kona venkat
-
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. అంజలిపై సాఫ్ట్ కార్నర్వీరు రిలేషన్లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కోన వెంకట్ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.ఆస్తి కబ్జాతనకు ఒక సపోర్ట్ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడిందినన్ను ఫ్రెండ్, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్‌డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.చదవండి: #SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి? -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్‌మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్‌లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్‌కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ, సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు. ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సత్యార్థ్ బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్ సెట్‌తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్ క్లినిక్‌లో ల్యాబ్ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్ క్లినిక్స్‌ని డిజైన్ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్‌లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్‌లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్‌సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం. -
నేను గర్వంగా చెప్తున్నాను..సీఎం జగన్ పాలనపై కోన వెంకట్...
-
మిక్స్డ్ టాక్.. రూ.50 కోట్లు కావాలంటున్న డైరెక్టర్
ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ఆ దేవుడిని ఒకటే అడిగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్ కావాలి సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్‌ను కోన వెంకట్‌గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్‌ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్‌గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
ఎంతమంది అడ్డుపడినా ఆ రోజే సినిమా విడుదల చేస్తాం: కోన వెంకట్
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్‌కు నట్టి కుమార్ రాసిన లేఖపై కోన వెంకట్ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు. ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు ఎప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. -
గీతాంజలి మళ్లీ వచ్చింది ఎవరు ఆపినా ఆగేది కాదు ఏప్రిల్ 11 నే రిలీజ్
-
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్‌ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్‌తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్‌తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
పాఠశాలల్ని గొప్పగా తీర్చిదిద్దిన ఏపీ ప్రభుత్వంపై కోన వెంకట్ ప్రశంసలు
-
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్‌బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్‌ఫోన్‌తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
దటీజ్ జగన్: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem — KONA VENKAT (@konavenkat99) January 29, 2024 -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
గంజాయి స్మగ్లింగ్ చేశాను.. పోలీసులకు దొరక్కుండా బోర్డర్ దాటించా: కోన వెంకట్
ప్రముఖ రచయిత కోన వెంకట్‌కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్‌గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ రివీల్ చేశారు. ''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అమ్మేందుకు గోవా వెళ్లాం. మహబూబ్‌నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. -
జిన్నాగా వస్తోన్న మంచు విష్ణు, ఫస్ట్ లుక్ చూశారా?
విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్‌లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అలాగే చోటా కే నాయుడు కనిపించడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో హీరో అని పిలిస్తే పలకని మంచు విష్ణు జిన్నా అనగానే మాత్రం చటుక్కున లేచి నిలబడి దేనికైనా రెడీ అంటుండటం విశేషం. ఇక ఈ సినిమాకు ఇంతకుముందు విష్ణు నటించిన రెండు చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. Mass Comedy Action!! It's the #Ginna Style@starlingpayal @SunnyLeone @anuprubens #PremRakshith@avaentofficial @24FramesFactory#Ginna #GinnaBhai Teluguhttps://t.co/1nmoFTUkVT Hindihttps://t.co/5TllK3y72q Malayalamhttps://t.co/MYoyBXgX4H — Vishnu Manchu (@iVishnuManchu) July 11, 2022 చదవండి: వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు -
మంచు విష్ణు మూవీకి సరికొత్త టైటిల్, ప్రకటించిన టీం
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘జిన్నా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విష్ణు కెరీర్లో ఇది 19వ చిత్రం. డా. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత టైటిల్‌ని కూడా వెరైటీగా రివీల్ చేశారు. సునీల్, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఈషాన్ సూర్యతో కలిసి విష్ణు సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్‌గా ‘జిన్నా’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండగా సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. -
స్టార్ రైటర్‌తో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక.. త్వరలో సర్ప్రైజ్ అంటూ
తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ 7 వరకు కొనసాగిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం లేని పేరు. అయితే బిగ్‌బాస్ ఎలిమినేషన్ తర్వాత ప్రియాంకకు భారీగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్‌ను ప్రియాంక సింగ్ కలిసింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ప్రియాంక. ఈ పోస్ట్‌కు 'ఒక సర్ప్రైజింగ్ వార్త రాబోతోంది. మీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రియాంక. ఇది చూస్తుంటే కోన వెంకట్‌తో ప్రియాంక సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరీ అది ఏ సినిమా గురించో, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌గా మారింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక టాప్ 7 వరకు కొనసాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందం, ఆట తీరుతో అభిమానులను మూటగట్టుకున్న ప్రియాంక తర్వాత మానస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంపై ట్రోలింగ్ బారిన కూడా పడింది. ఏదైమైనా బిగ్‌బాస్ అనంతరం ప్రియాంకకు ఆఫర్లు రావడం ఆమె కెరీర్‌కు మంచి శుభపరిణామం. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్‌రాజ్
సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్‌రాజ్. ‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్‌ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి. -
గల్లీ రౌడీ మూవీ టీంతో ముచ్చట్లు
-
‘పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు. ఇక శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్‌తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్ అన్నాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేదే కథ. -
కపటనాటక సూత్రధారి పోస్టర్: కొత్తగా ఉంది కదూ!
భిన్నమైన కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. "ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది.. చూస్తుంటే ఎంతో డిఫరెంట్ సినిమా అని తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది.. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్" అన్నారు. ఈ సినిమాలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైనా దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్‌లు సహనిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్ ఎఫెక్ట్.. బన్నీ సినిమా ఆగిపోయిందా? బాలీవుడ్ హాట్‌ఫేవరెట్ కియారా -
పండుగ వేళ కోనంత కుటుంబంతో స్పెషల్ చిట్ చాట్
-
అందుకు కారణం సీఎం వైఎస్ జగన్: కోన వెంకట్
‘‘ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకోవడంలో కోన వెంకట్ స్పెషలిస్ట్. కామెడీ సినిమాలు తీయడంలో నాగేశ్వర రెడ్డిది ప్రత్యేక శైలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీవీ వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సందీప్ కిషన్ నాకు మేనల్లుడితో సమానం. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే నటుడు రాజేంద్రప్రసాద్. ‘గల్లీ రౌడీ’ హిట్ అయ్యి కోన, ఎంవీవీలకు బాగా డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే నాగేశ్వర రెడ్డిగారి సినిమాలు చూడాలి’’ అని నందినీ రెడ్డి అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఇంత త్వరగా పూర్తయిందంటే కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారాయన. ఈ విధానంలో పూర్తయిన తొలి చిత్రం మాదే. ఇందుకు జగన్‌గారికి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘లేడీస్ టైలర్’కు ఎంత మంచి అభినందన వచ్చిందో ‘గల్లీ రౌడీ’కి కూడా మంచి అభినందన వస్తుంది’’ అన్నారు నటుడు డా. రాజేంద్ర ప్రసాద్. ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను, కోన వెంకట్ చేసిన ‘గీతాంజలి’ కంటే ‘గల్లీ రౌడీ’ పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ కాకపోతే నా జడ్జ్మెంట్లో రాంగ్ ఉన్నట్లే. ఆ తర్వాత నేను సినిమాలు చేయలేనేమో? అనేంత నమ్మకంతో సినిమా సక్సెస్ అవుతుందని చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నేను కథ వినేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో వింటాను. అందరి సహకారం వల్లే మా సినిమాను 60 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘అందరూ నవ్వుకునే సినిమా ‘గల్లీ రౌడీ’’ అన్నారు సందీప్ కిషన్. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రచయితలు భాను, నందు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలపై కేటీఆర్‌కు కోన వెంకట్ ట్వీట్
నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్‌లోని అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల కార్పోరేషన్ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సయ్యద్ నగర్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్‌లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. Lot of Illegal constructions are coming up in Sayyed Nagar, Road no 12, Banjarahills... No sewerage, No sanitation, No roads.. but multi storied constructions in these slums will lead to major problems in future.. Please look into this 🙏 @CommissionrGHMC @KTRTRS @GHMCOnline pic.twitter.com/rHN7uNFySC — kona venkat (@konavenkat99) February 26, 2021 -
మల్లేశ్వరి బయోపిక్ షురూ
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్కు కోన వెంకట్ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్
‘‘సినిమాలను థియేటర్స్‌లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్. థియేటర్స్‌లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్‌లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు. -
మహమ్మారి బారినపడ్డ వుహాన్‌లో అడుగుపెట్టి..
హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టిన వుహాన్‌కు వెళ్లడమంటేనే డేంజర్ జోన్లోకి అడుగుపెట్టినట్టుగా అందరూ భావిస్తుంటే ఆ డాక్టర్ అక్కడి బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు చైనాలోని వుహాన్‌కు వెళ్లి వైరస్ రోగులకు వైద్య సేవలందించి తన ఔదార్యం చాటుకున్నారు. వాషింగ్టన్ డీసీలో నివసించే తెలుగు వ్యక్తి డాక్టర్ నాగరాజు చైనాలోని వుహాన్‌కు వెళ్లి కరోనా రోగులకు వైద్య సేవలందించారని, ఆయన తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన అనంతరం చైనీయులు ఆయనను ప్రత్యేక విమానంలో సాగనంపారని ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు నిబ్బరంగా నిలిచే ఇలాంటి వారికి మనం శాల్యూట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ నాగరాజు చూపిన చొరవను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. చదవండి : హనీమూన్‌కు కొత్తజంట: కరోనా ఎఫెక్ట్‌తో.. -
మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ
కలెక్షన్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ! లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్(ఎదుటి వ్యక్తిపై గల ఎనలేని ప్రేమను తెలియజేయటం కోసం ‘ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ ’ ను వాడతారు)’ అని అన్నారు. 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆయనకు పలువరు సీని, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ( అందరూ బాగుండాలని... ) My nanas birthhhhhdayyyyyyy! Every year today is a celebration! You truly are one man army! Love you to the moon and back! pic.twitter.com/T83BwBCKq0 — Lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2020 ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్‌బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!’ అని అన్నారు. వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు @themohanbabu గారికి జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/cGWGaP9tGT — kona venkat (@konavenkat99) March 19, 2020 కాగా, మోహన్ బాబు తన 70వ పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో కొద్ది రోజుల క్రితం ఓ లేఖను విడుదల చేశారాయన. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ( ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్‌బాబు ) -
‘మృగం’ స్క్రిప్ట్ రెడీ.. స్టార్ హీరోతో చేస్తా
‘‘రాహు’ సినిమాలో కథానాయికకు ఓ వ్యాధి ఉంటుంది. రక్తం చూసినప్పుడు కళ్లు కనిపించవు.. ఒత్తిడికి గురవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ప్రవేశిస్తే ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు సుబ్బు వేదుల. అభిరామ్ వర్మ, కృతీ గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా సుబ్బు వేదుల చెప్పిన విశేషాలు. ♦నాది వైజాగ్. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే రచయిత కోన వెంకట్‌గారితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కొన్ని కథలకు కలిసి పనిచేశాం. ఆయన బ్యానర్లో ‘గీతాంజలి 2’ సినిమా నేను చేయాల్సి ఉంది.. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాలేదు.. కానీ, ఆయన నాకు మంచి సహకారం అందించారు. ♦‘రాహు’సినిమాకి కథే హీరో. దాదాపు ఏడాది పాటు ఈ కథపై పనిచేశా. చిత్ర నిర్మాతలు కథ వినగానే సినిమా చేద్దామన్నారు. నా కథపైన నమ్మకంతో నేను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతల సహకారం మరువలేనిది. 52 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. ♦థ్రిల్లర్ జోనర్లో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్‌ని అందించడంతో పాటు తాజా అనుభూతి ఇస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్. నేను, నా కూతురు ఈ సినిమాలో నటించాం. ‘మధుర’ శ్రీధర్‌గారు మాకు మంచి సహకారం అందించారు. సురేష్ బాబుగారు మా సినిమాను విడుదల చేయడం, జీ చానల్ వాళ్లు డిజిటల్ రైట్స్ తీసుకోవడం విడుదలకు ముందే మేం సాధించిన విజయాలు. ♦డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలంటే ఇష్టం. ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రం నా ఫేవరెట్. ఇళయరాజాగారి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన కథానాయకుడు అల్లు అర్జున్.. ఆయన నటన సూపర్బ్. ♦పెద్ద స్టార్ట్స్‌తో సినిమా చెయ్యాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి. ‘రాహు’ తర్వాత స్టార్ హీరోలను సంప్రదిస్తా. ఒక స్టార్ హీరో కోసం ‘మృగం’ అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. -
గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన
మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం ‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు. ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్‌కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. – నటుడు చిరంజీవి ‘హ్యాపీడేస్’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా గొల్లపూడి మారుతీరావుగారితో పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – నటుడు నిఖిల్ నన్ను హీరో అని పిలిచేవారు నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్ చేశాం. ఆ ఫంక్షన్లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – నటుడు శివాజీరాజా అది ఆయనకే సాధ్యం గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది. టైమింగ్ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – రచయిత, నిర్మాత కోన వెంకట్ -
‘సైలెన్స్’లో అనుష్క ఉండేది కాదట
తమిళసినిమా: సైలెన్స్ చిత్ర ప్రచారం మొదలయ్యింది. ఇది ఐదు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో నిశ్శబ్దం పేరుతోనూ , తమిళం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో సైలెన్స్ పేరుతోనూ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటి అనుష్క. దాదాపు రెండేళ్ల తరువాత ఆమె ముఖానికి రంగేసుకుని నటించిన చిత్రం సైలెన్స్. మాధవన్, నటి అంజలి. శాలినిపాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. దీనికి టీజీ.విశ్వప్రసాద్, రచయిత కోన వెంకట్ నిర్మాతలు. భాగమతి వంటి సంచలన చిత్రం తరువాత నటి అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సైలెన్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించిందని సమాచారం. అసలు ఆ చిత్రంలో అనుష్క నటించి ఉండేదే కాదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ అన్నారు. చిత్ర ప్రచారంలో ముమ్మరంగా ఉన్న ఈయన ఒక భేటీలో పేర్కొంటూ సైలెన్స్ చిత్ర కథను అసలు అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని చెప్పారు. పలువురు నటీమనులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇదని చెప్పారు. అలా అనుష్కకు కూడా కథను చెప్పినట్లు తెలిపారు. ఆమె ఇందులో నటించడానికి ముందు అంగీకరించలేదని, ఆలోచించి చెబుతానని అన్నారన్నారు. ఆ తరువాత చాలా రోజుల వరకూ అనుష్క నుంచి బదులు రాకపోవడంతో వేరే నటిని నటింపజేయడానికి సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. అలాంటి సమయంలో అనుష్క నుంచి ఫోన్ వచ్చిందని, సైలెన్స్ చిత్రంలో తాను నటిస్తాను అని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఆమె మరికాస్త ఆలస్యంగా చెప్పి ఉంటే ఈ చిత్రంలో ఉండేదే కాదని అన్నారు. కాగా సైలెన్స్ చిత్ర విడుదలకు తేదీ ఖరారు చేశారు. జనవరి 31న చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ నిశ్శబ్దం
‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నాం. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్‌లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ ‘నిశ్శబ్దం’. అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్‌లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘టెక్నికల్‌గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్‌గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్. -
అందరూ..అనుమానితులే..
సాక్షి, హైదరాబాద్ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్ ఆర్టిస్ట్ ట్యాగ్‌లైన్) సినిమా టీజర్‌ను బుధవారం లాంచ్ చేసింది. మోషన్ టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్లో అనుష్క 'సాక్షి' పాత్రలో దివ్యాంగురాలిగా స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు. గోపీ సుందర్ బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది. హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యూటసన్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ప్రమాదకరంగా పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే: కోన వెంకట్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించటంతో మెట్రో, ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కోన వెంకట్.. కేటీఆర్, తో పాటు జీహెచ్ఎంసీలకు ట్యాగ్ చేశారు. మరి కోన ట్వీట్ అధికారులు ఎలా స్పదింస్తారో చూడాలి. Damaged condition of the PVNR expressway near Pillar No : 20 , please take care before it’s too late @GHMCOnline @KTRTRS Source: Facebook friend pic.twitter.com/1Disn6bMRy — kona venkat (@konavenkat99) September 26, 2019 -
మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం
‘‘హాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాంబినేషన్లో వస్తున్న తొలి ‘క్రాస్ఓవర్’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్ ఓవర్ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్ టైమ్‌లో షూటింగ్ పూర్తి చేశాం. సెప్టెంబర్‌లో టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ హిట్ చిత్రం ‘కిల్‌బిల్’ సినిమాలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్‌తో పాటు 7–8 మంది హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్‌కి అమెరికన్ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్‌కి స్కోప్ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
జగన్ నిజం..బాబు మోసం.. పవన్ విద్వేషం..
ఆయన కలం... హీరోతో డ్రామా పండించింది... హీరోయిన్ను దెయ్యంగా చూపించింది... విలన్‌తో కామెడీ కితకితలు పెట్టించింది...! ‘ఢీ’, రెడీలతో తెలుగు సినిమా దూకుడును పెంచిన ఆయనలో కథా రచయిత, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత, పాటల రచయిత, నటుడు ఉన్నారు. ఆయనే... స్టార్ రైటర్ కోన వెంకట్. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన వెంకట్... రాజకీయ దిగ్గజం, మహారాష్ట్ర మాజీ గవర్నర్ కోన ప్రభాకర్‌రావుకు స్వయానా మనుమడు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చి రెండున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై విశాఖపట్నంలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పరిస్థితిని ఆయన ఒక్క మాటలో చెబుతూ.. ‘వైఎస్ జగన్ నిజం... చంద్రబాబు మోసం.. పవన్ కల్యాణ్ గందరగోళం’ అని విశ్లేషించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... పవన్ కల్యాణ్ సినీ రంగంలో నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంతటి అనుబంధం ఉంది. కత్తి మహేష్ వివాద విషయంలో పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ తప్పటడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశంగా స్పందిస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయ్. ఈ ఐదేళ్లలో తెలంగాణలోని హైదరాబాద్‌లోనే కాదు. మారుమూల పల్లెల్లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పవన్ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. పవన్... జగన్‌పై నీవు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించు...నేను జనసేన జెండా పట్టుకు తిరుగుతా... మాయావతి వంటివారితో పొత్తు పెట్టుకున్న పవన్... ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం విషం చిమ్మడం అన్యాయం. ఎందుకు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం వైఎస్ జగన్‌ది. అటువంటి జగన్‌పై అకారణంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు చెబుతున్నా... పవన్ కల్యాణ్... వైఎస్ జగన్‌పై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం ఒక్కదానికైనా ఆధారం చూపించండి. అలా చేస్తే నేను జనసేన జెండా పట్టుకుని మీ వెంటే తిరుగుతా. మాయావతి మదర్ థెరిసాలా కనిపించిందా? పవన్‌కు సరిగ్గా ఎన్నికల ముందు, అర్ధాంతరంగా మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాయావతి మీకు మదర్ థెరిసాలా కనిపించిందా? నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిన మాయావతి వద్దకు వెళ్లి పొత్తు పెట్టుకోవడం ఏమిటో? దళితుల ఓట్లే కావాలనుకుంటే అంతకంటే నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతలు మీకు దొరకలేదా? మీ గందరగోళ రాజకీయం, తప్పటడుగులు ఇక్కడే తెలిసిపోతున్నాయి. జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి 2014లోనే వైఎస్ జగన్ సీఎం అయితే ప్రస్తుతం రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేది. ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు. అందుకు ఆయన ఎవ్వరినీ నమ్ముకోలేదు. కేవలం తన కష్టాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన తండ్రి డా.వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చేసిన ఓదార్పు యాత్రకు, ప్రజల కోసం చేసిన పాదయాత్రకు చాలా తేడా ఉంది. పాదయాత్ర జగన్‌లో చాలా మార్పు తెచ్చింది. ‘నాన్న నాకు అన్నీ ఇచ్చాడు.. ఇక నేను కేవలం ప్రజల కోసమే బతకాలి’ అనే లక్ష్యం వైఎస్ జగన్‌లో కనిపిస్తోంది. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తేనే నవ్యాంధ్ర ఇప్పటినుంచైనా బాగుపడుతుంది. అందుకే నేను జగన్ నవ్యాంధ్ర ఆశాజ్యోతి అంటాను. బాబు వంటి విలన్‌ను సినిమాల్లోనూ సృష్టించలేను సినీ పరిశ్రమలో నాది సుమారు రెండున్నర దశాబ్దాల ప్రస్థానం. 54 సినిమాలకు రచయితగా పనిచేశాను. అందులో 90 శాతం విజయవవంతమైనవే. సినిమాల్లో ఎన్నో విలన్ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం నీచత్వం, భ్రష్టత్వమే. మొత్తం జీవితమంతా వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ మొదలు... 2014 ఎన్నికల్లో సీనియర్ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన వెన్నుపోటే పొడిచారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువెత్తు రూపం. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడు ఏమిటి? ఆయన బతికున్నారా లేదా? అని తెలియని పరిస్థితికి తెచ్చాడు. రక్త సంబంధీకులను కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. జూ.ఎన్టీఆర్‌ను ఎలా తొక్కొలని చూశాడో అందరికీ తెలుసు. కుమారుడు లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం చేసిన విషయం బహిరంగ రహస్యమే. చంద్రబాబుపై విమర్శలు ఎందుకు తగ్గాయో? చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయం అని గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్‌కల్యాణ్ చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు కూడా హర్షించారు. పవన్ ఇన్నాళ్లకు రాజకీయంగా సరైన దారిలోకి వచ్చారని అనుకున్నారు. మరి ఏమైందో తెలియదు? యూ టర్న్ అని చెప్పను గాని అకస్మాత్తుగా విమర్శల దాడి తగ్గించారు. అధికారపక్షాన్ని కాకుండా నిత్యం ప్రజలతో ఉండే వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. పవన్ కూడా పాదయాత్ర చేసుంటే... పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలపై మరింత అవగాహన వచ్చేది. అప్పుడు వాళ్లు చెప్పేది, వీళ్లు చెప్పేది విని మాట్లాడకుండా స్వయంగా ప్రజలతో మాట్లాడి అసలు సమస్యలేమిటో తెలుసుకునేవారు. సినీ గ్లామర్‌తో వెల్లువెత్తే అభిమానుల సమస్య మొదట్లో ఉన్నా, పాదయాత్ర చేసుకుంటూ పోతే అది తగ్గేది. స్టార్ హీరోల కంటే ఎక్కువ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న వైఎస్ జగన్ వేలాదిమంది పోటెత్తుతున్నా పాదయాత్ర చేశారు కదా? పవన్ కూడా అదే మాదిరి చేసుంటే ఆయనకు వర్తమాన రాజకీయాలపై స్పష్టత వచ్చేది. బ్రాహ్మణుడు చంద్రబాబుకు ఓటెయ్యకూడదు నేను సనాతన బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను. కానీ నేను సామాజిక బాధ్యత ఉన్న రచయితను. రచయితలకు కలం తప్ప కులం ఉండదు. నాది కులాంతర వివాహం. నా పెద్ద కుమార్తెది వర్ణాంతర వివాహం. కానీ బ్రాహ్మణులకు అనాదిగా చంద్రబాబు చేస్తున్న వంచనపై కడుపుమండి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్రాహ్మణులు పనికిరారని చంద్రబాబు భావిస్తుంటారు. అందుకే ఏ ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వరు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 294 నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కూడా ఒక్క టికెట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి. జంధ్యం వేసుకుని గాయత్రీమంత్రం చదివే ఒక్క బ్రాహ్మణుడు కూడా టీడీపీకి ఓటెయ్యకూడదని నేను బహిరంగంగా పిలుపునిస్తున్నా. సిగ్గు, శరం ఉంటే టీడీపీలో ఉన్న బ్రాహ్మణ నేతలు పునరాలోచన చేసుకోవాలి. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైఎస్ జగన్ బ్రాహ్మణ పక్షపాతి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు బాపట్లలో బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లిచ్చారు. ఈ ఒక్క విషయం చాలదా? బ్రాహ్మణులను వైఎస్ జగన్ ఎంత గౌరవిస్తున్నారో. అందుకే చెబుతున్నా... బ్రాహ్మణులారా, ఒక్క ఓటు కూడా బయటకి పోకూడదు. అన్ని ఓట్లూ వైఎస్ జగన్‌కే వేయండి. నవరత్నాలతో అందరి జీవితాలు బాగుపడతాయి మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా చిరస్థాయి పేరు సంపాదించారు. ఆరోగ్య శ్రీ. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్ ఇప్పటికీ పేదల గుండెల్లో కొలువై ఉన్నారు. మళ్లీ అంతటి పాలన ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే చూడగలం. ఆయన ప్రకటించిన నవరత్నాల గురించి నేను క్షుణ్నంగా తెలుసుకున్నా. ఆయన ఇంట్లో కూర్చునో, ఆఫీసులో కూర్చునో, పార్టీ నేతలతో మాట్లాడో నవరత్నాలు ప్రకటించలేదు. ఎండనక, వాననక రోడ్లపై ప్రజలతో తిరిగి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ తర్వాతే ప్రకటించారు. ఈ పథకాలతో బీదాబిక్కి జనమే కాదు అందరి జీవితాలు బాగుపడతాయి. సినీ పరిశ్రమలో జగన్ మద్దతుదార్లే ఎక్కువ సినీ పరిశ్రమలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుదార్లే ఎక్కువమంది ఉన్నారు. పవన్ కల్యాణ్‌ను మా సినీ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్‌కు మద్దతిచ్చేవారే అధికంగా ఉన్నారు. ఇక చంద్రబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విభజన తర్వాత సినీ పరిశ్రమ బాగోగులను ఆయన కనీసం పట్టించుకోలేదు. చివరగా ఒక్కమాట... నాకు రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. నేను వైఎస్సార్సీపీ నేతను కాదు. కనీసం కార్యకర్తను కూడా కాదు. కానీ వర్తమాన రాజకీయాలపై బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక రచయితగా ప్రజలు ఏ పక్షాన నిలవాలో సూచించాల్సిన కనీస కర్తవ్యం నాపై ఉంది. చంద్రబాబు అండ్ కో గిమ్మిక్కులతో కొందరు ప్రజలు, తటస్థులు గందరగోళానికి గురవుతుంటారు. అందుకే నా వంటి వాళ్లు బహిరంగంగా మాట్లాడాల్సిన సమయమిది. మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ఈ రాష్ట్ర గతి మారుతుంది. ప్రజల జీవనవిధానం మారుతుంది. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్ జగన్‌ను సీఎం చేయాలి. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
అనుష్క న్యూ లుక్.. ఇది జస్ట్ ఝలక్
జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి స్లిమ్ లుక్‌లోకి వచ్చేందుకు చాలా కాలంగా కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో అనుష్క లుక్ పైగా విమర్శలు వినిపించటంతో ఇక స్వీటీ కెరీర్ ముగిసినట్టే అని భావించారు. తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కాస్త తగ్గినట్టుగా కనిపించినా గతంలో కనిపించినంత గ్లామరస్‌గా మాత్రం కనిపించలేదు. దీంతో మరోసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్ మీద దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్ ఇచ్చాయి. వైట్ డ్రెస్‌లో స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న అనుష్క లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్ స్పందించారు. ‘ఇది జస్ట్ ఝలక్ అంతే.. సినిమాలోతన ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
అనుష్క కొత్త లుక్ చూశారా?
సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్‌ను మళ్లీ సృష్టించారు మన స్వీటి అనుష్క. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్‌ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ తరువాత అనుష్క భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే మళ్లీ ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేకపోయారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు స్వీటి ఆసక్తి చూపింస్తుండగా.. కోన వెంకట్ చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పారు. ఈ మూవీలోని అనుష్క లుక్‌ను కోన వెంకట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి క్రేజ్‌ను తీసుకువస్తుందో చూడాలి. We are super excited with the look of Anushka in our film. This would be her best look till date. I like this look too 👍 pic.twitter.com/7aDxK0xk0D — kona venkat (@konavenkat99) 25 December 2018 -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
‘సైలెంట్’ సినిమాలో అనుష్క
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్ ఇటీవల నిర్మాతగానూ మంచి విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణ సారధ్యంలో మరో సినిమాను ప్రకటించారు. బహు భాషా నటుడు మాధవన్, సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్కల కాంబినేషన్లో కోన వెంకట్ సహ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. సైలెంట్ పేరుతో సైలెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో నటించిన మాధవన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సైలెంట్ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నారు. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్లో అలరించనున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్‌గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్‌లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హోమ్‌వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్‌బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్‌గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్‌తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్‌ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్‌కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
‘నీవెవరో’ ఆడియో రిలీజ్
-
ఇంట్రస్టింగ్‌గా ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు (ఆదివారం) చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘నీవెవరో’ ఫస్ట్‌లుక్
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
‘నీవెవరో’ రీమేకా..?
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ప్రధాన పాత్రల్లో నీవెవరో పేరుతో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది.. అంధుడిగా కనిపించనున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మళయాల సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. రొమాంటిక్ యాక్షన్థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ధృవీకరించలేదు. -
నాని చేతుల మీదుగా టైటిల్ అనౌన్స్మెంట్!
కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు చిత్రయూనిట్. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్ నటించనున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. -
ఈవీఎంకు సరికొత్త అర్థం
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు భిన్నంగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా సహా రాజకీయ అంశాలపై స్పందించే టాలీవుడ్ రైటర్ కమ్ మేకర్ కోన వెంకట్ తన ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ గెలవటానికి ఈవీఎంలే కారణమంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)ను ఓపెన్ చేశారో.. అప్పుడే ఫలితం ఈవీఎం అని తేలింది. ఇంతకీ ఈవీఎం అంటే మరేమిటో కాదు.. ‘ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ’(ప్రతీ ఒక్కరూ మోదీకి ఓటేశారు) అంటూ కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా.. నో కామెంట్ అంటూ తెలివిగా వ్యాఖ్యానించారు. ‘చేయాల్సిన కామెంట్ అల్రెడీ చేసేశారు కదా! మీ టైమింగ్ సూపర్’ అంటూ అని కొందరు రీట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అది సెటైర్ అంటూ కోనపై మండిపడుతున్నారు. When they opened EVMs today in Karnataka (Electronic voting machines) ... The results are... EVM (Everybody Voted for Modi) ... No comments!! — kona venkat (@konavenkat99) 15 May 2018 -
కాలజ్ఞానమే యు
వైవైవీ క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వన్నెంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యు’. వివేక్ విశాల్, తరుణికా సింగ్, యామిని నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ‘‘గతంలో నేను కొన్ని డెమోస్ తీశాను. అందులో ఒక దాని పేరు ‘కాలజ్ఞానం’. ఆ డెమో న్యూయార్క్, బాంబే తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుపుకుంది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీస్తున్నాను. మనిషి సృష్టించుకున్న అభివృద్ధే వినాశకానికి కారణమని చెప్పబోతున్నా’’ అన్నారు. ‘‘25ఏళ్లుగా రామానాయుడు స్టూడియో, శబ్దాలయా స్టూడియోల్లో పనిచేశాను. నిర్మాతగా నాకిది తొలి సినిమా’’ అన్నారు మారుతి. ∙తరుణికా సింగ్, వివేక్ విశాల్, యామిని -
సినీ నటులపై కోన కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. రాజకీయనాయకులపై విమర్శలు చేస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘సినీరంగానికి చెందిన కొందరు నటులు సినిమాటిక్‌గా, స్టుపిడ్‌గా అనిపించే రాజకీయ సిద్ధాంతాలను చెపుతున్నారు. వారి ఆలోచన ఆచరణాత్మకగా ఉంటే అభినందించేవాన్ని.. కానీ అలా లేదు. వారు నిజాయితీ గత నాయకులను విమర్శించటం మానేసి, ప్రజా సమస్యలపైన దృష్టి పెడితే బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ వాఖ్యలు నటుడు శివాజీని ఉద్దేశించి చేసినవే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. Some actors from r film industry, started speculating some political theories which are sounding very cinematic and stupid... I appreciate them if they r more practical in their thinking... Instead of attacking geniune leaders, Pl focus on people and their problems brother !! — kona venkat (@konavenkat99) 24 March 2018 -
భావోద్వేగానికి లోనైన మంచులక్ష్మీ, కోన
సాక్షి, సినిమా : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రచయిత కోన వెంకట్, మంచులక్ష్మీలు భావోద్వేగంతో కూడిన సందేశాలను విడుదల చేశారు. ‘భారతీయ చలనచిత్ర రంగం ఒక దేవతను కోల్పోయింది’ అని ప్రముఖ రచయిత కొన వెంకట్ పేర్కొన్నారు. శ్రీదేవి మరణవార్త విని యావత్ ప్రపంచంతో తాను షాక్‌కి గురయ్యానని.. ఆమెతో కలిసి మామ్ చిత్రానికి తాను పని చేశానని ఆయన చెప్పారు. తాను ఆమెతో కలిసి పని చేసిన మొదటి చిత్రం అదేనని.. దురదృష్టవశాత్తూ అదే ఆమె కెరీర్ లో చివరి చిత్రం అవుతుందని ఊహించలేదని కోన తెలిపారు. ఆమె లేని లోటు ఎవరూ, ఎప్పటికీ పూడ్చలేరని, ఎన్ని యుగాలైన ఆ లోటు భర్తీ కాలేదని చెప్పారు. సౌమ్యురాలు.. సున్నితమైన వ్యక్తి, అందరినీ ప్రేమించే గుణం.. ఇలా ఎన్నో గొప్పలక్షణాలు ఆమెకున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కోన వీడియో సందేశంలో చెప్పారు. She loved cinema.. Cinema loved her more... Never thought that I was writing her last film.. MOM 🙏 pic.twitter.com/g9m1wIt3lA — kona venkat (@konavenkat99) 25 February 2018 ‘ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు’ శ్రీదేవి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదని నటి మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ‘ఆమె నటన నుంచి ప్రేరణ పొందని నటీనటులు లేరంటే అతిశయోక్తి కాదేమో. తెర వెనుకాల హుందాగా ఉండే శ్రీదేవి కెమెరా ముందుకు వస్తే నటనతో విజృంభించేవారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా పోషించే ఆమె ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు చాలా తీసుకునేవారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం శోచనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మంచులక్ష్మీ తెలిపారు. -
తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్
శ్రీదేవి మృతి పట్ల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. పలు సందర్భాల్లో శ్రీదేవి మీద తన అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ అవకాశం వస్తే ఆమెతో కలిసి నటించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ‘ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె గెలుచుకుంది. తిరిగి తను ఏ స్వర్గం నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నా. ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు’ అంటూ ట్వీట్ చేశాడు. హీరోయిన్ హన్సిక ‘నేను నమ్మలేకపోతున్నా. ఇది నిజం కాకూడదు. ఇంకా షాక్‌లోనే ఉన్నా. ఇది భారతీయ సినీ చరిత్రలోనే చీకటి రోజు. ఆమె లేని లోటును తెలియజేసేందుకు మాటలు సరిపోవటం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. యంగ్ హీరో నిఖిల్ ‘ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా.. అందం అంటే ఎప్పటికీ శ్రీదేవిగారే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్ నటి ఖుష్బూ, మెహరీన్, కోన వెంకట్, హరీష్ శంకర్, సుమంత్, ప్రియమణి, హన్సిక, అనీల్ రావిపూడి,ఈషారెబ్బా తదితరులు తమ సంతాపం తెలియజేశారు. She came. She saw. She conquered. And went back to the heavens from where she came. RIP Sridevi garu.IRREPLACEABLE pic.twitter.com/NB4GozzWYi — Jr NTR (@tarak9999) 25 February 2018 Shocked ! I can’t even believe this ... this can’t be true . Still in shock . This is the darkest day in Indian cinema . A legend , A true star , an act par excellence , any amount of words will fall flat to express the demise of #sridevi ji , gone to soon . — Hansika (@ihansika) 25 February 2018 At a loss for words! RIP #Sridevi garu!💔 pic.twitter.com/Ftk3n3rSms — Sumanth (@iSumanth) 25 February 2018 Shocked and feeling so sad that one of my idols whom I have always maintained was one of my inspirations to join the film industry is no more!!! RIP my idol! Forever you will remain in all our hearts!! #Sridevi 💔 — Priyamani Raj (@priyamani6) 25 February 2018 As a mark of respect for the late legendary actor #Sridevi, i change my DP for today.. Will miss your giggle and that laughter ma. — khushbusundar (@khushsundar) 25 February 2018 Unbelievable, deeply saddened to wake up to saddest news of legendary #Sridevi ji passing away, 🙏RIP,nothing can fill void of her loss to film industry,will always be someone to look up to #NaturalActress #SuperDancer #LovelyHumanBeing pic.twitter.com/lw2wTo7eX4 — Mehreen Pirzada (@Mehreenpirzada) 25 February 2018 Shocked😥.....Goddess #Sridevi Garu no more......... — Anil Ravipudi (@AnilRavipudi) 25 February 2018 Shocked beyond words. Grew up in awe of your talent. You gave us joy love and so many movies. Gone too soon. Rest in peace #Sridevi ma’am 💔 pic.twitter.com/QSGDbqWIcG — Eesha Rebba (@YoursEesha) 25 February 2018 -
సమంత మాయ కొద్దిసేపేనా?
సాక్షి, సినిమా : టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీ సమంత-నాగ చైతన్య వివాహం తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారు కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఇందులో సమంత కేవలం అతిథి పాత్రలోనే నటించబోతోందంట. ఈ చిత్రంలో కాసేపు కనిపించే ఓ పాత్ర కోసం దర్శకుడు నటీమణుల కోసం వెతుకుతుండగా.. సామ్ పేరును చైతూ సూచించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న హీరోయిన్ రోల్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ట్రాక్‌తో శివ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడంట. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్న చైతూ అవి పూర్తికాగానే శివ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సమంత రంగస్థలం, మహానటిలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. -
ఎంత సక్కగున్నావె లచ్చిమి.. ఎంతెంత బాగుందో!
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ.. ఎంతసక్కగున్నావె లచిమి.. ఎంత సక్కగున్నావె.. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే సేతికి అందిన సందమామలాగ.. ఎంత సక్కగున్నావే లచిమి.. ఎంత సక్కగున్నావె.. మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ.. ఎంత సక్కగున్నావె.. ముత్తెదువ మెళ్లో పసుపుకొమ్ములాగ.. ఎంత సక్కగున్నావె.. సుక్కల సీర కట్టిన ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావె.. అంటూ చిట్టిబాబు తన రామలక్ష్మీ కోసం పాడిన పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. పల్లె నేపథ్యాన్ని కళ్లకు కట్టెలా చంద్రబోస్ అందించిన సాహిత్యం, జానపద రీతిలో చెవులకు ఇంపుగా దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం, గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. శ్రోతలను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాటపై తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ రచయిత కోన వెంకట్ ప్రశంసల జల్లు కురిపించారు. సుకుమార్ ‘రంగస్థలం’ ట్రైలర్ ఎంతగానో నచ్చింది. కానీ ఈ పాట రంగస్థలంను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌కు, సంగీంత అందించిన డీఎస్పీకి మిలియన్ చీర్స్ అంటూ వర్మ ప్రశంసించారు. ‘చాలా అరుదుగా కొన్ని పాటలు మన గుండెల్ని తాకి, మన మనసుల్ని మీటి, మన జ్ఞపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంటాయి. ఇది అచ్చం అలాంటి పాటే’ అంటూ కోన వెంటక్ ట్వీట్ చేశారు. ఈ పాటకుగాను సమంత ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఈ పాటలో రాంచరణ్ కనబర్చిన హావభావాలు అద్వితీయమని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ లో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎంతసక్కగున్నావె.. లచిమి పాట రెండు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’ అంటూ రామ్‌చరణ్ వాయిస్‌తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది. -
కోన ట్వీట్‌పై కేటీఆర్ స్పందన ఏది?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్వీటర్ ద్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తూ సదరు శాఖలను అప్రమత్తం చేస్తుంటారు. సినీరంగంతోనూ కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వేడుకలకు అతిథిగా హాజరవ్వటమే కాదు, తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కేటీఆర్. అయితే సినీరంగంతో ఇంత సన్నిహితంగా ఉండే కేటీఆర్.. సినీ రచయిత కోన వెంకట్ చేసిన ఓ ట్వీట్‌పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్ (movierulz) వెబ్‌సైట్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కోరారు. తన మెసేజ్‌తోపాటు గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్స్ సైట్లో ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. కానీ ఈ విషయంపై కేటీఆర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఈ సైట్లో తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల పైరసీ లింక్‌లు కూడా రిలీజ్ అయిన 24 గంటలలోపే దర్శనమిస్తున్నాయి. @KTRTRS .. we request ur immediate intervention in taking severe action against this particular website called “movierulz” which is a major threat to TFI.. Please instruct concerned authorities to lock these people up for good and save us 🙏 Here’s is the evidence sir.. pic.twitter.com/r1tG5rDPKd — kona venkat (@konavenkat99) 12 February 2018 -
దుర్గమ్మ సేవలో హీరోయిన్ తాప్సీ
ప్రముఖ నటి తాప్సీ శుక్రవారం దుర్గగుడిపై సందడి చేశారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ కోన వెంకట్ శుక్రవారం దర్శించుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన తాప్సీ, కోన వెంకట్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ప్రత్యేక పూజలు జరిపించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం తాప్సీ మీడియాతో మాట్లాడారు. గతంలో పలుమార్లు అమ్మవారి గురించి తెలుసుకున్నానని, ఈసారి దర్శనం చేసుకోవడం తన అదృష్టమన్నారు. తాప్సీతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. -
మౌనమంటే ఇదేనా.. కత్తికి కోన ఘాటు కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఎడతెగని టీవీచర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. అటు పవన్ అభిమానులు మౌనంగా ఉండాలని కోన సూచించారు. దీంతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో భావించారు. కానీ, జనవరి 15వ తేదీ వెళ్లిపోయింది. ఇటు వివాదమూ సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం కత్తి మహేశ్ ట్వీట్.. కోన వెంకట్‌ను ఉద్దేశించి ‘ఎక్కడ ఉన్నారు సార్? నేను మౌనంగా ఉన్నా.. పవన్ కల్యాణ్, అతని అభిమానుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నా నుంచి నా కుటుంబానికి ఈ దాడులు విస్తరించాయి. నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కోన ఘాటుగా స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్లో పాల్గొన్నావు. పీకే, అతని అభిమానుల మీద దాడి చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలను కలిశావు. మౌనం అంటే నీ నిఘంటువులో వేరే అర్థం ఉందా’ అని ప్రశ్నించారు. దీనినిబట్టి పవన్ అభిమానులు, కత్తి మహేశ్ మధ్య గొడవకు ఫుల్స్టాప్ పెట్టేందుకు తెరవెనుక ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదా? కేవలం పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల సందర్భంగా రభస లేకుండా తాత్కాలికంగా వాయిదా వేసేందుకే కోన ఈ ట్వీట్ చేశారా? ఇకముందు కూడా ఈ వివాదం కొనసాగబోతుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Unfortunately, after my tweet on 7th, u continued ur debates on the same issue in few channels and also involved some student organisations in attacking PK & his fans.. Does “SILENCE” has different meaning in ur dictionary?? https://t.co/wXETH2BpbM — kona venkat (@konavenkat99) January 17, 2018 -
15న ఏం జరగబోతోంది?
టాలీవుడ్ విశ్లేషకుడు మహేష్ కత్తి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన భావిస్తున్న ఆయన ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ‘‘ మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అసలు ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పడితే అంత మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. “SILENCE IS A TRUE FRIEND WHO NEVER BETRAYS”.... I request everyone to maintain Silence till 15th January.. I request even Mahesh Kathi to maintain silence.. going to any media house or using any platform to speak against fans or PK will spoil the attempt to bring peace 🙏 — kona venkat (@konavenkat99) 7 January 2018 పూనమ్ కూల్ రియాక్షన్ ఇక తనపై మహేష్ కత్తి చేసిన విమర్శలపై నటి పూనమ్ కౌర్ నేరుగా స్పందించలేదు. కాకపోతే ట్విట్టర్లో మహేష్‌పై అనుచిత ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ఆమె రీ ట్వీట్‌తో సున్నితంగా మందలించారు. Who ever this is you are not going to degrade any ones mother ! I sincerely request ! Plz https://t.co/apmWDhSeu0 — Poonam Kaur Lal (@poonamkaurlal) January 7, 2018 -
రెండోసారి
‘గుండెల్లో గోదారి’ చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి–తాప్సీ మరోసారి జోడీ కడుతున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో ‘గీతాంజలి‘ చిత్రనిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రారంభం కానుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు మరో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ‘సరైనోడు, నిన్ను కోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆది ప్రస్తుతం ‘రంగస్థలం, అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు మంచి పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగానూ నటిస్తున్నారాయన. ‘వెన్నెల’ కిశోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్), సంగీతం: గోపీసుందర్. -
రామ్‌ని కోరి
సేమ్ బ్యానర్.. సేమ్ డైరెక్టర్.. సేమ్ రైటర్... కానీ హీరో చేంజ్ అయ్యాడట. ఏ బ్యానర్? ఏ డైరెక్టర్? ఏ రైటర్ అంటే.. డీవీవీ బేనర్, శివా నిర్వాణ, కోన వెంకట్. నాని హీరోగా శివా నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘నిన్ను కోరి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పుడు దానయ్య, శివా నిర్వాణ, కోన వెంకట్... రామ్‌ని కోరారు. రామ్ హీరోగా ఈ ముగ్గురూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. శివ చెప్పిన లవ్‌స్టోరీకి ఇంప్రెస్ అయ్యారట రామ్. అంతేకాదు.. ఈ సినిమాకి కూడా కోన వెంకట్నే స్క్రీన్‌ప్లే అందించనున్నారని సమాచారం. -
ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్‌కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్ డైరెక్టర్లే ఎన్టీఆర్ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేయడంతో కోన వెంకట్ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. ఎస్ఎస్ రాజమౌళి, వీ వినాయక్‌లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్ ప్లేస్‌లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. S.S.R & Koratala Shiva https://t.co/mxenAEjDs6 — kona venkat (@konavenkat99) 28 October 2017 -
కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్
నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కు స్టైలిస్ట్‌గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్‌గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్‌తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. తిక్క సినిమాలో గేయ రచయితగా ఆకట్టుకున్న నీరజ, త్వరలో ఓ సినిమాకు రచన చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రైటర్స్ అసోషియేషన్ లో పేరు కూడా రిజిస్టర్ చేయించుకున్న నీరజ, ఓ పెద్ద నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతుందట. త్వరలోనే నీరజ కథ అందించబోయే సినిమా ఎనౌన్స్మెంట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరి నీరజ కూడా అన్న కోన వెంకట తరహాలో కమర్షియల్ రైటర్ అనిపించుకుంటుందో లేక తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి. -
కోన వెంకట్‌తో సరదాగా కాసేపు
-
బాలీవుడ్ సినిమా అయినా.. గాడిలో పెడుతుందా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన వెంకట్ చేయి పడిందంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేంది. అయితే రాను రాను ఈ స్టార్ రైటర్ ఆ ఫాంను కోల్పోయాడు. పండగచేస్కో, అఖిల్, బ్రూస్ లీ, త్రిపుర, సౌఖ్యం ఇలా వరుస ఫ్లాప్‌లు కోక కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక తానే నిర్మాతగా మారి దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తూ తెరకెక్కించిన శంకరాభరణం కోన టాలెంట్ మీద అనుమానాలు కలిగేలా చేసింది. అయితే తరువాత డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోన కాస్త పరవాలేదనిపించాడు. టాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోవటంతో పరభాష ఇండస్ట్రీల మీద దృష్టిపెడుతున్నాడు కోన వెంకట్. ప్రస్తుతం ప్రభుదేవా తో కలిసి కోలీవుడ్‌లో రూపొందుతున్న అభినేత్రి సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాకు ఓ కథ వినిపించిన కోన, ఆ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ హీరోగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌కు కథ వినిపించిన కోన, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ లో అయిన కోనకు సక్సెస్ ట్రాక్ దొరుకుతుందేమో చూడాలి. -
కోలీవుడ్ లో 'గీతాంజలి'
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్‌లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్‌లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
కోలీవుడ్ గీతాంజలిలో జీవి
ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్‌లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్‌లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
ఆ ఇద్దరు విడిపోయినట్టేనా..?
కోన వెంకట్, గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ భారీ విజయాలతో ఇండస్ట్రీ ఫేట్ మార్చేసింది. ఒకే కథను మళ్లీ మళ్లీ రాస్తారన్న పేరున్నా, అదే కథను అన్నిసార్లు ఒప్పించటంలోనూ సక్సెస్ అయ్యారు కోన వెంకట్, గోపి మోహన్. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ మ్యాజిక్ పెద్దగా వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. షాడో, అల్లుడు శీను, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ రావటమే కాదు.. ఈ ఇద్దరి పెన్ను పవర్ తగ్గిపోయిందన్న అపవాదు కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ రచన మీద కన్న నిర్మాణ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో గోపి మోహన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు స్టార్ రైటర్లు పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోవటంతో ఇక మీదట వీరి కాంబినేషన్ కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలను వేదిస్తుంది. ఒక్కసారి దర్శకుడిగా మారిన తర్వాత తిరిగి రచయితలుగా పనిచేసే ప్రయత్నం చేయరు కనుక.. ఇక కోన వెంకట్, గోపి మెహన్ల జోడీ విడిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. -
నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!
- నిఖిల్ ‘‘ ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంటర్టైనింగ్ పార్ట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు ఉదయ్ పన్నెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’’ అని కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రథ మార్థంలో సప్తగిరి, సెకండాఫ్‌లో పృథ్విరాజ్‌ల కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అన్నారు.‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా రీచ్ అవ్వాలని ‘శంకరాభరణం’ చేశాను. అది నెరవేరింది. 600 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తే అసలు చూస్తారా అని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి థియేటర్స్ హౌస్‌ఫుల్. నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే’’ అని నిఖిల్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు నిలబెట్టిన సినిమా ఇది. అందుకే మేం మీ ముందు ధైర్యంగా నిలబడి ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. వెంకటేశ్ అనే అంధ విద్యార్థి మాట్లాడుతూ - ‘‘నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లా. స్టార్టింగ్ టు ఎండింగ్ కడుపుబ్బా న వ్వుతూనే ఉన్నాం. చాలా కాలం తర్వాత బాగా నవ్వానన్న ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, నైజాం పంపిణీదారు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?
రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్‌కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్‌లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్‌తో సినిమాలను నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్‌లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్‌తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్‌ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్‌తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే. -
టైటిలాభరణం
కొత్త సినిమా గురూ! ‘శంకరాభరణం’ కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్, శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది. తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’. టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు. అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే ముప్పులో పడతాడు హీరో తండ్రి. పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు. ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్ ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు. ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా) హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో కిడ్నా పర్కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌సఫరవుతుంటారు. ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా. కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి. వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు. అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది కమెడియన్లున్నారు. కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం. ‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్ నందనవనమ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో తెరపై చూసి చెప్పడం కష్టమే. కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం. సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ, హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది. ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే, స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం, బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు. - రెంటాల జయదేవ * హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు. * బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్ ప్రధానంగా మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి. -
'శంకరాభరణం' మూవీ రివ్యూ
టైటిల్ : శంకరాభరణం జానర్ : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తారాగణం : నిఖిల్, నందిత, రావు రమేష్, సుమన్, అంజలి దర్శకత్వం : ఉదయ్ నందనవనం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: కోన వెంకట్ నిర్మాత : ఎమ్ వి వి సత్యనారాయణ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న కథా రచయిత కోన వెంకట్ తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి, అన్నీ తానే అయి తెరకెక్కించిన సినిమా శంకరాభరణం. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ఫస్ గయా రే ఒబామా' సినిమా లైన్‌ను తీసుకొని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథా కథనాలు అందించారు కోన. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను శంకరాభరణం అందుకుందా..? కోన వెంకట్ ఫ్లాప్ ట్రాక్ నుంచి బయటపడ్డాడా..? కథ : గౌతమ్ (నిఖిల్ సిద్దార్ధ్) న్యూయార్క్‌లో ఆనందంగా జీవితం గడుపుతున్న కుర్రాడు. తన తండ్రికి వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు 25 ఏళ్ల క్రితమే వదిలేసి వచ్చిన తల్లి ఆస్తిని అమ్మడానికి ఇండియాకు వస్తాడు. బిహార్‌లోని పాట్నా సమీపంలో తన తల్లి పేరున ఉన్న శంకరాభరణం ప్యాలెస్‌ను అమ్మి ఆ డబ్బుతో తండ్రి సమస్యలను తీర్చేయాలనుకుంటాడు. అదే ప్యాలెస్‌లో నివాసం ఉంటున్న గౌతమ్ తల్లి కుటుంబసభ్యులు, ఆమె తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ద్వేషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చిన గౌతమ్‌కు తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కొడుకు (సప్తగిరి) సాయంగా వస్తాడు. ఇద్దరు కలిసి ప్యాలెస్‌లో ఉంటున్నవారిని ఎలాగైనా మోసం చేసి ప్యాలెస్ అమ్మేయాలని ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొన్న గౌతమ్, అనుబంధాల విలువ తెలుసుకొని ఆ పని చేయలేకపోతాడు. అప్పటికే బిహార్‌లో భారీగా ఆస్తులున్న ఎన్నారై అడుగుపెట్టడాన్న వార్త అక్కడున్న కిడ్నాపర్ గ్యాంగ్‌లకు తెలిసిపోతుంది. చేతిలొ చిల్లిగవ్వ కూడా లేని గౌతమ్‌ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఏమయ్యారు, గౌతమ్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు. చివరకు తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే ఎంచుకుంటున్న నిఖిల్ మరో బరువైన పాత్రతో ఆకట్టుకున్నాడు. జాలీ లైఫ్ నుంచి కష్టాల్లోకి అడుగుపెట్టిన కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా లుక్, డైలాగ్ డెలివరీ లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నిఖిల్ ఎన్నారైగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హ్యాపీ ఠాకూర్ పాత్రలో నందిత ఆకట్టుకుంది. కిడ్నాపర్‌గా సంజయ్ మిశ్రా కామెడీ పండిచాడు, చిన్న పాత్రలో కనిపించిన అంజలి కూడా గ్లామర్‌తో పాటు విలనీని కూడా బాగా పండించింది. క్లైమాక్స్‌లో వచ్చిన సంపత్ కూడా తన మార్క్ యాక్టింగ్‌తో మెప్పించాడు. రావు రమేష్, సుమన్, రఘుబాబు లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : శంకరాభరణం సినిమాకు అన్నీ తానే అయి పని చేసిన కోన వెంకట్ రచయితగా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్‌లతో థియేటర్లో నవ్వులు పూయించాడు. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన ఉదయ్ నందనవనం, కథ మీద మరింత పట్టు చూపించి ఉండాల్సింది. కథనంలో థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన వేగం కనిపించలేదు. ప్రవీణ్ సంగీతం బాగుంది. రొటీన్ కమర్షియల్ మ్యూజిక్ కు భిన్నంగా డిఫరెంట్ సాంగ్స్ తో అలరించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అప్ టు ద మార్క్ లేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో చాలా సీన్లు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. విశ్లేషణ : సినిమా అంతా బిహార్ బ్యాక్ డ్రాప్ లోనే జరిగినా అన్ని క్యారెక్టర్లు తెలుగులోనే మాట్లాడతాయి. తెలుగు ప్రేక్షకుల కోసం అలా ప్లాన్ చేసినా, కనిపించే నేపథ్యానికి, వినిపించే భాషకి సంబంధం లేనట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అన్ని ఫీల్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే రచయితగా మంచి పేరున్న కోన వెంకట్, ఈ సినిమాలో మాత్రం స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో ఆ స్థాయి వేగం కనిపించదు. సెకండాఫ్ కాస్త ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సంబంధం లేకుండా మారిపోతుంటుంది. దీంతో ప్రేక్షకుడు ఏ సమయంలోనూ కథతో కనెక్ట్ అవ్వడు. సినిమా అంతా సో సోగా నడిపించిన కోన.. క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. హీరో ఆడే మైండ్ గేమ్ తో ఆఖరి 30 నిమిషాలు థ్రిల్లింగ్‌గా కథ నడిపించాడు. ప్లస్ పాయింట్స్ : కోన డైలాగ్స్ క్లైమాక్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ స్లో నేరేషన్ ఎడిటింగ్ ఓవరాల్ గా శంకరాభరణం ఏ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపించని క్రైమ్ కామెడీ -
ప్రయోగాలకే ఓటేస్తున్నాడు
కమర్షియల్ జానర్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వటంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న నిఖిల్, ఆ జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. స్వామి రారా సినిమాతో తొలిసారిగా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా సినిమాలు చేయటం ప్రారంభించిన నిఖిల్, ఆ తరువాత వరుసగా కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. అంతేకాదు ఇక ముందు కూడా అదే తరహా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మిస్తున్న శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో. ఆ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్‌తో ఫాంలో ఉన్న నిఖిల్, అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్లో సక్సెస్ అయిన ఫస్ గయా రే ఒబామా సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులతో రీమేక్ చేశారు. ప్రస్తుతం టైగర్ సినిమా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నిఖిల్ మరోసారి ప్రయోగానికే ఓటు వేస్తున్నాడు. కార్తీక్ రెడ్డి అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ క్రీడా నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పాడు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ప్రస్తుతానికి నా గర్ల్‌ఫ్రెండ్ ఆయనే!
న్యూ జనరేషన్ హీరోల్లో నిఖిల్‌ది సెపరేట్ స్టయిల్. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ఇంకోసారి టచ్ చేయడు. ఎప్పటికప్పుడు తనకంటూ ఓ పంథా ఏర్పరచుకున్న నిఖిల్ ఈ శుక్రవారం ‘శంకరాభరణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో చెప్పిన ముచ్చట్లు... * ఓ రోజు సడన్‌గా కోన వెంకట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. కథ వినడానికి రమ్మన్నారు. విని ఇంప్రెస్ అయిపోయా. ఫుల్ నెరేషన్ కావాలని అడిగినా ఆయన ఫీల్ కాలేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి, నాకు వినిపించారు. * ‘శంకరాభరణం’ టైటిల్ పెడుతున్నామని చెప్పగానే నేను షాకైపోయా. రిస్కు అవుతుందేమోనని చెప్పా. ఆ టైటిల్ తో మనం బూతు సినిమా సినిమా తీస్తే తప్పుగానీ మంచి కంటెంట్ అందిస్తే ఏం ఫరవాలేదని కోన గారు నాకు భరోసా ఇచ్చారు. * ఈ టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అయ్యిందని నా అభిప్రాయం. * గతంలో నేను నటించిన ‘డిస్కో’ సినిమా చూస్తూ ఓ కుర్రాడు మధ్యలో హాలులో నుంచి వెళ్లిపోతూ, ‘భయ్యా... ఇక ఈ సినిమా చూడలేను’ అని కామెంట్ చేశాడు. నేను చాలా బాధపడ్డాను. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని డిసైడై, ట్రెండ్ మార్చాను. అప్పటి నుంచి కొత్త తరహా కథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. అలా ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘శంకరాభరణం’ నాకు దక్కాయి. * సినిమా తర్వాత సినిమా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది ఖరీదైన వ్యవహారం. క్వాలిటీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే ప్రమోషన్‌కు కూడా సమయం కేటాయించాలి. * ‘టైగర్’ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా చేయనున్నా. అలాగే చందు మొండేటి ద ర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చేస్తాను. దానికి ఇప్పటికే కథ రెడీ చేసేశాం. ‘కార్తికేయ’కు ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. * నేనింతవరకూ ప్రేమలో పడలేదు. చాలా ఏళ్లుగా ఐ యామ్ సింగిల్. ఇంటర్, ఇంజనీ రింగ్ ఎడ్యుకేషన్ టైమ్‌లో క్రషెస్ ఎవరికైనా కామన్ కదా. ఇప్పుడైతే నాకంత టైమ్ దొరకడం లేదు. సినిమాలతోనే గడిచిపోతోంది. ఇప్పుడు కోన గారే నా గర్ల్‌ఫ్రెండ్. * మా ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకో రెండు సినిమాలు హిట్టయితే పెళ్లి చేసుకుంటానని వాయిదా వేసుకుంటూ వస్తున్నా. అయితే పెద్దలు కుదిర్చిన అమ్మాయినే చేసుకుంటా. * ఆ మధ్య న్యూయార్క్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. అది టైమ్‌పాస్ కోసమే. అంతేగానీ ఏదో డెరైక్షన్ చేసేద్దామని మాత్రం కాదు. నా దృష్టి ఎప్పుడూ యాక్టింగ్ మీదే. -
కాంట్రవర్సీల్లోకి నన్ను లాగకండి బాబూ!
ఇవాళ తెలుగు సినిమా స్టార్ రైటర్ అంటే... గుర్తొచ్చే పేరు - కోన వెంకట్. పాత తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, రాజకీయ దిగ్దంతుడిగా ఎదిగిన తొలి తరం సినీ హీరో కోన ప్రభాకరరావు మనవడు. వర్మ శిష్యుడిగా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడమే కాదు... ముఖం మీదే చెప్పడమూ కోన స్టైల్. దర్శకులను కాదని రచయితల పక్షం నిలబడినా, ‘బ్రూస్లీ’కి తాను రాసిన సీన్లు దర్శకుడు శ్రీను వైట్ల తీయలేదని రచ్చకెక్కినా - అవన్నీ కోన మార్క్ నిజాయతీ. మరో మాటలో... మీడియాలో యమా కాంట్రవర్సీ. తాజాగా హీరో నిఖిల్‌తో బీహార్ నేపథ్యంలో కిడ్నాప్ డ్రామా థ్రిల్లర్ ‘శంకరాభరణం’ చిత్రానికి అన్నీ తానే అయి, డిసెంబర్ 4న జనం ముందుకు తెస్తున్నారాయన. ఆ సందర్భంగా కోన మాటల ఊటలో నుంచి చేదుకున్నవాళ్ళకు చేదుకున్నంత... ‘శంకరాభరణం’ అంటూ మీరు తీస్తున్న కిడ్నాప్ కథకు బీజం ఏంటి? 2000లో అనురాగ్ కశ్యప్ రచయితగా, ఇ.నివాస్ దర్శకత్వంలో వర్మ నిర్మించిన ‘శూల్’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. బీహార్ నేపథ్యంలోని ఆ కథను అక్కడే తీద్దామంటే కుదరలేదు కానీ, ఆ ఊళ్ళన్నీ తిరిగా. కిడ్నాపింగ్ అక్కడ ఒక పెద్ద పరిశ్రమ. అది చూసి, ఈ కథకు బీజం పడింది. ‘ఫస్ గయేరే ఒబామా’ చూశాక, ఒక స్కీవ్‌ు వచ్చింది. అవన్నీ కలిపి, ‘శంకరా భరణం’ కథ అల్లాను. సరిగ్గా ఆడితే రూ. 40 కోట్లొచ్చే స్క్రిప్ట్ ఇది. మరి, అంత మంచి స్క్రిప్ట్ స్టార్సతో కాకుండా నిఖిల్‌తో చేశారేం? చాలామంది స్టార్స వాళ్ళ ఇమేజ్ అనే బ్యాగేజ్‌తో వస్తారు. ఫ్యాన్స అంచనాలు సరేసరి. అందుకే, వాళ్ళు నటిస్తే పాత్రలు కాకుండా, వాళ్ళే కనపడుతుంటారు. కొత్త రకం స్క్రిప్ట్‌లు ఎంచుకొనే నిఖిల్ లాంటి హీరో దీనికి కరెక్ట్. నిఖిల్ కెరీర్‌కు ఇది ఒక ‘దూకుడు’ లాంటి హిట్టవుతుంది. హీరోయిన్ అంజలితో గెస్ట్ రోల్ వేయించగలిగారే? నిజానికిది గెస్ట్‌రోల్ కాదు. సినిమాలోని నలుగురు విలన్లలో ఆమె ఒకరు. ‘బ్యాండిట్ క్వీన్ ఆఫ్ బీహార్’ అనుకోండి. 15 నిమిషాల పాత్ర అది. హీరోయిన్ వేషాలేసే అమ్మాయిని విలన్‌గా ఏం చెప్పి ఒప్పించారేంటి? (నవ్వేస్తూ...) ఏం చెబుతామండీ... చేస్తే బాగుంటుందని చెబుతాం. ఇలాంటి పాత్రలేస్తే, ఒకప్పుడు శ్రీదేవి, విజయశాంతిలాగా ఆమెకు కూడా కొన్నేళ్ళు పవర్ఫుల్ పాత్రలు వస్తాయి. ఆ మాటే చెప్పా. మొత్తానికి, ఈ సినిమాకు మీరు చాలానే కష్టపడ్డట్లున్నారు? అవును. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ చేశా. అన్నీ మీరే చేస్తే... దర్శకుడెందుకు? అతణ్ణి ఏమైనా చేయనిచ్చారా? (నవ్వుతూ...) చెప్పడానికి యాక్షన్... కట్ ఉందిగా! రైటర్‌గా నేను సీన్ రాసి, అంతవరకు చూడడం వేరు. లొకేషన్, కాస్ట్యూవ్‌ు్స, సమన్వయం - ఇలా డెరైక్టర్ బాధ్యతలు చాలానే. అవన్నీ ఉదయ్ నందనవనమ్ బాగా చేశాడు. రైటర్‌గా ఆల్రెడీ మైండ్‌లో చూసిన సినిమానే యూనిట్ అంతా మనసులో చూస్తూతీస్తే హిట్. లేకపోతే, రిజల్ట్ ‘బ్రూస్లీ’లా ఉంటుంది. రచయితగా పేరేసినా, మీరు రాసిన సీన్లు ‘బ్రూస్లీ’కి వాడలేదనా? 72 సీన్లు రాస్తే, యథాతథంగా తీసుకోలేదు. కొన్ని స్టార్టింగ్, కొన్ని మధ్య లో, కొన్ని ఎండింగ్ తీసుకున్నారు. నేను ఫీలయ్యా. ‘దూకుడు’ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అని నమ్మిన ప్రేక్షకులు, బయ్యర్లు నష్టపోయారు. మీరు రాసినవన్నీ తీయాలా? పైగా, మీరేదో నష్టపరిహారం కేసు వేస్తారని వార్త! నేను రాసింది ‘భగవద్గీత’ కాదు. సుప్రీంకోర్ట తీర్పు కాదు. ఏం తీయా లనేది దర్శకుడి ఇష్టం. కానీ, రాసింది లేకుండా రచయితగా పేరు వేయడంతో నా పేరు దెబ్బతింది. అందుకే, నేను రాసిన సీన్లన్నీ బయటపెడతా. ఇక, కేసంటారా... ఆ వార్త వట్టి పుకారు. ‘బాద్షా’ అప్పుడే మీ మధ్య గొడవైందిగా? అవును. తర్వాత ఒక బలహీన క్షణంలో తప్పయిపోయిందని కన్నీళ్ళు పెట్టుకుంటే, నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నా. ఎంతైనా క్రియేటివ్ పీపులందరం ఎమోషనలే కదా. కలిశాం. తీరా, ఇప్పుడిలా. సినిమా అయినా, సంసారమైనా ఒక వ్యక్తి కన్విక్షన్. మిగిలినవారి కంట్రిబ్యూషన్. కానీ అవగాహన లేకపోతే, కొనసాగలేం. ఇంతకీ, శ్రీను వైట్లతో ఇప్పుడు మీ రిలేషన్? వెంటిలేటర్‌పై ఉంది. ఈ మధ్య మాట్లాడలేదు. భవిష్యత్‌లో కలసి పనిచేసే అవకాశం ఉందా? చేయచ్చు... చేయకపోనూ వచ్చు! మీరే రాసిన ‘అఖిల్’ గురించి మాట్లాడరేం? ‘బ్రూస్లీ’కి మూలకథ శ్రీను వైట్లదైతే, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేను రాసినవి. కానీ, ‘అఖిల్’కి కథ (వెలుగొండ శ్రీనివాస్), స్క్రీన్‌ప్లే నావి కావు. నేను వట్టి డైలాగ్ రైటర్ని. కాబట్టి నాకు బాధ్యత ఉండదు. ఆల్రెడీ రచయిత, దర్శకుడు చెప్పింది రాసివ్వడమే. మహా అయితే, వాళ్ళకు సలహా, సూచన చెప్పగలం. అంతకు మించి తల దూర్చకూడదు. అయినా గతం గతః. శంకరాభరణం’తో హిట్ సాధించాలి. ఎందుకంటే, ఈ ఇండ్రస్ట్రీ నిర్దాక్షిణ్యమైనది. సక్సెస్ ఇస్తేనే ఇక్కడ మనుగడ. ఇంతకీ పరుచూరి బ్రదర్స్ తర్వాత తరంలో మీరే నంబర్ వన్ రైటర్ అనచ్చా? అలాంటిదేమీ ఉండదండీ. ఇదొక పీరియడ్. అంతే! ఇప్పుడు నాలుగైదు సినిమాలకు రాస్తూ, స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తూ ఉండేసరికి పేరు తరచూ వినిపిస్తోంది. రెండేళ్ళు సెలైంట్‌గా ఉంటే, అంతా మర్చిపోతారు. ‘శంకరాభరణం’ మీ కెరీర్‌కే మలుపంటున్నారు. ఏమిటంత? బి, సి సెంటర్ల మాస్ సినిమాలు, ‘ఎ’ సెంటర్ల మల్టీప్లెక్స్ సినిమాలు - ఏవి తీయాలనే సందిగ్ధంలో తెలుగు సినిమా ఉంది. ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ న్యూజనరేషన్ సినిమా సక్సెసైతే, నా కెరీర్ కొత్తదోవ తొక్కుతుంది. అంటే... చిత్ర నిర్మాణం కొనసాగిస్తారా? దర్శకత్వం కూడా చేస్తారా? తప్పకుండా! వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మించాలని ప్లాన్. రిలయన్స్ వాళ్ళు 3 సినిమాల డీల్ అడుగుతున్నారు. క్రియేటివ్ రెస్పాన్సిబి లిటీ నాది, ఫైనాన్షియల్ హెల్పంతా వాళ్ళది. అప్పుడు స్టార్స్కానివాళ్ళతో చేయగలుగుతా. ఘోస్ట్ డెరైక్షన్ కాకుండా, నేనే డెరైక్షన్ కూడా చేస్తా. మీరే గతంలో డెరైక్టర్నైతే ఏడాదికి ఒకటే, రైటరైతే 4 సినిమాలు చేయచ్చన్నారు! నిజమే. కానీ, దానివల్ల ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ కనపడుతోంది. మనం రాసినదాన్ని వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు తీయడం వల్ల రైటర్‌గా పేరు పోతోంది. రైటర్‌గా నాలుగు సినిమాలు చేస్తే, పదిమందికీ పని దొరుకు తుందనుకుంటే, చివరకు మనకు పనిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 50 సినిమాల దాకా రచన చేశా. ఇక, రాశి కన్నా వాసి ముఖ్యం. కానీ చాలా స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారట! శ్రీదేవి లేటెస్ట్ హిందీ ఫిల్మ్ మీ కథేనట! అవును. ‘శంకరాభరణం’ బీహార్ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ అయితే, బోనీ కపూర్ నిర్మాతగా శ్రీదేవి నటిస్తున్న హిందీ చిత్రం మరో రకమైన థ్రిల్లర్. రవి ఉద్యావర్ అనే యాడ్ ఫిల్మ్‌మేకర్ దర్శకుడు. అలాగే, హైదరాబాద్ సిటీ నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథతో ‘పౌడర్’ అనే కథ చేశా. ఆ మాటకొస్తే, డ్రగ్స్ వినియోగదారుల్లో సినిమా వాళ్ళే ఎక్కువేమో? సినిమావాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, వాళ్ళ ముందు కెమేరాలు పెడతారు. ఖరీదైన ఈ డ్రగ్స్ కొనే కస్టమర్లలో సినిమా వాళ్ళు 5 శాతం లోపే! కామెడీ మిళాయించి కథలు రాసే మీరు థ్రిల్లర్స్ ఎంచుకోవడం... ఎంటర్టైనింగ్ సినిమాలు చేయడం నాకిష్టం. కానీ ఎంటర్టైన్మెంట్కీ, కామెడీకీ తేడా ఉంది. ప్రేక్షకులు ఆస్వాదిస్తూ, తెర మీది విషయంతో ఎంగే జయ్యేవన్నీ ఎంటర్టైన్మెంటే. కామెడీ, థ్రిల్లర్, ఛేజ్లూ ఎంటర్టైనింగే. దేశమంతా ఇప్పుడు ఎంగేజవుతున్న టాపిక్ ‘అసహనం’. దానిపై మీ వ్యాఖ్య? దానిపై నా కామెంటెందుకు? అసలే నా సినిమా రిలీజ్‌కు ఉంది. అదేంటి... దానిపై మీకంటూ ఒక ‘స్టాండ్’ (వైఖరి) ఏమీ లేదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రతి అంశం మీదా ఒక వైఖరి ఉంటుంది. కానీ, అన్నీ బయటపడి చెబుతామా? చెబితే, కొంపలంటుకుంటాయి (నవ్వులు). ఆమిర్‌ఖాన్‌ను మీ గురువు వర్మ విమర్శించారు! పూరి జగన్నాథ్ సమర్థించారు! (నవ్వుతూ...) వర్మ దేవుణ్ణే విమర్శించారు. ఆయనకు ఆమిర్ ఓ లెక్కా! పూరి జగన్నాథ్ ట్వీట్ అంటారా... ఆయన సినిమా రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఫరవాలేదు. కాంట్రవర్సీల్లోకి నన్ను లాగకండి. నలుగురినీ నా సినిమా చూడనివ్వండి బాబూ! ఇప్పటి దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కాంట్రవర్సీలేనేమో! (నవ్వుతూ) కాదు. నిజాలు. ‘శంకరాభరణం’ ఓ క్లాసిక్. ఆ పేరు మీ థ్రిల్లర్‌కి ఏ ధైర్యంతో పెట్టారు? ఆ టైటిలెందుకు పెట్టామన్నది హాలులోకొచ్చిన 5 నిమిషాలకే అర్థమై పోతుంది. నిజానికి, ముందు ఆ టైటిల్ అనుకోవడానికి ప్రత్యేక కారణం, జస్టిఫికేషన్ లేవు. అయితే, అనుకున్నాక కథలో జస్టిఫై చేశాం. విలువైన దేని నైనా కిడ్నాప్ చేసే బీహార్ నేర సంస్కృతి నేపథ్యంలో ప్రయోగాత్మక సినిమా కాబట్టి, జనంలో నానిన టైటిలైతే, బాగుంటుందని పెట్టాం. అప్పటి ఆ ‘శంకరాభరణ’ సృష్టికర్త కె. విశ్వనాథ్ గారేమీ అనలేదా? నేనింత వరకు బూతును అడ్డం పెట్టుకొని, సినిమాలు రాయలేదు. కాబట్టి, విశ్వనాథ్ గారు ఏమీ అనలేదు. ఆయన అడక్కపోయినా, నేనే కథ చెప్పా. ఆడియోకు వచ్చి, తొలి పాట రిలీజ్ చేయమంటే చేశారు. -
డేట్స్ క్లాష్ వద్దు గురూ!
సినిమా విడుదలైందా? వారంలోపే వసూళ్లు రాబట్టేశామా? అన్న చందంగా ప్రస్తుతం సినిమా మార్కెట్ ఉంది. వారం, పది రోజుల్లోనే వసూళ్లు రాబట్టేయాలంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. ఫలితంగా వేరే సినిమాకు థియేటర్లు అంతగా దక్కవు. మరి, ఒకేరోజు రెండు, మూడు పెద్ద సినిమాలంటే థియేటర్లు కష్టమే. అదేగనక నిర్మాతలందరూ ఒక అవగాహనతో ఉంటే... కలిసి మాట్లాడుకుంటే... ఏ సినిమాకీ నష్టం కలగని రీతిలో రిలీజ్లు ప్లాన్ చేయొచ్చు. ‘బాహుబలి’ కోసం ‘శ్రీమంతుడు’ విడుదలను వాయిదా వేసుకొన్న విషయం తెలిసిందే. రానున్న ఇరవై రోజుల్లో విడుదల కావాల్సిన మూడు సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడిదే జరిగింది. ఆ చిత్ర నిర్మాతలు మాట్లాడుకొని, తమలో తాము పోటీ పడకుండా... తమ చిత్రాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే... ఈ 27నే... ‘సైజ్ జీరో’ ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది. డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’ వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు. ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా, ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు. ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’ నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం. ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది. మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి. వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. అవగాహనతో ఉంటే... అందరికీ లాభం! ప్రస్తుతం ఏ సినిమా స్పాన్ అయినా వారం రోజులు మాత్రమే ఉంటోంది. అందుకే మేము ముగ్గురం కలిసి, మాట్లాడుకున్నాం. రాధామోహన్ రియల్ హీరో అనాలి. ఎందుకంటే, ‘అఖిల్’ చిత్రం కోసం ఆయన ‘బెంగాల్ టైగర్’ విడుదలను వాయిదా వేశారు. నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నారు కానీ, అప్పటికే మేం విడుదల తేదీ ప్రకటించేశాం. దాంతో మళ్లీ వాయిదా వేశారు. ‘శంకరాభరణం’ కోసం ఏకంగా డిసెంబర్ 10ని విడుదల తేదీగా ఫిక్స్ చేశారు. నిర్మాతలందరూ ఇలా మంచి అవగాహనతో ముందుకెళితే అందరికీ మంచి జరుగుతుంది - పొట్లూరి వి. ప్రసాద్ నిర్మాతలందరూ బాగుండాలి! అసలు ఈ నెల 5న ‘బెంగాల్ టైగర్’ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘అఖిల్’ సినిమా పోస్ట్‌పోన్ అయింది. మా సినిమాకూ, ‘అఖిల్’కూ డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే కావడంతో మా చిత్రాన్ని అనివార్యంగా 27కి వాయిదా వేశాం. ఆ డేట్ అనుకు న్నాక ‘సైజ్ జీరో’ గురించి తెలిసింది. పీవీపీగారు కలిసి, మాట్లాడిన తర్వాత ఓ అవగాహనకు వచ్చాం. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మా ‘బెంగాల్ టైగర్’ని డిసెంబర్ 10న రిలీజ్ చేస్తున్నాం. నిర్మాతలందరూ బాగుండాలన్నది నా ఆకాంక్ష. - కేకే రాధామోహన్ ఆ అపోహ వద్దు! ఒకేరోజు రెండు, మూడు సినిమాలు విడుదలైతే థియేటర్ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకే క్లారిటీగా మేం నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 20న ‘శంకరాభరణం’ను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల విడుదల ఉండటంతో డిసెంబర్ 4కి వాయిదా వేశాం. రాధామోహన్‌గారు పెద్ద మనసు చేసుకుని ‘బెంగాల్ టైగర్’ని వాయిదా వేశారు. ఒక సినిమా వాయిదా పడిందంటే.. కచ్చితంగా రీషూట్ చేయడం కోసమే అని అపోహపడే అవకాశం ఉంది. కానీ, అలాంటిదేమీ లేదు. కేవలం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే మేం ముగ్గురం కలసి ఈ నిర్ణయం తీసుకున్నాం. - కోన వెంకట్ -
బిహార్‌లో మలుపులు!
అతనో ఎన్నారై. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. అందుకే అతనికి ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేట్ అయినా పెట్టి మరీ దక్కించుకుంటాడు. కష్టాలంటే తెలీవు. ఇలాంటి కుర్రాడు ఓ పని మీద బిహార్‌లో అడుగుపెడతాడు. అప్పటి నుంచి అతనికి కష్టాలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఈ కుర్రాడి జీవితం ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘క్రైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. డిసెంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి. -
ఈ సినిమా అందరికీ ఓ సమాధానం!
‘‘నేను ఇటీవలే ‘సరైనోడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. ‘వీడు మాములోడు కాదు’ అనే టైటిల్‌ను పెట్టి కోన వెంకట్‌ను హీరోగా పెట్టి తీద్దామనుకుంటున్నా. కోన వెంకట్ కు ఏదైనా చేయగల సత్తా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపించేలా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా పతాకంపై నిఖిల్, నందిత జంటగా అంజలి ముఖ్యపాత్రలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించి, తొలి సీడీని కథానాయిక సమంతకు అందించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ- ‘‘కోన వెంకట్ నా శ్రేయోభిలాషి. ఏది చేసినా కొత్తగా ట్రై చేస్తాడు. ‘శంకరా భరణం’ టైటిల్ పెట్టి, తుపాకీలు, బీహార్ బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘కోన వెంకట్‌గారు ఇక్కడ నేను కెరీర్ స్టార్ చేసినప్పట్నుంచీ తెలుసు. సాంగ్స్‌లో మంచి కిక్ ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని సమంత అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘ఈ రోజు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందు పవన్‌కల్యాణ్‌గారి నుంచి మొదలుపెట్టాలి. తర్వాత సమంత గారికి చెప్పాలి. ‘శంకరాభరణం’ తర్వాత అంజలికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. నందిత తన పాత్రలో జీవించింది. ఈ సినిమా బాగా రావడానికి కారణం కెమేరామ్యాన్ సాయిశ్రీరామ్. చాలామంది ఇది కాపీ సినిమా అంటున్నారు. ‘ఫస్ గయే రే ఒబామా’ అనే హిందీ సినిమా దక్షిణాది రైట్స్ తీసుకుని, ఆ కథాంశం స్ఫూర్తితో ఓ లైన్ తీసుకుని ఈ ఫిల్మ్ చేశాం. అక్కడి రాజకీయ నాయకులకు కిడ్నాపింగ్ సైడ్ బిజినెస్. వాళ్ల పేర్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇక్కడి ప్రేక్షకులకి కొత్తగా ఉంటుంది. బాలీవుడ్ తరహా సినిమాలు ఇక్కడ రావడం లేదనే వారందరికీ ఈ సినిమానే సమాధానం’’ అని చెప్పారు. దర్శకులు కె.విశ్వనాథ్, శ్రీవాస్, బాబీ, మారుతి, నిఖిల్, నందిత, రావురమేశ్, దీక్షాపంత్, తమన్ పాల్గొన్నారు. -
ఎంతైనా సై అనే ఎన్నారై
ఆ కుర్రాడు ఎన్నారై. అంటే... నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదట. ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేటైనా ఇచ్చి కొనుక్కునే టైప్ అని కొత్త డెఫినిషన్ చెబుతున్నాడు. తండ్రి కష్టపడి బిలియన్స్ సంపాదిస్తే... ఎంతో ఈజీగా ఖర్చు పెట్టే కొడుకన్నమాట. ఇలాంటి కుర్రాడు ఇండియాలో అడుగుపెడతాడు. ఇక్కడ ఈ ఎన్నారై పడిన కష్టాల సమాహారమే ‘శంకరాభరణం’. రచయిత కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘కైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్‌లో తీశాం. బీహార్‌లోని డేంజరస్ స్పాట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీక రించాం. ఈ నెల 30న పాటలను, దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని కోన వెంకట్ తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి. -
శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి
శ్రీదేవి... శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి అని పిలిపించుకోవడానికి మహారాణి పాత్రలు వేయనక్కర లేదు. తెలుగువారి గుండెల్లో తనెప్పుడూ మహారాణే! పీక్‌లో ఉన్నప్పుడు బోనీ కపూర్‌తో... పెళ్ళి జీవితానికి శ్రీకారం చుట్టి... ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి జారుకున్నారు. మళ్ళీ ‘ఇంగ్లిష్... వింగ్లిష్’తో... సర్ప్రైజింగ్లీ సూపర్బ్ రీ-ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెండితెరపై కనబడతారా అని... ఎదురుచూస్తున్న తెలుగు గుండెలకు త్వరలో రాణీదర్శనం ఇవ్వనున్నారు. ►‘ఇంగ్లిష్-వింగ్లిష్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ‘పులి’కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటి? ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ చూసినవాళ్లందరూ ‘చాలా గ్యాప్ తర్వాత చేసినా మంచి సినిమా చేశారు’ అని అభినందించారు. ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా అలాంటి అభినందనలే అందుకోవాలి. అందుకే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. ‘పులి’ ఫ్యాంటసీ స్టోరీ. అలాంటివి చేయడం ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర బాగా నచ్చడంతో చేశాను. ► చిత్రదర్శకుడు శింబుదేవన్ ఈ కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? కథ అద్భుతం. నా పాత్ర చాలా బాగుంటుంది. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. అందుకే, కథ వినగానే నటించడానికి ఒప్పుకున్నా. పెద్దలు మాత్రమే కాదు... పిల్లలు కూడా చూసే విధంగా ‘పులి’ ఉంటుంది. ► షూటింగ్ వాతావరణం గురించి? ఇందులో నాది రాణి పాత్ర. షూటింగ్ లొకేషన్లో కూడా నన్ను అందరూ రాణిలానే చూసేవారు. అలా స్పెషల్‌గా ట్రీట్ చేయడం చాలా స్వీట్‌గా అనిపించేది. ► మీ పిల్లలు (జాన్వి, ఖుషి) మీ సినిమాలు చూసి, ఏమంటారు? చాలా గర్వపడతారు. నేను సాధించినది చాలా తక్కువ. ఆ తక్కువ విషయానికే వాళ్లు ఆనందపడడం చూసినప్పుడు నాకు భలే ఉంటుంది. ► తెలుగులో స్ట్రయిట్ చిత్రం ఎప్పుడు? మంచి కథ, పాత్ర దొరికితే చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ► ఆ మధ్య రచయిత కోన వెంకట్ మీకు కథ చెప్పారు కదా... అదేమైంది? కథ బాగుంది. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ సినిమా ఉంది. బహుశా రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ► మీ అమ్మాయి జాన్వి ఇప్పుడప్పుడే కథానాయికగా చేయదట కదా? అవును. కానీ, ఎవరికి వాళ్లు మా అమ్మాయి ఫలానా సినిమా ద్వారా పరిచయమవుతోందని ఊహాగానాలు చేస్తున్నారు. జాన్వి ఇంకా చిన్నపిల్ల. ► జాన్వి ఇప్పుడేం చేస్తోంది? ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇంకా చదువుకోవాలనుకుంటోంది. యూఎస్‌లో చదవాలనుకుంది. మేం కాదనలేదు. జాన్వి కంఫర్ట్‌గా సెటిలయ్యేవరకూ నేనూ అక్కడే ఉంటా. ప్రస్తుతానికైతే నెలరోజులు యూఎస్‌లో ఉండాలని ప్లాన్ చేసుకున్నా. ► ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం.. ఇప్పుడైతే కథానాయికలు వీలైనంత సన్నగా ఉండాలి. అప్పట్లో బొద్దుగా ఉండేవాళ్లంటే క్రేజ్. మీరు మాత్రం ఈ తరం నాయికలా సన్నగా ఉండేవారు. మరి అప్పుడు...? యాక్చువల్‌గా మా అమ్మగారి నుంచి నాకది అలవాటైంది. అమ్మ ఆలోచనలన్నీ చాలా ఫార్వార్డ్‌గా ఉండేవి. ఫ్రైడ్ ఫుడ్ తిననిచ్చేది కాదు. ఆయిలీ ఫుడ్‌ను ఎంకరేజ్ చేసేది కాదు. యోగా అలవాటు చేసింది. అమ్మ ప్రభావం వల్ల ఆరోగ్యం పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. వాకింగ్, జాగింగ్ చేసేదాన్ని. టెన్నిస్ బాగా ఆడేదాన్ని. ఇప్పటికీ యోగా, వాకింగ్, టెన్నిస్ - అన్నీ కంటిన్యూ చేస్తున్నా. ►టీలు, కూల్ డ్రింక్స్లాంటివి మీరు తీసుకునేవారా? చెబితే నమ్మరేమో కానీ, ఇప్పటివరకూ నాకు టీ రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కటంటే ఒక్క చుక్క కూడా తాగలేదు. కూల్‌డ్రింక్స్‌కి కూడా నేను చాలా చాలా దూరం. ►మరి... కాఫీ సంగతి? మా యోగా మాస్టర్ చెప్పడం వల్ల కాఫీ అలవాటు చేసుకున్నాను. అది కూడా ‘బ్లాక్ కాఫీ’. ఆయన ఎందుకు సజెస్ట్ చేశారంటే, నాకు జలుబు చేసేది. అలాంటి సమయాల్లో బ్లాక్ కాఫీ తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందన్నారు. అలా కాఫీ అలవాటైంది. ►బక్కపలచగా ఉన్నావేంటని ఎవరైనా కామెంట్ చేసేవారా? ఎన్టీఆర్‌గారు ‘ఏమండీ... ఆరోగ్యం బాగాలేదా.. అలా చిక్కిపోతున్నారు’ అనేవారు. నవ్వేసి ఊరుకునేదాన్ని. అప్పట్లో సన్నగా ఉండడం అంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అనుకునేవాళ్లు. ►ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్ హీరోల సరసన నటిస్తున్నప్పుడు భయంగా ఉండేదా? చాలా. ఇద్దరూ సీనియర్లు కాబట్టి, టెన్షన్ పడేదాన్ని. భయంతో కూడిన మర్యాద ఉండేది. కానీ, ఇద్దరూ కూల్‌గా ఉండేవాళ్లు. దాంతో టెన్షన్ తగ్గేది. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం మొదలుపెట్టాక భయం తగ్గిపోయింది. ►ఏయన్నార్‌తో నటించిన మీరు ఆయన తనయుడు నాగార్జునతోనూ నటించారు. ఎలా అనిపించేది? మీరిప్పుడు అడుగుతుంటే ‘ఓహో తండ్రి, కొడుకు - ఇద్దరి పక్కనా నటించానా?’ అనిపిస్తోంది. అప్పట్లో ఏదీ ఆలోచించే తీరిక ఉండేది కాదు. మంచి సినిమాలు సెలక్ట్ చేసుకోవడం, ఒప్పుకున్న పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడం... వీటి మీదే దృష్టి ఉండేది. అయితే, ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే... తండ్రి సరసన యాక్ట్ చేసినప్పుడు ఉన్న టెన్షన్ కొడుకుతో చేసినప్పుడు ఉండేది కాదు. ► మీ కన్నా వయసులో చాలా పెద్దవాళ్లయిన ఎన్టీఆర్, ఏయన్నార్ల సరసన నటించినప్పుడు మీ ఫీలింగ్? అదో అదృష్టం. ఇద్దరూ లెజెండ్రీ యాక్టర్స్. పైగా, మా మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి ఆలోచించేంత మానసిక పరిపక్వత కూడా నాకు ఉండేది కాదు. వాళ్లకు తగ్గట్టుగా ఎలా నటించాలి? అని మాత్రమే ఆలోచించేదాన్ని. ►పోనీ.. స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులోనే సినిమాలతో బిజీ కావడం, కథానాయిక అయ్యాక షిఫ్టులవారీగా పని చేయడం వల్ల, జీవితంలో ఎక్కువ కష్టపడ్డాం అనే పశ్చాత్తాపం ఏదైనా ఉందా? నెవర్... మనం ఏదైనా సాధించాలంటే ఏదో ఒకటి కోల్పోవాల్సిందే. కాలేజ్ ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు. కానీ, అంతకన్నా ఎక్కువ పాఠాలు సినిమా పరిశ్రమ నేర్పించింది. సినిమా అనేది నాకో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లోకజ్ఞానం అంతగా లేని వయసులో నలుగురిలో గుర్తింపు పొందడం, వయసు పెరిగే కొద్దీ నలుగురి అభినందనలు అందుకోవడం, ఎదరో అభిమానుల్ని సొంతం చేసుకోవడం ఓ వరం. ఈ అదృష్టం అందరికీ దక్కదు. ► మీ కెరీర్లో ఎప్పుడైనా భారీ పారితోషికం కోసం... బాగాలేని పాత్రలు చేసిన సందర్భాలున్నాయా? అస్సలు లేదు. మంచి పాత్రల కోసం పారితోషికం తగ్గించుకున్న సందర్భాలే ఉన్నాయి. ఇవాళ నటిగా వెనక్కి తిరిగి చూసుకుంటే, పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు నాకు. పారితోషికం విషయంలో రాజీపడ్డానే కానీ, పారితోషికం కోసం రాజీపడ లేదు. లక్కీగా నేను చేసినవన్నీ మంచి పాత్రలే. ►మీరు పెళ్లి చేసుకుని ముంబయ్ వెళ్లిపోయినా, అడపా దడపా ఇక్కడికొచ్చినప్పుడు అందరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అప్పుడు తెలుగువాళ్లకి దూరం అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుందా? ఒకవేళ లైఫ్ కరెక్ట్‌గా లేకపోతే అలా అనిపించి ఉండేదేమో. వీలు కుదిరినప్పుడల్లా నేనిక్కడకు వస్తున్నాను. ఏ ఫంక్షన్నీ వదిలిపెట్టడం లేదు. ఏ కార్యక్రమాన్నీ విస్మరించడం లేదు. ఇక్కడివాళ్లు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతుంటారు. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదమే. - డి.జి. భవాని చాలా బరువు మోశా! ‘పులి’ చిత్రంలో రెండువేల ఆరువందల గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం విశేషం. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇన్ని వేల షాట్స్ ఉన్న తొలి చిత్రం ఇదే. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకే దాదాపు ఆరు నెలలకు పైగా తీసుకున్నారు. ‘ఈగ’ చిత్రానికి గ్రాఫిక్స్ చేసిన ‘మకుట’ సంస్థే ‘పులి’కి కూడా విజువల్ ఎఫెక్ట్స్ చేసింది. నాటి విఠలాచార్య చిత్రాలను తలపించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ పాతికేళ్లలో ఇలాంటి కంప్లీట్ ఫ్యాంటసీ మూవీ రాలేదని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. -
నా స్టయిల్ మార్చుకున్నా!
‘‘కెరీర్ ప్రారంభంలో ‘నీ కోసం’, ‘ఆనందం’ లాంటి ప్రేమకథలు తీశాను. ఆ తర్వాత తీసినవన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఎక్కువగా ఆ తరహా చిత్రాల మీదే దృష్టి పెట్టాను. అయితే, ఆ కథలను తెర మీద ఆవిష్కరించే విషయంలో ఒకే ప్యాట్రన్ ఫాలో అయ్యాను. ఒకే పంథాలో తీయడం వల్ల ప్రేక్షకులు కూడా బోర్ ఫీలయ్యారు. అందుకే, ‘బ్రూస్లీ’ చిత్రానికి నా స్టయిల్ మార్చుకున్నాను. ఎలాంటి కథలు ఎంచు కున్నా, ఏ పంథాలో తీసినా నాదైన శైలి వినోదం ఉంటుంది’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం చేస్తున్న ‘బ్రూస్లీ’ నాకు స్పెషల్. రామ్‌చరణ్‌ను, చిరంజీవిగారిని ఒకేసారి ఈ సినిమాలో డెరైక్ట్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. చిరంజీవిగారు చేసిన పాత్ర కథలో భాగంగానే ఉంటుంది. ఆయన కనిపించే సన్నివేశాలు అభిమానులకు కన్నులపండగే. ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమా నులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అది సస్పెన్స్. ఈ చిత్రంలో బ్రూస్లీ అభిమానిగా, స్టంట్‌మాస్టర్‌గా రామ్‌చరణ్ విభిన్న పాత్రలో కనిపిస్తారు. కొంత విరామం తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్లతో పని చేయడం ఆనందంగా ఉంది. నా గత చిత్రాల్లా కాకుండా ఇందులో బ్రహ్మా నందం పాత్ర చిత్రణ కాస్త వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
దొంగల ముఠా రాణిగా అంజలి ?
-
గీతాంజలి సీక్వెల్‌గా త్రిపుర!
-
దోపిడీకి గురైన ప్రముఖ సినీ రచయిత
ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ దారి దోపిడీకి గురయ్యారు. అచ్చంగా సినిమా ఫక్కిలో చోరీ జరిగింది. సినిమాల్లో చూపించినట్లే దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడవేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు. నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ కోన వెంకట్‌తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా దొంగల బారిన పడగా, దర్శకుడు శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తృటిలో తప్పించుకున్నారు. నగర శివార్లలో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఈనెల 26న షాద్ నగర్లో ప్రకాష్ రాజ్ ఫాంహౌస్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారికాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దుండగులు దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా. కాగా వీరి వెనుకనే వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. అనంతరం కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దారిదోపిడీ విషయాన్ని షాద్ నగర్ పోలీసులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ సీఐ శంకరయ్య తెలిపారు. ఇక ఈ సంఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించినట్లు ఆయన తెలిపారు. కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'శంకరాభరణం' చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. -
ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’
ఏ తరానికైనా నచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. అలాంటి క్లాసిక్ పేరుతో ఇప్పుడు ఓ సినిమా మొదలైంది. ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎం.వి.వి. సినిమా పతాకంపై రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ తాజా ‘శంకరాభరణం’ని నిర్మిస్తున్నారు. నిఖిల్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనమ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఉగాదినాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘నాటి ‘శంకరాభరణం’కీ, ఈ ‘శంకరాభరణం’కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్. -
ఎటకారం చేస్తారట!
మనోజ్‌నందం హీరోగా వీరేందర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎటకారం’. ఎటకారం టీమ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు శ్రీనివాసగౌడ్ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో అయిదుగురం మిత్రులం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించామనీ, కామెడీ నేపథ్యంలో సాగే విభిన్న చిత్రమిదనీ నిర్మాతలు కిషన్ కవాడియా, వెంకట్రావ్ అన్నారు. జనవరి 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, రెండు పాటల్ని నేపాల్‌లో తీస్తామనీ దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఇసనాక సునీల్‌రెడ్డి. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల -
శంకరాభరణం టైటిల్‌తో...
‘శంకరాభరణం’... తెలుగు తెరపై ఓ క్లాసిక్.జేవీ సోమయాజులు, మంజు భార్గవి, బేబీ తులసి ముఖ్యతారలుగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయినా ప్రేక్షకుల మనోఫలకాలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే... ‘శంకరాభరణం’ టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రూపొందనుంది. రచయిత కోన వెంకట్ ఈ టైటిల్‌తో స్క్రిప్టు సిద్ధం చేశారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇటీవలే అంజలి కథానాయికగా ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి. -
'లౌక్యం' టీంతో సాక్షి చిట్‌చాట్
-
ఎవ్వరూ ఎవ్వరికీ బ్రేకివ్వలేదు!
-
అలా చేస్తే.. వాళ్ళకే ప్రమాదం!
-
శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించిన కోన వెంకట్!
సినిమా పరిశ్రమలో విభేదాలు సర్వ సాధారణమే. అయితే తాజాగా మాటల రచయిత కోన వెంకట్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య విభేదాలు చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీశాయి. ఈ చర్చకు కారణం వీరద్దరూ సుమారు 10 సంవత్సరాలు కలిసి పనిచేసి టాలీవుడ్ కు విజయవంతమైన చిత్రాలను ఆందించారు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన 'ఆగడు' చిత్రానికి కోన వెంకట్ మాటలు అందించలేదు. ప్రస్తుతం కోన వెంకట్ 'లౌక్యం' చిత్రానికి మాటలు రాశారు. లౌక్యం చిత్ర ప్రమోషన్ సందర్బంగా సాక్షి టెలివిజన్ లో చిట్ చాట్ చేస్తూ శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించారు. శ్రీను వైట్లతో నా ట్రావెల్ పది సంవత్సరాలు. మేమిద్దరం కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించాం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెండ్లీగా విడిపోయాం. నాకు శ్రీను లైఫ్ ఇవ్వలేదు. నేను శ్రీనుకి లైఫ్ ఇవ్వలేదు. సత్య చిత్రంతో నేను హిట్ సొంతం చేసుకున్నారు. 'ఆనందం' లాంటి మంచి చిత్రాన్ని అందించారు. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కోన వెంకట్ తెలిపారు. -
ఆ విలువ తెలుసు కాబట్టే గుర్తింపిచ్చారు!
-
రంగుపడుద్ది..?
ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో ‘రంగు పడుద్ది’ అంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. అప్పట్లో పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి కోన వెంకట్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. రచయితగా స్టార్డమ్ సంపాదించుకున్న కోన ఆ మధ్య ‘రామ్ అండ్ జూలియట్’ అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘రంగు పడుద్ది’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని బోగట్టా. ఇలాంటి టైటిల్స్ రవితేజ వంటి మాస్ హీరోలకు సరిగ్గా నప్పుతాయి. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారని వినికిడి. -
సినిమా రివ్యూ: పవర్
బలుపు చిత్ర విజయం తర్వాత ’మాస్ మహారాజ’ రవితేజ తదుపరి చిత్రం పవర్. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’ బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్‌ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్టైన్మెంట్ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్‌తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు. ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆణిముత్యం పాత్రతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు. ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి అవకాశం లభించిన ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు. విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్‌రాజ్ పరిమితమయ్యారు. టెక్నికల్ రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్లా పేలాయి. రవితేజ ఎనర్జీకి, కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. రవితేజను మరింత గ్లామర్‌గా చూపించారు. చిత్ర ఆరంభంలో వచ్చే యాక్షన్, చేజింగ్ ఎపిసోడ్స్ టాలీవుడ్ రే ంజ్కు మించి ఉన్నాయి. మ్యూజిక్ తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ అందించిన సంగీతంలో కొత్తదనమేమి కనిపించలేదు. రెగ్యులర్ బాణీలే మళ్లీ మళ్లీ వింటున్నామా అనే సందేహం కలుగుతుంది. దర్శకత్వం: రచయితగా గుర్తింపు పొంది.. దర్శకుడిగా మారిన బాబీ.. తన తొలి చిత్రంలో సాహసానికి ఒడిగట్టకుండా రెగ్యులర్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని పవర్ తెరకెక్కించారు. రవితేజ ఇమేజ్, ఎనర్జీని చక్కగా వాడుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యారు. అయితే పాత చింతకాయనే కథనే మళ్లీ సరికొత్త ప్యాకేజీలో కొత్త రుచిని అందించారని చెప్పవచ్చు. విక్రమార్కుడులో ఉండే ఆత్మను, బలుపులో ఉండే ఎంటర్ టైన్మెంట్ను మిక్స్ చేసి పవర్‌గా కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించారు. అయితే ప్రస్తుత కాలంలో సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రొటిన్ కథను చక్కటి స్క్రీన్‌ప్లే, వినోదం అనే పట్టాలకెక్కించి తన ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుడిని తప్పదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా... బలదేవ్ పాత్రను ఆరంభంలోనే ముగించడం, హస్పిటల్లో ఎపిసోడ్లో హోంమంత్రి తల్లికి సంబంధించిన సీన్, ఇంటర్వెల్ ట్విస్, చివర్లో బ్రహ్మీ పాట కొత్తగా అనిపించడమే కాకుండా దర్శకుడి ప్రతిభకు అద్దపట్టాయి. అయితే క్లైమాక్స్‌ను చూస్తే బలుపు తరహా ఇంకా మూస ధోరణినే నమ్ముకున్నారనిపిస్తుంది. ఓవరాల్‌గా అనేక ప్రతికూల అంశాలున్నా... ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సానుకూల అంశాలు డామినేట్ చేశాయని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్లతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం, త్వరలో వచ్చే భారీ చిత్రాల పోటిని ఎదురిస్తే తప్ప భారీ విజయం చిక్కకపోవచ్చు. --రాజబాబు అనుముల (ఇంగ్లీష్ రివ్యూ) -
'పవర్' ప్రెస్ మీట్లో కోన వెంకట్
-
చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని సూర్యామహల్‌లో ‘గీతాంజలి’ సినిమా యూనిట్ సోమవారం సందడి చేసింది. కోనవెంకట్ సమర్పణలో, ఎంవీవీ పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా వచ్చిన యూనిట్ సభ్యులకు పూల బొకేలు, బాణ సంచాతో థియేటర్ యజమానులు స్వాగతం పలికారు. అనంతరం సినిమా మధ్యలో యూనిట్ సభ్యులు ప్రేక్షకుల స్పందన అడిగి తెలుసుకున్నారు. సినీనటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హరర్లో కామెడీని కలిపి అందించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. డైలాగ్ రైటర్, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ మీ చిక్కోలు చిన్నోడు షకలక శంకర్‌ను ఆదరించినందుకు ఆనందంగా ఉందన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ మన శ్రీకాకుళంలో నేను నటించిన సినిమాను ఇంతగా ఆదరించడం సంతోషదాయకమన్నారు. వీరితో పాటుగా దర్శకుడు రాజ్‌కిరణ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజులు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని ధనంబాబు, మేనేజర్ రమేష్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో ‘గీతాంజలి’ జైత్రయాత్ర
-
విజయవాడలో ‘గీతాంజలి’ జైత్రయాత్ర
సినిమాల్లో సందేశం కంటే.. వినోదానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని గీతాంజని సినిమా నిర్మాత కోన వెంకట్ అన్నారు. సినిమాల్లో హిట్-ఫ్లాప్ అనే రెండు రకాలే ఉంటాయని, ప్రేక్షకులు ఆదరించడానికి పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదన్నారు. అందుకు గీతాంజలి సినిమా విజయమే నిదర్శనమని చెప్పారు. ‘గీతాంజలి’ జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా హోటల్ గేట్‌వేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ గీతాంజలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ముందే ఊహించామన్నారు. నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గీతాంజలికి ఇంతటి విజయూన్ని అందించిన ప్రేక్షకులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ జైత్రయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. శనివారం తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామని, విజయవాడ నుంచి యాత్రను ప్రారంభించామని, విశాఖ వరకు కొనసాగుతుందని చెప్పారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ గీతాంజలి సినిమా థియేటర్ల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.డెరైక్టర్ రాజ్‌కిరణ్ మాట్లాడుతూ సినిమా స్టోరీ విన్న తర్వాత శ్రీనివాసరెడ్డితోనే తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. కథ నచ్చి కోన వెంకట్ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు హరి, తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ -
దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్
రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్‌తో స్థానిక స్వామి థియేటర్లో హల్చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్‌కు వెళ్లిన యూనిట్‌కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్‌కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడలో... కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్‌కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్‌కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి పాల్గొన్నారు. -
గీతాంజలి టీంతో చిట్ చాట్ -2
-
గీతాంజలి టీంతో చిట్ చాట్ -1
-
'గీతాంజలి' మీడియా సమావేశం
-
‘దిల్’ రాజు యాక్టింగ్!
నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై కనిపించడం సర్వసాధారణం. రామానాయుడు తను నిర్మించిన చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు. అలాగే, ఎమ్మెస్ రాజు కూడా కొన్ని సిని మాల్లో కనిపించారు. ఇలా చాలామంది నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై అతిథి పాత్రలు పోషించారు. ఇప్పుడా జాబితాలో ‘దిల్’ రాజు కూడా చేరారు. అయితే, ఆయన సొంత సినిమాలో కాకుండా బయటి సినిమాలో నటించడం విశేషం. అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సమర్పణలో రూపొందిన ‘గీతాంజలి’ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆయన పాత్ర ఆయనే చేశారు. నిర్మాత ‘దిల్’ రాజుగానే ఆయన ఇందులో కనిపిస్తారు. -
గీతాంజలి మూవీ స్టిల్స్
-
అంజలి లేకపోతే ఈ సినిమా లేదు
‘‘ఇప్పటికి 45 కథలు రాసిన నాకు రాజకిరణ్ చెప్పిన ఈ కథ విని నేనెందుకిలా ఆలోచించలేకపోయానా అనిపించింది. భారీ చిత్రాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేను ఇలాంటి కథలను మరచిపోతున్నానేమో అనిపించింది. అంజలి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాళ్లమే కాదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో, అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. వీవీ వినాయక్, గోపీచంద్, మంచు లక్ష్మి పాటల సీడీలను ఆవిష్కరించి, ఎమ్మెల్యే కోన రఘుపతికి అందించారు. వినాయక్ మాట్లాడుతూ -‘‘అసలు దెయ్యాలే లేవనే నమ్మే బ్రహ్మానందంగారికి దెయ్యం కనిపిస్తే పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ -‘‘మామూలు సినిమాల్లో బ్రహ్మనందం భయపడితే వంద రోజులు ఆడుతున్నాయి. అదే హారర్ సినిమాలో బ్రహ్మానందంగారు భయపడితే తప్పకుండా 150 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ఇది తనకు స్పెషల్ మూవీ అని అంజలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్, పోనీ వర్మ, దశరథ్, శ్రీవాస్, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, వీరు పోట్ల, మెహర్ రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో, మోనాల్ గజ్జర్, నీరజ కోన తదితరులు మాట్లాడారు. -
అంజలీకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిందెవరు?
కోనసీమ అందాల భామ అంజలి కోలీవుడ్, టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇతర భాషాల నుంచి దిగుమతైన తారలకు గట్టి పోటీ ఇచ్చిన అంజలి తాజాగా గీతాంజలీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. గీతాంజలీ చిత్ర ఆడియో కార్యక్రమంలో అందర్నీ ఆకర్షించిన అంజలీ.. తాజాగా మీడియాలో హైలెట్ గా నిలిచింది. లేటెస్ట్ గా అంజలీ ఓ బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారును తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నారని ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. కోన వెంకట్ పోస్ట్ చేసిన అంజలీ ఫోటో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే తనకు తాను గిఫ్ట్ గా ఇచ్చుకున్నారనే అంశం చర్చనీయాంశమైంది. -
'గీతాంజలి' ఆడియో ఆవిష్కరణ
-
గీతాంజలి ఆడియో వేడుక పార్ట్ -2
-
గీతాంజలి ఆడియో వేడుక పార్ట్ -1
-
గీతాంజలి మూవీ వర్కింగ్ స్టిల్స్
-
వినాయక్ నన్ను డెరైక్షన్ చేయొద్దన్నారు!
సూటిగా సుత్తిలేకుండా మాట్లాడటం కోన వెంకట్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో డైలాగులు కూడా అలాగే ఉంటాయి. నిర్మాతగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, గీత రచయితగా మారి, కాలక్రమంలో మాటల రచయితగా, కథకునిగా ఎదిగి అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రతిభాశాలి కోన వెంకట్. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన నిర్మాణంలో ‘గీతాంజలి’ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో కోనతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ‘తోకలేని పిట్ట’(1996)తో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘గీతాంజలి’ చేశారు. కారణమేంటి? కథ అంతలా కట్టిపడేసింది. సగటు ప్రేక్షకునికి కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. పైగా.. నేను ఫ్యాక్షన్ కామెడీ చేశాను. యాక్షన్ కామెడీ చేశాను. మాఫియా కామెడీ చేశాను. హారర్ నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకూ కామెడీ చేయలేదు. ఇది నాక్కూడా కొత్త అనుభవం. పైగా ప్రస్తుతం హారర్ కామెడీ హవా నడుస్తోంది. కాంచన, ప్రేమకథాచిత్రమ్ విజయాలే అందుకు నిదర్శనాలు. ఇందులో హారర్, కామెడీ మాత్రమే కాదు. అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. అందుకే దర్శకుడు రాజకిరణ్ ఈ కథ నా వద్దకు తేగానే.. వెంటనే చేసేయాలని నిర్ణయించుకున్నా. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణగారిని కూడా నేనే పిలిపించి, నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. కథలో కొన్ని మార్పులు చేసి, కథనం, సంభాషణలు కూడా నేనే అందించాను. అంతగా నచ్చినప్పుడు మీరే డెరైక్షన్ చేయొచ్చుగా? ఈ కథ ద్వారా దర్శకుడవ్వాలనేది రాజకిరణ్ కోరిక. నా స్వార్థం కోసం ఒకరికి అన్యాయం చేయలేను. నా డెరైక్షన్ గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాను. కానీ.. అది కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం.. నా చేతిలో ఉన్న సినిమాలు, నన్ను నమ్ముకున్న దర్శక, నిర్మాతలే. ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేసుకునేలోపు కొత్త కమిట్మెంట్లు వచ్చిపడుతున్నాయి. దాని కారణంగానే ఈ విరామం. ఎవరినీ కాదనలేని పరిస్థితి నాది. ఒకసారి వినాయక్ అన్నారు. ‘నువ్వు దర్శకత్వం వైపు వెళ్లొద్దు. రైటింగ్‌లో ఉంటే ఎక్కువ సినిమాలు రూపొందుతాయి. వేలాది సినీ కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. డెరైక్షన్ వైపు చూశావంటే... నువ్వు కూడా ఏడాదికి ఒక సినిమా చేయాల్సి వస్తుంది. అది పరిశ్రమకు మంచిది కాదు’ అని. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. అందుకే.. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసి పంపుతున్నాను. ఏది ఏమైనా ఈ ఏడాది చివర్లో మాత్రం నా సినిమా ఉంటుంది. అంటే అందరూ అంటున్నట్లు పరిశ్రమలో రచయితల కరువు ఉందన్నది నిజమేనా? రైటర్లు వస్తున్నారు కానీ, నమ్మకాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. వారెంత మంచి కథ చెప్పినా వినడానికి మన దర్శక, నిర్మాతలు సిద్ధంగా లేరు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు అదే కథ నేను చెబితే వింటారు. అదే ప్రాబ్లమ్. అందుకే ‘టాలెంట్ ఉంది’ అనిపిస్తే వారిని సహాయకులుగా తీసుకుంటాను. వారికి బ్రేక్ రావడానికి కృషి చేస్తున్నా. హరీశ్‌శంకర్, బాబి అలా వచ్చినవారే. మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని కథలున్నాయి. ఏ ఏ సినిమాలు చేస్తున్నారు? కావల్సినన్ని కథలున్నాయి. సునీల్ హీరోగా ‘దిల్’రాజు నిర్మించనున్న చిత్రానికి కథ ఇచ్చాను. ‘అల్లుడు శీను’కి నేను, బాబీ కలిసి కథ ఇచ్చాం. రామ్ ‘పండగ చేస్కో’, గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్ చిత్రాలకు రచన నాదే. రీసెంట్గా నేను, గోపీ మోహన్ కలిసి రామ్‌చరణ్‌కి ఓ కథ రెడీ చేశాం. చరణ్‌కి కూడా ఆ కథ బాగా నచ్చింది. ఇంకా డెరైక్టర్ ఫిక్స్ అవ్వలేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది జనవరిలో ఆ సినిమా సెట్స్‌కి వెళ్తుంది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే... సల్మాన్‌ఖాన్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌కి కథ అందించాను. అభిషేక్ బచ్చన్ సినిమాక్కూడా కథ ఇచ్చాను. ఆ సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవి చాలా కథలు విన్నారు. కానీ... ఆమెకు ఏదీ నచ్చలేదు. ఇటీవలే ఆమెకు ఓ కథ చెప్పాను. అది ఆమెకు బాగా నచ్చింది. అక్టోబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ ఉంటుంది. శ్రీదేవి హీరోయిన్గా రూపొందే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు మీరు దర్శకత్వం వహించనున్నట్లు, అలాగే... త్వరలో సల్మాన్‌ని కూడా డెరైక్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి... నేను వారి సినిమాలకు కథను అందిస్తున్నానని చెప్పాను. దానికి డెరైక్ట్ చేస్తున్నట్లు రాసేశారు. అందులో నిజం లేదు. వారి సినిమాకు కథకుణ్ణి మాత్రమే. పవన్‌కల్యాణ్‌తో సినిమా అన్నారు. అది ఎందాకా వచ్చింది? ‘నా దర్శకత్వంలో మీరు నటించాలి’ అని ఆయన్ను అడిగాను. ‘కథ నచ్చితే ఎవరితో పనిచేయడానికైనా నేను సిద్ధం. అలాంటిది నీతో పనిచేయనా! మంచి కథ తీసుకురా’ అన్నారు. అన్నీ కుదిరితే... త్వరలోనే పవన్‌తో నా సినిమా ఉంటుంది. శ్రీనువైట్ల నుంచి విడిపోయాక మీ కెరీర్లో వచ్చిన మార్పులేంటి? మార్పులెందుకుంటాయి. ఒక డ్రైవర్ ఒక చోట మానేసి మరో చోట చేరతాడు. వాడి పనిలో ఏమైనా మార్పు ఉంటుందా? యజమాని మారతాడంతే, స్కిల్ మారదు. నా విషయంలోనూ అంతే... ఎక్కడ పనిచేసినా నా స్కిల్ మారదు. నా ప్రతిభలో కూడా మార్పు రాదు. 2004లో ‘వెంకీ’తో మా ప్రయాణం మొదలైంది. ప్రతి రిలేషన్‌కీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మాది ‘బాద్షా’తో ముగిసింది అంతే. ఆయన లేకుండా నేను బతకగలను... అలాగే నేను లేకుండా ఆయనా బతకగలరు. శ్రీనువైట్ల నుంచి బయటకు వచ్చాకే... నా నుంచి ‘బలుపు’ వచ్చింది. సో... ఎవరి ప్రయాణం ఆగదు. నేను ఇప్పటికీ చెప్పేది ఒక్కటే. శ్రీను వైట్లపై నాకెలాంటి పగ లేదు. తను కూడా బాగుండాలని కోరుకుంటాను. -
కోన వెంకట్ చెల్లెలు వివాహ వేడుక!
-
అంజలికి స్పెషల్
అంజలి భయపెట్టబోతోంది. అలాగే నవ్వించబోతోంది. తను ఒకేసారి భయాన్నీ, వినోదాన్నీ ఎలా కలిగిస్తుందంటే... ‘గీతాంజలి’ చూడాల్సిందే అంటున్నారు రచయిత కోన వెంకట్. ఆయన సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’. అంజలికి ఇది తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. రాజకిరణ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కోనవెంకట్ మాట్లాడుతూ -‘‘అనుష్కకు ‘అరుంధతి’లా, జ్యోతికకు ‘చంద్రముఖి’లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచే సినిమా ఇది. ఎవ్వరూ ఊహించని విధంగా కథాకథనాలు ఉంటాయి. నాదైన శైలిలో వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. బ్రహ్మానందంగారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘ఇప్పటికి 80శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. జూన్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే అతిథి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం, రావు రమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, యాక్షన్: విజయ్, ఆర్ట్: రఘుకులకర్ణి, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్. -
గీతాంజలి మూవీ ప్రెస్ మీట్
-
అంజలి... ‘గీతాంజలి’
అంజలి నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘గీతాంజలి’ సినిమా లోగోను పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కోన వెంకట్‌కు, ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారాయన. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అనుష్కకు అరుంధతిలా, అంజలికి గీతాంజలి ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అంజలి, బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, కెమేరా: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వీఎస్ఎన్ కుమార్. -
‘గీతాంజలి’లోగో ఆవిష్కరించిన పవన్
హైదరాబాద్: అంజలి తొలిసారిగా నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘గీతాంజలి’ లోగోను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కోన వెంకట్, ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ఎవ్వరూ ఊహించని విధంగా కథాకథనాలు ఉంటాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అనుష్కకు అరుంధతిలా, అంజలికి గీతాంజలి ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో మొత్తం 4 పాటలుంటాయి. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అంజలి, బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే, సత్యం రాజేష్, మధునందన్, షకలక శంకర్, హర్షవర్థన్, అపర్ణ వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, డాన్స్: శేఖర్, యాక్షన్: విజయ్, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమేరా: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్.కుమార్. -
దర్శకుడిగా మారబోతున్న మరో రచయిత
-
టాలీవుడ్ తెరపై శ్రీదేవి, కోన వెంకట్ కథకు గ్రీన్ సిగ్నల్!
తెలుగు తెరపై శ్రీదేవి కనిపించి చాలా సంవత్సరాలే అయింది. అయితే తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే దగ్గరయ్యేందుకు శ్రీదేవి త్రిభాష చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ చెప్పిన కథకు శ్రీదేవి తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పినట్టు ట్విటర్ లో ట్వీట్ చేశారు. శ్రీదేవితోపాటు భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ క నచ్చడంతో త్రిభాష చిత్రంగా రూపొందించేందుకు మొగ్గు చూపుతున్నట్టు కోన వెంకట్ వెల్లడించిన సమాచారం. శ్రీదేవిని కలిసి కథ చెప్పే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాను తన కథను అంగీకరించింది. బోని కపూర్ మూడు భాషల్లో రూపొందించనున్నారు అని కోన వెంకట్ తెలిపారు. ఆ చిత్రానికి దర్శకులు ఎవరన్నది, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం విమర్శల ప్రశంసలందుకుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత ఎన్నో అవకాశాలను వదులుకున్న శ్రీదేవి.. కోన వెంకట్ కథకు ఓకే చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. -
హ్యేపీ ఇండిపెండెన్స్ డే!
67వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులమైనందుకు గర్వపడుతున్నామని, దేశం గర్వించేలా ఏదైనా చేయాలని పలువురు పేర్కొన్నారు. మాతృభూమిలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హ్యేపీ ఇండిపెండెన్స్ డే.. భారతీయుడినని గర్వించు.. జైహింద్ అంటూ హీరో రామ్ ట్విట్ చేశారు. వందేమాతరం అంటూ హీరో రామ్ చరణ్ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులకు రచయిత కోన వెంకట్ వందనాలర్పించారు. స్వతంత్ర భారతావనికి హీరో సిద్ధార్థ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దేశానికి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానన్నాడు. నిజమైన భారతదేశ పౌరురాలిగా గర్వపడుతున్నానని హీరోయిన్ శ్రియా శరణ్ ట్విట్ చేసింది. భారతదేశం తన నా మాతృభూమి అయినందుకు గర్విస్తున్నానని, ఐ లవ్ ఇండియా అంటూ జెలీనియా పేర్కొంది. శాంతి, అనురక్తితో జీవించాలని ప్రియా ఆనంద్ ఆకాంక్షించింది. మిత్రులందరికీ పద్మశ్రీ డాక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా ఒకటేనని మంచు మనోజ్ ట్వీట్ పోస్ట్ చేశాడు. మేరా భారత్ మహాన్, భారతీయుడినని గర్వించు అని మంచు విష్ణు పేర్కొన్నారు. దేశం గర్వించేలా ఏదైనా చేయాలని సోనూ సోద్ సూచించాడు. తన 25వ సినిమా టైటిల్ 'హ్యేపీ ఇండిపెండెన్స్ డే' అని తమిళ హీరో ధనుష్ ట్వీట్ చేశాడు.