పార్క్, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అప్పెరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్టైల్ పార్క్, ఎంఎఎస్ ఫ్యాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ వంటి భారీ టెక్స్టైల్ పరిశ్రమలతో కలిపి మొత్తం 2,698 యూనిట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా రూ.4,957 కోట్ల పెట్టుబడితో 1,31,426 మందికి ఉపాధి లభిస్తోందని.. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పీఎం మిత్ర కింద రాష్ట్రంలో భారీ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కరికాల్ వలవన్ కోరారు. టెక్స్టైల్ పార్క్‌కు కొప్పర్తి అనుకూలం ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని ఏపీఐఐసీ వీసీ, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కొప్పర్తికి సమీపంలో కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీ లలితా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, శ్రీ గోవిందరాజ్ టెక్స్టైల్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వంటి పరిశ్రమలతోపాటు 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులతోపాటు, కడప, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులు సమీపంలో ఇది ఉండటం ఎగుమతులకు కలసొచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొప్పర్తిలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. పరిశీలన కోసం త్వరలో రాష్ట్రానికి అధికారుల బృందం రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక పార్క్‌తో లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్క్‌లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.4,445 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఒక పీఎం మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఏడు పార్కుల కోసం మొత్తం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. -
పరిశ్రమలకు విద్యుత్ సడలింపులు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ వినియోగ పరిమితులను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం సడలించింది. ఈ మేరకు వివిధ పారిశ్రామికవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. హెచ్‌టీ సర్వీసుల వినియోగదారులకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. దీనికి అవసరమైన నిరభ్యంతర పత్రం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే మార్కెట్లో కొనే విద్యుత్‌పై క్రాస్–సబ్సిడీ సర్‌చార్జ్, అదనపు సర్‌చార్జ్‌ల నుంచి మినహాయింపునిచ్చింది. అదేవిధంగా పరిమితులు అమలులో ఉన్నంతవరకు కనీస చార్జీలు వర్తించవని.. వాస్తవ వినియోగంపైనే డిమాండ్ చార్జీలు విధించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. వినియోగదారులు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్‌ను పొందే విషయంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా నెలవారీ కోటా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పరిమితుల ప్రకారం జరిమానాలు విధించాలి. డిస్కమ్‌ల అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకి 209 మిలియన్ యూనిట్లు ఉంది. దీనిలో థర్మల్ 70 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు 38 మి.యూ, హైడ్రో 6 మి.యూ, గ్యాస్, సెయిల్ 8 మి.యూ, పవన విద్యుత్ కంపెనీలు 16 మి.యూ, సౌర విద్యుత్ కంపెనీలు 25 మి.యూ, హిందుజా 12 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 0.04 మిలియన్ యూనిట్ల చొప్పున అందిస్తున్నాయి. ఇప్పటికీ పవర్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి 34 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తే తప్ప డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల 30 వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులపై విధించిన పరిమితులను పొడిగించాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. పరిమితుల వల్ల 290 మిలియన్ యూనిట్లు ఆదా.. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, గృహావసరాలకు కోతలు లేకుండా సరఫరా అందించడం కోసం ఈ నెల 8 నుంచి పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు అమలులోకి వచ్చాయి. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే 290 మిలియన్ యూనిట్లను ఆదా చేసి గృహావసరాలకు నిరంతరం, వ్యవసాయావసరాలకు 7 గంటలు విద్యుత్‌ను అందించారు. ఇంకా కొరత ఉండటం, పంటలకు విద్యుత్ అవసరం వంటి కారణాలతో పరిమితులను మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు నిరంతరం నడిచే పరిశ్రమలు రోజులో వాడే విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు వాడుకోవచ్చు. మిగతా పరిశ్రమలకు వారంలో ఒక రోజు (వారాంతపు సెలవు కాకుండా) పవర్ హాలిడే అమలు జరుగుతుంది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాదాపు 22 పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. -
పరిశ్రమలకు 'పరిమితి'పై త్వరలో సడలింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విధించిన పరిమితి, నియంత్రణ చర్యలు సాధ్యమైనంత త్వరగా సడలించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. డిస్కంలు జరిమానా చార్జీలను ఆదాయ వనరుగా చూడకూడదని, నిబంధనల అమలుకు వాటిని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతల నుంచి ఉపశమనం కలిగించడం కోసం పరిశ్రమలపై ఇటీవల విధించిన ఆంక్షలపై కమిషన్ సభ్యులు పి.రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ సింగ్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్, మూడు డిస్కంల సీఎండీలతో ఏపీఈఆర్సీ చైర్మన్ బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుండి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల రికవరీకి సంబంధించిన సమస్యలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర్రంలో బొగ్గు కొరత, దానిని అధిగమించేందుకు తీసుకుంటున్న పలు చర్యలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. ఏ ధరకైనా విద్యుత్ కొనుగోలు చేసి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. విద్యుత్ రంగం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని, అనవసర పెట్టుబడులు మానుకోవాలని సూచించారు. సకాలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ, ఈ విషయంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పనితీరు బాగోని ఏ డిస్కంను కమిషన్ ఉపేక్షించేది లేదని చైర్మన్ హెచ్చరించారు. ఊరట ఇలా.. ► విద్యుత్ ఆంక్షల అమలు కాలంలో క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి ఉండదు. ► కాంట్రాక్ట్ చేసిన డిమాండ్‌పై కాకుండా పరిమితం చేసిన డిమాండ్‌పై మాత్రమే డిమాండ్ చార్జీలు. ► ఏప్రిల్ 15 నుంచి మాత్రమే జరిమానా చార్జీల విధింపు. ► ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగం ఉన్న వినియోగదారులకు నెలవారీ విద్యుత్ కోటా పూర్తయ్యాకే జరిమానా. ► ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఓపెన్ యాక్సెస్ లభ్యత కోసం నిరభ్యంతర పత్రం జారీ. -
పారిశ్రామిక కారిడార్లపై కీలక ముందడుగు
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా.. ఈ అంశంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్‌పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా.. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరై కారిడార్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన రాష్ట్రంలో కారిడార్లు, నోడ్స్లో పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. నిధులు త్వరితగతిన ఇచ్చేందుకు హామీ ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన 51 శాతం పనులను ఇప్పటికే పూర్తి చేశామని.. కేంద్రం వాటా 49 శాతం నిధుల్ని గ్రాంట్ రూపంలో కేటాయించాలని పరిశ్రమల శాఖ అధికారులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సోమ్‌ప్రకాష్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా 11 కారిడార్లు, 32 పారిశ్రామిక నోడ్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఇందులో 5 నోడ్స్ను ఏపీకి కేటాయించామన్నారు. కారిడార్లు, నోడ్స్‌కు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను జూన్ నాటికి సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా రూ.4 వేల కోట్లను త్వరితగతిన కేటాయించేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అన్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్స్‌తోపాటు ఎగుమతులకు ఎక్కువ అవకాశాలుండే పరిశ్రమలపై దృష్టి సారించాలన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. జనావాసాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీలకు భూకేటాయింపులు తగ్గించేలా చూడాల, వీలైనంత త్వరగా గ్రాంట్ కేటాయించి రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్ల అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక యువతకు ఉపాధి
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను మ్యాపింగ్ చేసి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలవారీగా మానవ వనరుల వివరాలను సేకరించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కొన్ని పరిశ్రమలు ఆయా సంస్థల్లోనే శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు వివరించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదానీ పోర్టులో భారీ అవకాశాలు ఒక్క నెల్లూరు జిల్లాలోనే పోర్టులు, లాజిస్టిక్ రంగంలో ఏకంగా 5,650 మంది మానవ వనరుల అవసరం ఉన్నట్లు అదాని పోర్టు తెలియచేయడమే కాకుండా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కర్నూలులో రాంకో సిమెంట్, వైఎస్ఆర్ కడపలో దాల్మియా సిమెంట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలిదశలో 11,981 మంది అవసరం జిల్లాలవారీగా సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది 11,981 మంది నిపుణులైన మానవ వనరులు అవసరమని వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 23 రంగాలకు చెందిన 66 పరిశ్రమలకు సంబంధించి 48 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. శిక్షణ అనంతరం అదే సంస్థలో ఉద్యోగంలో చేరేలా అవకాశం కల్పిస్తున్నారు. -
‘గోల్కొండ’ నోట్‌బుక్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లేపాక్షి నంది నోట్‌బుక్స్ అంటే ఒకప్పుడు విద్యార్థుల్లో యమ క్రేజ్. హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ నోట్ బుక్స్‌నే సరఫరా చేసేవారు. బయటివారు కొనుక్కోవాలంటే మాత్రం సూపర్బజార్లకు వెళ్లాల్సిందే. సాధారణ నోట్ బుక్‌లకంటే పెద్దసైజ్, నాణ్యత ఈ నోట్‌బుక్స్ సొంతం. వాటి మీద ఆసక్తితో విద్యార్థులు పట్టణాల్లోని సూపర్ బజార్లకు వెళ్లి మరీ కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ నోట్‌బుక్స్ మళ్లీ రాబోతున్నాయి. కాకపోతే లేపాక్షి నంది బ్రాండ్ స్థానంలో ‘గోల్కొండ’ నోట్‌బుక్స్ పేరుతో వాటిని పరిశ్రమల శాఖ తీసుకొస్తోంది. అన్ని శాఖలకు అందుబాటులోకి... తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్లో భాగంగా ఈ నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. గోల్కొండ నోట్‌బుక్‌లను తీసుకునేలా జిల్లాల్లోని డీఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరింది. విద్యార్థులకే కాక... అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, కార్పొరేషన్లు, బోర్డు కార్యాలయాల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్ ప్యాడ్లు, పేపరు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులకు పరిశ్రమల శాఖ లేఖలు కూడా రాసింది. సైజును బట్టి ధరలు.. సైజులను బట్టి ఈ నోట్‌బుక్‌ల ధరలను నిర్ణయించింది. ఏ4 సైజ్, ఏ3 సైజు తదితర తెల్ల కాగితం నాణ్యతను (70 జీఎస్ఎం, 75 జీఎస్ఎం) బట్టి ధరలను ఖరారు చేసింది. 200 పేజీల సింగిల్ రూల్డ్ (వైట్) నోటుబుక్కు సైజును బట్టి రూ.31.30గా, 100 పేజీల నోట్ బుక్ ధరను సైజును బట్టి రూ.10.29గా, రూ.17.77గా నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను గురుకుల విద్యాసంస్థల అధికారులకు పంపించింది. వాటిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. -
శ్రీసిటీతో గౌతమ్‌రెడ్డికి అనుబంధం
శ్రీసిటీ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చిత్తూరు జిల్లాలోని సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ (శ్రీసిటీ)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త ఇక్కడి పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీసిటీతో గౌతమ్‌రెడ్డికి మంచి అనుబంధం ఉంది. గడచిన రెండేళ్లలో పలుసార్లు శ్రీసిటీని సందర్శించిన ఆయన పారిశ్రామికాభివృద్ధికి విశేష సహకారం అందించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 2020 ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన భారీ పరిశ్రమ టోరె ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన జపాన్ ప్రతినిధులతో సమావేశమై మరిన్ని పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చేలా ఒప్పించారు. తరచూ వర్చువల్ విధానంలో ఇక్కడ పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ వారి సమస్యలను పరిష్కరించేవారు. మంత్రిగా, స్నేహితుడుగా పరిశ్రమల సీఈవోలకు ప్రత్యక్షంగాను, ఫోన్లోను అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందారు. శ్రీసిటీకి తీరనిలోటు గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర పారిశ్రామిక వర్గానికి, ముఖ్యంగా శ్రీసిటీకి తీరని లోటు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి, ప్రత్యేకించి కరోనా సమయంలో పరిశ్రమల పునః ప్రారంభానికి ఆయన అందించిన సహకారం ఎంతో విలువైనది. – రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ -
ఎగుమతులు ఎగసేలా
సాక్షి, అమరావతి: దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి మన రాష్ట్రం 10 శాతం వాటాను చేజిక్కించునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే ఎగుమతుల్లో మంచి పనితీరు కనబరుస్తున్న జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల వివరాలను సేకరించి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో గల అవకాశాలను పరిశీలించి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్స్) జీఎస్ రావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలు దేశవ్యాప్తంగా అత్యధిక ఎగుమతులు చేస్తున్న టాప్ 20 జిల్లాల్లో ఉండగా.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ నాటికి రాష్ట్రం నుంచి రూ.84,701.64 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. అందులో రూ.24,071.26 కోట్ల ఎగుమతులతో విశాఖ మొదటి స్థానంలోను, రూ.19,499.19 కోట్లతో తూర్పు గోదావరి రెండో స్థానంలో ఉన్నాయి. ఇదే సందర్భంలో కర్నూలు జిల్లా నుంచి రూ.317 కోట్లు, వైఎస్సార్ జిల్లా రూ.633 కోట్ల ఎగుమతులతో చివరి స్థానాల్లో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి వెనుకబడిన జిల్లాల్లో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లా నుంచి అత్యధికంగా ఖనిజాలు, ఉద్యాన పంటల ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వైఎస్సార్ జిల్లా నుంచి బేరియం, బైరటీస్, పోర్ట్లాండ్ సిమెంట్, అరటి వంటి ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాభివృద్ధితోపాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఇందుకోసం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్, వైఎస్సార్ ఈఎంసీలతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెద్దఎత్తున తయారీ కేంద్రాలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటయ్యే యూనిట్లను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలో పలు యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. -
రాష్ట్రంలో 5 వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: దుబాయ్ ఎక్స్పో–2020లో ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి అనేక సంస్థలు ఆసక్తిని కనబరిచాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ‘నవరత్నాలు’ పేరుతో రాష్ట్రంలో సాధిస్తున్న సుస్థిరమైన అభివృద్ధితో పాటు 11 రంగాలకు చెందిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధానంగా వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో పెట్టుబడులకు రీజెన్సీ గ్రూపుతో ఒప్పందం జరిగిందన్నారు. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ (అలుబండ్ అనుబంధ సంస్థ), ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ మొబిలటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలిపాం రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దుబాయ్ ఎక్స్పో ద్వారా ప్రపంచానికి తెలియజేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఏపీ పెవిలియన్‌ను రోజుకు 7,000 నుంచి 10,000 మంది సందర్శించినట్లు ఏపీ ఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. -
విదేశీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో–2022లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రతి అంశంలో ఏపీ ప్రత్యేకత కనిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న ఎక్స్పోకి ఏర్పాట్లపై అధికారులతో గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎక్స్పోకి ప్రభుత్వం తరఫున మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవనుంది. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చాయి. ఈ నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మంత్రికి వివరించారు. ఏపీ పెవిలియన్‌లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐటీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు తీసుకున్న చర్యలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. పర్యటన ఇలా.. ఈ నెల 13న 100 మంది సభ్యులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 14న పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం, రోడ్ షో నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో భారీ సమావేశం ఉంటుంది. 15న ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వరల్డ్ ఫెసిలిటీ సైట్ విజిట్‌లతోపాటు వివిధ ఎమిరేట్ కంపెనీలతో బీ2జీ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశమై ఏపీ గురించి చర్చిస్తారు. -
అపార అవకాశాలున్నాయ్.. అందిపుచ్చుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వివరించి, అవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) భారీ ప్రచార ప్రణాళికను రూపొందించింది. వచ్చే 12 నెలల్లో రూ.18,300 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా వర్చువల్ సమావేశాలకే పరిమితమైన ఈడీబీ ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించనుంది. వివిధ దేశాల్లో జరిగే కీలకమైన 9 అంతర్జాతీయ సదస్సులు, దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే 41 సదస్సుల్లో పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు దుబాయ్ ఎక్స్‌పోలో రాష్ట్ర పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, ఇంధనం, గ్రామ వార్డు సచివాలయాలు వంటి కీలక శాఖల అధికారులు ఆ శాఖల్లోని పెట్టుబడి అవకాశాలను వివరించి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఈడీబీ అధికారులు తెలిపారు. జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా రాష్ట్రం భాగస్వామ్యం కానుంది. జాతీయ, అంతర్జాతీయ రోడ్‌షోలలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వాటిలో పాల్గొనే సంస్థలకు వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. అంతర్జాతీయ పెట్టుబడులపై దృష్టి దుబాయ్ ఎక్స్పో, స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లకు వివరిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం ఈ రెండు సదస్సులకు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ఇంకా రాష్ట్ర అధికారుల బృందం పర్యటన ఖరారు కాలేదు. ఈ రెండు సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెవిలియన్లు ఏర్పాటు చేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి -
స్కూల్ నుంచే నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: పాఠశాలల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖను పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సీడాప్, ఉపాధి, శిక్షణ సహా పలు విభాగాలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కిందకు తీసుకువచ్చే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (డీఎస్డీఏ)ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ విస్తీర్ణంలో వర్క్ ఫ్రం హోంటౌన్ కేంద్రాలు వర్క్ ఫ్రం హోంటౌన్ కేంద్రాల పైలట్ ప్రాజెక్ట్‌పై సమీక్షలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో వర్క్ ఫ్రం హోంటౌన్ (డబ్ల్యూఎఫ్ హెచ్‌టీ) కేంద్రాలను భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మౌలిక’ ప్రాజెక్టులపై ప్రణాళిక సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి 2022–23 ఆర్థిక ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై మంత్రి మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టుల ప్రగతి, విశాఖ–చెన్నై కారిడార్ పురోగతిపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీకల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈడీబీ, ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డు తదితర అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్సైట్లో లింక్ ద్వారా ఓపెన్ చేసేందుకు వీలుగా వెబ్సైట్ విండో తయారు చేయాలని మంత్రి సూచించారు. లేపాక్షి, హస్తకళలు కలిపి జాయింట్ ఔట్లెట్లు..: చేనేత, జౌళి, హస్తకళలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను మంత్రి మేకపాటి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో చేనేత, జౌళి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాల కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. లేపాక్షి, హస్తకళలకు ప్రస్తుతం వేర్వేరు ఔట్లెట్లు ఉన్నాయని, వాటిని జాయింట్ ఔట్లెట్లుగా నిర్వహిస్తే మరింత వ్యాపారం జరిగే అవకాశముందన్నారు. -
ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం
సాక్షి, అమరావతి: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగస్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరకు రవాణా, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వసతుల కల్పన ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణను ఆచరణలో చూపుతున్నారని అన్నారు. ఇది ఆయన దార్శనికతకు నిదర్శనమన్నారు. పంచ సూత్రాల ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన ‘పీఎం గతిశక్తి‘ సదస్సులో మంత్రి మేకపాటి పాల్గొన్నారు. రూ.18 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక నోడ్లు, కార్గో హబ్‌ల ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తుందన్నారు. పీఎం గతిశక్తిపై ప్రతి రాష్ట్రం నుంచి నోడల్ ఆఫీసర్ని నియమించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
విశాఖలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయం
సాక్షి, అమరావతి: వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా విశాఖపట్నంలో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమని, 62 శాతం జనాభా వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ఆహార ధాన్యాల పంట వరితో పాటు పత్తి, మొక్క జొన్న, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఊతమివ్వాలని కోరారు. ఆ లేఖలోని వివరాలిలా ఉన్నాయి. పలు పంటల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ► 17.84 లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఉద్యాన పంటల ద్వారా 312.34 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తోంది. దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో, మిరప, కోకో, నిమ్మ, ఆయిల్ పామ్, బొప్పాయి, టమాటో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. జీడిపప్పు, మామిడి, బత్తాయిసాగులో 2వ స్థానంలో ఉంది. ► పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అపారమైన ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ► ఆక్వాకల్చర్‌కు మద్దతుగా 974 కి.మీ పొడవుతో రెండవ పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 70% వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్.. సముద్ర చేపలు, లోతట్టు చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.13,781 కోట్ల విలువైన 52.88 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు, రూ.15,832 కోట్ల విలువైన 2.79 లక్షల టన్నుల సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ► రాష్ట్రం నుంచి బియ్యం, మామిడి, అరటి, నిమ్మ, జీడిపప్పు, మిరప, పసుపు, వెజిటబుల్ ఆయిల్స్, కాఫీ, చక్కెర, పాల ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులతో పాటు ఆక్వా ఫీడ్, ఘనీభవించిన రొయ్యల ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. ► దేశంలోనే 2వ అతి పెద్ద ఓడరేవు విశాఖలో ఉన్నందున వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సులభతరం చేయడంలో ‘ఎపెడా’ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దృష్ట్యా ఏపీ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచేందుకు విశాఖలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటు తక్షణావసరం. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలి. -
విశాఖలో మరో ఎంఎస్ఎంఈ పార్క్
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సహా పార్కు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన భూమి వరల్డ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వంద ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా.. 20 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ‘భూమి వరల్డ్ గ్రూప్’ ప్రతిపాదనపై చర్చించారు. దీన్ని మరోసారి పరిశీలించి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది పాల్గొన్నారు. ఇండో–జపాన్ ప్రతినిధుల భేటీ మంత్రి గౌతమ్‌రెడ్డితో ఇండో–జపాన్ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై మంత్రి చర్చించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ పాల్గొన్నారు. -
ఎర్ర 'తివాచీ' పరిచేవారేరి?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సహజసిద్ధ రంగులతో.. అబ్బురపరిచే చిత్రాలతో రాజుల కాలం నుంచి ఆకట్టుకుంటూ వస్తున్న ‘తంగెళ్లమూడి తివాచీ’ రంగు క్రమంగా వెలిసిపోతోంది. కోటకు కొత్త అందం తేవాలన్నా.. ఇంటికి కళ రావాలన్నా ఏలూరు తివాచీ పరచాల్సిందే అనే స్థాయిలో వెలుగొందిన పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. దేశవిదేశీయుల మనసు చూరగొన్న పరిశ్రమ.. ఇప్పుడు తనకు ‘ఎర్ర తివాచీ’ పరిచేవారి కోసం ఎదురుచూస్తోంది. పర్షియా నుంచి వలస.. సహజసిద్ధ రంగులతో తయారయ్యే సంప్రదాయ తివాచీలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి ప్రసిద్ధి. గొర్రెల నుంచి సేకరించిన ఊలు, సహజసిద్ధ రంగులు, జూట్, పత్తితో 300 ఏళ్లకు పై నుంచి ఇక్కడ తివాచీలు తయారు చేస్తున్నారు. 18వ శతాబ్ధంలో పర్షియా నుంచి మచిలీపట్నం ఓడరేవుకు తివాచీలు తయారు చేసే ముస్లింలు కొందరు వలస వచ్చారు. వారు కాలక్రమేణ తంగెళ్లమూడిలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తంగేడు వనంలా ఉండేది. తంగేడు పూల నుంచి తీసిన రంగులను తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పత్తి, జూట్ కూడా అందుబాటులో ఉండటంతో వారు ఇక్కడే స్థిరపడిపోయారు. 50 ఏళ్లకు పైగా మన్నిక.. ఎన్ని అడుగుల తివాచీకి ఆర్డర్ ఇచ్చినా.. ఇక్కడ అద్భుతంగా తయారు చేసి ఇస్తారు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏలూరులో మాత్రమే చేనేత మగ్గాలపై తివాచీలు తయారు చేస్తారు. ఇవి 50 ఏళ్లకుపైగా మన్నిక ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటికి మంచి డిమాండ్ ఉండేది. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసేవారు. యంత్రాలు రావడంతో 2002 నుంచి ఇక్కడి పరిశ్రమకు గడ్డుకాలం మొదలైంది. తక్కువ ధరకు ప్లాస్టిక్ కార్పెట్లు వస్తుండటంతో అందరూ వాటివైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఏలూరు తివాచీల గురించి తెలుసుకున్నవారు ఆర్డర్లు ఇస్తుండటంతో కొంతకాలం కిందట మంచి డిమాండ్ వచ్చిందని తయారీదారులు చెప్పారు. అంతలోనే కరోనా విజృంభించడంతో పరిశ్రమ కుదేలైందని వాపోయారు. తివాచీ నేత పనిలో నిమగ్నమైన కార్మికులు కరోనాతో దెబ్బ గతంలో 100 మందికి పైగా చేనేత కార్మికులు, 50 మంది ఎక్స్‌పోర్టర్లు, 20 మంది మాస్టర్ వీవర్లతో ఈ పరిశ్రమ కళకళలాడేది. ప్రభుత్వ సహాయ సహకారాలు అందడానికి వీలుగా ఏలూరు కార్పెట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ నేతృత్వంలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించడంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కొని వెళ్లిపోయారు. నైపుణ్యమున్న చేనేత కార్మికులు తగ్గిపోయారు. 10 మంది కార్మికులతోనే తక్కువ ఆర్డర్లతో నెట్టుకువస్తున్నారు. 6 గంటల పనికి రూ.300 ఇస్తున్నా కార్మికులు దొరకట్లేదని తయారీదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ హితం.. ఈ తివాచీలు పర్యావరణ హితమైనవని తయారీదారులు చెబుతున్నారు. ఊలు, కాటన్, జూట్‌తో పాటు సహజసిద్ధ రంగులు ఉపయోగిస్తామని తెలిపారు. 50 ఏళ్లకు పైగా మన్నిక ఉండే వీటిని మూడు నెలలకొకసారి శుభ్రం చేస్తే కొత్తగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. సాధారణ కార్పెట్ కంటే వీటి ధర కాస్త అధికం. ఇందులోనే 50 శాతం కూలి ఖర్చులు, 30 నుంచి 40 శాతం మెటీరియల్ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ తివాచీల్లో హానికర రసాయనాలు వినియోగిస్తారని.. ఇవి భూమిలో, సముద్రంలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మన్నిక రెండేళ్లే ఉంటుంది. కానీ ధర తక్కువ కావడంతో అందరూ ప్లాస్టిక్ వైపు వెళుతున్నారని చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే పని సిద్ధమైన తివాచీని ఫినిషింగ్ చేస్తుంటాను. ఫినిషింగ్ ఎంత బాగా చేస్తే అంత మన్నిక ఉంటుంది. 40 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. గతంలో చాలా సందడిగా ఉన్న మా పరిశ్రమ నేడు వెలవెలబోతుంటే చూడటం కష్టంగా ఉంది. – సత్యనారాయణ, ఫినిషింగ్ కార్మికుడు మాది ఐదోతరం కార్పెట్ తయారీ పరిశ్రమలో నేను ఐదో తరానికి చెందినవాడిని. పనినైపుణ్యంతో అనేక అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు ఆ వెలుగులు పోయాయి. ప్లాస్టిక్ కార్పెట్ వచ్చాక మా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మార్కెట్ కొంత మేర బాగానే ఉన్నప్పటికీ.. కార్మికులు దొరకట్లేదు. నైపుణ్య కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆన్లైన్ మార్కెటింగ్ విక్రయాలకు అవకాశం కల్పిస్తే ఈ రంగం కోలుకుంటుంది. – అబ్దుల్ నయీం, తయారీదారు -
ఇంధన పొదుపుపై కసరత్తు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్ నిర్వహించేలా ఎంఎస్ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్ఎంఈలు 5,000 మిలియన్ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్ యూనిట్లు ఆదా అయినట్టే. ఎంఎస్ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్ క్లస్టర్లో 43 ఎంఎస్ఎంఈలు 455 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఎస్ఈసీఎం రెండు ఫిషరీస్ ఎంఎస్ఎంఈలు ఆనంద ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కదెర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థల్లో ఇంధన ఆడిట్ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్ లో తేల్చింది. పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం టీఈఆర్ఐ సంస్థ ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇప్పటికే ఇంధన ఆడిట్ నిర్వహించి ఫిషరీస్ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. – నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ బీఈఈ సంస్థలతోనే ఆడిట్ పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. – కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. –జేవీఎన్ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ -
పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్
ఈ కష్టకాలంలో పారిశ్రామికవేత్తలు చూపి స్తున్న అంకితభావానికి, ఎగుమతి దారులు, వాణిజ్య మండళ్లు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు. పారిశ్రామికవేత్తల్లో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్రంతోపాటు అభివృద్ధి చెందేలా మరింత మందిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే సూచనలు చేయండి. కచ్చితంగా నెరవేరుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్ర ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదైందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సరైన మౌలిక వసతులు, చక్కటి విధానాలు అమలు చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలమనేందుకు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి, జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు పడిపోగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయని వివరించారు. 2020–21లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించగా రాష్ట్ర జీఎస్డీపీ క్షీణత 2.58 శాతానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో 5.8 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్ కార్నివాల్ ‘వాణిజ్య ఉత్సవ్’ను మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంతో పాటు మీరు కూడా (పారిశ్రామికవేత్తలు) అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ ఏపీ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. వాణిజ్య ఉత్సవ్–2021ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారం రోజులు మీతోనే... ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ దేశాల దౌత్యాధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతి దారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ స్వాగతం. విజయవాడలో రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా జరుగుతాయి. వారం రోజులపాటు వాణిజ్య వర్గాలు, ప్రభుత్వం కలసి మెలసి పనిచేస్తాయి. సంక్లిష్ట సమయం.. గత రెండేళ్లలో పెను సవాళ్లను ఎదుర్కొన్నాం. తొలి ఏడాది మాంద్యం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే రెండో సంవత్సరం కోవిడ్ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ వసూళ్లు 3.38 శాతం పడిపోయాయి. 2018–19లో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. 2020–21లో మరింత క్షీణించి 7.3 శాతానికి పడిపోయింది. దేశ ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. 9 నుంచి 4కి ఎగబాకిన ర్యాంకు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఎగుమతులు 19.4 శాతం వృద్ధి చెందాయి. రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో సముద్రపు ఉత్పత్తులు 15 శాతం ఉండగా షిప్స్, బోట్ల నిర్మాణ రంగం 8.5 శాతం, ఫార్మా రంగం 7.3 శాతం, ఐరన్, స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతంతో ఎగుమతులకు దోహదపడ్డాయి. 2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీఎస్డీపీ కోవిడ్ సంవత్సరం 2020–21లో 2.58 శాతం క్షీణిస్తే దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నామంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండూ చాలా కీలకం. రెండేళ్లలో చాలా దూరం ప్రయాణం గత రెండేళ్లలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ – గెయిల్ స్థిరమైన పారిశ్రామిక ప్రగతి కోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్ లభ్యం కావాలి. పరిశ్రమలు, గృహ అవసరాల కోసం గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గెయిల్ భాగస్వామ్యంతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఇంధన వనరులను అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం. 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు తిరుపతి, విశాఖల్లో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెడితే మరో వర్సిటీ ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించటంపై దృష్టి సారిస్తుంది. ఇవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. కొత్త పోర్టుల నిర్మాణం... రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పోర్టులను నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడు ఉత్తరాది రాష్ట్రాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 254 మిలియన్ టన్నులు కాగా మూడు కొత్త పోర్టుల వల్ల తొలిదశలో మరో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు వీటితోపాటు మరో 8 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. ఏపీకి ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నా హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాదు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీరు, ఎస్టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిన దృష్ట్యా 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.13,500 కోట్లతో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నాం. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ విజయవాడలో రెండురోజుల వాణిజ్య ఉత్సవ్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమితంగా ఆకర్షించింది. రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలను తెలిపే విధంగా మొత్తం 29 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 15 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీ ఎక్స్పీరియన్స్ ఎరినా పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతులు, వైఎస్సార్ వన్ ద్వారా అందించే బిజినెస్ అడ్వైజరీ సేవలు, రాష్ట్రంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రభుత్వం సహకారం తెలిపే విధంగా మూడు తెరలు ఏర్పాటు చేసి వీడియోలు చూసేలా టచ్ స్క్రీన్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15 నిమిషాలపాటు ఆసక్తిగా ఎరినా, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మానవ శిరోజాలను ఎగుమతిచేసే స్టాల్స్, టీ ఎగుమతులు, హస్తకళలు, ఎంపెడా ఏర్పాటు చేసిన అక్వేరియం చేపలు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ, హస్తకళల స్టాల్స్‌ను సందర్శించి వ్యాపారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ స్టాల్స్‌లో చిన్న వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూసి వీటిని పెద్దగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథులకు ఇచ్చే మెమెంటోగా వాడుకోవచ్చని సీఎం అధికారులకు సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఉత్పత్తులను తిలకిస్తున్న సీఎం జగన్ -
ఏపీ నుంచి ఎగుమతులు రయ్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు ఏడాదికేడాది వృద్ధిలో సాగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి 195 దేశాలకు 2,106 రకాల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2019–20లో సుమారు రూ.1,08,348 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 2020–21లో 13.8 శాతం వృద్ధి రేటుతో రూ.1,23,370 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రస్తుతం దేశం ఎగుమతుల్లో 6 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2030 నాటికి 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచాలని నిర్దేశించుకుంది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ) లిమిటెడ్ ప్రస్తుత ఎగుమతుల పరిస్థితిపై చేసిన అధ్యయనం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతి చేసే ఉత్పత్తులకు కేటాయించే 8 సంఖ్యల హెచ్ఎస్ఎన్ కోడ్ అధారంగా రాష్ట్రం నుంచి ఏయే దేశాలకు ఏయే ఉత్పత్తులు ఏ మేరకు ఎగుమతవుతున్నాయనేది స్పష్టమైంది. మూడు స్థానాలు పెంచుకున్న రాష్ట్రం 2019–20లో దేశీయ ఎగుమతుల్లో ఏడవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం.. ఎగుమతులను ప్రోత్సహించడంతో 2020–21లో నాలుగో స్థానానికి చేరుకుంది. మొత్తం దేశ ఎగుమతుల్లో 21 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 20 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 9 శాతంతో తమిళనాడు, 6 శాతంతో ఆంధ్రప్రదేశ్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో డ్రగ్ ఫార్ములేషన్స్, స్టీల్–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ ఉపకరణాలు వంటి రంగాలు కీలకపాత్ర పోషించాయి. విలువపరంగా 6 రంగాల నుంచే 60 శాతం ఎగుమతులు రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 60 శాతం ఆరు రంగాల నుంచే వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విలువ పరంగా చూస్తే రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతుల్లో వనామీ రొయ్యలు అగ్రస్థానంలో ఉన్నాయి. గతేడాది రూ.8,760 కోట్ల విలువైన వనామీ రొయ్యలు రాష్ట్రం నుంచి ఎగుమతయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఓడలు, బోట్లు, టగ్స్ ద్వారా రూ.7,300 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,110 కోట్ల విలువైన జనరిక్ ఔషధాలు, రూ.4,380 కోట్ల విలువైన మాంగనీస్, రూ.3,650 కోట్ల విలువైన రసాయనాలు, రూ.2,920 కోట్ల విలువైన బియ్యపు నూక ఎగుమతి అయ్యాయి. పరిమాణపరంగా 5 కీలక రంగాల నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రం నుంచి 216 లక్షల కిలోల గ్రానైట్, బెరైటీస్, సిమెంట్ ఎగుమతులు జరిగాయి. 133 లక్షల కిలోల ఇనుము/ఉక్కు, 115 లక్షల కిలోల బియ్యం, 44 లక్షల కిలోల ముడి ఇనుము, మాంగనీస్, 44 లక్షల కిలోల కాల్షియనేటెడ్ కోక్, హైగ్రేడ్ డీజిల్ ఎగుమతులు జరిగాయి. లాటిన్ అమెరికాపై ఆసక్తి మన రాష్ట్రం నుంచి వ్యాపారులు అత్యధికంగా ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తం ఎగుమతుల్లో 29 శాతం వాటాతో ఉత్తర అమెరికా అగ్రస్థానంలో ఉంది. గతేడాది ఉత్తర అమెరికాకు రూ.17,388.6 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఆ తర్వాత స్థానంలో ఆసియా దేశాలున్నాయి. ఎగుమతుల్లో 21 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్న ఆసియా దేశాలకు గతేడాది రూ.12,884.5 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. యూరోపియన్ దేశాలకు రూ.6,073.6 కోట్లు, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు రూ.3,212 కోట్ల విలువైన ఎగుమతులు చేశారు. బ్లూ ఎకానమీపై దృష్టి సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై అధికంగా దృష్టి సారిస్తున్నాం. ఎగుమతులు పెరిగితే ఆ మేరకు ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10% వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు ఎయిర్ కార్గో అవకాశాలను పెంచుతున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి జిల్లాల వారీగా ఉత్పత్తుల ఎంపిక రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను జిల్లాల వారీగా ఎంపిక చేసి వాటిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాం. వివిధ దేశాల్లో ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అమ్మకం, కొనుగోలుదారులతో సమావేశాలను నిర్వహిస్తున్నాం. – జి.రాజేంద్రప్రసాద్, వీసీఎండీ, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ -
పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమ
సాక్షి, అమరావతి: రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎలాంటిæ పరిశ్రమ రావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ఆహారశుద్ధి సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.4,361.91 కోట్లతో భావనపాడు తొలిదశ పనులు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు ఓడరేవును తొలి దశలో రూ.4,361.91 కోట్లతో నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 6,410 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ లార్డ్ విధానం (తొలుత ప్రభుత్వం అభివృద్ధి చేసి తర్వాత లీజు లేదా విక్రయిస్తారు)లో అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.527.22 కోట్లు సమకూర్చనున్నట్లు పెట్టుబడులు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రైట్స్ సంస్థ సవరించిన ప్రాజెక్టు నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వం భావనపాడు పోర్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది. భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పోర్టును అభివృద్ధి చేయనుండగా, ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.3,053.34 కోట్ల రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. -
త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ–2021 తీసుకురానున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ తీసుకురాబోతున్నామని వివరించారు. కేంద్ర స్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించి సీఎస్ చైర్మన్‌గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాన్ మేజర్ పోర్టుల్లో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని.. ఏపీఐఐసీ భూముల్లో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ట్రక్ పార్కింగ్ ప్రాంతాలు నిర్మించాలని.. అక్కడ ఇంధన స్టేషన్లు, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఐటీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనలపైన అధికారులతో మంత్రి చర్చించారు. రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ వి గిరి, లంకా శ్రీధర్ పాల్గొన్నారు. -
పెట్టుబడిదారుల కోసం ‘పింక్ బుక్’
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వచ్చే వారికి మార్గద ర్శకంగా ఉండేలా తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్ బుక్’ను మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వసతులు, మౌలిక సౌకర్యాలపై సంపూర్ణ అవగాహన కలిగేందుకు పింక్‌బుక్ దోహదం చేస్తుందని, వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, శాఖల కాంటాక్టు వివరాలతో రూపొందించిన పింక్‌బుక్ ద్వారా పెట్టుబడి దారులు తమ భవిష్యత్ పెట్టుబడులపై నిర్ణ యం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. నిరంతర విద్యుత్, మానవ వనరులు తదితర వివరాలను ఈ బుక్‌లో పొందుపరిచినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ వింగ్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లక్ష్యాన్ని చేరు కుంటున్న నేపథ్యంలో కార్యకర్తల వివరాల డిజిటలైజేషన్లో వేగం పెంచాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. సభ్యత్వ నమోదు, జిల్లా కేంద్రా ల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అం శాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 31తో కార్యకర్తల జీవిత బీమా ప్రీమి యం గడువు ముగుస్తున్నందున సభ్యత్వ నమోదు వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 1న బీమా సంస్థకు ప్రీమి యం చెల్లింపు చెక్కుతో పాటు కార్యకర్తల వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి కారణాలను ఆరా తీశారు. సభ్యత్వ నమోదు సమయంలో కరోనా లాక్‌డౌన్‌తో లక్ష్యం చేరుకోలేదని ఇన్చార్జిలు వివరించారు. లక్ష్యాన్ని చేరని పార్టీ శాసన సభ్యులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి త్వరగా వివరాలు ఇవ్వాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ద్వారా వసూలైన మొత్తాన్ని పార్టీ కార్యాలయంలో జమయ్యేలా చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. -
ఆఫీసు నుంచా.. ఇంటి నుంచా..!
సాక్షి, హైదరాబాద్: ఆతిథ్య, రిటైల్ రంగాల తరహాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి న అనేక మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. కోవిడ్ థర్డ్‌వేవ్‌ను కారణంగా చూపుతూ ఐటీ ఉద్యోగు లు ఆఫీసుల నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు బడా ఐటీ కంపెనీలు వారానికి ఐదు రోజుల పని విధానం కాకుండా పరిమిత సంఖ్యలో కార్యాలయాలకు ఉద్యోగులు హాజరయ్యే హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ (కొద్దిరోజులు ఇంటి నుంచి, మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడం) విధానంవైపు మొగ్గు చూపుతున్నాయి. కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన రవాణా, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర ఉద్యోగులు మాత్రం ఐటీ ఆఫీసులు తిరిగి కళకళలాడే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. 10 శాతానికి మించని హాజరు కోవిడ్ మూలంగా ఏడాదిన్నరగా మూతపడిన హైదరాబాద్ ఐటీ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు గత జూన్ నాటికి 60శాతానికి చేరుకుంటుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అది ఈ ఏడాది చివరి నాటికి 80శాతానికి పైనే ఉంటుందని సర్వే లు వెల్లడించాయి. అయితే గత ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ రెండో దశ విజృంభించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు పదిశాతంగా నమోద వుతోంది. థర్డ్‌వేవ్ భయంతోపాటు వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు 20 శాతం మంది ఉద్యోగులు బృందాల వారీగా ఆఫీసు నుంచి పనిచేసేలా ‘హైబ్రిడ్’విధానాన్ని తెరమీదకు తెస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి సంస్థలు వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నాయి. ఇతరుల సమస్యలనూ అర్థం చేసుకోండి వ్యాక్సినేషన్ వేగం పెరగడంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వి«ధానంతో ఆ రంగంపై ఆధారపడిన ట్యాక్సీ డ్రైవర్లు, క్యాంటీన్లు, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర సర్వీసు ప్రొవైడింగ్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యం తో పనిచేయాలని కోరుకుంటున్నాం. వారిపై ఆధారపడిన ఇతర రంగాల వారి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ, పరిశ్రమల శాఖ డిసెంబర్ నాటికి మెరుగవుతుంది కోవిడ్ పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ఐటీ రంగం మంచి పురోగతి సాధిస్తోంది. రాష్ట్రంలోని 1,500కు పైగా ఐటీ కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. 2020–21లో 13 శాతం వృద్ధిరేటుతో 1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధించడం ఖాయం. ఆఫీసు నుంచే పనిచేయాలని భారతీయ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండగా, దిగ్గజ సంస్థలు హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. అందువల్ల డిసెంబర్ నాటికి ఆఫీసుకొచ్చే ఉద్యోగుల శాతం మెరుగవుతుందని అంచనా వేస్తున్నాం. –భరణికుమార్ ఆరోల్, ప్రెసిడెంట్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ -
పోర్టుల బిల్లులో మార్పులు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పోర్టుల (మైనర్ పోర్టులు)పై అధికారాలను చేజిక్కించుకునేలా కేంద్రం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2020పై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అభ్యంతరాలు లేవదీస్తోంది. గురువారం జరిగే మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎంఎస్డీసీ) సమావేశంలో ఈ బిల్లుపై రాష్ట్రానికి గల అభ్యంతరాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో వివరించనున్నారు. గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ అధ్యక్షతన జరిగే 18వ ఎంఎస్డీసీ సమావేశంలో మంత్రి మేకపాటి వర్చువల్‌గా పాల్గొంటారు. ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2020లో అమల్లోకి వస్తే పాత పోర్టుల నిర్వహణకు అనుమతుల మంజూరులో జాప్యం జరగడంతో పాటు కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, 974 కి.మీ. తీరప్రాంతం గల ఏపీ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతుందంటూ జనవరిలోనే ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే.. ప్రస్తుతం దేశంలో ఉన్న మేజర్ పోర్టులకు ఒక్కొక్క రెగ్యులేటరీ వ్యవస్థ ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. మొత్తం 160 మైనర్ పోర్టులకు కలిపి ఒకే రెగ్యులేటరీ వ్యవస్థ ఉంటుంది. కొత్త పోర్టులు కట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసిందని, పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తెలిపారు. మైనర్ పోర్టులకు ఒకే నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను తాము గట్టిగా వ్యతిరేకించి.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. రాష్ట్ర ప్రతిపాదనలకు అనుకూలంగా బిల్లులో చేసిన మార్పులను బట్టి ఎంఎస్డీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఎగుమతులను భారీగా పెంచుదాం
సాక్షి, అమరావతి: దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను ప్రస్తుతం ఉన్న 5.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ.1,07,730 కోట్లకుపైగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల్ని 2030 నాటికి రూ.2,52,750 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధన కోసం రంగాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎగుమతుల్లో కీలకమైన నాలుగు రంగాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఇతరత్రా మార్కెట్ అవకాశాలు, అమ్మకాలు, సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టిసారించింది. మత్స్యసంపద, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ముడి ఇనుము–స్టీల్ ఎగుమతుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ కాఫీ, గ్రానైట్, బైరటీస్, నిర్మాణరంగ పరికరాలు, ఎలక్ట్రికల్, కాటన్, దుస్తులు వంటి మరికొన్ని రంగాల్లో వ్యాపార అవకాశాలను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. అగ్రస్థానంలో ఉన్న 4 రంగాల ఎగుమతుల వాటా 2030 నాటికి 42.7 శాతానికి చేర్చాలని నిర్ణయించింది. దేశ ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటాను 10%కి పెంచేందుకు కొన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇదీ రోడ్‌మ్యాప్ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.16,350 కోట్లుగా ఉన్న చేపలు, రొయ్యల ఎగుమతి 2030 నాటికి రూ.37,575 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు పెద్దపీట వేయడమే కాకుండా కాకినాడ వద్ద బల్‌్కడ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటివల్ల ఫార్మా ఎగుమతులు ప్రస్తుతం ఉన్న రూ.12,300 కోట్ల నుంచి రూ.28,275 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారంతోపాటు రాష్ట్రంలో పోస్కో, జిందాల్ వంటి సంస్థలు ఉక్కు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రంగంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు, విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ముడి ఇనుము, ఉక్కు ఎగుమతుల విలువ రూ.7, 425 కోట్ల నుంచి రూ.17,100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రసాయనాల ఎగుమతులు రూ.10,725 కోట్ల నుంచి రూ.24,675 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మినరల్ ఫ్యూయల్స్ రూ.3,300 కోట్ల నుంచి రూ.7,650 కోట్లకు, కాఫీ ఎగుమతులు రూ.3,900 కోట్ల నుంచి రూ.8,625 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
జాతీయ సగటు కంటే తెలంగాణ ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఈ విషయంలో గతంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని వెళ్లాలని కోరారు. ఇప్పటిదాకా ఉద్దీపన ప్యాకేజీని ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదని, రాష్ట్రాల్లో విపక్ష, స్వపక్ష ప్రభుత్వాలు అనే తేడా లేకుండా మేకిన్ ఇండియా నినాదాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక 2020–21ను మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. జాతీయ సగటు కంటే తెలంగాణ ఉత్తమం ►ఏడేళ్లలో 20కిపైగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి రప్పించాం. ►ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏడాది కాలంలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం. ►గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 810 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 10 పారిశ్రామిక పార్కుల్లో రూ. 6,023 కోట్ల పెట్టుబడులతో 453 పరిశ్రమలు, 7,623 ఉద్యోగాలు వచ్చాయి. సాక్షి, హైదరాబాద్: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) మెరుగ్గా ఉందని, 2020–21లో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.78 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా 1.26 శాతం జీడీపీ తగ్గినా జీడీపీతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా ఏకంగా 20.9 శాతం పెరగ్గా జాతీయ స్థాయిలో కేవలం 3 శాతమే పెరిగిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగం జీఎస్డీపీకి ఈ స్థాయిలో వాటా అందించడం ఇదే తొలిసారన్నారు. ఇక జీడీపీలో తెలంగాణ ఆర్థిక రంగం 26 బేసిస్ పాయింట్లు పెరిగి 2020–21లో 5 శాతానికి చేరిందని చెప్పారు. 2019–20లో ఇది కేవలం 4.74 శాతంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. అలాగే తలసరి వార్షిక ఆదాయంలో జాతీయ సగటు రూ. 1,27,768 కాగా తెలంగాణలో రూ. 2,27,145గా ఉందన్నారు. 2020–21 గ్రాస్ స్టేట్ వ్యాల్యూ అడిషన్ (జీఎస్వీఏ)లో రంగాలవారీగా వ్యవసాయ రంగం 20.6 శాతం, పారిశ్రామిక రంగం 19.1 శాతం, సేవా రంగం 60.3 శాతం చొప్పున వాటా ఉందన్నారు. ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ సొబగులు... ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకు తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ టవర్లను ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది నల్లగొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ‘టీ–హబ్’రెండో దశ, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సౌకర్యం ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాదే ప్రారంభిస్తామని, ఎలక్టానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సాగునీటి రంగంతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ రంగం కూడా ఎంతో పురోగతి సాధించిందని, గతంలో 30 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.06 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. హైదరాబాద్ మినహా మిగతా పాత 9 జిల్లాల పరిధిలో 250 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సీఎం ఆదేశాల మేరకు ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు’ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... – ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల ఎగుమతుల్లో 2020–21లో 12.98 శాతం వృద్ధి రేటుతో ఐటీ ఎగుమతులు రూ. 1,45,522 కోట్లకు చేరగా ఉద్యోగుల సంఖ్యలో 7.99 శాతం వృద్ధి రేటుతో కొత్తగా 46,489 ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,489కి చేరగా, పరోక్షంగా హోటల్, టూరిజం, ఇతర సర్వీసు రంగాల్లో సుమారు 20లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. – ఎస్టీపీఐ, ఎస్ఈజడ్, నాస్కామ్ వంటి సంస్థల లెక్కల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ. 2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో 15.6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక రంగంలో కొత్తగా వస్తున్న పెట్టుబడుల్లో 80 శాతం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీల కార్యకలాపాల విస్తరణ వల్లే వచ్చాయి. – ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ జాబితాలో మొదటి స్థానం, ఈఓడీబీలో 3వ స్థానం, నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో 4వ స్థానంలో నిలవడంతోపాటు ఐటీపీవో త్రీ స్మార్ట్ సిటీస్ అవార్డును హైదరాబాద్ గెలుచుకుంది. అమెజాన్ డేటా సర్వీసెస్, ఎన్పీసీఐ, వీఎస్ఈజెడ్, గోల్డ్‌మన్ సాష్ వంటి కంపెనీలు ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే దిక్సూచిగా పనిచేస్తు్తన్నాం. కరోనా మహమ్మారి సంక్షోభంలో జీనోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తోంది. జీనోమ్ వ్యాలీతోపాటు, పాలిస్టర్ ఫిల్మ్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. టీ–హబ్, టీఎస్ఐసీ, రిచ్, వి–హబ్ క్షేత్రస్థాయిలో ఇన్నోవేటర్లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు ఊతమివ్వడంలో అనూహ్యంగా పురోగతి సాధిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డ్రోన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి సరికొత్త టెక్నాలజీలో తెలంగాణ ముందంజలో ఉంది. -
వార్షిక నివేదిక: కరోనాపై పోరులో ‘కీ’ రోల్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి యావత్ దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న దశలోనూ తెలంగాణలోని ఔషధ తయారీ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోంది. గత ఏడాది వ్యవధిలో ఎన్నో ఆవిష్కరణలతో నూతన శిఖరాలను అందుకొనే దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్‌కు చెక్ పెట్టే ఔషధాల తయారీలో తెలంగాణలోని ఔషధరంగ పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రెమిడెసివిర్, ఫావిపిరవిర్ వంటి ప్రాణాధార మందులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదించిన ఆర్టీ–పీసీఆర్ కిట్లలో ఒకటి హైదరాబాద్‌లోనే తయారవగా ఇక్కడి పలు కంపెనీలు ఆర్టీ–పీసీఆర్ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియమ్స్, రీ–ఏజెంట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేశాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ విస్తృత కృషి వల్ల పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంగల తొలి కరోనా టీకా తయారైంది. అలాగే బయోలాజికల్–ఈ వంటి ఇతర కంపెనీలు సైతం కరోనా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. కేటీఆర్ గురువారం ఆవిష్కరించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక పురోగతి నివేదిక 2020–21లో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు.. ►హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ.. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రతి ఐదు ప్రముఖ వ్యాక్సి¯Œ తయారీ సంస్థల్లో నాలుగు జీనోమ్ వ్యాలీ కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ►ఔషధ తయారీ రంగంలో 311 కంపెనీలు రూ. 6,734.56 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా వాటి ద్వారా 33,655 మందికి ఉపాధి లభించనుంది. మెడ్‌ట్రానిక్ సంస్థ తమ పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రం విస్తరణకు రూ. 1,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచి్చంది. ►నగరంలోని మెడికల్ డివైసెస్ పార్క్‌లో తమ యూనిట్లు నెలకొల్పేందుకు 19 పరిశ్రమలు రూ. 204 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 2,400 మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి. ►ప్రముఖ జంతువుల పోషకాహార తయారీ కంపెనీ న్యూట్రికో నేతృత్వంలోని ‘ట్రౌవ్ న్యూట్రిషన్ ’జడ్చర్లలో తమ ఉత్పత్తి విభాగాన్ని ఏర్పాటు చేసింది. పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వా రంగ పరిశ్రమలతోపాటు పెంపుడు జంతువులకు అవసరమైన పౌషకాహార పదార్థాలు ఇక్కడ తయారు కానున్నాయి. ట్రౌవ్ న్యూట్రిషన్, స్క్రెట్టింగ్ బ్రాండ్ల పేరుతో దక్షిణాసియా అవసరాలను ఈ పరిశ్రమ తీర్చనుంది. ►హైదరాబాద్ ఫార్మా సిటీలో 50 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ►హైదరాబాద్‌లో రూ.1110 కోట్లతో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ఫియెట్ చె్రస్లర్ ఆటోమోబైల్స్ ప్రకటించింది. ►హైదరాబాద్‌కు చెందిన లక్సై లైఫ్ సైన్సెస్ అనే ఔషధ కంపెనీ రానున్న రెండు మూడేళ్లలో ఆర్ అండ్ డీ, టెక్నాలజీ, ఉత్పాదక సామర్థ్యం పెంపు కోసం రూ. 400 కోట్ల పెట్టబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ►అమెరికాకు చెందిన ‘ఫార్చూన్ 500’కంపెనీ ‘మస్సాచుసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్’ హైదరాబాద్‌లో రూ. 1,000 కోట్లతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీపీసీ)ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 170 ఏళ్ల చరిత్రగల ఈ కంపెనీ అమెరికా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి జీపీసీ ఇదే కావడం విశేషం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వంశీరామ్స్ బీఎస్ఆర్ ఐటీ సెజ్‌లో 1.5 లక్షల చదరపు అడుగుల లీజు స్థలంలో జీపీసీని అభివృద్ధి చేయనుంది. ►రాష్ట్రంలో తమ రెండు ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు రూ. 320 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హిందుస్తా¯Œ సానిటరీ వేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. భువనగిరిలో స్పెషాలిటీ గ్లాస్ తయారీ కోసం తమ సంస్థ నేతృత్వంలోని ‘ఏజీఐ గ్లాస్‌ప్యాక్’పరిశ్రమలో రూ. 220 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. 2022 నాటికి ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.ఇప్పటికే ఈ సంస్థ తెలంగాణలో రూ.1,500–1,600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 15 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో రోజుకు 154 టన్నుల గ్లాసు ఉత్పత్తులు తయారు కానున్నాయి. సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్స్ తయారీ కోసం హిందూస్థా¯Œ కంపెనీ మరో రూ.100 కోట్ల పెట్టబుడులు పెట్టనుంది. ►దేశానికి చెందిన ప్రముఖ పాలిస్టర్ ఫిల్మ్స్, ఇం జనీరింగ్ ప్లాస్టిక్స్, స్పెషాలిటీ పాలిమర్స్ తయారీ కంపెనీ ‘ఈస్టర్ ఫిల్మ్‌టెక్’తెలంగాణలో తమ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు రూ. 1,350కోట్ల పెట్టబడులు పెట్టనుంది. 800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ►హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. ఇక్కడ కోచ్‌లు, లోకోమోటివ్స్, ఇంటర్ సిటీ ట్రైన్ సెట్స్, మెట్రో రైళ్లు, మోనో రైళ్లు తయారు కానున్నాయి. ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీ కలిగి ఉండనుంది. ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 10 కొత్త పారిశ్రామిక పార్కులు.. టీఎస్–ఐఐసీ 2020–21లో రాష్ట్రంలో 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసి రూ. 6,023 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 453 పరిశ్రమలకు 810 ఎకరాలను కేటాయించింది. న్యూ ఎనర్జీ పార్క్ (దివిటిపల్లి), మైక్రో ఇండస్ట్రియల్ పార్క్ (రాయారావుపేట), ఇండస్ట్రియల్ పార్క్ మండపల్లి (సిద్దిపేట), ఇండస్ట్రియల్ పార్క్ (తునికి»ొల్లారం), ఇండస్ట్రియల్ పార్క్ (జిన్నారం), జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ (శివనగర్), ఆగ్రో ప్రాసెసింగ్ పార్క్ (బండమైలారం), ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ (దండుమల్కాపూర్), ఆక్వా హబ్ (సిరిసిల్ల), ఐటీ పార్క్ (ఉస్మాన్‌నగర్)లో ఆయా పార్క్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పరిశ్రమలతో 7,623 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 49 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 34 ఎకరాలను కేటాయించింది. నంబర్ వన్ ఫ్యూచర్ ఏరో స్పేస్ సిటీ ఏరో స్పేస్ రంగంలో ఉత్తమ రాష్ట్ర పురస్కారాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ అందుకుంది. ఎఫ్‌డీఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ఫ్యూచర్ విభాగంలో హైదరాబాద్ నంబర్ వన్ ర్యాంకు సాధించింది. ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, సఫ్రాన్‌లు హైదరాబాద్‌లో కొత్త తయారీ యూనిట్లను ప్రకటించాయి. టీఎస్–ఐపాస్‌తో రూ. 2.14 లక్షల పెట్టుబడులు.. రాష్ట్ర పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’కింద ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 2.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా 7.71 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. -
Andhra Pradesh: సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారనడానికి జీడీపీ గణాంకాలే నిదర్శనమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. 2020–21లో దేశ జీడీపీ (ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా) 2.97 శాతం క్షీణిస్తే మన రాష్ట్రంలో 1.58 శాతం వృద్ధి నమోదైందని గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు. నవరత్నాల పథకాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పారు. 24 నెలల కాలంలో 18 నెలలుగా కోవిడ్‌తో పోరాడుతున్నప్పటికీ పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చడంలో తెలంగాణ, తమిళనాడు కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలే దీనికి నిదర్శనమని, 2019 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రాజెక్టులు వాస్తవ రూపంలోకి వచ్చాయని వివరించారు. 2019లో రూ.34,696 కోట్లు, 2020లో రూ.9,840 కోట్లు, 2021(జనవరి, ఫిబ్రవరి)లో రూ.1,039 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని మేకపాటి తెలిపారు. చేతల ప్రభుత్వం.. గత సర్కారు మాదిరిగా ఒప్పందాలు అంటూ హడావుడి, ప్రచారాలు లేకుండా నేరుగా పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. గోల్డ్ ప్లస్ గ్లాస్ సెంచూరీ ఫ్లై, నీల్ కమల్ లాంటి ఫరి్నచర్ కంపెనీలు, జపాన్‌కు చెందిన భారీ టైర్ల తయారీ సంస్థ ఏటీజీ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటి ద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించిందన్నారు. ఇందులో 65 భారీ, మెగా ప్రాజెక్టులు కాగా 13,885 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. రూ.1,32,784 కోట్ల విలువైన 67 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వీటి ద్వారా 1,56,616 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇవికాకుండా రూ.1,43,906 కోట్ల విలువైన 67 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి కార్యరూపం దాల్చడం ద్వారా 1,56,169 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. దేశ వాణిజ్య ఎగుమతుల్లో 16.8 బిలియన్ డాలర్లతో రాష్ట్రం 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చడం ద్వారా 33.7 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సానుకూల వాతావరణం సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ పెట్టుబడితో, నష్టభయం లేని వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిక్‌డిక్ట్ నిధులతో కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ, వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఈఎంసీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.7,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్లు ఇచ్చామని, ఈ ఏడాది టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీలకు ఆగస్టులో రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పేరుతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం, ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అదానీ పోర్టులో గంగవరం విలీనంపై కమిటీ
సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్ (జీపీఎల్)ను అదానీ పోర్టు సెజ్(ఏపీ సెజ్) లిమిటెడ్‌లో పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఏర్పాటయ్యే ప్రత్యేక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, గత ఒప్పందాలకు నష్టం వాటిల్లకుండా చూసేందుకు వివిధ శాఖలకు చెందిన ఆరుగురు కార్యదర్శులతో సాధికారిక కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కన్వీనర్‌గా ఉంటారు. రెవిన్యూ, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రభుత్వ రంగ శాఖల కార్యదర్శి కేవీ రమణ, న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత కమిటీ సభ్యులుగా ఉంటారు. 60 రోజుల్లోగా కమిటీ నివేదిక.. గంగవరం పోర్టు ప్రమోటర్ డీవీఎస్ రాజు కుటుంబానికి చెందిన 58.1 శాతం, విండి లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 31.5 శాతం షేర్లను ‘ఏపీ సెజ్’ కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాల కోసం జీపీఎల్‌ను పూర్తిగా ఏపీ సెజ్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అంగీకరించింది. గతంలో జీపీఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలు పాటిస్తూ ఆదాయానికి నష్టం లేకుండా కొత్తగా ప్రత్యేక కంపెనీ (ఎస్పీసీ)ని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. గత ఒప్పందాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేవిధంగా సూచనలతో 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కరికాల వలవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సెజ్‌తో కొత్త ఒప్పందం చేసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అందులో తెలిపారు. ఆ అంశాలు ఇవీ.. ► ప్రస్తుతం ఉన్న రాయితీ ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందాల్లో ఎటువంటి మార్పులు లేకుండా చూడాలి ► ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వానికి చెల్లింపులు జరగాలి ► ఈ ప్రాజెక్టుకు చెందిన ఆస్తులకు రక్షణ ఉండాలి ► ఈప్రాజెక్టులో ప్రభుత్వ హక్కులు, ప్రయోజనాలు యధావిధిగా ఉండాలి ► ఒప్పందం ముగిసిన తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి ► ఈ డిజిన్వెస్ట్‌మెంట్, విలీనం, కొత్తగా ప్రత్యేక కంపెనీ ఏర్పాటు లాంటివి నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలి ► దీనిపై ఎస్బీఐ క్యాప్ ప్రతిపాదించిన ప్రభుత్వ వాటా ఉపసంహరణ అంశాన్ని ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కమిటీ పరిశీలించవచ్చు ► అనుభవజ్ఞుల సలహాలు అవసరమైతే కమిటీ తీసుకోవచ్చు. -
ఉపాధి కల్పనకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో భాగంగా భూకేటాయింపులను త్వరితగతిన చేస్తోంది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా వడివడి అడుగులు వేస్తోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేవలం రెండేళ్ల కాలంలోనే 2,068 కంపెనీలకు 2,526.52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 2,050 కంపెనీలు సూక్ష్మ, మధ్యతరగతికి చెందినవే కావటం విశేషం. డీఆర్డీవో, పార్లే ఆగ్రో, ఏటీజీ టైర్స్, ఇంటెలిజెంట్ సెజ్, ఓఎన్జీసీ, ఏఆర్ లైఫ్ సైన్స్, జీఎం మాడ్యులర్, ఆస్ట్రమ్ ఇండస్ట్రీస్, లైఫ్ టైమ్ ఫార్మా వంటి సంస్థలతో పాటు అనేక సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు భూములు కేటాయింపు చేశారు. ఈ యూనిట్ల ద్వారా 1,54,757 మందికి ఉపాధి లభించనుంది. పూర్తి పారదర్శకంగా ఉండేవిధంగా ఆన్లైన్లోనే భూ కేటాయింపులు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (ఏపీఐసీసీ) అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం హయాంలో.. ఐదేళ్ల కాలంలో 2,980 యూనిట్లకు భూ కేటాయింపులు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 2,068 కంపెనీలకు భూములు కేటాయించడం విశేషం. ఇంకా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నాయని, త్వరలోనే మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి జరుగుతోందని ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఐదు జిల్లాల మధ్య పోటీ పెట్టుబడుల ఆకర్షణలో ప్రధానంగా ఐదు జిల్లాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అత్యధికంగా 408 యూనిట్ల ఏర్పాటుతో 35,501 మందికి ఉపాధి కల్పించడం ద్వారా చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. వీటిద్వారా చిత్తూరు జిల్లాలో రూ.3,791.76 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 232 యూనిట్ల ఏర్పాటుతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉండగా.. ఇక్కడ రూ.9,321.37 కోట్ల పెట్టుబడి రానుంది. తద్వారా 33,154 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కృష్ణా జిల్లాలో 267, ప్రకాశం జిల్లాలో 254, తూర్పు గోదావరి జిల్లాలో 223 యూనిట్లకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. -
రాష్ట్రానికి రెండేళ్లలో పెట్టుబడులు రూ.33,323.2 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. గడచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి రూ.33,323.2 కోట్ల విలువైన నూతన పెట్టుబడులు వచ్చినట్టు సర్వే లెక్క గట్టింది. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద, మెగా, ఎంఎస్ఎంఈ రంగాల్లో మొత్తం 13,789 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 1,41,276 మందికి ఉపాధి లభించినట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం 2020–23, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం, సింగిల్ విండో క్లియరెన్స్ కోసం ‘వైఎస్సార్ ఏపీ వన్’ వంటివిధానాలు అమలు చేయడం వంటి పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడినట్టు తేలింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, విశాఖ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 60 భారీ కంపెనీల ఏర్పాటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 60కి పైగా భారీ, అతి భారీ యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.28,188.75 కోట్ల విలువైన పెట్టుబడులు రాగా.. 29,531 మందికి ఉపాధి లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.12,041 కోట్లు, చిత్తూరు జిల్లా రూ.11,194.72 కోట్లు, విశాఖ జిల్లా రూ.2,461.19 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. చిన్న పరిశ్రమల్లో భారీ ఉపాధి ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ రంగానిదే అగ్రస్థానమని మరోసారి నిరూపణ అయ్యింది. రెండేళ్లలో రాష్ట్రంలో ఈ రంగం ద్వారా 1,11,745 మందికి ఉపాధి లభించింది. 2019–20, 2020–21 కాలంలో రాష్ట్రంలో మొత్తం 13,729 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు రాగా.. వీటిద్వారా రూ.5,134.45 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 1,596 యూనిట్ల ఏర్పాటుతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 16,377 మందికి ఉపాధి కల్పించడం ద్వారా ప్రకాశం జిల్లా ముందంజలో ఉంది. వైఎస్సార్ నవోదయం కింద ఆర్థికంగా కష్టాల్లో ఉన్న యూనిట్లు పునరుద్ధరించడానికి చేయూతనివ్వడం, రీస్టార్ట్ ప్యాకేజీ కింద కోవిడ్ సమయంలో రాయితీ బకాయిల చెల్లింపు, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లుల మాఫీతో ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి కారణమైందని ఆర్థిక సర్వే పేర్కొంది. -
నైపుణ్యాభివృద్ధిరస్తు.. ఉపాధి మస్తు
సాక్షి, అమరావతి: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ‘మీకు ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలో చెప్పండి. మేమే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని సమకూరుస్తాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ వివిధ కంపెనీలకు ఆహ్వానం పలికారు. స్థానిక యువతకు పారిశ్రామిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. వారిని మెరికల్లా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచన మంచి సత్ఫలితాలిస్తోంది. 7 నెలల కాలంలోనే 4,413 మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉపాధి పొందడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా.. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా వివిధ సంస్థలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని పరిశ్రమల శాఖ గుర్తించగా.. దానికి అనుగుణంగా ఏపీ ఎస్ఎస్డీసీ కోర్సులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ పోగ్రాం (ఐసీఎస్‌టీపీ)ను ఏపీ ఎస్ఎస్డీసీ నిర్వహిస్తోంది. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో వారికి కావాల్సిన కోర్సులకు అనుగుణంగా ఐసీఎస్‌టీపీ నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఐసీఎస్‌టీపీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 276 కంపెనీలు ముందుకు రాగా.. అందులో ఇప్పటికే 156 కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణ తరగతుల ద్వారా యువతకు అందించి ఉపాధి కల్పించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వివరించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధంగా మొత్తం 4,413 మందికి శిక్షణ ఇవ్వగా.. కోర్సు పూర్తి చేసిన వెంటనే వారందరికీ ఆయా సంస్థలు నేరుగా ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. వివిధ సంస్థలకు ఇలా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాంగ్నిజెట్, కియా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, రాంకీ ఫార్మా, నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి అవసరమైన కోర్సుల్లో ఏపీఎస్ఎస్డీసీ యువతకు శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు, ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ట్రైనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఎనలిస్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా కోర్సులు పూర్తి చేసి ఉపాధి పొందిన వారికి ప్రారంభ వార్షిక వేతనం కనిష్టంగా రూ.2 లక్షల వరకు ఉంటోందని ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పేర్కొన్నారు. -
పరిశ్రమలు నడపడానికి ఓకే
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కట్టడి కోసం రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ విధించినప్పటికీ తయారీ రంగ పరిశ్రమలు కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఉదయం వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సూచనలకు అనుగుణంగా రెండు వారాల కర్ఫ్యూ సమయంలో పరిశ్రమల్లో అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తూ కోవిడ్ ప్రొటోకాల్‌ను జారీ చేశారు. నిబంధనలు ఇవీ.. ► పరిశ్రమలన్నీ వాటి అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడానికి షిఫ్టుల వారీగా పనిచేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు సింగిల్ షిఫ్ట్‌లో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించవచ్చు. ► జాతీయ నిర్మాణ, పైప్‌లైన్ పనులు యథావిధిగా కొనసాగించవచ్చు. ఐటీ, ఐటీ ఆథారిత కంపెనీలు, డేటా సెంటర్లకు అనుమతి. ► ఈ–కామర్స్ ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి అనుమతి. ► కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు సొంతగానే సర్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ► కర్ఫ్యూ తర్వాత కూడా పనిచేసే సిబ్బంది ప్రయాణానికి ఆధార్, ఉద్యోగి నంబర్ ఆధారంగా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ► కంపెనీలే ఉద్యోగులకు అనుమతి పత్రాలు మంజూరు చేసి అవి స్థానిక అధికారులకు అందచేయాలి. ► తగిన అనుమతి పత్రాలతో కంటైనర్లు, సరకు రవాణా వాహనాల ప్రయాణానికి అనుమతి. ► పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు. -
ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
సాక్షి, అమరావతి: రైతులకు అధిక ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్(ఆహార శుద్ధి పరిశ్రమ) యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. సుమారు రూ.2,900 కోట్ల పెట్టుబడి అంచనాతో ప్రతి పార్లమెంటు పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంక్యుబేషన్ సెంటర్, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు పెట్టనుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కన్సల్టెన్సీగా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌ను నియమిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక, మౌలిక వసతుల కల్పన, డీపీఆర్ తయారీ, బిడ్లు పిలవడం, కంపెనీలను ఎంపిక చేయడం, రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం తదితర కార్యకలాపాలను ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రా’ నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సేవలకు గానూ ఫీజు చెల్లించనున్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేలా.. ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేసే ఈ యూనిట్లను నిర్వహించే కంపెనీ.. ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి లీజు రూపంలో అద్దె చెల్లిస్తుంది. వీటికి అవసరమైన ముడి సరుకును నేరుగా రైతుల నుంచి సేకరించి రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ల ద్వారా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, డైరీ, ఆక్వా, ఇతర వ్యవసాయ పంట ఉత్పత్తులు వృథా కాకుండా.. వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పంటలను సకాలంలో పూర్తిగా విక్రయించుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కంపెనీ ఎంపిక వంటి పూర్తిస్థాయి సేవలను ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రా’ అందిస్తుందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పల్లెల నుంచి పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఔత్సాహికులను గుర్తించే పనిని రాష్ట్ర పరిశ్రమల శాఖ చేపట్టింది. ఇందుకోసం ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 2, 3 మండలాలకు కలిపి రెండుసార్లు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 320 సదస్సులు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార రంగంలోకి దిగాలనుకునే 100 మంది ఔత్సాహికులను గుర్తించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలపై వారికి అవగాహన కలి్పస్తామని వివరించారు. ఇలా వచ్చిన వారిలో మండలానికి కనీసం ఒక ఐదు మందిని ఎంపిక చేసి.. ఇన్వెస్ట్మెంట్ మోటివేషన్ క్యాంపెయిన్(ఐఎంసీ) పేరుతో మూడు రోజుల పాటు పెట్టుబడి వ్యయం, ఫైనాన్సింగ్, భూమి కొనుగోళ్ల తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందజేస్తామని వెల్లడించారు. అవకాశాలు మెండు.. రాష్ట్రంలో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్, రసాయనాలు వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక భారీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పెద్ద సంస్థల ద్వారా అనేక ఎంఎస్ఎంఈలకు అవకాశాలేర్పడుతాయి. అలాగే ఒక జిల్లా–ఒక ఉత్పత్తి పేరిట కేంద్రం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి ద్వారా కూడా స్థానిక ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే అవకాశాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించనున్నారు. అలాగే పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి సొంతంగా యూనిట్లు పెట్టుకునే వారిని గుర్తించి.. వారికి కూడా అవగాహన సదస్సులు నిర్వహించేలా పరిశ్రమల శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది. రెండేళ్లలో 3,000 మంది పారిశ్రామికవేత్తలు.. కొత్త ఆర్ధిక సంవత్సరం రాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మూడు నెలల్లో సదస్సులు పూర్తి చేసి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వీరికి శిక్షణ పూర్తి చేసి ఏపీఐఐసీ, బ్యాంకుల నుంచి రుణాలిప్పించి రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభింపజేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విధంగా కనీసం 3,000 మంది కొత్త పారిశ్రామికవేత్తలను పరిచయం చేసినట్లవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. -
ఇక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్ కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్ డి్రస్టిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు స్థానికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. హస్తకళలు, చేనేత, ఆహారం, వ్యవసాయం, ఖనిజాలు, బొమ్మల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఓడీఓపీ సెల్ నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను విక్రయించడం ద్వారా బ్రాండ్ ఏపీ పేరు ఇనుమడించే విధంగా చేయడం కోసం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ముడి పదార్థం ఎంపిక దగ్గర నుంచి తుది ఉత్పత్తి విక్రయించే వరకు ఉత్పత్తిదారులకు సహకరించేలా అన్ని మౌలిక వసతులు, ప్రత్యేక క్లస్టర్లు, ఉమ్మడి సౌకర్యాల వేదికలను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సిడ్బీ, స్ఫూర్తి వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. కేంద్రం సహకారాన్ని కోరాం వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 స్థానిక ఉత్పత్తులను ఎంపిక చేశాం. ఈ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని ఇప్పటికే కోరాం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదావన్లతో ఈమేరకు మాట్లాడాము. – గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి ఆన్లైన్ మార్కెట్‌పై దృష్టి బ్రాండ్ ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త రకాలను రూపొందించే విధంగా నిఫ్ట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. సంస్థలకు ఆరి్థక సహకారం అందించడానికి సిబ్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. చూడగానే ఆకర్షించేలా ఉత్పత్తులను తీర్చిదిద్దడానికి ప్యాకేజింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 17న హోటల్ తాజ్ ప్యాలస్‌లో నిర్వహించే 11వ ఇండియా కెమ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. 100కు పైగా దేశాల నుంచి 7,000 మందికిపైగా వ్యాపారసంస్థల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు మంత్రి మేకపాటి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రణాళికలను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌తో పాటు కృష్ణపట్నం నోడ్‌లో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. పెట్రో కెమికల్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 17న మధ్యాహ్నం నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ ఆధ్వర్యంలో ఐటీసీ మౌర్యా హోటల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సులో కూడా మంత్రి మేకపాటి పాల్గొంటారు. 18, 19 తేదీలలో మంత్రి మేకపాటి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. -
విశాఖలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.350 కోట్లతో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఎంఎస్ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్పెయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్ఎంఈలే వెన్నెముక అని పేర్కొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ టెర్మినళ్ల ఏర్పాటు దిశగా ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వనున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్ మ్యాన్‌పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని మంత్రి వివరించారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచాం కోవిడ్–19 సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచామని మంత్రి మేకపాటి చెప్పారు. కరోనా లాక్డౌన్ వల్ల ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంగా కృషి చేశామన్నారు. 11,238 యూనిట్లకు రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించామని చెప్పారు. లాక్డౌన్లో పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను రద్దు చేశామన్నారు. మూడేళ్లలో తిరిగి చెల్లించుకునేలా తక్కువ వడ్డీకి ఎంఎస్ఎంఈలకు రుణాలిచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. ‘వైఎస్సార్ నవోదయం’ పథకం ద్వారా వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్ విధానంలో ఒకేసారి లక్షకుపైగా యూనిట్లకు రూ.2,807 కోట్ల విలువైన రుణాలను అందించి ఎంఎస్ఎంఈల్లో జవసత్వం నింపామని తెలిపారు. సరసమైన ధరకే ఎంఎస్ఎంఈలకు భూమిని అందించి రాష్ట్రవ్యాప్తంగా 31 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఎంఎస్ఎంఈ సీఈవో పవనమూర్తి తదితరులు ఏపీ తరఫున పాల్గొన్నారు. -
పొరుగు రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా ఏపీ మెరుగు
సాక్షి, అమరావతి: వెళ్లిపోతున్నాయ్.. తరలి వెళ్తున్నాయ్...! అంటూ రాష్ట్రంలోని పరిశ్రమలపై దుష్ప్రచారం చేసిన ప్రతీసారి నిజమేంటో, ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూనే ఉన్నారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, ఛానళ్లలో అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు వెలువరిస్తుండటం పట్ల మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. ఆ వివరాలివీ.. కియా మరిన్ని పెట్టుబడులు... కియా కార్ల పరిశ్రమ వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చాక ఏకంగా రూ.400 కోట్లతో మరింత విస్తరిస్తామని కియా ప్రకటించింది. ’మన పాలన మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా మే 28న పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన మేధోమథన సదస్సులో కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అదానీ డేటా సెంటర్ వెళ్లిపోతోందనే అసత్య ప్రచారానికి తెరతీశారు. కానీ అదానీ గ్రూప్ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెడతామని, దాదాపు 25 వేల మందికి ఉపాధి అందించనున్నట్లు ఆ సంస్థే వెల్లడించింది. డేటా సెంటర్ మాత్రమే కాదు ఐటీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ లాంటివి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరంలో వార్బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్ మెంట్ నుంచి రూ.1,954 కోట్లతో పోర్టులో 31.5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూప్ స్వయంగా ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలో మరో పోర్ట్ కృష్ణపట్నాన్ని రూ.12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తి ఆపేసిందని ఊదరగొట్టారు. విజయవాడలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కు సమీపంలో నెలకొల్పిన ఈ ప్లాంటు కరోనా సమయంలో కూడా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించింది. తాజాగా ఉత్పత్తీ ప్రారంభించింది. ముందంజలో ఏపీ గత రెండేళ్లలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కన్నా పెట్టుబడులు, స్థాపన, ఉత్పత్తి ప్రారంభించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రతి నెలా విడుదల చేసే గణాంకాలే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన ప్రతిపాదనలు 2019లో రూ.18,823 కోట్ల వరకు ఉండగా తమిళనాడు, తెలంగాణ గణాంకాలు పరిశీలిస్తే వరుసగా రూ.8,562 కోట్లు, రూ.5,432 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ఆ రాష్ట్రాలకు వచ్చాయి. 2020లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రతిపాదనలు రూ.9,727 కోట్లు కాగా తమిళనాడులో రూ.6,807 కోట్లు, తెలంగాణలో రూ.7,392 కోట్లు ఉన్నాయి. కష్టకాలంలో పరిశ్రమలకు అండగా ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సమయంలోనూ ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల వివరాలు పరిశీలిస్తే 2020లో రూ.9,840 కోట్ల పెట్టుబడులున్నాయి. అదే తెలంగాణలో రూ.6,057 కోట్లు, తమిళనాడులో కేవలం రూ.1,184 కోట్లు మాత్రమే ఉన్నాయి. 2019లో ఏపీలో పరిశ్రమలు రూ.34,696 కోట్ల విలువైన ఉత్పత్తిని ప్రారంభించాయి. తమిళనాడులో రూ.2,860 కోట్లు, తెలంగాణలో రూ.7,364 కోట్ల విలువైన ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ వివరాలన్నీ గత సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకూ డీపీఐఐటీ, ఐఈఎమ్‌లలో అధికారికంగా పొందుపరిచారు. కరోనా సమయంలో పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిన తీరును యావత్ దేశం ప్రశంసించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక సంస్కరణలను చూసి పొరుగు రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందుతున్నాయనడంలో సందేహం లేదు. -
పరిశ్రమలకు పుష్కలంగా నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు తగినంత నీరు అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునే సమయానికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసం సుమారు రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ఏపీ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విశాఖ నగర వాసులతో పాటు అక్కడి పరిశ్రమలకు నీటిని అందించడానికి జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో) సేవలను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా, మరికొన్నింటికి 2022లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని ఏపీఐఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ పారిశ్రామిక పార్కుకు ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలి.. అందుకు అయ్యే వ్యయం ఎంత.. అన్నది లెక్క తెల్చారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు సోమశిల నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా.. కృష్ణపట్నం, నాయుడుపేట, చిత్తూరు జిల్లాలోని పార్కులకు కండలేరు నుంచి.. విశాఖకు గోదావరి జలాలను.. అనంతపురానికి హంద్రీ–నీవా నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని వినియోగంచుకునే విధంగా కృష్ణపట్నం వద్ద పైలెట్ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చౌకగా నీటిని అందిస్తాం రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని కంపెనీలకు నీటిని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా నీటిని పుష్కలంగా అందిస్తే కిలో లీటరుకు ఎంత ధరైనా చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చౌకగా నీటిని అందించే విధంగా ఏపీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. – కే.రవీన్ కుమార్ రెడ్డి, వీసీ, ఎండీ, ఏపీఐఐసీ -
ఏపీకి రూ.1,975 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అక్టోబరు 2019 నుంచి డిసెంబరు 2020 మధ్య పదిహేను నెలల కాలానికి రూ.1,975 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం రూ. 5,54,613.65 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఈ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్డీఐలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే, రూ.78,159 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో.. రూ.59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.11,331.61 కోట్ల మేర ఎఫ్‌డీఐలతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఎఫ్‌డీఐల్లో 2.4 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రూ.1,975 కోట్ల ఎఫ్‌డీఐలతో 12వ స్థానంలో నిలిచింది. ఐటీ రంగం విస్తరించిన హైదరాబాద్.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వెళ్లిపోవడంతో ఎఫ్‌డీఐల రాక కూడా అక్కడే కేంద్రీకృతమై ఉన్నట్లు అవగతమవుతోంది. మారిషస్ నుంచే అత్యధికం కాగా, గడిచిన 20 ఏళ్లలో 2000 ఏప్రిల్ నుంచి డిసెంబరు 2020 వరకు దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో 28 శాతం మారిషస్ నుంచే ఉన్నాయి. తదుపరి 22 శాతం సింగపూర్ నుంచి వచ్చాయి. అమెరికా నుంచి 8 శాతం, నెదర్లాండ్స్ నుంచి 7 శాతం, జపాన్ నుంచి 7 శాతం, యూకే నుంచి 6 శాతం ఉన్నాయి. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో సింగపూర్, యూఎస్ఏ, కేమన్ ఐలాండ్స్, యూఏఈల నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు సింగపూర్ నుంచి రూ.1,16,812 కోట్లు, యూఎస్ఏ నుంచి రూ. 95,246 కోట్లు, యూఏఈ నుంచి రూ. 29,149 కోట్లు, కేమన్ ఐలాండ్స్ నుంచి రూ. 18,842 కోట్లు వచ్చాయి. సేవ, సాఫ్ట్వేర్ రంగాల్లోనే అత్యధికం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్–ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్, పరిశోధన–అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్ అండ్ అనాలసిస్ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్‌డీఐలు రాగా, కంప్యూటర్స్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి ఏకంగా> రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలికమ్యునికేషన్లు (7 శాతం), ట్రేడింగ్ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ (5 శాతం), మౌలిక వసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మాస్యూటికల్స్ (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి. -
పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, ఇందులో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతర్జాతీయ మల్టీలేటరల్ బ్యాంకులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే విశాఖ–చెన్నై కారిడార్ అభివృద్ధికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సాయమందిస్తోందన్నారు. ‘భారీ నిధులతో వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై అంతర్జాతీయ మల్టీలేటరల్ బ్యాంకులతో కలిసి ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సులో మంత్రి మేకపాటి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని బ్యాంకులు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను.. మండల కేంద్రాలకు అనుసంధానించే విధంగా ప్రభుత్వం భారీప్రణాళికను సిద్ధం చేసిందని, ఇప్పటికే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటోందన్నారు. రూ.16 వేల కోట్లతో విశాఖలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లతోపాటు తయారీ, సేవా రంగాల్లో అపార అవకాశాలున్నాయని.. వాటిపై సంస్థలు, బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్ వంటి సమయంలోనూ ఎంఎస్ఎంఈల నాలుగేళ్ల బకాయిలు రూ.1,100 కోట్లను తీర్చామన్నారు. ఈ స్ఫూర్తితో వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మల్టీలేటరల్ బ్యాంకుల ప్రతినిధులతో వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఫ్యాప్సీ అధ్యక్షులు అచ్యుతరావు, ఫాప్కి సీఈవో ఖ్యాతి నరవనే, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అనుకూలం.. పెట్టుబడులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన తీర ప్రాంతముందని.. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021లో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రహదారులు, రైళ్లు, పోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరుకు రవాణా వ్యయం తగ్గించేందుకు.. ఏపీలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు అవసరమైన సహజసిద్ధమైన వనరులన్నీ ఏపీలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రూజ్ టూరిజం ద్వారా ఈ రేవులను అనుసంధానం చేస్తామన్నారు. సదస్సులో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహనరావు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లెదర్ పార్కులో రూ.1,347 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేస్తున్న మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టడానికి 440 సంస్థలు ముందుకొచ్చాయి. సుమారు రూ.1,347 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 18,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 13,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయని కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల ‘సాక్షి’కి తెలిపారు. 537 ఎకరాల్లో రూ.281 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో యూనిట్లు నెలకొల్పడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి జనవరి 31 వరకు బిడ్లను ఆహ్వానించగా 440 సంస్థలు తమ ప్రతిపాదనలు పంపాయని, ఇందులో 257 యూనిట్లు ఎస్సీ వర్గాల నుంచే వచ్చాయని చెప్పారు. ‘మూడు నుంచి 15 ఎకరాల్లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి 51 సంస్థలు ప్రతిపాదనలు పంపగా, 339 సంస్థలు సూక్ష్మ, చిన్న యూనిట్లు నెలకొల్పడానికి ప్రతిపాదనలు పంపాయి. వియత్నాం, తైవాన్‌తో పాటు ఇప్పటికే చెన్నై, ఆగ్రాల్లో యూనిట్లు ఉన్న సంస్థలు కూడా కృష్ణపట్నం లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం కోసం పరిశ్రమల శాఖకు పంపాము’ అని రత్నాకర్ వివరించారు. కాగా, లెదర్ పార్కు వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న స్థానికుల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, లెదర్‌పార్క్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే విధంగా స్థానికులతో కలిసి స్టడీ టూర్ నిర్వహించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. తమిళనాడులోని రాణిపేట, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా లెదర్ పార్కుల ద్వారా స్థానికులు ఎలా లబ్ధి పొందుతున్నారో ఈ స్టడీటూర్‌లో వివరించనున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వీరిని స్టడీ టూర్‌కు తీసుకెళ్తామని, యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో 5.5 కిలోమీటర్ల లోపలకు తీసుకెళ్లి వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రత్నాకర్ వివరించారు. -
వైఎస్సార్ జిల్లాకు రూ.35,090 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలో 4,025.68 ఎకరాల్లో నాలుగు భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.35,090 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే ఈ కీలక ప్రాజెక్టుల పనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా పరిశ్రమల శాఖ కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల వల్ల 3.54 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ), వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ హబ్ (ఎంఐహెచ్), పులివెందులలో ఇంటిలిజెంట్ సెజ్ పాదరక్షల తయారీ కేంద్రం, పులివెందుల ఆటోనగర్ పార్కులకు డిసెంబర్ 24న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రోజు కంపెనీల నిర్మాణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పది కీలక కంపెనీలతో చర్చలు పూర్తి చేసి, పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 3,164 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ సేకరించిన 6,914 ఎకరాల్లో 3,164.46 ఎకరాలను వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ► ఇప్పటికే ఎంఐహెచ్ ముఖ ద్వారంతో పాటు ఇతర మౌలక వసతుల కల్పనకు సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిత్తి ఇంజనీరింగ్ లిమిటెడ్, నీల్కమల్, ట్రియోవిజన్, సెంచురీ ప్లై, రొటోమాక్, ఫార్మా కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ► కొప్పర్తిలో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 540 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నారు. రెడీటూ వర్క్ విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో 34 షెడ్లు నిర్మిస్తారు. ► ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్లస్టర్ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. డిక్సన్ టెక్నాలజీస్, టెక్‌చరన్ బ్యాటరీస్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ► అపాచీ పాదరక్షల తయారీ సంస్థ శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఏర్పాటు చేసే ఇంటిలిజెంట్ సెజ్ యూనిట్‌కు అదనంగా పులివెందులలో 28 ఎకరాల్లో రూ.70 కోట్లతో కాంపోనెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ► పులివెందులలో ఏపీఐఐసీ 32.22 ఎకరాల్లో ఆటోనగర్ పార్కును అభివృద్ధి చేస్తోంది. సూక్ష్మ, మధ్య తరగతి సంస్థలను ఆకర్షించే విధంగా 281 ప్లాంట్లు అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా రూ.20 కోట్ల పెట్టుబడితో పాటు 2 వేల మందికి పత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. -
ప్రాజెక్ట్ రిపోర్ట్ మొదలు .. మార్కెటింగ్ వరకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎటువంటి నష్టభయం అనేది లేకుండా పూర్తిస్థాయి చేయూత (హ్యాండ్ హోల్డింగ్) అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ప్రతిపాదించిన ‘వైఎస్సార్ ఏపీ వన్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ ఏపీ వన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల పెట్టుబడి కేంద్రాల్లో (ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్) ఏపీ వన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పెట్టుబడి ఆలోచనతో వచ్చిన వ్యక్తికి ప్రాజెక్టు రిపోర్ట్ దగ్గర నుంచి యూనిట్ ప్రారంభించి తయారు చేసిన వస్తువుల (ప్రొడక్ట్) మార్కెటింగ్ వరకు పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పరిశ్రమల అధికారులకు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొత్తం 11 జిల్లాలలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించగా, ఈ నెల 26న ఏలూరులో తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల అధికారులకు నిర్వహించే తరగతులతో ఈ శిక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి. కారిడార్ల నుంచి కేంద్ర రాయితీల వరకు .. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు, ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న ప్రోత్సాహకాలపై అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. 1978లో జిల్లా పెట్టుబడి కేంద్రాల విధానం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమమని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తయారు చేసే ఉత్పత్తులను ఏయే దేశాలకు ఎగుమతి చేయవచ్చు, అలాగే రాష్ట్ర అవసరాలకు కావాల్సిన ముడి వస్తువులను ఏయే దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు వంటి విషయాలపై కూడా అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
ఏపీలో ‘లంబోర్గిని’
సాక్షి, అమరావతి: ప్రఖ్యాత స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ లంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల (బ్యాటరీతో నడిచే కార్లు) తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్ గ్రీన్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్ గ్రీన్ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ సంస్థ పోర్టు ఆధారిత సెజ్ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. లంబోర్గిని వాహనాలతో పాటు కైనటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల 2,30,00,000 మెట్రిక్ టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ఇది 147.34 కోట్ల చెట్లను పెంచడానికి సమానమని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. భారీ మెగా ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది. -
వేగంగా సమగ్ర పారిశ్రామిక సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు, ఇతర అవసరాలు తెలుసుకునేందుకు చేపట్టిన ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే–2020 వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,948 యూనిట్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే 9,010 యూనిట్లకు సంబంధించి సర్వే పూర్తయింది. సర్వేలో కృష్ణా, అనంతపురం జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,254, అనంతలో 1,183 యూనిట్లలో సర్వే పూర్తయింది. సర్వే సందర్భంగా ప్రతి పరిశ్రమకూ ఆధార్ నంబర్లా 11 అంకెలతో ఓ ప్రత్యేక అంకెను కేటాయించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు సంబంధించిన తొమ్మిది రకాల కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికే సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కరోనా, వరదల కారణంగా కొన్ని చోట్ల సర్వే ఆలస్యమవుతోంది. అవసరమైతే గడువు తేదీని పెంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
నైపుణ్యమే యువత భవితకు ఆయుధం
సాక్షి, అమరావతి: నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ► కీలక సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి పరిస్థితులు దోహదమవుతాయి. మంచి నైపుణ్యం కలిగిన యువతను రాష్ట్రానికి, దేశానికి అందించడానికి ప్రభుత్వం 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. ► స్థానిక యువతకు కంపెనీలు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకువచ్చాం. ► ఒప్పందం ప్రకారం టెక్ మహీంద్ర ఫౌండేషన్ విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ► బయోకాన్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ డొమైన్లో నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ► స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
301 సంస్కరణలను అమలు చేయండి
సాక్షి, అమరావతి: ప్రస్తుత సంవత్సరం సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) సూచించింది. 2020–21 ర్యాంకుల కోసం 15 విభాగాల్లో ఈ సంస్కరణలను నవంబర్‌లోగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ► 2019 సంవత్సరానికి గాను 187 సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల కావడంతో వీటి అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ శ్రీకారం చుట్టింది. ► వీటి ప్రకారం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉండగా, మరికొన్నింటి కోసం ప్రత్యేక అప్లికేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ► సంస్కరణల అమలుకు రెండున్నర నెలలే సమయం ఉండటంతో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించి కొత్త మార్గదర్శకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టింది. ► ఈ సంస్కరణలను అమలు చేశాక వీటి ప్రయోజనం పొందిన వారి నంబర్లు తీసుకుని సర్వే నిర్వహించడం ద్వారా ర్యాంకులను నిర్థారిస్తారు. అయితే సర్వేకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. ► ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్ లైసెన్స్, హెల్త్ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ► సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ దరఖాస్తు నమోదు దగ్గర్నుంచి రుసుంల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. -
ఆంధ్రప్రదేశ్ నంబర్ 1
సాక్షి, అమరావతి : విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 2019 సంవత్సరానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 10 స్థానాలు ఎగబాకి రెండవ స్థానంలోకి రాగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది. శనివారం న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవోడీబీ–2019 ర్యాంకులను విడుదల చేశారు. ► తొలిసారిగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తీసుకొని ప్రకటించడం ఈ ర్యాంకుల ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేసినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే దాని ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఈ సంస్కరణలు అమలు అవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి ర్యాండమ్‌గా డీపీఐఐటీ, ప్రపంచ బ్యాంకు సర్వే చేసి ఈ ర్యాంకులు ప్రకటించాయి. ► కోవిడ్–19 వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కింది. సమస్యల పరిష్కారానికి ఔట్ రీచ్ ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ఈ సంస్కరణల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ► పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ –2019 నుంచి జనవరి 2020 మధ్య హిందూపురం, విశాఖ, విజయవాడ పట్టణాల్లో ఔట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరుగా 8,000 మంది పారిశ్రామిక వేత్తలను కలిసి వారి సమస్యలను పరిష్కరించింది. ► వాణిజ్య వివాదాలను త్వరతగతిన పరిష్కరించడానికి విశాఖ, విజయవాడల్లో ప్రత్యేక వాణిజ్య కోర్టులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2015 సింగిల్ డెస్క్ పాలసీని పూర్తిగా సవరించడంతో పాటు, పరిశ్రమలకు భూ కేటాయింపులను సింగిల్ డెస్క్ ద్వారా నిర్ధిష్ట కాలపరిమితిలో ఇచ్చే విధంగా నిబంధనలు తీసుకువచ్చింది. ► ఆన్లైన్ ద్వారా ఔషధాల అమ్మకాల లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ 1988 చట్ట ప్రకారం రెన్యువల్ చేసుకునే విధానం నుంచి అన్ని షాపులకు మినహాయింపు ఇవ్వడం, కార్మిక చట్టాలు, బాయిలర్ చట్టాల్లో పలు సంస్కరణలు తీసుకు వచ్చింది. సీఎం జగన్‌పై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలనపై పారిశ్రామికవేత్తల నమ్మకానికి ఈ ర్యాంకులే నిదర్శనం. తొలిసారి సర్వే ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో మొదటి స్థానం సాధించడం పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సలభతర వాణిజ్యం కోసం పారిశ్రామిక సంస్కరణల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కోవిడ్–19 సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంపై మరింత నమ్మకం పెరిగింది. – మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సంస్కరణలను పాటించడం వల్లే.. ఈ ఏడాది సులభరత వాణిజ్యం కోసం ప్రవేశపెట్టిన 187 సంస్కరణలను కచ్చితంగా పాటించాము. ప్రతి సంస్కరణ అమలు తీరుపై కనీసం 100 మంది పారిశ్రామికవేత్తల అభిప్రాయలు తెలుసుకున్నాకే ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ సర్వే నిర్వహించారు. కనీసం 70 శాతం మంది అనుకూలంగా చెప్పకపోతే ఒక్క పాయింటు కూడా రాదు. అలాంటింది మొదటి ర్యాంకు వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను ఏ విధంగా అమలు చేసిందో ఇట్టే తెలుస్తోంది. – జవ్వాది సుబ్రమణ్యం, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
కోపర్తిలో ‘వైఎస్సార్ ఈఎంసీ’
సాక్షి, అమరావతి: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా కోపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)’ని ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 ఎకరాల్లో ఈ క్లస్టర్ ఏర్పాటుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎంసీ–2 విధానం కింద ఎలక్ట్రానిక్ తయారీదారులను ఆకర్షించేందుకు రూ.730.50 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడమే కాకుండా రూ.380.50 కోట్లు గ్రాంట్‌గా సమకూర్చనుంది. మిగిలిన రూ.350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, టెలికాం నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, ఈ మొబిలిటీ ఉత్పత్తుల తయారీకి చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీఐఐసీ ఈ ఈఎంసీని అభివృద్ధి చేయనుంది. ఈ క్లస్టర్ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తైవాన్ కంపెనీలు ఆసక్తి కోవిడ్–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు భారత్‌లో తయారీ రంగ యూనిట్లు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన రెండు మొబైల్ తయారీ కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. యాపిల్ ఫోన్ తయారుచేసే తైవాన్ సంస్థ పెగాట్రాన్ కూడా కోపర్తిలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. అలాగే యాపిల్, రెడ్మీ వంటి ఫోన్లను తయారుచేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్ల ఏర్పాటును పరిశీలిస్తోంది. ఇందులో ఒక యూనిట్‌ను కోపర్తి ఈఎంసీలో ఏర్పాటుచేయాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. వీటితో పాటు పలు దేశీయ కంపెనీలు కూడా తమ యూనిట్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి వ్యక్తంచేస్తున్నాయి. ఈఎంసీలో యూనిట్లకు అనేక రాయితీలు కోపర్తి వైఎస్సార్ ఈఎంసీలో ఏర్పాటుచేసే యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పలు రాయితీలు అందించనుంది. విదేశీ సంస్థలతో పాటు దేశీయ సంస్థలను ఆకర్షించేందుకు ప్రత్యేక రాయితీలిచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తరుల్లో పేర్కొంది. అవి.. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లకు ఒకేచోట అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు, తక్కువ ధరకే భూమిని లీజుకు ఇవ్వనున్నారు. కంపెనీలు వారికి నచ్చినట్లుగా తక్షణం ఫ్యాక్టరీ నెలకొల్పుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. యూనిట్లకు భూమిని తొలుత 33 ఏళ్లకు లీజుకిచ్చి దాన్ని 99 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. కార్యకలాపాలు ప్రారంభించి విజయవంతంగా పదేళ్లు పూర్తిచేసుకున్న తర్వాత భూమిని పూర్తిగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.4–4.5లకే యూనిట్ విద్యుత్, 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, ఎనిమిదేళ్లపాటు ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు, లాజిస్టిక్ సపోర్టు కింద ఐదేళ్లపాటు దేశీయ రవాణాలో ఏడాదికి రూ.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తారు. రూ.250 కోట్ల పెట్టుబడితో కనీసం 2,000 మందికి ఉపాధి కల్పించిన సంస్థకే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఐపీఎస్ పాలసీ కింద ఇచ్చే మెగా స్టేటస్‌ను కూడా ఇవ్వనున్నారు. ఈ పాలసీ కింద ఈఎంసీని అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించే బాధ్యతను ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి కోవిడ్–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు భారత్‌లో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని ఆకర్షించడానికి కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు భారత్‌లో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకువచ్చేలా ఆయా కంపెనీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి -
పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020–23కు రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా ఆవిష్కరించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంలో ప్రధానాంశాలు.. ► వెనుకబడిన వర్గాల మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. ► ఇప్పటికే బాగా విస్తరించిన ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతోపాటు 10 కొత్త రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి. ► బొమ్మల తయారీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్–లెదర్, మెషినరీ, ఎయిరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు. ► పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ అందించేలా చర్యలు. అనేక రాయితీలు.. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు. ► కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికవేత్తలకు సగం ధరకే భూమి, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు. ► సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపుతోపాటు వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ, నాలా చార్జీలో కొంత మినహాయింపు. ► 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు 100%, వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75%, 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ మినహాయింపు. ► మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకనుగుణంగా అదనపు రాయితీలు. ► పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ► నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజ్. -
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నింటినీ ఈ విధానం కిందకు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని.. ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్ పార్టీ తనిఖీలు ఉండాలని సీఎం స్పష్టంచేశారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా కొత్త విధానంలో పొందుపరచాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలిలా ఉన్నాయి.. ► కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని అధికారులు ప్రతిపాదించగా.. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే.. ► రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులను సూచిస్తూ ఇండస్ట్రియల్ అట్లాస్ రూపొందించాలి. ► ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలు అట్లాసులో పొందుపరచాలి. ► పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి. ► పరిశ్రమలు కాంప్లియన్స్ (సమ్మతి) నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి. ► వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలి. థర్డ్ పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. ► కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. ► పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. ► విశాఖ గ్యాస్ దుర్ఘటనలో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడంవల్లే ఈ సమస్య వచ్చింది. ► పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితిలేదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. ► పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని.. రెండు, మూడు నెలల్లో వీటిని పూర్తిచేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సమీక్షలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు రాష్ట్రంలో పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్(ప్రత్యేక తనిఖీ) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్, బాయిలర్స్ విభాగం ఇన్స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఆర్వో, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని నియమించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పరిశ్రమల్లో 90 రోజుల్లోగా స్పెషల్ డ్రైవ్‌ను పూర్తి చేసి.. ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని ఆదేశిస్తూ మంగళవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ► ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక, జూన్ 8న ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాల మేరకు స్పెషల్ డ్రైవ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► పరిశ్రమలను నాలుగు విభాగాలుగా వర్గీకరించాలి. 1.విష, ప్రమాదకర రసాయనాల తయారీపరిశ్రమలు 2.ప్రమాదకర విష పదార్థాలు నిల్వ చేసే పరిశ్రమలు. 3.పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను నిల్వ చేసి, వాటిని తయారు చేసే పరిశ్రమలు 4.ఈ మూడు కేటగిరీల్లోని పరిశ్రమలు.. వీటిని జిల్లా స్థాయి కమిటీలు విధిగా తనిఖీ చేయాలి. -
ఆదాపై ‘టెరీ’ ఆరా
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో చేపట్టే.. అంతర్జాతీయ ఇంధన పొదుపు సాంకేతికతకు ఈ అధ్యయనం కీలకం కానుంది. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ► విద్యుత్ వినియోగం అధికంగా ఉండే గ్లాస్, రిఫ్రాక్టరీ పరిశ్రమలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్–టెరీ’కు అప్పగించింది. ► అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఏడాది పాటు టెరీ అధ్యయనం చేస్తుంది. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈల కోసం బీఈఈ ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తుంది. ► రాష్ట్రంలో విద్యుత్ పొదుపుకు అపార అవకాశాలున్నాయని టెరీ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించింది. దీంతో అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సాంకేతికత, పొదుపు చేయగల విద్యుత్ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంధన పొదుపు సంస్థ కృషి చేస్తోంది. ► ఎంఎస్ఎంఈ రంగంలో నూతన ఎనర్జీ ఎఫిషియన్సీ సాంకేతికత అమలు చేస్తున్న ఇంధన శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. -
శరవేగంగా కడప ఉక్కు పనులు
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసినప్పటి నుంచి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 67వ నంబర్ జాతీయ రహదారి నుంచి ప్లాంట్ దగ్గరకు చేరుకోవడానికి నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.76 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే సాయిల్ టెస్టింగ్, సర్వే పనులు పూర్తి చేసి ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.షాన్ మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ► జనవరి నుంచి ప్రధానప్లాంటు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్లాంట్‌కు చేరుకోవడానికి అవసరమైన నాలుగు లైన్ల రహదారికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ► 10,000 కేవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా కోసం ఏపీఎస్పీడీసీఎల్కు రూ.6.88 కోట్లు కేటాయించారు. సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సేకరించే బాధ్యతను ఎస్బీఐ క్యాప్‌కు అప్పగించారు. ► ప్లాంట్‌కు అవసరమైన నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతోంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ఇప్పటికే దరఖాస్తు చేశాం. రెండు కీలకమైన సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ► ఈ ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుము ఏటా 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి ఇప్పటికే ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థాలను సొంత అవసరాలకు వినియోగించుకునేలా 88.6 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నెల రోజుల్లో భాగస్వామ్య కంపెనీ ఎంపిక ► ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య కంపెనీగా చేరడానికి ఆసక్తి ఉన్నకంపెనీల నుంచి దరఖాస్తులు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కోరుతూ టెండర్లు పిలిచారు. ► దీనికి జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోంది. ► ఇప్పటికే ఐదు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ► ఈవోఐ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకు గడువుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ► మొత్తం ప్రక్రియను వచ్చే నెలరోజుల్లో పూర్తి చేసి భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేయనున్నారు. ► శంకుస్థాపన చేసినప్పటి నుంచి మూడేళ్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
పారిశ్రామిక చేయూతలో ఏపీనే బెస్ట్
సాక్షి, అమరావతి: సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలకు పూర్తిస్థాయి చేయూతను అందిస్తున్నామని, ఆదాయం పడిపోయిన సమయంలోనూ ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ‘మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ పాజిటివ్’ అనే అంశంపై సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ► కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైన సమయంలోనూ ఎంఎస్ఎంఈలను ఆదుకోవటానికి రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి, రెండు విడతల్లో చెల్లించాం. ► ప్రభుత్వ విభాగాలకు కొనుగోలు చేసే 360 రకాల వస్తువుల్లో 25% ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. ► పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కార్మిక శక్తిని అంచనా వేసి ఉపాధి అందించే విధంగా ఒక యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ► అవసరమైతే నైపుణ్య శిక్షణను అందించి ఎక్కువ మందికి ఉపాధి కొరతను తీర్చేందుకు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. ► రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాం. సమావేశంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ పీఐ హరనాథ్, రాష్ట్రీయ ఇస్పట్ నిగం లిమిటెడ్ చైర్మన్ ప్రదోశ్ కుమార్ రత్, ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, తదితరులు హాజరయ్యారు. -
మూడేళ్లలో మీకెంతమంది ఉద్యోగులు కావాలి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నిపుణుల వివరాలను తెలుసుకోవడానికి పరిశ్రమల శాఖ భారీ సర్వేను చేపట్టింది. ఇందుకోసం ‘సమగ్ర పరిశ్రమ సర్వే’ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో 900 మెగా, లార్జ్ కంపెనీలతోపాటు 97 వేలకుపైగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) నుంచి వివరాలు సేకరిస్తారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. వచ్చే మూడేళ్లలో ఎంత మంది ఉద్యోగులు అవసరమవుతారు? ఏయే రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు కావాలనే వివరాలను పరిశ్రమల నుంచి సేకరించనున్నట్లు పరిశ్రమల శాఖ జేడీ ఉదయ్‌భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. ► ఇప్పటికే పరిశ్రమ ఆధార్ పేరుతో యూనిట్లకు సంబంధించిన 70 కాలమ్స్‌లో సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ యాప్ ద్వారా మరో 30 కాలమ్స్‌తో అదనపు సమాచారం సేకరించనుంది. ► ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించనున్నారు. ► ఈ సమగ్ర సర్వే కోసం జిల్లాలవారీగా జిల్లా సంయుక్త కలెక్టర్–2 చైర్మన్‌గా జేసీ–3 వైస్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ జీఎం కన్వీనర్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ ► రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ► పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువతను అందించడానికి 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ► ఈ సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా కంపెనీలకు కావాల్సిన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ► ఇందుకోసం ఆయా కంపెనీలు.. నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ► రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన వారిని అందించడంతోపాటు వాటి అవసరాలను గుర్తించి.. పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నదే సర్వే లక్ష్యమని అధికారులు చెప్పారు. -
కార్మికులు కావలెను
గుంటూరు జిల్లా ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం గ్రామానికి చెందిన దాదాపు 40 కుటుంబాలు ఏడాదిలో ఒకట్రెండు నెలలు మినహా వలసలోనే ఉంటాయి. లాక్‌డౌన్‌తో సొంత ఊరికి చేరుకున్న ఆ కుటుంబాలన్నీ కొత్త జాబ్ కార్డులు తీసుకుని రెండు శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి నెల రోజులుగా ఉపాధి హామీ ద్వారా పనులు పొందాయి. నగరాల్లో మళ్లీ పనులు మొదలు కావడంతో 10 కుటుంబాలు తిరిగి వలస వెళ్లిపోయాయి. ఏపీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ వచ్చిన దాదాపు 3 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లిపోయారు. మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసెళ్లిన దాదాపు 1.80 లక్షల మంది సొంతూళ్లకు తిరిగి వచ్చారు. ఫలితంగా ఒకవైపు పనులున్నాయి.. మరోవైపు కార్మికుల అవసరమూ ఉంది. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన పరిస్థితి. అటు పరిశ్రమలకు కార్మికులను అందించడం.. ఇటు కార్మికులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కార్మికులు, పరిశ్రమలను సమన్వయం చేసే బాధ్యతను స్వీకరించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కార్యాచరణకు సిద్ధమైంది. పరిశ్రమల అవసరాలపై సర్వే చేసి అందుబాటులో ఉన్న కార్మికుల వివరాల సేకరణ ప్రక్రియను నెల రోజుల్లోగా పూర్తి చేస్తారు. అనంతరం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించి అమలు చేయనున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో కార్మికుల వివరాలు, పరిశ్రమల అవసరాలతో సమగ్ర డేటా బేస్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన చిత్తూరు జిల్లా తిరుమల కండ్రిగ గ్రామానికి చెందిన ఓంశేఖర్ లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోయారు. జీవనోపాధి కోసం ప్రస్తుతం ఊర్లోనే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇతర రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 3 లక్షల మంది కార్మికులు లాక్‌డౌన్‌తో మన రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ప్రధానంగా నగరాలు, శివారు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా కార్మికులు అందుబాటులో లేరు. పరిశ్రమలు, తయారీ, వ్యాపార, నిర్మాణ, ఆతిథ్యం ఇలా అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిపుణులైన కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. స్థానికంగా ఉన్నవారికి అధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో వెళ్లిపోయిన కార్మికులను వ్యయ ప్రయాసలకోర్చి మరీ వెనక్కి రప్పించేందుకు పరిశ్రమ, వ్యాపార వర్గాలు సిద్ధపడుతున్నాయి. అందుకోసం భారీగా అడ్వాన్సులు చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రత్యేక అనుమతులు తీసుకుని వాహనాల్లో వారిని వెనక్కి తీసుకొస్తున్నాయి. మామిడికి నీటి కొరత లేకుండా... విజయవాడ పరిసరాల్లో ఈ వేసవిలో లాక్డౌన్ సమయంలో మామిడి మొక్కలను సంరక్షించేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. నూజివీడు, ముసునూరు, మైలవరం తదితర చోట్ల మామిడి తోటల్లో బోర్లకు మరమ్మతులు, కొత్తవి తవ్వేందుకు చత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి నిపుణులను రప్పించేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ అడ్వాన్సులు చెల్లించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇన్నోవా కార్లలో రాష్ట్రానికి తెచ్చామని జి.కొండూరుకు చెందిన మదమంచి రంజిత్ చెప్పారు. రాజస్థాన్ నుంచి రావాల్సిందే.. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో ఇప్పుడిప్పుడే వస్త్ర దుకాణాలు తెరుస్తున్నారు. డిజైనర్ వస్త్రాలపై ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లు చేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లించి పనులు చేయించుకుంటారు. వీరిలో ఎక్కువమంది రాజస్థాన్‌కు చెందినవారే. వారు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఎక్కువ అడ్వాన్సులు చెల్లించి వెనక్కి రప్పిస్తున్నారు. మేస్త్రీలు, ప్లంబర్లకు గిరాకీ లాక్‌డౌన్‌తో తాపీ మేస్త్రీలు, వడ్రంగి మేస్త్రీలు, ఎలక్ట్రికల్ వర్కర్లు, ప్లంబర్లకు డిమాండ్ పెరిగింది. గతంలో వీరికి రోజుకు రూ.600 వరకూ వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు స్థానికంగా ఉండే కార్మికులకు రోజుకు రూ.800 వరకూ చెల్లిస్తున్నారు. విద్యుత్ పనులకూ కూలీలే పవర్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయ విద్యుత్ ఫీడర్ల సామర్థ్యం పెంపు పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త సబ్స్టేషన్లు, కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ఈ పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో లాక్డౌన్ ముందు వరకు 2 వేల మంది వలస కార్మికులు పనిచేశారు. 400 కేవీ, 220 కేవీ లైన్ల నిర్మాణంలో తమిళనాడు కూలీలు నిపుణులు. దాదాపు 1,200 మంది స్వస్థలాలకు వెళ్లడంతో వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యుత్తు ప్రాజెక్టులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని కార్మికులను రప్పించడం, భద్రత కల్పించడంపై మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఆతిథ్య రంగానికి సిబ్బంది కొరత హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం మందకొడిగా సాగుతుండటంతో యాజమాన్యాలు కనీస సిబ్బందితో నెట్టుకొస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఆతిథ్య రంగంలో పనిచేస్తుండగా వారిలో దాదాపు 25 వేల మంది స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇందులో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో 75 శాతం మంది వంట మనుషులు ఆ రెండు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ఆగస్టు తరువాతగానీ హోటల్ పరిశ్రమ గాడిలో పడదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలకు చెందినవారిని వెనక్కి రప్పించడం ఆర్థిక భారమేనని పేర్కొంటున్నాయి. ‘ఉపాధి’ డబుల్ గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో పట్టణాల నుంచి వెనక్కివచ్చినవారిని ఉపాధి హామీ పనులే ఆదుకుంటున్నాయి. వలస కూలీల్లో దాదాపు 40 శాతం మందికి ఉపాధి పనులే ఆధారమయ్యాయి. గత రెండు నెలల వ్యవధిలో 4.25 లక్షల మంది కొత్తగా ఉపాధి హామీ పనుల కోసం పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. సమగ్ర వివరాలతో డేటా బేస్.. ► జాయింట్ కలెక్టర్–3 ఆధ్వర్యంలోని ఈ కమిటీలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, జిల్లా కార్మిక శాఖ మేనేజర్లతోపాటు గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. ► ఈ కమిటీ ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని పరిశ్రమల అవసరాలను తెలుసుకుంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రశ్నావళిని రూపొందించింది. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం ఉన్న కార్మికులు అవసరం? ప్రస్తుతం ఎంతమంది కార్మికులు కావాలి? భవిష్యత్‌లో ఆ పరిశ్రమలను విస్తరిస్తే ఎంతమంది అవసరమవుతారు? విద్యార్థులకు ఆ పరిశ్రమల్లో అప్రంటీస్షిప్ ఇస్తారా? తదితర అంశాలపై పరిశ్రమ యాజమాన్యాలను సంప్రదించి నివేదిక రూపొందిస్తారు. ఈ వివరాలతో సమగ్రంగా డేటా బేస్ సిద్ధం చేస్తారు. ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తారు. పరిశ్రమల శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కూలీలను వెనక్కి రప్పించేందుకు పరిశ్రమల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఏఈ)లపై ఆధారపడి 10 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. వారిలో మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వలస వచ్చినవారు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే అత్యధికంగా ఉన్నారు. ‘రీస్టార్ట్’ ద్వారా పరిశ్రమలు పునఃప్రారంభమైనా 30 శాతం నుంచి 40 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమ లాంటి వాటిలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో 20 శాతానికి మించి గ్రానైట్ పరిశ్రమల్లో పనులు ప్రారంభం కాలేదు. క్వారీల్లో బండలు కోయడం లాంటి పనుల్లో రాజస్తాన్ కార్మికులకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. వారంతా స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో స్టోన్ క్రషింగ్ సిబ్బంది కోసం అడ్వాన్సులు, ప్రయాణ చార్జీలు చెల్లించి మరీ వెనక్కి రప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ‘శ్రీసిటీ’లో పని చేసే కార్మికుల్లో అత్యధికులు తమిళనాడుకు చెందినవారే. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో స్థానిక కూలీలను వినియోగించేలా చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన శ్రీను బెంగళూరులో తాపీ పనులు చేస్తాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబం సొంత ఊరు చేరుకుంది. బెంగళూరులో రోజుకు రూ.700 – రూ.1,000 దాకా సంపాదించే శ్రీను ప్రస్తుతం ఇతర పనులు చేసేందుకు ఇష్టపడటం లేదు. బెంగళూరులో పనులు ప్రారంభమైతే తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నాడు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లి రోడ్డు పక్కన చిన్న పాకలు వేసుకుని జీవించేవి. 2014–19మధ్య నాగార్జున సాగర్ కాల్వలకు నీరు విడుదల కాకపోవడంతో ఊరిలో పెద్దగా వ్యవసాయ పనులు దొరకకపోవడంతో పట్నం దారి పట్టాయి. మగాళ్లు ఆటోలు నడుపుతుండగా... ఆడవాళ్లు పని మనుషులుగా జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో సొంతూరికి తిరిగి వచ్చారు. నెలరోజులపాటు ఉపాధి పనులు చేసిన అనంతరం లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. సరైన శిక్షణ ఇచ్చి.. అవకాశాలు కల్పిస్తే.. ఇలాంటి వారు ఇక్కడే ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ద్విముఖ వ్యూహంతో ముందుకు అటు పరిశ్రమలు, ఇటు కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని రూపొందించింది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల అవసరాలను గుర్తించడంతోపాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని కార్మికులకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. నెల రోజుల్లోగా సర్వే, వివరాల సేకరణ పూర్తి ► సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారు ఎంతమంది ఉన్నారు? స్థానిక నిరుద్యోగులు ఎంతమంది? పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉందా? అనే వివరాలను సేకరిస్తారు. ► గ్రామాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నవారికి అక్కడి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అర్హులైన వారికి స్థానిక పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ► పరిశ్రమల అవసరాలపై సర్వే, అందుబాటులో ఉన్న కార్మికుల వివరాల సేకరణను నెల రోజుల్లో పూర్తి చేస్తారు. అనంతరం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తారు. పరిశ్రమల అవసరాలు తీరుస్తూ కార్మికులకు ఉపాధి కల్పిస్తాం లాక్డౌన్ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. అటు పరిశ్రమల అవసరాలను తీర్చడంతోపాటు ఇటు మన రాష్ట్రంలోని కార్మికులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. అందుకోసం ప్రత్యేకంగా యాప్ కూడా రూపొందిస్తాం. ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కార్మికులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. – చల్లా మధుసూదన్‌రెడ్డి (ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్) -
పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి..
-
పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం
75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చాం. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. స్థానికంగానే నైపుణ్యమున్న మానవ వనరులు లభిస్తాయి. వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడాలి. అలా వారి కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేదోడుగా నిలవాలి. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పది కాలాల పాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా.. అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే. ఇందులో మరో మాట ఉండకూడదు. గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు అసలే వద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పోటీలో మనం గెలుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట మేరకు అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా పారిశ్రామిక విధానం ఉండాలని, పెట్టుబడుల్లో డీ రిస్కింగ్ ద్వారా పరిశ్రమలకు పెద్ద ఊతం ఇవ్వాలని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు, క్లస్టర్లకు పెద్ద పీట వేయాలని, ఆ నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ)పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రఖ్యాత సంస్థలతో పీసీబీని టై అప్ చేయాలి ► పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణ పద్ధతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. ఇందులో కనీసంగా నలుగురు సభ్యులు ఉండాలి. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)ను టై అప్ చేయాలి. ► పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే, ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా ఇదివరకే టై అప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. ► ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని వివరించి అవగాహన కల్పిస్తారు. ► పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్ఐపీసీ పరిశీలించి, ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్ఐపీబీ ముందుకు వస్తుంది. ఎస్ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజెంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. ► ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటు చేయడంలోనే కాకుండా, తర్వాత కాలంలో కూడా అండగా నిలుస్తాం. ఏం చేయగలమో అదే చెప్పాలి ► ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారి పట్ల ప్రో యాక్టివ్‌గా ఉంటుంది. ► పరిశ్రమలు పెట్టే్ట వారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలి. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక, ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలి. కనికట్టు మాటలొద్దు ► పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పింది. పరిశ్రమలకు రూ.4 వేల కోట్ల ఇన్సెంటివ్‌లను బకాయి పెట్టింది. ఆ బకాయిలను తీర్చడానికి ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ► ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే ఒక విడతలో సగం బకాయిలు చెల్లించాం. మిగిలిన సగం డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ► సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గాలి ► ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గుతుంది. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. పరిశ్రమలకు, ప్రజలకు మేలు జరిగేలా ఈ విధానం ఉంటుంది. ► భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యం. పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశం. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ► ఇండస్ట్రియల్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీని వల్ల వారికి భవిష్యత్తులో కార్యకలాపాల పరంగా గానీ, పర్యావరణం పరిరక్షణ పరంగా గానీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నడుపుకోవచ్చు. -
భయం వీడి... బతుకు పోరులో
సాక్షి, అమరావతి: సుదీర్ఘంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో స్తంభించిన జనజీవనం మళ్లీ గాడిన పడుతోంది. కరోనా వైరస్ పట్ల మితిమీరిన భయం అవసరం లేదన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రజలు మనోనిబ్బరంతో ముందడుగు వేస్తున్నారు. నాలుగో విడత లాక్డౌన్లో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు దోహదం చేశాయి. ప్రధానంగా రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సూచించింది. గతంలోనే వ్యవసాయ పనులకు అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయటకు వస్తున్నారు. రోడ్ల మీద జన సంచారం కనిపిస్తోంది. అన్ని రకాల కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. వేసవి కావడంతో ఏసీలు, కూలర్ల అమ్మకాలపై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. అన్ని పరిశ్రమలు ఉత్పత్తిని పునఃప్రారంభించాయి. టేక్అవే హోటళ్ల వ్యాపారం జోరందుకుంది. తోపుడుబళ్ల నుంచి చిన్న చిన్న వ్యాపారాల వరకు అన్నీ గాడిలో పడుతున్నాయి. రైతు బజార్లలో సందడి కనిపిస్తోంది. వాహనాల సందడి... గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో 1,500 ఆర్టీసీ బస్సులను నడిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించడం ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి చోట్ల ఆర్టీసీ బస్టాండ్ల వద్ద బస్సులు ఎక్కేందుకు క్యూలు కనిపిస్తుండటం ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. రాష్ట్రంలో దాదాపు 25 వేల లారీ సర్వీసులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తు రవాణా జరుగుతోంది. పరిశ్రమల్లో ఊపందుకున్న ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రీస్టార్ట్ పథకం కింద మూడు రోజుల్లో 12,312 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ పునఃప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లోనే 100 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుందని పారిశ్రామికవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. గాడిన పడిన ఆక్వా రంగం లాక్‌డౌన్‌తో ఆక్వా రంగం దెబ్బతింది. ఎగుమతులు లేక రైతులు, బ్రోకర్లు, ప్లాంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ మద్దతు ధర ప్రకటించి సుమారు 60 – 70 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేసిన ఆక్వా రైతులను ఆదుకున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో ఆక్వా రంగం కూడా మళ్లీ ఊపందుకుంది. జాగ్రత్తలు పాటిస్తూ జీవన సమరం.. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే జీవితాలు నిలబెట్టుకోవాలనే సంకల్పంతో తిరిగి విధులకు హాజరవుతున్నాం. మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లను వాడుతూ విధులు నిర్వర్తిస్తున్నాం’ – నాయుడు, సీకాన్ ఇండస్ట్రీ,ఆటోనగర్ అక్కిరెడ్డిపాలెం. నెలలో వాహనాల విక్రయం పెరుగుతుంది.. ‘లాక్డౌన్ సడలింపులతో ఉగాదికి ముందు బుక్ చేసుకున్న వాహనాలను కొనుగోలుదారులు తీసుకువెళుతున్నారు. ఆంక్షలు పూర్తిగా తొలగిస్తే నెల రోజుల్లో ద్విచక్ర వాహనాల వ్యాపారం పుంజుకుంటుంది. అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి’ – శ్రీనివాస్, సీఈఓ, వరుణ్ బజాజ్ వ్యాపారాలు గాడిన పడుతున్నాయి ‘లాక్డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో రాష్ట్రంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాపారాలను పునఃప్రారంభిస్తున్నారు. కరోనా భయాన్ని వీడి వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకునేలా మా చాంబర్ చర్యలు తీసుకుంటోంది’ – వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడు, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంచి ధరకు ధాన్యాన్ని విక్రయించా.. ‘8 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. లాక్‌డౌన్‌తో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందాం. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇవ్వడంతో ధాన్యాన్ని మంచి ధరకు విక్రయించాం. రైతులందరూ ఆనందంగా ఉన్నారు’ – దూనబోయిన లక్ష్మణరావు , కండ్రిగ,కొత్తపేట మండలం, తూర్పుగోదావరి జిలా ఉత్సాహంగా విధుల్లోకి... ‘మళ్లీ విధుల్లో చేరడం ఉత్సాహంగా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తా. ప్రయాణికులు భౌతికదూరం, జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సు ఎక్కటానికి ముందే అందరూ శానిటైజర్‌ను వినియోగించేలా చేస్తున్నాం’ – ఎస్డీ ఇంతియాజ్, ఆర్టీసీ డ్రైవర్, వెంకటగిరి డిపో పనులు దొరుకుతున్నాయి ‘వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో చేతినిండా పని దొరుకుతోంది. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నాం. ఉపాధి హామీ పనులు కూడా ఉన్నందున ఇబ్బంది లేదు.’ – బెవర అప్పన్న, రైతుకూలీ, బెలమర గ్రామం, పోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా. 1. విజయవాడ పటమట సెంటర్లో బ్యాగ్ కుడుతున్న కార్మికుడు 2. విశాఖలోని మొబైల్ దుకాణంలో కొనుగోలుదారులు 3. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తిరిగి ప్రారంభమైన సా మిల్లు 4. విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో రోడ్డు పక్కన బట్టలు అమ్ముతున్న చిరు వ్యాపారులు 5. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద తెరుచుకున్న పూలదుకాణం 6. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సైకిల్ షాపులో పని చేసుకుంటున్న కార్మికుడు 7. మచిలీపట్నంలో మండుటెండలోనూ మామిడి పండ్లు అమ్ముతున్న అవ్వ ముమ్మరంగా సాగు పనులు.. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 49.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసింది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో రైతన్నలు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఆన్లైన్లో విత్తనాల విక్రయాలు అందుబాటులో ఉండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు రబీ పంటల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లు, మండీలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో భరోసా.. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ప్రభుత్వం సమర్థంగా కరోనాను కట్టడి చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు డిశ్చార్జిలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ పకడ్బందీగా ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో ప్రజల్లో భరోసా పెరిగింది. రవాణా రంగానికి పూర్వకళ.. ‘లాక్డౌన్ సడలింపులతో తిరిగి కోలుకుంటామన్న ఆశ ఉంది. పరిశ్రమలు తెరచుకుంటున్నాయి. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. ఉత్పత్తి మొదలవుతోంది. ఇవన్నీ రవాణా ఊపందుకోవడానికి దోహదం చేస్తుంది. లారీలకు గిరాకీ పెరుగుతుంది’ –వైవీ ఈశ్వరరావు,లారీ యజమాని, విజయవాడ. సడలింపులతో హోటళ్లకు ఊరట.. ‘హోటల్లు ప్రస్తుతం ఆన్లైన్ సేవలు నిర్వహించేలా సడలింపులు ఇచ్చారు. సాయంత్రం 7 గంటల వరకు రెస్టారెంట్లు ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది కొంత ఊరట నిచ్చే విషయం. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లకు కమీషన్లు ఇవ్వాలి కాబట్టి ఏమీ మిగిలే పరిస్థితి లేదు. ప్రజలను అనుమతిస్తే పార్శిళ్లు తీసుకెళతారు. మాకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది’ – జి సాంబశివరావు, హారిక రెస్టారెంట్ -
చిన్న పరిశ్రమలకు పెద్ద మేలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు రూ.904.89 కోట్లు విడుదల చేయడంతో పాటు, చిన్న పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలు రద్దు చేసింది. పెద్ద పరిశ్రమలకు పెనాల్టీలు లేకుండా మూడు నెలలు వాయిదా వేసింది. చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనుంది. ఈ మేరకు సీఎం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల వల్ల 97,428 చిన్న తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరడంతో పాటు వీటిల్లో పనిచేస్తున్న 9,68,269 మంది ఉపాధికి భద్రత కల్పించినట్లయ్యిందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రూ.188 కోట్ల ఫిక్స్డ్ చార్జీలు రద్దు ► ఎంఎస్ఎంఈలకు ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి సంబంధించి మినిమం కరెంటు డిమాండ్ చార్జీలు రూ. 188 కోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్ )కరెంటు మినిమం డిమాండ్ చార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించారు. ఎటువంటి పెనాల్టీలు, వడ్డీలు చెల్లించనవసరం లేకుండా మూడు నెలల పాటు వాయిదా వేసింది. ► ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకు, 24,252 చిన్న తరహా పరిశ్రమలకు, 645 మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా 97,428 ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేసింది. 25% ఎంఎస్ఎంఈల నుంచే కొనాలి ► రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు జరిపే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచే చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఎస్పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయి. ► ఈ 25 శాతంలో 4 శాతం ఎస్సీ,ఎస్టీలు, 3 శాతం మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. తక్కువ వడ్డీకే రుణాలు ► ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో వర్కింగ్ కేపిటల్ అందించనుంది. ► కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీతో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందించనున్నారు. ఈ రుణాలను 6 నెలల మారిటోరియం పీరియడ్‌తో కలిపి మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ► అతి తక్కువ వడ్డీతో ఇచ్చే ఈ వర్కింగ్ కేపిటల్ రుణాల కోసం సిడ్బీ, ఐడీబీఐలతో కలిపి రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతంగా నిర్ణయించారు. ఈ రుణాల మంజూరుకు ఏపీఎస్ఎఫ్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆదాయం బాగున్నా ఐదేళ్లలో చెల్లించింది సున్నా ► ఒకపక్క లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఆరేళ్ల బకాయిలు తీర్చాలని ఆదేశాలు జారీ చేయడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ► రాష్ట్ర ఆదాయం బాగున్న తరుణంలోనూ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ► పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటితో ఎంఎస్ఎంఈ రంగం ఆర్థికంగా చితికిపోయిందని, ఆదుకోమని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. రెండు విడతలుగా చెల్లింపులు లాక్ డౌన్‌తో నష్టపోయిన సంస్థలు తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు ఊతమిచ్చేలా ఆరేళ్ల రాయితీ బకాయిలు రూ.904.89 కోట్లు రెండు విడతలుగా మే, జూన్ నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించాల్సిన రూ.827.52 కోట్లతో పాటు 2019–20కి సంబంధించిన రూ.77.37 కోట్లు చెల్లించనున్నారు. దీంతో 11,238 ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో ఎస్సీలకు చెందిన 3,876 యూనిట్లకు రూ.238.9 కోట్లు, ఎస్టీలకు చెందిన 839 యూనిట్లకు రూ.46.16 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో భాగంగా మే 22న సుమారు రూ.450 కోట్లు విడుదల చేస్తామని పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పిన సంగతి విదితమే. కోలుకోవడానికి ఊతం క్లిష్ట సమయంలో రాయితీ బకాయిలు చెల్లించి లిక్విడిటీ కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకోవడానికి ఊతమిచ్చినట్లయ్యింది – సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.రామకృష్ణ కొత్త రుణాలతో ఊపిరి ఖజానాకు రూపాయి రాని తరుణంలోనూ వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నారు. కొత్త రుణాలు ఇచ్చి ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని సీఎం జగన్ దేశంలోనే ప్రథమంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది పారిశ్రామిక రంగంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. – ఏపీకే రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఎంఈ జాతీయాధ్యక్షుడు. -
సంక్షోభం నుంచే కొత్త అవకాశాలు
‘లాక్డౌన్ ప్రారంభానికి ముందే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ), కరోనాతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉండగా, రాష్ట్ర జీడీపీలో 35 శాతం, ఎగుమతుల్లో 40 శాతం మేర వాటా కలిగి ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో, ఈ రంగం పూర్తిగా చతికిల పడింది. అందువల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలపై కేంద్రం దృష్టి పెట్టాలి’ అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తుపై సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే.. ► సుమారు 50 రోజుల పాటు లాక్డౌన్ మూ లంగా పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అయినా వేతనాలు, విద్యుత్ బిల్లులు, పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ చెల్లింపుతో పాటు బ్యాంకు రుణాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. మామూలు పరిస్థితుల్లోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు మరింత భారం మోపుతోంది. ► లాక్డౌన్ నిబంధనలను సడలించి పరిశ్రమలకు అనుమతి ఇచ్చినా 30 నుంచి 40 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల మార్కెట్ ఇంకా తెరుచుకోలేదు. కొనుగోళ్లు పెరిగితేనే ఎంఎస్ఎంఈ రంగం పుంజుకుంటుంది. కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకున్నా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పరిశ్రమల కార్యకలాపాలకు మరో 4 నెలలు పట్టే అవకాశం ఉంది. ► పారిశ్రామికరంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల్లో సుమారు 30, 40 శాతం మంది తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముడిసరుకు లేకపోవడం కూడా పూర్తి స్థాయి లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆటంకం కలిగిస్తున్నాయి. ► పరిశ్రమలు తిరిగి గాడిన పడేందుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం 20 నుంచి 30 శాతం రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాలని కోరినా, బ్యాంకింగ్ రంగం కూడా సంక్షోభంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇలాంటి రుణాలకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ ఇస్తే తప్ప ఎంఎస్ఎంఈ పరిశ్రమలు గట్టెక్కే పరిస్థితి లేదు. ► పరిశ్రమలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలోకి వెళ్తాయి. దీంతో పరిశ్రమల సిబిల్ రేటు తగ్గి రుణ పరిమితి పెంచడం, కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తాయి. రూ.5 కోట్ల రుణ పరిమితి లోపల ఉన్న అన్ని రకాల ఎంఎస్ఎంఈలను ఎన్పీఏ జాబితాలో చేర్చడానికి ఉన్న గడువును ఏడాది పాటు వాయిదా వేయాలి. ► సాధారణ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే కార్మికులకు ఈఎస్ఐ కార్పొరేషన్ 70 శాతం వేతనం చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు అంతకంటే ఏమీ భిన్నంగా లేవు కాబట్టి ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మూడు, నాలుగు నెలల పాటు ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి చెల్లించాలని ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాం. కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఈఎస్ఐ పరిధిలో లేవు. ఆంక్షలు తొలగించినా వీటిలో సుమారు 30 శాతం పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడం కష్టమే. ఇలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రమే 6 నెలల పాటు నేరుగా వేతనాలు చెల్లించాలి. ► జీఎస్టీ చెల్లింపుపై ప్రభుత్వం 3 నెలల పాటు డిఫర్మెంట్ ఇచ్చినా 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. డబ్బులే లేనప్పుడు వడ్డీ చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది. వడ్డీ లేకుండా జీఎస్టీ చెల్లింపు గడువును కనీసం 6 నెలల పాటు పొడిగించాలి. ► పరిశ్రమలు పనిచేయని కాలానికి సంబంధించి ఏపీ తరహాలో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2,700 కోట్ల సబ్సిడీలు రావాల్సి ఉంది. ఇందులో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించి రూ.600 కోట్ల వరకు ఉండొచ్చు. చిన్న పరిశ్రమలకు గుర్తించి రాయితీలు విడుదల చేస్తే సుమారు ఐదారు వేల పరిశ్రమలకు ఊరట లభిస్తుంది. ► ఎంఎస్ఎంఈ రంగం స్థితిగతులపై ఇటీవల సిడ్బీ, క్రిసిల్ సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ నివేదిక ప్రకారం రూ.కోటి కంటే తక్కువ రుణాలు తీసుకున్న చిన్న పరిశ్రమల ఆస్తుల విలువ సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్లే గతంలో జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వంటి సందర్భాల్లోనూ సవాళ్లను ఈ రంగం అధిగమించగలిగింది. రుణాలు తిరిగి చెల్లించడంలోనూ చిన్న పరిశ్రమలు మెరుగ్గా ఉన్నట్లు సిడ్బీ, క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద పరిశ్రమల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 19.1 శాతం కాగా, ఎంఎస్ఎంఈలు 11.3 శాతం మాత్రమే ఎన్పీఏ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈ రంగానికి అదనపు రుణాలు ఇచ్చినా బ్యాంకులు నష్టపోయే అవకాశం ఉండదు. ► ఫార్మా, వైద్య ఉపకరణాలు, ఆరోగ్య రంగం లో మౌలిక వసతుల రంగాల్లో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటేనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మనుగడ సాగించగలుగుతాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తే చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునే శక్తి వస్తుంది. ► కరోనా సంక్షోభంలోనూ ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగం కొత్త పుంతలు తొక్కేందుకు అనువైన మార్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. నైపుణ్య శిక్షణ, సరళీకృత విధానాలతో తెలంగాణ రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. -
అనంతపురంలో మరో రెండు భారీ పరిశ్రమలు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్ బస్ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ► అనంతపురం జిల్లాలో కియా మోటర్స్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో ఇచ్చిన జీవోతో ఆ ప్రాంతంలో మిగిలిన పరిశ్రమలకు ఆటంకంగా మారింది. కియా చుట్టుపక్కల 10 కి.మీ పరిధి వరకు ఎటువంటి కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదంటూ 2017లో జీవో నెంబర్ 151 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీని ఫలితంగా అప్పటికే ఒప్పందం కుదిరినప్పటికీ ఈ రెండు పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది. ► ఈ నేపథ్యంలో అడ్డంకిగా ఉన్న ఆ జీవో నుంచి ఈ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులిచ్చారు. దీంతో కియా కంటే ముందే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందున ఈ 2 పరిశ్రమలకు ఈ జీవో నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ► తాజా ఉత్తర్వులతో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అడ్డంకులు తొలిగాయి. ► అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి. -
రీస్టార్ట్‌తో 15,399 మంది వలస కూలీలకు ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలస కూలీలు, ప్రజలకు ఆర్థిక చేయూతను అందించే లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన ‘రీస్టార్ట్’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. కట్టుదిట్టమైన చర్యలతో ఉద్యోగులకు పూర్తి భద్రతను కల్పిస్తూ.. గ్రీన్ జోన్లో ఉన్న పరిశ్రమలను తిరిగి ప్రారంభించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి రీస్టార్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ► లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే 1,134 కంపెనీలు పనిచేస్తుండగా రీస్టార్ట్ కింద మరో 258 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. ► ఇప్పటివరకు 1,012 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకోగా 258 కంపెనీలకు అనుమతులు మంజూరు చేశారు. మరో 610 కంపెనీల అనుమతుల మంజూరు పరిశీలనలో ఉంది. మిగిలినవాటికి అనుమతులు మంజూరు చేయలేదు. ► రాష్ట్ర పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 77,943 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. రీస్టార్ట్ కార్యక్రమం ప్రారంభించిన ఐదు రోజుల్లోనే వీరిలో 15,399 మందికి ఉపాధి లభించింది. ఇందులో 13,210 మంది వివిధ పరిశ్రమల్లో పనిచేస్తుండగా 2,189 మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగ పనులకు అనుమతులు ► గ్రామీణ ఉపాధిలో కీలక పాత్ర పోషించే ఇటుక బట్టీలు రాష్ట్రవ్యాప్తంగా 1,943 ఉండగా ఇందులో 516 తిరిగి ప్రారంభమయ్యాయి. ► అలాగే రాష్ట్రవ్యాప్తంగా 53,786 నిర్మాణ రంగ పనులు చేయాల్సి ఉండగా అందులో 1,742 మంది పనులు ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 1,532 మందికి అనుమతులు మంజూరు చేశారు. గణాంకాలు.. -
పరిశ్రమలు రీస్టార్ట్
రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మే 3 వరకు యథావిధిగా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయి. ఏయే మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవచ్చో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. పరిశ్రమల్లో భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షించే బాధ్యతను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి, ఎస్ఐ, పరిశ్రమలు, కార్మిక శాఖల అధికారులకు అప్పగించారు. సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దాదాపు నెల రోజులుగా మూతపడ్డ పారిశ్రామిక రంగాన్ని దశలవారీగా పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా వైరస్ విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే వలస కార్మికులు, నిర్మాణ రంగ కూలీలకు చేయూతనిచ్చేలా సోమవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిలో పెడుతూ ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే విధంగా ‘రీ స్టార్ట్’ పేరుతో నిబంధనలను రూపొందించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్ మండలాలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలాంటి పారిశ్రామిక కార్యక్రమాలను అనుమతించరు.గ్రీన్ జోన్లో కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు కూడా కఠినమైన నిబంధనలు పాటించాలి. పరిశ్రమలు, యూనిట్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడైనా వైరస్ విస్తరించి రెడ్‌జోన్‌గా మారితే అప్పటివరకు ఇచ్చిన అనుమతులు రద్దవుతాయి. మార్గదర్శకాలు ఇవీ.. ► ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడకుండా పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఒక వాహనంలో ప్యాసింజర్ కెపాసిటీలో 30 నుంచి 40 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ► అన్ని వాహనాలను ప్రవేశ ద్వారం వద్దే రసాయనాలు చల్లి శుభ్రం చేయాలి. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. ► సిబ్బంది అందరికీ వైద్య బీమా ఉండాలి. ► హ్యాండ్ వాష్, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ► ఒక్కో షిఫ్ట్‌కు మధ్య గంట విరామం ఉండాలి. భోజన విరామంలో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ► పది మంది కంటే ఎక్కువగా సమావేశాలను నిర్వహించకూడదు. పనిచేసే ప్రాంతంలో సీట్ల మధ్య దూరం కనీసం ఆరు అడుగులు ఉండాలి. ► లిఫ్ట్‌ల సామర్థ్యంలో సగం మందిని మాత్రమే అనుమతించాలి. మెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. ► గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధించాలి. ఉమ్మి వేయడాన్ని కఠినంగా నిషేధించాలి. ► సందర్శకులను అనవసరంగా అనుమతించరాదు. ► కరోనా చికిత్స ఆసుపత్రులు వివరాలను కార్మికులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. ► పరిశ్రమల ప్రాథమిక సమాచారం, కార్మికుల వివరాలను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్‌కు అందజేసి పునఃప్రారంభించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తనిఖీ నివేదికల ఆధారంగా కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు. ► ప్రతి పరిశ్రమ రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కార్మికులను గుర్తించాలి. తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రతి కార్మికుడితో హామీపత్రం తీసుకోవాలి. పర్యవేక్షణ అధికారులు వీరే... తెరుచుకునే పరిశ్రమలు ఇవే... ► నిత్యావసర, అత్యవసర పరిధిలోకి వచ్చే పరిశ్రమలు బియ్యం, ఆయిల్, పప్పు మిల్లులు, పిండి మరలు ► పాడి పరిశ్రమలు, ఆర్వో ప్లాంట్లు, డిస్టిల్డ్ వాటర్, ప్యాకేజ్ వాటర్, బిస్కెట్లు, పండ్ల రసాలు, వెర్మిసెల్లీ, చక్కెర లాంటి అన్ని రకాల ఆహార పరిశ్రమలు ► బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫార్ములేషన్స్, ఆర్ అండ్ డీ, ఐబీ సెట్స్, ఆక్సిజన్ సరఫరా, పీపీ గేర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలు, గ్లౌజులు, బ్యాండేజ్‌ల తయారీ సంస్థలు ► లిక్విడ్ సబ్బులు, డిటర్జెంట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ ఫౌడర్, ఫ్లోర్ క్లీనర్స్, శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, పేపర్ నాప్కిన్స్, ఆక్సిజన్ సిలెండర్లు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు ► శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగ్, లాజిస్టిక్ ► మిరప, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, ► బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు. చేపలు, కోళ్లు, ఇతర జంతువుల దాణా తయారీ సంస్థలు. ► సౌర విద్యుత్‌తో పాటు అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ► ఆయుర్వేదం, హోమియోపతి మందుల తయారీ ► ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలు ► పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, కంటైనర్ డిపోల వద్ద ఉన్న శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగ్ కార్యకలాపాలు ► నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన అన్ని రకాల రవాణా సర్వీసులు నిర్మాణ రంగంలో వీటికి అనుమతి రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, బిల్డింగులు, అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, మున్సిపాల్టీ పరిధిలో లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు, అన్ని రకాల పారిశ్రామిక వాడల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వీటికి కూడా అనుమతి ► మున్సిపాల్టీ పరిధిలో లేని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు ► ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక నగరాలు ► నిరంతరాయంగా పనిచేయాల్సిన యూనిట్లు ► హార్డ్‌వేర్ తయారీ సంస్థలు ► బొగ్గు ఉత్పత్తి, గనులు, ఖనిజాలు వీటికి సంబంధించిన పేలుడు పదార్థాల తయారీ సంస్థలు ► చమురు, గ్యాస్ అన్వేషణ, శుద్ధి కర్మాగారాలు జనపనార పరిశ్రమ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ► ఎరువులు, రసాయనాలు తయారీ, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ సంస్థలు ► వ్యవసాయ సంబంధిత అన్ని రకాల పనిముట్లు, యంత్రాలు, హేచరీస్, వాణిజ్య ఆక్వా సాగు, దాణా తయారీ సంస్థలు ► తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ అమ్మకం 50 శాతం సిబ్బందితో అనుమతి ► 50 శాతం మంది సిబ్బందితో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు ► ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల డేటా, కాల్ సెంటర్లు, కొరియర్స్ సర్వీసులు -
రాష్ట్ర పరిశ్రమలకు కోవిడ్ ఉపశమన పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పరిశ్రమ కూడా లాక్డౌన్ వల్ల మూతపడకుండా ఉండేందుకు కోవిడ్ ఉపశమన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రుణాలపై మారిటోరియం, వడ్డీ రాయితీలు, వైఎస్ఆర్ నవోదయం వంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► లాక్డౌన్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి జరిగిన నష్టాన్ని మదింపు చేసి ఏ మేరకు ఆర్థిక సాయం అందించాలన్న దానిపై సీఐఐ, ఏపీ చాంబర్స్, ఫిక్కీ వంటి పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో చర్చిస్తున్నాం. ► కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు ఇప్పటికే ప్రకటించిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సాయం ఇచ్చే విధంగా కోవిడ్ ఉపశమన పాలసీని రూపొందిస్తున్నాం. ► ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ► రాష్ట్రంలో సుమారు 1.07 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా అందులో 10 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు. వినియోగించిన కరెంట్‌కే బిల్లు.. ► లాక్డౌన్ వల్ల విద్యుత్ సంస్థల సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి రీడింగ్ తీసే పరిస్థితి లేకపోవడంతో గడిచిన నెల బిల్లునే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది గృహ వినియోగదారులకు అనుకూలమైన నిర్ణయం కాగా పారిశ్రామిక యూనిట్లకు ఇబ్బందికరంగా పరిణమించింది. ► గత నెల 22 వరకు యూనిట్లు రన్ కావడంతో విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది. కానీ ఇప్పుడు యూనిట్ నడవక ఇబ్బందులు ఉన్న సమయంలో గడిచిన నెలలో వచ్చిన బిల్లులు ఇప్పుడు చెల్లించలేమంటూ వివిధ పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ► అలాగే పరిశ్రమలు ప్రతీ నెలా చెల్లించాల్సిన ఫిక్స్డ్ చార్జీలను కూడా ఎత్తి వేయాలని కోరాయి. ► ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో పరిశ్రమలకు ఈ నెలలో వినియోగించిన విద్యుత్ ఆధారంగానే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ► వినియోగించిన విద్యుత్ వరకు బిల్లులపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాం. స్థిర చార్జీల విషయంలో డిస్కంలతో చర్చిస్తున్నాం. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం ప్రకటిస్తాం. ► ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలకు ముడి సరుకు కొరత లేకుండా చూస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. లాక్డౌన్ నుంచి 520 పరిశ్రమలకు మినహాయింపు ఇందులో అత్యధికంగా ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలే రాష్ట్రంలో లాక్డౌన్ నుంచి 520 పారిశ్రామిక యూనిట్లకు మినహాయింపు ఇచ్చారు. అత్యవసర సర్వీసులు కింద ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందులో అత్యధికంగా 318 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులు ఇవ్వగా, 188 ఫార్మా, ఫార్మా ఉపకరణాల తయారీ సంస్థలు ఉన్నాయి. యూనిట్లను సగం సిబ్బందితో మాత్రమే నడపాలని, పనిచేసే చోట విధిగా భౌతిక దూరం పాటించాలని ఆదేశించినట్లు తెలిపారు. ► పనిచేసే సంస్థలను పర్యవేక్షించే బాధ్యత ఏపీఐఐసీ జనరల్ మేనేజర్లది. ► పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ► సరుకు రవాణాకు సంబంధించి లాజిస్టిక్ అనుమతులు ఇచ్చాం. ► ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉత్పత్తి 40 నుంచి 45 శాతంగా జరుగుతోంది. ► మొత్తం మీద చూస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం వరకు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
అమెరికా, ఈయూపై అతిగా ఆధారపడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎగుమతుల కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై అతిగా ఆధారపడటం మంచిది కాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది. మొత్తం 23 సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులు ఇవే.. - తోటల పెంపకానికి కూడా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడం - జీఎస్టీని పకడ్బందీగా అమలు చేయడం - మధ్య, చిన్నతరహా పరిశ్రమల నుంచి సానుకూల ఎగుమతులను ప్రోత్సహించడం - పారిశ్రామిక రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించడం. జాప్యం పట్ల అసంతృప్తి అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన ఈ కమిటీ దేశంలో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడంలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రోత్సాహానికి కేంద్రం తగినన్ని నిధులను కేటాయించనందున ఆ శాఖకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు గండిపడుతోందని అభిప్రాయపడింది. ఎగుమతుల్లో ఒక క్రమ పద్ధతిని అనుసరించడం, నిర్దిష్ట ఆలోచనలతో ప్రయత్నించడం, ఎగుమతులను వివిధ రంగాలకు విస్తరింపజేయడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడం, విధానాలను సరళీకృతం చేయడం వంటి చర్యల ద్వారా 2024–25 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల మేరకు ఎగుమతుల లక్ష్య సాధనలో ముందడుగు వేయొచ్చని కమిటీ సూచించింది. వాణిజ్యం, పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహం శాఖకు రూ.9,238.51 కోట్లు కేటాయించాల్సి ఉండగా 2020–21 బడ్జెట్లో రూ 6,219.32 ట్లే కేటాయించడాన్ని కమిటీ ప్రస్తావించింది. -
ఐటీ.. సిటీ మేటి
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు గ్రేటర్ సిటీకి జైకొడుతున్నాయి. మహా నగర శివారు ప్రాంతాలు ఈ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం టీఎస్ ఐపాస్, హార్డ్‌వేర్, ఐటీ పాలసీలను ప్రవేశపెట్టడంతో మూడేళ్లుగా ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలతోపాటు తయారీ, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో దిగ్గజ పరిశ్రమలు వందలాదిగా నగర శివార్లకు తరలివస్తున్నా యి. పరిశ్రమల శాఖ వర్గాల ప్రకారం.. గత 6 నెలల్లో నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు 255 దరఖాస్తులు అందాయి. వీటిలో 60 తయారీరంగం, 80 ప్లాస్టిక్, 40 ఏరోస్పేస్ విడిభాగాలు, 20 ఫార్మా కంపెనీలున్నాయి. ఐటీ సంబంధ కంపెనీలు 55 వరకు ఉన్నాయి. ఇవి శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. రెండేళ్లలో వీటి ద్వారా రూ.18,400 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 2015 నుంచి ఐటీ వెల్లువ.. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రవాహానికి దారులు వేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్‌కు విశేష స్పందన లభిస్తోంది. 2015 నుంచి గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వివిధ రకాల కంపెనీల ఏర్పాటుకు దాదాపు 800 దరఖాస్తులు అందగా, 478 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుతో రూ.28,000 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీల్లో 3.29 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. రాబోయే రెండు మూడేళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉపాధి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ నగరంలో సుమారు వంద చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసరాలకే పరిమితమయ్యాయి. వీటి ద్వారా 50 వేల మందికి ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ కేంద్రంగా ఇప్పటికే బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల శాఖలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంతా అనుకూలమే.. టీఎస్ ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. విస్తరణలో భాగంగా ఇవన్నీ మరిన్ని బ్రాంచీలను ఏర్పాటు చేస్తాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో విశిష్ట భౌగోళిక వాతావరణ పరిస్థితులు, నైపుణ్యంగల ఐటీ నిపుణులు అందుబాటులో ఉండటంతో చాలా కంపెనీలు ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు మక్కువ చూపుతున్నాయి. -
పెట్టుబడులకు స్వర్గధామం
సాక్షి, అమరావతి: రాజకీయ స్థిరత్వం.. పారదర్శక విధానాలు.. అపార సహజ సంపద.. భారీగా భూమి, నీరు, నైపుణ్యమున్న మానవ వనరుల లభ్యత, మెరుగైన రోడ్డు, రైలు మార్గాలు.., 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం.. ఆగ్నేయ ఆసియా దేశాల మార్కెట్లతో సత్సంబంధాలు కలిగి ఉండటం పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ‘గమ్యస్థానం’గా మారిందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 39 మెగా, భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా 33 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రూ.1,840 కోట్ల పెట్టుబడితో 6,572 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈలు) ఉత్పత్తి ప్రారంభించడంతో 49,001 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండటాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. రూ.13 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన 1,736 సంస్థలకు ఏపీఐఐసీ (ఆంధ్రపదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) భూములు కేటాయించడాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్.. సీఆర్ఆర్సీ, జేఎస్‌డబ్ల్యూ, పానాసోనిక్ లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా భాసిల్లుతోందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇదీ వాస్తవ చిత్రం. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతుంటే రాష్ట్రం నుంచి వెనక్కి మళ్లుతున్నాయంటూ ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను అచ్చోసి ప్రజలపై రుద్దాలని చూడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. నూతన విధానంతో వేగంగా అనుమతులు వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులతోపాటు అనుమతులను వేగంగా, పారదర్శకంగా జారీ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంతో ప్రభుత్వం పనిచేస్తోంది. నిపుణులైన మానవ వనరుల కోసం వర్సిటీలు రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ వర్శిటీని ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చే చర్యలు చేపట్టింది. 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మంగళగిరికి సమీపంలోని నవులూరులో రూ.200 కోట్లతో ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. - 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ సింగిల్ డెస్క్ (ఏక గవాక్ష) విధానంలో రూ.38,922 కోట్ల పెట్టుబడితో 1,13,900 మందికి ఉపాధి కల్పించేలా 2,589 పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. - సుమారు రూ.10,944 కోట్ల పెట్టుబడితో 43,300 మందికి ఉపాధి కల్పించే ఏటీసీ టైర్స్, పీఎస్ఏ వాల్సిన్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, వింగ్‌టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు 20 పరిశ్రమల ఏర్పాటుకు అందచేసిన ప్రతిపాదనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఎస్ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) పరిశీలనలో ఉన్నాయి. - లక్నోలో ఇటీవల డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా ఏపీలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. - చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితర దేశాల పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. వెల్లువలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. భూముల కేటాయింపు దగ్గర నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా, పారదర్శకంగా జారీ చేస్తున్నాం. దీనివల్లే తొమ్మిది నెలల్లో 39 భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. రూ.38,922 కోట్లతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు అందచేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం. ఎస్ఐపీబీ ఆమోదముద్ర వేస్తే రూ.10,944 కోట్లతో 20 భారీ పరిశ్రమల పనులు ప్రారంభమవుతాయి. పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలోకి వెల్లువలా వస్తోందనడానికి ఇదే తార్కాణం. రూ. 7,916 కోట్లతో ఏర్పాటైన 8 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి స్థాయిలో ఉన్నాయి. రూ.8,663 కోట్ల పెట్టుబడితో స్థాపించిన 8 పరిశ్రమలు యంత్రాల అమరిక స్థాయిలో ఉన్నాయి. ఇవి అతి త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. వీటివల్ల 19,011 మందికి ఉపాధి లభిస్తుంది. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయి. – రజత్ భార్గవ్, పరిశ్రమల శాఖ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం ఆరు ఓడరేవుల నిర్మాణానికి సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మొదటి దశలో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు ఓడరేవులను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం తన నివాసంలో రాష్ట్రంలో ఓడరేవుల పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉన్నందున వీలైనంత వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. మిగిలిన ఓడరేవులకు కూడా అవసరమైన భూ సమీకరణను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికి రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని చెప్పారు. కేంద్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఒక ఓడరేవును కేంద్రం నిర్మించాల్సి ఉందని, ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంక్షేమానికే ప్రాధాన్యత సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు విస్పష్టంగా చెప్పారు. తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు–నేడు అని, తర్వాత ప్రతి ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది రెండో ప్రాధాన్యత అని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు తీసుకెళ్లే కాల్వల విస్తరణ, పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడ నుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలింపు ప్రాధాన్యత కార్యక్రమాలుగా వివరించారు. ప్రతి జిల్లాకు తాగునీటిని అందించే వాటర్ గ్రిడ్ మరో ప్రాధాన్యతని, ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో స్థిరత్వం ఉంటుందని, అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుందని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. సబ్సిడీ బదులు విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. విద్యుత్ సంస్కరణల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10,000 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామని, దాని బదులు రాష్ట్ర ప్రభుత్వమే 12,000 మెగా వాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ సంస్థలకు ఇస్తే సరిపోతుందన్నారు. ఇందుకోసం సుమారు రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 37 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని, అంటే విద్యుత్ సంస్థలకు నాలుగేళ్లలో చెల్లించే సబ్సిడీ డబ్బుతో సొంతంగా విద్యుత్ సమకూర్చుకోవచ్చని, ఈ దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. -
చదువుల వెంటే కొలువులు
సాక్షి, అమరావతి: చదువులు పూర్తవ్వగానే విద్యార్థులకు ఉపాధి మార్గాలు మెరుగవ్వాలంటే విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య గట్టి అనుసంధానం ఏర్పాటు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల (యూ–ఐ) అనుసంధానంపై ఏర్పాటయిన వర్కింగ్ గ్రూప్ తన నివేదికను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు అందించింది. దీనిపై అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్న కేంద్రం.. త్వరలోనే కొత్త విధానాన్ని ప్రకటించనుంది. నిపుణుల కమిటీ సూచనల ప్రకారం.. వివిధ పరిశోధనలపై పేటెంటు హక్కు కలిగిన నిపుణులు, శాస్త్రవేత్తలతో టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ (టీఐఈసీ)లను ప్రతి వర్సిటీలో ఏర్పాటు చేస్తారు. బోధన, పరిశోధనలు, ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ (ఐపీ) టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తదితర అంశాల్లో ఈ కేంద్రాలు.. వర్సిటీలు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం చేస్తాయి. ఇందుకు యూ–ఐ ఫెసిలిటేషన్ ఫండ్, యూ–ఐ ఆర్డీ ఫండ్, ఐపీ ఫండ్లను యూజీసీ ద్వారా కేంద్రం సమకూర్చనుంది. ఈ కార్యక్రమాలకోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 225 కోట్లు యూజీసీకి బడ్జెట్లో కేటాయించనుంది. పాఠ్య ప్రణాళికల్లో మార్పులు పరిశ్రమలకు అవసరమైన రీతిలో వర్సిటీల కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు ప్రవేశపెడతారు. పాఠ్యాంశాల రూపకల్పనలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేస్తారు. విద్యార్థులు, పరిశోధకులకు ‘పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్’ తప్పనిసరి చేస్తారు. వర్సిటీలు, పరిశ్రమలు కలిసి ‘జాయింట్లీ ఫండెడ్ పీహెచ్డీ’ కార్యక్రమాలను ప్రారంభిస్తాయి. ప్రయోజనాలు ఇవీ.. - వర్సిటీ–పరిశ్రమల అనుసంధానం ద్వారా అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులకు నూతన పరిజ్ఞానం అందుతుంది. - సైన్సు తదితర అంశాల్లో నూతన నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అందుబాటులో ఉంటారు. - అతి తక్కువ ఖర్చుతో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) ఫలవంతమవుతుంది. తద్వారా ప్రజాధనం ఆదా అవుతుంది. - ఈ పరిశోధనల ద్వారా వర్సిటీలకు అదనపు ఆదాయం ఉంటుంది. పరిశోధన ప్రక్రియలు విస్తృతం అవుతాయి. - పరిశ్రమల వాస్తవిక సమస్యలపై లోతైన అధ్యయనం జరగడం ద్వారా సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూడవచ్చు. - విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు. - ఇంటర్న్‌షిప్‌లు తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. - ఇండస్ట్రీలనుంచి వచ్చే అనుభవాంశాల ఆధారంగా పాఠ్యప్రణాళికల రూపకల్పన - పరిశ్రమల ప్రతినిధుల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఏర్పాటు. - పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రీసెర్చి పార్కుల ఏర్పాటు. - శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి, పరిశోధనలను చేపట్టే దిశగా ప్రోత్సాహకాలు. - ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లపై నూతన కోర్సులు. - పారిశ్రామిక భాగస్వామ్యంతో ‘అప్లయిడ్ రీసెర్చి’కి ప్రాధాన్యత. -
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి తరలివచ్చిన పరిశ్రమల జాబితాను కొత్త ఏడాదికల్లా ప్రజల ముందు ఉంచేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఐటీ, పరిశ్రమలరంగ ప్రగతి పరిశీలించారు. అనంతరం మంత్రి మేకపాటి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గడిచిన ఐదు నెలల్లో 12 భారీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రాగా వీటిలో తొమ్మిదింటికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నవంబర్ 18న ముఖ్యమంత్రి వద్ద జరిగే సమీక్షలో ఈ ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తుంటే కొన్ని పత్రికలు, ప్రతిపక్ష నేతలు పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టాక రూ. 14,515 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించాయని, వీటి ద్వారా 17,702 మందికి ఉపాధి లభించిందని, మరో 20 మెగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సమీక్షలో అధికారులు మంత్రికి తెలిపారు. చిత్తూరు జిల్లాలో వివిధ దశల్లో ఆగిపోయిన ఆరు ప్రాజెక్టులకు మరింత సమయం ఇస్తే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రత్యేక ఈవెంట్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని తిరిగి పరిశ్రమల శాఖలోకి తీసుకొచ్చే విషయంపై కూడా సమీక్షలో చర్చించారు. ముఖ్యమంత్రి దృష్టికి మీ సేవ ఉద్యోగుల అంశా>న్ని తీసుకెళ్లేందుకు, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో వారిలో ఏర్పడ్డ భయాందోళనలను తొలగించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను మంత్రి కోరారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఏపీ టీఎస్ ఎండీ నంద కిశోర్, డైరెక్టర్ (ఐ.టీ ప్రమోషన్స్) ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీసీఎల్ సమస్య పరిష్కరిస్తాం.. చైనాకు చెందిన టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు సమీక్షకు ముందు మంత్రిని కలిసి చిత్తూరు జిల్లా వికృతమాల వద్ద ఏర్పాటు చేయనున్న టీవీ అసెంబ్లింగ్ యూనిట్ ప్రాజెక్టు పురోగతిని వివరించారు. విద్యుత్, నీటి, రవాణా వంటి మౌలిక వసతుల్లో సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మేకపాటి.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 10 రోజుల్లో్ల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రూ. 2,200 కోట్లతో 139 ఎకరాల్లో టీసీఎల్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. -
మౌలిక వసతులకే పెద్దపీట
సాక్షి, అమరావతి: కొత్త పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం 2020 – 25 తయారీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీల కంటే స్థానికంగా కల్పించే మౌలిక వసతులు, నిపుణులైన మానవ వనరుల కల్పన వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రాయితీలు ప్రకటించడం కంటే కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఒకేచోట కల్పిస్తే కంపెనీలు వాటంతట అవే వస్తాయన్నది అధికారుల అంచనా. గత ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించినా సరైన మౌలిక వసతులు లేకపోవడంతో కంపెనీలు రాని విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో తక్కువ కాకుండా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఇంతకాలం కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ప్లగ్ అండే పే విధానాన్ని ఈ పార్కుల ద్వారా తయారీ రంగంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో నిపుణులైన మానవ వనరుల లభ్యత ప్రధానమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలకు అవసరమైన నిపుణులను ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. ఒక కంపెనీ శంకుస్థాపన చేసిన రోజున ఎటువంటి మానవ వనరుల నిపుణులు కావాలో చెబితే ఆ కంపెనీ ప్రారంభించే నాటికి ఆ మేరకు సమకూరుస్తారు. ఇదే విషయాన్ని నూతన పారిశ్రామిక విధానంలో స్పష్టంగా పేర్కొననున్నారు. ఈ నెలాఖరుకు ముసాయిదా సిద్ధం ప్రస్తుత పారిశ్రామిక విధానం వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో 2020 ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా రూపొందిస్తున్నారు. ఇది రెండు వారాల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత అన్ని రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా పాలసీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పులపై చర్చించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుందని చెప్పారు. అన్నిటికీ కలిపి ఒకే పాలసీ ఇప్పటి వరకు పారిశ్రామిక, ఐటీ, మెరైన్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం అంటూ రకరకాల పాలసీలు ఉండటం వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఏ పాలసీలో ఏ రాయితీలు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళానికి ఫుల్స్టాప్ పెడుతూ ఏయే రంగాలకి ఎటువంటి రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామో తెలియచేస్తూ ఒకే పారిశ్రామిక పాలసీ విడుదల చేయాలని పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే విధంగా ఒక రంగానికి చెందిన కంపెనీలకు పోటీ పేరుతో ఇష్టమొచ్చిన విధంగా రాయితీలు ప్రకటించే వారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేస్తూ ఒకే రంగానికి చెందిన కంపెనీలకు ఒకే రకమైన రాయితీలు ఇవ్వనున్నారు. ఈ దిశగా నూతన పారిశ్రామిక విధానంలో కీలక మార్పు తేనున్నారు. -
పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో 75 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. పరిశ్రమల రంగంపై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన మానవ నవరులను తీర్చిదిద్దడానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఎంపిక చేసి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం త్వరితగతిన 25 ఇంజనీరింగ్ కళాశాలలను ఎంపిక చేయాలన్నారు. పారిశ్రామిక వర్గాలకు మానవ వనరుల కొరత తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ టెండర్లతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు రాష్ట్రంలో అమలు చేస్తున్న అత్యున్నత పారిశ్రామిక విధానాలను పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానానికి రూపకల్పన చేయాలని చెప్పారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, మెట్రో రైల్, ఎలక్ట్రికల్ బస్సులు వంటి బీవోటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. రాయలసీమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కడప ఉక్కు కర్మాగారం నిర్మాణంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు ఎలా వచ్చాయో? గత తెలుగుదేశం ప్రభుత్వం పరిశ్రమలను కూడా మోసం చేసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాయితీలు ఇస్తాం.. పెట్టుబడులు పెట్టండి అని చెబుతూ దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసిన గత ప్రభుత్వం చివరకు మొండిచేయి చూపిందన్నారు. 2015–16 నుంచి రూ.2,000 కోట్ల మేర పారిశ్రామిక రాయితీలు బకాయిలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టమని ఏ ముఖం పెట్టుకొని అడుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో పారిశ్రామిక బకాయిలున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చిచెప్పారు. మున్సిపాల్టీలు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వాడటం ద్వారా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదన్నారు. ఇజ్రాయెల్‌లో రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారని వివరించారు. ఆ దేశంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ విధానంలో మంచినీటిగా మార్చి, ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ లాభదాయక సంస్థగా మారాలి నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభదాయక సంస్థగా మారేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని అన్నారు. భారీ సంఖ్యలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా డీజిల్ భారాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించడం ద్వారా చౌకైన జలరవాణా వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. పంట ఉన్నచోటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏ నియోజకవర్గంలో ఏయే పంటలు పండుతున్నాయో అక్కడే ఆయా పంటల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్వా సాగు అవుతున్న ప్రాంతాలను గుర్తించి నకిలీ సీడ్, దాణా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలుష్యంపై కఠిన వైఖరి పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని అరికట్టాలని, ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల వల్ల పర్యావరణానికి నష్టం కలగడానికి వీల్లేదన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఆమోదించిన తర్వాతే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. పీసీబీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కఠినంగా లేకపోతే భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందులు వస్తాయని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. -
త్వరలో నూతన పారిశ్రామిక విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా త్వరలో నూతన పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక పాలసీలు వచ్చే ఏడాదితో ముగియనుండడంతో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో ప్రకటించిన రాయితీలు, పాలసీలు కేవలం వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే ప్రయోజనాలు వర్తించేవని, దీంతో కార్పొరేట్ సంస్థల్లో ఒక రకమైన ఆందోళన ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాకుండా అందరికీ వర్తించే విధంగా గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పాత పాలసీల గడువు ముగిసే లోపు 100 రోజుల కార్యక్రమం లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రూ.7,000 కోట్లు అడిగాం... పారిశ్రామిక రంగానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు రూ.7,000 కోట్లు, ఐటీ శాఖకు రూ.1,400 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా ఆర్థిక మంత్రిని కోరినట్లు గౌతంరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం మేరకు కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐటీపై ప్రత్యేక దృష్టి బెంగళూరు, పూణే నగరాలతో పోటీ పడే విధంగా విశాఖ నగరానికి ఐటీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఐటీ పెట్టుబడుల్లో వేగంగా విస్తరించడానికి విశాఖకు అపార అవకాశాలున్నాయని అన్నారు. విశాఖ తర్వాత మంగళగిరి, తిరుపతి వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు, చెన్నై, బెంగళూరులకు దగ్గరగా ఉన్న తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. -
రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ, జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. సుమారు రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసిన పోస్కో కంపెనీ ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలియచేశారు. పోస్కో ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గిల్హో బాంగ్, పోస్కో మహారాష్ట్ర సీఎఫ్‌వో గూ యంగ్ అన్లతో పాటు పోస్కో సీనియర్ ప్రతినిధులు సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉన్నందున వైఎస్సార్ జిల్లాలో కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దీనికి అంగీకరించిన పోస్కో ప్రతినిధులు కడపలో కర్మాగారం ఏర్పాటు సాధాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా సుమారు 6,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిదార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఏటీజీ టైర్ల కంపెనీ! విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో సుమారు రూ.1,600 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) ఆసక్తి కనపరుస్తోంది. సుమారు 100–125 ఎకరాల్లో అచ్యుతాపురం సెజ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందచేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగ యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఏటీజీ తయారు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక యూనిట్ ఉండగా విశాఖ వద్ద మరో యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టీసీఎల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి: సీఎం చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్ యూనిట్ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానికి సంస్థ టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సుమారు రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే భూమి, నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు టీసీఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ సీఈవో కెవిన్ వాంగ్, టీటీఈ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ అలెన్ చెన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద అన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, టీసీఎల్ సమస్యలను పరిష్కరించి త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను ఆదేశించారు. కంపెనీలకు అనుమతుల మంజూరులో అవినీతికి తావు ఉండకూడదని, ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపినట్లు తెలిస్తే ఎంత స్థాయి రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా క్షమించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. -
టీఎస్ ఐపాస్‌కు కొత్త మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోన్న టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. నాలుగేళ్లుగా టీఎస్ ఐపాస్ అమలు తీరుపై సమీక్షించడంతోపాటు, అవసరమైన చోట సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత వస్తేనే మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తారని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత కాలంగా పరిశ్రమలకు భూ కేటాయింపులను కూడా పరిశ్రమల శాఖ నిలిపివేసింది. రాయితీలు, ప్రోత్సాహకాల చెల్లింపులో తదుపరి మార్గదర్శకాలు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను అనుసరించాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక చట్టం ‘టీఎస్ ఐపాస్–2014’ను రూపొందించింది. 2015 జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వెలువడే ఆదేశాల కొరకు పారిశ్రామికవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పెరిగిన పారిశ్రామిక వృద్ధి రేటు.. రాష్ట్రంలోని వనరులను దృష్టిలో పెట్టుకుని 14 ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాలను రూపొందించారు. పెట్టుబడులతో వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘సింగిల్ విండో’విధానంలో ఆన్లైన్ ద్వారా 23 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 57 రకాల అనుమతులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘స్పెషల్ చేజింగ్ సెల్’ఏర్పాటు చేశారు. టీఎస్ ఐపాస్ అమల్లోకి వచ్చిన సుమారు నాలుగేళ్ల కాలంలో రూ.1.58 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, 15.28 లక్షల మంది ఉపాధి కల్పన జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు 20.8 శాతం కాగా 2015–18 మధ్య కాలంలో తెలంగాణ ఏకంగా 68.5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) అధ్యయన నివేదిక వెల్లడించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు చేరాయి. పెట్టుబడులపై విశ్లేషణ.. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందినవి ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ట్రేడ్, ఎలక్ట్రికల్ వెహికల్, సోలార్.. తదితర రంగాల్లో రూపొందించే ప్రత్యేక పాలసీలతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెట్టుబడులకు వీలున్న రంగాలపై ఎక్కువ దృష్టి సారిస్తూ, టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాల్లో ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత ఇచ్చేలా పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభిం చింది. నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతోపాటు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక పార్కుల ఏర్పాటు వంటి అంశాలకు టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు టీఎస్ ఐపాస్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ–ప్రైడ్, ఇతరుల కోసం టీ–ఐడియా పేరిట పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ రెండు పారిశ్రామిక రాయితీ పథకాల్లో భాగంగా పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, అమ్మకం పన్నుపై రాయితీ, పావలా వడ్డీ తదితర ప్రోత్సాహకాలను ప్రకటించారు. టీఎస్ ఐపాస్ 2014 చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. టీప్రైడ్, టీ–ఐడియాకు సంబంధించి సుమారు రూ.2,200 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో టీ–ఐడియాకు సంబంధించి రూ.1,600 కోట్లు, టీ–ప్రైడ్కు సంబంధించి రూ.600 కోట్ల మేర రాయితీ బకాయిలు పేరుకుపోయాయి. నూతన మార్గదర్శకాల్లో రాయితీలు, ప్రోత్సాహకాల విడుదలపై స్పష్టమైన గడువు విధించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. -
‘టీ–ఐడియా’ నిబంధనల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించే ‘టీ–ఐడియా 2014’పథకం నిబంధనల్లో పరిశ్రమల శాఖ పలు మార్పులు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన నియమావళి ప్రకారం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా విడుదల చేస్తారు. ప్రోత్సాహకాల చెల్లింపునకు అవసరమైన మొత్తాన్ని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఖాతాకు పరిశ్రమల శాఖ కమిషనరేట్ బదిలీ చేస్తుంది. ఇప్పటివరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సీ) ఆమోదంతో దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా పరిశ్రమల శాఖ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ విడుదల చేసే ప్రోత్సాహకాల మొత్తంలో ఇకపై 10 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఎస్ఐహెచ్సీఎల్) ఖాతాకు జమ చేస్తారు. ప్రోత్సాహకాల విడుదల కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇకపై టీఎస్ఐహెచ్సీఎల్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా పరిశ్రమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితరాలపై అధ్యయనం చేసి, సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ప్రోత్సాహకాలను విడుదల చేస్తారు. గతంలో కొన్ని పరిశ్రమలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుని మూత పడిన నేపథ్యంలో అవకతవకలు నివారించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు ప్రోత్సాహకాల విడుదల బాధ్యతను అప్పగించారు. బ్రిడ్జి రుణాలు రాబట్టుకునేందుకే! నష్టాల బాటలోఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను (టీఎస్ఐహెచ్సీఎల్) రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్తాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులు తదితరాలతో నష్టాలబమS బాటన పయనిస్తున్నారు. నష్టాల బాటలో ఉన్న సుమారు 3,700 పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ బ్రిడ్జి రుణాలను మంజూరు చేస్తోంది. తాజాగా సవరించిన టీ–ఐడియా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి రుణగ్రస్త పరిశ్రమలకు విడుదలయ్యే ప్రోత్సాహకాలు ఇకపై హెల్త్ క్లినిక్ ఖాతాలో జమ అవుతాయి. తాము గతంలో ఆయా పరిశ్రమలకు ఇచ్చిన బ్రిడ్జి లోన్‌ను మినహాయించుకుని, మిగతా ప్రోత్సాహకాన్ని సంబంధిత పరిశ్రమలకు హెల్త్ క్లినిక్ విడుదల చేస్తుంది. -
లక్ష రూపాయల కంపెనీకి 200 ఎకరాలు
సాక్షి, అమరావతి: ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం కాగితంపై ఏర్పాటైన ఒక కంపెనీకి రూ.వందల కోట్ల విలువైన భూమిని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయిస్తుందా? కేవలం రూ.లక్ష మూలధనంతో ఒక కంపెనీని నమోదు చేసుకొని వందల కోట్ల పెట్టుబడితో వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటే చాలు.. ముందూవెనుక ఆలోచించకుండా రూ.కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చేస్తోంది. అక్టోబర్‌లో కాగితాలపై ఏర్పాటైన కంపెనీ నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదిం చడం, ఆ తర్వాత మూడు రోజులకే జీవో విడుదల కావడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎన్నికల వేళ మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించిన భూముల వ్యవహారం ఉన్నతా ధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.40 కోట్లకే 200 ఎకరాలు తిరుపతికి అత్యంత సమీపంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో మెడికల్ డివైస్ పార్కును ఏర్పాటు చేయడానికి మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు 200 ఎకరాలు కేటా యిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం రూ.కోటిన్నర పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.20 లక్షలకే కేటాయించింది. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం.. రూ.300 కోట్లు పలుకుతున్న 200 ఎకరాల భూములను కేవలం రూ.40 కోట్లకే అప్పగించేసింది. అంతేకాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా మరో రూ.50 కోట్లు ప్రాజెక్టు వ్యయంలో సబ్సిడీగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చకచకా కదిలిన ఫైలు కేవలం లక్ష రూపాయల మూలధనంతో గతేడాది అక్టోబర్ 24న మొగిలి ఇందు మౌళి (మేనేజింగ్ డైరెక్టర్), బండారు నరసింహారావు, అరగొండ రోహిత్ రెడ్డిలు డైరెక్టర్లుగా మేజెస్ ఎలక్ట్రానిక్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటైంది. తిరుపతి సమీపంలో రూ.188 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ పార్కును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం నవంబర్ 28న మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అక్కడ నుంచి ఫైలు అత్యంత వేగంగా కదిలింది. ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం కావడం, 2014–20 పారిశ్రామిక పాలసీకి అదనంగా సబ్సిడీ ధరకే భూమి కేటాయించడం, పెట్టుబడి వ్యయంలో 30 శాతం సబ్సిడీగా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇది జరిగిన మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవోను పరిశ్రమల శాఖ విడుదల చేయడం గమనార్హం. ఎలాంటి అనుభవం లేకున్నా.. పేరుకు మేజెస్ ఎలక్ట్రానిక్ పార్క్ అని కనిపిస్తున్నా దీని వెనుక దుబాయ్‌కు చెందిన కంపెనీ కీలకపాత్ర పోషించింది. ప్లాస్టిక్ చెత్త కవర్లు, చెత్తబుట్టలు తయారుచేసే దుబాయ్‌కు చెందిన అల్ బకరా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సీ; ముఖానికి, తలకి తగిలించుకునే మాస్క్‌లు తయారు చేసే మెడిక్యూబ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిదార్థ ఇన్ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్‌లు కలిసి మేజెస్ను ఏర్పాటు చేశాయి. రూ.188 కోట్ల పెట్టుబడితో వైద్య పరికరాల పార్కును అభివృద్ధి చేస్తామని, ఈ పార్క్ ద్వారా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ ఈ మూడు సంస్థలకు వైద్య పరికరాల తయారీలో ఎటువంటి అనుభవం లేదు. కేవలం మెడికల్ పార్క్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కారుచౌకగా ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు కనిపిస్తోందని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇలా ఒక అనామక కంపెనీకి రూ.310 కోట్ల ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
ఆన్లైన్లో కొనేద్దామా!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగం కావాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ ఉపకరణాలు మొదలు తమకు అవసరమైన స్టేషనరీని తక్కువ ధరకు ఆన్లైన్లో కొనుగోలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో అవకతవకలు లేకుండా కొనుగోళ్లు చేయవచ్చని భావిస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యం లో కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం)ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ శాఖ తరఫున జీఈఎం పోర్టల్ నుంచి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ సంబంధ యంత్రాలూ అందులో లభ్యమవుతున్నాయని, వివరాలు పూర్తిగా తెలుసుకున్నాక కొనుగోలు చేస్తామని వివరించారు. పత్తి యంత్రాలు మొదలు ల్యాప్‌టాప్‌ల వరకూ... ప్రైవేటులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా తదితర ఆన్లైన్ పోర్టళ్లు ఎలాగో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే జీఈఎం అలాంటిదే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా వస్తువులపై కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉండవు. కాబట్టి తక్కువ ధరకే లభిస్తాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్టేషనరీ మొదలు ల్యాప్‌టాప్‌లు, కార్లు, వ్యవసాయ ఉపకరణాలన్నీ లభ్యమవుతాయి. హైఎండ్ ఇన్నోవాకారు బయటి మార్కెట్లో రూ. 20 లక్షలుంటే, జీఈఎంలో రూ.16 లక్షలకే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. పత్తిని తీసేందుకు బ్యాటరీతో పనిచేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, హార్డ్‌వేర్ పరికరాలు, సీసీ కెమెరాలు, ప్యాసింజర్ మోటార్ వాహనాలు, కార్యాలయ ఫర్నిచర్ వంటి 8 వేలకు పైగా ఉత్పత్తులు అందిస్తున్నారు. ఇప్పుడు అందజేస్తున్న వ్యవసాయ యంత్రాలను ఆన్లైన్లో కొనుగోలుచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయమని చెబితే పోర్టల్‌లోనే ఆర్డర్ చేయడానికి వీలుంది. ఇప్పటికే ట్రాక్టర్లు సబ్సిడీపై ఇస్తున్నామని, వాటినీ ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జీఈఎంలో కొనుగోలుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి జీఈఎంలో కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ ఉపసంచాలకులకు ఈ–మెయిల్ సౌకర్యం కల్పించి అవసరమైనవి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నారు. -
గుండ్లపోచంపల్లిలో హస్తకళల శిక్షణా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గుండ్లపోచంపల్లి పారిశ్రామిక వాడలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా మని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని నిర్వహణ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయి స్తామన్నారు. అలాగే ఈ పారిశ్రామికవాడలో సంబంధం లేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తుల అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. చేనేత శాఖపై మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. పాశమైలారం టెక్స్టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు టెస్కో ఆధ్వర్యంలో విక్రయ కేంద్రాల పెంపు, వెబ్సైట్ ఏర్పాటు, రీ బ్రాండింగ్ వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, లూమ్స్ అప్‌గ్రెడేషన్ వంటి కార్యక్రమాలను లబ్ధిదారుల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లను నియమించుకోవాలన్నారు. సెప్టెంబర్‌లోగా అందుబాటులోకి బతుకమ్మ చీరలు: చేనేత శాఖ డైరెక్టర్ ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ మంత్రికి నివేదించారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయిస్తున్నామని, సెప్టెంబర్ మూడో వారంలోగా చీరలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ను కలిసిన బ్రిటన్ మంత్రి సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వంలోని ఆసియా, పసిఫిక్ వ్యవహారాల మంత్రి మార్క్ ఫీల్డ్ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును మంగళవారం కలిశారు. బ్రిటన్ హై కమిషనర్ డొమినిక్ అస్క్విత్, డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను కలిసిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడల విశేషాలను కేటీఆర్ బ్రిటన్ మంత్రికి తెలియజేశారు. -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
బత్తాయి చేదు.. టమాటా కుదరదు!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో పండించే బత్తాయిలో కొంత చేదుదనం ఉంటుంది. అలాంటి బత్తాయిని ప్రాసెసింగ్ చేసి పల్ప్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారు చేసి నిల్వ ఉంచడం సాధ్యంకాని పని. ఇక టమాటా కూడా అలాంటిదే. రాష్ట్రంలో పండించే టమాటాలు ప్రాసెసింగ్‌కు పనికిరావు. వాటి ద్వారా టమాటా సాస్ వంటివి తయారు చేయలేం. ఎంతో పేరున్న బంగినపల్లి మామిడి సహా ఇతర రసాలతో అనుబంధ ఉత్పత్తులు తయారు చేయలేం. మిర్చి, పసుపు తదితరాల ద్వారా అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకు అవి పనికి రావు’అని ఉద్యాన నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రతీ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎలా ఏర్పాటు చేయగలమనే సందేహం వ్యవసాయ శాఖ అధికారులను పట్టిపీడిస్తోంది. ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి పరిశ్రమల శాఖ ముసాయిదా విధాన పత్రాన్ని సమర్పించింది. అయితే ఆ విధాన పత్రం రాష్ట్ర పరిస్థితులకు తగినట్లు లేదని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో అందులో మార్పులు చేయాలని, మరింత అధ్యయనం అవసరమని నిర్ధారణకు వచ్చారు. ప్రాసెసింగ్ యూనిట్లు లేని చోటే ఏర్పాటు చేసేలా ప్రోత్సాహకాలు ఉండాలని, అందుకు తగ్గట్లుగా పారిశ్రామిక వేత్తలకు వెయిటేజీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు ప్రయోజనం కలుగుతుందా లేదా అనే అంశాన్ని ఆధారం చేసుకొనే ఏర్పాటు చేయాలని సూచించింది. మార్చాల్సిందే.. రాష్ట్రంలో ఆహార పంటలు అవసరానికి మించి పండుతుండటంతో వాటిని మార్కెటింగ్ చేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ సీజన్లో కిలో రూ.100 వరకు ఉండే టమాటా సీజన్లో రూపాయికి పడిపోతున్న పరిస్థితి ఉంది. మిర్చి ధర కూడా క్వింటా రూ.12 వేలు పలకాల్సింది పోయి రూ.3–4 వేలకు పడిపోతోంది. కంది, పెసర వంటి పప్పుధాన్యాలకూ మద్దతు ధర దొరకడం లేదు. ఈ నేపథ్యంలో విరివిగా వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మరోవైపు రాష్ట్రంలో పండించే పంట రకాలను ఆధారం చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఉదాహరణకు పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పండించే టమాటా రకమే సాస్‌కు పనికొస్తుంది. మన రకం టమాటా పనికిరాదు. కాబట్టి మన వద్ద ఉన్న పంట రకాలను మార్పు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే టమాటా, బత్తాయి, మిర్చి, మామిడి వంటి రకాలను మార్చాలి. అలా చేస్తేనే ప్రాసెసింగ్ యూ నిట్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. తాజా ఆహారమంటేనే ఇష్టం ఇక దేశంలో ప్రజలు తాజా ఆహారాన్నే ఇష్టపడుతుంటారు. నిల్వ చేసిన పదార్థాలకు పెద్దగా ఆదరణ ఉండదు. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్లు ఏమేరకు లాభదాయకంగా ఉంటాయన్న అనుమానాలున్నాయి. అలాగే వ్యవసాయ పంటలు రెండు సీజన్లలోనే పండుతాయి. ఏడాది పొడవునా ఉండవు. కాబట్టి కేవలం సీజన్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తాయి. కాబట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారా అనే అనుమానాలూ ఉన్నాయి. దీంతో ప్రాసెసింగ్ యూనిట్లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమగ్ర అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. -
హైనన్ ప్రావిన్స్‌తో రాష్ట్రం ఎంవోయూ
- చైనాతో తెలంగాణ మైత్రీ బంధం - ఐటీ, తయారీ రంగాల్లో పరస్పర సహకారానికి కృషి - మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు - పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మారుస్తాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: చైనాలోని హైనన్ ప్రావిన్స్ (రాష్ట్రం)తో తెలంగాణ దృఢ మైత్రీ బంధం ఏర్పరుచుకుంటుందని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. హైనన్ ప్రావిన్స్, రాష్ట్రం నడుమ మైత్రీ బంధానికి (సిస్టర్ ప్రావిన్స్ రిలేషన్) సంబంధించి సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హైనన్ ప్రావిన్స్ తరఫున అక్కడి గవర్నర్ లీ సుగుయ్ సంతకాలు చేశారు. ఈ ఎంవోయూ ప్రకారం ఇరుపక్షాలు ఐటీ, తయారీ, ఇతర రంగాల్లో సహకారానికి సమానత్వం, పరస్పర లబ్ధి ప్రాతిపదికన కృషి చేస్తాయి. తద్వారా స్నేహ సంబంధాలతోపాటు ఆర్థిక, వాణిజ్య బంధాలను ఏర్పరచుకుంటాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా చైనా ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులకు తెలంగాణను ప్రథమ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. పరస్పర వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కలసి నడుస్తామని సుగుయ్ తెలిపారు. హైనన్ ప్రావిన్స్‌లో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను లీ సుగుయ్ ఆహ్వానించగా మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు హైనన్ ప్రావిన్స్‌తో టీ హబ్ మరో ఎంవోయూ కుదుర్చుకోగా హైనన్ ప్రావిన్స్‌లో ఆస్పత్రి స్థాపనకు అపోలో హాస్పిటల్స్ కూడా ఎంవోయూ కుదర్చుకుంది. సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతోపాటు హైనన్ ప్రావిన్స్ ప్రతినిధులు లూ జియువాన్, వాంగ్ షెంగ్, ఎల్వీ యాంగ్, హాన్ యాంగ్ పాల్గొన్నారు. -
ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు
- రెండేళ్లలో రూ.35 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు - గతేడాది రూ.68,258 కోట్ల మేర ఐటీ ఎగుమతులు - టీఎస్ ఐపాస్, ఐటీ పాలసీలతో పెట్టుబడులకు ఊపు - ప్రాథమిక దశలోనే నిమ్జ్, ఫార్మాసిటీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పారదర్శకత, సరళమైన, అవినీతి రహిత విధానాలకు పెద్దపీట వేస్తూ... నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది. 2014 నవంబర్ 27న టీఎస్ఐపాస్కు చట్టబద్ధత కల్పించగా 2015 జూన్ 12న సీఎం కేసీఆర్ నూతన పాలసీని ఆవిష్కరించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి ఎదురేగి స్వాగతం పలికి, పరిశ్రమల స్థాపనకు అనుమతులు, సౌకర్యాలు సమకూర్చేలా సీఎం కార్యాలయంలో ‘ఛేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. భారీగా పెట్టుబడులు ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంగా ప్రభుత్వం చెబుతున్న టీఎస్ ఐపాస్ ద్వారా ఏడాది వ్యవధిలోనే రూ.35 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో 396, జిల్లా స్థాయిలో 1,623 పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... 1,20,169 మందికి కొత్తగా ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తోంది. టీఎస్ఐపాస్ ఆవిష్కరణ రోజే రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు ప్రకటించగా... తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. టీఎస్ ఐపాస్ ద్వారా మరో ఏడాదిలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు వీలుగా 1.45 లక్షల ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీకి సర్కారు అప్పగించింది. మూతపడిన నిజాం షుగర్స్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమ నిజాం దక్కన్ షుగర్స్‌ను నష్టాలు సాకుగా చూపుతూ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ మూసివేసింది. దీంతో సుమారు 350 మంది ఉద్యోగులతో పాటు వేల మంది రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మె గా టెక్స్టైల్ పార్కు, చేనేత విధానం రూపకల్పన ప్రాథమిక దశలోనే ఉండగా.. రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రెండేళ్లలో ముగ్గురు మంత్రులు రాష్ట్ర ఆవిర్భావం రోజున తొలి మంత్రివర్గంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా పరిశ్రమల శాఖ బాధ్యత చేపట్టారు. 2014 డిసెంబర్లో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జరిగిన మంత్రిత్వ శాఖల మార్పుల్లో కేటీఆర్‌కు పరిశ్రమల శాఖను అప్పగించారు. ఔత్సాహికులకు ప్రేరణ టీ-హబ్ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ‘టీ-హబ్’ పేరిట 2015 నవంబర్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఐఐటీ, ఐఎస్బీ, నల్సార్ వర్సిటీ సహకారం అందిస్తున్న టీ-హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రేరణ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఫైబర్ గ్రిడ్, రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది. భూసేకరణ వివాదాల్లో నిమ్జ్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం భారీ పారిశ్రామిక వాడల ఏర్పాటును ప్రతిపాదించింది. కొన్ని ప్రతిపాదనలకు భూసేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించగా... మరికొన్ని ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్కు స్థాపనకు కేంద్రం అనుమతివ్వగా ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధమైనా సీఎం వద్ద పరిశీలన దశలోనే ఆగిపోయాయి. ► మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 12 వేల ఎకరాల్లో నిమ్జ్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 3,700 ఎకరాలను మాత్రమే సేకరించారు. నిర్ణీత గడువులోగా భూమి సేకరిస్తేనే నిమ్జ్‌కు తుది అనుమతులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ► రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫార్మాసిటీ’ని 12,500 ఎకరాల్లో స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి డీపీఆర్ తయారీ ప్రాథమిక దశలోనే ఉండిపోయింది. భూసేకరణ కూడా నత్తనడకన సాగుతోంది. పరిహారం చెల్లింపు విషయంలో జహీరాబాద్, ముచ్చర్లలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఐటీకి ప్రత్యేక పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,300కుపైగా ఐటీ కంపెనీలుండగా.. ఐటీ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా గతే ఏడాది రూ.68,258 కోట్లు ఆర్జించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి జాతీయ దిగ్గజ కంపెనీలకూ హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఆన్లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గ్రామీణ యువతను పట్టణ యువతతో సమానంగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నూతన ఐటీ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నోవేషన్, గేమింగ్-యానిమేషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ తదితర అనుబంధ పాలసీలూ తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు రాయితీలను ప్రకటించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రం నుంచి రూ.1.36 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో పాటు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
రూ. 100 కోట్లు.. వెయ్యి ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు చేపట్టిన రెండు వారాల అమెరికా పర్యటన సానుకూలాంశాలతో ప్రారంభమైంది. పర్యటన తొలి రోజులో భాగంగా కేటీఆర్ సోమవారం ఇల్లినాయీస్ రాష్ట్రంలోని షికాగో నగరంలో పలువురు పెట్టుబడిదారులు, సంస్థలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలను వివరించారు. అలాగే ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 100 కోట్లు) పెట్టుబడులు పెట్టడంతోపాటు వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కేర్ సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే రెడ్ బెర్రీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ కాంత్, జెనెసిస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ మోనిఫ్ మాటోక్, సేఫీ హోల్డింగ్స్ సీఈఓ అఫీ హసన్ తదితరులు కేటీఆర్‌తో సమావేశమై పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు బిజీ బిజీగా... తొలి రోజు పర్యటనలో కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. తొలుత భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్‌తో సమావేశమైన కేటీఆర్.. ఆ తర్వాత ఇల్లినాయీస్ డిప్యూటీ గవర్నర్ ట్రే చిల్డ్రెస్తో భేటీ అయ్యారు. ఇల్లినాయీస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఫార్మా, ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. టీ హబ్తోపా టు తెలంగాణ ప్రభుత్వ విధానాలను అభినందించిన ట్రే చిల్డ్రెస్.. ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులకు పలు ఇల్లినాయీస్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలోని షి కాగో నగరంతో తెలంగాణకు.. ముఖ్యంగా హై దరాబాద్ నగరానికి ప్రత్యేక అనుబంధముందన్నారు. పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు.. భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్ విందు ఏర్పాటు చేసి జ్ఞాపికను అందజేశారు. ఇండియానా గవర్నర్‌తో కేటీఆర్ భేటీ షికాగో నుంచి ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానాపోలిస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశమయ్యారు. అనంతరం ఇండియానాపోలిస్-హైదరాబాద్ సిస్టర్ సిటీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ర్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించారు. ఇండియానాపోలిస్తో రాష్ట్రానికున్న సాంస్కృతిక, వ్యాపార సంబంధాలపై మంత్రి ప్రసంగించారు. తొలి రోజు పర్యటనలో మంత్రి వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు. -
నాలుగేళ్లలో ఎగుమతులు డబుల్
♦ ఎక్స్పోర్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ♦ ప్రస్తుత వార్షిక ఎగుమతులు రూ.లక్ష కోట్లు ♦ డ్రైపోర్టులు, జలమార్గాల అభివృద్ధిపై దృష్టి ♦ ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: సరుకుల ఎగుమతులను వచ్చే నాలుగేళ్లలో రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏటా రూ.లక్ష కోట్ల విలువ చేసే ఎగుమతులు జరుగుతుండగా.. 2019-20 నాటికి రూ.2 లక్షల కోట్లకు చేర్చాలని నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటికే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు ఫార్మాసిటీ, నిమ్జ్, మెడికల్ డివెజైస్, టెక్స్టైల్, సుగంధ ద్రవ్యాల పార్కుల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన విధానంలో పొందుపరచాల్సిన విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. ఎగుమతులపరంగా రాష్ట్రవాటా 1.93 శాతం కాగా.. దేశంలో 12వ స్థానంలో వుంది. రాష్ట్రం నుంచి ప్రధానంగా ఫార్మా, బల్క్‌డ్రగ్, వ్యవసాయ, సాగు ఆధారిత ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, చేనేత, వస్త్ర, హస్త కళా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వీటితోపాటు కార్పెట్లు, వజ్రాభరణాలు, రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తులు.. గ్రానైట్, బెరైటీస్, ఫెల్స్పార్, క్వార్ట్జ్ తదితర ముడి ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లైఫ్‌సెన్సైస్, ఐటీ, హార్డ్‌వేర్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత, వస్త్ర పరిశ్రమ.. తదితర 14 ప్రధాన రంగాలకు పరిశ్రమల శాఖ ప్రత్యేక పాలసీలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఎగుమతుల విధానం రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఎగుమతుల కమిషనర్‌గా నియమిస్తూ.. పాలసీ విధి విధానాలు రూపొందించే బాధ్యత అప్పగించింది. మరోవైపు దీనిపై సూచనలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. డ్రైపోర్టులు.. జల మార్గాలు రాష్ట్రం చుట్టూ భూభాగం ఆవరించి ఉండటంతో నూతన విధానంలో డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదిస్తూ.. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరారు. ఈ మేరకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే కన్సల్టెన్సీ రాష్ట్రంలో రెండు చోట్ల డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. ఒక్కో డ్రైపోర్టు ఏర్పాటుకు 1,200 ఎకరాల భూమి, రూ.3,020 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. పొరుగు రాష్ట్రాల్లోని నౌకాశ్రయాలను కలుపుతూ కృష్ణా, గోదావరి నదీ జలమార్గాల అభివృద్ధికి కేంద్ర సాయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ట్రేడ్ సెంటర్ మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఫార్మాసిటీ, వరంగల్ టెక్స్టైల్ పార్కు, పాశమైలారం పారిశ్రామిక పార్కులో ఉమ్మడి కాలుష్య శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు మేధో సంపత్తి కేంద్రాలు ఉండగా.. వీటి సంఖ్యను మరింత పెంచడం ద్వారా మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్‌మార్కుల రిజిస్ట్రేషన్ తదితరాలకు రక్షణ కల్పిస్తారు. చెన్నై ట్రేడ్ సెంటర్, బెంగుళూరు ట్రేడ్ సెంటర్ తరహాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రేడ్ సెంటర్ స్థాపించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా తెలంగాణ వాణిజ్య భవనం పేరిట ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిర్మిస్తారు. అపెడా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడి ప్యాకేజింగ్, స్టోరేజీ సపోర్ట్, ఎగుమతి విధానాలు, నిబంధనలు తదితరాలపై ఎగుమతిదారులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్యత్ బంధు పథకం ద్వారా కోరాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎగుమతులకు అనువైన వాతావరణం, అవరోధాలు, మౌలిక సౌకర్యాల కల్పనపై ఇప్పటికే స్థూల అవగాహనకు వచ్చామని.. త్వరలో నూతన విధానం రూపొందించి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపుతామని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పాయి. -
త్వరలో కార్మిక విధానాల సరళీకరణ
సీఐఐ సదస్సులో ‘డిప్’ సంయుక్త కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: స్టార్టప్ ఇండియా విధానం ద్వారా దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక సంస్థ(డిప్) సంయుక్త కార్యదర్శి మహేంద్ర బలరాజ్ అన్నారు. కార్మిక విధానాలను సరళీకరించడం ద్వారా పరిశ్రమల యజ మానులు, కార్మికులకు లాభదాయకంగా ఉండే లా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) తెలంగాణ శాఖ చైర్మన్ వనిత దాట్ల అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో బలరాజ్ మాట్లాడారు. రక్షణ రంగ ఉత్పత్తుల పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించాలనే సూచనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల(ఎఫ్ఎంసీజీ) కోసం ప్రత్యేక విధానం రూపొందించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ వెల్లడించారు. ఏరోస్పేస్ విధానంపై అధ్యయనం కోసం నిపుణులు, పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశామన్నారు. పరిశ్రమల తనిఖీల విషయంలోనూ పలు మార్పులు చేస్తున్నామని.. స్వయం ధృవీకరణ ఇచ్చే పరిశ్రమల్లో ఐదేళ్లకోమారు మాత్రమే తనిఖీ చేస్తామన్నారు. గతంలో వివిధ నిబంధనల కింద చేయాల్సిన తనిఖీల న్నింటినీ ఒకే పర్యాయం జరిపి.. ఆన్లైన్లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ-హబ్‌లో 300కు పైగా స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయన్నారు. లాభాలు లేని పరిశ్రమలను మూసివేసేందుకు అనువైన విధానం ప్రవేశ పెట్టాలని.. మూసివేత సందర్భంగా ఉద్యోగులకు నష్టం జరగకుండా ప్రభుత్వం పాలసీ రూపొందించాలని పలువురు పారిశ్రామికవేత్తలు సూచించారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు 15 రోజుల్లోగా డబ్బు చెల్లించని పక్షంలో న్యాయపరమైన అధికారాలు ఉన్న ప్రత్యేక కమిటీకి పిర్యాదు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. ముంబైలో ఫిబ్రవరి 13 -18 తేదీల నడుమ డిప్, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మేకిన్ ఇండియా వీక్’ను విజయవంతం చేయాలని వనిత పిలుపునిచ్చారు. -
మూడు చోట్ల మాన్యుఫాక్చరింగ్ హబ్‌లు
♦ నేత పాలసీ ముసాయిదాలో ప్రతిపాదన ♦ కొత్త విధానంపై మంత్రి జూపల్లి సమీక్ష ♦ వరంగల్‌లో సమీకృత టెక్స్టైల్ హబ్ ♦ రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్-2015లో భాగంగా దీనిని రూపొందించారు. రాష్ట్రంలో తెలంగాణ టెక్స్టైల్ అప్పరెల్ పాలసీ-2015 పేరిట రూపొందించిన ఈ పాలసీ తొలి ముసాయిదాలోని అంశాలపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పుష్పా సుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, ఆప్కో డెరైక్టర్ శైలజారామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర నేత పాలసీకి అనుగుణంగా రాష్ట్ర విధానం ఉండాలని పుష్పా సుబ్రమణ్యం సూచించారు. నూతన పాలసీ లక్ష్యాలు, ఉద్దేశాలను ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు వివరించారు. నేత, వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు అమల్లో ఉంటాయన్నారు. సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా పాలసీ రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నేత కార్మికులు సొంత యూనిట్లు స్థాపించేలా ప్రోత్సహించాలన్నారు. తొలి ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి మెరుగులు దిద్దుతామని మంత్రి జూపల్లి ప్రకటించారు. వరంగల్‌లో సమీకృత టెక్స్టైల్ హబ్ నేత పాలసీలో భాగంగా రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా), మహబూబ్‌నగర్‌లో టెక్స్టైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పత్తి సాగు ఎక్కువగా ఉన్న వరంగల్ కేంద్రంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాలోని నేత పరిశ్రమను ఏకీకృతం చేస్తూ సమీకృత టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులు, కళాకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించాలని, వృత్తిపై ఆధారపడినవారి ఆదాయం పెంచాలనే అంశంపై దృష్టి సారించారు. టెక్స్టైల్ రంగంలో స్థానికంగా, విశ్వవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేలా పాలసీని రూపొందించారు. నూతన పాలసీ ప్రత్యేకతలు ► చేనేత, వస్త్ర పరిశ్రమ కోసం {పత్యేక భూబ్యాంకు ► పరిశ్రమలకు నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా ► వస్త్రోత్పత్తిలో వివిధ దశలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ► నైపుణ్య, సాంకేతిక శిక్షణ, పరిశోధన కోసం ప్రత్యేక కేంద్రం ► వినూత్న డిజైన్లకు రూపకల్పన, వివిధ రకాల ఉత్పత్తులు ► మార్కెట్ అభివృద్ధితోపాటు, ఉత్పత్తుల్లో తెలంగాణ బ్రాండ్‌పై ప్రత్యేకశ్రద్ధ ► టెక్స్టైల్ రంగంలో వచ్చే సాంకేతిక మార్పులను ఒడిసి పట్టుకునేలా శిక్షణ ► ప్రస్తుతమున్న కార్యకలాపాల బలోపేతం, ఉత్పత్తులకు మరింత విలువ చేర్చడం ► నూలు, మరమగ్గాలకు ప్రోత్సాహం ► నేత, దుస్తుల తయారీ పరిశ్రమల అనుసంధానం ► నేత యంత్రాల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు -
స్థానికులకు ఉపాధి కల్పించండి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులు, మహిళలకు ఉపాధి కల్పించాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో భాగంగా నాలుగో విడతలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న 16 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. సచివాలయంలోని సీ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఉప కార్యదర్శి సైదాతో పాటు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగో విడతలో మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ. 1,570.64 కోట్ల పెట్టుబడులతో 1,812 మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి వెల్లడించారు. టీఎస్ ఐపాస్‌లో భాగంగా నాలుగో విడతలో బుధవారం అనుమతులు పొందిన 16 సంస్థల్లో సౌర విద్యుత్, ఏరోస్పేస్ ప్రొడక్ట్స్, రబ్బర్ టైర్స్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. మహిళల్లోనూ ఐటీఐ అర్హత కలిగిన వారు ఉన్నందున అవకాశం ఇవ్వాలని మంత్రి సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్య అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. నాలుగు విడతలు... రూ.5,205.43 కోట్లు.. ఈ ఏడాది జూన్‌లో ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 68 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ. 5,205.43 కోట్ల పెట్టుబడులు, 13,438 మందికి ఉపాధి దక్కుతుందని పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నూతనంగా అనుమతులు పొందిన పరిశ్రమల్లో 95 శాతం మేర హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనే ఏర్పాటు కానున్నాయి. -
రేణిగుంటలో సెల్కాన్ తయారీ యూనిట్
అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సెల్కాన్ సీఎండీ వై.గురు మొబైల్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెల్కాన్ మరో ప్లాంటును తిరుపతి సమీపంలోని రేణిగుంట దగ్గర ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సెల్కాన్ సీఎండీ వై.గురు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాంటులో ట్యాబ్లెట్ పీసీలు కూడా తయారు చేస్తారు. చిత్రంలో గురుతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఉన్నారు. -
కంపెనీ యాజమాన్యంపై కేసు
గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురి మృతికి కారణం కంపెనీని తనిఖీ చేసిన పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు మరొకరి పరిస్థితి విషమం కంపెనీ ఎదుట ధర్నా, భారీ బందోబస్తు చౌటుప్పల్ : మండలంలోని మల్కాపురం శివారులోని శ్రీజయ లాబోరేటరీస్ కంపెనీలో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతికి కారణమైనందున కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసునమోదు చేశారు. సాయంత్రం 5గంటలకే ప్రమాదం జరిగి, ముగ్గురు మృతిచెందినప్పటికీ, రాత్రి 10గంటల వరకు కూడా మృతిచెందిన విషయాన్ని బయటికి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచడాన్ని నిరసిస్తూ, బుధవారం ఉదయం మల్కాపురం గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీకి తనిఖీల కోసం వచ్చిన పరిశ్రమల శాఖ అధికారులను అడ్డుకోవడంతో, చౌటుప్పల్ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీ సులు అదుపులోకి తీసుకుని, భూదాన్ పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చిన్నకుల్లెడ గ్రామానికి చెందిన ఎ.రాజశేఖర్(24) మృతిచెం దినప్పటికీ, ఇతని పేరు బయటికి రాలేదు. ఒరిస్సాకు చెందిన మారుతి అనే వ్యక్తి చనిపోయినట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఈయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు బుధవారం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహాలను పరిశీలించారు. పరిశ్రమల శాఖ రాష్ట్ర డెరైక్టర్ కిషన్, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, శ్రీదేవి, డిప్యూటీ లేబర్ కమీషనర్ కె.భాగ్యానాయక్లు కంపెనీని సందర్శించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా,ఎస్ఐ మల్లీశ్వరి ఆధ్వర్యంలో కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.శ్రీని వాసరాజు(33), పి.వెంకట్రాజు(50), కె.చంద్రశేఖర్(34), టి.సత్యనారాయణ(30), రాజుమెహ్ర(22)ల ఆరోగ్యం నిల కడగానే ఉంది. రామారావు(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈయన సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం.. కంపెనీలో సంపును శుభ్రం చేయిస్తుండగా, క్లోరోఫామ్ గ్యాస్ లీకై 9మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడ చనిపోయినప్పటికీ, కంపెనీ యాజమాన్యం పోలీసులకు కూడా సమాచారమివ్వకుండా గోప్యంగా ఉంచింది. బుధవారం మృతుల కుటుంబాలను పిలిచి నష్టపరిహారం చెల్లించింది. రాజశేఖర్ కుటుంబానికి రూ.10లక్షలు, మిగతా ఇద్దరి కుటుంబాలకు రూ.8లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు తెలిసింది.