Kodada
-
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి -
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్ మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్ చేసి మెసేజ్‌ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నాకు పొలిటికల్ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం. -
కోదాడలో వరద బీభత్సం..
-
సింగపూర్‌లో కోదాడకు చెందిన పవన్ దుర్మరణం
సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారంసాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన పవన్ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న పవన్ అకాలం మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ
సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో వారు ఒప్పందం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. -
సుప్రీం కోర్టులో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చుక్కెదురు
సాక్షి, సూర్యపేట: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో ఆయనపై కేసు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో పాటు మూడేళ్ల పాటు హై కోర్టుకు హాజరు కాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేయగా దీని విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తన వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మల్లయ్య యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
వచ్చేవి కాంగ్రెస్ ప్రభుత్వాలే..
కోదాడ: అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాబోతున్నాయని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. ప్రజలను అక్కున చేర్చుకొని ముందుకుపోవడానికి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ‘గడప గడపకు కాంగ్రెస్’కార్యక్రమంలో, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకు రాహూల్‌గాంధీ సందేశం తీసుకెళ్లాలని, దీనిలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడపకు పార్టీని తీసుకెళ్లాలి బీజేపీ నుంచి దేశాన్ని కాపాడటానికి రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని మండిపడ్డారు. దేశాన్ని అదానీకి దోచిపెట్టారని, అదానీ చేసిన ఆర్థిక కుంభకోణంలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. ఆయన వెంట ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, బోస్‌రాజు, నిరంజన్, పటేల్ రమేష్‌రెడ్డి తదితరులున్నారు. దామోదర్‌రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్‌రెడ్డి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో సాక్షాత్తు మాణిక్‌రావు ఠాక్రే ఎదుటే సూర్యాపేట నియోజకవర్గ నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యాపేట కాంగ్రెస్ కంచుకోట అని, నేడు దానికి బీటలు వారడానికి కారణం ఎవరో చెప్పాలని, తమను కనీసం సమావేశానికి ఆహ్వానించలేదని రమేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దామోదర్‌రెడ్డి కల్పించుకొని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి అంత ప్రా«ధాన్యమివ్వాల్సిన అవసరం లేదనడంతో గొడవ మొదలైంది. దీంతో ఠాక్రే, ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్యాపేట: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని పార్లమెంటులో చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. దేశాన్ని బీజేపీ ఛిన్నాభిన్నం చేయబోతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్ జోడో యత్ర చేపడుతున్నట్లు చెప్పారు. చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. -
తెలంగాణలో కమలం మిషన్ 90.. అభ్యర్థులున్న నియోజకవర్గాలెన్ని?
మిషన్ 90 అంటూ ఊదరగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్నారు. ఢిల్లీ పెద్దల రాకపోకలు ఊపందుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రధాని, హోం మంత్రి రాబోతున్నారు. మరి ఆ పార్టీకి అనేక జిల్లాల్లో అభ్యర్థులే దొరకడంలేదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏదో ఈపాటికే అర్థం అయ్యే ఉంటుంది? కమలానికి పక్క పార్టీ నుంచి వచ్చే నాయకులే దిక్కా? ఎన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారు? ఈ ఏడాది ఆఖరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి రావడానికి కమలం పార్టీ ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కూడా అందుకు సిద్ధం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే సమయంలో చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక కమలం పార్టీ తీవ్ర వడిదుడుకులు ఎదుర్కొంటోంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం కౌన్సిలర్లుగా గెలిచే సత్తా ఉన్న నేతలు కూడా ఆ పార్టీలో కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అలాంటి నియోజవర్గాల్లో కోదాడ ఒకటి. ఇక్కడ బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కేడర్ ఉన్నా నడిపించే నాయకత్వం లేకపోవడంతో చతికిల పడుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుంచి ఈ సీటులో ఎవరు పోటీ చేస్తారు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. కోదాడ లైన్లో ఎవరెవరు? ప్రస్తుతం కోదాడ బీజేపీలో కనగాల నారాయణ, నూనె సులోచన, సంపత్, వేలంగి రాజు లాంటి నేతలు ఉన్నారు. కానీ వీరిలో ఎవరికీ కనీసం రెండు వేల ఓట్లు కూడా సాధించే సత్తా లేదనేది కాదనలేని వాస్తవం. గతంలో ఓసారి పోటీ చేసిన నూనె సులోచనకు వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణగా చొప్పొచ్చు. 2009 లో కోదాడ నుంచి పోటీ చేసిన ఆమెకు వచ్చిన ఓట్లు 1810 మాత్రమే. మరి ఇలాంటి నేతలను పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటం అంటే నాటు పడవతో సముద్రంలో ప్రయాణించినట్లే అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు టాక్. అందుకే సొంత పార్టీ నేతలను నమ్ముకుని నట్టేట మునిగే కంటే..ఇతర పార్టీల్లో ప్రజల్లో పట్టున్న నేతలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్లోని వర్గ విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేపై గత కొంతకాలంగా అసంతృప్తితో నిరసన గళం వినిపిస్తున్న ఇద్దరు ముగ్గురు నేతలను టార్గెట్ గా చేసుకుని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కోదాడ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న నేతతో పాటు కోదాడ పట్టణానికే చెందిన మరో కీలక నేతను కూడా బీజేపీ టచ్ చేసినట్లు కోదాడలో టాక్ నడుస్తోంది. వారు కూడా ఆలోచించుకుని చెప్తామని అన్నారట. చదవండి: (మాకు నమ్మకం లేదయ్యా.. నాకు నువ్వు, నీకు నేను అంతే!) అమెరికా నుంచి తీసుకురావాల్సిందే..! ఇదే సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ ఎన్నారైని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరంగా చేసినట్లు తెలుస్తోంది. ప్రయత్నిస్తున్న వారిలో ఎవరు పార్టీలో చేరకున్నా.. ప్లాన్ బీని అమలు చేసేందుకు కూడా కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న కీసర శ్రీకళా రెడ్డిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పథకం రచించిందట. ఆమె నియోజకవర్గానికే చెందిన నేత కావడం.. అందులోనూ మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కూతురు కావడంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో రంగంలోకి దించేందుకు ఇప్పటికే శ్రీకళతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. మెట్టినింట్లో రాజకీయంగా నిరూపించుకున్న ఆమె పుట్టినింట్లో నిరూపించుకోవడంతో పాటు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో కోదాడకు వచ్చేందుకు ఒప్పుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసమే ఆపసోపాలు పడుతోంది. చూద్దాం.. కోదాడలో బరిలో కమలం పార్టీ ఎవరిని దించుతుందో..? - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!
కోదాడ (సూర్యాపేట): ఇంటర్ ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రాల బండిల్ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు. గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది. దీంతో బల్క్ సెంటర్ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్‌కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
కోదాడ మహిళకు సూపర్ ఉమెన్ ఇన్ సర్వీస్ అవార్డు
వాషింగ్టన్: కరోనా సమయంలో చేసిన సేవకు గాను కోదాడ మండలానికి చెందిన చింతా నవ్య స్మృతికి అమెరికాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ " ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి ఆధ్వర్యం లో "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని, 500 డాలర్ల రివార్డ్‌ను అందచేశారు. చింతా నవ్య స్మృతి అమెరికాలో ని "మేరీల్యాండ్ "లో ప్రాంతంలో నివసిస్తూ.. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా మెడికల్ హెల్ప్, డాక్టర్స్ సంప్రదింపులు, బ్లడ్ ప్లాస్మా డొనేషన్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ , పీపీఈ కిట్ల డిస్ట్రిబ్యూషన్ పలు గ్రామాలకు అందచేయడం లో కోఆర్డినేట్ చేశారు. అంతేకాకుండా కాన్సర్ హాస్పిటల్స్ లో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలకి తన వంతు సహాయంగా దాతలతో కలిసి కాలేజీలకు ఫీజులను చెల్లించారు. ఫీస్లు కాలేజీ కి కట్టడానికి దాతలతో కలిసి సహాయం చేయగలిగారు. చింతా నవ్య స్మృతి సామాజిక కార్యక్రమంలో తన సేవలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
రూ. 6 లక్షలు: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు!
కోదాడ రూరల్: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇంటిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి ఆదివారం తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి హైదరాబాద్‌లోని కొంపెల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే కాంక్రీట్ సిమెంట్ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి. ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్ ఉన్నాయి. దీనికి రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అనంతరాంరెడ్డి తెలిపారు. ఆదివారం ట్రాలీ లారీ సాయంతో దీన్ని గ్రామానికి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో ఏడెనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఏర్పాటు చేసుకున్నాడు. -
అమెరికాలో కోదాడ వాసి రవికుమార్ మృతి
వాషింగ్టన్: అమెరికాలో కోదాడ వాసి సిరిపురపు రవికుమార్(26) మృతి చెందాడు. బోటు షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. కోదాడకు చెందిన శ్రీనివాస్- పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్ మూడేళ్లుగా అమెరికాలోని సిగ్నా ఇన్సూరెన్స్‌లో పని చేస్తున్నాడు. కాగా వీకెండ్ కావడంతో రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ మేరకు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రవికుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
స్వాతంత్ర సమరయోధుడి కన్నుమూత
కోదాడ రూరల్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు (87) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. రామలక్ష్మీపురం సింహయ్యగా పిలిపించుకునే కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు అప్పట్లోనే ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసి కొన్నాళ్లు హిందు పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని గణపరం రామలక్ష్మీపురంలో జన్మించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లి వచ్చారు. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగా సమీప బంధువు. విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు విరేపల్లి లక్ష్మీనారాయణరావు, వేనేపల్లి చందర్రావు, ఉత్తమ్ పద్మావతి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు కొండపల్లి వాసుదేవరావు, కొండపల్లి మురళీధర్‌రావు, విద్యాత్తవేత్తలు మంత్రిపగఢ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తమ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
గాంధీ బయోపిక్: అతిధి పాత్రలో కోదాడ వాసి
సాక్షి, కోదాడ: ‘న్యూయార్క్’ చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇతి వృత్తం.. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్ మెకానిజం, ఇన్సి్టయిన్ రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్ స్పెల్ ఆఫ్ బుక్ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా చూసే అవకాశం కల్పించారు. చిత్రంలో కోదాడ వాసులు... ఈ చిత్రంలో గాంధీజీ చిన్ననాటి మిత్రుడిగా కోదాడకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన కొండపల్లి రాధాకృష్ణ కుమారుడు కొండపల్లి అనీష్ నటించాడు. అదేవిధంగా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ లేడీతో కలిసి రైలులో ప్రయాణించిన వ్యక్తిగా అతిథి పాత్రలో కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామచందర్‌రావు నటించారు. కాగా గాంధీ వివిధ వయస్సు పాత్రలను అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు శ్రీనివాసరావు సనా పతి, రాజేష్రాజ్గోపాల్, తేజ్ కొండేటి, దీపక్ భీమ్రాశెట్టి నటించారు. కాగా కస్తూర్బా గాంధీగా అమెరికాకు చెందిన లారెంజో పల్లాడినో, మమాడివ్ శిశి, సరితా నవాలీ, కామ్యరాయసం నటించారు. కాగా... అమెరికాలో స్థిరపడిన కోదాడ వాసి అయిన భరద్వాజ్ వి .కొమరగిరి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం.. గాంధీజీ జయంతి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన చిత్ర సంస్థ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు రామ్ అల్లాడి తెలిపారు. ఈ చిత్రానికి రామ్ దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణిమా దిగ్వీతో పాటు మరికొందరు అమెరికన్స్ సహకారంతో నిర్మించారు. కాగా దర్శకుడు వరంగల్ వాసి.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన గతంలో వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఓరుగల్లు కోట తదితర చారిత్రాత్మక ఇతి వృత్తాలపై డాక్యుమెంటరీలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు. -
ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!
కోదాడ : ఆంధ్రాలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’) -
లాక్డౌన్ : అంబులెన్స్ డ్రైవర్ల కొత్త దందా
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజారవాణా మొత్తం బంద్ అయింది. అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలను తప్ప వేటిని రోడ్లపైకి అనుమతించడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణికులను తరలిస్తున్నారు. కోదాడ దగ్గర ఈ దందా బయటపడింది. పెషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు వెయ్యి రూపాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంబులెన్స్ కావడంతో ప్రతి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను తీసి పంపించారు. కానీ కోదాడ వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్లు డబ్బులు తీసుకొని ప్రయాణికులను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పోలీసులు రామపురం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన మూడు అంబులెన్స్‌ను తనిఖీలు చేయగా ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో కొత్త దందా షురూ అయ్యింది. అంబులెన్స్‌లో ప్రయాణికుల తరలింపు ఘటన వెలుగులోకి రావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇకపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. హైవే రోడ్లపై ఇకపై చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
దొంగచాటుగా ప్రయాణికుల తరలింపు
-
బీమా సొమ్ము కోసం సొంత అన్న కొడుకే..
సాక్షి, మునగాల(కోదాడ) : గత నెల 24న జాతీయ రహదారిపై మండలంలోని ఇందిరానగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన మండలంలోని తాడువాయికి చెందిన ముంజల సైదులు (30) కేసు మిస్టరీని మునగాల పోలీసులు ఛేదించారు. మునగాల సీఐ శివశంకర్ గౌడ్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడువాయి గ్రామానికి చెందిన ముంజల సైదులు గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి అన్న ముంజల వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. మృతుడి అన్న కొడుకు రమేష్ ఒంటిరిగా ఉంటే తన బాబాయి సైదులు పేరుమీద కొన్ని రోజులు క్రితం రెండు లారీలు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. దీంతో పాటు రూ.50 లక్షల ఇన్సూ్రెన్స్ కూడా చేయించాడు. కొన్ని రోజుల తర్వాత లారీలు నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో వారు లారీలను తీసుకెళ్లారు. దాంతో తన బాబాయి ప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని పథకం వేశాడు. తన స్నేహితులైన గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబును సంప్రదించి చెరో రూ.ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. గతనెల 24న సైదులును గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి తీసుకొవచ్చి మార్గమధ్యలో మద్యం తాగించారు. అనంతరం జాతీయ రహదారిపై ఇందిరానగర్ శివారులో గల పార్కింగ్ స్థలం (ట్రక్ లే అవుట్) వద్ద బొలోరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అదే రోజు మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. కాగా గతంలో కూడా ఒకసారి సైదులును హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.... ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంటరిగా ఉండే సైదులు పేరు మీద రూ.50 లక్షల బీమా ఎందుకు చేయించారని ఆరా తీశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సంఘటన వెనుక మృతుడి అన్న కొడుకు రమేష్ హస్తం ఉంటుందని అనుమానించి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పాడు. బీమా సొమ్ము కోసమే రమేష్ హత్య చేసినట్లు సీఐ వివరించారు. దీంతో రమేష్‌తో పాటు స్నేహితులు మహేష్, శోభన్‌బాబులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శుక్రవారం కోదాడ కోర్డులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మునగాల ఎస్ఐ కె.సత్యనారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు..
సాక్షి, కోదాడ : విజయవాడ కనదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన కందారపు ప్రణయ్‌తేజ(20), ప్రవీణ్, దామోదర్, మధు నలుగురు స్నేహితులు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి కారులో విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో కోదాడలోని శ్రీరంగాపురం క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే విజయవాడ నుంచి పట్టణంలోకి ఒక్కసారిగా మలుపు తిరుగుతున్న బస్సును వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు ఘ టన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు వెనుక సీట్లో కూర్చున్న ప్రణయ్‌తేజ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగిలిన ముగ్గురి పరి స్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి కోదాడ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
నాటినుంచి.. నేటికి ‘కోదాడ’!
సాక్షి, కోదాడ : నియోజకవర్గ కేంద్రమైన కోదాడను 1952లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీనికి తొలి సర్పంచ్‌గా మర్ల పానకాలయ్య, ఉపసర్పంచ్‌గా కాకుమాను నర్సింహారెడ్డి, కార్యదర్శిగా గుడుగుంట్ల చిన అప్పయ్య వ్యవహరించారు. నాడు పంచాయతీలో నాలుగు వేల మంది జనాభా, మూడు వేల ఓటర్లు ఉండగా ఆదాయం రూ.రెండు వేలుగా ఉండేది. 1956 నుంచి 64 వరకు తమ్మర వెంకటేశ్వరరావు సర్పంచ్‌గా ఉన్నారు. ఆ తరువాత చినఅప్పయ్య 1965 నుంచి 1971 మార్చి వరకు సర్పంచ్‌గా పని చేశారు. 1971 మార్చి నుంచి 72 మార్చి వరకు గరిడేపల్లి స్వామి, 1972 నుంచి 81 వరకు దాదాపు 10 సంవత్సరాలు వెలిశాల అనంతరామయ్య సర్పంచ్‌గా పనిచేశారు, 1981లో జరిగిన ఎన్నికల్లో వేనేపల్లి చందర్రావు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1984 జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కోదాడ ఎమ్మెల్యేగా వెళ్లడంతో అప్పటి ఉప సర్పంచ్ చిట్టాబత్తిని సుబ్బరామయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత సత్యబాబు, ఎర్నేని బాబు, పారా సీతయ్య, ఏర్నేని కుసుమ పని చేశారు. ఉపసర్పంచ్‌గా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర్లు రెండుసార్లు ఇన్చార్జ్ సర్పంచ్‌గా పని చేశారు. 2012 వరకు కోదాడ గ్రామపంచాయతీగా కొనసాగింది. ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించింది. 2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడంతో టీడీపీ–కాంగ్రెస్ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంటిపులి అనిత మొదటి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. పెరిగిన వార్డులు.. మేజర్ పంచాయతీగా ఉన్న కోదాడను 2012లో ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. దీనికి తొలిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండేవి. తాజాగా శివారు గ్రామాలైన తమ్మర, కొమరబండ కోదాడ మున్సిపాలిటీలో కలవడంతో వార్డుల సంఖ్య 35కు పెరిగింది. ప్రస్తుతం 75 వేల జనాభా 53,898 మంది ఓటర్లు ఉన్నారు. -
సమ్మెలోనే ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ
కోదాడ అర్బన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం దిగిరావడం లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని ఆర్టీసీ జేఎసీ నాయకులు పేర్కొన్నారు. కోదాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ నారాయణ గురువారం పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు కార్పొరేషన్ తరఫున అన్ని బెన్ఫిట్స్ ఇస్తూ సత్కరించాల్సి ఉండగా ప్రభుత్వ విధానంతో సమ్మెలో కార్మికులు ఉండటంతో కార్మికులే ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరితో పదవీ విరమణ పొందుతున్న కార్మికులు తీవ్ర మనోవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను గారడీ మాటలతో అందలం ఎక్కించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ కార్మికులను పాతాళానికి తొక్కేయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు పన్నినా కార్మికులు డిమాండ్లు సాధించుకొనేందుకు ముందుకు పోతారే తప్ప వెనక్కు తగ్గరన్నారు. పదవీ విరమణ పొందిన నారాయణకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా యూనియన్లు చర్యలు తీసుకుంటాయని వారు తెలిపారు. డ్రైవర్ నారాయణ మాట్లాడుతూ కార్మికులు అనుభవిస్తున్న గడ్డు కాలంలో పదవీ మిరణ పొందడం దురదృష్ణకరంగా భావిస్తున్నానని, ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమంలో కార్మికులతో కలిసి ముందుకుసాగుతానన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎసీ సూర్యాపేట నాయకుడు ఎస్ఎస్ గౌడ్, కోదాడ నాయకులు సైదులు, రాజశేఖర్, డ్రైవర్లు, కండక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం
సాక్షి, కోదాడ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు కోదాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కర్ణాటకకు చెందిన వేణుమాధవ్ తండ్రి ప్రభాకర్ (నాయర్) 50 సంవత్సరాల క్రితం కోదాడకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన టెలిఫోన్ డిపార్టుమెంట్లో పనిచేసేవారు. తల్లి సావిత్రమ్మ కోదాడలో ఆర్ఎంపీగా పని చేసిది. వేణుమాధవ్‌కు ఇద్దరు అన్నలు, అక్క, చెల్లి ఉన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఆయన ఆ తరువాత ఇంటర్, డిగ్రీ బీకాం కోర్సులను కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు. చదువుకునే సమయంలో మిమిక్రీ, వెంట్రిలాక్విజంలో మంచి పట్టు సంపాదించారు. మాధవరెడ్డితో పరిచయం... కోదాడ ఎమ్మెల్యేగా వేనేపల్లి చందర్రావు ఉన్న సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేణుమాధవ్ పాల్గొని వేదికలపై నవ్వించేవాడు. ఈ క్రమంలో నాటి హోంశాఖమంత్రి మాధవరెడ్డి వద్దకు వేణుమాధవ్‌ను ఎమ్మెల్యే చందర్రావు తీసుకెళ్లి పరిచయం చేయడంతో ఆయన కోదాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొంత కాలం పాటు టీడీపీ కార్యాలయంలో లైబ్రేరియన్‌గా పని చేశారు. ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టిలో పడడంతో ఆయన తన సినిమా ‘ సంప్రదాయం’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1996 జనవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి 2016 వరకు ఆయన దాదాపు 500 సినిమాళ్లో నటించారు. హం గామా, భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాళ్లో ఆయన హీరోగా కూడా నటించారు. ఈ మూడు సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. ఆయనకు భార్య వాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో సినీ నటుడిగా ఎంతో బిజీగా ఉండే వేణుమాధవ్ కోదాడలో జరిగే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 2009వ సంవత్సరంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జోలె పట్టి విరా ళాలు సేకరించి నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. 2016లో కోదాడలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 2018లో కోదాడలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టకు ఆయన వచ్చి రెండు రోజులపాటు కోదాడలో సందడి చేశారు. ఎన్నికల సమయంలో హడావుడి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన కోదాడ వచ్చారు. రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేయడానికి వెళ్లి ఎలాంటి పత్రాలు తీసుకురాలేదు. దీంతో నామినేషన్ తీసుకోవడానికి అధికారులు తిరస్కరించడంతో వెళ్లిన ఆయన మళ్లీ రెండవసారి వచ్చినామినేషన్ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య చివరి రోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వేణుమాధవ్ మృతికి సంతాపం పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ అకాల మృతికి పలువురు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మంచి కళాకారుడిని కోల్పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉంటుందని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, ఎన్.పద్మావతి, కోదాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితలు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాకు వెన్నుదన్నుగా ఉండేవాడు కోదాడ బాలుర పాఠశాల నుంచే వేణుమాధవ్ నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత కేఆర్ఆర్ కళాశాలలో చదువుకున్నాం. కోదాడలో మేము ఏర్పాటు చేసిన తెర సాంస్కృతిక కళామండలికి ఆయన చేదోడుగా ఉండేవాడు. కోదాడ వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లడు. సంవత్సరం క్రితం భార్యభర్తలు, పిల్లలు వచ్చి వెళ్లారు. ఆయన మరణం తీవ్రమైన బాధ కలిగించింది. – వేముల వెంకటేశ్వర్లు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ వేణుమాధవ్ నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా అన్యోన్యంగా ఉండే వాడు. ప్రతి ఎన్నికల్లో కోదాడకు వచ్చి నాకు ప్రచారం చేసేవాడు. కోదాడకు వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయనతో 20 సంవత్సరాల అనుబంధం ఇలా అర్ధంతరంగా ముగియడం బాధగా ఉంది.– పారా సీతయ్య, మాజీ సర్పంచ్ ఎంతో సరదాగా ఉండేవాడు వేణుమాధవ్ ఇంటర్, డిగ్రీలో నా క్లాస్మేట్. గత సంవత్సరం కోదాడలో జరి గిన వినా యక చవితి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మాతో రెండు రోజులు గడిపాడు. కళాశాల రోజుల్లో సరదాగా ఉండేవాడు. పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఇలా అకాల మరణం చెందడం బాధ కలిగించింది. –పాలూరి సత్యనారాయణ, క్లాస్మేట్ -
ఒకేసారి తప్పిన పెను ప్రమాదాలు
సాక్షి, కోదాడ : ఇద్దరు వాహనదారులు చాకచక్యంగా వ్యవహరించడంతో శనివారం పెను ప్రమాదాలు తప్పాయి. వివరాలలోకి వెళ్తే ..మండల పరిధిలోని దోరకుంట శివారులో గల అశోక్‌లేలాండ్ లోకి వెళ్తేందుకు లారీ జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుంది. అదే సమయంలో కోదాడ నుంచి ద్విచక్రవాహనంపై నల్లబండగూడెం వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ మలుపును గమనించకుండా దాని వెంటనే వెళ్లడంతో అది పూర్తిగా లారీ మధ్యటైర్ల కిందకు వెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న అతను ఒక్కసారే దానిని వదిలేసి పక్కకు దూకాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా నుజ్జు అయింది. అదే సమయంలో అటుగా చూసుకుంటు విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరకు గాయడలేదు. పోలీసులు వచ్చి వాహనాలను బయటకు తీసి పంపించారు. -
ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆ..దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. కాసుల కోసం కక్కుర్తి పడి మరో ఇద్దరి పరీక్షలు రాస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల సెంటర్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన మహ్మద్‌సల్మాన్, తిరపతమ్మలు కోదాడలోని నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరారు. ప్రస్తుతం ఎంఎస్ కళాశాల సెంటర్లో జరుగుతున్న ఫెనలీయర్ పరీక్షలు రాస్తున్నారు. అయితే మహ్మద్సల్మాన్కు బదులుగా ఏపీలోని మక్కపేటకు చెందిన వత్సవాయి మండలం పోలంపల్లిలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అజ్మీర వెంకటప్పయ్య బీకాం పరీక్షకు హాజరయ్యాడు. ఇదే మాదిరిగా తిరపతమ్మకు బదులుగా పెనుగంచిప్రోలులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వెంకటప్పయ్య భార్య బాణోతు కవిత బీఎస్సీ ఫైనలీయర్ పరీక్షకు హాజరైంది. విషయాన్ని పసిగట్టిన కొందరు వ్యక్తులు కోదాడ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పరీక్ష కేంద్రానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూనివర్సిటీ నిర్వాహకుల మాయాజాలం... కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వాహకులు వారికి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలు రాస్తున్న ఒక్కో విద్యార్థి నుంచి పేపర్‌కు వెయ్యి నుంచి రెండు వెయ్యిలు వసూళు చేస్తున్నారని, డబ్బులు కట్టలేని వారిని పరీక్ష రాయకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టిన వారందరికీ సపరేటు రూం ఏర్పాటు చేసి అందులో నేరుగా పుస్తకాలు ఇచ్చి పరీక్ష రాయిస్తున్నారని తెలిపారు. ఇక ఒకరికి బదులు మరొకు పరీక్షలకు హాజరైతే దాదాపుగా రూ.10వేలకు పైగానే వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ పరీక్షలకు హాజరయ్యే వారందరూ దాదాపుగా ఎదో ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసే వారో లేక ప్రైవేట్ ఉద్యోగం చేసే వారే ఎక్కువగా ఉండటంతో వారు ప్రమోషన్ల కోసం సర్టిఫికెట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. -
మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..
సాక్షి, నల్గొండ : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం శివారులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ దశరథ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొయలగూడేనికి చెందిన రమాదేవి(28)కి అదే జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఏసుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. దంపతుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా రమాదేవి ఏడాదిన్నర క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటినుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మందులగూడెంలో నివాసముంటున్న తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. బతుకుదెరువు నిమిత్తం రమాదేవి ఏడాదిన్నర క్రితమే డబ్బా శ్రీను అనే సర్కస్ కపెనీలో పనిచేస్తోంది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సిండే సవాల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. పది రోజుల క్రితం.. ఊరూరా తిరుగుతూ సర్కస్ నిర్వహించే బృందంతో కలిసి సిండే సవాల్, రమాదేవి కూడా ఇటీవల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి వచ్చా రు. బృందం సభ్యులు గ్రామ శివారులో డేరాలు ఏర్పాటు చేసుకుని సర్కస్ నిర్వహిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా రమాదేవి మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని, అతడితోనే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతోందని సిండే సవాల్ అనుమానించారు. ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడం తో రమాదేవి మందులగూడేనికి వెళ్లిపోయింది. కూలి డబ్బులు తీసుకునేందుకు.. సర్కస్‌లో పని చేసినందుకు గాను కూలి డబ్బులు తీసుకున్న సిండే సవాల్ స్వగ్రామం వెళ్లిపోతున్నానని సర్కస్ బృందానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే ఆ బృందం మేస్త్రీ రమాదేవికి కూడా ఫోన్ చేసి సిండే సవాల్ వెళ్లిపోయాడని, నీకు రావాల్సిన కూలి డబ్బులు తీసుకుపోవాలని రమాదేవికి ఫోన్ చేశాడు. దీంతో రమాదేవి బుధవారం సోదరుడు హరిని వెంటబెట్టుకుని గణపవరం గ్రామానికి వచ్చింది. కూలి డబ్బులు సోదరుడికి ఇవ్వడంతో వెళ్లిపోగా తాను మాత్రం సర్కస్ బృందం సభ్యులతో డేరాలోనే ఉంది. అర్ధరాత్రి వచ్చి.. అయితే తాను స్వగ్రామం వెళ్లిపోయాయని తెలిస్తే రమాదేవి కూలి డబ్బులకు కచ్చితంగా రమాదేవి వస్తుందని భావించిన సిండే సవాల్ బుధవారం అర్ధరాత్రి గణపవరం శివారులోని సర్కస్ బృందం వేసుకున్న డేరాల వద్దకు వచ్చాడు. అతడు ఉహించినట్టుగానే రమాదేవి అక్కడే ఉండడంతో ఇకపై కలిసే మంచిగా ఉందామని మాయమాటలు చెప్పాడు. అక్కడి నుంచి అలా పక్కకి వెళ్లి మాట్లాడుకుందామని తీసుకుపోయాడు. కాసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీయడంతో ఆగ్రహానికి లోనైన సిండే సవాల్ పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమో ఛాతిభాగంలో పొడిచి పారిపోయాడు. దీంతో రమాదేవి కేకలు వేస్తూ నేలకొరగడంతో సర్కస్ బృందం సభ్యులు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమాదేవి సోదరుడు హరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చలాకి చంటి కారుకు ప్రమాదం
-
చలాకి చంటి కారుకు ప్రమాదం
సాక్షి, కోదాడ: సినిమా వాళ్లనే కాదు టీవీ నటులను కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జబర్దస్త్’ ఫేం చలాకి చంటి పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి కారు లారీని వెనక నుంచి ఢీకొంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కోదాడ కొమరబండ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, గతేడాది జూన్ నెలలో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి చలాకి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. (చదవండి: సీన్లో ‘పడ్డారు’) -
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం
సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం తోగర్రాయి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి వెంటనే దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో టాటా ఇండికా కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. సకాలంలో ఫైరింజన్ రాకపోవడం వల్ల కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కోదాడ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు -
కోదాడ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు
-
సీతారామా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
సీతారాముల కల్యాణ రమణీయ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు.. తమ జీవితాలు సాఫీగా సాగిపోవాలని భక్తిశ్రద్ధలతో ఏక పత్నీవ్రతుడిని వేడుకున్నారు.. అప్పటి వరకు భక్తిపారవశ్యంలో మునిగితేలిన ఆ భక్తులు.. ఆటోలో స్వస్థలానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనే లోపలే ఘోరం జరిగిపోయింది. విధి వైపరిత్యమో.. మరో కారణమో తెలియదు కానీ ..ఆటో వారి పాలిట మృత్యుశకటంగా మారింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి.. ముందుగా వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు... కోదాడరూరల్ : కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామాదేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కోదాడకు చెందిన పలువురు భక్తులు అక్కడ జరిగే వేడుకలకు వెళ్లివస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని సిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మహిళలు కల్యాణానికి వెళ్లారు. కల్యాణం అనంతరం అక్కడి నుంచి ఆటోలో కోదాడకు బయలుదేరారు. వీరితో పాటు పట్టణానికి చెందిన మరో ఐదుగురు ఆటోలోకి ఎక్కారు. డ్రైవర్‌తోపాటు మొత్తం ఆటోలో పది మంది ఉన్నారు. తమ్మర నుంచి ఆటో బయలుదేరి కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా కోదాడకు వస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో ముందు ఉన్న బస్సును ఆటో ఓవర్‌టెక్ చేస్తూ అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి రోడ్డు కుడివైపునకు వచ్చాడు. అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మం పట్టణానికి సిమెంట్ లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఆటో వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (60) ఆయన భార్య బేతు నాగసులోచన (57), తమ్మరకు చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ (48), పట్టణంలోని మాతానగర్‌కు చెందిన నరిమినేని సుగుణమ్మ (45), రెడ్చిల్లి వెనుక నివాసముంటున్న గుండపనేని పద్మ (56) అక్కడికక్కడే మృతిచెందారు. సిరి అపార్టుమెంట్‌కు చెందిన అంబటి సైదమ్మ (38), వట్టికొండ శైలజ (40)లు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. అక్కడికి చేరుకొనే లోపే ఈ ఇద్దరు కూడా మార్గమధ్యలో మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు మహిళలు లక్ష్మి, రేణుక, మంగతాయారుకు గాయాలయ్యాయి. రేణుక పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను ఖమ్మం నుంచి హైదరబాద్‌కు తరలించారు. లక్ష్మీ విజయవాడలో చికిత్స పొందుతుండగా మంగతాయారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలు... ప్రమాద ఘటనలో లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోను ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు, క్షతగాత్రులు కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయారు. స్థానికులు వాహనదారులు అక్కడకు చేరుకుని దాదాపుగా 20 నిమిషాలు శ్రమించి ముందుగా గాయాలపాలైన వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించి , మృతదేహాలను బయటకు తీసారు. ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు కోదాడకు చెందిన ఏడుగురు ఒక్కసారే మృతిచెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారి కుటుంబాలన్ని దాదాపుగా పట్టణంలో అందరికి పరిచయాలు ఉండటంతో మృతదేహాలను చూసేందుకు వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. వైద్యశాల ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆటోడ్రైవర్ తొందరపాటే కారణమా...? ఘోర రోడ్డు ప్రమాదానికి ఆటో డ్రైవర్ తొందరపాటే కారణమని తెలుస్తోంది. శ్రీరామ నవమి కావడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉం డటంతో మరిన్ని ట్రిప్పులు తోలుకోవచ్చనే ఆశతో ఎదురుగా బస్సు ఆగి ఉన్న ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆటో డ్రైవర్ తొందరపాటుతో ఎదురుగా వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోకుం డా ఒక్కసారే పక్కకు మలపడంతో లారీ ఢీకొ ట్టింది. ఇక్కనిమిషం ఆగితే అందరు క్షేమంగా ఇళ కు చేరేవారు. మరణించిన వారిలో నలుగురు కూ డా రెండు నిమిషాలు ఆగితే ఖమ్మం క్రాస్‌రోడ్, బీ ఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద దిగేవారే ఉన్నారు. మృతుల వివరాలు రాసుకోవడానికి వెళితే... తమ్మర నుంచి కోదాడకు వస్తున్న ఆటో లారీని ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మతి చెందారనే సమాచారం కోదాడ పట్టణ పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి బయలుదేరారు. పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డితో పాటు రైటర్ వట్టికొండ రామారావు కూడా పెన్ను పేపర్లు తీసుకుని సంఘటన స్థలానికి బయలుదేరారు. ఘటనాస్థలిలో మృతుల , గాయపడిన వారి వివరాలు రాసుకోవడానికి రైటర్ రామారావు సిద్ధమవుతున్నాడు. కానీ అక్కడ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ తన భార్య వట్టికొండ శైలజ పడి ఉండడంతో రామారావుకు దిక్కుతోచలేదు. అపార్టుమెంట్ వాసులతో కలిసి ఆమె తమ్మర దేవాలయానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైంది. వెంటనే తేరుకున్న ఆయన ఆమెను హుటాహూటిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించాడు. కాని ఖమ్మం చేరుకొనే లోపే ఆమె మృతిచెందింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముగ్గురి వివాహాలు చేసి.. తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఎస్కె. అబ్బాస్ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు వివాహాలు చేయగా మరో కుమారుడు వివాహానికి ఉన్నాడు. ఒంటరిని చేసి వెళ్లిపోయావా.. సైదమ్మ భర్త వీరారెడ్డి పట్టణంలో వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదమ్మ మృతితో వారి కుటుంబం దిక్కుతోని స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలను, నన్ను ఒంటరిని చేసి వేళ్లిపోయావా అంటూ ఆమె భర్త బోరున విలపించాడు. కోదాడకు చేరుకున్న ఎస్పీ... ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కోదాడకు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబాలతో మాట్లాడారు. కార్యక్రమాలు వెంటనే జరిగే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు తెలిపారు. ఆయన వెంట పట్టణ, రూరల్ సీఐలు, స్థానిక ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ప్రశాంతంగా జీవించే సమయంలో... గుండపనేని పద్మ ,భర్త సత్యనారాయణ పట్టణంలో కిరణాషాపు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు. వీరిలో చిన్నకొడుకు, కుతూరు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే రెడ్‌చిల్లీ వెనుక బజారులో ఇంటిని కొనుగోలు చేసి నెలరోజుల క్రితం చిన్నకుమారుడి వివాహం చేశారు. పిల్లలు ఉన్నతంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటిలో ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో పద్మ దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఒక్క దేవుడూ కాపాడలేక పోయాడా.. మృతుల్లో ఇద్దరు బేతులక్ష్మయ్య నాగసులోచన దంపతులు. వీరు బీఎస్ఎన్ కార్యాలయం ఎదురుగా గల వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహాలు చేసిన లక్ష్మయ్య ఓ కిరణాషాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గృహిణిగా ఉంటున్న నాగసులోచనకు దైవభక్తి ఎక్కువ. ‘‘నువ్వు దేవుడికి రోజు పూజ చేస్తున్నా ఒక్క దేవుడన్నా మిమ్మల్ని కాపడలేదా అమ్మా.. ఇద్దరూ ఒక్కసారే మమ్మల్ని వదిలిపోయరా’’ అంటూ వారి కూతుళ్లు, కుమారుడు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే... ప్రమాద జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. ఆతర్వాత వైద్యశాలో చికిత్స పొందుతున్న పలువురుని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న వారిని ఖమ్మం, విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ.. మాతానగర్‌కు చెందిన సుగుణకు భర్త, కొడుకుతో ఉంటూ బస్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయాల మార్కెట్లో పనిచేస్తోంది. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె మృతితో కొడుకు, భర్త, తీవ్రంగా రోదిస్తున్నారు. -
కోదాడలో దొంగ ఓటు..!
సాక్షి, కోదాడఅర్బన్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో పట్టణంలో బా లుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ బూత్‌లో దొంగ ఓటు పోలైంది. పట్టణంలోని 1వ వా ర్డుకు చెందిన షేక్ సైదులు అనంతగిరి రోడ్డులోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు చెందిన ఓటు బాలుర ఉన్నతపాఠశాలలోని 170/ 90 పోలింగ్ బూత్‌లో 436 సిరియల్ నంబర్లో ఉంది. అతను వేరే ఊరుకు కూలి నిమిత్తం వెళ్లి ఓటు వేసేందుకు ఉదయం 9గంటలకు కోదాడకు చేరుకున్నాడు. తన తమ్మడు మైకు నాగులు వద్ద ఉన్న పోల్ చిట్టీని తీసుకుని పోలింగ్ బూత్ ఓటు వేసేందుకు వెళ్లాడు. తాను క్యూలైన్లో వెళ్లి పోలింగ్ అధికారికి తన ఓటరు చిట్టి ఇవ్వగా సీరియల్ నంబర్‌ను పరిశీలించిన పోలింగ్ సిబ్బంది అప్పటికే ఈ ఓటు వేశారని తెలపడంతో ఆవాక్కయ్యా డు. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న తన తమ్ముడు మైకు నాగులు తన అన్న ఓటు వేసేందుకు ఇప్పుడే వస్తే ఇప్పటికే మరెవరో ఓటు వేయడం ఏమిటని పోలింగ్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తిన ఏజెంట్లు షేక్ సైదులేనని నిర్ధారించడంతో తాము ఆయనతో ఓటు వేయించడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు షేక్ సైదులు తన ఓటు వేరే వారు వేస్తే ఎలా అని, తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో పోలింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. పోలింగ్ అథికారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమస్యను వివరించి ఆయన అనుమతితో సైదులకు చాలెంజ్ ఓటు ఇవ్వడంతో అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చాలెంజింగ్ ఓటు తుంగతుర్తి : అధికారుల తప్పిదంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఓటు వేయకుండా వినియోగించుకున్నట్లు ఓటరు లిస్ట్‌లో ఉంది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కలెంచర్ల సతీష్ గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన ఓటరు స్లిప్‌ను అధికారులకు చూపగా అప్పటికే ఆ విద్యార్థి ఓటు ఈడీసీలో (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఉపయోగించుకున్నట్లు ఓటరు లిస్టు ఉందని చెప్పారు. దీంతో ఓటే వేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ పాండు నాయక్ స్పందించి పోలిం గ్ కేంద్రానికి వెళ్లి ఆ విద్యార్థితో రాతపూర్వకంగా లేఖ రాయించుకుని ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. -
నల్లగొండకు కాబోయే ఎంపీని నేనే..
సాక్షి,మునగాల (కోదాడ) : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా తాను అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్‌గాంధీ ప్ర«ధాన మంత్రి, తాను ఎంపీ కావడాన్ని ఏశక్తీ ఆపలేదన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు తాను నల్లగొండ ఎంపీగా బరిలోకి దిగానని స్పష్టం చేశారు. నా జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. ఈ ఎన్నికలు భారత దేశ భవిష్యత్‌కు సంబంధించి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంట్ ఓటర్లంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్న చూపని.. ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఓ భూకబ్జాదారుణ్ని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించి నల్లగొండ ప్రజలను అవమానపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని పేర్కొన్నారు. కేసీఆర్ 16ఎంపీ సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతానని మరో డ్రామాకు తెరలేపడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఉన్న ఎంపీలతో ఏం ఒరగబెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఇకపై ఎక్కువ సమయం నల్లగొండ పార్లమెంట్‌పై దృష్టిసారిస్తానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా ఈ పదిహేను రోజుల పాటు పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేసే అవకాశమున్నందున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిజాయితీగా, నిస్వార్థగా పనిచేసే తనను కేంద్రానికి పంపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తాను కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మునగాల మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తిరిగి ఎంపీగా గెలిచి అంతకు పదిరెట్లు ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఓ నాయకుడు తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని.. ఆయనకు ప్రజలు తగిన విధంగా బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తొలుత ఉత్తమ్‌కు మునగాలలో ఘనస్వాగతం పలికారు. ర్యాలీగా సభాస్థలికి బయలుదేరిన ఉత్తమ్‌కు మునగాల ఓటర్లు నీరాజనం పలికారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాతంగి బసవయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, వంగవేటి రామారావు, పందిరి నాగిరెడ్డి, నరంశెట్టి నర్సయ్య, కాసర్ల కోటేశ్వరరావు, వెంకట్రాంరెడ్డి, సాముల శివారెడ్డితోపాటు వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. వారం వ్యవధిలో కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మూడు ఘటనల్లో రెండింటిలో భార్యలే భర్తల హత్యకు సూత్రధారులుగా వ్యవహరించగా ప్రియులు పాత్రధారులుగా మారి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. మరో ఘటనలో ఓ భర్త తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ప్రియుడిని దారుణంగా హత్యచేసాడు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి జైలుపాలు కావడంతో మూడు కుటుంబాల్లో చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సాక్షి, కోదాడ : మూడు హత్యలను పరిశీలిస్తే తాత్కాలిక ఆకర్షణకు లోనైన వీరు కుంటుంబ పరిస్థితులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించారు. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తలను పొట్టన పెట్టుకున్నారు. గుడిబండ గ్రామానికి చెందిన పులికాశయ్య హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్ద ఓ అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న యువకుడితో కాశయ్య భార్య నాగలక్ష్మి విహహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరో ఘటనలో చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన కుక్కల గోపిని అతని భార్య రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో దారుణంగా హత్య చేయించింది. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో పట్టుమని పది సంవత్సరాలు కూడా లేని వీరి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. భార్యభర్త చేతిలో ప్రియుడు ఇక నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త తన భార్యతో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసి సాగర్ కాలువలో పడవేశాడు. పక్షం రోజుల తర్వాత ఘటన వెలుగు చూడడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యువకుడు రహీం హత్యకు గురికాగా భార్యభర్తలు కోటయ్య, త్రీవేణిలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీరి కొడుకు ఇపుడు దిక్కులేనివాడయ్యాడు. ఇటీవల హత్యకు గురైన కుక్కల గోపి గుడిబండ వాసి పులి కాశయ్యరహీమ్ (ఫైల్) పాపం పసివాళ్లు ఇలాంటి బంధాల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయ్యారయ్యింది. కోదాడలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లో పదేళ్ల లోపు ఐదుగురు పిల్ల అనాథలు గా మారారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలు కావడంతో వారి అలనాపాలనా చూసే వారు కరువయ్యారు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని వయస్సులో జరిగిన ఈ ఘటనలు వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతా యని ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
రహీమ్‌ది హత్యే..!
సాక్షి, కోదాడరూరల్ : కోదాడలో అదృశ్యమై..ఖమ్మం జిల్లా పాలేరు వాగులో విగతజీవుడిగా తేలిన యువకుడిది హత్యగానే పోలీసులు తేల్చారు. ఆ యువకుడితో సఖ్యతగా మెలిగిన వివాహిత, తన భర్త, తల్లి, మరో వ్యక్తి కలిసి దారుణానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో తేలింది. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నడిగూడెం మండల కాగిత రామచంద్రాపురానికి చెందిన షేక్ రహీమ్(24) లారీక్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు కోటయ్య భార్య త్రివేణితో సఖ్యతగా మెలిగాడు. ఎనిమిది మాసాలు సాగిన అనంతరం విషయం భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. కోటయ్య విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించాడు. కానీ రహీమ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోటయ్య తన భార్య త్రివేణిని కోదాడలోని ఆజాద్‌నగర్‌లో నివాసముంటున్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం పంపించాడు. నెల రోజుల కిత్రం భార్య వద్దకు వచ్చిన కోటయ్య నీ వల్ల గ్రామంలో మన పరువు పోయింది.. చనిపోదామని చెప్పాడు. రహీమ్ తనను వేధిస్తున్నాడు.. మనమెందుకు చనిపోవాలి.. అతడినే మట్టుబెడదామని తీర్మానించుకున్నారు. ప్లాన్ ప్రకారమే... రహీమ్‌ను హత్య చేద్దామని కోటయ్య ,భార్య త్రివేణి అతని అత్త శ్రీదేవి ఆమెతో సఖ్యతగా ఉంటున్న బండి వాసులు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే గత ఫిబ్రవరి 26 రాత్రి 11.30 గంటల సమయంలో త్రివేణి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను రమ్మని రహీమ్‌ను ఫోన్‌చేసి పిలిచింది. అతను ఇంట్లోకి వెళ్లగానే అçప్పటికే కాపుకాసుకుని ఉన్న ముగ్గురు ఇంట్లోకి వెళ్లిన రహీమ్‌ను రొకలిబండతో కళ్లపై కొట్టి ..చున్నితో మెడకు ఉరేసి హత్య చేశారు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గొనెసంచిలో కట్టి మునగాల వద్ద సాగర్ కాల్వలో పడేసారు. ఆ తర్వాత అనుమానం రాకుండా యాథా విధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. రహీమ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదని తండ్రి నాగుల్ మీరా ఈ నెల 8వ తేదీన పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగా గతంలో జరిగిన గొడవలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోటయ్య, త్రివేణి కదలికలు, ఫోన్‌కాల్స్‌పై దృష్టిసారించారు. రహీం మృతదేహం సోమవారం పాలేరువాగులో లభ్యం కావడం, అతడి ఒంటిపై గాయాలుండడంతో హత్యగానే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. మంగళవారం కోదాడలోని ఆజాద్‌నగర్‌లో కోటయ్య అతని భార్య త్రివేణి, అత్త శ్రీదేవి ఈమే సహజీవనం చేస్తున్న బండి వాసులను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
జిల్లాలో మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా..
సాక్షి, కోదాడరూరల్ : ఇటీవల పలు చోట్ల మళ్లీ సారా తయారీ చేస్తున్నారు. గుట్టచప్పుడు కాకుండా ఏపీ నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సారా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా తయారయ్యే నాటుసారా వ్యాపారం పూర్తిగా బంద్ అయింది. అనుమానితులను ప్రభుత్వం, ఎక్సైజ్, సివిల్ పోలీసులు సారా తయారీ, విక్రయాలు జరపొద్దని స్టేషన్లకు పిలిచి హెచ్చరించారు. కొందరిని బైండోవర్ చేసి పూచీకత్తుపై వదిలేశారు. అయినా వినని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో భయడిన తయారీదారులు, బెల్లం వ్యాపారులు తమ వ్యాపారులను బంద్ చేశారు. పూర్తిగా దీనిపై ఆధారపడిన కుటుంబాలకు ఆసరాగా ప్రభుత్వం నుంచి ఉచితంగా రుణాలు కూడా అందజేశారు. దాంతో ఎక్కడా నాటుసారా వాసన లేకపోవడంతో పోలీసులు కూడా ఇటీవల పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించి గతంలో ఈ వ్యాపారం రుచి చూసిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేస్తున్నారు. కోదాడ శివారు గ్రామాలు, తండాలు, హుజూర్నగర్ నియోజకవర్గంలోని కృష్ణపట్టె ప్రాంతాల్లో మళ్లీ ఎక్కువగా సారా తయారవుతుందని సమాచారం. గ్యాస్ పొయ్యిలపైనే తయారీ... అయితే గతంలో ఈ సారాను కట్టెల పొయ్యిపై కట్టెలు, టైర్లు వంటివి వేసి మంటతో తయారు చేసే వారు. ఇవి వాడితే విపరీతమైన పొగ వచ్చి ఎక్కడ సారా వండినా గుర్తు పట్టేవారు. దాంతో ఇప్పుడు తయారీ దారులు ఇంట్లోనే గ్యాస్ పొయ్యిపై బట్టీలను పెట్టి సారా తయారు చేస్తున్నారు. గ్యాస్ ఖర్చు ఎక్కువైనా సారా రేటు కూడా అధికంగా ఉండటంతో తండాలు, గ్రామాల్లో ఇదే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిసింది. శివారు గ్రామాలు, తండాల్లో ఎక్కువగా.... ఎక్కువగా మారుమూల ఉన్న గ్రామాలు, తండాల్లో ఈ సారా తయారీ ఇటీవల ఎక్కువైంది. గతంలో సారా, నల్లబెల్లం వ్యాపారం చేసిన వారు ఇటీవల రంగంలోకి దిగినట్లు సమాచారం. మఠంపల్లి, గరిడేపల్లికి చెందిన బెల్లం వ్యాపారులు గతంలో సారా తయారు చేసే వారి ఫోన్ నంబర్లు తీసుకుని నల్లబెల్లం కావాలా అని ఫోన్ చేసి వారిని ఏపీ వారికి పరిచయం చేయడంతో వారే నేరుగా వచ్చి బెల్లాన్ని అమ్ముతున్నట్లు సమాచారం. గ్రామాలు, తండాల్లోని కొద్ది మందిని ఎంచుకుని వారికి రాత్రి సమయాల్లో నల్లబెల్లం సరఫరా చేస్తున్నారు. ఖరీదైన వాహనాల్లో రవాణా... ఇదివరకు బెల్లం, పటికను వ్యాపారులు ఆటోలు, టాటాఎస్ వాహనాల్లో తీసుకొచ్చి సారా తయారీ దారులకు దిగుమతి చేసేవారు. రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా కొనసాగడంతో పోలీసులు తనిఖీలు చేసే సమయంలో పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికీ అనుమానం కలగకుండా ఖరీదైన కార్లలో రవాణా చేస్తున్నారు. నల్లబెలం రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదివరకు 50 కేజీల నల్లబెల్లం బస్తా రూ.1400 నుంచి 1600 ఉండగా ప్రస్తుతం రూ.3500, పటికను కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఏపీ నుంచి భారీగా నల్ల బెల్లం ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా నల్లబెల్లం, పటిక సరఫరా అవుతుంది. ఇటీవల కోదాడ, హుజూర్‌నగర్‌లో పెద్ద ఎత్తున పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, విజయవాడ నుంచి రాష్ట్రం లోకి అక్రమంగా బెల్లాన్ని దళారులు రవాణా చేస్తున్నారు. మఠంపల్లి మండలం, చింతలపాలెం మండలాల్లో ఉన్న బల్లకట్టు నుంచి, కోదాడ మండల రామాపురం క్రాస్‌రోడ్డు నుంచి మాత్రమే ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గం ఉంది. అంటే దాదాపుగా ఈ మార్గాల గుండానే బెల్లం రవాణా అవుతుందని తెలుస్తుంది. రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎక్సైజ్ చెక్‌పోస్టు పెట్టినా సిబ్బందిని నియమించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఇక బల్లకట్టులు, మట్టపల్లి బ్రిడ్జి వద్ద కూడా చెక్‌పోస్ట్‌లు లేకపోవడంతో రవాణా సాగుతుంది. నిఘా తగ్గడంతో పెరిగిన తయారీ సారా తయారీపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు నిఘా పెట్టకపోవడంతో ఇటీవల తండాలు, పలు గ్రామాల్లో సారా తయారీ ఎక్కువైనట్లు తెలిస్తుంది. కోదాడ మండలం భీక్యాతండాలో చూస్తే తాగుడు అలవాటు ఉన్న కొందరు, వ్యాపారం చేసే మరికొందరు సారా బట్టీలను పెడుతున్నారు. వీరు రాత్రి సమయంలో బట్టీలు పెడుతున్నారు. కొద్ది మంది వారు తాగడానికి తయారు చేసుకుని మిగిలినది విక్రయిస్తున్నారు. మరికొందరు మాత్రం ద్విచక్రవాహన డిక్కీలు, ట్యాంక్ కవర్లలో పెట్టుకుని కోదాడ, హుజూర్‌నగర్‌లో విక్రయిస్తున్నారు. సీసా (650ఎంఎల్) సారాను రూ.150 విక్రయిస్తున్నారు. ఒక్క బీక్యాతండాలోనే కాకుండా పలు తండాలు, గ్రామాల్లో కూడా తయారు చేస్తున్నట్లు తెలిస్తుంది. సమాచారం ఇస్తే దాడులు చేస్తున్నాం... గ్రామాలు, తండాల్లో సారా తయారు చేస్తున్నట్లు సమాచారం వస్తే దాడులు చేస్తాం. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచా రం లేకపోయినప్పటికీ రొటీ న్గా దాడులు నిర్వహిస్తూనే ఉన్నాము. ఇటీవల కోదాడ, చిలుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేశాం. – ఆర్.సురేందర్, ఎక్సైజ్ సీఐ, కోదాడ -
యుక్తవయస్సులోనూ వృద్ధులుగా..
సాక్షి, కోదాడ : తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి 2,016 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించడంతో పట్టుమని 40 సంవత్సరాలు నిండని వారు వృద్ధుల అవతారం ఎత్తుతున్నారు. మీ సేవ కేంద్రాలే అడ్డాగా ఆధార్, ఓటరు కార్డుల్లో వయస్సును అమాంతం పెంచుకుంటున్నారు. కోదాడ పట్టణంలో దీని కోసం ప్రత్యేక అడ్డాలు ఏర్పడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు, బీఎల్ఓలు, వారి భర్తలు దీన్ని లాభసాటి వ్యాపారంగా చేసుకున్నారు. వేల సంఖ్యలో కాగితాల్లో వృద్ధులు తయారు అవుతున్నారు. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, శ్రీరంగాపురం, సాలార్జంగ్పేట, బాలాజీనగర్‌లో ఇప్పటికే మార్పిడి యథేచ్ఛగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. దళారుల దందా.. వాస్తవానికి ఆసరా పింఛన్ కోసం ఆధార్‌కార్డు వయస్సుతో సంబంధం లేదు. కేవలం ఓటరు కార్డులోని వయస్సును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కానీ కొందరు దళారులు ఆధార్ కార్డులో కూడా వయస్సు పెంచాలని మభ్యపెడుతూ సామాన్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఇక ఓటరు గుర్తింపు కార్డుల్లో వయస్సు పెంపు కోసం పలువురు బీఎల్ఓలు కూడ భారీగా పుచ్చుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో కోదాడ తహసీల్దార్ వద్ద పని చేసిన ఓ వ్యక్తి కొంత మంది కార్యాలయ ఉద్యోగులతో ఉన్న సంబంధాలతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, బాలాజీనగర్, సాలార్జంగ్ పేటలలో కూడా ఈ దందా పెద్దెత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరంగాపురం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి వయస్సు వాస్తవంగా 45 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ కార్డుల్లో వయస్సును పెంచుకుని కొంత కాలంగా పింఛన్ పొందడం గమనించదగ్గ విషయం. పింఛన్ల పంపిణీలో చేతివాటం.. కోదాడ పట్టణంలో దాదాపు 5 వేల వరకు వివిధ రకాల పింఛన్లను ప్రతి నెలా అందించాల్సి ఉంది. కానీ పట్టణంలో 3 బయోమెట్రిక్ యంత్రా లే ఉండడంతో పరిసర గ్రామాలలో ఉన్నవారిని కోదాడకు పిలిపించి పింఛన్లు ఇప్పిస్తున్నారు. అయితే వీరు తపాలా కార్యాలయంలో ఇవ్వాల్సిన పింఛన్లను ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తూ ప్రతి లబ్ధిదారు నుంచి 50 రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా వేలిముద్రలు పడడం లేదని కొంద మంది కోదాడలో లేకున్నా వారి పింఛన్లను పెద్ద ఎత్తున డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పింఛన్ల పంపిణీ సమయంలో వేలి ముద్రలు పడని వారి కోసం మున్సిపాలిటీ 1–15 వార్డులకు ఒకరిని, 16–30 వార్డులకు మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కీలకంగా వ్యవరిస్తున్నారని సమాచారం. పింఛన్లు పొందుతున్న వారు కోదాడలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు. వారి వేలు ముద్రలు పడడం లేదని మున్సిపాలిటీ ఉద్యోగులు డబ్బులు డ్రా చేస్తున్నారని, దీని కోసం రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో చనిపోయిన వారివి కూడా వేలి ముద్రలు పడడం లేదని నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు పింఛన్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. వేలి ముద్రలు పడనివారి పింఛన్లను మాత్రమే మున్సిపల్ ఉద్యోగులు డ్రా చేయాలి. చనిపోయిన వారి పింఛన్లు డ్రా చేసినట్లు తెలిస్తే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. విచారించి తగు చర్యలు తీసుకుంటాం. – కందుల అమరేందర్‌రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ -
అయ్యో పాపం కీర్తన
సాక్షి, నడిగూడెం (కోదాడ) : అధికారులు నిర్లక్ష్యం ఆ విద్యార్థిని ప్రాణాలకు ముప్పుతెచ్చింది. సంబంధిత అధికారులు తమకెందుకులే అనుకోవడంతో ఇప్పుడు ఓ తల్లికి కడుపుకోత మిగిల్చేలా ఉంది. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో ఆశలతో ఆ పాఠశాలలో చేరింది. తోటి విద్యార్థులతో నిత్యం ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ గడిపింది. కానీ విధి విద్యుత్ తీగల రూపంలో ఆ పసిపాప ప్రాణం ఇప్పుడు విలవిలతాడుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ, నాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నారు ఆ తల్లిదండ్రులు, మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దగ్గుపాటి యేసు, నాగమణిల చిన్న కూతురు కీర్తన. తండ్రి యేసు మూగ. తల్లి నాగమణి కూలినాలి పనులు చేసుకుంటున్నది. ఈ చిన్నారి నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని చదువుతోపాటు, ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొనేది. రెండు చేతులు తొలగించారు కీర్తన విద్యుత్ఘాతానికి గురై శరీరం తల భాగం తప్ప పూర్తిగా దెబ్బతింది. దీంతో గత నెల 26న ఎడమ చేతిని తొలగించారు. గత నెల 28న కుడిచేయిని కూడా తొలగించారు. విద్యుత్ ఘాతంతో శరీరం కుళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారిని చూసిన వైద్యసిబ్బంది, వైద్యులు, బందువులు కన్నీరు పెట్టుకున్నారు. మాటలు రాని తండ్రి యేసు మౌనంగానే రోదిస్తున్నాడు. కన్న తల్లి నాగమణి జీవశ్ఛవాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం కీర్తన చూడడం, మాట్లాడడం చేస్తుంది కానీ అవయవాల్లో కదలికలు లేవు. కీర్తన ఆరోగ్యం కుదుట పడేంత వరకు పూర్తిగా గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యంలోనే చికిత్స చేయిస్తున్నారు. కీర్తన కోలుకునేందుకు దాదాపు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. పాఠశాల నుంచి ఇద్దరు ఉపాద్యాయులు, ప్రిన్స్‌పాల్ భిక్షమయ్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజురూ చేసేందుకు, స్థానిక శాసన సభ సభ్యుల ద్వారా దరఖాస్తు కూడా చేశారు. విద్యార్థిని పూర్తి స్థాయిలో కోలుకునేందుకు చికిత్స జరిపిస్తామని కోదాడ ఎమ్యెల్యే మల్లయ్య యాదవ్ హామీనిచ్చినట్లు ప్రిన్స్‌పాల్ ఎ.భిక్షమయ్య తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేంత వరకు గురుకుల సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ఘాతానికి గురై చికిత్స పొందుతున్న కీర్తన త్వరగా కోలుకోవాలని అనేక మంది విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. విషమంగా కీర్తన పరిస్థితి ఈ నెల 16న కీర్తన తన స్నేహితులతో గురుకుల పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుతుండగా ప్రాంగణంలో లభించిన అల్యూమినియ రాడ్‌తో సాధన చేసింది. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం మీదుగా 33బై కేవీ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం.. ప్రమాదశాత్తు కీర్తన ఆడుకుంటున్న అల్యూమినియం రాడ్ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురైంది. తీవ్ర గాయాల పాలవ్వడంతో అదే రోజున 108 వాహనంలో కోదాడకు తరలించారు. అక్కడినుంచి ఖమ్మం తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. -
పుట్టినరోజు వేడుకలో విషాదం
కోదాడ: పుట్టిన రోజు వేడుక విషాదం నింపింది. స్నేహితుడి బర్త్‌డే నిర్వహించేందుకు చెరువువద్దకు వెళ్లిన నలుగురు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన చక్రాల ప్రవీణ్ (17), దుగ్యాల భవానీ ప్రసాద్ (17), నేరేడుచర్లకు చెందిన ఎస్.కె. సమీర్ (16), ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం పైనపల్లికి చెందిన ఎన్.మహేందర్ సింహా (17)లు కోదాడ సమీపంలోని అనురాగ్ పాలిటెక్నిక్ కళాశాలలో తొలి ఏడాది చదువుతున్నారు. బుధవారం చక్రాల ప్రవీణ్ పుట్టినరోజు కావడంతో కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు వేడుక చేసుకోవడానికి తినుబండారాలు తీసుకుని కోదాడ పెద్దచెరువు కట్టపైన ఉన్న మైసమ్మగుడి వద్దకు చేరుకున్నారు. కేక్ కటింగ్ అనంతరం చేతులు కడుక్కోవడానికి సమీర్ అనే విద్యార్థి చెరువులోకి దిగాడు. కాలు జారడంతో అతను నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో కాపాడేందుకు చక్రాల ప్రవీణ్ చెరువులోకి దిగాడు. కానీ సమీర్ గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చిన ప్రవీణ్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనిస్తున్న భవానీ ప్రసాద్, మహేందర్ సింహా, పి.ప్రవీణ్, అరవింద్‌లు వారిని కాపాడేందుకు చెరువులోకి దూకారు. అయితే చెరువు లోతుగా ఉండటంతో భవానీ ప్రసాద్, మహేందర్ సింహాలు నీటిలో మునిగి మృతి చెందగా పి.ప్రవీణ్, అరవింద్‌లు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో భయపడిన మిగతా విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీస్తుండటంతో స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి, కోదాడ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో నలుగురు విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, కృష్ణాజిల్లా: తెలంగాణలో దొంగనోట్ల ముద్రిస్తున్న ముఠా గుట్టును కృష్ణాజిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ బస్సులో కండక్టర్‌కు రవి అనే వ్యక్తి నకిలీ నోటు ఇచ్చి.. చెలామణి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, నకిలీ నోటును గుర్తించిన కండక్టర్.. ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకొని.. స్థానికంగా ఉన్న కంచికచర్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని మునగాలలో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లను ముద్రిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్కానర్ , ప్రింటర్లు, రూపాయలు విలువచేసే 47వేల దొంగనోట్లను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బస్తీమే తోటికోడళ్ల సవాల్..!
సాక్షి, కోదాడ : ఎన్నికల వేళ కోదాడ పట్టణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బుధవారం పట్టణంలో ఏ సెంటర్లో చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఔరా రాజకీయం అంటే ఇదే మరీ అంటూ ప్రజలు గొనుక్కుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే 2014లో కోదాడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయిం చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు వంటిపులి గోపయ్య పెద్దకోడలు వంటిపులి నాగలక్ష్మి చైర్పర్సన్ అభ్యర్థిగా 30వ వార్డులో బరిలోకి దిగారు. ముందుజాగ్రత్తగా ఆయన చిన్న కోడలు వంటిపులి అనిత కూడా 19వ వార్డులో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి పారా సత్యవతిపై పోటీకి నిలబడ్డారు. అనూహ్యంగా కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి వంటిపులి నాగలక్ష్మి పరాజయం పాలయ్యారు. మరో పక్క టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి పారా సత్యవతిని గోపయ్య చిన్నకోడలు ఓడించింది. దీంతో వంటిపులి అనితను చైర్పర్సన్ పదవి వరించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అనిత టీఆర్ఎస్లో చేరగా, గోపయ్యతో పాటు పెద్ద కోడలు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. బుధవారం పెద్దకోడలు నాగలక్ష్మి, ఆమె భర్త వెంకటేశ్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మరో పక్క టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యకు మద్దతుగా చైర్పర్సన్ వంటిపులి అనిత, ఆమె భర్త నాగరాజులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారాన్ని చూసిన ప్రజలు రాజకీయాలు కుటుంబాలను కూడా వేరు చేస్తాయి కాబోలు అనుకోవడం కనిపించింది. మరిన్ని వార్తాలు... -
నాకు ఓటు వేస్తే పర్యావరణాన్ని కాపాడుతా
సాక్షి, కోదాడ : తనకు ఓటు వేస్తే పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని, ప్రజలకు మెరుగైన జీవన విధానానికి అవకాశం కల్పిస్తానని హమీ ఇస్తున్నాడు కోదాడకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ. సోమవారం మొక్కలను చేత పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ ప్రేమి కులు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణం, గ్రామాల్లో హరిత వనాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు. -
కోదాడలో వేణుమాధవ్ నామినేషన్
సాక్షి, కోదాడ : సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్ వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు. దీంతో సోమవారం ఆయన మరో మారు కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని వేణుమాధవ్ భావించారు. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
‘నేను పోటీలో ఉంటా’
సాక్షి, కోదాడ : కోదాడ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటానని నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ టికెట్ మల్లయ్యకు ఇస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం ఆయన అనుచరులతో కలిసి సూర్యాపేటలోని మంత్రి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మెరకు మంత్రి తనకు ఎటువంటి సంబంధం లేదని, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అనంతరం కోదాడ వచ్చి ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తనకే టికెట్ ఇస్తుందని, సోమవారం నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కానీ సాయంత్రానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోదాడ టికెట్‌ను బొల్లం మల్లయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది. చందర్రావు నివాసంలో సంబరాలు.. టికెట్ బొల్లం మల్లయ్య యాదవ్‌కు ప్రకటించడంతో ఆయన చందర్రావు ఇంటికి వెళ్లి అక్కడ మిఠాయిలు పంచుకున్నారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత తదితరులు స్వీట్లు పంచారు. అనంతరం మల్లయ్య పార్టీ కార్యాలయంలో ఉన్న శశిధర్‌రెడ్డి వద్దకు రావడంతో పలువురు కార్యకర్తలు టికెట్ వద్దని చెప్పాలని మల్లయ్యను పట్టుబట్టారు. ఆస్తులు ఆమ్ముకొని పార్టీని బతికించాను. కోదాడ నియోజకవర్గంలో 2010 నుంచి పార్టీ కోసం ఆస్తులను ఆమ్మి కష్టపడ్డానని చెప్పారు. రెండు రోజుల క్రితం బొల్లం మల్లయ్యను పార్టీలో చేర్చుకోవాలని పార్టీ చెపితే నాలుగు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హైదరాబాద్‌కు తీసుకెళ్లానన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతరులకు టికెట్ ఇస్తామనడం అన్యాయమన్నారు. తాను సోమవారం నామినేషన్ దాఖలు చేస్తానని, జరిగిన అన్యాయం ఇంటింటికి తిరిగి చెపుతానని నియోజకర్గ ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. -
కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను ప్రకటించిన టీఅర్ఎస్
-
నాయినికి షాకిచ్చిన కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్ : ముషీరాబాద్ టికెట్‌ను తన అల్లుడికి కేటాయించాలని కోరిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి గులాబీ అధినేత కేసీఆర్ మొండిచేయి చూపారు. ఆ స్థానాన్ని టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్‌కు కేటాయిస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇటీవల టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మల్లయ్య యాదవ్‌కు కేటాయించారు. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని మంత్రి నాయిని మొదటి నుంచి పట్టుబట్టారు. అయితే, అక్కడ ముఠా గోపాల్ అయితేనే.. ప్రభావం చూపగలరని పార్టీ సర్వేలో వెల్లడైందని, అందుకే గోపాల్‌కు ఆ సీటు కేటాయించామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ఆ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముఠా గోపాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కోదాడ సీటు గత శుక్రవారమే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఖరారు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న కోదాడలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఆ స్థానాన్ని కేటాయించారు. బర్కత్ పురాలో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టిఆర్ఎస్ బిఫామ్ ను ముఠా గోపాల్ తీసుకోనున్నారు. నాయిని ఆశీర్వాదం తీసుకుని సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆధ్వర్యంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయన చేస్తారు. -
ఎన్నికల ఇంకు.. కథా.. కమీషు..
సాక్షి, కొదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తారు. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. మరీ ఈ ఇంకుకు పెద్ద చరిత్రే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయ్యారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహరాజ నల్వాడీ కష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకులు.తరువాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడ తయారీ చేస్తుంది. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు దీని తయారీ గురించి తెలియనీయరు. -
ఉత్తమ్‌కు షాకిచ్చిన టీడీపీ నేత
సాక్షి, నల్గొండ : ఎన్నికల ముందు మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగంగా నల్గొండ జిల్లా కోదాడ సీటు తనకే వస్తుందని భావించిన టీడీపీ నేత బొల్ల మల్లయ్య యాదవ్ టికెట్ రాకపోవడంతో గులాబీ గూటికి చేరారు. కోదాడ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతికి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరశ చెందిన ఆయన శుక్రవారం తెలంగాణ భవన్లో ఆపధర్మ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లయ్య పార్టీని వీడడంతో మహాకూటిమి అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి విజయంపై పడుతుందని అక్కడి నేతలు విశ్లేషిస్తున్నారు. మల్లయ్య చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహాకూటమిలో మల్లయ్య యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ‘‘కేసీఆర్‌యే స్వయంగా ఫోన్ చేసి తాను బలహీన వర్గాల గొంతుకగా ఉంటానని మల్లయ్యకు భరోసా ఇచ్చారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే ఇంతమంది తెలంగాణ భవన్‌కు రావడం సంతోషకరం. తెలంగాణ భవన్లో ప్రతి రోజు వేలాది మందితో చేరికలు జరుగుతుంటే గాంధీ భవన్‌కు మాత్రం గేట్లకు తాళాలు వేస్తున్నారు. అక్కడ బౌన్సర్లే, ఉత్తమ్ ఇంటి వద్ద బౌన్సర్లే. 30 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మూడు కోట్లకు టికెట్ అమ్ముకుంటున్న వారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమేస్తారు. చంద్రబాబుకే తెలంగాణను అమ్ముకోరని గ్యారంటీ ఎంటి? వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారు అయ్యాయి. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. గత పాలనను చూడండి నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడండి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు వాసుదేవరావు
సాక్షి,కోదాడ అర్బన్ : ఎంతో చైతన్యం కల్గిన హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అక్కిరాజు వాసుదేవారావు నాటి రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవెర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 1962 నుం చి1972 మరకు వరకు రెండు సార్లు కాంగ్సెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికై బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహా రావుల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం 1977 కోదాడ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఆయన 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.1978కు ముందు కాంగ్రెస్ ఉన్న ఆయనను ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో ఉన్నదని, ఆయన సమకాలికులు చెబుతున్నారు. స్వచ్ఛందంగా.. 1983 వరకు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అదే సంవత్సరంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ స్థానిక పరిస్థితలను అవగతం చేసుకుని, పెరిగిన ఎన్నికల వ్యయం, వర్గవిభేదాలు, కులప్రాతిపతికన ఓట్లు చీలడంతో పోటీనుంచి తప్పుకున్నారు. తన శిష్యుడైన చింతాచంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించారు. నేటి రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టికెట్ల కోసం తన్నుకుంటున్న ఈ స్థితిలో ఆయనకు వచ్చిన టికెట్‌ను స్యచ్ఛందంగా వదులుకుని సమకాలిన రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఈ నిర్ణయాన్ని కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ స్యయంగా బహిరంగ వేదిక పైనుంచే అభినందించారు. విద్యాప్రదాతగా.. హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల్లో పోటీచేసిన సందర్భములో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కోదాడలో డిగ్రీ కళాశాలను ఆర్ట్స్అండ్ సైన్స్ విభాగంతో ఏర్పాటు చేయించారు. తొలుత కోదాడ బాలుర ఉన్నతపాఠశాలలో ఈ కళాశాలను ప్రారంభించారు. అనంతరం తన బంధువులైన కొండపల్లి రాఘవమ్మరంగారవు నుంచి 60ఎకరాల భూమిని విరాళంగా సేకరించి 1970లో కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు ఫౌండర్ చైర్మన్‌గా ఆయన కొనసాగారు. అదే విధంగా ఆయన కళాశాల అభివృద్ధికి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేశారు. అప్పట్లోనే విదేశాల్లో ఎంబీఏ చదివిన మాజీమంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావును కళాశాల కరస్పాండెంట్‌గా చేశారు. ఈ కళాశాల ద్వారా ఎందరో విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాలకు, కళాశాల విద్యార్థులకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం బ్రహ్మానందరెడ్డితో.. వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ నియోజకవర్గ పరిధిలో వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా ఆయనకు ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. అప్పటి వరకు కిరోసిన్ దీపాలతో ఉండే గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. రహదారులు, వైద్యానికి పెద్దపీట నియోజకవర్గంలో రహదారులను ఏర్పాటు చేయడంలో ఆయన కృషిచేశారు. కనీస రహదారి లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు రహదారి సౌకర్యాలు కల్పించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా హుజూర్నగర్, కోదాడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అనేక గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయించారు. స్వతహాగా ఆర్ఎంపీ వైద్యుడైన ఆయన నియోజకవర్గంలో వైద్యానికి కూడా పెద్దపీట వేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషిచేశారు. గఫార్‌ఖాన్ ప్రసంగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తున్న అక్కిరాజు సాగర్ కాలువల ఏర్పాటులో కూడా ప్రత్యేకతే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయన హుజూర్నగర్, కోదాడ ప్రాంతాలకు సాగర్‌నీటిని తీసుకొచ్చేందుకు చేసిన కృషి ఇప్పటికీ ఆయా ప్రాంతాల ప్ర జలు కొనియాడుతారు. పీవీ నర్సింహారావు మంత్రి వ ర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆ యన అప్పటి కాలువల ఏర్పాటులో ఎంతో కృషిచేశారు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు రాజకీయంగా ఆయన రాష్టంలో మంచి గుర్తింపు తెచ్చుకుని జాతీయ నాయకులతో మంచి సత్సంబంధాలను కొనసాగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోదాడకు వచ్చిన సందర్భముగా ఆయనను అభినందించి సెంట్రల్లో మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. అనంతరం ఆమె హత్యకు గురికావడంతో రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది ఏర్పడింది. పీవి నర్సింహారావుకు బంధువు, అత్యంత ఆత్మీయుడు అయన వాసుదేవరావుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో రాజకీయ జీవితానికి విఘాతం కల్గింది. ఆప్కాబ్ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్ ఆయన కొనసాగారు. జాతీయ స్థాయిలో ఆయనకు మణిశంకర్ అయ్యర్ తదితర ఆనాటి నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. రాష్ట్రంలో అప్పటి పెద్దతరం నాయకులు, సినిమా పరంగా ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణరెడ్డి, దాశరథిలతో మంచి సంబంధాలను కొనసాగించారు. ఆంగ్లంలో అనర్గళవక్తగా అక్కిరాజు వాసుదేవరావుది హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేళ్లచెర్వు శివారు వెంకట్రాపపురం. ఆయన కుటుంబం భూస్వామ్య కుటుంబం కావడంతో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను ఆయన తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో చదివించారు. అక్కడ ఆయన ఎస్ఎస్ఎల్సీ వరకు చదవి అంగ్లంలో మంచి పట్టు సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో అసెంబ్లీలో పలు సమస్యలపై ఆంగ్లలో మాట్లాడుతుంటే సభ ఆసాంతం ఆలకించేదని పాత తరం నాయకులు తెలిపే వారు. ఆంగ్లంలో మంచి పట్టు సాధించడంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన మంచి గుర్తింపు వచ్చిం ది. రాష్ట్రానికి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా వారి ప్రసంగాలను ఆయన తర్జుమా చేసే వారని తెలిపారు. -
కోదాడ బరిలో హాస్య నటుడు వేణుమాధవ్..!
సాక్షి, కోదాడ అర్బన్: సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. కాగా వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణం. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భాం తర్వాత ఆయన పార్టీ సభలో పాల్గొని తన మిమిక్రి ద్వారా ప్రచాన కార్యక్రమాన్ని చేట్టారు. తదనంతరం ఆయనకు సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిందే. ఆయన మిత్రబృందం కూడా రాజకీయాల్లో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవాకార్యక్రమాలను చేపట్టేందుకు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను స్వయంగా వేయనున్నట్లు తెలిపారు. -
హెలికాప్టర్ నుంచి కరపత్ర ప్రచారం
కోదాడ: 2004 ఎన్నికల్లో ఓ యువ నాయకురాలు హెలికాప్టర్ ద్వారా సాగించిన ప్రచారం అప్పట్లో కొత్త ఒరవడి సృష్టించింది. కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్. 2004 ఎన్నికల్లో ఆమె ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు ఆమె కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి ఆమె మాత్రం అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కోదాడకు వచ్చి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడ టికెట్ కోసం ప్రయత్నించారు. ఒకదశలో ఆమెకే టికెట్ వస్తుందని ప్రచారం సాగింది. దీంతో అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కోదాడకు వచ్చే ముందు శ్రీకళారెడ్డి.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించారు. దాని ద్వారా బహిరంగసభ జరుగుతున్న కోదాడ పట్టణంలో లక్షల సంఖ్యలో కరపత్రాలను వెదజల్లారు. దీన్ని నాడు ప్రజలు వింతగా చూశారు. ఆ తరువాత ఆమె కొంతకాలం రాజకీయాల్లో తిరిగినా.. ఆ తరువాత రాజధానిలో వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. 384 ప్రస్తుత ఎన్నికల్లో ‘ఎం3’ రకం ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించి ఒక ఈవీఎంను తయారు చేయొచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. ఒక బ్యాలెట్ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫొటో ఉంటాయి. ఒకే నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీచేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. -
ఎదురుచూపులు..!!
సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఏ ముహూర్తాన ప్రకటించారోగాని కోదాడ వాసులకు మాత్రం గడిచిన రెండు నెలలుగా అభ్యర్థుల ప్రకటనలపై ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రం మొత్తం స్పష్టత వచ్చినప్పటికీ కోదాడ స్థానంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో అదే పరిస్థితి నెలకొనడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఢీలా పడ్డారు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు టీవీల్లో చూడడం, తెల్లవారిన తరువాత పత్రికల్లో వెదకడం రెండు నెలలుగా కోదాడ నాయకుల దినచర్యగా మారింది. కాని పరిస్థితిలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. తాజాగా శనివారం అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతుంది. కాని ఆరోజు కూడా రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్నారనే సమాచారం అందుతండడంతో స్థానికంగా ఉత్కంఠ పెరిగిపోతుంది. నువ్వా.. నేనా..? కోదాడ టికెట్ కోసం అధికార టీఆర్ఎస్ నుంచి ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎవ్వరికి టికెట్ ఇవ్వాలో తేల్చకుండా రెండు నెలలుగా వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చింది. దీంతో విసుగు చెందిన కొందరు నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఐనప్పటికీ పార్టీ మాత్రం నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. చందర్రావు హైదరాబాద్‌లో తన సామాజిక వర్గానికి చెందిన కొంత మందితో తీవ్ర లాబీయింగ్ చేయిస్తుండగా శశిధర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌ల మీద భారం వేసి కోదాడకు, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నాడు. మధ్య, మధ్యలో మండలాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు. మీకా.. మాకా...? ఇదీలా ఉండగా కాంగ్రెస్ కూడా కోదాడ టికెట్ విషయంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్ గ్యారంటీ లేకపోవడం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. మహాకూటమిలో భాగంగా కోదాడ టికెట్‌ను టీడీపీ కోరుతుందనే ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్ తనకు టికెట్ ఖాయమని, ఏపీ సీఎం తనకు హామీ ఇచ్చారని చెపుతుండడంతో క్యాడర్లో ఆయోమయం నెలకొంది. సందట్లో సడేమియా..!! టికెట్ల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా సామాజిక మాధ్యమాల్లో, వాట్సప్ గ్రూపులలో జరుగుతున్న ప్రచారం ఇరు పార్టీల నేతలకు కాక పుట్టిస్తుంది. ఫలాన గ్రూపులో ఇలా వచ్చింది, ఫలానా వారికి ఈ మెసేజ్ వచ్చింది... వాస్తవమేనా ? అంటూ పలువురు ఇతరులకు ఫోన్లుచేసి వాకబు చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు శనివారం కూడా తెరపడడం లేదని తెలుస్తుండడంతో ఇంకా కోదాడ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. -
సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు.. విటుల్లో ప్రముఖులు?
కోదాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్ కలకలం సృష్టిస్తోంది. ఆన్లైన్లో అమ్మాయిల ఫొటోలను అప్లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వ్యభిచార నిర్వాహకుల వద్ద రెగ్యులర్ కస్టమర్స్ పేరుతో ప్రముఖుల ఫోన్‌నంబర్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం కోదాడలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, కోదాడ : పట్టణ కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అందివచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘాపెట్టి .. కోదాడ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఉప్పందింది. దీనిపై నిఘా పెట్టిన ఖాకీలు శనివారం దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు రిమాండ్ చెయ్యడంతో పాటు బాలికలను నల్లగొండ రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను పోలీసులు తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడినట్లు కోదాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిలో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు నిప్పులేనిదే పొగరాదని ముక్తాయింపునిస్తున్నారు. విటుల్లో పలువురు ప్రముఖులు? నిందితుల వద్ద లభించిన సెల్ఫోన్లే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దానిలో ఉన్న నంబర్లు, వారితో తరచూ మాట్లాడిన వారి నంబర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేపనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన కొందరు ప్రభ్వుత ఉద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికావిలేకరులు, వ్యాపారులు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. తమ పేరు బయటకు రాకుండా పోలీసులను కాకా పడుతున్నారని, వారిపై పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఇక్కడ ప్రచారం సాగుతుంది. పోలీసు కస్టడీలో నిందితులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన నిందితులను కోదాడ పోలీసులు తిరిగి తమ కస్టడీకి తీసుకున్నారని సమాచారం. వారి నుంచి పూర్తి వివరాలను రాబట్టి ఈ రాకెట్‌కు చెక్‌పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మా దృష్టికి కూడా వచ్చింది కట్టకొమ్ముగూడెం రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాము. కానీ మా వద్ద వాట్సప్‌లో కొంత మంది ప్రముఖుల వివరాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ వాస్తవంగా మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. జరుగుతున్న ప్రచారంపై విచారణ చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తాం. – శ్రీనివాసులరెడ్డి, పట్టణ సీఐ -
కోదాడలో అరుదైన పక్షి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఖమ్మంక్రాస్రో డ్డులో ఓ దుకాణం ఎదుట గురువారం సాయంత్రం గుడ్లగూబ జాతికి చెందిన అరుదైన పక్షి కనిపించింది. లేత నీలం, తెలుపు రంగుతో నల్లని తోక కలిగి రామచిలుకలా ఉంది. ఈ పక్షి వింతగా ఉండడంతో దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు -
కొత్తపల్లిలో వ్యక్తి దారుణ హత్య
త్రిపురారం(నాగార్జునసాగర్) : అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం సా యంత్రం ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన అలుగుల పెద్దవెంకట్‌రెడ్డి (52)కి తన తమ్ముడు అలుగుల జంగారెడ్డి మధ్య ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న రెండు ఎకరాల 24 గుంటల భూమి కొలతల్లో కొంత తేడాలు ఉండడంతో ఇరువురి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు అలుగుల జంగారెడ్డి తన భూమిని ఇటీవల రైతు తిరుపతయ్యకు అమ్ముకున్నాడు. విషయం తెలుసుకున్న అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి కొత్తపల్లి గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దల మాటలను పట్టించుకోకుండా జంగారెడ్డి రెండు రోజుల క్రితం తన భూమిని కొలత చేయిస్తుండగా అన్న పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడకు వెళ్లి తమ్ముడితో గొడవపడ్డారు. ఈనేపథ్యంలో తన అన్నపై తమ్ముడు జం గారెడ్డి కక్ష పెంచుకున్నాడు.ఈక్రమంలో మంగళవారం సాయంత్రం అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లాడు. విష యం తెలుసుకున్న జంగారెడ్డి, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి అన్న పెద్ద వెంకట్‌రెడ్డిని కత్తులతో పొడిచి చంపాడు. తీవ్ర రక్తస్రావం అయి పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. దాడిచేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్య విషయం తెలుసుకున్న హలియా సీఐలు ధనుంజయగౌడ్, ఎస్ఐ సతీష్‌కుమార్ ఘటన స్థలం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనకు గల కారణాలను విచారించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసమే తన భర్తను మరిది జంగారెడ్డి హతమార్చారని మృతుడి భార్య కనకదుర్గ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
‘ కాంతారావు’ బయోపిక్
కోదాడరూరల్ : సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్కు దర్శకుడు దాదాసాహెబ్‌పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సమానంగా వెలుగొందిన గొప్పనటుడిపై బయోపిక్‌ను తీసేందుకు 50శాతం వివరాలు సేకరించానని మిగిలిన వివరాల కోసం ఆయన స్వగ్రామం వచ్చానని దర్శకుడు ఆదిత్య తెలిపారు. కాంతారావు జీవిత చరిత్ర తెలుసుకునేందుకు ఆదివారం దర్శకుడు ఆదిత్య కోదాడ మండలం గుడిబండ గ్రామానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనవ విలేకరులతో మాట్లాడారు. కాంతారావు జీవితాన్ని రెండు కోణాల్లో చంద్రదివ్య ఫిలీం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనగనగా ఓ రాకుమారుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో కాంతారావు 1950 నుంచి 1971 వరకు గల స్వర్ణయుగం.. ఆ తర్వాత కష్టాకాలంపై రెండుగంటల నిడివి గల సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలతో పాటు బి.విఠాలాచార్య, హీరోయిన్లు కృష్ణకుమారి, రాజశ్రీ పాత్రలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాంతారావు కుటుంబ సభ్యులతో, పెద్దకుమారుడు ప్రతాప్‌తో సినిమా కథపై చర్చించనని అ న్నారు. దీనిలో భాగంగానే స్వగ్రామంలో ఆయన గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు ఆదిత్య కాంతారావు ఇంటి వరండాలో కూర్చొని గ్రామస్తులు, ఆయన జీవితాన్ని చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుల సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలను దర్శకుడికి వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి గ్రామస్తులు, ఆయన అభిమానుల సహా కారం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, యరగాని లక్ష్మయ్య, బాలేబోయిన సిద్దయ్య, పోలోజు నర్శింహచారి, వెంకటాచారి, శ్రీనివాసుల ప్రసాద్‌రెడ్డి, కుక్కడుపు సైదులు గ్రామ ప్రజలు ఉన్నారు. ఆనందంలో గ్రామస్తులు.. తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గొప్ప దర్శకుడి చేతిలోకే సినిమా.. కాంతారావు బయోపిక్‌ని సినిమా తీసే డైరెక్టర్ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్‌ఫిల్మ్‌లు తీసి 2015లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్ ఓపెన్ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్‌లో పేరు కూడా సంపాదించాడు. తెలుగు చిత్రసీమలో ఏఎన్ఆర్ తర్వాత ఆదిత్యకు ఆ తర్వాతే కళాతపస్వీ విశ్వనాథ్‌గారికి వచ్చింది. పిల్లలుకాదు పిడుగులు సినిమాకు 2004 ఉత్తమ బాలలచిత్ర కేటగిరికిలో నంది అవార్డు కూడా పొందారు. ‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చింది.. ఈనెల 19న సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన కాంతారావు బయోపిక్ వార్తాకు ఉమ్మడి రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సాక్షిలో వచ్చిన వార్తాను చూసిన ఆయన అభిమానులు అనేకమంది ఫోన్ చేశారని సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారని కావాల్సిన సహాయ సకారాలు అందజేస్తామని తెలిపారని అన్నారు. -
జడ్చర్ల– కోదాడ..ఇక హైవే
మిర్యాలగూడ : ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల– కోదాడ రోడ్డు ఇక జాతీయ రహదారిగా మారనున్నది. 214 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డు మరింత వెడల్పు కానున్నది. ఆర్అండ్బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 7 మీటర్ల వెడ్పల్పులో బీటీ ఉంది. కాగా దానిని జాతీయ రహదారిగా గుర్తించడం వల్ల పది మీటర్ల వెడల్పుకు విస్తరించనున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రోడ్డు నిర్మాణాన్ని మొత్తం ఐదు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో 510 కోట్ల రూపాయలతో రెండు ప్యాకేజీలు జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు 94 కిలో మీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న మరో మూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మల్లేపల్లి– అలీనగర్ (హాలియా), అలీనగర్ (హాలియా) – మిర్యాలగూడ వరకు 80 కిలోమీటర్ల వరకు 500 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. మిర్యాలగూడ – కోదాడ వరకు 40 కిలో మీటర్ల మేర మరో 200 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కావాల్సి ఉంది. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పనులు కూడా త్వరలో చేపట్టనున్నారు. మల్లేపల్లి నుంచి హాలియా వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, విద్యుత్ స్థంబాలు తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇవీ..ప్యాకేజీలు జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారు. వాటిలో 94 కిలోమీటర్ల మేర జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు విభజించారు. మిగతా 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో మల్లేపల్లి– హాలియా (అలీనగర్), హాలియా – మిర్యాలగూడ, మిర్యాలగూడ – కోదాడ వరకు విభజించారు. ఒక్కొక్క ప్యాకేజీకి 40 కిలోమీటర్లు ఉండే విధంగా విభజించారు. ఫోర్వే ఉన్న చోటనే డివైడర్లు గతలో ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల నుంచి కోదాడ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించారు. 214 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రోడ్డు వంద ఫీట్ల వెడల్పు ఉండే విధంగా నిర్మాణం చేస్తారు. దానిలో 10 మీటర్ల వెడల్పులొనే బీటీ వేస్తారు. ప్రస్తుతం ఆ రోడ్డు 7 మీటర్ల మేర బీటీ ఉండగా దానిని పది మీటర్లకు పెంచుతారు. అందుకని రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేయరు. ప్రధాన పట్టణాలు ఉన్న చోట నాలుగులైన్ల రోడ్డు నిర్మిస్తారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మించిన చోట మాత్రమే డివైడర్లు ఏర్పాటు చేస్తారు. మిగతా రోడ్డు డివైడర్ లేకుండానే ఉంటుంది. అంతే కాకుండా ఎక్కడ కూడా బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు. అందుకని ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రోడ్డు మీదుగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభం జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. అందుకు గాను రూ.500 కోట్లతో రెండు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మరో ప్యాకేజీకి కూడా టెండర్లు చివరి దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల భూములు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం తప్పనిసరిగా అందుతుంది. – లింగయ్య, ఏఈ, జాతీయ రహదారుల విభాగం -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కోదాడ : హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన బర్మావత్ లక్ష్మి ఏప్రిల్ 5న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన అజ్మీరా అశోక్‌నే చెడు అలవాలట్లకు బానిసగా మారి చోరీలకు పాల్పడుతున్నాడు. బాలాజీనగర్‌కు చెందిన సీతరాంసింగ్ కుటుంబ సభ్యులు ఈ నెల మొదటివారంలో ఊరికి వెళ్లారని తెలుసుకుని దొంగతనానికి వచ్చాడు. కాని ఇంటి యజమానురాలు లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో తన పేరు బయట పెడుతుందని అక్కడ ఉన్న బ్లేడుతో గొంతు కోశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు బిరువా తాళం తీసి చిందరవందర చేశాడు. కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించి ఇంటిలో రక్తపు మరకలను హత్య జరిగిన మరుసటి రోజే కుటుంబ సభ్యులు ఇతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో అశోక్ నిందితుడిగా తేలడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ వివరించారు. రహస్యం ఎందుకో..? హత్య జరిగిన రోజు ఇంటి వద్ద తచ్చాడడమే కాకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో రక్తపుమరకలను కడగడంతో అతనిపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చెయ్యడంతో పోలీసులు ఏప్రిల్ 6న అజ్మీరా అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నాటి నుంచి విచారణ చేస్తునే ఉన్నారు. కేసును ఛేదించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కొంత మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9–30 గంటలకు వాట్సప్‌లో హత్య కేసు నిందితుడు అజ్మీరా అశోక్ అని, సీతారాంసింగ్ ఇంటిలో దొంగతనానికి వచ్చి, అడ్డు వచ్చిన లక్ష్మిని దారుణంగా హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోదాడ పట్టణ సీఐ పేరుతో ఓ పోస్టు పెట్టారు. దీన్ని కొంత మంది గమనించగా మరికొంత మంది చూడలేదు. సంచలనం కలిగించిన ఈ హత్య కేసులో నిందితుడిని అంత రహస్యంగా రిమాండ్ చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న ప్రశ్న పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చిన్న చిన్న దొంగలను పట్టు కున్నప్పుడు సమావేశాలు పెట్టి, ఫొటోలు తీసి వెల్లడించే పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకు ఇలా చేశారనేది అంతుచిక్కిని ప్రశ్న. దీనికి పోలీసులు మాత్రం సమయం లేక పోవడం వల్ల అలా చేశామని, దీనిలో ఇతరత్ర కారణాలు ఏమీ లేవని అంటుండడం కొసమెరుపు. ఆద్యంతం హైడ్రామానే.. అశోక్ అరెస్ట్ ఆద్యంతం హైడ్రామాగానే సాగింది. పోలీసులు నిందితుడిని హత్య జరిగిన రోజునే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదట నిందితుడు నేరాన్ని ఒప్పుకోకపోవడంతో పోలీసులు 15 రోజులుగా వివిధ కోణాల్లో విచారణ చేసి చివరకు అతడే నిందితుడిగా తేల్చారు. అజ్మీరా అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతడే నిందితుడని పలువురు భావిస్తున్న విషయానిన ‘సాక్షి’ ఈ నెల 7న ‘పోలీసుల అదుపులో నిందితుడు’ శీర్షికన కధనం ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్..?
కోదాడ : మూడు రోజుల క్రితం పట్టణంలోని బాలాజీనగర్‌లో పట్టపగలు దారుణ హత్యకు గురైన గిరిజన మహిళ బర్మావత్ లక్ష్మీబాయి (46) కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును పట్టణ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజున కుటుంబ సభ్యులు లక్ష్మీబాయి పెద్ద కుమారుడి కొడుకును చూడడానికి 10 గంటల సమయంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లారు. అంతకు ముందు మూడు రోజులు కోడలు వద్దే లక్ష్మీబాయి ఉంది. తాను ఇంటి వద్దే ఉంటానని, బారసాల కూడా కాదు కాబట్టి మీరు వెళ్లి రమ్మని లక్ష్మీబాయి చెప్పింది. దీంతో ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడళ్లు, ఆమె భర్త సీతరాంసింగ్ నేలకొండపల్లి వెళ్లారు. 12 గంటల సమయంలో రెండో కుమారుడు సందీప్ తల్లికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన వారు 12–30 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు చుట్టూ చీర చుట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు గాయాన్ని గమనించలేదు. కళ్లు తిరిగి పడిపోవడంతో తలకు దెబ్బ తగిలిందెమోనని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు అతడేనా..? లక్ష్మీబాయిని వైద్యశాలకు తీసుకెళుతున్న సమయంలో బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించాడని, కం గారులో అతని గురించి తాము పట్టించుకోలేదని లక్ష్మీబాయి రెండో కుమారుడు సందీప్ అంటున్నారు. ఆస్పత్రికి వెళుతుండగా పలుమార్లు సదరు వ్యక్తి సందీప్‌కు ఫోన్ చేసి ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పాడు. మొదట వద్దు అన్న సందీప్ సదరు వ్యక్తి పలుమార్లు ఫోన్ చేయడంతో చివరకు విసుగులో నీ ఇష్టం అని అనడంతో సదరు వ్యక్తి వెంటనే ఇంటిలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. ఇదంతా కేవలం 15 నిమిషాల్లోనే సదరు వ్యక్తి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతను వారి బంధువు కూడా కాదు. అతను ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తానన్నాడు? అన్న విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అంతే కాకుండా వైద్యశాలకు ఫోన్ చేశానని, వైద్యులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో పాటు ఆమెకు ఎలా ఉంది అంటూ ఆరా తీయడం కూడా అతనిపై ఉన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ విషయాలన్ని సందీప్ ఫోన్లో రికార్డు అయ్యాయి. ఇపుడు ఇవే కేసుకు బలమైన ఆధారాలుగా మారనున్నాయి. ఇంటిని కుటుంబ సభ్యులే శుభ్రం చేయించినట్లు అందరిని నమ్మించాడు. తనపై అనుమానం రాకుండా ఉండడానికే తప్పు దోవపట్టించాడేమోనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పోలీసులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే కేసును ఛేదిస్తామని చెపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం : శ్రీనివాసరెడ్డి, సీఐ లక్ష్మీబాయి హత్య కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. విషాదం నుంచి కోలుకోని కుటుంబ సభ్యులు : అప్పటి వరకు తమ కళ్ల ముందు తిరిగిన తల్లి, ఊరు వెళ్లి రండి చేపల కూర వండి పెడతానని చెప్పి తమను సాగనంపిన రెండు గంటల లోపే దారుణహత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులో విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తునే ఉన్నారు.తమ తల్లి ఎన్నో కష్టాలు పడి చదివించిందని ఆమె కృషి వల్లే తాము ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డామని లక్ష్మీబాయి ముగ్గురు కుమారులు రోదిస్తూ చెపుతున్న తీరు పలువురిని కంట తడిపెట్టిస్తోంది. లక్ష్మీబాయి భర్త సీతరాంసింగ్ కూడా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా సన్నిధానం ఏర్పాటు చేసి మాలదారులకు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాడు. లక్ష్మీబాయి కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ది. పట్టణంలోని ఎవ్వరితో విభేదాలు లేని వీరి కుటుంబానికి చెందిన మహిళను హత్య చేయాల్సిన అవసరం ఎవ్వరికి ఉందో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
కోదాడఅర్బన్ : ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నజీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం లకారానికి చెంది న గార్లపాటి ప్రభాకర్ ఇటీవల పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లోని సాయితేజ హోటల్‌కు వెళ్లి యజమానిని ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు పదివేలు లంచం ఇవ్వాలని లేనిపక్షంలో తప్పుడు కేసు పెట్టిస్తానని బెదిరించడంతో యజమాని ఆందోళన చెందిన అడిగిన డబ్బు ఇచ్చాడు. రెండురోజుల కిత్రం లక్ష్మిపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టపల్లి శ్రీను వద్దకు వెళ్లి బెదిరింపులకు పా ల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవా రం ఖమ్మం క్రాస్‌రోడ్‌లో వేచి ఉన్న శ్రీను దగ్గరకు ప్రభాకర్ రావడంతో అతడి గుర్తింపు కార్డు చూపాలని అడిగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీను స్నేహితులు ప్రభాకర్‌ను వంటమాస్టర్‌గా గుర్తించి అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘50 దేశాల్లో కేటీఆర్‌కు అభిమానులు’
సాక్షి, కోదాడ: కేటీఆర్ ప్రభంజనం చూసి ప్రతిపక్ష నాయకులకు జ్వరాలు వస్తున్నాయని మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకర్గ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఆకాశానికెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యువకెరటం కేటీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలో 50 దేశాల్లో కేటీఆర్ ప్రాధ్యాన్యత వున్నదని, అభిమానులూ వున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకుల గురించి మంత్రి కేటీఆర్ వున్నది ఉన్నట్టుగా చెబుతూ అలీబాబా గుంపు అన్నారని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల మ్యానిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. -
వాగును పూడ్చు.. భవనం కట్టు
కోదాడ : సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఉలకవాగు ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు కాగితాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. అధికారుల చేతులు తడిపారు. అనుకూలంగా కాగితాలను మార్చుకున్నారు. ఇంకేముంది ఆగమేఘాల మీద అనుమతులు మంజూరయ్యాయి. జెట్ స్పీడ్‌తో వాగులో భవన నిర్మాణం కొనసాగుతుంది. మొదట ఈ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఓ ప్రజాప్రతినిధి ఆ తరువాత పెద్దమనిషి అవతారమెత్తారు. అందరిని తానే ‘సరి’చేసి నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూశాడు. వందల అడుగుల వెడల్పుతో ఉన్న ఉలకవాగు మురుగుకాల్వ కన్నా చిన్నగా మారిపోయింది. ఇదేమిటం టే ఐబీ, రెవెన్యూ, మున్సిపల్‌శాఖ అధికారులు అది తమ పని కాదంటే తమ పని కాదని తప్పించుకుంటున్నారు. వాగు ఉందని చెబుతుంది వారే .. కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో సర్వే నంబర్ 936, 937లలో తమ్మర శేషగిరిరావుకు భూమి ఉంది. దీనిని తమ్మర వెంకటేశ్వరరావుకు జీపీఏ ఇచ్చాడు. దానిని ఆయన టీచర్స్ కాలనీ పేరుతో లే అవుట్ చేసి అమ్మాడు. జీపీఏ చేసే సమయంలో, లే అవుట్ చేసే సమయంలో అక్కడ ఉత్తరం వైపు వాగు ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కాని వాగు ఎంత వెడల్పుతో ఉందో సరిగా ఎక్కడ పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. భూమి యజమానికి తృణమో, ఫణమో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగితాల మీద ఒక రకంగాను, క్షేత్ర స్థాయిలో మరో రకంగాను వ్యవహారం నడిచింది. ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న భవనానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ఉలకవాగు నీరు పోవడానికి వంతెన ఉంది. దానిని చూసైనా వాగు ఎంత వెడల్పు ఉందో ఇట్టే చెప్పేయవచ్చు కాని అధికారులు మాత్రం మూమూళ్ల మత్తులో అనుకూలంగా నివేదికలు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ‘సరి’ చేశాడు... ఉలకవాగులో సాగుతున్న భవన నిర్మాణంలో ప్రజాప్రతినిధి ఒక్కరు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా వాగులో పూడికను తీయ్యించి చాలా హడావుడి చేశాడు. మున్సిపల్ అధికారులతో చెప్పి పనులు కూడా ఆపించాడు. ఆ తర్వాత తెరవెనుక మంతనాలు నడిపారు. వ్యతిరేకించే వారినందరిని తానే దగ్గరుండి ‘సరి’ చేసే పని చేపట్టాడనే ఆరోపణలు కాలనీలో గుప్పుమంటున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు ఉలక వాగులో ఒక ప్లాట్‌ను క్రమబద్ధీకరించడానికి యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ అధి కారులు వెనుకా ముందు చూడకుండా క్రమబద్ధీకరించారు. అనుమతులు కూడా మంజూరు చేశారు. భవన నిర్మాణం విషయం కాలనీవాసులకు తెలియడంతో ఉలకవాగులో అక్రమ నిర్మాణాల వల్ల భారీ వర్షాలు వస్తే నీరు కాలనీ మీదకు వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు పనులను ఆపి వేశారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధి సైతం దీన్ని వ్యతిరేకించారు. దీంతో అక్కడ వాగు ఉందో లేదో చెప్పాలని రెవెన్యూ అధికారులను, ఐబీ అధికారులను మున్సిపల్ అధికారులు కోరగా రికార్డులలో వాగు లేదని రెవెన్యూ అధికారులు, వాగు ఉంది కాని ఎంత వెడల్పు ఉందో తెలవదని ఐబీ అధికారులు వింతైన సమాధానాలు ఇచ్చారు. దీంతో తాము ఏమి చేయలేమని మున్సిపల్ అ«ధికారులు చేతులెత్తేశారు. పనులు ఆపాం.. ఉలకవాగులో భవన నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పనులు ఆపాం. రెవెన్యూ, ఐబీ అధికారులు వాగు విషయంలో సరైన విధంగా స్పందించలేదు. దీంతో మేము ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు పనులు ఆపారో తెలపాలని భవన యజమాని అడగడంతో మా వద్ద సరైన కారణం లేక మళ్లీ అనుమతి ఇచ్చాం.-అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
భగ్నప్రేమికుల బలవన్మరణం
కోదాడ/నేరేడుచర్ల: భగ్నప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం చేయడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా, తను లేకుండా జీవించలేనని అమ్మాయి కూడా బలవన్మరణం చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ, నేరేడుచర్లలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నేరేడుచర్లకు చెందిన గూడూరు ప్రశాంత్ (25) అలియాస్ ఉప్పి కోదాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. కోదాడకు వచ్చిపోయే క్రమంలో కోదాడలోని వీటీ కాలనీకి చెందిన శాలిని (18) అనే బంధువుల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. శాలిని కోదాడలోని ఓ డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమకు శాలిని తల్లిదండ్రులకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వేరే వ్యక్తితో నిశ్చాతార్థం చేశారు. వీడియోకాల్‌లోనే ఆత్మహత్యకు నిర్ణయం నేరేడుచర్లలో శుక్రవారం రాత్రి మిత్రులతో మాట్లాడి ఇంటికి వచ్చాడు. ఉదయం 6 గంటలకే తనను నిద్ర లేపాలని ఎదురింట్లో ఉండే ఓ మహిళకు చెప్పాడు. అయితే.. శనివారం ఉదయం ఆమె వచ్చి తలుపుకొట్టగా ఉలుకూపలుకూలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగులకొట్టి చూడగా ప్రశాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. అటు కోదాడలో కూడా శాలిని తెల్లవారుజామునే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నా చివరి క్షణంలో వీడియోకాల్ ద్వారా మాట్లాడుకొని ఒకే సమయంలో పురుగుల మందు తాగారు. -
వడి..వడిగా
దేవరకొండ : 2014లో ప్రతిపాదనలు.. 2016లో సాంక్షన్ అప్రూవల్.. 2017సెప్టెంబర్‌లో పనులు ప్రారంభం... 2019 మే నాటికి పూర్తి... క్లుప్తంగా చెప్పాలంటే జడ్చర్ల – కోదాడ హైవే నిర్మాణ పనుల పరిస్థితి ఇది... కానీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎన్ని ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తారో, భూ సేకరణ ఎలా ఉండబోతుంది... దానికి నష్టపరిహారం ఎంత చెల్లిస్తారు... ఎన్ని కమర్షియల్ దుకాణాలు తొలగించాల్సి ఉంది.. అనే విషయాలపై హైవేలో ఉన్న కమర్షియల్ దుకాణదారుల్లో గుబులుగా ఉంది.. ఇప్పటికే జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి పనులు ఆరు భాగాలుగా విభజించి టెండర్లను పిలవగా జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు చేపట్టే పనులు ప్రారంభమయ్యాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న జడ్చర్ల – కోదాడ హైవే విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులను ఆరు భాగాలుగా విభజించగా సుమారు 250 కి.మీ. మేర జడ్చర్ల నుంచి కోదాడ వరకు రోడ్డు విస్తరణ జరగనుంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి, కల్వకుర్తి నుంచి చారగొండ, చారగొండ నుంచి మల్లేపల్లి, మల్లేపల్లి నుంచి హాలియా, హాలియా నుంచి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుంచి కోదాడ వరకు ఆరు పనులుగా విభజించారు. ఈ పనుల్లో ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు విభజించిన మూడు పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు నిర్మించే రోడ్డు పనులను అనూష ప్రాజెక్టు రూ.200 కోట్లకు దక్కించుకోగా, కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు ఎస్.ఆర్.కె. కంపెనీ రూ. 171కోట్లకు చేజిక్కించుకుంది. నాలుగు రోడ్లు.. వంద ఫీట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) మొదట 150 ఫీట్ల మేర రోడ్డును విస్తరించాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేవలం 100 ఫీట్లు విస్తరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకే పనులకు మంజూరు అనుమతి వచ్చింది. మొత్తం 240 కి.మీ. మేర సాగే ఈ రోడ్డు పనులు మొత్తం 100 ఫీట్లు మాత్రమే విస్తరిస్తారు. కాగా పట్టణాల్లో మాత్రం రోడ్డుకు ఇరువైపులా కలిపి 80 ఫీట్లు రోడ్డును, రెండు వైపులా డ్రెయినేజీలు 10 ఫీట్లు, రెండు వైపులా ఫుట్‌పాత్‌లు కలిపి 10 ఫీట్ల చొప్పున విస్తరణ చేపడతారు. ఈ పనులను పూర్తి చేసే కాంట్రాక్టర్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు రోడ్డు పనులు విస్తరించిన పిదప ట్రాఫిక్, ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రోడ్లను విస్తరించే అవకాశాలుంటాయి. ఇప్పటి వరకు ఈ పనులకు సంబంధించి భూ సేకరణ , ఔటర్లు కానీ ఎక్కడ చేపట్టే అవకాశాలు లేవు. కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 చెట్ల తొలగింపు ఇప్పటికే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతుండగా కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 800 భారీ చెట్లను సంబంధిత కాంట్రాక్టర్లు తొలగించారు. ఆ చెట్లు వందల సంవత్సరాల నాటివి. ఇందులో వేప, రావి, మర్రి లాంటి పెద్ద వృక్షాలున్నాయి. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తొలగించిన చెట్లకు బదులు, ఐదింతల రెట్లు మొక్కలను నాటి కొంతకాలం పాటు వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే రోడ్లపై వంద ఫీట్ల మేర నిర్మించే పనుల్లో భాగంగా కమర్షియల్ దుకాణాలు తమ సెల్లార్లను ముందుకు నిర్మించిన వాటికి ఎలాంటి నష్టపరిహారం లేకుండానే వాటిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపడుతారు. కేవలం ఒక్క దేవరకొండ పట్టణంలోనే వంద ఫీట్ల మేరకు నిబంధనలు అతిక్రమించి వందకుపైగా కమర్షియల్ దుకా>ణాలకు ఆర్అండ్బీ అధికారులు తొలగించాలని నోటీసులు ఇచ్చారు. అయితే రోడ్డు అలైన్మెంట్ అంతా పూర్తయ్యాక రోడ్డు మూలమలుపులు ఉన్న చోట సరిచేసే అవసరం వస్తే అందుకు సంబంధించి రైతుల భూములను ఎన్హెచ్ఏఐ కొనుగోలు చేస్తుంది. వాటికి నష్టపరిహారం కూడా అందిస్తారు. కాగా భూ సేకరణను ఎన్హెచ్ఏఐ అధికారులు, ఆర్టీఓ సమక్షంలో పూర్తి చేస్తారు. 2019 మే నాటికి పూర్తి 2019 సంవత్సరం మే నాటికి జడ్చర్ల నుంచి కోదాడ వరకు పూర్తిగా రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే జడ్చర్ల నుంచి మల్లేపల్లి వరకు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు చేపట్టబోయే పనులకు త్వరలోనే టెండర్లు పూర్తవనున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రయాణికులకు, ట్రాన్స్‌పోర్టేషన్ భారంతోపాటు దూర భారం తగ్గుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే హైదరాబాద్ వరకు 200 కి.మీ. ప్రయాణించి శంషాబాద్ మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వంద కి.మీ. మేర ప్రయాణ భారం పెరుగుతుండగా కోదాడ నుంచి జడ్చర్ల హైవే పూర్తయితే ఈ దూర భారం తగ్గనుంది. -
సెల్‌ఫోన్ సంభాషణలే ప్రాణాల మీదకు తెచ్చాయా.?
ఇంజనీరింగ్ చదువుకున్నారు. తల్లిదండ్రులను ఎదురించి కోరుకున్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు వివాహితల జీవితాలు అర్ధంతరంగా ముగియడానికి కారణాలు ఏమిటి.? బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారా? లేక నమ్మినవారి చేతిలో హతమయ్యారా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. సాంకేతిక విప్లవంగా చెప్పుకుంటున్న సెల్‌ఫోన్ ఇద్దరి జీవితాల్లో కల్లోలానికీ, చివరికి వారి ప్రాణాలను బలితీసుకుందనే అనుమానాలువ్యక్తం అవుతున్నాయి. కోదాడ: కోదాడలో సోమవారం వెలుగుచూసిన వేర్వేరు సంఘటనల్లో అనుమానాస్పదంగా మృతిచెందిన వెంపటి జయశ్రీ (24) మాధవి (23)ల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాలు, నేపథ్యం వేరైనప్పటికీ ఇద్దరి మరణానికి కారణం ఒకటేనని తెలుస్తోంది. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద జయశ్రీ తల్లి ధనలక్ష్మి మాత్రం తన కుమార్తెను భర్త శ్రావణ్, అత్త మామలు వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మాధవి భర్త సతీష్ కూడా వంశీకృష్ణ వేధించి తనభార్యను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రాణాలమీదకు తెచ్చిన సెల్‌ఫోన్... కోదాడలో ఇంజనీరింగ్ చదువుకున్న జయశ్రీ పట్టణానికి చెందిన శ్రావణ్‌ను ప్రేమించి..పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఓ మిత్రుడు బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల అతను తరచు జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై భర్తకు జయశ్రీకి చిన్నపాటి గొడవలు అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని తరచు వేధిస్తున్నాడని ఆమె తల్లి పేర్కొంటోంది. అంతే కాక విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తికి శ్రావణ్ ఫోన్ చేసి ఇక తన భార్యకు ఫోన్ చెయ్యవద్దని వార్నింగ్ ఇవ్వడమేగాక కోదాడలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల రికార్డు తనవద్ద ఉందని శ్రావణ్ తరుచు బెదిరిస్తున్నాడని జయశ్రీ తల్లిదండ్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో జయశ్రీ ఒత్తిడికి లోనైందా? లేక ఇతర కారణాలు ఏమై ఉంటాయన్నది పోలీసుల విచారణలో తేలనుంది. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జయశ్రీ కాపురంలో ఇంత కల్లోలానికి, ప్రాణాల మీదకురావడానికి సెల్‌ఫోనే కారణమని బంధువులు అంటున్నారు. మాధవి మరణానికి కూడా..? కోదాడలోని షిర్డీనగర్‌లో సోమవారం వెలుగుచూసిన మాధవి అనుమానాస్పద మరణం వెనుక కూడా సెల్‌ఫోన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వత్సవాయికి చెందిన మాధవి ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్‌తో నెలన్నర క్రితమే వివాహం చేసుకుంది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే ఉన్నాయని తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా కష్టపడి పైకి వచ్చి, విద్యుత్ ఏఈ ఉద్యోగం సంపాదించిన సతీష్‌నే పెళ్లి చేసుకుంటానని కోరి చేసుకుందని బంధువులు అంటున్నారు. కానీ చదువుకునే రోజుల్లో పరిచమైన వంశీకృష్ణతో గతంలో తరచు ఫోన్లో మాట్లాడింది. వాటిని అడ్డుపెట్టుకుని మాధవిని వేధించడమేగాక ఫోన్ సంభాషణలను భర్తకు పంపుతానని బెదిరించాడని, దాని విషయం మాట్లాడడానికే ఆమె కోదాడకు వచ్చి ఉంటుందని బంధువులు అంటున్నారు. భర్త సతీష్ మాత్రం వంశీకృష్ణ వేధిస్తున్నాడని తనకు కూడా చెప్పిందని, అతనిపై గతంలో కేసు కూడా పెట్టిందని అంటున్నాడు. తన భార్య హత్యకు వంశీకృష్ణ కారణమని అతను ఆరోపిస్తున్నాడు. ఇదీలా ఉండగా సోమవారం కోదాడకు వచ్చిన మాధవి తన మరిదిని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఉండమని ఆటోలో షిర్డీనగర్‌కు వెళ్లింది. అక్కడ వంశీకృష్ణ ఒక్కడే ఉన్నాడని ఫోన్ విషయమై వారు గొడవ పడుతుండగా అతని భార్య వచ్చిందని.. దీంతో తగాదా పెద్దదై భార్యభర్తలు కలిసి మాధవిని హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవి చనిపోయిన గదిలో ఫ్యాన్‌కూడా లేదని, చున్ని ఆమె బరువును కూడా ఆపదని అందువల్ల ఆత్మహత్య కానే కాదని.. అది ముమ్మాటికీ హత్యేనని బం«ధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద రోదిస్తూ ఆరోపించారు. పోస్టుమార్టానికి వైద్యుడు కరువు..! సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు వివాహితలు జయశ్రీ, మాధవిల మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడు కరువయ్యాడు. సోమవారం రాత్రి మృతదేహాలను మార్చురీకి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వైద్యుడు లేకపోవడంతో బం«ధువులు మార్చురీ వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు మృతదేహాలను హుజూర్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం కావడంతో మృతుల కుటుంభ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విచారణ జరుపుతున్నాం.. జయశ్రీ, మాధవి మరణాల మిస్టరీని ఛేదించేందుకు విచారణను ముమ్మరం చేశాం. జయశ్రీని వరకట్నం కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. మాధవి మృతిపై కూడా ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మాధవి విషయంలో సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశాం. సాధమైనంత త్వరలో ఈ కేసుల మిస్టరీని ఛేదిస్తాం. –సీఐ రజితారెడ్డి, కోదాడ -
ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం
-
ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం
సూర్యాపేట : ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఆది నారాయణరెడ్డికి చెందిన ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండటంతో రహదారి కనపడక కాన్వాయ్‌లోని ఒక వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. గన్మెన్లు, డ్రైవర్‌ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్ళి చేర్చారు. -
కోదాడలో పరిమళించిన మానవత్వం
-
నగలకు మెరుగు పెడతామంటూ మోసం
కోదాడ: బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళను ఏమార్చి నాలుగు తులాల బంగారు గొలుసుతో ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఈ సంఘటన గురువారం మండల పరిధిలోని గుడిబండలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంకా వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి తోడుగా వారి మూడో కోడలైన భవానీ ఉంటుంది. గురువారం ఉదయం పది గంటల సమయంలో రాగి పాత్రలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓరాగి పాత్రకు, మరో వెండి వస్తువుకు మెరుగు పెట్టి చూపిం చారు. తర్వాత బంగారు వస్తువులకు కూడా మెరుగుపెడతామంటూ చెప్పి మంగమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడును ఇవ్వమని అడిగారు. మంగమ్మతో పాటు ఆమె కోడలు భవానీ ఎంత వద్దన్నా వారు వినిపించుకోకుండా మా చేతికి ఇవ్వవద్దు, మీరే మెరుగుపెట్టుకోండి అంటూ వారిని నమ్మించారు. పాత్రలో వస్తువులు వేసి వేడి చేయాలని చెప్పి మహిళలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పాత్రలోని వస్తువులను మాయం చేసి ఒకరి తరువాత ఒకరు జారుకున్నారు. కొద్ది సమయం తర్వాత బాధితులు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని బాలుడి మృతి
కోదాడ (సూర్యాపేట) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. తొగర్రాయి గ్రామానికి చెందిన గీతేష్(10) రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగకు వచ్చి పరలోకాలకు
సాగర్ కాల్వలో పడి నలుగురి మృత్యువాత కోదాడ: ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల్లో కృష్ణా జిల్లా వత్సవాయి మండ లం దేశపాలెంకి చెందిన ఫకీరాబీ, చిన సైదులు దంపతుల సంతానం షేక్ సుద్దాబీ(18), హుస్సేనాబేగం (14), ముస్తఫా (10)తోపాటు, ఖమ్మం జిల్లాకు చెందిన సైదాబీ, షేక్ మహబూబ్ హుస్సేన్‌ల కుమారుడు రియూజ్(9) ఉన్నారు. వీరంతా 4 రోజుల క్రితం పీర్ల పండుగకు అమ్మమ్మ మీరాబీ నివాసం ఉంటున్న నడిగూడెం మండలం సిరి పురానికి వచ్చారు. బుధవారం బట్టలు ఉతికేం దుకు సైదాబీతోపాటు నలుగురు వెళ్లారు. హుస్సేనాబేగం తమ్ముళ్లు ముస్తఫా, రియూజ్ లకు కాల్వ దరి వెంట స్నానం చేయిస్తుండగా, అత్త సైదాబీ, సుద్దాబీ బట్టలు ఉతుకుతున్నారు. ఈ క్రమంలో హుస్సేనాబేగం ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడడంతో ముస్తఫా, రియూజ్‌లు ఆమెను రక్షించేందుకు నీటిలోకి వెళ్లారు. ఈత రాక ముగ్గురూ కేకలు వేస్తుండగా.. పక్కనే బట్టలు ఉతుకుతున్న సుద్దాబీ వారిని రక్షించేం దుకు నీటిలోకి దూ కింది. అయితే వారంతా సుద్దాబీని గట్టిగా పట్టుకోవడంతో ఆమెతో పాటు అందరూ నీటిలో మునిగిపోయూరు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి కాల్వలోకి దిగి నలుగురిని బయటికి తీయగా అప్పటికే వారంతా చనిపోయూరు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా, సుద్దాబీకి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. -
ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం
కోదాడఅర్బన్ : ఎస్సీల వర్గీకరణతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన సంఘం కోదాడ–హుజూర్నగర్ నియోకవర్గాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతలపాటి చిన్నశ్రీరాములు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మలñ ్లపాక వెంకన్న, నాయకులు ఏపూరి పర్వతాలు, కె.అంజయ్య, బొడ్డు హుస్సేన్, శౌరి, ఎం.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పవన్‌కుమార్ ఈ సందర్భంగా సంఘం నియోజకరవర్గ ప్రధాన కార్యదర్శిగా మొలుగూరి పవన్‌కుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
వర్గీకరణ సాధించే వరకూ పోరాటం
కోదాడ : ఎస్సీల వర్గీకరణ సాధించే వరకూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు వెనుదిరుగవద్దని టీఎమ్మార్పీస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ కోరారు. డప్పు–చెప్పు కార్మికులకు నెలకు 2 వేల రూపాయల పించన్ ఇవ్వాలని ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం కోదాడలోని రంగాథియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డప్పు, చెప్పు కార్మికులకు 2 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మీ వెంటే ఉంటానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హమీ ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తన పాద యాత్ర ఇప్పటికే 175 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. టీఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన పోరాటంలో మందుండి పోరాడినది మాదిగలేనన్నారు. నవంబర్ 16న లక్ష మంది మాదిగలతో కలిసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నామని, మాదిగలంతా ఆ సభకు తరలిరావాలని కోరారు. ఎస్సీలలో ఎన్నో ఉపకులాలు ఉన్నప్పటికీ ఒకటి రెండు కులాలే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తూ వస్తున్నాయన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలని, అందుకు మాదిగ నాయకులు, కార్యకర్తలు రాజీలేని పోరాటాలు నిర్వహించాలని కోరారు. రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర జరుగనుంది. అంతకు ముందు రాత్రి బసచేసిన కోదాడ రైస్‌మిల్లర్స్ భవనం నుంచి బయలుదేరిన పాతయాత్ర కార్యకర్తలు,నాయకులు కోలాటాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. పట్టణంలో శ్రీనివాస్ ఎమ్మార్పీస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రా్రçష్ట ఉపాధ్యక్షుడు చింతాబాబు, ఆమరారపు శ్రీను, కుటుంబరావు, రాయల వీరస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కోదాడ : తెలంగాణలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఉద్యమించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి మనోహర్‌నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్ధుల ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం యువతను మోసం చేస్తుందన్నారు. సమావేశంలో వేణుగోపాల్, భుక్యారవినాయక్, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకరాచారి, శివరాంయాదవ్, శ్రావణ్‌కుమార్, సైదులు, లిక్కి మోహన్‌రావు,సుంకరి అభిందర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
స్పెల్‌బీ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
కోదాడ అర్బన్ : ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షలో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. పట్టణంలోని తేజ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఉదయ్‌కుమార్ క్యాటగిరి–3, క్యాటగిరి–4 విభాగాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీల్లో క్యాటగిరి–3 నుంచి జి.సింధు, క్యాటగిరి–4లో కె.మహతి విజేతలుగా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, డైరెక్టర్లు జానకిరామయ్య, సోమిరెడ్డి తదితరులు అభినందించారు. అదే విధంగా పట్టణంలోని మదర్ థెరిస్సా పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో క్యాటగిరి–1లో జి.వైష్ణవి, ఎ.వేద, జి.అభినవ్గౌతమ్, క్యాటగిరి–2లో డి.లక్ష్మీపూజిత, జి.లక్ష్మీనిహారిక, ఎస్.కె ఇషా, సి.హెచ్ నందన్నిహాల్, ఎస్.కె అబ్దుల్రహమాన్, క్యాటగిరి–3లో ఎం.సహస్ర, కె.జాషువాస్టాలిన్ ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.కనకదుర్గ తెలిపారు. -
తిరంగాయాత్ర ప్రారంభం
కోదాడ : తెలంగాణ వియోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు కోరారు. ఆదివారం కోదాడలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగాయాత్రను ఆయన బస్టాండ్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర సాధన పోరాట సమయంలో నిత్యం విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. ఎంపీ కవిత విమోచన దినోత్సవంపై అపరిపక్వ ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సందర్బంగా కోదాడలోని అక్కిరాజు వాసుదేవరావు, చాలకి ఐలమ్మ, గుడుగుంట్ల అప్పయ్య విగ్రహాలకు, కీసర జితేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, నూనె సులోచన, కనగాల వెంకట్రామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్,వంగవీటి శ్రీనివాసరావు, అక్కిరాజు యశ్వంత్, కనగాల నారాయణ, సాతులూరి హన్మంతరావు, కొదుమూరి ప్రవీణ్, సాంబశివరావు, నకిరికంటి జగన్మోహన్రావు, చిలుకూరి శ్రీనివాస్, కోమటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
యువజన విధానం ప్రకటించాలి
కోదాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యువజన విధానం ప్రకటించాలని భారత యువజన ప్రజాతంత్ర సమాఖ్య(డీవైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రోజులుగా కోదాడలో జరుగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రా్రçష్టంలో 20–30 సంవత్సరాల వయస్సు కలిగి చదువుకున్న యువత 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు కల్పించలేక పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించక పోవంతో అవి నిర్వీర్యంగా మారిపోతున్నాయని, దీనిని సాకుగా తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు పేద తల్లి దండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. కేజీ టు పీజీ విద్య విధానంపై ప్రభుత్వం తన విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి మార్జిన్‌మనీ లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలను మంజూరు చేయాలని కోరారు. ఈసమావేశంలో న ర్సింహారావు, రవినాయక్, ఎస్కె. బషీర్, కుక్కడపు ప్రసాద్, పి. శ్రీనివాస్,ముత్యాలు, కె. శ్రీనివాస్, కె. వెంకటనారాయణ, చంద్రం, రాధాకృష్ణ, సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తున్న పాలకులు
కోదాడ : యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వీరి అసమర్థ పాలన వల్ల యువశక్తులు నిర్వీర్యం అవుతున్నాయని డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అభయ్ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో జరుగుతున్న డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల్లో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావ్యవస్థను కార్పొరేట్ రంగానికి అప్పగించి సామాన్యులకు అందని వస్తువుగా విద్యను తయారు చేశారని ఆరోపించారు. అందరికి విద్యను అందించాలనే రాజ్యాంగమౌళిక సూత్రాలకు పాలకులు తిలోదకాలు ఇచ్చారన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ వనరులు, యువశక్తులు భారతదేశానికి ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకుంటే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారుతుందన్నారు. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరిచి పుష్కరాలు, నిమజ్జనాలు, బతుకమ్మ పండుగల అంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనుత్పాదక రంగాలకు ఖర్చు చేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలని యువ శక్తులను సక్రమంగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతతకు మారు పేరుగా ఉండే యూనివర్సిటీల్లో కేంద్ర పాలకులు తమ రాజకీయాలను జొప్పించి అశాంతి నిలయాలుగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న ఢిల్లీలో జరిగే దళిత ర్యాలీలో డీవైఎఫ్ఐ పాల్గొంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏ. విజయ్‌కుమార్, కె భాస్కర్, జిల్లా కార్యదర్శి జె. నర్శింహారావు, కుక్కడపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోదాడలో ఉగ్రవాది అరెస్టు
కర్ణాటక బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు సాక్షి ప్రతినిధి, నల్లగొండ/బెంగళూరు: పదహారేళ్ల క్రితం కర్ణాటకలో ఏక కాలంలో వివిధ చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఉగ్రవాది షేక్ అమీర్ ఆలీ ఆ రాష్ట్ర సీఐడీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్ణాటక రాష్ట్ర అదనపు డీజీపీ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు తెలంగాణ పోలీసుల సహకారంతో నల్లగొండ జిల్లా కోదాడలో సోమవారం రాత్రి అమీర్‌ను అరెస్టు చేశారు. దీన్దార్ అంజుమాన్ సంస్థ పేరుతో 2000 జూలైలో బెంగళూరులోని జేజే నగర్, హుబ్లీ, కలబుర్గీలో ఏక కాలంలో కొంతమంది బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల వెనుక 29 మంది ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరిలో 23 మంది పట్టుబడి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన ఏడుగురిలో ఐదుగురు పాకిస్తాన్‌కు చెందిన వారు. మిగిలిన ఇద్దరిలో అమీర్ తాజాగా పట్టుబడగా.. మరొకరు పరారీలో ఉన్నారు. అలీ ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవాడు. అప్పట్లో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. కాగా, అలీ ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో కలసి కోదాడలోనే నివాసం ఉన్నట్లు తెలిసింది. పట్టణంలోని రెహనాజ్ హెల్త్ సెంటర్ పేరిట క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. -
లీక్‌లో కోదాడ లింక్!
►సీఐడీ అదుపులో వైద్యుడు కోదాడ: ఎంసెట్-2 లీక్‌లో నల్లగొండ జిల్లా కోదాడకు లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం కోదాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి కోసం కోదాడకు చెందిన మరో సీనియర్ వైద్యుడి సాయంతో ఈయన ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు సమాచారం ఇవ్వడంతో కోదాడకు వచ్చిన సీఐడీ అధికారులు ఆ వైద్యుడిని ప్రశ్నించి తమతో పాటు తీసుకెళ్లినట్లు తెలిసింది. సీనియర్ వైద్యుడు గత కొన్నేళ్లుగా ఇదే దందాను కొనసాగిస్తూ ఇందులో ఆరితేరినట్లు పుకార్లు వస్తున్నాయి. పేపర్ కొనుగోలులో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈయన.. తనకు ఆప్తుడైన కోదాడకు చెందిన ఓ వ్యాపారి మనుమరాలికి కూడా ఎంసెట్-2 పేపర్‌ను అందించినట్లు సమాచారం. కోదాడలోనే చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసే కాంట్రాక్టర్ కూడా తన కుమార్తె కోసం దళారుల వద్ద ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
జడ్చర్ల– కోదాడ హైవే విస్తరణకు సర్వే
జడ్చర్ల: జడ్చర్ల– కోదాడ రహదారి విస్తరణ పనులకు ప్రాథమికస్థాయిలో సోమవారం సర్వే ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) తయారుచేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జడ్చర్ల వద్ద జాతీయ రహదారి నుంచి నల్గొండ జిల్లా మల్లేపల్లి వరకు సిబ్బంది సర్వే పనులు చేపట్టారు. రోడ్డు మధ్య నుంచి ఒక్కోవైపునకు 75అడుగుల మేర స్థలాన్ని సేకరించేందుకు కొలతలు తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ రహదారి రెండు వరుసలా లేక నాలుగు వరుసలా అన్న సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇటీవల సంబంధిత రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులు నాలుగు వరుసల రహదారిగా మారనుందని అధికారులు ప్రకటించారు. -
పార్కుల ఆహ్లాదం ఎక్కడ..
–పార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టని పాలకవర్గం –గాంధీ పార్కులో సైతం కానరాని పచ్చదనం కోదాడఅర్బన్: సుమారు 65వేల జనాభా, ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కోదాడ పట్టణ ంలో ప్రజల ఆహ్లాదం కోసం కనీసం ఒక్క పార్కు కూడా లేదు. సాయంత్రం వేళల్లో సరదాగా కాసేపు గడిపేందుకు అనువైన స్థలాలు పట్టణ వాసులకు కరువువయ్యాయి. మున్సిపాలిటీగా ఏర్పడి 5సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ఒక్క కొత్త పార్కు కూడా రూపొందలేదు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతీ సందర్భంలోనూ చెప్పే పాలకవర్గం కూడా నేటివరకు పార్కుల ఏర్పాటుపై ఏ సమావేశంలోనూ చర్చించిన దాఖలాలు లేవు. పార్కుల అభివృద్ధిపై శీత కన్ను.. పట్టణంలో ప్రస్తుతం ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. పేరుకు ఇది పార్కే కానీ ఇందులో పచ్చదనం మాత్రం కానరాదు. ఈ పార్కు స్థలంలో గ్రంథాలయం, మండల సమాఖ్యల కార్యాలయాలు నిర్మించడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన తరువాత బైపాస్‌రోడ్‌లోని ఓ వెంచర్లో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడిచినా, నేటివరకు పనులు పూర్తికాలేదు. ఈ పార్కును అక్కడి రియల్ ఎస్టేట్ వెంచర్ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టణంలో ఖళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను మినీ పార్కులుగా అభివృద్ధి చేస్తే అవి కొంత మేరకైనా ఉపయోగపడతాయని పలువురు బావిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కులు అభివృద్ధి చేయాలని పలవురు పట్టణ వాసులు కోరుతున్నారు. పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వంటిపులి అనిత, చైర్పర్సన్ కోదాడ పట్టణంలోని ప్రజల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గాంధీపార్కుని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించాం. మున్సిపాలిటీకి రావాల్సిన లేఅవుట్ స్థలాలను స్వాధీనం చేసుకుని పార్కులను అభివృద్ధి చేస్తాం. -
కోదాడ పెద్దచెరువు ఎన్నికలు ఏకగ్రీవం
నామినేషన్లు ఉపసంహరించుకున్న వీరస్వామి వర్గం 9 మంది డైరెక్టర్ల ఏకగ్రీవం 28న అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక కోదాడ తీవ్ర ఉత్కంఠతను రేపిన కోదాడ పెద్ద చెరువు మత్స్యసహకార సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సొసైటీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మాజీ అధ్యక్షుడు కందరబోయిన వీరస్వామి ఫ్యానల్ మంగళవారం నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నికలు ఏకగీవ్రమయ్యాయి. సొసైటీలో ఉన్న 9 డైరెక్టర్ పోస్టులకు గాను మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన మంగళవారం వీరస్వామి వర్గంతో పాటు మొత్తం 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 9మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సూర్యదత్ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు వేముల రాముడు, గాదె మధు, ఐతబోయిన ధనమూర్తి, సింగం శ్రీనివాసరావు, పొనుగోటి ధనమూర్తి, రెడ్డి బోయిన రంగయ్య, గాదె నాగయ్య, పులిదాసు వెంకటేశ్వర్లు, శీలంచిన వెంకటయ్యలు ఈ నెల 28న సమావేశమై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. మొదటి నుంచి అనుకున్నట్లుగానే కోదాడకు చెందిన వేముల రాముడును అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్లను కోదాడ నియోజకవర్గ ఇన్చార్జీ కె. శశీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కరెంటు రామిరెడ్డి, పారసీతయ్య తదితరులు అభినందించారు. చక్రం తిప్పిన ఇన్చార్జి, నకిరేకల్ ఎమ్మెల్యే.. కోదాడ మత్స్యసహకార సొసైటీకి ఐదేళ్ల తరువాత జరగుతున్న ఎన్నికలు అధికార పార్టీకి మొదట పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీ పడడంతో వారిని సముదాయించడానికి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జీ కె.శశీధర్రెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో చర్చించి ఒక వర్గాన్ని నామినేషన్ ఉపసంహరించుకొనేలా చేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే చందర్రావు, కరెంటు రామిరెడ్డి కూడా ఈ ఎన్నకల్లో కీలకంగా వ్యవహరించారు. -
సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం పాత కమిషనర్ చేర్చుకున్నారు.. కొత్తాయన వద్దంటున్నారు సంతకం చేయకుండానే విధుల నిర్వహణ ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్‌తో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్‌కు బదిలీ చేసింది. కాని చైర్పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్‌ను కోరింది. చైర్‌పర్సన్‌తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్ను రిజిష్టర్‌లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు. ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తాము. -
అసైన్డ్ భూమి..అమ్మకానికి సిద్ధం!
కోదాడ : పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని అమ్మకానికి సిద్ధం చేశారు. విలువైన ఈ భూమిని కొద్ది రోజులుగా శుభ్రం చేసి ప్లాట్లుగా విభజించడం వెనుక ఓ రాజకీయ నేత కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎంతకు తెగించారంటే కోదాడ పెద్దచెరువు మునక భూమిలో కూడా రాళ్లు పాతి ప్లాట్లు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు రెవెన్యూ, ఐబీ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో ప్లేటు ఫిరాయించిన సదరు నేత భూమి అమ్మడం లేదని ప్రభుత్వం 14 మందికి కేటాయించడంతో వారందరికీ పంచి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వడానికి ఆయనెవ్వరని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే... కోదాడకు చెందిన తమ్మర వెంకట సీతరామారావు కోదాడ రెవెన్యూ పరిధిలో రామిరెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న సర్వే నంబర్ 55లో సీలింగ్ కింద ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భూమిని అధికారులు కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ పేటకు చెందిన 14 మంది దళితులు, మైనార్టీలకు అసైన్డ్ చేశారు. వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవించాల్సి ఉంది. అమ్మకం, కొనుగోళ్లు చెయ్యరాదు. కానీ ఈ భూమిని 1990లో కోదాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. దానిని తన తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు నాడు సదరు భూమిలో పార్టీ జెండాలను పాతి తిరిగి పేదలకు కేటాయించాలని ఉద్యమం కూడా చేశారు. ఈ తరువాత విషయం హైకోర్టు వరకు చేరింది. దీంతో కోర్టు రిజస్ట్రేషన్ రద్దు చేసి తిరిగి పేదలకు అప్పగించాలని చెప్పడంతో అధికారులు తిరిగి వారికే కేటాయించారు. ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఈ భూమి అలాగే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పట్టణం విస్తరించడంతో భూమి విలువ ఎకరం కోటి రూపాయలకు చేరింది. దీంతో నాడు భూములను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓ నేత తెర వెనకుండి ఈభూమిని శుభ్రం చేయించి ప్లాట్లుగా పెట్టి అమ్మకానికి సిద్ధం చేశాడు. పనిలో పనిగా పెద్ద చెరువు నీరు ఉండే ప్రాంతంలో కూడా రాళ్లు పెట్టి ప్లాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులకు, పెద్ద చెరువు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి పనులను అడ్డుకున్నారు. -
భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని..
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ వివాహితను భార్య, ఆమె బంధువులు కలిసి చితకబాదారు. ఈ ఘటన మండల పరిధిలోని తమ్మరబండపాలెం అవాస గ్రామం అల్వాలపురంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గురుస్వామి, సత్యవతి దంపతులు. గురుస్వామి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన సత్యవతి పెద్ద మనుషులను ఆశ్రయించడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. ఇటీవల గురుస్వామి మళ్లీ ఆ వివాహిత వద్దకు వెళ్తుండటంతో సత్యవతి, ఆమె బంధువులు కలిసి వెళ్లి సదరు వివాహితను చితకబాదారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె బంధువులు కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివాహిత బంధువు తెలిపారు. -
విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.12 కోట్ల భారం
కోదాడ : జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది ఉన్నారు. వీరిలో 40 వేలమంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుండగా, 60 వేల మంది వరకు ప్రై వేట్పాఠశాలలో ఆం గ్ల మాధ్యమంలో చదువుతున్నారు. 6 నుంచి 10 తరగతుల వరకు ఆంగ్లమాధ్యమం పుస్తకాలు అందుబాటులోకి రావడంతో తప్పనిసరిగా వాటినే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్టేట్ సిల బస్‌లో నడుస్తున్న ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలన్నింటిలో ఈ ప్రభుత్వ పుస్తకాలనే వాడుతున్నారు. కానీ ప్రాథమికస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో ప్రభు త్వ పుస్తకాలు ఇప్పటి వరకు లేవు. దీంతో 1నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి పుస్తకాలు కొని విద్యార్థులకు ఇస్తున్నాయి. కానీ 2016-17లో ప్రాథమికస్థాయి విద్యార్థులకు ఆంగ్లమాధ్యమం పుస్తకాలు రాబోతున్నాయి. దీంతో తమ వ్యాపారం కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు హడావుడిగా పుస్తకాలను అంటగడుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.12 కోట్ల భారంపడుతోంది. చేతివాటం ప్రదర్శిస్తున్న పాఠశాలలు.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయడంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రమాణిక పుస్తకాలను ముద్రిస్తున్నాయి. కానీ అవి తమ రేట్లపై 2 నుంచి 3 శాతం మాత్రమే కమీషన్ ఇస్తాయి. దీంతో పాఠశాలల నిర్వాహకులు వీటిని తమ విద్యార్థులకు ఇవ్వరు. కొన్ని సాధారణ పబ్లిషర్స్ పుస్తకాల ధరపై 25 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇస్తారు. ఇవి ప్రామాణికంగా లేక పోయినా తమకు ఎక్కువ లాభం వస్తుండడంతో వీటినే తీసుకొని పుస్తకాల మీద ఉన్న ధరకు తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. వీటితో పాటు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, బ్యాగులు, సాక్సులు, చివరకు లంచ్‌బాక్సులు, వాటర్‌బాటిళ్లు కూడా వారే సరఫరా చేస్తున్నారు. వీటికోసం ఒక్కో విద్యార్థి నుంచి ఐదారువేల రూపాయలను వసూలు చేస్తున్నాయి. మరీ ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి? 2016-17 విద్యాసంవత్సరంలో ప్రాథమిక తరగతులకు కూడా ఆంగ్లమాధ్యమంలో ప్రభుత్వ పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటినే అందరు ఉపయోగించాలని ప్రకటించింది. వాటిధరలు కూడ తక్కువగా ఉంటాయి. ఒక్కోతరగతికి 100 నుంచి 200 రూపాయలలోపే ఉన్నట్లు సమాచారం. తప్పని సరిగా వాటినే వాడాలనే ఆదేశాలను అమలు చేస్తే తల్లిదండ్రుల మీదపడే కోట్లాదిరూపాయల భారం తగ్గుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారుల ద్వారాప్రకటించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వ పుస్తకాలనే వాడాలి : గోపతి గోపయ్య, ఎంఈఓ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక తరగతులకు ప్రభుత్వ పుస్తకాలనే వాడాలి. ప్రైవేట్ పుస్తకాలను వాడితే చర్యలు తప్పవు. ప్రైవేట్ పాఠశాలలు అంటగితే చర్యలు తీసుకుంటాము. -
మేనత్తను వేధిస్తున్నాడనే..
తన మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్న వ్యక్తిపై అల్లుడు కక్ష పెంచుకున్నాడు.. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు..అదును కోసం వేచి చూస్తుండగా.. ఒంటరిగా ఆరుబయట నిద్రపోతూ ఆ వ్యక్తి కనిపించాడు.. ఇంకేముంది.. ఆదమరచి నిద్రపోతున్న ఆ వ్యక్తిపై తన బంధువుతో కలిసి బండరాయితో మోది హత్య చేశాడు.. ఇదీ కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన సర్ధార్ హత్యోదంతం వెనుక ఉన్న ప్రధాన కారణం - కోదాడరూరల్ కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన సర్ధార్ హత్య కేసు మిస్టరీ వీడింది. సర్ధార్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ సమీప బంధువే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. రూర ల్ సీఐ మధుసూదన్‌రెడ్డి నిందితుల వివరాలు, హత్యకు గల కారణాలను వివరించారు. గణపవరం గ్రామానికి చెందిన ఎస్కె.సర్ధార్ అదే గ్రామానికి చెందిన పూలమ్మతో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వ్యక్తి గత కారణాలతో పూలమ్మ నాలుగు సంవత్సరాల నుంచి సర్ధార్‌ను దూరంగా పెట్టింది. దీంతో సర్ధార్ 2012 ఏప్రిల్ నెలలో పూలమ్మపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగ సర్ధార్ మూడు నెలల పాటు చర్లపల్లిలో జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అయితే పూలమ్మ మేనల్లుడు అదే గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు అప్పటి నుంచే సర్ధార్‌పై కక్ష పెంచుకున్నాడు. అదును కోసం వేచి చూస్తుండగా.. అదును కోసం వేచి చూస్తున్న వెంకటేశ్వర్లుకు అవకాశం వచ్చింది. గత నెల 25వ తేదీన రాత్రి సర్ధార్ ఒంటరిగా ఇంటి ఆరుబయట బండపై పడుకుని ఉండడాన్ని వెంకటేశ్వర్లు గమనించారు. ఇదే విషయా న్ని తన బంధువైన వట్టె వెంకటేశ్వర్లుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి సుమారు 50 కేజీల బరువున్న బండరాయి తీసుకువచ్చి నిద్రపోతున్న సర్ధార్ తలపై మోది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు. మొదటి నుం చి పూలమ్మ తరఫు నుంచే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా భయాందోళనకు గురై గడ్డం వెంకటేశ్వర్లు, అతడి బంధువు వట్టె వెంకటేశ్వర్లు పోలీసులకు లొంగిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు సీఐ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ విజయ్‌ప్రకాశ్, శ్రీను, వెంకన్న, శ్రీనివాస్, మనోహర్, గురుస్వామి, జానీ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పట్టణం బైపాస్‌రోడ్డుపై బైక్, లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడగా, మరో ఆరేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ఆలూరుపాడు గ్రామస్తులుగా గుర్తించారు. -
రూ.3.5లక్షల నకిలీ కరెన్సీ సీజ్
నల్లగొండ జిల్లా కోదాడలో భారీగా నకిలీ కరెన్సీ వెలుగు చూసింది. బస్టాండ్‌లో రూ.3.5లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని..
కోదాడరూరల్: బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని ఓ బిజినెస్ కరస్పాండెంట్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధి అనంతగిరి చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన సముద్రాల సాయికుమార్ అనంతగిరి ఎస్బీహెచ్ బ్యాంకు పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్‌గా (బీసీఏ) ఉంటూ తన ఏరియాలో జీరో అకౌంట్లో తీసుకున్నాడు. ఇతడికి జీరో అకౌంట్లు తీసేందుకు ఎస్బీహెచ్ బ్యాంకు వారే ఎక్యుప్మెంట్స్ ఇచ్చారు. గత మే నెలలో 92 మంది ఖాతాలు తీసేందుకు సంబంధిత డాక్యుమెంట్స్‌ను బ్యాంకులో ఇచ్చి అప్లోడ్ చేయమన్నాడు. ఈ సమయంలో బ్యాంకు మేనేజర్ బదిలీపై వెళ్లాడు. అప్పటి నుంచి సాయికుమార్ ఖాతాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల కాలంలో ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు సాయికుమార్‌ను బ్యాంక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. అతను కొద్ది రోజుల క్రి తం బ్యాంకుకు వెళ్లి తాను తెచ్చిన జీరో అకౌంట్ తె రవాలని ప్రాథేయపడ్డాడు. కొత్తగా వచ్చిన మేనేజర్ బ్యాంకు అకౌంట్లు తెరవకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. ఈ విషయంపై ఈ నెల 1న సాయికుమార్ సూర్యాపేటలోని ఎజీఎంకు ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆయన 3న బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు తీసుకోవాలని సూచించాడు. బ్యాంకుకు వెళితే మేనేజర్ నా మీద ఎంజీఎంకు ఫిర్యాదు చేస్తావానీపై ఎస్టీ కేసు పెడతానని సాయికుమార్‌ను వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ అనంతగిరి చౌరస్తాలో పురుగు మందు తాగా డు. బ్యాంక్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో డ్రైవ ర్లు గమనించి అతడిని కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్ర స్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని రెండురోజులు గడిస్తేగాని ఎం చెప్పలేమని వైద్యుడు తెలిపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై వేధింపులకు గురి చేసిన బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య వినీత కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కారు, ఆటో ఢీ: 10 మందికి గాయాలు
కోదాడరూరల్: నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. నల్లబండగూడెం గ్రామానికి చెందిన 10 మంది కూలీలు మంగళవారం విజయవాడ సమీపంలోని ఫ్యాక్టరీలో పనులు చేసేందుకు బయలుదేరారు. వారి ఆటో రోడ్డును క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 8 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎస్సై కారుగా చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూట్ కేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సోమవారం కోదాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న వీరంతా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి కేజీ బంగారం, రూ1.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో మరో ‘ఠాగూర్’ ఘటన
నాగోలు: మృతి చెందిన వ్యక్తికి వైద్యం చేస్తూ డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ మతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడలోని గుదిబండ గ్రామానికి చెందిన కె.తులసిరెడ్డి ఛాతి నొప్పితో నాలుగు రోజుల క్రితం కొత్తపేటలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యుల నుంచి రూ.2 లక్షలను కట్టించుకుని శస్త్ర చికిత్స నిర్వహించి పరిస్థితి బాగానే ఉందని నమ్మించారు. తీరా శుక్రవారం మిగిలిన డబ్బులు కట్టించుకున్న తరువాత.. తులసిరెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆసుపత్రి డాక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గుండెనొప్పి రావడంతో తులసిరెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారని, శస్త్ర చికిత్స చేసి స్టంట్లు వేశామని, మెదడు మాత్రం సరిగా స్పందించడం లేదని, సరైన చికిత్స అందించామని అన్ని రికార్డులు ఉన్నాయని తెలిపారు. చైతన్యపురి సీఐ సమక్షంలో ఆసుపత్రి వర్గాలు అందించిన వైద్యం గురించి బంధువులకు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో బంధువులు చర్చలు జరపడంతో ఆందోళన సద్దుమణిగింది. -
మళ్లీ గుచ్చాడు!
నగరంలో, నల్లగొండలో సైకో సూదిగాళ్ల హల్చల్ హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సైకో సూదిగాళ్ల కలకలం చెలరేగింది. ఇటీవలే మల్కాజిగిరిలో ఓ చిన్నారిపై సిరంజి దాడి జరుగగా... ఇప్పుడు ఎల్బీనగర్లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఎల్ఐసీ ఉద్యోగిపై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లబైల్లి తం డాకు చెందిన స్వామినాయక్ (27) బీఎన్‌రెడ్డి నగర్లో నివాసవుుంటూ ఎల్ఐసీ వూర్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు.సోమవారం దిల్సుఖ్నగర్ నుంచి ఎన్జీవోస్ కాలనీ వైపు వెళుతున్న ఓ బస్సు ఎక్కాడు. ఆ బస్సు దిల్సుఖ్నగర్-చైతన్యపురి వుధ్య ఉన్న సమయంలో తెల్లషర్టు, తెల్లప్యాం టు ధరించిన వ్యక్తి స్వామినాయుక్ మోకాలి వెనుక భాగంలో సూది (ఇంజెక్షన్ సిరంజి)తో గుచ్చాడు. బస్సు నడుస్తుండగానే, బస్సులోనే చెప్పులు వదిలేసి దిగి పరారయ్యూడు. స్వామినాయుక్ పక్కనే ఉన్న ప్రయూణికులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. కొద్దిసేపటికే నొప్పి భరించలేక స్వామినాయక్ బస్సులో పడిపోయూడు. బాధితుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇంజెక్షన్ గుచ్చి ఆటోలో పరారీ కోదాడ రూరల్: నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లు శివారులో సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి సూదిగుచ్చి.. ముగ్గురు యువకులు ఆటోలో పరారయ్యారు. కాపుగల్లుకు చెందిన కోపూరి వీరయ్య కోదాడకు వచ్చి పనిముగించుకుని సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. గ్రామశివారులోని మామిడితోటల వద్దకు రాగానే కాపుగల్లు నుంచి కోదాడ రోడ్డు వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చింది. వీరయ్య బైక్‌ను రోడ్డుకిందికి దించగా.. ఆటో కూడా అతనివైపే మలిపి ఒక్కసారిగా ఆపారు. వెంటనే ఆటోలో నుంచి ఓ వ్యక్తి దిగి వీరయ్య కుడి చెంపపై సూది గుచ్చాడు. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే దుండగులు అదే ఆటోలో పరారయ్యారు. బాధితుడు కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, వీరయ్య బ్యాంక్‌లో పంట రుణం తీసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో డబ్బు కోసం దొంగలు ఈ పనిచేశారా..లేదా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోదాడలో సూది సైకోగాళ్లు
-
కోదాడలో సూది సైకోగాళ్లు
నల్లగొండ: కొద్ది రోజులుగా సూది సైకో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సూదిగాళ్ల కలకలం నల్లగొండ జిల్లాకు వ్యాపించింది. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కోదాడ మండల కాపుగల్లులో బైకుపై వెళ్తున్న వీరయ్య (55) గ్రామ శివారుకు రాగానే ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై సూది విసరడంతో అది చెంపపై గుచ్చుకుంది. ఆయన వెంటనే కోదాడలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వీరయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంతరాష్ట్ర దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్
కోదాడ రూరల్ : రాత్రివేళ రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకుని సేదతీరుతున్న వారిని టార్గెట్ చేస్తూ కత్తులతో బెదిరించి నగదు, బంగారం, సెల్ఫోన్లు దొంగలిస్తున్న అంతరాష్ట్ర దారిదోపిడీ దొంగల ముఠాను కోదాడరూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం తెల్లవారు జామున పట్టుకున్నారు. మధ్యాహ్నం సూర్యాపేట డీఎస్పీ అబ్దుల్ష్రీద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పెరాయిగూడెంకు చెందిన మేహార్‌షిండే, అదేగ్రామానికి చెందిన ఎళ్లు షిండే, మల్కాజ్షిండే, కర్నూలు జిల్లా పందిపాడుకుకు చెందిన వీరులు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడేవారు. ఈ మధ్య కోదాడ ప్రాంతంలో పగటిపూట కీ చైన్స్ విక్రయిస్తూ రాత్రివేళ దోపిడీలు చేసేవారు. బుధవారం రాత్రి రూరల్ సీఐ రామాపురం క్రాస్‌రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆంధ్రప్రాంతనుంచి కోదాడకు వస్తున్న ఆటోను ఆపి వివరాలు అడగగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా చేసిన నేరాలు ఒప్పుకున్నట్లు తెలిపారు. మేహార్‌షిండే, ఎళ్లు షిండేలు గత సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దోపిడి నేరం చేసి 40 రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారని, వారి వద్ద నుంచి మూడు కత్తులు, సెల్‌ఫోన్, రూ.1500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ పోలీసుకు డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ చరమందరాజు, ఏఎస్ఐ ఇమామ్, హెడ్‌కానిస్టేబుల్ బ్రహ్మం, రమేష్, సిబ్బంది ఉన్నారు. -
రూ. 100కే కిలో చికెన్..
కోదాడ టౌన్: కాడెద్దుల పోరులో లేగదూడల కాళ్లు విరగడం అంటే ఇదేనేమో..! ఇద్దరు బడా చికెన్ వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా కిలో చికెన్ ధర రూ.100కు పడిపోయింది. దీంతో చికెన్ చిరు వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అయితే, కోడిమాంసం ప్రియులు మాత్రం సంతోషంతో ఉన్నారు. ఇదంతా నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదం. వివరాలు.. పట్టణంలో దాదాపు 25 చికెన్ దుకాణాలున్నాయి. వారికి కావాల్సిన కోళ్లను కోదాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు సరఫరా చేస్తారు. వారు కిలోకి కొంత కమీషన్ తీసుకుంటారు. వారి మధ్య వచ్చిన పోటీతో తమ రిటైల్ దుకాణాల్లో చికెన్ ధర తగ్గించి అమ్మడం ప్రారంభించారు. దీంతో చిరు వ్యాపారులు కూడా అదే అనుసరించాల్సిన దుస్థితి ఏర్పడింది. వారం క్రితం వరకు కేజీ బాయిలర్ చికెన్ రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.100కు తగ్గించారు. బడా వ్యాపారుల పోటీతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో పది రూపాయలను తగ్గించి తమను కోలుకోనీయకుండా పథకం వేస్తున్నారని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీ నూనె దందా
కోదాడటౌన్ : కోదాడ కేంద్రంగా ఓ ఆయిల్ మిల్లు యజమాని కొంత కాలంగా చేస్తున్న నకిలీ నూనె దందా బట్ట బయలైంది. శనివారం హైదరాబాద్‌లో ఆయిల్‌ఫెడ్ అధికారులకు పట్టుబడ్డ నకిలీ నూనె ట్యాంకర్ కోదాడ నుంచి వచ్చిందని అధికారులు తేల్చడంతో స్థానికంగా సంచలనం కలిగించింది. మూతపడ్డ ఆయిల్ మిల్లు పేరుతో కొంత కాలంగా ఈ నకిలీదందా కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న మిల్లు కేంద్రంగా నకిలీ వేరుశనగ నూనెను సరఫరా చేస్తూ కోదాడ నుంచి సరఫరా చేస్తున్నట్లు కాగితాల మీద చూపుతున్నట్లు సమాచారం. కోదాడలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో ఆయిల్ మిల్లు ఉండేది. దీనిని కోదాడకు చెందిన విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ వారు నడుపుతున్నారు. కోదాడ పరిసర ప్రాంతాలలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వేరుశనగ పంట పండించక పోవడంతో ఈ మిల్లు మూత పండింది. దీంతో సదరు కార్పొరేషన్ వారు ఇతర ప్రాంతాల నుంచి నూనెను ట్రేడింగ్ పేరుతో సేకరించి ఆయిల్‌ఫెడ్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఓ మిల్లును తీసుకొని కోదాడ మిల్లు పేరుతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. కోదాడలో రెండు దుకాణాలను తీసుకొని వీరు వేరుశనగ నూనెను రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నారు. మిల్లు యజమాని వివరణ తాము నూనెను ట్రేడింగ్ చేస్తామని, కల్తీతో తమకు ఎటువంటి సంబంధం లేదని కోదాడ విజయలక్ష్మి ఆయిల్ కార్పొరేషన్ యజమాని శంకర్ చెప్పా రు. క్వాలిటీ లేక పోతే తాము సరఫరా చేసిన నూనెను వెనక్కి తీసుకుంటామన్నారు. నూనె తాము తయారు చేసింది కాదని కేవలం ట్రేడింగ్ మాత్రమే చేశామన్నారు. మూత పడ్డ మిల్లుకు దీనికి సంబంధం లేదన్నారు. ఆయిల్‌ఫెడ్‌లో ఉన్న ఆంధ్రా తెలంగాణ అధికారులకు పడక తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. -
ఎన్‌హెచ్‌గా కోదాడ-కల్వకుర్తి మార్గం
కేంద్రానికి ఎంపీ గుత్తా విజ్ఞప్తి న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల అభ్యున్నతికి, పారిశ్రామికరంగ అభివృద్ధికి, పర్యాటక కేంద్రాల అనుసంధానానికి దోహదపడుతుంది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రికి చాలాసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపింది. అందువల్ల తక్షణం దీనిని జాతీయ రహదారిగా ప్రకటించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని గుత్తా పేర్కొన్నారు. -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
నల్లగొండ : నల్లగొండ జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను రాడ్ తో కొట్టి చంపాడో భర్త. వివరాలు.. కోదాడ కు చెందిన వేముల రమేష్ అనే వ్యక్తి గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమేష్ ఇనుపరాడ్‌తో భార్య రమణ(35) తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్తానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. (కోదాడ) -
చైన్ స్నాచర్ అరెస్ట్... 12 తులాల బంగారం స్వాధీనం
నల్గోండ: నల్గొండ జిల్లా కోదాడ శివారులో చైన్ స్నాచర్ బి. శివారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు శివారెడ్డిని తనదైన శైలిలో విచారిస్తున్నారు. నిందితుడి శివారెడ్డిపై ఇప్పటికే కృష్ణా జిల్లా మైలవరం, ఏ కొండూరు, రెడ్డి గూడెం పోలీసు స్టేషన్లతోపాటు నల్గొండ జిల్లా హుజూర్నగర్, కోదాడ, చిలుకూరు పోలీసు స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయాయి. -
కోదాడలో షర్మిల పరామర్శ యాత్ర
నల్గొండ: వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల ఈ రోజు నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పరామర్శయాత్ర కొనసాగించనున్నారు. తొలుత ఆమె కోదాడ మండలం తొగర్రాయిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన రాంప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం కోదాడకు చెందిన సురభి శ్రీనివాస్, వల్లంశెట్టి రాంప్రసాద్ కుటుంబాన్ని, చిల్కూరు మండలం ఆచార్యగూడెంలో అల్వాల ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత మునగాల మండలం గణపవరానికి చెందిన సారెడ్డి శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని, వెంకటరామాపురానికి చెందిన మరుకుంట్ల గురవయ్య కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు -
కొత్త విధానంతో కోటి తిప్పలు
కోదాడటౌన్ : మార్చి నెలలో నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను, జిల్లా అధికారులను ఇప్పటి నుంచే టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త సిలబస్‌తో పాటు మారిన పరీక్ష విధానంలో మొదటిసారిగా జరగనున్న ఈ పరీక్షలు, తదనంతరం పరీ క్షా ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయోననే ఆందోళన ఇప్పుటి నుంచే మొదలైంది. డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేసి జనవరి నెల నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహిం చాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 నుంచి 80 శాతం సిలబస్ మాత్రమే పూర్తి కావొచ్చిందని, మిగిలిన సిలబస్ పూర్తి చేయడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జనవరి చివరి వరకైనా సిలబ స్ను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుం ది. మార్చి25 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ కావడంతో విద్యార్ధులను నూతన విధానంలో పరీక్షకు సిద్ధం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చిక్కులు తెచ్చిన నూతన విధానం ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను నూతన విధానంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ప్రశ్న, జ వాబులను బట్టీ పడుతున్నారని దీనిని సమూలంగా మా ర్చాలని భావించిన విద్యావేత్తలు ఈ సంవత్సరం నుంచి నిరంతరం సమగ్ర మూల్యాంకన పద్ధతి(సీసీఎల్) ని అమ లు చేస్తున్నారు. దీని ప్రకారం వివిధ సబ్జెక్టులలో పాఠ్యాం శాల వెనుక ఉన్న ప్రశ్నలు కాకుండా పాఠ్యాంశములోని ఎ క్కడి నుంచైనా ప్రశ్నలు అడగవచ్చు. దీనికి విద్యార్థి ము ఖ్యాంశాలనే గాక పాఠం మొత్తం చదవాల్సి ఉంటుంది. గ తంలో ముఖ్యమైన పాఠ్యాంశాలను విద్యార్థులచే బట్టీ ప ట్టించి ఎలాగోలా గట్టెక్కించేవారు. కాని ఈ సారి ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రోజు వరకు ప్రశ్న ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి అడుగుతారు? దాని సమాధానం ఏమిటి? అన్నది తెలియదు. దీంతో విద్యార్థులకు, ఆయా పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది. ఈ సారి 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులను విద్యార్థి తరగతిలో ప్రదర్శించిన వివిధ నైపుణ్యాలను పరిశీలించి ఇంటర్నల్ మార్కులుగా ఇవ్వాలి. వీటిని పబ్లిక్ పరీక్షలో సాధించిన మార్కులతో కలిపి ఫైనల్ గ్రేడ్ నిర్ణయిస్తారు. చివరిలో మొక్కుబడిగా శిక్షణ..!! మారిన సిలబస్, కొత్త పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ విషయంలో తాత్సారం చేశారు. జూన్‌లో పాఠశాలలు మొదలు కాగా డిసెంబర్ నెలలో కొత్త విధానంపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అప్పటికే సమ యం మించిపోయింది. ఇక పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారిలో 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. వారికి బోధించే ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యార్థులకు బోధన చేస్తూ విద్యార్థు చేత గైడ్లు, టెస్టు పేపర్లు చదివిస్తున్నారు. వెనుబడిన విద్యార్థులను గుర్తించే సమయం ఏది? సంవత్సరం చివరలో పరీక్షలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ప్రారంభం నుంచే విద్యార్థిని పరీక్షించి తద్వార వెనుక బడిన అంశాలలో వారిని మెరుగు పర్చాల్సి ఉంది. కాని కొత్త విధానంపై ఉపాధ్యాయులకే సరైన అవగాహన కల్పించకపోవడంతో ఇప్పటి వరకు వెనుక బడిన విద్యార్థులను గుర్తించే అవకాశం రాలేదు. సోమవారం నుంచి అర్ధ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత సంక్రాంతి సెలవులు. తిరిగి పాఠశాలలకు వచ్చే సరికి జనవరి నెల పూర్తవుతుంది. ఇక వారిలో వెనుక బడిన విద్యార్థులను గుర్తించడం, వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. వెనుక బడిన విద్యార్థులను గుర్తించడానికి ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఒక సబ్జెక్టును బోధించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్కడ ఇవి అమలు కావడం లేదు. దీంతో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆందోళన అవసరం లేదు : విశ్వనాథరావు, డీఈఓ బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నూతన విధానం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. జనవరి చివరి వరకు సిలబస్ పూర్తి చేస్తాం. ప్రధానోపాధ్యాయులు కూడా పాఠాలు బోధించాలని ఆదేశాలు ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిలేదు. -
ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందా
కోదాడటౌన్ :ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందాలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. కోదాడ కేంద్రంగా రెండేళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారం నిర్వహిస్తున్న వీరిద్దరు శని వారం హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. నిందితులది అస్సాం రాష్ర్టం కాగా వారిద్దరూ కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నారు. వారి వద్ద భారీ ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు లభ్యమాయ్య యి. వీరిని నమ్ముకుని అడ్మిషన్ల కోసం కొన్ని ఇంజి నీరింగ్ కళాశాలల నిర్వాహకులు లక్షల రూపాయలు ముట్టజెప్పగా వారికి ముందస్తుగా కొన్ని విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా వీటిలో ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేలడంతో డబ్బులు ముట్టజెప్పిన కళాశాలల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ అనుమతి రాక నానా ఇబ్బందులు పడుతున్న కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇంతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా పోలీస్ ఉన్నతాధికారులు కోదాడపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను దర్యాప్తు కోసం కోదాడకు పంపారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క కోదాడలోనే ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 2 వేల మంది ఇం జినీరింగ్, పాలిటెక్నిక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరారు. కొన్ని కన్సల్టెన్సీలు ఉత్తరాది నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడి కళాశాలల్లో చేర్పించాయి. అం దుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 నుంచి రూ.50 వేల వరకు కమిషన్ తీసుకున్నట్లు తెలిసిం ది. మొదట కోదాడకు చెందిన ఓ మైనార్టీ కళాశాల కొంతమంది బీహార్ విద్యార్థులను చేర్చుకుంది. వా రిని అనుసరించి ఇప్పుడు కోదాడలోని మరో నా లుగు కళాశాలలు పాలిటెక్నిక్,ఇంజినీరింగ్‌లో 2000 విద్యార్థులకు గడిచిన రెండేళ్ల నుంచి అడ్మిషన్లు ఇ చ్చాయి. విద్యార్థుల ఉండటానికి రెండు కళాశాలలు ప్రత్యేక హాస్టళ్లు, తరగతులను నిర్వహిస్తున్నాయి. భారీగా ఉపకార వేతనాలు బీహార్, చత్తీగఢ్, అస్సాం రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల వారికి కల్యాణయోజన పథకం కింద కేం ద్రం భారీగా ఉపకార వేతనాలు ఇస్తుంది. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నవారి ఆత్రుతను ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు అదునుగా భావించారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి విద్యార్థులను కళాశాల లకు అంటగట్టి వారి నుంచి కమిషన్ రూపంలో లక్ష ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంజినీరింగ్ అ డ్మిషన్ల కొనుగోలు దందా ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట మంతటా విస్తరించింది. గతంలోనూ చాలా మంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడి కోర్సుల్లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీ సుల దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకా శాలున్నాయి. -
ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
కోదాడరూరల్ : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం కోదాడలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ డివిజన్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లధనాన్ని వెలికితీస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కేంద్రం ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు కావాల్సిన సమాచారం తమ దగ్గరలేదనడం పెట్టుబడిదారులకు ఒత్తాసు పలుకడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కుటుంబ సమగ్ర సర్వేలో ప్రజల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం.. ఆహారభద్రత కార్డులు, సామాజిక పింఛన్లు, ఫాస్టు పథకానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 8 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన మాటలు కోతలేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు చేస్తున్న యాత్రలు తమ ఉనికిని కాపాడుకోవటానికే తప్ప ప్రజా సమస్యలపై కాదని విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో సూర్యాపేటలో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 26, 27, 28, మార్చి 1న హైదబాద్‌లో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్‌లో విశాఖపట్నంలో ఆలిండియా మహాసభలు జరుగుతాయని వివరించారు. సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య, గట్టు వెంకట్రామయ్య, కుక్కడపు ప్రసాద్, వెంకటేశ్వరరావు, యలమంచి, బెల్లంకొండ సత్యనారాయణ స్టాలిన్‌రెడ్డి, కొరట్ల శ్రీను, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ కాకుండానే...
కోదాడరూరల్ : ఎంతో కష్టపడి మెడికల్ సీటు సాధించి కాలేజీలో చేరేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని కలలు మార్గమధ్యలోనే కల్లలయ్యాయి. మరో రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరే వారికి అనుకోని ఆపద ఎదురైంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని దుర్మరణం పాలవ్వగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని దుర్గాపురం బైపాస్‌రోడ్డులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన గొలుసు నర్సయ్య కుతూరు సుష్మ(18), వనస్థలిపురానికి చెందిన ముగుళ్ల మహేందర్‌రెడ్డి కూతురు మనీషారెడ్డి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. వారిద్దరిని కళాశాలలో చేర్పించేందుకు నర్సయ్యతో పాటు ఆయన కు మారుడు సుమిత్, మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సుష్మలు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. ఉదయం ఏడు గంటల సమయంలో కోదాడ మండలం దుర్గాపురం బైపాస్ వద్దకు రాగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కోదాడలోకి వచ్చేందుకు వేగంగా మలుపు తిరుగుతుండగా అంతేవేగంతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గొలుసు సుష్మ, సుమిత్, మహేందర్‌రెడ్డి అతడి భార్య సుష్మ, కారుడ్రైవర్ రాంభూపాల్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. మనీషారెడ్డి, నర్సయ్య, మహేందర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గొలుసు సుష్మ, సుమిత్, సుష్మల పరిస్థితి విషమం గా ఉండటంతో వారిని ఖమ్మం తరలిస్తుండగానే గొలుసు సుష్మ మృతిచెందింది. సుష్మ తమ్ముడు సుమిత్ పరిస్థితి కూ డా విషమంగా ఉండటంతో అతడిని ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యామేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ప్యాకేజీ ఇస్తాం.. ఖాళీ చేయండి
‘కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు గ్రామాల ప్రజలు తాము నివసిస్తున్న ప్రాంతాలను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాలి...ప్యాకేజీ వెంటనే అందజేస్తాం’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులతో శుక్రవారం కలెక్టర్ కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీప్రభుత్వం విడుదల చేసిన రూ. 20కోట్లు గ్రామాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. కోదాడరూరల్ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ చెల్లిస్తామని, తమతమ ప్రాంతాలను ఖాళీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. శనివారం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో పులిచింతల ముంపు ప్రాంతాలైన కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు ప్రజలతో గ్రామాల వారీగా సమావేశమయ్యారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ముంపు బాధితులు తమకు కేటాయించిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడానికి సిద్ధమైందని, దీంతో ముంపు గ్రామాలలోకి నీరు చేరుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వచేయాలని అధికారులను ఆదేశించిందని, అ స్థాయిలో నీటిని స్టోరేజీ చేస్తే ముంపు గ్రామాలు 13 పూర్తిస్థాయిలో, 4 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని చెప్పారు. అయితే మరో ఏడాది వరకు ప్రాజెక్ట్‌లో 7 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పునరావాస నిర్వాసితులకు రూ.292 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు 172 కోట్ల రూపాయలను అందజేశామని, మిగిలిన రూ.120కోట్లు కూడా విడుదల చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, వాటిని గ్రామాల వారీగా అందజేస్తామన్నారు. త్వరలోనే ముంపు గ్రామాల పర్యవేక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని దత్తత అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. 18ఏళ్లు నిండిన వారికి నాటి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, దానిని 2013 నాటికి అమలు చేయాలని పలువురు ముంపువాసులు కలెక్టర్‌ను కోరారు. 2007లో ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేస్తామని, అది కూడా 18 ఏళ్లు నిండి విద్యార్థి కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రాప్రాంతంతో పనిదినాలను ఎక్కువగా చూపించారని, కూలిని రూ.161 చెల్లించారని, తమకు మాత్రం పనిదినాలు అనుకున్న ప్రకారం కల్పించలేదని, కూలిని రూ.97, రూ.110 చెల్లించారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ అనుకున్న పనిదినాలను కల్పించి కూలి రేటును రూ.165 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస ప్రాంతాలలో అధికారులు సరిగా వసతులు కల్పించడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన శాఖల వారీగా మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, కోదాడ తహసీల్దారు పసుపులేటి రామకృష్ణ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు. -
అయోమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు
కోదాడటౌన్ :వెంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదేనేమో.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మార్పుల కోసం జరుగుతున్న కసరత్తు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి లాటర్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు సంకటంగా మారింది. వీరు ప్రవేశం పొందే ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండవ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటింది. కానీ ఈసెట్ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు నేటికీ సీట్లు అలాట్ కాకపోవడంతో అయోమయంలో పడిపోయారు. జిల్లాలో 8 మంది డిప్లమా విద్యార్థులు జిల్లాలో ఉన్న 46 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సుమారు 8400 మంది ఉన్నారు. డిప్లమా హోల్డర్స్‌గా పిలువబడే వీరు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. కాగా పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో మేలో ఈసెట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. జూన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ వెంటనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చారు. ర్యాంక్ సాధించిన వారితో లాటరల్ ఎంట్రీ ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 700 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 48వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో తలెత్తిన వివాదం తో వీరికి నేటికీ సీట్లు కేటాయించలేదు. దీంతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. నెలరోజులుగా తరగతులు ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం తరగతులు జూలై 4వ తేదీ నుంచి జరగుతున్నాయి. వీరికి మొదటి సెమిస్టర్ తరగతులు అక్టోబర్‌లో పూర్తవుతాయి. ఆ వెంటనే పరీక్షలు నిర్వహించాలని యూనివర్శిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈసెట్ అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది అధికారులకు కూడా తెలియడం లేదు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
నేడు కోదాడలో కాంగ్రెస్ సమావేశం ఇంకా ఏకతాటిపైకి రాని జిల్లా నాయకులు పార్టీ భవిష్యత్‌పై చర్చ ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పెరిగిన వలసలు సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా కాంగ్రె స్ తొలిసారి భేటీ కాబోతోంది. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్, మూడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, మెజారిటీ ఎంపీపీలు వెరసి... జిల్లాలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవులను మినహాయిస్తే, ఒకవిధంగా అధికార టీఆర్ఎస్ కంటే కూడా బలంగానే ఉంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మున్ముందు మరింతగా పెరిగే వీలుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరాన్ని ఆలస్యంగానైనా పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. పార్టీ శ్రేణులనుఓ చోట చేర్చేందుకు శుక్రవారం కోదాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, సమావేశం ఏర్పాటు చేసిన నియోజకవర్గాన్ని బట్టి కొంత ప్రతికూలత ఉంది. జిల్లా కాంగ్రెస్‌లో బలమైన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డి సోదరులకు అటు టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌తో పేచీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జిల్లా కాంగ్రెస్ ఏకతాటిపైన లేనే లేదు. టీసీఎల్పీ నేతగా ఉన్న పార్టీ సీనియర్ కె.జానారెడ్డి సైతం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టీపీసీసీ నాయకత్వం ఇప్పటిదాకా కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదన్న విమర్శ పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే భువనగిరి నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నకిరేకల్ నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కావాల్సినంత బలం ఉన్నా, సభ్యులను కాపాడుకోలేక సూర్యాపేటను కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని మండలాల్లోనూ ఎంపీపీలను ఇదే తరహాలో కోల్పోయారు. చూడడానికి పదవుల రీత్యా బలంగా కనిపిస్తున్నా, టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడంలో మాత్రం ఇక్కడి నాయకులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్‌ప్రెసిడెంట్ ఉత్తమ్, జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు ఇలా ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. మరి ఈ సమావేశంలో పార్టీని బతికించుకునే దిశలో ఏమైనా చర్చిస్తారా..? కేవలం మొక్కుబడిగా కలిసి చేతులు కలిపేసుకుని వెళ్లిపోతారా..? అన్న ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్తల మదిని వేధిస్తున్నాయి. -
కోదాడలో తీవ్ర ఉద్రిక్తత
కోదాడ అర్బన్ : కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గురువారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ పద్ధతుల్లో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ టీఆర్ఎస్, టీడీపీ నాయకులు ఎన్నికను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ కార్యాలయానికి వంద మీటర్లలోపు ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు బుధవారం ప్రకటించారు. పది గంటల సమయంలో టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కార్యాలయంలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. పదిన్నర గంటల సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లను వెంట తీసుకుని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కార్యాలయానికి వస్తుండగా వారిని స్థానిక మసీదు వద్ద అడ్డుకుని నల్లజెండాలతో నిరసన తెలిపారు. సుమారు పది నిమిషాలసేపు టీఆర్ఎస్,టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు టీఆర్ఎస్, టీడీపీ నాయకులను చెదరగొట్టి ఎమ్మెల్యే వాహనాన్ని కార్యాలయంలోనికి పంపించారు. అమె వాహనంతోపాటు కౌన్సిలర్లు ఉన్న బస్సు కార్యాల యం వద్దకు చేరుకోగానే మరోసారి టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల మరోసారి చెదరగొట్టి కౌన్సిలర్లను లోనికి పంపించారు. తోపులాట సందర్భంగా టీఆర్ఎస్కు చెందిన ఇరువురు నాయకురాళ్లకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్, టీడీపీ నాయకులు రహదారిపై కొంతసేపు రాస్తారోకో నిర్వహించారు. కార్యాలయం లోపల ఎన్నిక జరుగుతున్నంతసేపు బయట నిరసన తెలుపుతూనే ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుక్కడపు బాబు, రాయపూడి వెంకటనారాయణ, చలి గంటి లక్ష్మణ్, ఏనుగుల ఎల్లేశ్వరరావు, బెలిదె అశోక్, గట్ల నరసింహారావు, కంచుకొమ్ముల శంకర్, టీడీపీ నాయకులు పాలూరి సత్యనారాయణ, ఉప్పగండ్ల శ్రీను, కె.చందర్రావు, ప్రసాద్, గురుమూర్తి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
వృద్ధురాలి మీదినుంచి వెళ్లిన ట్రాక్టర్.. కేతేపల్లి, న్యూస్‌లైన్ : ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రిస్తున్న వృద్ధురాలి మీదుగా అదే ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చెర్కుపల్లి ఐకేపీ కేం ద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మనగోటి రాములమ్మ(75) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులనుంచి ధాన్యం యాచించేందుకు మంగళవారం ఐకేపీ కేంద్రానికి వెళ్లింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధాన్యం రాశుల పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టరుట్రాలీ కింద నీడలో విశ్రమించింది. గమనించని ట్రాక్టరు డ్రైవరు ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక్కిపోనిచ్చాడు. రాములమ్మకు వినికిడి లోపం ఉండడంతో ట్రాక్టరు స్టార్టు అయిన విషయం తెలియక అలాగే ఉండిపోయింది. దీంతో రాములమ్మ తలమీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు అందించిన సమాచారంతో కేతేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బైక్ పైనుంచి పడి.. కోదాడ రూరల్, న్యూస్‌లైన్ : బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చిత్తలూరి కిరణ్‌కుమార్ (36) తన జేసీబీల పనినిమిత్తం కోదాడకు వచ్చాడు. పని ముగిసేసరికి రాత్రి అయ్యింది. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో కిరణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డువెంట వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని అతన్ని కోదాడకు తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు. -
ఉత్తమ(మ్), సతీమణి విజయం
నల్గొండ : తెలంగాణ పిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి విజయం సాధించారు. హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందగా, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతి గెలుపొందారు. ఇక మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. -
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
హోరెత్తిన ర్యాలీలు
ముగిసిన సార్వత్రిక ప్రచారం... ప్రలోభాలకు శ్రీకారం సాక్షి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగి సింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెరలేచింది. బుధవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం పరిసమాప్తమైంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌తో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని కోదాడలో ముగించారు. అలాగే టీడీపీ, బీజేపీలు జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు హోరెత్తాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, సీపీఎం తదితర పార్టీల నాయకులు భారీగా జనసమీకరణ చేసి ప్రధాన పట్టణాల్లో బైక్‌ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల రోడ్ షోలు
-
'ఇచ్చిన మాటకోసం తుదివరకూ నిలబడతా'
నల్గొండ : రాష్ట్రాన్ని అయితే విభజించారు గానీ... తెలుగు జాతిని వేరుచేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నల్గొండ జిల్లా కోదాడ బహిరంగ సభలో ప్రసంగించారు. రెండ్రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి...ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలో మనకు మనం ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు. ఏ వ్యక్తి అయితే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాడో...అలాంటి వ్యక్తినే మనం తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని విశ్వసనీయత అంటే కనపడని విధంగా రాజకీయాలు మారిపోయాయని జగన్ వ్యాఖ్యానించారు. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు అయితే ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలనేలా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగిందని జగన్ అన్నారు. మహానేత మరణాంతరం అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని...ఆయన మృతితో పేదోడి కోసం ఆలోచించే నాయకుడే లేకుండా పోయారన్నారు. అక్కచెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెడుతున్నందుకు గర్వపడుతున్నానని జగన్ అన్నారు. రెండు నెలల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర దశ, దిశ మార్చే విధంగా అయిదు సంతకాలు చేస్తానని తెలిపారు. సీమాంధ్రలో అమలు చేయబోయే పథకాలు తెలంగాణలోనూ అమలు అమలు అవుతాయని జగన్ వెల్లడించారు. ఇచ్చిన మాట కోసం, పెట్టే సంతకం కోసం తుదివరకూ నిలబడతానని ఆయన స్పష్టం చేశారు. -
మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ : ఈ నెల 30వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 23న కోదాడకు రానున్న సందర్భంగా నిర్వహించే బహిరంగసభ ప్రాంగణం, హెలిప్యాడ్‌ను నరేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థులను తమ సొంత ఇంటి అభ్యర్థులుగా భావిస్తూ జిల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మా జీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించి వారి చెప్పుచేతల్లో నడుచుకున్నాడని విమర్శించారు. ప్రస్తుతం ఉత్తమ్‌కు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా సీమాంధ్రులు తమ స్వలాభం కోసం ఇప్పించిందేనని, ఉత్తమ్ గెలిస్తే సీమాంధ్రుల మెప్పుకోసం తెలంగాణను తాకట్టుపెడతాడని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏనాడూ నోరుమెదపని ఆయన తెలంగాణను అభివృద్ధి చేస్తాననడం హా స్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందని విమర్శించే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గమనించిన తెలంగాణ ప్రజలు టీడీపీ, బీజేపీ కూటమిని ఆదరించేందు కు సిద్ధంగాలేరన్నరు. సమావేశంలో కోదాడ ఎ మ్మెల్యే అభ్యర్థి శశిధర్‌రెడ్డి, జిల్లా అధికా ర ప్రతి నిధి బక్క పిచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందం, శ్రీనివాస్, గోవిందరాంసింగ్, కుక్కడపు బాబు, పుల్లయ్య, అంజయ్య,లక్ష్మయ్య పాల్గొన్నారు. -
రగులుతున్న తమ్ముళ్లు
తొలిజాబితాలో ఐదుగురు అభ్యర్థులు ఖరారు ఇంకా పెండింగులోనే ‘కోదాడ’ జిల్లా నుంచి మోత్కుపల్లి పోటీ చేయనట్టేనా! రాజీనామాలకు సిద్ధపడుతున్న నేతలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ టీడీపీకి జిల్లాలో భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలున్నా, కేవలం భువనగిరి స్థానానికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి జిల్లా నుంచి పోటీ చేయడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఈ కార ణంగానే ఆయన పేరును ప్రకటించలేదని చెబుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు టికెట్‌పై ఇంకా సస్పెన్సే కొనసాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొల్లం మల్లయ్యయాదవ్ ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ కోసం పోటీ త్రీవంగానే ఉంది. ఈ కారణంగానే చివరి నిమిషంలో టికెట్ ఖరారు చేసే ఉద్దేశంతో పెండింగులో పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా బీజేపీకి వదిలేయాలని దాదాపు నిర్ణయించిన ఆలేరు, మునుగోడు, నల్లగొండ స్థానాల విషయంలోనూ వివాదం జరుగుతోంది. ఆలేరును మినహాయిస్తే, మునుగోడు టీడీపీ శ్రేణులు అధినాయకుని నిర్ణయంపై కస్సుమంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కర్నాటి వెంకటేశం రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చారని సమాచారం. అయితే, ఈ నెల 11వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జర గనున్నందున అప్పటి దాకా వేచి ఉండి 12వ తేదీన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలోగా ఆయన తన సహచరులు, అనుచరులతో మాట్లాడుకుని ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరో వైపు నల్లగొండలోనూ టీడీపీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నాయి. మునుగోడు, నల్లగొండలో తన వర్గీయులకు టికెట్ ఇవ్వకుండా బీజేపీకి కేటాయించినందునే భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్లు పార్టీల వర్గాల సమాచారం. ఈ విషయాలన్నింటినీ విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో చిచ్చు రేపుతోంది.భువనగిరి సిట్టింగ్ సీటును ప్రస్తుత ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డికి కేటాయించారు. ఇప్పటికే ఆమె ఈ నియోజకవర్గం మూడు పర్యాయాలు గెలిచి, నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి గడిచిన అయిదేళ్లుగా కనీసం ఇన్‌చార్జ్‌ను కూడా నియమించ లేదు. పార్టీ నాయకుడు బంటు వెంకటేశ్వర్లుకు ఈ సారి అనూహ్యంగా టికెట్ దక్కింది. జిల్లాలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కారణంగానే ఆయనకు టికెట్ దక్కిందంటున్నారు. మునుగోడులో కర్నాటి వెంకటేశానికి అవకాశం ఇవ్వలేక పోయినందున ఆ లోటును మిర్యాలగూడలో పూడ్చారు.హుజూర్నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా వంగాల స్వామిగౌడ్‌ను ఖరారు చేశారు. కొద్ది నెలల కిందటే ఆయనను ఇక్కడ ఇన్చార్జ్గా నియమించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేసిన స్వామిగౌడ్ టీడీపీలో చేరి గత ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. దేవరకొండ నియోజకవర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌కు టికెట్ ఇచ్చారు. స్వామిగౌడ్ నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన బిల్యానాయక్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. నియోజకవర్గానికే పరిమితమయ్యారు. టికెట్ కోసం పోటీ పడే వారూ లేకపోవడంతోఆయన పేరు తొలి జాబితాల్లోనే చోటు చేసుకుంది.సూర్యాపేట టికెట్ పార్టీలో ఉత్కంఠ రేపింది. నియోజకవర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఖరారైంది. ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు నాయకత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో చివరకు రమేష్‌రెడ్డికే టికెట్ దక్కింది. -
నీ వెంటే నేను..!
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి కోదాడ, వారి బంధం మరణంలో కూడా వీడలేదు. ఏడడుగులు భర్తతో కలసి నడిచిన ఆమె మరణంలో కూడా తోడు వెళ్లింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ (55) ఓ ట్రాన్స్‌పోర్ట్‌లో స్వీపర్‌గా, ఆయన భార్య అనసూర్యమ్మ (48) వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారంరాత్రి సత్యనారాయణ గుండెపోటుతో మరణించారు. భర్త కళ్లముందే మృతి చెందడాన్ని తట్టుకోలేని ఆమె గుండెలవిసేలా రోదిస్తూ తెల్లవారుజామున సొమ్మసిల్లి పడిపోయింది. బంధువులు చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది. వీరి మృతదేహాలను పక్కపక్కనే ఉంచడంతో చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. -
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్,విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శించొద్దని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శారదదేవి, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శనివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పలు అంశాలపై వారు సూచనలిచ్చారు. సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నికల అధికారి రామానుజుల రెడ్డి వారికి వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా సజావుగా నిర్వహిం చేందుకు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టరేట్లో అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వారి వెంట సూర్యాపేట ఆర్డీవో నాగన్న ఉన్నారు. ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలింపు ఎన్నికల విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది శనివారం మధ్యాహ్నం తమకు కేటాయించిన వార్డులకు ఈవీఎంలను తీసుకవెళ్లారు. మొత్తం 30 వార్డులను ఆరు జోన్లుగా విభజించిన అధికారులు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులలో ఆయా పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు. -
ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం
కోదాడటౌన్, న్యూస్‌లైన్,మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. చివరిరోజున వివిధ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పార సత్యావతి తరుఫున సినీనటుడు వేణుమాధవ్ పట్టణంలో ప్రచారం చేశారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు 27, 28 వార్డులలో పాదయాత్ర నిర్వహించి ఆ వార్డు అభ్యర్థి ఓరుగంటి ప్రభాకర్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి వంటిపులి నాగలక్ష్మితో పాటు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి వివిధ వార్డులలో శుక్రవారం విసృ్తతంగా పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు మహబూబ్ జానీ, సత్యబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావులు వివిధ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శశిథర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డులలో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేనిబాబు ఆ పార్టీ పార్టీ అభ్యర్థులను గెలిపిచాలంటూ ఆయా వార్డులలో ప్రచారం నిర్వహించారు. 12వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిత్రపక్షాల నాయకులు ర్యాలీలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. -
బహుముఖం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో ఘట్టం పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగిసింది. తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఎంతమందన్నది తేలింది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీల వార్డు సభ్యుల పదవుల కోసం ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 210 వార్డులకు 1,311మంది తుది బరిలో నిలిచారు. అత్యధికంగా కోదాడలో 362 నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. మిర్యాలగూడలో 36 వార్డులకు 351 మంది పోటీ పడుతున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40వార్డులకు 220మంది పోటీ పడుతున్నారు. పోటాపోటీ.... దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. చాలా చోట్ల కాంగ్రెస్‌కు ఇంటిపోరు ఎక్కువఉంది. ఆఖరి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా రెబల్స్‌గా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులపై రెబల్స్దే పైచేయి ఉండొచ్చని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్.. ఇతర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగాయి. టీడీపీకి అన్ని వార్డుల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో స్థానికంగా క్యాడర్ని బట్టి కొన్ని పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. భువనగిరిలో వర్గపోరు.... భువనగిరి కాంగ్రెస్‌లో వర్గపోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడున్న 30 వార్డుల్లో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయితే ఎంపీ వర్గం, స్థానిక నేత వర్గం తమ అభ్యర్థులను వేర్వేరుగా రంగంలోకి దింపాయి. ప్రధానంగా పోటీ కూడా వీరి మధ్యే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వర్గపోరును టీడీపీ సానుకూలంగా మలుచుకోవడానికి తహతహలాడుతోంది. మొత్తం గా బరిలో 175 మంది నిలిచారు. సూర్యాపేటలోనూ రెబల్స్ బెడద... ఈ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద ఉంది. ఉన్న 34 వార్డుల్లో కాంగ్రెస్ ఒంటిరిగా బరిలోకి దిగింది. 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీపడుతున్నారు. టీడీపీ32, బీజేపీ 31 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. టీడీపీతో కొన్ని వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. టీఆర్ఎస్, సీపీఐ పొత్తు కుదుర్చుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. తుదిపోరులో 193మంది నిలిచారు. మిర్యాలగూడలో... ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అన్ని వార్డుల్లో బరిలోకి దిగింది. టీడీపీ, సీపీఎం 25 చొప్పున, బీజేపీ 11 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. అయితే కొన్ని వార్డుల్లో టీడీపీ, సీపీఎం ఒప్పందానికి వచ్చాయి. ఇంకొన్ని వార్డుల్లో కాంగ్రెస్, కాంగ్రెస్సేతర పార్టీలు ఏకమయ్యాయి. మొత్తం మీద ఈ మున్సిపాలిటీల్లో పురుపోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం 36 వార్డుల్లో 351 మంది బరిలో నిలిచారు. కోదాడలో కూటములుగా.. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, సీపీఎంలు కూటమిగా ఏర్పడ్డాయి. మరోపక్క టీఆర్ఎస్, సీపీఐ జతకట్టాయి. దాదాపు పది వార్డుల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 30 వార్డుల్లో 175 మంది త లపడుతున్నారు. దేవరకొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒంటరిగా.. దేవరకొండ నగర పంచాయతీలో మొత్తం 99 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. 8, 9, 12 వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు చైర్మన్ స్థానానికి ఎంపికయ్యే అవకాశముంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒంటరిగానే బరిలోకి దిగాయి. టీడీపీ, బీజేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి. హుజూర్నగర్... హుజూర్నగర్ నగరపంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, టీడీపీలు కూటములుగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, సీపీఐ కూటమిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌కు ఇక్కడా రెబల్స్పోరు తప్పడం లేదు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్‌కు, రెండు వార్డుల్లో టీడీపీకి రెబల్స్ బెడద ఉంది. మొత్తం 20వార్డుల్లో 98 మంది అభ్యర్థులు తలపడనున్నారు. నల్లగొండలో టీడీపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్ బెడద నల్లగొండలో కాంగ్రెస్, టీడీపీకి అధికంగా రెబల్స్ భయం పట్టుకుంది. 40 వార్డుల్లో దాదాపు 20వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. టీడీపీకి కూడా 16 వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. కొన్ని వార్డుల్లో టీడీపీ, బీజేపీ, ఇంకొన్ని వార్డులో సీపీఎం, టీఆర్ఎస్ కలిసి సర్దుబాటు చేసుకున్నాయి. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వారు కలిసి తిరుగుతున్నారు. అంతేగాక ఇక్కడి మొత్తం 40 వార్డులో ఉండగా వీటిలో 220మంది తుది బరిలో నిలిచారు. -
పందెంరాయుళ్ల అరెస్ట్
కోదాడరూరల్, న్యూస్‌లైన్ మండలంలోని నల్లబండగూడెం-రెడ్లకుంట గ్రామాల మధ్య గల మామిడితోటలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై గురువారం కోదాడ రూరల్ పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కోడు పుంజులు, నాలుగు కార్లు, రెండు ఆటోలు, నాలుగు ద్విచక్రవాహనాలు, రూ. 85,100 నగదు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు. మామిడితోటలో కోడి పందెలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్లు సీఐ మొగలియ్య, ఎస్ఐ జి.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిందితుల్లో కృష్ణాజిల్లా గన్నవరం, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, ప్రకాశం జి ల్లాలకు చెందినవారు ఉన్నట్లు వివరించారు. నింది తులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరం తా రామాపురం క్రాస్ రోడ్డులోని పాత ఇనుము వ్యా పారం చేసే వ్యక్తి సహకారంతో ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్స్ బ్రహ్మం, రమేష్, సంజీవ్, శ్రీకాంత్, సత్యం పాల్గొన్నారు. -
జాతి వైరాన్ని మరచిన వానరం, మార్జాలం
-
తల్లిదండ్రుల ఒత్తిడే ఆ విద్యార్థిని ప్రాణం తీసిందా?
నల్గొండ: ఆ విద్యార్థిని అప్పటి వరకు బాగానే ఉంది. క్లాస్‌కు కూడా వెళ్లింది. ఇంతలో ఏమైందో ఏమో, తాను చదువుతున్న స్కూల్ భవనం పైనుంచి దూకేసింది. నిండు ప్రాణాలను బలవంతంగా తీసేకుంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. నల్గొండ జిల్లా కోదాడలో ఈ దుర్ఘటన జరిగింది. విగతజీవిగా మారిన ఆ అమ్మాయి పేరు రిషిత. ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తెలంగాణ బంద్ కావడంతో టెన్త్ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒక గంట క్లాస్ మాత్రమే పెట్టారు . క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి బయల్దేరిన రిషిత, బుక్స్ మర్చిపోయానంటూ మళ్లీ లోపలికి వెళ్లింది. అంతే ఇక తిరిగిరాలేదు. వాచ్‌మేన్, తోటి విద్యార్థులు చూస్తుండగానే స్కూల్ 5వ అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రిషిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిషిత తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. కూతురి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిషిత కూడా బాగానే చదువుతుందని, మంచి మార్కులు తెచ్చుకుంటుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం రిషితపై తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, అందువల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సింగారానికి ‘వల’
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :నడిగూడెం మండలం సింగారం గ్రామ పరిధిలోని చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకునేందుకు కొందరు వల పన్నారు. వారి ప్రయత్నం ఫలిస్తే రెండు మంచినీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది. కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గం పరిధిలోని 27గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు చేపల పెంపకానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింగారం చెరువు ప్రతిఏటా సాగర్ నీటితో కళకళలాడుతోంది. దీనిని మంచినీటి కోసం ఉపయోగించుకోవడానికి జిల్లా అధికారులు ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 2009లో *14 కోట్లతో నాబార్డు సహకారంతో చెరువుకు సమీపంలో మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోదాడ నియోజకవర్గం పరిధిలోని 27 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కోదాడ పట్టణానికి నీరందించేందుకు.. సింగారం చెరువు ద్వారా కోదాడ పట్టణానికి మంచినీటిని అందించేందుకు 2011లో *9 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. దీని కోసం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డిపాలెం వద్ద ఫిల్టర్బెడ్లను కూడా నిర్మించారు. దీని పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే వేసవిలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగానే ఈ చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకొచ్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువును రిజర్వాయర్‌గా మార్చక ముందు దీనిలో గ్రామానికి చెందిన మత్స్య సహకార సొసైటీ ఆధ్వర్యంలో చేపల పెంపకం చేపట్టేవారు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి భారీగానే దండుకునేవారు. పైరవీల జోరు.. కలెక్టర్‌పై ఒత్తిడి చేపల ఆదాయంపై కన్నేసిన రాజకీయ నాయకులు మత్య్సకారుల ఉపాధిని సాకుగా చూపి చేపల పెంపకానికి అనుమతి పొందేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కొందరు కలెక్టర్‌ను కూడా కలిశారు. అయితే నిబంధనల ప్రకారం ఓ కలెక్టర్ నిషేధించిన దానిని తాను మళ్లీ అనుమతి ఇవ్వలేనని ప్రస్తుత కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయనపై రాజధాని స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తెప్పలు, చిన్న వలలతో నష్టం లేదు చెరువులో మత్య్సకారులు తెప్పలపై, చిన్న వలలను ఉపయోగించి చేపలు పట్టుకోవడం వల్ల పెద్ద ఇబ్బం ది ఉండదు. ప్రతిరోజూ ఇలాగే చేపలు పట్టుకుంటే ఎవరికీ నష్టముండదు. కానీ, సొసైటీ వారు చేపల పెంపకాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. వారే చేప పిల్లలను పోసి, ఫీడ్ వేసి, చేపలు పట్టుకుంటారు. వాటి బరువును బట్టి కిలోకి ఇంత అని సొసైటీకి డబ్బు చెల్లిస్తారు. ఈ డబ్బును సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులు పంచుకుంటారు. వీరిలో కొద్దిమందికి మాత్రమే చేపలు పటేట్టప్పుడు కాంట్రాక్టర్ పని కల్పిస్తాడు. ఈ విధంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల ఫీడ్ వేసేందుకు, చేపలు పట్టడానికి పెద్ద వలలు వాడడంతో చెరువు నీరు కలుషితం అవుతుందని అధికారులంటున్నారు. తెప్పలపై గ్రామానికిచెందిన మత్స్య కారులే చేపలు పట్టుకుంటే అభ్యంతరం చెప్పేవారు ఉండరని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తేనే ఇబ్బందులుఎదురవుతాయన్నారు. -
పరిహారం.. ఫలహారం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెల్లటూరులో పునరావాస ప్యాకేజీ విషయంలో కోదాడలోని ప్రత్యేక కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. మేళ్లచెరువు మండలం వెల్లటూరులో ముంపు బాధితుల పేరుతో భారీగా దండుకున్నారు. గ్రామానికి చెందిన 12మందికి రెండేసిసార్లు, ఒక కుటుంబానికి మూడుసార్లు చెక్కులు జారీ చేశారు. అంతేకాకుండా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ పరిహారాన్ని ఇచ్చి దానిలో కూడా సగానికి పైగా తమ వాటాగా పుచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘనత వహించిన ఈ అధికారులు గ్రామంలో మరణించిన దాదాపు 20మంది పేరుతో *23 లక్షలకు చెక్కులు జారీ చేశారు. ఈ విధంగా ఈ ఒక్క గ్రామంలోనే అధికారులు 49 లక్షల రూపాయలను అధికంగా, అక్రమంగా చెల్లించి దానిలో సింహభాగం వారే పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. చనిపోయినవారికి అందజేశారట.... వెల్లటూరు గ్రామంలో దాదాపు 20మంది మృతి చెందారు. వీరికి కూడా అధికారులు చెక్కులు జారీ చేశారు. బినామీ పేర్లతో అకౌంట్లను తెరిచి దానిలో ఈ చెక్కులను వేసి ఏటీఎం కార్డుల ద్వారా ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తుంది. ఒక్క గ్రామంలోనే 20మంది మృతులకు జంకు, బొంకు లేకుండా చెక్కులను జారీ చేయడంలో కోదాడలోని పులిచింతల కార్యాలయ ఉద్యోగుల చేతివాటం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహరంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు వాటాలు పంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ మొత్తం వ్యవహరంలో జోక్యం చేసుకుని విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కనీస చర్యలు కరువు.. కోదాడ పులిచింతల అధికారులు చేస్న్ను అక్రమాలపై ‘సాక్షి’ గత డిసెంబర్ 17న ‘డబ్బుల్..డబుల్’ శీర్షికన భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. దాదాపు 30 లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించిన విషయాన్ని సవివరంగా సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. ఇదంతా మేళ్లచెరువు మండలంలోని చింత్రియాల గ్రామంలో జరిగిన కుంభకోణం మాత్రమే. దీనిపై సూర్యాపేట ఆర్డీఓ విచారణ చేస్తున్నట్లు అప్పుడు అధికారులకు చెప్పారు. ఇది చెప్పి నెల రోజులు దాటినా దీనిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. -
డబుల్ డబ్బుల్
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :కోదాడలో ఉన్న పులిచింతల కార్యాలయంలోని ఓ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి తన చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా 30 లక్షల రూపాయలు కాజేశాడు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారాన్ని ఫలహారంలాగా బొక్కేశాడు. కార్యాలయంలో ఉన్న ఉన్నత ఉద్యోగిని డమ్మీగా చేసి ఆ అధికారి.. అన్నీ తానై కార్యాలయంలో చక్రం తిప్పుతున్నాడు. ఈ కార్యాలయం పరిధిలో ఉన్న 8 గ్రామాలలో ఒక్క గ్రామంలోనే వెలుగు చూసిన అవినీతి ఇది. ఇదే అధికారి.. చనిపోయిన దాదాపు 100మంది పేరు అసలేం జరిగిందంటే...పులిచింతల ముంపు గ్రామమైన చింతిర్యాలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమయంలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. గ్రామంలో 13మంది పేర్లను రెండుసార్లు జాబితాలో పొందుపర్చారు. వారికి రెండుచోట్ల గుర్తింపు నంబర్లు ఇచ్చి చెక్కులు జారీ చేశారు. జాబితాలో కొందరి పేర్లు రెండుసార్లు నమోదైన విషయాన్ని సదరు కార్యాలయ అధికారులే ఁలేఖ నంబర్ బి/282/2012 తేదీ 02-07-12న) స్వయంగా ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ విషయాన్ని మరిచి ఓ అధికారి తెరవెనుక చక్రం తిప్పి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తొలగింపు జాబితాను తొక్కిపట్టి రెండుసార్లు పరిహరం చెక్కులు జారీ చేశాడు. అంతే కాకుండా ఈ గ్రామంలో చనిపోయిన ఐదుగురికి కూడా చెక్కులు జారీ చేశాడు. వాస్తవానికి భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పరిహారం చెక్కులు ఇవ్వవచ్చు. ఇద్దరూ చనిపోయినపుడు చెక్కులు జారీ చెయ్యకూడదు. ఈ నిబంధనను కూడా తుంగలో తొక్కి 8 గ్రామాలలో దాదాపు 100మంది చనిపోయిన వారి పేరుతో పరిహారం కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవిగో వాస్తవాలు.... మేళ్లచెరువు మండలం పులిచింతల ముంపు గ్రామమైన చింతిర్యాలలో మర్రి వెంకటరెడ్డికి (గుర్తింపు నంబర్ 100901 ద్వారా) రూ.లక్షా 77వేల 790ను మొదటి చెక్కుగా ఇచ్చారు. ఇదే వ్యక్తికి (ఐడీనెంబర్ 141001 ద్వారా) మళ్లీ లక్షా 62,665 రూపాయలు చెల్లించారు. బి.సైదులుకు(ఐడీ నంబర్ 105802 ద్వారా) మొదటిసారి 1,62,665 రూపాయలు, రెండోసారి (ఐడీ నంబర్ 108301) ద్వారా రూ.59వేలు చెల్లించారు. ఇదే గ్రామానికి చెందిన నత్తిపాటి సిద్దేశ్వరరావుకు (ఐడినంబర్ 117504 ద్వారా) మొదటిపారి లక్షా 62వేలు, రెండోసారి (ఐడీనంబర్) 117508 ద్వారా రూ.87వేలు ఇచ్చారు. మొర్రిమేకల పిచ్చయ్యకు మొదటిసారి (ఐడీనంబర్118601ద్వారా) రూ.లక్షా 62వేలు, రెండోసారి (ఐడీనంబర్119103 ద్వారా) మరో రూ.లక్షా 62వేలు చెల్లించారు. సకినాల తిరుపతిరావుకు (ఐడీనంబర్ 120507ద్వారా) మొదటిసారి రూ.లక్షా 62వేలు, రెండవసారి (ఐడీ నంబర్ 120502 ద్వారా) రూ.87వేలు ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన బడుగుల చిన్న వెంకటేశ్వర్లుకు (ఐడీ నంబర్ 123301 ద్వారా) మొదటిసారి రూ.లక్షా 47వేలు, మరోసారి ఇతనికే (ఐడీ నంబర్ 134401ద్వారా) రూ.లక్షా 62వేలు ఇచ్చారు. వీరితో పాటు బడుగుల మనోహర్, గడ్డం కోటేశ్వరరావు, చెడపంగు మరియదాసు, చెడపంగు కోటయ్య కొడుకు మరియదాసుకు, విక్టరి బాబు, అమరబోయిన లక్ష్మయ్య, రుంజా జెమ్స్లకు రెండు ఐడీ నంబర్ల ద్వారా ఒక్కొక్కరికి అదనంగా రూ.లక్షా 62 వేల చొప్పున చెల్లించారు. అమరబోయిన లక్ష్మయ్యకు రెండుసార్లు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు చెల్లించటమే కాకుండా రెబల్లె గ్రామంలో కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. ఈ విధంగా 13మందికి కలిపి 20 లక్షల రూపాయలు అదనంగా చెల్లించారు. రెండోసారి ఇచ్చిన చెక్కుల్లో అధిక భాగం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కాజేసినట్లు సమాచారం. చనిపోయిన వారినీ వదల్లేదు.... చింతిర్యాలలో చనిపోయిన ఐదుగురి వ్యక్తులకు చెక్కులు జారీ చేసి దాదాపు 10 లక్షల రూపాయలు కాజేశారు. గ్రామానికి చెందిన భీమా శేషయ్య (ఐడీ నంబర్ 111401), షేక్ హుస్సేనమ్మ (ఐడీ నంబర్ 135608), కొడిమెల తిరపతమ్మ (ఐడీ నంబర్ 137206), అంగులూరి లక్ష్మి (ఐడీ నంబర్ 140801), సంగు పిచ్చమ్మకు చనిపోయిన తర్వాత చెక్కులను జారీ చేశారు. అకౌంట్ పే చెక్కులు ఎలా పాసయ్యాయో అధికారులకే తెలియాలి. ఇది ఈ కార్యాలయం కింద ఉన్న ఒక గ్రామం పరిస్థితి. మిగిలిన ఏడు గ్రామాలలో కూడా దాదాపు 95మంది చనిపోయిన తర్వాత సదరు డీటీ చెక్కులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ జరిపి బాధితుల సొమ్ము స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అల్లుడి కోసం గిల్లుడు... కోదాడలోని పులిచింతల కార్యాల యంలో పనిచేస్తున్న ఓ అధికారి తన అల్లుడి పేరుతో భారీగా ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు పథకం పన్నాడు. ముంపు గ్రామమైన తమ్మారంలో ఇతని అల్లునికి ఓ పాత ఇల్లుంది. దాని విలువ గతంలో అధికారులు రూ.11 లక్షలుగా నిర్ణయించగా, ఆ అధికారి తన చేతివాటంతో దాని విలువను ఏకంగా రూ.33లక్షలకు పెంచేశాడు. కొందరు అడ్డుచెప్పడంతో తాత్కాలికంగా ఆగిన ఆయన.. ప్రస్తుతం 33లక్షల రూపాయలను విడుదల చేయించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. -
సతీష్.. బెస్ట్ స్టూడెంట్
కోదాడ: చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని నిరూపించాడీ యువకుడు. పరీక్షల సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి చనిపోయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు. పీహెచ్‌డీలో ఫస్ట్ రావడమే కాదు...కర్ణాటక రాష్ట్ర ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన పేద యువకుడి విజయగాథ ఇది. నల్లగొండ జిల్లా కోదాడలోని రావులపెంట వెంకయ్య, ఆదిలక్ష్మి దంపతులు నిరుపేద కూలీలు. వెంకయ్య స్వగ్రామం నల్లబండగూడెం. రాళ్లు కొట్టేపని చేస్తూ ఉపాధి కోసం కోదాడకు వలస వచ్చారు. తమ నలుగురు కుమారుల్లో చిన్నవాడైన సతీష్‌ను చదివించారు. చిన్నతనం నుంచే సతీష్ చదువులో చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో 557 మార్కులు సాధించడంతో కోదాడ క్రాంతి కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది. 907 మార్కులు సాధించిన సతీష్‌కు మెడిసిన్‌లోనూ మంచి ర్యాంకే (3605) వచ్చింది. మహబూబ్‌నగర్ హార్టికల్చర్ వర్సిటీలో బీఎస్సీ(హార్టికల్చర్)లో చేరాడు. విజయవంతంగా డిగ్రీ పూర్తిచేసి, వర్సిటీలో టాపర్‌గా నిలిచాడు. బీఎస్సీ పూర్తయ్యాక ఉద్యానవనశాఖలో ఉద్యోగం వచ్చింది. పెద్ద చదువుల కోసం వచ్చిన కొలువును వదులుకుని పీజీకి ప్రిపేర్ అయ్యాడు. జాతీయస్థాయిలో 136 ర్యాంకు సాధించాడు. బెంగళూర్ భాగల్కోట హార్టికల్చర్ వర్సిటీలో చేరి, 96శాతం మార్కులతో పీజీ పూర్తి చేశాడు. పుట్టెడు దుఖంలోనూ.... ఉద్యానవనశాస్త్రంలో డాక్టరేట్ సాధించాలనే ఆశయంతో సతీష్ పీహెచ్డీ ప్రవేశపరీక్షకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఈ ఏడాది అక్టోబర్ మొదటివారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తండ్రి వెంకయ్య మృతి చెందాడు. పుట్టెడు దు:ఖంలోనూ అక్టోబర్ చివరివారంలో జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. భాగల్కోట వర్సిటీస్థాయిలో పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. సతీష్ అకడమిక్ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం 2013 సంవత్సరానికి ‘‘బెస్ట్స్టూడెంట్’’గా ఎంపిక చేసింది. ఈనెల 28న బెంగళూరులో జరిగే ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా సతీష్ బెస్ట్స్టూడెంట్ అవార్డు, బంగారు పతకం అందుకోనున్నారు. కాగా, దీన్ని తన నాన్నకే అంకితమిస్తున్నానని సతీష్ పేర్కొన్నాడు. -
కోదాడలో రేషన్ మాఫియా
కోదాడటౌన్, న్యూస్‌లైన్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వాటిని రీ సైక్లింగ్ చేస్తూ కొందరు అక్రమార్కులు లక్షలార్జిస్తున్నారు. ప్రతి రోజూ మూడు జిల్లాల నుంచి రేషన్ బియ్యం కోదాడకు చేరుతున్నాయి. దీంతో కోదాడ నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యానికి అడ్డాగా మారింది. దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హడావిడి చేసి దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం పట్టుబడినా దాని మూలాలు కోదాడలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాపారం చేసే వారికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా లభిస్తుండటంతో అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతున్నారు. మరో పక్క ఒకరి అక్రమ నిల్వల సమచారం మరొకరు అధికారులకు చేర వేస్తున్నారు. వందల టన్నుల రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోదాడలో ఆరుగురు వ్యాపారులు భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీరిపై ఇప్పటికే అనేకసార్లు దాడులు నిర్వహించారు. అయినప్పటికీ ఈ వ్యాపారం ఆగడం లేదు. పాత మిల్లులను అడ్డాగా చేసుకొని వీరు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. లారీల్లో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోదాడ మండలం కూచిపూడిలో ఓ పాత మిల్లులో అధికారులు గడిచిన నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడులు నిర్వహించి భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అజాద్‌నగర్‌లో ఉన్న ఓ వ్యాపారిపై కూడా నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేశారు. విచిత్రమేమిటంటే దాడులు జరిగిన మరుసటి రోజు నుంచే వీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు వారం రోజుల కిత్రం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీలో తరలిస్తుండగా అక్కడి అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ బియ్యంతో కోదాడ మండలం కూచిపూడికి చెందిన ఓ వ్యాపారికి సంబంధం ఉన్నదని తేలింది. శనివారం రోజు కూచిపూడిలో దాడులు చేసి 70 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. మరుసటి రోజు ఆదివారం కోదాడ పట్టణంలోని రామిరెడ్డిపాలెం రోడ్డులో ఉన్న మరో వ్యాపారి నిల్వ చేసిన రేషన్ బియ్యంపై అధికారులు దాడులు చేసి 69 కింటాళ్ల బియ్యం పట్టుపడ్డాయి. కాగా ఇక్కడ బియ్యం నిల్వ చేసిన విషయాన్ని పట్టణంలోని హెచ్‌పీ బంక్ సమీపంలో ఉన్న మరో రేషన్ బియ్యం వ్యాపారి అందించాడని, అతని మిల్లుపై కూడా దాడులు చేయాల్సిందేనని అధికారులతో బాధితుడు వాగ్వివాదానికి దిగాడు. దాంతో అధికారులు అక్కడ కూడా దాడులుచేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తిలాపాపం తలాపిడికెడు ఇటీవల కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని చేస్తున్న వారిని డబ్బుల కోసం ఓ రౌడీషీటర్ బెదిరించాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారులు కూడా అధిక లాభాలు వస్తుండటంతో గుట్టు బయటపడకుండా అందరికీ పంపకాలు చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి నెల మామూళ్లను వీరివద్ద పసూలు చేస్తూ పంపకాలు చేసుకుంటున్నారు. -
‘రియల్’ మోసం..!
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :కోదాడ-మునగాల మండలాల సరిహద్దులోని ద్వారకానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్లో భారీ కుంభకోణం జరిగింది. రియల్టర్ ఒకే భూమిని డెవలపర్స్‌కు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చి, అదే భూమిని మరొకరికి సేల్ కమ్ జీపీఏ (విక్రయంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేశాడు. దీంతో ఇక్కడ డెవలపర్స్ కట్టిన ఇళ్లను కొన్న వారు లబోదిబోమంటున్నారు. జరిగిన మోసంపై డెవలపర్ మామిడి రామారావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు రియల్టర్ పి. రామాంజనేయులగౌడ్, డెవలపర్లో ఒకరైన పందిరి రాజశేఖర్‌పై కేసు నమోదైంది. కోదాడ మండలం కొమరబండ సమీపంలో ద్వారకానగర్ పేరుతో బీబీనగర్‌కు చెందిన రామాంజనేయులుగౌడ్ 30ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దానిలో 24వేల చదరపు గజాలను(120 ప్లాట్లు) కోదాడకు చెందిన రాజశేఖర్, రామారావు, జనార్దన్, రాజవర్ధన్రెడ్డిలకు డెవలప్మెంట్ కోసం విక్రయ అగ్రిమెంట్ చేశాడు. వీరు దీని కోసం భారీ ఎత్తున డబ్బు చెల్లించారు. ఈ భూమిలో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తూ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ డెవలప్మెం ట్లో పై నలుగురితో పాటు రియల్టర్ రామాం జనేయులుగౌడ్ 50 శాతం భాగస్వామిగా ఉన్నాడు. దీంతో డెవలపర్స్ ఇళ్లను నిర్మిస్తున్నామని పలువురు ఉద్యోగులకు, చిరువ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని ప్లాట్లను అమ్మడంతో పాటు వాటిలో ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 30కి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. వీటికి కోదాడకు చెందిన బ్యాంక్ రుణాలూ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇపుడే మొదలైంది. డెవలప్మెంట్కు ఇచ్చిన స్థలం మరొకరికి అమ్మకం ద్వారకానగర్‌లో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చెసేందుకు రియల్టర్ ఇచ్చిన 24వేల గజాలలో(120 ప్లాట్లు) విక్రయ అగ్రిమెంట్‌కు ముందుగానే 4వేల గజాలను (డాక్యుమెంట్ నెంబర్ 5953/2011 ద్వారా) ఒకరికి, అగ్రిమెంట్ తర్వాత మరొకరికి (డాక్యుమెంట్ నెంబర్ 10397/2012 నుండి 10402/12 వరకు), మరో 10వేల గజాలను ఆరుగురు వ్యక్తులకు అమ్మాడు. అయితే, ఈ అమ్మకం వ్యవహారం తెలియని డెవలపర్లు వాటిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. అవి వివిధ దశలలో ఉన్నాయి. కొన్నింటిని విక్రయించి కొన్న వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయమని రియల్టర్‌ను కొంతకాలంగా కోరుతున్నారు. కానీ, రియల్టర్ ఆ భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించి ఉండడంతో తన బండారం బయటపడుతుందని వారిని తిప్పుతున్నారు. డెవలపర్లలో ఒకరైన పందిరి రాజశేఖర్ ఈ మోసంలో భాగస్వామిగా మారాడని అనుమానం వచ్చిన ఇతర భాగస్వాములు ఈసీలు తీయించారు. దీంతో అప్పటికే ఆ భూమిని ఏడు డాక్యుమెంట్ల ద్వారా అమ్మినట్లు తేలింది. దీంతో డెవలపర్స్‌తో పాటు ప్లాట్లు కొన్న వారు రియల్టర్‌ను నిలదీయగా తనకేమీ తెలియదని అంతా తన అనుచరునిపై నెట్టి తప్పించుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన బాధితులు మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోదాడ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు కోర్టు ఆదేశించింది. దీంతో కోదాడ పట్టణ పోలీసులు రియల్టర్ రామాంజనేయులుగౌడ్, అతని అనుచరుడు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ దొంగ అరెస్ట్.. రిమాండ్
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ : కోదాడ పట్టణ పరిధి శ్రీరంగాపురంలో ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన వీరబాబు అనే వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగాపురానికి చెందిన అంకతి ప్రసాద్ ట్రాక్టర్‌ను శనివారం రాత్రి వంకా వీరబాబు దొంగిలించాడు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీరబాబు ట్రాక్టర్‌ను హుజూర్‌నగర్‌కు తీసుకువెళుతుండగా బాలాజీనగర్ వద్ద ఐడీ పార్టీ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరబాబును కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఐడీ పార్టీ సిబ్బంది సుందరయ్య, నర్సయ్య, యుగంధర్, శ్రీను, నరసింహారావులను పట్టణ సీఐ మధుసూదన్ అభినందించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.మృతులు, క్షతగాత్రులు కృష్ణా, ఒంగోలు జిల్లాలకు చెందిన వారు. కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన తుమ్మల నరేంద్ర కుమార్తెకు ఆరునెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చెకప్ కోసం శనివారం ఉదయం నరేంద్ర తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లా డు. చికిత్స అనంతరం వీరి మిత్రుడు వంగపాటి వెంకటేశ్వర్లు(32)తో కలిసి రాత్రి విజయవాడకు బయలుదేరారు. నరేంద్ర డ్రైవింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లు అతని పక్కన ముం దు సీటులో కూర్చున్నాడు.నల్లబండగూడెం వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న ట్యాంకర్‌ను నరేం ద్ర గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరేంద్ర, అతని భార్య శిరీష, కుమారుడు యశ్వంత్ సాయి, కుమార్తె కీర్తికకు గాయాల య్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ, కారు ఢీ.. చింతపల్లి:హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మెదిరిమెల్లే గ్రామానికి చెందిన మన్నె బసవయ్యచౌదరి (52) భార్య వెంకటరాజేశ్వరి స్వగ్రామానికి కారులో వెళ్లివస్తుండగా మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ సమీపంలో మల్లెపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బసవయ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకటరాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థాని కులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
నిధులు, విధులు అవసరం:విజయమ్మ