
కోదాడ: 2004 ఎన్నికల్లో ఓ యువ నాయకురాలు హెలికాప్టర్ ద్వారా సాగించిన ప్రచారం అప్పట్లో కొత్త ఒరవడి సృష్టించింది. కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్. 2004 ఎన్నికల్లో ఆమె ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు ఆమె కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి ఆమె మాత్రం అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కోదాడకు వచ్చి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడ టికెట్ కోసం ప్రయత్నించారు.
ఒకదశలో ఆమెకే టికెట్ వస్తుందని ప్రచారం సాగింది. దీంతో అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కోదాడకు వచ్చే ముందు శ్రీకళారెడ్డి.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించారు. దాని ద్వారా బహిరంగసభ జరుగుతున్న కోదాడ పట్టణంలో లక్షల సంఖ్యలో కరపత్రాలను వెదజల్లారు. దీన్ని నాడు ప్రజలు వింతగా చూశారు. ఆ తరువాత ఆమె కొంతకాలం రాజకీయాల్లో తిరిగినా.. ఆ తరువాత రాజధానిలో వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు.
384 ప్రస్తుత ఎన్నికల్లో ‘ఎం3’ రకం ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించి ఒక ఈవీఎంను తయారు చేయొచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. ఒక బ్యాలెట్ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫొటో ఉంటాయి. ఒకే నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీచేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment