special category status for AP
-
కేంద్రం కనికరమెంత?
సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి, వంద శాతం వ్యయాన్ని భరించి సత్వరమే ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. ఇందుకోసం 2014లోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే, అప్పటి సీఎం చంద్రబాబు.. కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ప్రత్యేక హోదాను కూడా వదులుకోవడానికి కూడా అంగీకరించారు. దీంతో కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకొంది. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. బడ్జెట్లో కేటాయింపుల ద్వారా కాకుండా ఎల్‌టీఐఎఫ్(దీర్ఘకాలిక నీటి పారుదల నిధి) రూపంలో నాబార్డు రుణం ద్వారా నిధులను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్ చేస్తామని) మెలిక పెట్టింది. దీనికీ చంద్రబాబు అంగీకరించారు. ఈమేరకు 2016 డిసెంబర్ 26న సంతకం చేశారు. దాంతో బడ్జెట్లో నిధుల కేటాయింపు హక్కును రాష్ట్రం కోల్పోయింది. 2017–18 నుంచి బడ్జెట్లో కేంద్రం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. పోలవరం మినహా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద చేపట్టిన 99 ప్రాజెక్టులు పూర్తవడంతో 2022–23లో ఎల్‌టీఐఎఫ్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించి, సకాలంలో ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కట్టుబడుతుందా? లేదా? అన్నది ఫిబ్రవరి 1న వెల్లడికానుంది. రీయింబర్స్ ప్రక్రియలో తీవ్ర జాప్యం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి నిర్మాణానికి అయిన ఖర్చును కేంద్రం నాబార్డు రుణాలతోనే రీయింబర్స్ చేస్తోంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది నిధుల కొరతకు దారితీసి, ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపుతోంది. 2021–22లో బడ్జెట్లో కేటాయించకపోయినప్పటికీ, భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో మిగులు ఉండటంతో రూ.320 కోట్లను బడ్జెట్ ద్వారా పోలవరానికి కేంద్రం విడుదల చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పోలవరానికి నిధులను కేటాయించలేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా సరిపడా నిధులు కేటాయించి, సకాలంలో రీయింబర్స్ చేస్తే– పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
సడలని పట్టు! విభజన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచినా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు. అపరిష్కృత అంశాలపై గతంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పలుమార్లు సమావేశమై కొంత పురోగతి సాధించినా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఆర్థ్ధిక ఆంక్షలపై జోక్యం చేసుకోండి.. గత సర్కారు పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను ఇప్పుడు సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోందని, కేటాయించిన రుణ పరిమితిలో కోతలు విధిస్తోందని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. గత సర్కారు చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిల అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తం రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. పోలవరానికి నిధులిచ్చి సహకరించండి.. ప్రధానితో భేటీలో ప్రధానంగా పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన అంచనా వ్యయాల ఖరారు, నిర్వాసితులకు చెల్లింపులు లాంటి అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లను రెండేళ్లుగా కేంద్రం చెల్లించలేదని, ఈ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేస్తూ దీన్ని ఖరారు చేసి త్వరగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి కాంపొనెంట్‌ను విడిగా కాకుండా ప్రాజెక్టులో భాగంగానే చూడాలని కోరారు. నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా పరిగణించడంతో బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల నిర్మాణంలో జాప్యం కావడంతోపాటు వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వారీగా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లిస్తే చాలావరకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు రూ.10,485.38 కోట్లు అవసరమని, అడ్‌హాక్‌గా నిధులు మంజూరు చేస్తే పనులు వేగంగా కొనసాగుతాయని వివరించారు. ఈ నిధులను మంజూరు చేస్తే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని సానుకూలం.. సీఎం ట్వీట్ విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించాం. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరటంపై ప్రధాని సానుకూలంగా స్పందించారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ బకాయిలు.. హోదా.. విశాఖ మెట్రో తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ జెన్కోకు ఈ బకాయిల వసూలు అత్యవసరమన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనలు హేతుబద్ధంగా లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్నప్పటికీ 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రేషన్ సరుకులను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని చెప్పారు. ఇందుకోసం రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నెలకు సుమారు 3 లక్షల టన్నుల రేషన్ బియ్యం నిల్వలు కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపచేసినట్లు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అంశాలతో నీతి ఆయోగ్ కూడా ఏకీభవించి కేంద్రానికి సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ► రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యమన్నారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ► కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచేలా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని సీఎం కోరారు. ► రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 26కు పెరిగిన నేపథ్యంలో అదనంగా మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని సీఎం కోరారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 మెడికల్ కాలేజీలతో కలిపి 14 మాత్రమే ఉన్నందున మిగిలిన 12 జిల్లాలకు కూడా వెంటనే వైద్య కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నట్లు తెలిపారు. ► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు. -
ఏపీపై కేంద్రం వివక్ష.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాటవేస్తోంది
రాజమహేంద్రవరం రూరల్: ఏ రాష్ట్రంపైనా లేని విధంగా ఏపీపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు తదితర అంశాలపై లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం కావాలనే సాకులు చెబుతున్నట్లు ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటున్న కేంద్రం.. దానికి గల కారణాలను పరిశీలించడం లేదని మండిపడ్డారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు, వాటి దుర్వినియోగంపై నాటి టీడీపీ పాలకులను ప్రశ్నించాలన్నారు. ఈ విషయాన్ని కాగ్ కూడా బహిర్గతం చేసిందని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడం లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినా కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కేంద్రం స్పందించకపోవడంతోనే వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు అంశాలపై ప్రైవేటు బిల్లు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖ–చెన్నై కోస్తా కారిడార్, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, ధాన్యానికి గిట్టుబాటు ధర, వైద్య కళాశాలల ఏర్పాటు, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టులపై కేంద్రాన్ని ప్రశ్నించామన్నారు. -
రూ.10,000 కోట్లతో పోలవరం పరుగులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు వీలుగా అడహక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని విన్నవించారు. కాంపోనెంట్ వారీగా రీయింబర్స్ విధానంతో నిర్మాణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతున్న దృష్ట్యా దీనికి స్వస్తి చెప్పాలని కోరారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించిన మాదిరిగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ అంశాలను విన్నవించేందుకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా పోలవరం, రిసోర్స్ గ్యాప్ నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానితో చర్చించి వినతిపత్రం అందజేశారు. రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించండి పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సొంతంగా రూ.2,900 కోట్లు ఖర్చు చేసిందని, ఈ మొత్తాన్ని వెంటనే రీయింబర్స్ చేయాలని సీఎం జగన్ కోరారు. సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీబీటీ పద్ధతి ద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్ రీసోర్స్ గ్యాప్ నిధులు మంజూరు చేయాలి.. రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు ‡చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. 2014–15కి సంబంధించి బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈ నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ అందుతుండగా ఇందులో కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల మందికి రాష్ట్రమే రేషన్ వ్యయాన్ని భరిస్తోందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమని, ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్ ఇప్పటికే సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడంతో సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం సైతం పథకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులపై పునఃపరిశీలన చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీవారి చిత్రపటం అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ వీటిని పరిష్కరించండి.. ► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఈ బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఒడ్డున పడతాయి. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించేందుకు మార్గం సుగమమం అవుతుంది. ► రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదు. దీనివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. ► పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది. ► రాష్ట్రంలో 26 జిల్లాలకుగానూ కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. వీటిని మంజూరు చేయాలి. ► కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ► ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ► గత సర్కారు హయాంలో రాష్ట్రంలో నిర్దేశిత పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. ఇప్పుడు మూడేళ్లలో రూ.17,923 కోట్లకుపైగా రుణ పరిమితిలో కోత విధించారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కానీ గ్రాంట్లు కావు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాలి. -
ప్రత్యేక హోదా ఖరీదు రూ.15 వేల కోట్లు
మదనపల్లె/చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకహోదా ఖరీదు రూ.15,000 కోట్లుగా ప్యాకేజీని నిర్ణయించి వాటితో పాటుగా ఆరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తే సరిపోతుందన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా, ఐదేళ్లు అధికారంలో ఉండి సింగపూర్, జపాన్ అంటూ మోసగించిన వారిని నిలదీయాలన్నారు. -
‘హోదా’ ఎందుకివ్వలేదో చెప్పండి
కడప కార్పొరేషన్: ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ఎందుకివ్వలేదో చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ నిర్వహించిన రణభేరిపై శనివారం కడప కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చెయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. పో తిరెడ్డిపాడును విస్తరించడం ద్వారా ఆయన రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్ మరింత మేలుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర సహకారం లేనందునే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ముందుకు సాగకుండా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందన్నారు. ఇక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టమేమీలేదన్నారు. ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని మీటింగులు పెట్టినా బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. బీజేపీ రణభేరికి జెండా, అజెండా లేదన్నారు. విభజన సమస్యలు తీర్చలేదుగానీ.. మరో కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీలో ఇప్పుడున్న సమస్యలను పరి ష్కరించడం చేతగాని బీజేపీ, కొత్త సమస్యల కోసం పోరాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ సమస్యనూ ఇంతవరకూ పరిష్కరించలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గండికోట ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి సురేష్ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమైందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. తమను పట్టించుకోని కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజల మాదిరిగానే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా తిరస్కరించారని తెలిపారు. రాజ్యసభలో సోమవారం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో మౌలికసదుపాయాలు, సరిహద్దు వ్యాపారం అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. విభజన అనంతరం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ప్రత్యేకహోదా కల్పించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి మాజీ ప్రధాని మన్మోహన్ సభలో ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం గౌరవించాలని కోరారు. విభజన చట్టంలోని అనేక లోపాలను బీజేపీ అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎగ్గొడుతోందని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టంలో చేర్చకపోవడం వల్లనే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 19 February 2022
-
‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు తెచ్చుకున్న బాబు’
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు.. సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం దగ్గర ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు కూడా తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పుడు రాష్ట్రానికి అదే విధంగా నిధులు రాబట్టుకోవాలన్నారు. విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు సీఎంగా ఉండి కూడా రాజధానిని కట్టకుండా చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. -
హోదాపై ప్రత్యేక కమిటీ వేయండి: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి.. దానిని సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఈ లేఖ ప్రతులను మీడియాకు అందజేశారు. లేఖలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని జీవీఎల్ ప్రస్తావించలేదు. తెలంగాణతో పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై 17న జరిగే సబ్ కమిటీ సమావేశం అజెండా నుంచి హోదా సహా నాలుగు అంశాలను సవరించడాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి నాలుగు అంశాలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కారణాలు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆ లేఖలో జీవీఎల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర స్థాయిలో చర్చ జరిగితే తమకూ సంతోషమేనని తెలిపారు. బాబు ప్రతిపాదనతోనే ప్యాకేజీ హోదానైనా ఇవ్వండి లేదా అంతకు సరిపడా ప్యాకేజీ ఇవ్వండి అని అప్పట్లో చంద్రబాబు ప్రతిపాదన చేసేనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు. -
‘హోదా’ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్
ప్రత్తిపాడు: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు నిజంగా కష్టపడుతున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సోమవారం గ్రామ సచివాలయ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల్లో పెట్టిన ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రం విడిపోయిన నాటినుంచీ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా పలుసార్లు మోదీని నేరుగా కలిసి హోదా అంశాన్ని గుర్తు చేశారని, ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఇదే అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడారని వివరించారు. అయితే, ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని, ప్రత్యేక ప్యాకేజీ చాలని గత ప్రభుత్వం చెప్పడం వల్లే ఈ అంశాన్ని పక్కన పెట్టామని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చాలాసార్లు చెప్పారని హోంమంత్రి అన్నారు. కేంద్రం వెనక్కిపోవడం బాధాకరం విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే చాలా లాభాలున్నాయని, అందుకోసమే ఎప్పటి నుంచో హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీస్తున్నారని హోం మంత్రి సుచరిత చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం శాఖ అజెండాలో పెట్టిన ప్రత్యేక హోదా అంశంపై వెనక్కిపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చెప్పిందన్నారు. 2014లో మోదీనే స్వయంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అధికారంలోనికి వచ్చిన తరువాత దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఎందుకంటే మనం అడిగే పరిస్థితుల్లో ఉన్నామని, వారు అడిగించుకునే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం
విజయనగరం అర్బన్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యేక హోదా అని, దానిని సాధించే వరకు పోరాటం ఆగదని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్లో మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీలు ఉన్నారని చెప్పారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా పలు దఫాలు ప్రధాని మోదీని కలిసి వినతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి సంబంధం లేదని, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని చెప్పారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలను అధిగమించి త్వరలోనే చట్టం చేస్తామన్నారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని రావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
అది ముగిసింది
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్)/పాలకొల్లు సెంట్రల్: ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమని, దానికి మించి దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు, ఇతర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రూ.లక్షల కోట్లు రాష్ట్రానికి అందజేస్తుంటే.. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు వాటితో చేపట్టిన అభివృద్ధి పనులకు తమ పేర్లు, స్టిక్కర్లు అంటించుకుని తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్టెట్‌పై మేధావులతో ఆదివారం నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పొరపాటున చేరిందని, ఆ అంశం అనవసరమైందని తర్వాత గుర్తించడంతో దానిని తొలగించాల్సి వచ్చిందని జీవీఎల్ చెప్పారు. ఈ అంశమే ప్రధానమైనది కదా అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ.. ఏపీకి ప్రధానం కావచ్చునేమోగానీ, తెలంగాణకు అప్రధానమైనది కదా అని బదులిచ్చారు. సాక్షాత్తూ ప్రధానే రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని, అనైతికంగా విభజన చేశారని అన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అభ్యంతరమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ఇక ప్రత్యేక హోదా అనే అంశం లేనట్లేనన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వినియోగ సమస్యలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, పౌర సరఫరా సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్, వనరుల అంతరం తదితర అంశాలపై ఆ త్రిసభ్య కమిటీ ప్రధానంగా చర్చిస్తుందని వివరించారు. రాష్ట్రం చేతుల్లోనే ‘కాపు రిజర్వేషన్’ అంతకుముందు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యను జీవిఎల్ కలుసుకుని కాపు రిజర్వేషన్లపై ఆయనతో చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం రాజమహేంద్రవరం ఏకేసీ కళాశాల రోటరీ రివర్ సిటీ హాలులో బీజేపీ రాష్ట్ర మేధావుల సెల్ కన్వీనర్ వడ్డి మల్లికార్జునరావు అధ్యక్షతన రాష్ట్ర కాపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంనాటి కాపు రిజర్వేషన్ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉందన్నారు. ఈ సమస్యను కేంద్రం పరిధిలోకి నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా దీనిపై చర్య తీసుకోవచ్చన్నారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను వెంటనే అమలుచేయాలని జీవిఎల్ డిమాండ్ చేశారు. నాడు కాపులను చంద్రబాబు మోసం చేశారని, నేడు వైఎస్సార్సీపీ కూడా కాపులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోపు కాపు రిజర్వేషన్లను అమలుచేయాలని, లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తాను ఆరు నెలల నుంచి అధ్యయనం చేశానని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు వచ్చినా రిజర్వేషన్లు అమలు చేయడంలో ఇబ్బందిలేదని, ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని జీవీఎల్ చెప్పారు. -
‘హోదా’పై ప్రత్యేక భేటీ!
సాక్షి, అమరావతి: ‘హోదా’పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపాలని.. అలా తమ పార్టీ కూడా కోరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇందుకోసం విడిగా ఒక సమావేశం అడగమనండి.. పెట్టమనండి అని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం అయినందున ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆ అంశాన్ని అజెండా నుంచి కేంద్రం తొలగించిందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు తెలంగాణకు ఎలాంటి సంబంధంలేదని.. ఇది దానిలో పెట్టాల్సిన అంశం కాదని ఆయన చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదాకు సరిపడా నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధం ఇక ప్రత్యేక హోదాకు సరిపడా నిధులు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వంలో కొంత కసరత్తు జరిగిందని సోము వీర్రాజు వెల్లడించారు. అప్పట్లో ఆ మేర నిధులివ్వడానికి కేంద్రం సిద్ధపడిందని, హోదా అంశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమేరకు ముందుకెళ్లిందని చెప్పడానికే ఈ అంశాలను తాను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానన్నారు. ప్రత్యేక హోదాకు సరిపడా నిధులివ్వడానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కసరత్తును ఈ ప్రభుత్వం మళ్లీ మొదలెట్టాలని వీర్రాజు అన్నారు. 17న కేంద్రమంత్రి గడ్కరీ రాక రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, మరికొన్నింటి శంకుస్థాపనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా 21 జాతీయ రహదారులను ప్రారంభిస్తారని, మరో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. రూ.64 వేల కోట్ల ఖర్చుతో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని.. ఇందులో అధిక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకోవాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని వీర్రాజు ప్రశ్నించారు. ఈనెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గడ్కరీ పాల్గొనే సభా వేదిక నిర్మాణాన్ని సోము వీర్రాజు పరిశీలించారు. -
అజెండాలో చేర్చినప్పుడు నోరెత్తలేదేం?
సాక్షి, మచిలీపట్నం, కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలుత విభజన సమస్యల పరిష్కార కమిటీ అజెండాలో చేర్చినప్పుడు ఏమాత్రం స్పందించని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు తొలగించగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తహతహ లాడుతున్నారని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తన కోవర్టులను బీజేపీలో చేర్చి నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకుని కనీసం అదికూడా సాధించలేని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నాడు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజుతో హోదా అవసరం లేదని అర్ధరాత్రి ప్రకటన చేయించారని గుర్తు చేశారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో, గడికోట శ్రీకాంత్‌రెడ్డి కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నీచ రాజకీయాలొద్దు.. ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఒక్క రూపాౖయెనా తెచ్చారా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో చంద్రబాబు మార్గదర్శకత్వంలో కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈర‡్ష్య, నీచ రాజకీయాలను కట్టి పెట్టాలని సూచించారు. విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ అజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీలో చేరిన తన కోవర్టుల ద్వారా చంద్రబాబు తొలగింప చేశారని చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే కదలిక ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించాలని కోరటాన్ని మంత్రి నాని గుర్తు చేశారు. ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని, ఏపీకి జరిగిన అన్యాయంపై దృష్టి సారించాలని ప్రధానిని సీఎం కోరారన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని అపరిష్కృత అంశాలకు సంబంధించి కమిటీని నియమించారని తెలిపారు. ప్రతిపక్షం కాదు.. పనికిమాలిన పక్షం టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరుకున్న కొందరు నాయకులు చంద్రబాబు అజెండాను అక్కడ అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం కాదని, పనికిమాలిన పక్షమని «ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పదేపదే ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ డిమాండ్‌ను సజీవంగా ఉంచారని చెప్పారు. -
మోదీ వ్యాఖ్యలపై చర్చకు నోటీసు ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. మోదీ మాట్లాడిన అంశాలపై ఏపీ ఎంపీలు నోటీసు ఇవ్వాలని కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చ జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని అన్నారు. చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి మెజార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇటీవల రాజ్యసభలో ఏపీపై చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి షెడ్యూల్ 9, 10లలో ప్రస్తావించిన 150 సంస్థల విషయం ఎనిమిదేళ్లు అవుతున్నా కేంద్రం తేల్చకపోవడం అన్యాయమన్నారు. -
హోదాపై కేంద్రం ద్వంద్వ వైఖరి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడంలో ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో ఏర్పడిన నూతన రాష్ట్రాలకు ఏ చట్టంలో ఉందని ప్రత్యేక హోదా కల్పించారో చెప్పాలని సోమవారం పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఎగ్గొట్టడానికి ఆ పార్టీ కుంటిసాకులు చెబుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ఏం చేశారని రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోందని.. చట్టం చేసింది కాంగ్రెస్.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది టీడీపీ అని గుర్తుచేస్తూ.. కానీ, వైఎస్సార్సీపీని ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించి న విజయసాయిరెడ్డి ఇటు అధికార బీజేపీని హోదా పై ఘాటుగా ప్రశ్నిస్తూనే టీడీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. అంతకుముందు.. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు విజయాలు, ప్రాధామ్యాలు వివరిస్తూ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి్డ తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన తన ప్రసంగంప్రారంభించారు. ప్రత్యేక హోదాపై .. అధికారంలోకి వచ్చిన త ర్వాత వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంలేదంటూ ఆరోపించడం టీడీపీకి దినచర్యగా మారిందని విమర్శించా రు. సభ సాక్షిగా కొన్ని వాస్తవాలు తెలపాల్సి ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడుసార్లు ప్రధాని మోదీ తో, 12సార్లు హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారని, ప్రతిసారీ హోదా అంశాన్ని ప్రస్తావిం చారని గుర్తుచేశారు. ఇటీవల తిరుపతిలో నిర్వహిం చిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులోనూ అమిత్‌షాను హోదా గురించి డిమాండు చేశారన్నా రు. ఈ అంశంపై చర్చకు గత పార్లమెంట్ సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చి ఉభయ సభలను స్తంభింపచేశామని గుర్తుచేశారు. బీజేపీ కుంటిసాకులివే.. ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడానికి కేంద్రం కుంటిసాకులు చెబుతుందని విజయసాయిరెడ్డి తెలి పారు. ఏపీకి ఇస్తే జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలూ డిమాండ్ చేస్తాయని కేంద్రం చెబుతోందన్నారు. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినా ఏ రాష్ట్రం రాజధానిని కోల్పోలేదన్నా రు. కానీ, విభజనకు గురైన ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయిందన్నారు. అలాగే.. ‘‘విభజనకు గురైన ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెం ట్ సాక్షిగా ప్రధానమంత్రి వాగ్ధానం చేశారా? ఏపీకి హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కా దా?.. అలాగే, ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. ఆర్థిక ప్రా తిపదికన ఏపీకి హోదా ఇస్తే వెనుకబడిన ఒడిశా, బిహార్లూ హోదా కోసం డిమాండ్ చేస్తాయన్న కారణాన్ని కేంద్రం చూపిస్తోంది. ఒడిశా, బిహార్‌లు ఆర్థికంగా వెనకబడిన వాస్తవం నాడు మన్మోహన్ సింగ్‌కు తెలియదా?’’ అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌కు ఇచ్చారు కదా.. ఇక విభజన చట్టంలో ఎక్కడా ‘హోదా’ ప్రస్తావనే లే నందున మంజూరు చేయలేమని కేంద్రం చెబుతోందని.. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్ విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదాను ఇవ్వలేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు. అలాగే.. ‘హోదా’ రాజకీయంగా సాధ్యపడే అంశం కాదనడం కేంద్రానికి సరికాదని తెలిపారు. గతేడాది పాండిచ్చేరి ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని అనలేదా అని ప్రశ్నించారు. హోదాకి ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు హోదా బదులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, హోదాకి ప్ర త్యేక ప్యాకేజీ ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కా దని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు.. ఏపీతోపాటు విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 164వ నివేదికలో సిఫార్సు చేసినందున ఇప్పటికైనా ఏపీకి హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. నికర రుణ సేకరణపై ఆంక్షలా!? మరోవైపు.. ఏపీ నికర రుణ సేకరణ పరిమితిని త గ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు హయాం లో పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఇప్పుడు ఏపీని శిక్షించడం తగదన్నారు. నికర రుణ సేకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఏపీ ఎంత మెరుగ్గా ఉందో వివరించారు. 2019–20లో కేంద్రం ద్రవ్యలోటు 4.6 శాతం ఉంటే, ఏపీలో 4.1 శాతం, 2020–21లో కేంద్రంలో లోటు 9.2 శాతం ఉంటే ఏపీలో 5.4 శాతం, 2021–22లో కేంద్రంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండగా ఏపీలో 3.5 శాతం ఉందన్నారు. వాస్తవాలు గమనించి ఏపీ నికర రుణ సేకరణ పరిమితిపై ఆంక్షలు తొలగించాలని కోరారు. -
పెండింగ్.. పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయాలను తక్షణమే ఆమోదించేలా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ఖర్చులో అధికభాగం భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి రావటం, ముంపు ప్రాంతాల కుటుంబాలకు ప్యాకేజీలు విస్తరించాల్సిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్నారు. సవరించిన అంచనాలకు కేంద్ర సంస్థలే ఆమోదం తెలిపినప్పటికీ ఆ మేరకు నిధుల విడుదలకు కేంద్రం తిరస్కరించడం ప్రాజెక్టు పనులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రధాని దృష్టికి తెచ్చారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా ఆమోదించి నిధులివ్వాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనంతరం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో గంటకుపైగా సమావేశమయ్యారు. ఏపీలో రెవెన్యూ లోటు, పెండింగ్ నిధులు, విద్యుత్ బకాయిలు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై చర్చించి వినతిపత్రాలు అందజేశారు. ఆ వివరాలివీ.. విభజన పర్యవసనాలతో ఆర్ధిక ప్రగతికి దెబ్బ.. రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఏపీకి కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం. భౌగోళికంగా తెలంగాణ కంటే పెద్దదైన ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను తీర్చి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల రాజధానిని, మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేస్తే చాలావరకు ఊరట లభిస్తుంది. కానీ ఇప్పటికీ చాలా హామీలు నెరవేరలేదు. ఇరిగేషన్‌కే నిధులనడం సరికాదు.. 2013 భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 ఏప్రిల్ 1 అంచనాల మేరకు పోలవరానికి నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. విభజన చట్టం సెక్షన్ 90 స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం. ఏ ప్రాజెక్టులోనైనా రెండు రకాల అంశాలుంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు ఇరిగేషన్లో అంతర్భాగం. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ప్రాజెక్టు ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. రూ.2,100 కోట్ల పోలవరం పెండింగ్ బిల్లులనూ మంజూరు చేయండి. ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్ తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు.. విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో విద్యుత్‌ను అందించింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. సంపన్న రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారులు అధికం జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థికంగా ఎదిగిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పీడీఎస్ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నా. కోవిడ్‌తో సంక్లిష్ట పరిస్థితులు.. 2019–20 ఆర్థిక మందగమనం ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.34,833 కోట్లు రావాల్సి ఉండగా రూ.28,242 కోట్లు మాత్రమే వచ్చాయి. 2020–21లో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కోవిడ్ మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. కేంద్ర పన్నుల్లో రూ.7,780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య పరిరక్షణకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.వేల కోట్లలో ఉంటుంది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల చేతికి నేరుగా డబ్బులు అందచేసి (డీబీటీ) సంక్షోభ సమయంలో ఆదుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ ææనిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా అమలు చేశాం. ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు 2020–2021లో దేశ జీడీపీలో 11 శాతం మేర కేంద్రం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. గత సర్కారు హయాంలోనే అధికంగా అప్పులు 2021–22 ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా నిర్ధారించగా కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. గత సర్కారు హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండా రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తీసుకుంటున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నాం. గత సర్కారు హయాంలో అధికంగా అప్పులు చేశారనే కారణంతో ఇప్పుడు కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన తరుణంలో ఇలాంటి పరిమితులు సరికాదు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించాలి. – భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్‌ను రెన్యువల్ చేయాలి. కడప స్టీల్ ప్లాంట్... వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలి. వేలం ప్రక్రియ వల్ల తక్కువ ఖర్చుకు గనులు దొరికే అవకాశాలు సన్నగిల్లుతాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించాం. ఎస్సార్ స్టీల్స్ కాంపిటేటివ్ బిడ్డర్‌గా ఎంపికైంది. రుణం మంజూరుకు ఎస్బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తైతే రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది. -
దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా!
సాక్షి, అమరావతి: దేశాన్ని తాకట్టు పెట్టి బహిరంగ వేలానికి సిద్ధపడిన బీజేపీ.. కమ్యూనిస్టులను విమర్శించడం విడ్డూరమని సీపీఎం రాష్ట్ర కమిటీ మండిపడింది. బీజేపీ నేతల్ని కమ్యూనిస్టులు వెంటాడుతూనే ఉంటారని, ఆ పార్టీ నిజస్వరూపాన్ని బట్టబయలుచేసి ప్రజాకోర్టులో నిలబెట్టేది తామేనని ప్రకటించింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీ చట్టంలోని అంశాలను అమలు చేస్తామని చెప్పి మాటతప్పింది బీజేపీ కాదా? అని నిలదీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభల తీర్మానాలను పార్టీ నాయకులు ఎంఏ గఫూర్, మంతెన సీతారాం, ప్రభాకర్‌రెడ్డి, సీహెచ్ బాబూరావు బుధవారం మీడియాకు విడుదల చేశారు. ‘ప్రజల సమస్యలను పరిష్కరించమంటే కమ్యూనిస్టులపై దుమ్మెత్తిపోస్తారా, సోము వీర్రాజు లాంటి మతోన్మాద వ్యక్తులకు కమ్యూనిస్టుల విలువ, త్యాగాలు, పోరాటాలు ఏం తెలుసు’ అంటూ ఎద్దేవా చేసింది. వీర్రాజుకు దమ్ముండి తమ దగ్గరకు వస్తే ప్రజాసంఘాల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలన్నింటినీ చూపుతామని సవాల్ చేసింది. బీజేపీ మాదిరి తమకు రహస్య ఖాతాలు ఉండవని పేర్కొంది. కాసుల కక్కుర్తి కాషాయానిదేగానీ కమ్యూనిస్టులది కాదని చెప్పింది. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పార్టీ మహాసభ తీర్మానించింది. 1,05,601 కుటుంబాలు ముంపునకు గురవుతుంటే 15 ఏళ్లలో కేవలం 4 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని పేర్కొంది. పునరావాసాన్ని దశలవారీగా కాకుండా ఏకకాలంలో పూర్తిచేయాలని డిమాండ్ చేసింది. రాజధానిగా అమరావతినే ఉంచండి రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని విమర్శించింది. దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. ఆస్తిపన్ను పెంపు ఆపాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, మైనారిటీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ను అమలు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని, దళితులపై దాడులు, సామాజిక సమస్యలపై పోరాడాలని పార్టీ మహాసభ తీర్మానించింది. -
ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరలేరు
సాక్షి, అమరావతి: చట్ట సభలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని న్యాయస్థానాలను కోరడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బడ్జెట్లో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరలేరని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపలేవని చెప్పింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే విషయంలో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వ్యాజ్యాన్ని ఇదే అంశంపై 2018లో పోలూరి శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ఇచ్చిన హామీని అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్చంద్ర వర్మ ఇటీవల దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్జీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక హోదాపై గతంలో దాఖలైన వ్యాజ్యంలో తమ వైఖరితో కౌంటర్ దాఖలు చేశామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ, ప్రత్యేక హోదా కింద కేంద్రం పలు రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి మాత్రం అలాంటివి ఏవీ ఇవ్వలేదని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి స్వయంగా చట్ట సభలో హామీ ఇచ్చారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రధాన మంత్రి హామీని అమలు చేయాలని కోర్టును కోరలేరని చెప్పింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తారంది. అలాగే బడ్జెట్ హామీలను అమలు చేయాలని కూడా కోరలేరని తెలిపింది. -
వరద సాయం తక్షణమే విడుదల చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అకాల వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా, పోలవరం డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే అమరావతి ఉద్యమం సాగుతోందని ప్రజలందరికీ తెలుసన్నారు. అమరావతి రైతులకు ఎవరూ వ్యతిరేకం కాదని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎన్.రెడ్డెప్ప, వంగా గీతావిశ్వనాథ్లు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన వర్షాలు, వరదలు నాలుగు జిల్లాల్లోని రెండు లక్షలమంది ప్రజలపై ప్రభావం చూపాయని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి కోరారని చెప్పారు. రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కమిటీ నివేదిక రాగానే సాయంచేస్తామని చెప్పారని తెలిపారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు వాటిని ప్రజలకు అందనీయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడు తూ కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మభ్యపెడుతూనే పాండిచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం దారుణమని విమర్శించారు. 20 ఏళ్లలో ఎన్డీయే, యూపీఏ సంయుక్తంగా కలిసి చేసిన పని రాష్ట్ర విభజన ఒక్కటేనన్నారు. హోదా మరుగునపడిన అంశం కాదని, నిరంతరం పోరాడతామని చెప్పారు. ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ రెవె న్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, ఇతరత్రా పెండింగ్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి చూపిన చొరవకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి ఉద్యమం జరుగుతోందని పేర్కొన్నారు. ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొక్కను సరిగా నాటకపోవడం వల్లనే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వృక్షంగా మార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రజలతో ఉండి సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ, ఉపాధి నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ జోన్, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్లుగా పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేదల గౌరవాన్ని పెంచారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ అజెండాలో కూడా ఉందని గుర్తుచేశారు. అమరావతి రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందన్నారు. జమ్మూకశ్మీర్, అయోధ్య రామాలయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేసినట్లే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. -
ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మంగళవారం పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, రాజ్యసభలో పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరారు. లోక్‌సభలో డిమాండ్స్, గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోదీ సభలోను, బయట ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని చాలా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పోలవరాన్ని ఇరిగేషన్, తాగునీరు..అంటూ వేరుచేయడం సరికాదు పోలవరం ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 194 టీఎంసీలతో డిజైన్ రూపొందించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును విభజన చట్టం రాకముందే మొదలు పెట్టారన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తూ.. కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు చేయకపోవడం బాధాకరమని చెప్పారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని, దీన్ని కేబినెట్ ఆమోదించాలని కోరారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం, టీడీపీల మధ్య ఏం జరిగిందో అనవసరమని రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తిగాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్, తాగునీరు కాంపొనెంట్ అంటూ వేరుచేయడం సరికాదన్నారు. సవరించిన అంచనా రూ.55 వేల కోట్లకు అనుమతించినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్నారు. ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ విషయంలో కాగ్ ఆడిట్ చేసి చెప్పిన విధంగా రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఇటీవల భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, తక్షణ సాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 13 వైద్య కళాశాలలకు సాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిమిత్తం సభ్యులకు ఎంపీలాడ్స్ నిధులు పెంచాలని మిథున్‌రెడ్డి కోరగా పలువురు సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం సానుభూతి చూపించాలని ఆయన కోరారు. ఏపీ ఆర్థికంగా నష్టపోయింది రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. -
ఏపీకి ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వరు: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరో తెలియజేయాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు కారణాలు ఏమిటో చెప్పాలంది. ప్రత్యేకహోదాకు సంబంధించి సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కౌంటర్ దాఖలు చేయాలంది. పలు రాష్ట్రాలకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకహోదా ఇచ్చారో తెలియజేయాలంది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చిన రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌కు సైతం ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం ఆ హామీని అమలు చేయడం లేదని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రామచంద్రవర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో తన హామీని నిలబెట్టుకోవడం లేదని తెలిపారు. హోదా ఇవ్వకుండా 2016లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందన్నారు. వాస్తవానికి ప్యాకేజీ–2 కింద కొన్ని రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వలేదని వివరించారు. ఈ ప్రోత్సాహకాలు అందుకుంటున్న రాష్ట్రాలన్నీ ప్రత్యేకహోదా ఉన్నవేనని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ప్రత్యేకహోదా రాష్ట్రాలన్నింటికీ బడ్జెట్ ఆధారిత మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, అయినా కేంద్రం స్పందించడంలేదని చెప్పారు. ఆ రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పలు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రత్యేకహోదా ఇచ్చేందుకు గీటురాయి ఉంటుందని, అలాంటి గీటురాయి పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ వస్తున్నప్పుడు హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని అడిగింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆ పిటిషన్లతో తమకు సంబంధంలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులకు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులకు ఎంతో తేడా ఉందని హరినాథ్ చెప్పారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, ఈ నేపథ్యంలో నష్టపోయిన ఆ రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏయూ క్యాంపస్ (విశాఖతూర్పు): ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం సత్వరమే నెరవేర్చాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విశాఖ రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారని అది ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం విశాఖపట్నంలోని ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ‘ఈ నెల 27న దేశ బంధ్‌ను జయప్రదం చేయాలి..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుందాం’ అనే నినాదంతో సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. బృందాకారత్ మాట్లాడుతూ.. కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ.. బడా వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం బానిసలా వ్యవహరిస్తున్నదని, దేశ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతుందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ బీజేపీ ప్రభుత్వం తన పరిపాలన సాగిస్తోందన్నారు. రైతులపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు నినదిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో తొమ్మిది నెలలుగా రైతులు అలుపెరగని పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వలస కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరోనా మహమ్మారి విలయానికి ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. దీన్ని కప్పిపుచ్చుతూ ఉచిత వ్యాక్సిన్ హోర్డింగ్‌లను పెట్టుకుంటూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను వదిలేసి మత సమస్యలపై పోరాడటం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కరోనాతో త్రిపుర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌దాస్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సీపీఎం గ్రేటర్ నగర కార్యదర్శి బి.గంగారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కొండయ్య ప్రసంగించారు. -
‘హోదా’, విశాఖ రైల్వేజోన్‌పై స్థాయీ సంఘం పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పట్టుబట్టింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇంకా రైల్వే శాఖ పరిశీలనలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తీసుకున్న చర్యలపై కమిటీకి నివేదిక అందజేయాలని సూచించింది. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ చర్య సమగ్ర అభివృద్ధికి, వాణిజ్యం, ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. ‘ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ’ శీర్షికన రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి శనివారం వర్చువల్ సమావేశం ద్వారా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది. ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. విశాఖ జోన్ ఇంకా పరిశీలనలోనా? విశాఖ జోన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని, డీపీఆర్ ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్ కార్యాచరణకు కాలపరిమితిని నిర్ణయించలేమని ఆ శాఖ నుంచి సమాచారం వచ్చిందని కమిటీ తెలిపింది. ‘భారతీయ రైల్వేలలో 5వ అత్యధిక ఆదాయాన్ని అందించే డివిజన్ అయిన వాల్తేరు డివిజన్ రద్దుకు కారణాలు అడిగితే విశాఖలో జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు అవుతున్నందున పరిపాలన ప్రాతిపదికన మాత్రమే విశాఖలో డివి జన్ కేంద్రాన్ని తీసివేశామని రైల్వే శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్ కొనసాగింపు రోజువారీ కార్యకలాపాలలో గానీ, ఈ ప్రాంత దీర్ఘకాలిక రైల్వే అభివృద్ధిలో ఎటువంటి విలువను జోడించదని ఆ శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ను పొరుగున ఉన్న విజయవాడ డివిజన్లో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వ్యవస్థ సజావుగా సాగుతుందని తెలిపింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, డివిజన్ కార్యాలయం మినహా విశాఖ కేంద్రంగా ఉన్న ప్రస్తుత రైల్వే వ్యవస్థ చాలా వరకు అలాగే ఉంటుందని, వాల్తేరు డివిజనల్ ఆఫీస్‌తో సహా విశాఖలో ప్రస్తుతం ఉన్న రైల్వే సిబ్బందిలో ఎక్కువ మంది విశాఖలోనే సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటారని కమిటీకి సమాచారం అందించింది. పరిపాలనా, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు కమిటీకి తెలిపింది’ అని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంది. వాల్తేరు డివిజన్‌ను కుదించే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మిరప ఎగుమతులకు శీతల గిడ్డంగులు.. గుంటూరు నుంచి ప్రతినెలా 1.80 లక్షల టన్నుల మిరప పంట ఎగుమతి అవుతుందని, వీటికి సాధారణ గిడ్డంగులు కాకుండా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వాణిజ్య శాఖకు కమిటీ సిఫారసు చేసింది. -
మార్మోగిన ‘ప్రత్యేక హోదా’ నినాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, దిశ చట్టానికి ఆమోద ముద్ర, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో గురువారం ఆందోళన కొనసాగించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెట్టుబడి క్లియరెన్స్ ఇచ్చి నిధులు విడుదల చేయాలన్న అంశంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సావధాన తీర్మానం పెట్టేందుకు నోటీసులు ఇచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్ అవినాష్‌రెడ్డి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తోందని, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, ఈ చర్యల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఒకవైపు, కాంగ్రెస్ తదితర పక్షాలు ఒకవైపు వెల్‌లో ఆందోళన చేపట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలో నలుగురు ఎంపీలు వివిధ అంశాలపై చర్చను కోరుతూ 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా అంశంపై చర్చ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు దిశ చట్టం ఆమోదంపై చర్చ కోరుతూ నోటీసులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెట్టుబడి క్లియరెన్స్ పెండింగ్‌లో ఉందని, ఇప్పటివరకు వెచ్చించిన వ్యయం రీయింబర్స్ చేయాల్సి ఉందని, ఈ అంశాలపై చర్చించాలని కోరుతూ పిల్లి సుభాష్‌చంద్రబోస్ నోటీసులు ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దీనిని పరిరక్షించాలని, ఈ అంశంపై సమగ్ర చర్చ అవసరమని పేర్కొంటూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఆయా నోటీసులను చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అనుమతించలేదు. తమ డిమాండ్లపై వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. -
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల, విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో మంగళవారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. ఆ పార్టీ ఎంపీల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభ అట్టుడికిపోయాయి. లోక్‌సభ పూర్తిగా స్తంభించిపోగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు కేంద్రం పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని, ఈ అంశంపై చర్చకు వీలుగా సభా కార్యక్రమాలు వాయిదా వేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు నోటీసులు ఇచ్చారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని, విశాఖ స్టీలు ప్లాంటు ఏర్పాటైంది అమ్మకానికి కాదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్, టీఎంసీ తదితర పక్షాలు పెగాసస్ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈనేపథ్యంలో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. చేసిన చట్టాలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని నినదించారు. పదేపదే విజ్ఞప్తి చేసినా వారు ఆందోళన కొనసాగించడంతో 8 నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తిరిగి వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో ప్యానెల్ స్పీకర్ కిరీట్ సోలంకి ఒకే ఒక్క నిమిషంలో సభను గురువారానికి వాయిదా వేశారు. మంగళవారం లోక్‌సభ 14 నిమిషాలపాటు కొనసాగింది. రాజ్యసభలో 267 నిబంధన కింద నోటీసు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో కార్యకలాపాలు మధ్యాహ్నం వరకు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి 267 నిబంధన కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై చర్చించాలని తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్‌శర్మ కూడా తాము రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. రూల్ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని, అందులో జాతీయ ప్రాధాన్య అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించలేనని చెప్పారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమేనని, దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. చట్టాలకు, సభలో ఇచ్చిన హామీలకు గౌరవం ఇవ్వనప్పుడు రాజ్యాంగానికి ఏం గౌరవం ఇచ్చినట్టని అడిగారు. చైర్మన్ స్పందిస్తూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం మీకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. దీంతో విజయసాయిరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనకు దిగారు. ఒకదశలో విజయసాయిరెడ్డి ఆగ్రహంతో చేతిలోని పేపర్లను చింపేశారు. సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ గంటపాటు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితి నెలకొనడంతో మళ్లీ వాయిదాపడింది. ఒంటిగంటకు తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ హక్కు అని, వైజాగ్ స్టీలు ప్లాంటు ఏర్పాటైంది అమ్మకం కోసం కాదని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ దశలో సభానాయకుడు పీయూష్ గోయల్ జోక్యం చేసుకుంటూ.. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ‘మీరు చాలా సీనియర్ సభ్యులు. కోవిడ్ ఎంతటి విలయం సృష్టిస్తున్నదో మీకు తెలుసు. అలాంటి అతి ముఖ్యమైన అంశంపై సభ చర్చకు సమాయత్తమైంది. మీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సభలో సుహృద్భావ వాతావారణం నెలకొని చర్చ కొనసాగడానికి సహకరించండి. ఆందోళన విరమించి చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని పేర్కొన్నారు. పోడియం వద్ద ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను ముందుకు సాగనీయకపోవడంతో సభ తిరిగి పావుగంట వాయిదాపడింది. అనంతరం సమావేశమైన రాజ్యసభ కోవిడ్‌పై స్వల్పకాలిక చర్చను చేపట్టింది. -
ప్రత్యేకహోదాపై మరోసారి నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై నోటీసు ఇచ్చారు. పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్లకార్డుతో ఆందోళన తెలిపారు. పోలవరానికి నిధుల విడుదల, పెగాసస్ డేటాలీక్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ, విపక్ష ఎంపీల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్గాని భరత్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత గల అంశం. దీనిపై చర్చ కోసం రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ చేశాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం’’ అని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ‘‘విభజన చట్టం ప్రకారం పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయగల్గుతాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో విజయసాయిరెడ్డి పోరాడుతున్నారు.రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న వెంకయ్యే గతంలో ఏపీకి పదేళ్లు హోదా ఇవ్వాలన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే’’ అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. -
పెద్దల సభలో ‘హోదా’గ్ని
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజైన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వేడిపుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఉభయ సభల్లోనూ నినాదాలు హోరెత్తించారు. లోక్‌సభ, రాజ్యసభలను దాదాపు స్తంభింపజేసేలా పెద్దఎత్తున ఆందోళన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను డిమాండ్ చేస్తూ లోక్‌సభలో.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళమెత్తారు. ఈ విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలంటూ వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టి రూల్–267 కింద ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చను ప్రారంభించాలని అందులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయిరెడ్డి తన నోటీసులో క్లుప్తంగా ఇలా వివరించారు.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలు ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైంది. ప్రధాని ఇచ్చిన ఈ హామీని 2014 మార్చి 1న జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కానీ, ఇది జరిగి ఏడేళ్లు దాటినా ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’.. అని విజయసాయిరెడ్డి ఆ నోటీసులో డిమాండ్ చేశారు. పోడియం వద్దకు ఎంపీలు ఆ తర్వాత హోదా అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభలో పోడియం వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. కానీ, రూల్–267 కింద విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీసుతోపాటు విభిన్న అంశాలపై ఇతర పార్టీల సభ్యులిచ్చిన 17 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో విజయసాయిరెడ్డి, ఇతర సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అనంతరం విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ.. ‘మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ, ఈ రోజు చర్చకు అనుమతించలేను’.. అని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని పోడియం వద్ద నినదించారు. సభ వాయిదా పడి ప్రారంభమైన ప్రతీసారి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఇలా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఇదే సమయంలో సభలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఆందోళనను మౌనంగా వీక్షిస్తూ కనిపించారు. కామర్స్ కమిటీకి అభినందనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మ¯న్ ఎం. వెంకయ్యనాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన.. కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిందని చైర్మన్ తెలిపారు. కమిటీ మొత్తం జరిపిన సమావేశాల్లో 31 శాతం ఈ కాలవ్యవధిలోనే నిర్వహించడంపట్ల ఆయన కమిటీ చైర్మన్, సభ్యులను అభినందించారు. పోలవరంపై లోక్‌సభలో ప్లకార్డుల ప్రదర్శన విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని, ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా సభా కార్యకలాపాలు వాయిదా వేయాలని కోరుతూ వాయిదా తీర్మానానికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సభాపతి ఓం బిర్లాకు నోటీసులిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్–90 ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని కేంద్రం ప్రకటించిందని, అన్ని అనుమతులు తీసుకునేందుకు, ప్రాజెక్టు అమలుచేసేందుకు ఈ చట్టం ద్వారా కేంద్రానికి బాధ్యతలను దఖలుపరిచిందని మిథున్‌రెడ్డి తన నోటీసులో ప్రస్తావించారు. ఏడేళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు తగిన స్థాయిలో నిధులు విడుదల చేయడంలేదని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిఫారసు మేరకు రూ.55,656.87 కోట్లకు కేంద్ర ఆర్థిక శాఖ పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. -
రూల్ 267కింద ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలి: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. నోటీసులో ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో విజ్ఞప్తి చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదు
ఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే కేంద్ర పన్నుల వాటా క్రమేణా తగ్గుతోందని తెలిపారు. జనాభాకు ఎక్కువ ప్రాధన్యాత ఇచ్చిన పన్నుల వాటాలో కోత పెడుతున్నారని, జనాభాను నియంత్రణ చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని పేర్కొన్నారు.జనాభా ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించే పద్ధతిని మార్చుకోవాలని,ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వ వనరుల సమీకరణ కోసం సంస్థ నమ్మడం మంచిది కాదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసన ప్రకటిస్తున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 'ఎన్నో త్యాగాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే ఉంది. రుణాలను వాటాలుగా మారిస్తే ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని విజయసాయిరెడ్డి నినదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది 120 కోట్ల రూపాయల జిఎస్టి చెల్లిస్తోందని, హిందుత్వకు తామే ప్రతినిధులం అని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం దేవాలయాలపై పన్నులు ఉపసంహరించుకోవాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 'భక్తులు ఉండే గదుల పైన సైతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాణిజ్య సంస్థ కాదు..లాభార్జన కోసం అక్కడ కార్యక్రమాలు జరగడం లేదు దేవుడి సేవ కోసమే భక్తులు ఉన్నారు. జీఎస్టీ వ్యవస్థ కంటే ముందు టిటిడిపై పన్నుల భారం లేదు.కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తిరుమలపై జిఎస్టి ఉపసంహరించుకోవాలి' అని విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. చదవండి : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్సీపీ -
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబేనని, ఆయనే ప్రత్యేక హోదా ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్సీపీని తప్పుపట్టే స్థాయి టీడీపీకి లేదన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నాడు బీజేపీతో జత కట్టి, హోదాకు బదులు ప్యాకేజీ బాగుందన్న చంద్రబాబు మాటలను ఆంబోతు అచ్చెన్నాయుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ లోక్‌సభ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీలు వాకౌట్ చేసిన విషయాన్ని అచ్చెన్నాయుడు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా కోసం నాడు వైఎస్సార్సీపీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇసుక తవ్వకాల్లో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా టీడీపీకి చెందిన బ్రోకర్లను, దళారులను, జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ, దొంగల ముఠాలను ఇసుక రీచ్‌లలో పెట్టి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను స్వాహా చేసినట్టు ఒప్పుకున్నట్టేనని అర్థమవుతోందన్నారు. ఇసుక ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ అడిగినా, వసూలు చేసినా వెంటనే ఫిర్యాదు చేయడం కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. -
ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంట్ వేదికగా వైఎస్సార్ సీపీ మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. లోక్‌సభలో మంగళవారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. కేంద్రమంత్రి సూటిగా సమాధానమివ్వాలని మిథున్‌రెడ్డి కోరారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని అడగ్గా.. మిథున్‌రెడ్డి అనుబంధ ప్రశ్న అడిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2014లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ముగిసిపోయిందన్నారు. స్టీల్ ప్లాంట్ దేశానికి, ఏపీకి గొప్ప ఆస్తి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తరఫున గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మిథున్‌రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌కు మైన్స్ కేటాయించి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దితే దేశానికి, రాష్ట్రానికి గొప్ప ఆస్తిగా మిగులుతుందని వివరించారు. పోలవరం నిర్మాణం కీలక దశలో ఉందని, కేంద్రం వేగవంతంగా స్పందించాలన్నారు. ఏపీలో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సహకారం అందించాలని కోరారు. వివిధ పద్దుల కింద పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. -
‘ప్రత్యేక హోదా’ చేర్చకపోవడం విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పది సవరణలు ప్రతిపాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం, వైజాగ్ రైల్వేజోన్ నోటిఫై చేయకపోవడం, రెండేళ్లవుతున్నా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్వహణ జరగకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ సవరణలు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయానికి ఆమోదం అంశం, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాలను ప్రస్తావించకపోవడంపై సవరణలు ప్రతిపాదించారు. ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీకి ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ అమలుపై విధివిధానాలను ప్రస్తావించకపోవడంపై సవరణ ప్రతిపాదించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్దేశించిన బిల్లు 2010 మార్చిలో రాజ్యసభలో ఆమోదం పొందిందని, దాని గురించి రాష్ట్రపతి ప్రస్తావించలేదని సవరణ పెట్టారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశంపై, నదుల అనుసంధానం, ఉపాధి పని దినాలు 100 నుంచి 150 రోజులకు పెంచడంపై, పీఎం కిసాన్ సమ్మాన్ సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై విజయసాయిరెడ్డి సవరణలు ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని విజయసాయిరెడ్డి కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు. వైఎస్సార్ హయాంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తాము కూడా ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజీలేని పంథాను అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొరియర్లో తలనీలాలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం సీపీఐ నేతలు శిరోముండనం చేయించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలనీలాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొరియర్ ద్వారా పంపనున్నట్టు వారు వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేటాయింపు, నిధుల మంజూరులో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపారని మండిపడ్డారు. సీపీఐ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎం.శ్రీనివాస్, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎ.విమల, జి.జయమ్మ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన, కరోనా ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం వర్చువల్‌గా ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సి ఉందని, వాల్తేరు డివిజన్‌ను కొనసాగిసూ్తనే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలన్నారు. ► పార్లమెంట్ ఉభయ సభలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిళ్లు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. ► వ్యవసాయ ఉత్పత్తులకు రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్ధం చేయాలని కోరారు. ► ఇటీవల ఏపీలో వరుసగా జరిగిన ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నాయకులున్నట్టుగా సీసీ టీవీ పుటేజీల ఆధారంగా వెల్లడైందన్నారు. ► మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ఐపీసీ, సీఆర్పీసీలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ తెచ్చిన దిశ చట్టం 21 రోజుల్లో పరిష్కరించే వీలు కల్పించిందన్నారు. ► విశాఖలో జాతీయ ప్రాధాన్యం కలిగిన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
సకాలంలో పోలవరం
రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం కానీ జరగదు. వన్యప్రాణి అభయారణ్యాలకు భంగం కానీ, ఇతర పర్యావరణ ఇబ్బందులు కానీ తలెత్తవు. అందువల్ల దీనికి త్వరితగతిన అనుమతి ఇచ్చేలా సంబంధిత శాఖకు సూచించాలి. 2014–15 నాటికి రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కానీ రూ. 4,117.89 కోట్లుగా మాత్రమే కేంద్రం గుర్తించింది. ఇందులో కూడా రూ.3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన బకాయిలతో పాటు, రాష్ట్రం పేర్కొన్న విధంగా మిగిలిన రూ.18,830.87 కోట్లు విడుదల చేయాలి. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలి. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ జీవరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా కేంద్రం సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) సిఫారసు మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి (ఆర్సీఈ) ఆమోదం తెలపాలని కోరారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి.. రాత్రి 9.15 గంటల నుంచి 10.40 గంటల వరకు హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి. 2017 – 18 ధరల సూచీని పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని, ఈ మేరకు రెండో రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ (ఆర్సీఈ)కు ఆమోదం తెలిపేలా కేంద్ర జల శక్తి శాఖకు సూచించాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఒక లేఖ సమర్పించి, అందులో అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ కింద సేకరించాల్సిన భూమి 1,02,130 ఎకరాల నుంచి 1,55,465 ఎకరాలకు పెరిగిందని నివేదించారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్ర స్థాయి సర్వే తర్వాత భూ సేకరణలో 55,335 ఎకరాలు పెరిగిందని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందని వివరించారు. 2018 డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు. సీఎం ఇంకా ఏం కోరారంటే.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ ఇవ్వండి ► ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆగస్టులో ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 తెచ్చింది. ► ఈ దిశగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. గిరిజన విశ్వ విద్యాలయం, ప్రత్యేక హోదా ► విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధిత శాఖ తీసుకునేలా చూడాలి. ► కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరం. మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వండి ► రాష్ట్రంలో జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. (రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డేటాను వివరిస్తూ ఒక లేఖ అందజేశారు) వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ► రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనికోసం కొత్తగా 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటితోపాటు ఇదివరకే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ► ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలి. వీటి అనుమతులకు వెంటనే ఆమోదం తెలపాలి. కాలేజీల ఏర్పాటుకు తగినంత ఆర్థిక సహాయం అందించాలి. ధాన్యం కొనుగోలు, స్థానిక సంస్థల బకాయిలు ఇవ్వండి ► ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపునకు ఇది దోహద పడుతుంది. ► సహకార సంస్థలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ధాన్య సేకరణ బకాయిలను చెల్లించడంలో ఈ నిధుల విడుదల చాలా సహాయపడుతుంది. ► 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థలకు రూ.529.95 కోట్ల మేర విడుదల చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు రెండో విడత కింద గ్రామీణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,312.5 కోట్లను వెంటనే విడుదల చేయాలి. కోవిడ్ నివారణ చర్యలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టడానికి ఈ నిధులు ఎంతో అవసరం. ఉపాధి హామీ పథకం నిధులు పెంచాలి ► లాక్డౌన్ తదనంతర పరిణామాల్లో భాగంగా చాలా మంది తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉంది. ఉపాధి హామీ కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి. ► అంగన్వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి. ఉపాధి హామీ కార్యక్రమాల కోసం పెండింగులో ఉన్న రూ.3,707.77 కోట్ల మేర నిధులు విడుదల చేయాలి. నివర్ తుపాను సాయం విడుదల చేయాలి ► జాతీయ విపత్తు నిధి కింద నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు ఆర్థిక సహాయం చేయాలి. ► ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం బాధిత ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీ, తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం రూ.2,255.7 కోట్లను విడుదల చేయాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. విద్యుత్ రంగానికి ఊతమివ్వండి ► రాష్ట్ర విభజన తర్వాత రూ.5,541.78 కోట్లను విద్యుత్ కొనుగోలు రూపంలో ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షరతులతో కూడిన రుణాలను తెలంగాణ డిస్కంలకు ఇవ్వడం ద్వారా ఏపీ జెన్కోకు ఆ చెల్లింపులు జరిగేలా చూడాలి. ► అప్పర్ సీలేరులో చేపడుతున్న 1350 మెగావాట్ల రివర్స్ పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు సుమారు రూ. 8,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలి. అలాగే అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలి. ► ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు, అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి.. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
‘హోదా’ రాకపోవడానికి బాబు ప్యాకేజే కారణం
మదనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పరంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ ప్యాకేజీ రూపంలో చంద్రబాబు అప్పట్లో స్వీకరించారని చెప్పారు. చంద్రబాబు హయాంలో జాతీయ షెడ్యూల్డు కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్((ఎన్ఎస్ఎఫ్డీసీ) నిధులతో కొనుగోలు చేసిన థ్యాంక్యూ సీఎం వాహనాల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందన్నారు. ఆ వాహనాలకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూరిస్తే చంద్రబాబు స్టిక్కర్ వేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికపై తమ పార్టీ, జనసేన ఇంకా మాట్లాడుకుంటున్నాయని, తమలో ఎవరో ఒకరి అభ్యర్థి రంగంలో ఉంటారని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధిస్తాం
-
దిశ చట్టం రూపుదాల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. శుక్రవారం రాత్రి హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 9.40 గంటల నుంచి రాత్రి 10.20 వరకు దాదాపు 40 నిమిషాల పాటు రాష్ట్ర అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి. దిశ చట్టం కోసం చేయాల్సిందంతా చేశాం ‘మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. విచారణను వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలోగా శిక్షలు విధించడానికి దిశ చట్టం తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశాం. అందువల్ల ఏపీ దిశా చట్టం త్వరిత గతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి. శాసనమండలి రద్దును ఆమోదించాలి శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెచ్చిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖకు సూచించి ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదించేలా చూడాలి. ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలి పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవస్థ సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నా.. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యం చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. హోంమంత్రిత్వ శాఖ రూ.253.40 కోట్ల అంచనా వ్యయంతో దీనిని 2017లో ఆమోదించింది. ఇందులో రూ.152 కోట్లు కేంద్ర వాటా కాగా, రూ.101.40 కోట్లు రాష్ట్ర వాటా. కానీ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో ఈ ప్రాజెక్టు మూత పడింది. ఈ విషయంలో చొరవ చూపి ఆదుకోవాలి. సీనియర్ అధికారులను కేటాయించండి శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రత కోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత కేడర్ సామర్థ్యం పెంచాలి. ఇందులో భాగంగా 79 సీనియర్ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలి. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు వీలుగా డీఐజీ, ఐజీపీ, ఏడీజీపీ ర్యాంకుల్లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్ర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఈ అంశాల పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలి. దీంతోపాటు స్టేట్ ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సెంట్రలైజ్డ్ డేటా సెంటర్, ఏపీ పోలీస్ అకాడమి ఏర్పాటుకు తగిన సహాయం చేయాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి కొనసాగేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయంలో అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం–2020కి కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రెండు మూడు నెలల్లో ఇది చట్టంగా మారనుంది. ఈ దిశగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం మీకు తెలిసిందే. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రాజెక్టులకు సాయం ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలి. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం – చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగు పరచడానికి గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలి. ఆ మేరకు సంబంధిత శాఖలకు సిఫారసు చేయాలి. పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.838 కోట్లు ఆదా చేశాం. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,549 కోట్లుగా కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక కమిటీ 2019 ఫిబ్రవరిలో ఆమోదించింది. దీనికి సంబంధించిన పాలనా పరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సహాయ, పునరావాస వ్యయం రూ.3,200 కోట్ల నుంచి రూ.33,010 కోట్లకు పెరగడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వినియోగపత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆడిట్ చేసినప్పటికీ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జల వనరుల శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. గ్రాంట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ. 10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయితే గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు వస్తున్నా.. ఏపీకి రావడం లేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన ఏడు జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ఖండ్ తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన జరిగిన తొలి ఏడాది 2014–15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటును భర్తీ చేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 సంవత్సర రెవిన్యూ లోటును రూ.22,949 గా కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. ఈ మేరకు నిధులు విడుదల చేయించాలి. రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేయగా.. ఇందులో రూ.1,000 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన ఆదేశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమిత్ షాకు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు. మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చండి.. ఢిల్లీ తెలుగు పాత్రికేయుల వినతి ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందేలా మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చాలని ఢిల్లీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అక్రిడేటెడ్ తెలుగు జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని కలిసేందుకు ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రిని ఢిల్లీ తెలుగు పాత్రికేయులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వీరితో ఆత్మీయంగా మాట్లాడిన వైఎస్ జగన్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. ఈ సౌకర్యాన్ని అందించే దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం శనివారం ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. -
ఎజెండా ఏపీ
-
ఏపీ అభివృద్ధికి ఊతమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గంటా నలభై నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానికి సీఎం వైఎస్ జగన్ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు ఇవీ.. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి ‘2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహకారం కావాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,549 కోట్లు. ఇందులో ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.33,010 కోట్ల మేర అవసరం అవుతుంది. కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు రూ.55,549 కోట్లకు ఆమోదం తెలిపినా, సవరణ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలిపేలా చూడాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3,320 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించండి. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిదని ఆర్థిక సంఘం చెప్పింది అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా తమ పరిధిలో లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చని చెప్పింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విభజన అనంతరం తొలి ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు ఉన్నట్లు కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలి’ అని సీఎం వైఎస్ జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి.. ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం శాసన మండలి ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖను ఆదేశించండి. సీఎం ప్రధానికి విన్నవించిన మరిన్ని అంశాలు.. – ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలి. – కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి. – రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలి. – కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలి. – రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలి. – గత ఆరేళ్లలో వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవు. బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలి. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4,000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారు. – మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019పై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలి. -
‘ఏపీ అభివృద్దికి సంపూర్ణ సహాయ సహకారాలు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం సానుకూలంగా జరిగిందని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్ని అంశాలను ప్రధానికి సీఎం జగన్ వివరించారన్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్దికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు మిథున్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని ఇప్పటికే పార్లమెంట్లో కేంద్ర మంత్రులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రధానికి సీఎం వివరించారన్నారు. శాసనమండలి రద్దుకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుందని, ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. శాసనమండలి ప్రతీ అభివృద్ది కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని, అందువల్ల శాసనమండలిని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని సీఎం జగన్ ప్రధానిని కోరారని పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పిన అంశాలను నిశితంగా విన్న ప్రధాని రాష్ట్ర అభివృద్దికి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. చదవండి: ప్రధాని మోదీకి సీఎం జగన్ ఆహ్వానం రేణుదేశాయ్ ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు -
ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం
-
ప్రధాని మోదీకి సీఎం జగన్ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా సీఎం జగన్ బుధవారం సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. అలాగే ఈ ఏడాది మార్చి 25న ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాల పంపిణీ చేపడుతున్నామని, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టినట్లు సీఎం తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాలు రూ. 55,549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3320 కోట్లును విడుదల చేసేలా జల వనరుల శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలనిన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవిస్తూ, కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలన్నారు. గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలన్నారు. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వివరించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని వివరించారు. అలాగే శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న ముఖ్యమంత్రి గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తేమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్ చేసిందన్న ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞాపన చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాలని, మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి సీఎం జగన్ వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీని కోరారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. -
నేడు ప్రధానితో సీఎం వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధనకోసం సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. వివిధ అంశాలపై ప్రధానికి నివేదన.. ప్రధానితో సీఎం భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోలవరం ప్రాజెక్టుకోసం సవరించిన అంచనాలకు పరిపాలన ఆమోదం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదించిన కేటాయింపులను పెంచాలని కూడా ప్రధానికి జగన్ నివేదిస్తారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాల్సిన ఆవశ్యకతను మరోసారి మోదీ దృష్టికి తీసుకెళతారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే పార్లమెంటు వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడం ఒక్కటే మార్గమని ఆయన వివరిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలను ప్రధానికి నివేదించి వీలైనంతగా నిధులు కేటాయించేలా సీఎం కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. నేడు కేబినెట్ భేటీ బుధవారం ఉదయం పదిన్నరకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానంతరం సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రధానితో సమావేశమవుతారు. (చదవండి: మనసుతో చూడండి) -
హోదా ఇచ్చి ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని పార్లమెంటు వేదికగా మరోసారి వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. సోమవారం ఆ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. గణనీయమైన రెవెన్యూ వాటా హైదరాబాద్‌కు వెళ్లిపోవడమే కాకుండా ఆదాయాన్ని తెచ్చే వనరులు లేకపోవడం వల్ల ఏపీకి ప్రత్యేక హోదా అవసరమన్నారు. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘పన్నుల వాటా తగ్గడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, ఇతర రాష్ట్రాలతో సమానంగా పోటీ పడగలిగే పరిస్థితి వచ్చేందుకు హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాం. రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తిచేస్తున్నా. ఏపీకి పోలవరం ఒక జీవ రేఖ. ఇది జాతీయ ప్రాజెక్టు కూడా. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,860.50 కోట్ల మేర దీనిపై వెచ్చించింది. రూ. 3,283 కోట్ల మేర రాష్ట్రానికి కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లుగా సాంకేతిక సలహా కమిటీ ఆమోదించినప్పటికీ సవరించిన వ్యయం కమిటీ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిని తక్షణం ఆమోదించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలి. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలకు స్మార్ సిటీ పథకంలో భాగంగా కేటాయించిన రూ. 9,081 కోట్లను తక్షణం విడుదల చేయాలి. విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు, అమరావతి– అనంతపురం ఎక్స్‌ప్రెస్ మార్గానికి తగిన రీతిలో కేంద్రం సహకారం అందించాలి’ అని విజ్ఞప్తి చేశారు. అమ్మ ఒడి, నాడు– నేడుకు నిధులివ్వండి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి బడికి వెళ్లే పిల్లలు ఉన్న తల్లులకు ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు. నాడు–నేడు పథకం ద్వారా తొలి విడతలో 15,715 పాఠశాలలను ఆధునికీకరిస్తోందని వివరించారు. ఈ రెండు పథకాలకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని అభ్యర్థించారు. ఏపీలో 12 జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొల్పాల్సి ఉందని గుర్తు చేశారు. ఇందులో 7 సంస్థలకు రూ. 2,209 కోట్లు కేటాయించగా.. కేవలం రూ. 1,020 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన మొత్తం కూడా త్వరితగతిన విడుదల చేయాలని నివేదించారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని, రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది ఇబ్బందికరమన్నారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి అసంతృప్తిని మిగిల్చింది.. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు అసంతృప్తి మిగిల్చిందని ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రత్యేక హోదా అంశం అటు రాష్ట్రపతి ప్రసంగంలోనూ, ఇటు బడ్జెట్లోనూ లేదు. ఇది 5 కోట్ల ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సీఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రిని, హోం మంత్రిని పలుమార్లు కలసి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. కానీ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని సాకులు చెబుతూ వచ్చింది. దీంతో హోదాకు సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. అయితే హోదా కేటాయింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి శిశువును కాపాడిందని ప్రధాన మంత్రి స్వయంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చెప్పారు. అందువల్ల ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి’ అని కోరారు. -
సీఎం స్థానం అంటే.. రాష్ట్రానికి తండ్రి లాంటిది
సీఎం స్థానం అంటే.. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటిది. దేవుడు మనకు ఈ స్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయమైనా ఒక తండ్రిలా ఆలోచించి తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే కూడా తప్పే అవుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏటా రెవెన్యూ ఎంతో కొంత పెరుగుతుందని, నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చు కానీ పెరుగుదలైతే ఉంటుందన్నారు. ఆంగ్ల పత్రికల ప్రతినిధులతో సోమవారం ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. పెన్షన్లు, ఇంగిష్ మీడియం, రాజధాని, ప్రత్యేక హోదా, మండలి రద్దు, పోలవరం, కియాపై అసత్య ప్రచారం తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన స్పష్టీకరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. సంతృప్త స్థాయిలో లబ్ధి కల్పించడమే లక్ష్యం ‘మాకు ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వండని చెప్పాం. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితా ప్రజల ముందే ఉంచుతున్నాం. ఈ రోజు ఫోన్ ఆన్ చేస్తే కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిషే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. రాజధానిపై నేను చెప్పాల్సిందంతా అసెంబ్లీలోనే చెప్పా. మౌలిక వసతుల కోసమే రూ.1,09,000 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఆ డబ్బులో 10వ వంతు విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. మరో 10 ఏళ్లకైనా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారుస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం. అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని, అమరావతి రైతులెవ్వరికీ అన్యాయం చేయం అని చెప్పాం. రాజధానిపై బీజేపీ జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెబుతుంటే, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. కొద్ది జాప్యమే.. అడ్డుకోలేరు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏని ఏఎంఆర్డీఏగా మార్చడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అందరికీ మంచి చేస్తున్నామని ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టాం. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. తాము ఎక్కడికీ వెళ్లడం లేదని కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాల కోసం వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4 వేల కోట్లను గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించలేదు. ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్ వెళ్లారు. ఇది అభివృద్ధి కాదా? విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, గృహ నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలుగా నిర్ణయించాం. నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను బాగా అభివృద్ధి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం నాణ్యత బాగా పెంచాం. అమ్మఒడి అమలు చేశాం. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసాతో అన్నదాతలను ఆదుకుంటున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. -
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ధ్వజం
-
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ధ్వజం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే డబ్బు లేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాంలో ఎన్పీఆర్ అమలు కోసం రూ. 65 వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కర్నూలులో లతీఫ్‌లావుబాలీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లింలను భారతదేశ పౌరులుగా చూస్తున్నామంటూ ఒకవైపు బహిరంగ సభల్లో చెబుతున్న మోదీ.. మరోవైపు వారిపై పరోక్షంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింల కోసం ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ కేసు సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానుందని, ముస్లింల అభ్యున్నతికి ఉపకరించే ఆ బిల్లుపై మంచి న్యాయవాదులను పెట్టి వాదించాలని తాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించానని తెలిపారు. తన ప్రతిపాదనపై వారు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెపుతున్నానని చెప్పారు. అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కేరళ తరహాలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు. కార్యక్రమంలో కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్‌ఖాన్, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రహీముద్దీన్ అన్సారి, వివిధ దర్గాల అధిపతులు పాల్గొన్నారు. -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని కేంద్రం మాట తప్పిందని గుర్తు చేశారు. -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
-
అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ చేసిన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరని, అసెంబ్లీ అధికారంలో జోక్యం చేసుకోజాలరని బుధవారం లోక్‌సభలో ప్యానెల్ స్పీకర్ ఎ.రాజా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజా పలుమార్లు జోక్యం చేసుకుని వారించారు. అయినా వినిపించుకోకుండా గల్లా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజా స్పందిస్తూ.. ‘అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ(పార్లమెంటులో) ప్రశ్నించలేరు.. ప్రస్తావించనూ లేరు. అది అసెంబ్లీ అధికారం. దానిలో జోక్యం చేసుకోజాలం’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారుపై విమర్శలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా జయదేవ్ తన ప్రసంగమంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతోనే సరిపుచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుంటోందని, రెండంకెల వృద్ధి సాధించిన తమ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను పరిశ్రమలు ఉపసంహరించుకున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని అభ్యంతరం వ్యక్తంచేశారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని వికేంద్రీకరణను రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిందని, అయితే శాసన మండలిలో చైర్మన్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ప్రభుత్వం కౌన్సిల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తన సమాధానంలో రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని చెప్పారని, కానీ రాజధానులని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అమరావతిని నోటిఫై చేస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కేంద్రం గుర్తించిందన్నారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టి పెట్టండి.. ఈ నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని ‘మీరు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్నారు. దానికే పరిమితం కావాలి..’ అంటూ గల్లా జయదేవ్‌కు సూచించారు. అయితే గల్లా వినిపించుకోలేదు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ చెప్పిందని, ఇప్పుడు మూడు రాజధానులు తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో విషయంలోకి రావాలంటూ ప్యానెల్ స్పీకర్ ఆయనకు సూచించారు. ‘‘మీ ప్రకటన వివాదానికి దారితీస్తోంది. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరు.. దానిని గుర్తుంచుకోవాలి..’’ అని ఒకింత ఘాటుగా చెప్పారు. దీంతో తాను ప్రశ్నించట్లేదని, కేవలం నేపథ్యమే చెబుతున్నానంటూ గల్లా తిరిగి అవే విషయాలు మాట్లాడారు. ప్యానెల్ స్పీకర్ మరోసారి జోక్యం చేసుకుంటూ.. ‘‘మీ సమయాన్ని వృథా చేసుకోరాదు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టిపెట్టండి..’’ అని హితవు పలికారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే గల్లా తిరిగి మాట్లాడుతూ నిపుణుల కమిటీకి చట్టబద్ధత లేదని, ముఖ్యమంత్రి వాటిని ప్రభావితం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల వల్ల ఆర్థిక భారం మూడు రెట్లు పడుతుందన్నారు. తిరిగి ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని.. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ ప్రశ్నించలేరు.. కనీసం ప్రస్తావించనూ లేరని, అసెంబ్లీ అధికారంలో మనం జోక్యం చేసుకోజాలమని అంటూ మీరు వినకపోతే నేను ఇంకో సభ్యుడిని పిలుస్తానని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా జయదేవ్ ముఖ్యమంత్రిపై విమర్శలు కొనసాగించారు. దీంతో ‘ఆ వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవు’ అని ప్యానెల్ స్పీకర్ స్పష్టంచేశారు. కానీ జయదేవ్ అమరావతిపైనే మాట్లాడుతుండడంతో వేరొక సభ్యుడి పేరును రాజా పిలిచారు. దీనిపై జయదేవ్ అభ్యర్థించడంతో నిమిషం సమయమిస్తూ ప్రసంగాన్ని ముగించాలని కోరారు. కానీ గల్లా మళ్లీ పాత విషయాలే ప్రస్తావించడంతో ప్యానెల్ స్పీకర్ మాట్లాడాలంటూ మరొక సభ్యుడి పేరును పిలిచారు. -
ప్రజల ఆవేదనను మీ దృష్టికి తెస్తున్నా ..
-
ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దృష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. సీఎం జగన్ లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రజల ఆవేదనను మీ దృష్టికి తెస్తున్నా ‘‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వృద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ, ఏపీ ప్రజలలో మాత్రం అసంతృప్తి కలిగించిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. దాంతో ఏపీ ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏపీ ప్రజల్లో తీవ్రంగా ఉన్న ఆవేదన, బాధను గతంలో కూడా పలు పర్యాయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న అంశాల నేపథ్యంలో మీ సహకారం, మార్గ నిర్దేశం కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. విభజన అనంతరం అత్యధిక ఆదాయం ఇచ్చే వనరుల ప్రయోజనాలు తెలంగాణకు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ ఈ ఆదాయ వనరులను కోల్పోయింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించ కూడదని 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని లోక్ సభలో ఆర్థిక శాఖ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు మా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని మేము కోరాము. దీనిపై వారు స్పందిస్తూ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదా కల్పించే అంశానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. కానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రతిపాదన పట్ల 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా కల్పించడం అనేది జాతీయ అభివృద్ధి మండలి తుది నిర్ణయం అని చెప్పారు. 2020–21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరించారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. -
‘సెలెక్ట్ కమిటీపై వారి తీరు ఆశ్చర్యకరంగా ఉంది’
సాక్షి, అమరావతి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని, అసెంబ్లీ సెక్రటరీ మీద మంత్రులు ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిబంధలన ప్రకారం సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. అధికారపక్షం రూల్ ప్రకారం వెళ్లమంటే.. ప్రతిపక్షం మాత్రం రూల్ అమలు చేయొద్దనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్‌కి ఉన్నట్టే ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘యనమల రామకృష్ణుడు తను మాత్రమే తెలివైనవాడిని అనుకుంటారు. అది మన ఖర్మ..!’ అని బొత్స ఎద్దేవా చేశారు. ఆ విషయం కేంద్ర ఎప్పుడో చెప్పింది.. రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉందని, కానీ చంద్రబాబు ఒక్కో జిల్లాకు రూ.350 కోట్లు సరిపోతాయని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆ నిధులను కూడా దారి మళ్లించారని వెల్లడించారు. విజయనగరం జిల్లాకు ఇచ్చిన నిధులు అశోక్ గజపతిరాజు కోట సుందరీకరణ కోసం వాడారని తెలిపారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు ద్రోహం చేసాడని, ఆయన చేసిన తప్పును కేంద్రానికి వివరించి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని బొత్స పేర్కొన్నారు. 2 లక్షల 50 వేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ఈఎంఐలు కట్టకుండా ఎగ్గొట్టాడని ఆయన విమర్శించారు. -
హోదా కేంద్రం పరిధిలోనే ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, ఈ విషయాన్ని పదిహేనో ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని మరోసారి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘ మా పార్టీ ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తోంది. మైనారిటీ సోదరుల నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా దీనికి సంబంధించి జారీచేసిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం ఎన్పీఆర్లోని ప్రశ్నావళిని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. మైనారిటీల్లో అభద్రతాభావాన్ని తొలగించాలి. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిందని మేం సీఏఏకు మద్దతిచ్చాం. కానీ ప్రతిరోజూ వీధుల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వారి ఆందోళనను పరిష్కరించాలి. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నారు. విభజన హామీలు నెరవేర్చండి ‘మా రాష్ట్ర అంశాల్లోకి వస్తే.. మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆర్థిక ఇబ్బందులతో మా రాష్ట్రం ఏర్పడింది. దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతూ వచ్చాం. సభ సాక్షిగా దానిపై ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దీనితోపాటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలూ నెరవేర్చాలని అడుగుతూ వస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా వీటిపై స్పందించాలి. 14వ ఆర్థిక సంఘం చెప్పినందున ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం.. ప్రత్యేక హోదాతో తమకు సంబంధం లేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. అది కేవలం కార్యనిర్వాహక నిర్ణయం మాత్రమే. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదికి రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని విభజన రోజున చెప్పారు. అది రూ. 22,900 కోట్లుగా సీఏజీ తేల్చింది. కానీ కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికాబోతోంది. ఇందుకు కేంద్రం త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. గడిచిన ఆరు నెలలుగా రూ. 5 వేల కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నా ప్రాజెక్టు వేగవంతంగా నిర్మిస్తున్నాం. దీనిపై పెట్టిన ఖర్చుకు వడ్డీయే రూ. 500 కోట్లుగా ఉంది. ప్రధాని ఈ విషయం గుర్తించాలని కోరుతున్నాం. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు నిర్మించాల్సి ఉంది. కేంద్రం దీనికి సాయం చేయాలి. రాష్ట్రాలకు సాయం చేయకుండా, వాటి ఆకాంక్షలు నెరవేర్చకుండా దేశం 5 ట్రిలియన్ల ఎకానమీ సాధించడం కష్టం..’ అని పేర్కొన్నారు. రాజధాని కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని తిరువూరులో వస్తుందని చెప్పారు. మూడు నెలల కాలం ఆయన మనుషులు అమరావతి ప్రాంతంలో భూములు కొనే పనిలో ఉన్నారు. టీడీపీ నేతలు దాదాపు 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. కొనుగోళ్ల కార్యక్రమం పూర్తయ్యాక తిరువూరు కాదని, అమరావతిలో రాజధాని వస్తుందని ప్రకటించారు. 4 వేల ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ముఖ్యమంత్రిగా ఉండి అధికార రహస్యాలను స్వార్థానికి వాడుకున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కోట్లాది రూపాయల విలువ గల భూములను ఎలా కొన్నారు? ఈడీ రంగంలోకి దిగిందని విన్నాను. తప్పుడు ధ్రువీకరణలతో భూములు కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం దేశవ్యాప్తంగా తిరిగి మోదీ పాలనకు, బీజేపీకి చరమగీతం పాడుతామని చెబుతూ వచ్చారు. రాహుల్‌ని ప్రధానిని చేస్తానన్నారు. కానీ ఈరోజు టీడీపీ వాళ్లు కాంగ్రెస్ వాళ్ల పక్కన కూర్చునేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఈ రోజు మా వెనుక కూర్చున్నారు. మా వెనుక నుంచి వాళ్లు గోల చేసినా మాకు నష్టం లేదు. ఎందుకంటే వారికి చంద్రబాబు ఇచ్చిన అసైన్మెంట్ అది. కుంభకోణాల నుంచి రక్షించాలని చంద్రబాబు వారిని కోరారు. ఎలాంటి అవినీతి లేకుండా అద్భుత పనితీరు కనబరుస్తున్న యువ ముఖ్యమంత్రికి ఈ సభ ఆశీస్సులు కావాలని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు ‘ఇటీవల బీఏసీ సమావేశంలో టీడీపీ రెండు అంశాలు లేవనెత్తింది.. ప్రాజెక్టులు రద్దు చేస్తున్నారని, రాజధానిని మారుస్తున్నారని ఆరోపించింది. దీనిపై అనేకమార్లు వారు మాట్లాడుతున్నందున సభకు స్పష్టత ఇవ్వ దలచుకున్నా.. మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మేం అధికారంలోకి వచ్చేసరికి రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మా ముందు పెట్టారు. మరో రూ. 20 వేల కోట్ల అదనపు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టునూ రద్దు చేయదలుచుకోలేదు. కేవలం రివర్స్ టెండరింగ్ నిర్వహించి వ్యయాన్ని తగ్గించుకోవాలనుకుంది. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టును అప్పటి సీఎం ఒక ఏటీఎంలా మార్చేశారని, అది అవినీతిమయమైందని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది నిజమేనని రివర్స్ టెండరింగ్ ద్వారా రుజువైంది. ఒక్క ప్రాజెక్టులోనే రూ. 800 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి సీఎం రూ. 70 వేల కోట్లతో పాజెక్టులకు టెండర్లు పిలిచారు. అన్ని టెండర్లు 5 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు. రివర్స్ టెండరింగ్‌లో ఆ ప్రాజెక్టులకు 10 నుంచి 20 శాతం తక్కువకే టెండర్లు ఖరారు చేశారు. ఉదాహరణకు వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టును ఎన్నికలకు ముందు ఓ కాంట్రాక్టర్ 5 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో అదే కాంట్రాక్టర్ 15 శాతం తక్కువకు తీసుకున్నారు. చవక గృహాల నిర్మాణం విషయంలో ఒక భాగం టిడ్కో, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం, ఒక భాగం లబ్దిదారుడు భరించాలి. ఎస్ఎఫ్టీకి రూ. 2,200 చొప్పున కాంట్రాక్టు ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ లో మేం రూ. 400 ఆదా చేశాం. 7 లక్షల యూనిట్లలో లబ్ధిదారులకు దాదాపు రూ. లక్ష చొప్పున ఆదా అయ్యింది. మా సీఎం పూర్తి పారదర్శక విధానాలను అమలు చేస్తున్నారు. ప్రతి టెండర్‌నూ జ్యుడిషియల్ కమిషన్ ముందు పెడుతున్నాం. టెండర్ల పరిశీలనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం..’ అని వివరించారు. ‘రాజధాని విషయంలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎక్కడైనా నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి దాదాపు రూ. 1500 వరకు ఉంటుంది. కానీ అమరావతిలో స్థలం ఉచితం, ఇసుక ఉచితం, అయినా నిర్మాణానికి ఎస్ఎఫ్టీకి రూ. 11 వేల చొప్పున టెండర్లు ఇచ్చారు. పీపీఏలు రద్దు చేశారని ఆరోపించారు. కేవలం ఎన్నికలకు ముందు చంద్రబాబు యూనిట్‌కు రూ. 4.83 పైసల చొప్పున చేసుకున్న 41 ఒప్పందాలను మాత్రమే రద్దు చేశాం. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలు యూనిట్‌కు కేవలం రూ. 3 చొప్పున పీపీఏలు కుదుర్చుకున్నాయి. కొన్ని సందర్భాల్లో రూ. 3 కంటే తక్కువే ఉంది. దీన్నే మేం ప్రశ్నించాం. ప్రస్తుతం ఇది న్యాయ వ్యవస్థ సమీక్షలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోపునరుత్పాదక విద్యుత్ శక్తి విషయంలో సింగపూర్ ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువేబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని గర్వంగా చెబుతున్నాను. రూ. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు అది. అతిత్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మా సీఎం ప్రారంభించబోతున్నారు..’ అని వివరించారు. -
ఏపీపై ఇదేం వివక్ష?
సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంపై వివక్ష చూపడం సరైందికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూశామని అయితే ఆ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలో పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక లోటును నియంత్రించేందుకు ఆహార సబ్సిడీ, వ్యవసాయ రుణాలు మాఫీ చేయడాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని.. ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి దీనిని పరిశీలించాలన్నారు. బడ్జెట్లో రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారని.. ఇందులో వివక్ష లేకుండా ఏపీ వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్‌ను ప్రోత్సహించాలన్నారు. జల్ జీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు కేటాయించడం మంచి విషయమన్నారు. పోలవరం చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. తీవ్ర నీటి ఎద్దటి ఉన్న 100 జిల్లాల్లో సమగ్ర నీటి సరఫరా పథకాలు అమలు చేస్తామన్నారని.. అందులో ఏపీకి కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎంతో సాయం వస్తుందని ఎదురు చూశామని, అయితే కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర హక్కులు, వాటాను సాధించుకుంటామని విజయసాయిరెడ్డి వివరించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనాయకుడు పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, తలారి రంగయ్య, బీవీ సత్యవతి, లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మొత్తంమీద మందగమనంలో సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ఎన్నో వదులుకున్నామని, అవన్నీ మనకు రాలేదన్నారు. రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని ఈ విషయమై ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నామని బుగ్గన వివరించారు. స్థూల ఉత్పత్తి 10 శాతం అంటే ప్రశ్నార్థకం రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 శాతం అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. గత బడ్జెట్లోనూ ఇలాగే చెప్పారని, కానీ అంచనాలన్నీ తప్పాయ్యాయన్నారు. బడ్జెట్ పూర్తిగా ప్రశ్నార్థకంగా తయారైందని, జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని అయితే అప్పు శాతం తగ్గించడం మంచి పరిణామమన్నారు. గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యలక్ష్మి, కిసాన్ రైలు ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ‘కృషి ఉడాన్’ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని, వెనుకబడిన జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి ఆయుష్మాన్ భారత్ నిర్ణయం మంచిదేనన్నారు. నూతన విమానాశ్రయాల నిర్మాణం, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటు, చిన్న పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ ఆహ్వానించదగ్గవేనన్నారు. డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు? కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, ఏడు నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను సరిదిద్దేందుకు తమకు సమయం పడుతుందని.. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్ టెండరింగ్ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. పోలవరంలోనూ.. బొగ్గు రవాణా మొదలు వెలిగొండ, కంప్యూటర్లు, ప్రింటర్ల వరకూ ప్రతి దాంట్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గిస్తే యనమలకు బాధెందుకని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కొన్ని కంపెనీలతో లాలూచీపడినందునే తాము సమీక్షించినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అసమర్థ ప్రతిపక్షం ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ వారు వట్టి తుగ్లక్‌లు కాదని వారు దుర్మార్గమైన తుగ్లక్లని, పాపపు పనులు చేసి నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికే తమకు ఆరు నెలలు పట్టిందని అచ్చంగా తుగ్లక్ పనులు చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. కార్యాలయాల తరలింపులో తప్పు లేదు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపులో ఏ మాత్రం తప్పులేదని, ఈ విషయం శ్రీబాగ్ ఒప్పందంలో స్పష్టంగా ఉందని బుగ్గన అన్నారు. ప్రజా తీర్పును మందబలంతో టీడీపీ వారు శాసనమండలిలో అడ్డుకున్నారని, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
‘హోదా’ వదిలేశా సాంబా!
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తును ఫలప్రదం చేసుకునేందుకు రాష్టానికి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి ఇక భవిష్యత్‌లో ఎప్పుడూ ప్రస్తావించబోనని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హామీ పత్రం రాసిచ్చారు! గురువారం రెండు పార్టీల మధ్య చర్చల సందర్భంగా ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందం జరిగినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ– జనసేన మధ్య తాజాగా కుదిరిన పొత్తు సందర్భంగా చర్చించిన అంశాలకు లోబడే పని చేయాలని రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీల నేతల భేటీలో చర్చించిన అంశాలను మీటింగ్ మినిట్స్ రూపంలో రికార్డు చేశారు. అంటే చర్చించిన అంశాలను, ఇరుపక్షాలు కలిసి తీసుకున్న నిర్ణయాలను పత్రాలపై రాసుకొని రెండు పక్షాల నేతలు సంతకాలు చేయడం అన్నమాట. బీజేపీ– జనసేన పొత్తు చర్చల సారాంశాన్ని మీటింగ్ మినిట్స్‌లో రికార్డు చేసినట్టు బీజేపీ వర్గాలు వివరించాయి. అవగాహన లేక తప్పుబట్టా! తెలంగాణతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున పవన్‌కల్యాణ్ ప్రచారం చేయడం మొదలు ఏపీలో తాజా పరిణామాల దాకా ఇరు పార్టీల పొత్తుల సందర్భంగా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. హోదాకు బదులుగా ప్యాకేజీ కూడా చర్చకు వచ్చింది. హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్ర ఆర్థికాభివృద్దికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు పవన్‌కు వివరించినట్లు తెలిసింది. పవన్ దీనికి అంగీకరిస్తూ హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అప్పట్లో అవగాహన లేక తప్పుబట్టానని, భవిష్యత్తులో ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తానని సంజాయిషీ ఇచ్చుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. హోదాపై పవన్ వెల్లడించిన ఈ అభిప్రాయం కూడా మీటింగ్ మినిట్స్‌లో రికార్డు అయిందని వెల్లడించారు. -
వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చారు. హోదా కోసం తాను చేయాల్సింది చేశానని ఆయన చెప్పుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్ ఇచ్చారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని హోదాపై కేంద్రంపై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు కాషాయ కండువాతో జత కట్టారు. మరోవైపు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం వల్లే సమస్య వచ్చిందని పవన్ వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, జనసేన తరపున పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?) ఈ భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘వామపక్ష పార్టీలకు నేను ఏమైనా బాకీ ఉన్నానా? ఆ పార్టీలకు నేనేమీ చెబుతాను. వామపక్ష పార్టీలతో కలవక ముందే బీజేపీ కోసం పని చేసాను. ఏపీ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకు వెళతాం. ఇక అమరావతిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. కాగా అమరావతిపై ప్రభుత్వం ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం దాటవేశారు. ఇక పవన్ వైఖరిపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కాగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ కమిటీలను వేసింది. అంతేకాకుండా ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార్సులు, నివేదికలపై మంత్రులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
హోదా పై కేసులు ఎత్తివేత
-
హోదా ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిశోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన వేలాది మందిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా పోరాటాలకు సంబంధించి కేసుల్లో ఉన్న నిందితులందరిపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేలా పిటిషన్ దాఖలు చేయాలని సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో ఉద్యమకారులపై జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను సేకరించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. -
ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి
రాష్ట్ర ఆర్థిక,పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. విభజనతో 59 శాతం జనాభా, అప్పులు వస్తే.. 47 శాతం మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయి. రాజధానిని కోల్పోవడంతో ఆర్థిక అవకాశాలు, ఆదాయాలు, కేంద్ర సంస్థలను కోల్పోయాం. పార్లమెంట్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశంలో వివరించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి సాయాన్ని అభ్యర్థించారు. వినతిపత్రంలో వివరాలు ఇవీ... నాలుగు స్తంభాల్లా అభివృద్ధి.. ‘‘అభివృద్ధి, ప్రాధాన్యతల్లో గత ఐదేళ్లుగా ఏపీలో చోటు చేసుకున్న అసమానతలను సరిదిద్దేలా చర్యలు చేపట్టాం. మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం, గ్రామీణ–పట్టణ తారతమ్యాలను తొలగించి సామాజిక భద్రత పెంచడం, మౌలిక వసతులు, పరిశ్రమల వృద్ధిపై దృష్టి, పారదర్శకత – అవినీతి రహిత పాలన కోసం సంస్కరణలు తేవడం అనే నాలుగు అంశాల ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ నాలుగు అంశాలను నాలుగు అభివృద్ధి స్తంభాలుగా భావించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాతిపదిక ఆధారంగానే ‘‘నవరత్నాలు’’ రూపొందించాం. రైతులకు రైతు భరోసా, అందరికీ విద్య కోసం అమ్మ ఒడి, విద్యా దీవెన, అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, అందరికీ ఇల్లు లక్ష్యంతో పేదలందరికీ ఇళ్లు, మెరుగైన సామాజిక భద్రత కోసం పెన్షన్ల పెంపు, మహిళా సాధికారత కోసం ఆసరా, వెనకబడిన వర్గాలకు చేయూత, సాగునీటి రంగం అభివృద్ధికి జలయజ్ఞం లాంటి కీలక పథకాలు తెచ్చాం. తొలి సమావేశాల్లోనే అభ్యున్నతికి అంకురార్పణ మా ప్రభుత్వం వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక చట్టాలు తెచ్చాం. కౌలు రైతుల సంక్షేమం, ఉద్యోగాల కల్పన, అట్టడుగు వర్గాలు, మహిళల సామాజిక–ఆర్థిక అభ్యున్నతికి చట్టాలు తెచ్చాం. అవినీతి నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేశాం. పబ్లిక్ టెండరింగ్ వ్యవస్థను మెరుగుపరిచాం. విద్యారంగంలో నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేశాం. సామాన్యుడికి మేలు జరిగేలా ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చాం. కరువు కాటు.. తుపాన్ల బీభత్సం.. రాష్ట్రానికి 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉంది. ఇందులో 9 జిల్లాలు తుపాన్ల వల్ల ప్రభావితమవుతాయి. మరోవైపు రాయలసీమ, ప్రకాశం జిల్లా నిత్యం కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. అటు కరువు, ఇటు తుపాన్ల కారణంగా రైతుల కష్టాలు వర్ణణాతీతం. సురక్షిత తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల లేమి, పారిశ్రామికీకరణ లేకపోవడం, ఉద్యోగాల సృష్టి లేక వెనకబాటుతనం ఉంది. అక్షరాస్యత దేశ సగటు కంటే తక్కువగా ఉంది. పౌష్టికాహార లభ్యతలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. ప్రాథమిక విద్యలో నెట్ ఎన్రోల్మెంట్ రేషియో (ఎన్ఈఆర్)లో చివరి స్థానంలో ఉంది. ప్రాథమికోన్నత విద్యలో చివరి నుంచి మూడోస్థానంలో ఉంది. గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియోలోనూ ఇదే పరిస్థితి. పట్టణీకరణలోనూ వెనకబడి ఉంది. ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల మౌలిక వసతులు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యా, వైద్య సంస్థలను కోల్పోయాం. సేవా రంగం, ముఖ్యంగా విరివిగా ఎగుమతులు ఉన్న ఐటీ రంగాన్ని కోల్పోయాం. విద్యుత్ రంగం కుదేలు గత ఐదేళ్లుగా రాష్ట్ర విద్యుత్ రంగంలో అస్తవ్యస్త విధానాలను అనుసరించారు. అధిక ధరలతో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సంస్థలనుంచి ముఖ్యంగా పవన విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు పరిమితి 5–10 శాతం ఉంటే ఆ పరిమితిని దాటి 23.6 శాతం వరకూ కొనుగోలు చేశారు. దీనివల్ల ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 2,654 కోట్ల నష్టం వాటిల్లింది. డిస్కంలు రోజూ రూ. 7 కోట్ల మేర నష్టపోతున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సి ఉన్నా గత ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఉద్దేశపూర్వకంగా గ్రిడ్ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారు. గత ఐదేళ్లుగా అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రూ. 20 వేల కోట్ల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్ వినియోగదారులపై భారం మోపే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే చార్జీలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి. అస్తవ్యస్థంగా ఆర్థిక రంగం 2014–15 నాటికి రూ. 97 వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. గత ఐదేళ్లలో వృథా ఖర్చులతోపాటు అడ్డగోలుగా అంచనా వ్యయాల పెంచారు. ప్రస్తుతం అవన్నీ సరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన మా కష్టాలను రెట్టింపు చేసింది. పన్ను ఆదాయం నామమాత్రంగానే ఉంది. 2013–14లో రెవెన్యూ మిగులు జీఎస్డీపీలో 0.5 శాతం ఉండగా 2018–19లో జీఎస్డీపీలో 1.3 శాతం రెవెన్యూ లోటుగా మారింది. ద్రవ్య లోటు 2.4 శాతం నుంచి 3.6 శాతానికి ఎగబాకింది’’ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీలు, నాయకులు విభజన హామీలను నెరవేర్చండి.. – ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. విభజనతో 59 శాతం జనాభా, అప్పులు వస్తే 47 శాతం మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయి. రాజధానిని కోల్పోవడంతో ఆర్థిక అవకాశాలు, ఆదాయాలు, కేంద్ర సంస్థలను కోల్పోయాం. పార్లమెంట్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి. – ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి రూ.50 కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2,100 కోట్లు అందాల్సి ఉండగా రూ. 1,050 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేబీకే తరహాలో మిగిలిన రూ. 23,300 కోట్ల నిధులివ్వాలి. – రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు రాయితీలు కల్పించాలి. 10 ఏళ్ల పాటు జీఎస్టీ, ఆదాయపన్ను నుంచి మినహాయింపులు ఇవ్వాలి. 10 ఏళ్ల పాటు 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. – రెవిన్యూ లోటు రూపేణా రూ. 22,948 కోట్లను పూడ్చాలి. – పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో ఖర్చు చేసిన రూ. 5,103 కోట్లను రీయింబర్స్ చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ. 16 వేల కోట్లు మంజూరు చేయాలి. – కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఆ ప్రాంతానికి ఇది చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే ఎంపిక చేశాం. పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి. – దుగ్గరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. అయితే అక్కడ పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలి. – రాజధాని నిర్మాణం కోసం రూ. 2,500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి దాకా రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరతాం. వీటికి సాయం చేయండి.. – పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం కార్యక్రమానికి కేంద్రం సాయం అందించాలి. – గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించేందుకు పూనుకున్నాం. దీనికి సాయం చేయండి. – కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోవడంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరి నుంచి వరద జలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి– కృష్ణా అనుసంధానానికి సహాయం అందించండి. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పర ప్రయోజనకరం. – ఇంటింటికీ రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడానికి వాటర్ గ్రిడ్‌ను తెస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సహాయం అందించండి, – ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు నిర్మించబోతున్నాం. సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ (సెక్) డేటా సరిగా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ ఎంపికచేయాలి. ప్రధాని కార్యాలయ అధికారులతో భేటీ ప్రధానితో సమావేశానికి ముందు ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేందర్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె.మిశ్రాను కలసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.20 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఎంపీల ఆత్మీయ స్వాగతం మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీలు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీలంతా ప్రధానిని కలసి గ్రూప్ ఫోటో దిగారు. తిరిగి వెళ్లే సమయంలో తనను కలసిన యూపీ ఎంపీ జగదాంబికా పాల్, కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడారు. -
హోదాపై కేంద్రాన్ని నిలదీసిన మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి లోక్‌సభలో నొక్కి చెప్పారు. ఆయన గురువారం లోక్‌సభలో హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, హోదాపై సభలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని కేంద్రం తీరును మిథున్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, గడిచిన అయిదేళ్లలో ఏపీకి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదని ఎంపీ విమర్శించారు. ఎంపీ మాట్లాడుతూ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీకి రూ.60వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఉంది. రాజధాని లేదు. మౌలిక వసతులు లేక రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది. రాయితీలు పెద్దగా లేకపోవడంతో పరిశ్రమలు రావడం లేదు. వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్ల నుంచి నిధులు విడుదల కావడం లేదు. స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం, పారిశ్రామిక కారిడార్ హామీలు ఏమైపోయాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలి. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఏపీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు చేస్తున్న వారిపై జీఎస్టీ పెనాల్టీ విధిస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ చెల్లించడం లేదు. దీనిపై సరైన యంత్రాంగం తయారు చేయాలి.’ అని కోరారు. -
‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26, 2019న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, దీన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశం ముగిసిన అధ్యాయమని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘానికి నివేదించామని చెప్పడం కీలకమలుపుగా భావించవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా మే 26న ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపాం..’ అని పేర్కొన్నారు. సమాధానాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపలేదని, తద్వారా ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే నీతిఆయోగ్ సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్టు తెలిపారు. -
‘మరో పోరాటానికి వైఎస్ జగన్ సిద్ధం’
సాక్షి, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా సంజీవనిగా భావిస్తున్న ‘ప్రత్యేక హోదా’ కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హోదా సాధించేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శుక్రవారం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదే నెరవేర్చబోతున్నామని తెలిపారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కాపులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వారిని ఎన్నో అవమానాలకు గురిచేశారని గుర్తుచేశారు. కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ సందర్భంగా తుని రైలు దహనం ఘటనలో టీడీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని దాడిశెట్టి రాజా ప్రకటించారు. తుని రైలు దహనంలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో అవసరానికి మించి అప్పులు చేసినట్లు యనమల అంగీకరించారని, ఓటమి అనంతరం తమపై నిందలు వేయడం సరికాదని హితవుపలికారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని వైఎస్ జగన్ ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ వారంతా తమ పార్టీకే ఓటు వేశారని అభిప్రాయపడ్డారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం
-
ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు
-
హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి
-
‘పార్లమెంట్లో ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు షరతుగా పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేకహోదా మాటను నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన హోదా అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి కోరారని, ఆనాడు విభజ ప్రక్రియలో ఉన్న రాజ్యసభ ఛైర్మన్ ఏపీకి న్యాయం చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని నిర్మూలించాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కాకినాడ పెట్రో కారిడార్‌ను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్లో మినహాయించిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను చేర్చాలన్నారు. తమ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారని, కులం, బంధుప్రీతి, అవినీతితో పెచ్చురిల్లిన టీడీపీని ప్రజలు కూకటివేళ్లతో పెకిలించివేశారని పేర్కొన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని చెప్పారు. ఎవరైనా పార్టీ మారితే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో పాస్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సీఎం అంగన్వాడీల జీతాలను మూడువేల నుంచి పదివేల రూపాయలకు పెంచారని, అలాగే దేశవ్యాప్తంగా అంగన్వాడీల జీతాలు పెంచాలని విజయసాయిరెడ్డి కోరారు. -
హోదా కేసులన్నీ ఎత్తేయండి
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గత సీఎం ముందు ప్లకార్డులు ప్రదర్శించారని దేశద్రోహం కేసులు పెట్టారు.. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా కోసం ఉద్యమిస్తే అన్యాయంగా కేసులు పెట్టి హింసించారు.. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అందుకే ప్రత్యేక హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించిన సీఎం.. శాంతిభద్రతలకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలు హోదా ఉద్యమ కేసుల విషయాన్ని ప్రస్తావించారు. గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ఓ కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు దేశద్రోహం కేసు పెట్టారని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద నమ్మకం పోతుందని, తక్షణమే ఆ కేసులన్నీ ఎత్తివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మానవీయ కోణంలో పని చేయాలి రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ అంశాన్ని ప్రతి ఉద్యోగి దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకొనిపోవాలని చెప్పారు. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలని, ప్రజా ప్రతినిధులను గౌరవించాలన్నారు. పాలనా వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమేనన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పు చేస్తే ఎవరైనా, ఎంతటి వారినైనా సహించవద్దని, చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దని చెప్పారు. వ్యక్తిగత ఇగోలు పక్కనపెట్టి అందరూ కలిసి పని చేయడం ద్వారా దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థను ప్రథమ స్థానంలో నిలపాలని దిశానిర్దేశం చేశారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన ‘ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. మంచి పాలన కోసం మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు. పోలీసు శాఖలో దిగువ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ వర్తింపజేయాలి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్ విభాగం ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇష్టానుసారం సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించండి పోలవరం నిర్వాసితుల సమస్యలపై అధికారులు మానవత్వంతో స్పందించి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా శాశ్వతంగా గ్రీవెన్స్ సెల్ పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా కేటాయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగినందున దాన్ని పూర్తి చేసేందుకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టండి.. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండకుండా చూడాలన్నారు. రహదారుల పక్కన ఉండే దాబాల్లో మద్యం అమ్మకాలను నివారించాలన్నారు. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, భద్రతా నిబంధనలు, నియమాలపై రోడ్డు పక్కన హోర్డింగ్‌లు పెట్టించాలన్నారు. జరిమానాలు విధించే ముందు ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విజయవాడ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ అధికారులను ఆదేశించారు. బాధితులను త్వరితగతిన ఆదుకునేలా అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యం, సీఐడీతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1,150 కోట్ల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం వేగంగా జరగాలన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఆస్తులపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి
-
హోదా అంశం పరిశీలనలో లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా మంజూరు చేసే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభలో ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఒడిశా, రాజస్థాన్, బిహార్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థనలు వచ్చాయని వివరించారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) గతంలో ప్రణాళిక సహాయం కోసం ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేసేదన్నారు. గతంలో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో పరిశ్రమల వృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదని తెలిపారు. -
పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల..ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అన్నారు. ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా పోరాటం నుంచి తప్పుకునేందుకే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసి.. హోదా ఆశలను సజీవంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా కోసం తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లోక్‌సభలో హోదా అంశాన్ని లేవనెత్తిన మిథున్‌రెడ్డి
-
‘వడ్డీలకే రూ. 20 వేల కోట్లు కట్టాల్సి వస్తోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని... రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోందని వివరించారు. వడ్డీలకే 20వేలకోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు చెల్లించాడానికే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితిని ఏపీ ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రంలో 77శాతం రైతులు అప్పుల్లో మునిగిపోయారని, వారిని ఆదుకునేందుకు కేంద్రం ఏం చేస్తుందో ముందే చెప్పాలని కోరారు. రైతుల అభివృధికోసం స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కోరారు. -
హోదా హామీ అమలు కాలేదు
పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను.లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు? – సీఎం వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాలేదని ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు అంశాల ఎజెండాతో ప్రధాని నేతృత్వంలో బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మార్గాలు, ఒకే దేశం–ఒకే ఎన్నిక, 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధి అనే ఐదు అంశాలు ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అఖిలపక్ష భేటీకి పలు పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఎజెండాలోని అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు మద్దతు పలికారు. అలాగే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు రాజ్యాంగంలో పదో షెడ్యూలును, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. మహాత్ముడి 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో పటిష్ట పథకాలు ప్రకటించాలని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది.. ‘పార్లమెంటరీ విలువలు, సంప్రదాయాలపై నాకు అపార గౌరవం, భక్తి ఉన్నాయి. పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను. లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు? మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించగల సామర్థ్యం ఉండి.. ఆ విభజనకు ముందస్తు షరతుగా విధించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చగలిగే సామర్థ్యం లేకపోవడాన్ని పార్లమెంట్ ఎలా సమర్థించుకుంటుంది? ఇది ఏరకమైన న్యాయం? ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలంటే, గౌరవాన్ని పొందాలంటే పార్లమెంట్ ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత వ్యవధిలో, తూచా తప్పకుండా అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం ఆపుతాయి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఫిరాయింపులపై పటిష్ట చర్యలు ఉండాలి ‘రాజ్యాంగంలోని పదో షెడ్యూలు అమలులో పటిష్ట చర్యలు ఉండాల్సిన ఆవశ్యకతను మీ ముందుకు తెస్తున్నాను. ఈ అంశాన్ని మీకు తెలిపేందుకు వీలుగా కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తెస్తున్నా. గత లోక్‌సభకు మా పార్టీ నుంచి గెలిచిన వారిలో ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించడమే కాకుండా బహిరంగంగా వారి సమావేశాల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే గత అసెంబ్లీలో మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ తన అవినీతి, నల్లధనం ఆశ చూపి ఎరవేసింది. వారిలో కొందరిని మంత్రులుగా కూడా చేసి అధికారాన్ని దుర్వినియోగపరిచింది.. కానీ ఈ రెండు కేసుల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధిపైన రెండు సభల సభాపతులు అనర్హత వేటు వేయలేదు. ఇది ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పరిహసించడమే కాదు.. ప్రజా తీర్పును కూడా పరిహసించడమేనన్న అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందువల్ల పార్లమెంట్‌కు, శాసనసభలకు ఎన్నికైన సభ్యుల ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లను ప్రిసైడింగ్ అధికారి 90 రోజుల్లో పరిష్కరించాలని, ఇందుకు వీలుగా పదో షెడ్యూలులో తగిన నిబంధనను చేర్చాలని ప్రతిపాదిస్తున్నా. అలాగే ఇతర పార్టీల నుంచి రాజీనామా చేయకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్న రాజకీయ పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అనర్హత వేటు వేసేందుకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా ఒక నిబంధన చేర్చాలి’ అని జగన్ చెప్పారు. ‘ఇవి పాటించనప్పుడు బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం తప్ప ఏం చేయగలవు? అందువల్ల సభ మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు, అన్నింటికంటే ముందుగా పార్లమెంట్ విశ్వసనీయతను పెంచేందుకు వీలుగా ఈ అంశాలను ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాల వృద్ధికి పటిష్ట పథకాలు తీసుకురండి ‘నేటి ఎజెండాలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలని ప్రధానిని కోరుతున్నా. ముఖ్యంగా జాతీయస్థాయిలో విద్యారంగంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) వృద్ధి చేసేందుకు, వైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చును తగ్గించడానికి వీలుగా పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలి. బ్రిక్స్ దేశాలతో పోల్చితే ఉన్నత విద్యారంగంలో 25 శాతంతో మనదేశం రెండో అత్యల్ప జీఈఆర్ కలిగి ఉంది. ఆర్థిక స్థిరత్వం లేక, పేదరికం కారణంగా చాలా మంది పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉండిపోతున్నారు. బ్రిక్స్ దేశాల్లో రష్యా 81 శాతం జీఈఆర్ కలిగి ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ 50 శాతం, చైనా 48 శాతం, దక్షిణాఫ్రికా 21 శాతం కలిగి ఉంది. అలాగే విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయం అత్యల్పంగా జీడీపీలో 3.5 శాతం మాత్రమే ఉంది. మిగిలిన బ్రిక్స్ దేశాల్లో ఇదే అత్యల్పం. బ్రెజిల్లో 6.20 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో 6.10 శాతం, చైనాలో 4.20 శాతం, రష్యాలో 3.80 శాతంగా ఉంది. దేశంలో ఆరోగ్య రంగాన్ని వృద్ధి చేసేందుకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రారంభించిన ప్రధాని దూరదృష్టిని అభినందిస్తున్నా. అయినప్పటికీ మనం ఈ దిశగా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. అఖిలపక్ష సమావేశానికి వస్తున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ఆరోగ్య రంగానికి మన దేశంలో జీడీపీలో కేవలం 1.3 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాం. బ్రిక్స్ దేశాల్లో ఇదే అత్యల్పం. దక్షిణాఫ్రికాలో ఇది 8.80 శాతంగా, బ్రెజిల్లో 8.30 శాతంగా, రష్యాలో 7.10 శాతంగా, చైనాలో 5 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ఆరోగ్య రంగంలో చేస్తున్న మొత్తం వ్యయంలో వైద్యం కోసం దేశ ప్రజలు చేస్తున్న వ్యయమే 65 శాతంగా ఉంది. బ్రిక్స్ దేశాల్లో ఇదే అత్యధికం. బ్రెజిల్లో 44 శాతంగా ఉండగా, రష్యాలో 41 శాతం, చైనాలో 34 శాతం, దక్షిణాఫ్రికాలో 8 శాతంగా ఉంది. అందువల్ల వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మనదేశానికి జాతీయ స్థాయిలో జీఈఆర్‌ని వృద్ధి చేసే పథకాలు, ప్రజల వైద్య ఖర్చును తగ్గించగలిగే పథకాలను ప్రధాని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా బ్రిక్స్ దేశాల్లో ఉత్తమ దేశంగా రాణించేలా తోడ్పడాలని కోరుతున్నా’ అని అన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికపై.. ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదన ఒక సాహసోపేతమైన చొరవ. మా రాష్ట్రంలో పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభకు 1999 నుంచి ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలో మేం 20 ఏళ్లుగా భాగస్వాములం. ఒకే దేశం–ఒకే ఎన్నిక సూత్రాన్ని ప్రాథమికంగా చూస్తే ఎన్నికల వ్యయం తగ్గుతుంది. ఐదేళ్లకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఈ ప్రక్రియ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. పాలనలో అంతరాయం తగ్గుతుంది. పైగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరే కాలపరిమితితో ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసం అధికార, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడానికి ఆస్కారం ఉంటుంది. ఎంపీలను పలకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ రకంగా స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీకి ఆ రాష్ట్రంలోని అధికారులు, పోలీసు యంత్రాంగంపై నియంత్రణ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఒకే దేశం–ఒకే ఎన్నిక ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నా. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం, విస్తృత భాగస్వామ్యం కలిగిన ప్రజాస్వామ్యం కోసం మద్దతు ఇస్తున్నా. అయితే వివిధ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి విభిన్న సమయాల్లో ఉంది. ప్రధానమంత్రి ఈ ప్రతిపాదనను అమలులోకి తెచ్చేందుకు రాజ్యాంగంలోని సమాఖ్య స్వరూపం స్ఫూర్తితో ఒక మెకానిజాన్ని రూపొందిస్తారని విశ్వసిస్తున్నా’’ అని జగన్ చెప్పారు. అలాగే ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఈ నెల 15న జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడించిన వ్యూహానికి మద్దతు పలుకుతున్నానని తెలిపారు. -
అఖిలపక్ష సమావేశంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన
ఢిల్లీ: అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి గళమెత్తారు. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఐదేళ్లయినా ఇంకా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ఆ వ్యవస్థలపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నిర్ణీత కాలవ్యవధితో నెరవేరిస్తే సభలో పార్టీల నిరసన ఆగిపోతుందని సూచించారు. రాజీనామా చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యేలను రాజకీయ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఆ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి చేర్చుకున్న విషయాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిపై అనర్హత వేటు వేయకుండా చట్టాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. 10వ షెడ్యూల్ సవరించండి ఫిరాయింపులకు పాల్పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 90 రోజుల్లో అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్ సవరించాలని కోరారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పదే పదే ఎన్నికల వల్ల అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వివరించారు. ప్రజాధనం వృధా, అధికార దుర్వినియోగం కూడా తగ్గుతుందని అన్నారు. ఏకకాల ఎన్నికలకు సంబంధించి సాంకేతిక అంశాలను అధిగమించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ప్రధాన మంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకుందన్నారు. వైద్య విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలని విన్నవించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ జేబు నుంచి అధికంగా ఖర్చు పెడుతున్నారని, దీన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిక్స్‌దేశాలతో సమానస్థాయిలో భారత దేశాన్ని వైద్యవిద్యారంగంలో నిలబెట్టాలని అభిలషించారు. -
బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తాం : మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ-యువకులకు ఉద్యోగాలు కల్పించేలా బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకం ఏపీ ఐఐసీ పేమెంట్ క్లియరెన్స్‌పై చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వాస్తవమైనవా కాదా అని పరిశీలిస్తామన్నారు. జన్యూన్ ఇండ్రస్టీస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పరిశ్రమల ఏర్పాటుకు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, అది వస్తే పరిశ్రమలకు రాయితీ వస్తుందన్నారు. తమ పార్టీ మొదటి నుంచి హోదాపై పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. హోదా వచ్చే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి సాధించామని, బీజీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ విధానమని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాకూడదు
-
హోదాపై మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం విపక్ష సభ్యులు మాట్లాడిన తీరుపై అధికార పార్టీ సభ్యులు భగ్గుమన్నారు. సభలో కొంతసేపు తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ప్రత్యేక హోదా తెస్తామంటేనే ప్రజలు అధికారం ఇచ్చారు, హోదా తీసుకురావాలని సూచిస్తున్నాం అని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందిస్తూ.. మాకు మీరు సూచన చేయడమేంటి, ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నది మీరు కాదా? అని ధ్వజమెత్తారు. మీకు కేంద్రం ఏం ప్యాకేజీ ఇచ్చిందో మాకు తెలియదు కానీ దీన్నుంచి బయట పడాలని అనుకుంటున్నారు అని విమర్శించారు. ఇంతలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలుగజేసుకుని గిల్లి గిల్లిచ్చుకోవాలని చూసేది మీరేనని, హోదా విషయంలో, ప్యాకేజీ విషయంలోనూ మమ్మల్ని కేంద్రం తప్పుదారి పట్టించిందని, దీనికి దెప్పిపొడవాల్సిన అవసరం లేదని అన్నారు. సభలో హోదా తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోటంరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల వాగ్వాదం హోదాపై తీర్మానం సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభను వేడెక్కించాయి. వంచన, వెన్నుపోటు, అవినీతి, దగా వంటివాటిపై పట్టాలిచ్చే విశ్వవిద్యాలయం ఉంటే ఇది చంద్రబాబుకే ఇవ్వాలని శ్రీధర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతూ శ్రీధర్‌రెడ్డి మాట్లాడారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు కొంతసేపు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఆ రోజు మేము హోదాపై మాట్లాడితే ట్యూషన్ పెట్టించుకోండని చంద్రబాబు అన్నది నిజం కాదా? ప్యాకేజీ వచ్చిందని ఢిల్లీలో కేంద్ర మంత్రులకు సన్మానాలు చేసి శాలువాలు కప్పారు, ఆ శాలువాలు రూములను నింపినా సరిపోవని ఎద్దేవా చేశారు. ఇంతలోనే అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ.. తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోలేదని, హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామని పేర్కొన్నారు. దీక్ష చేస్తానంటే బాబు వద్దన్నారు: మంత్రి అవంతి హోదా కోసం తాను విశాఖలో దీక్షకు పూనుకుంటే అప్పటి సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి అవంతి శ్రీనివాస్ అసెంబ్లీలో ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఐదుసార్లు ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఆ తర్వాత అప్పటి కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఫోన్ చేసి.. పార్టీలో నువ్వొక్కడివే ఎంపీవా, నీకు ఒక్కడికే హోదా కావాలా అంటూ కోపగించి దీక్ష విరమించేలా చేశారని పేర్కొన్నారు. హోదా కోసం జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో మైలేజీ ఆయనకు వెళ్తోందన్న భయంతో చంద్రబాబు కూడా మళ్లీ హోదా డిమాండ్‌ను ఎత్తుకున్నారన్నారు. చంద్రబాబు వైపు మంత్రి అవంతి చూపిస్తూ... ‘‘సార్ మీరు నన్నేమీ అనుకోవద్దు. మీ పక్కన ఉన్నవాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, వాళ్లను నమ్మొద్దు’’ అనడంతో సభ్యులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. చంద్రబాబూ క్షమాపణ చెప్పండి : అంబటి గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల ప్రత్యేక హోదా రాకుండా పోయింది. నేను తప్పు చేశాను, నావల్ల ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు ఒప్పుకుని, రాష్ట్ర ప్రజలను క్షమాపణలు అడిగితే బాగుంటుంది’’ అని వైఎస్సార్సీపీ సభ్యుడు అంబటి రాంబాబు సూచించారు. క్షమాపణలు చెబితే బాబు క్రేజ్ ఇంకా పెరుగుతుందన్నారు. గతాన్ని తవ్వి చంద్రబాబును విమర్శించే అవకాశం టీడీపీ సభ్యులే ఇస్తున్నారని చెప్పారు. -
హోదా ఇవ్వాల్సిందే
ప్రణాళికా సంఘం 2015 జనవరి వరకు ఉంది. ఆ తరువాతే నీతి ఆయోగ్ వచ్చింది. అంటే 7 నెలలు ప్రణాళికా సంఘం అమల్లోనే ఉంది. ఆ 7 నెలల కాలంలో చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కలసి కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని అడగటం కానీ, కనీసం లేఖ రాసిన పాపాన కూడా పోలేదు. చంద్రబాబు ఏడు నెలల పాటు ప్రత్యేక హోదాను పట్టించుకోకపోవడం వల్లే కేబినెట్ తీర్మానం అమలుకు నోచుకోలేదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ వద్దని, రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రత్యేక హోదానే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని అభ్యర్థిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు లేక నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే కొంతైనా ఊరట లభిస్తుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏపీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు హోదా అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపనిదే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనంటూ నాడు పట్టుబట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, మరి అదే పట్టుదల హోదాపై ఎందుకు చూపలేదని నిలదీశారు. నాటి కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని కలిస్తే సరిపోయేదని, అలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకుని చంద్రబాబు 7 నెలలపాటు తాపీగా వ్యవహరించారని విమర్శించారు. ఆయన బాధ్యతగా వ్యవహరించి ఉంటే హోదా అప్పుడే వచ్చి ఉండేదని, మన యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కూడా దక్కేవని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ చంద్రబాబు గతంలో ఇదే సభలో తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో రికార్డులను సరి చేసేందుకు ప్రత్యేక హోదాయే కావాలంటూ ఇప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదిగో అభిజిత్‌సేన్ లేఖ .. ప్రత్యేక హోదా రద్దు కోసం తాము ఎలాంటి సిఫార్సులు చేయలేదంటూ 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్ రాసిన లేఖను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ ఎదుట ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తేదీన కేంద్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా నాటి కేబినెట్ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిన నోట్‌ను కూడా ముఖ్యమంత్రి సభ ముందు ఉంచారు. ఈనెల 15వతేదీన ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా తీర్మానంలోని అంశాలనే ప్రస్తావించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ‘‘అధ్యక్షా... ఒక రాష్ట్రంగా మనం ఎంత అన్యాయానికి గురయ్యామో ఈ ప్రకటన ద్వారా సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు. ఇలాంటి విభజన వల్ల కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిప్పులమీద నడవాల్సి వస్తుందని, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో నష్టపోతుందని తెలిసి కూడా విభజన విషయంలో మొండిగా ముందుకు వెళ్లిన విషయం మన అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతాం. ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వండి అని సభ సాక్షిగా మరోసారి తీర్మానం చేయాల్సి వస్తోంది. మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోగా మరింత పెరగటానికి కారణమైంది కాబట్టే ఈరోజు మనమంతా ఇంత పోరాటం చేయాల్సి వస్తోంది. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, అప్పు–చెల్లింపు బాధ్యతలను మనం వారసత్వంగా పొందాం. కానీ 47 శాతం ఆదాయం మాత్రమే పొందాం. ఆదాయాన్నీ, ఉద్యోగాల్ని ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ, ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం. 2015–2020 మధ్య కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.22,133 కోట్లు ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి డివల్యూషన్ తర్వాత రెవెన్యూ మిగులు రూ.1,18,678 కోట్లుగా ఉంటుందనీ 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తవంగా గత ఐదు సంవత్సరాలలో మన రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లకు విపరీతంగా పెరిగింది. ఇది 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన మొత్తం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్ అనేక దశాబ్ధాల వ్యవధిలో దేశంలోని ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఇందుకు నిదర్శనం 2013–14లో ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.57 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉండగా హైదరాబాద్ నగరం ఒక్కటే రూ.56,500 కోట్ల ఎగుమతులను సాధించింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,397గా ఉంది. ఉద్యోగాలు లేక వలస వెళుతున్నారు.. కొత్త రాష్ట్రానికి ఎదురయ్యే సవాళ్లను, ఆర్థిక దుస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ పార్లమెంటులోనే ప్రకటన చేశారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సహాయం చేయడం ద్వారా, అభివృద్ధిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా, రాయితీలు కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని పార్లమెంటులో చెప్పారు. అయితే రాష్ట్రాన్ని విభజించే సమయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఇది రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక, సామాజిక దుస్థితికి దారి తీసింది. విభజన సమయంలో రూ.97,000 కోట్లుగా ఉన్న మన రాష్ట్ర రుణం 2018–19 నాటికి ఐదు సంవత్సరాలలో అత్యధికంగా రూ,2,58,928 కోట్లకు చేరింది. రుణంపై వడ్డీ మాత్రమే సంవత్సరానికి రూ.20,000 కోట్లకుపైగా ఉంటే దీనికి అదనంగా అసలు రూపంలో చెల్లించాల్సిన మొత్తం మరొక రూ.20,000 కోట్ల మేరకు ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వినియోగించుకున్న రుణాల కోసం ఇచ్చిన హామీల రూపంలో భారీ కంటింజెన్సీ చెల్లింపు బాధ్యతలు ఉన్నాయి. మరోవైపు ఉపాధి కల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయి మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. హోదానే జీవనాడి... ఈ నిరుత్సాహపూరిత పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రం ఆర్థికంగా, ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు, అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు లభిస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న గ్రాంట్లు తలసరి రూ.5,573గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తున్న గ్రాంట్లు తలసరి రూ.3,428 మాత్రమే ఉంది. పైగా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ఆదాయపు పన్ను మినహాయింపు, జీఎస్టీకి సంబంధించిన మినహాయింపులు, ఇతర రాయితీలు, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నందువల్ల హోదా ప్రాముఖ్యత సంతరించుకుంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసే సత్వర పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, తయారీ రంగంలో పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యాసంస్థలు వస్తాయి. ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవన్నీ సత్యదూరాలే.. ఒకవైపు నిజం ఇలా ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి రకరకాల సాకులు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ వాదనలన్నీ సత్యదూరం. నిజం ఏమిటన్నది మరోసారి అందరి ముందు ఉంచుతున్నా. 14వ ఆర్ధిక సంఘం గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్‌సేన్ రాసిన లేఖను మీ ముందు ఉంచుతున్నా. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రద్దుకు సిఫార్సు చేయలేదని అందులో ఆయన స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వతేదీన నాటి కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యం. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నాటి కేబినెట్ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్లానింగ్ కమిషన్‌తో మాట్లాడి చేయించకపోవడం వల్లే హోదా అమలు కాలేదు. 2015 జనవరి 1 తర్వాతే ప్రణాళికా సంఘం రద్దై నీతి ఆయోగ్ ఏర్పడింది. ఏపీ మినహా ఏ రాష్ట్రాన్నీ ఇలా విభజించలేదు.. అనేక ఇతర రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ హోదాను కోరుతున్నాయనే వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపించాయి. అందువల్ల ఈ అంశంపై నేను మాట్లాడదలుచుకున్నా. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థికంగా, ద్రవ్యపరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తామనే ముందస్తు షరతుతో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రాన్నీ పార్లమెంటులో విభజించలేదన్న విషయం ఇక్కడ గమనార్హం. నాడు పార్లమెంట్లో అటు పాలక పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా దీనికి మద్దతు తెలిపాయి. విభజన కోరిన రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందించే రాజధానిని ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. అత్యధిక సంఖ్యలో ప్రజలు, తక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం కాబట్టే న్యాయం చేయడానికి ఇదే సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి, ఆ హామీని నిలబెట్టుకోలేని ఆ పార్లమెంట్‌కు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండడం న్యాయమేనా? ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని స్పష్టమైన నేపథ్యంలో ఇక జాప్యం లేకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఐదు కోట్ల ప్రజల తరఫున ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’ ఇలాగే ఉంటే ఈసారి 13 మందే... చంద్రబాబు హోదా గురించి నాడు ప్లానింగ్ కమిషన్‌ను అడిగి ఉంటే వచ్చి ఉండేదని, అలా చేయకుండా ఆయన తీరిగ్గా ప్రధాని వద్దకు వెళ్లి హోదా అడగడం ఆశ్చర్యకరమని సీఎం వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్రత్యేక హోదా అమలును సాధించగలిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఆ తరువాత మళ్లీ ప్రధాని దగ్గరకు వెళ్లడం, కొత్తగా హోదా కోరుతూ తీర్మానం చేయడం లాంటి అవసరం ఉండేది కాదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నోరు తెరిస్తే సత్యదూరమైన మాటలు చెప్పడం చంద్రబాబుకు అలవాటై పోయిందని సీఎం విమర్శించారు. ఇప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి 13 మంది ఎమ్మెల్యేలకే పరిమితం అవుతారని జగన్ వ్యాఖ్యానించారు. హోదా ఏం పాపం చేసింది బాబూ? ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ ఇందులో వివాదాలకు తావు లేదని, గతంలో ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇదే సభలో తీర్మానం చేసినందున ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రికార్డులను సరిచేస్తున్నామని చెప్పారు. అయినాసరే చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ముఖ్యమంత్రి జగన్ కూర్చుంటూ బంగారంలా మాట్లాడవచ్చంటూ సూచించారు. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వకుండా, మాట్లాడనివ్వకుండా చేసే సంప్రదాయం తమది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు. ‘29 సార్లు ఢిల్లీ వెళ్లా. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పా’ అని చంద్రబాబు పేర్కొనడంపై ముఖ్యమంత్రి జగన్ ప్రతిస్పందించారు. పోలవరం ముంపు మండలాల గురించి చంద్రబాబు చెబుతున్నారని అయితే ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది బాబూ? అని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారంటూ చురకలు అంటించారు. ‘ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. గుండెపై చేయి వేసుకుని మనస్సాక్షిని అడగండి. మీ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుంది’ అని ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చ , హోదాపై చర్చలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా తీర్మానానికి మండలిలో బీజేపీ మద్దతు జాప్యం లేకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టిన అనంతరం బీజేపీ పక్ష నాయకుడు మాధవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు సమాన స్థాయిలో, ఇతరేతర రూపంలో రాష్ట్రానికి సహాయం చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. హోదా కోసం పట్టుపట్టకుండా హోదాకు సమాన స్థాయిలో కేంద్రం ఏ రూపంలో సహాయం చేసినా తీసుకోవడానికి ముందుకొస్తే రాష్ట్రానికి ప్రయోజనకరమన్నారు. అయితే ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. హోదా కోరుతూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కీలక సంఘాల నేతలతో ఒక అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం వద్దకు తీసుకెళ్తే బాగుంటుందన్నారు. పలువురు సభ్యుల సూచనల అనంతరం సభ హోదా తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్లానింగ్ కమిషన్‌ను కలిస్తే సరిపోయేది 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, అయితే అంతకంటే ముందే 2014 మార్చి 2న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిందని, అంతేకాకుండా హోదాను అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయించడంలో చంద్రబాబు సరిగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ‘ప్రణాళికా సంఘం 2015 జనవరి వరకు ఉంది. ఆ తరువాతే నీతి ఆయోగ్ వచ్చింది. అంటే 7 నెలలు ప్రణాళికా సంఘం అమల్లోనే ఉంది. ఆ 7 నెలల కాలంలో చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కలసి కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని అడగటం కానీ కనీసం లేఖ రాసిన పాపాన కూడా పోలేదు’ అని సభలో ముఖ్యమంత్రి నిలదీశారు. చంద్రబాబు ఏడు నెలల పాటు ప్రత్యేక హోదాను పట్టించుకోకపోవడం వల్లే కేబినెట్ తీర్మానం అమలుకు నోచుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. కేవలం ప్లానింగ్ కమిషన్ వద్దకు వెళ్లి కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని కోరితే సరిపోయేదని, అలాంటిది కూడా పట్టించుకోలేదంటే ప్రత్యేక హోదాపై ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కావాలంటూ నీతి ఆయోగ్ ఏర్పడిన 9 నెలల తరువాత 01–9–2015న తీర్మానం చేయటాన్ని బట్టి హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి, ఆరాటం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని, లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా ఆయన రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నా : చంద్రబాబు ప్రత్యేక హోదా తీర్మానంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ‘నేను 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్ర సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పా. కానీ కేంద్రం స్పందించలేదు. ప్రత్యేక హోదాకు సమానంగా, అంతకు మించి ప్యాకేజీ ఇస్తానంటేనే అప్పట్లో ఒప్పుకున్నా. చివరి బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం మోసం చేసింది. అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. రాజకీయంగా మేం నష్టపోయినా ప్రత్యేక హోదాపై పోరాటం చేశాం. మీరు హోదా కోసం పోరాడితే సహకరిస్తాం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు కదా హోదా కోసం పోరాడాలి’ అని పేర్కొన్నారు. -
మాటంటే మాటే
-
దేశంలో ఎక్కడా ఆ విధానం లేదు : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారి సామాజిక మంత్రి మండలిని ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవస్థలు నాశనమయ్యాయని, చెడిపోయిన రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడం కోసమే సీఎంగా ప్రమాణం చేశానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నీతివంతమైన పరిపాలన అందిస్తామని, అలా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ కోసం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జడ్జి అనుమతితో టెండర్లకు వెళ్లే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాకు అడ్డుకట్ట వేయగలమని సీఎం అభిప్రాయపడ్డారు. ఏడాది ముందే రైతు భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీర్మానంపై విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. తన సుధీర్ఘ ప్రసంగంలో సీఎం అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రానున్న ఐదేళ్లూ తమ ప్రణాళికలు ఉంటాయని వెల్లడించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల శ్వాస, హోదా ఇచ్చే వరకు కేంద్రంపై ఒత్తిడి తేస్తూనే ఉంటాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావిసాం. సీఎం, మంత్రుల ఛాంబర్లో చూస్తే మా మేనిఫేస్టో కనబడుతుంది. ర్తెతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తాం. ఇచ్చిన మాట కంటే ఏడాది ముందే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం. రైతన్నల సంక్షేమం కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పథకాలతో దేశమంతా ఏపీ వైపు చూసేలా.. రెండువేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తాం. బాబు పాలనలో ఇన్పుట్ సబ్సిడీ రూ.రెండువేల కోట్లు పెండింగ్‌లో ఉంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు భీమా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మారుస్తాం. విద్యాహక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. జనవరి 26న అమ్మబడి పథకం కింద ప్రతి తల్లికి రూ. 15వేలు ఇస్తాం. వచ్చే ఐదేళ్లలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకి తీసుకువస్తాం. ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. దాని కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ద్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు జీతాలు పెంచాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాం. ప్రభుత్వ పథకాలతో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తాం. ఆగస్ట్ 15న ఐదు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వారితోనే ప్రతి పథకాన్ని డోర్‌డెలివరీ చేస్తాం. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేస్తాం. జూలై 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. -
‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్’
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన డిమాండ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినితీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు.జాతీయ చానల్ న్యూస్ ఎక్స్ నిర్వహించిన ఇండియా నెక్ట్స్ డిబేట్లో మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. 51 శాతం ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వీప్ చేశారని తెలిపారు. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజల కష్టాసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన రోజు నుంచే వైఎస్ జగన్ ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం తమ సత్తాను నిరూపించాయి. రాజ్యసభలో బీజేపీ ఇంకా మైనారిటీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తాం. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని మేము భావించాం.. కానీ అది సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని మాకు మాట ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ నేతలు కూడా సభలోనే ఉన్నారు. 60 శాతం ప్రజలకు 40 శాతం రెవెన్యూతో విభజించారు. దీంతో ఏపీ ఏటా 20వేల కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సి వస్తోంది. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో అవినీతి పెరిగిందని జాతీయ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల ఊబిలో నెట్టేశారు. పార్లమెంట్లో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. సీబీఐ ఆంధ్రప్రదేశ్‌లో కేసులను దర్యాప్తు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ దర్యాప్తుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతి ఇచ్చార’ని మిథున్‌రెడ్డి డిబెట్లో పేర్కొన్నారు. ఏపీ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : బీజేడీ ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు బీజేడీ ఎంపీ పినాకి ఘోష్ కూడా ఇండియా నెక్ట్స్ డిబెట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తుపాన్ల కారణంగా ఒడిశా తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. -
హోదా ఏం పాపం చేసింది బాబూ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు 2014లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, దానిని అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడిగారా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. హోదాను అమలు చేయాలని కనీసం ప్లానింగ్ కమిషన్‌కు లేఖ కూడా రాయలేదని గుర్తుచేశారు. హోదా తీర్మానంపై చంద్రబాబు నాయుడు మాట్లాడిన అనంతరం.. సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు కనీసం చిత్తశుద్ధి కూడా లేదని సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఏర్పడిన తొమ్మిది నెలల తరవాత చంద్రబాబు స్పందించారని, అప్పటి వరకు కనీసం దాని ఊసే లేదని గుర్తుచేశారు. దీన్ని బట్టే చూస్తే.. హోదాపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని సీఎం వైఎస్ జగన్ వివరించారు. పోలవరం నిర్మాణం కొరకు ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఇవ్వకపోతే ప్రమాణం చేయమని అప్పట్లో చంద్రబాబు చెప్పారని, మరి హోదా ఏం పాపం చేసిందని.. ఆ పని చేయలేదని ఘాటుగా నిలదీశారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబాద్ధాలు మాట్లాడుతన్నారని మండిపడ్డారు. -
హోదా సాధించలేకపోయాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తాము సాధించలేకపోయామని, హోదా సాధన బాధ్యత ప్రజలు వైఎస్సార్సీపీకే ఇచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీ ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం చంద్రబాబు మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల కాలంలో హోదా సాధనకు ప్రయత్నించామని, కానీ మావల్ల కాలేదని పేర్కొన్నారు. తాము విఫలమైనందుకు ప్రజలు వైఎస్సార్సీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను తమ ప్రభుత్వమే ఏపీలో విలీనం చేసిదని చంద్రబాబు తెలియజేశారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని, అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. తమకు ప్యాకేజీ వద్దని, రాష్ట్రాన్ని సంజీవని అయిన ప్రత్యేక హోదానే కావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో స్పష్టం చేసిన విషయంతెలిసిందే. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిందని, అయితే ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ప్రవేశం పెడుతున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేకహోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. సభ చర్చలో భాగంగా హోదా తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. -
మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : తమకు ప్యాకేజీ వద్దని, రాష్ట్రాన్ని సంజీవని అయిన ప్రత్యేక హోదానే కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిందని, అయితే ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ప్రవేశం పెడుతున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేకహోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిప్రాయానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనతో మనకు అన్నివిధాలుగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆనాటి కేంద్రప్రభుత్వం మొండిగా ముందుకు నడిచింది. గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ.. గత ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో ఆ ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నాం. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 59 శాతం మంది జనాభాను, అప్పులను వారసత్వంగా పొందాం. కానీ ఆదాయాన్ని 47 శాతం మాత్రమే పొందాం. ఆధాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాన్ని కోల్పోయాం. విభజన నాటికి రూ.97 వేల కోట్లున్న రుణం ఐదేళ్లలో రూ.2,58,928 కోట్లకు ఎగబాకింది. 2013-14 ఏడాది ఏపీ నుంచి రూ.57 వేల కోట్లు సాప్ట్వేర్ ఎగుమతులు ఉండగా.. ఒక్క హైదరాబాద్ నుంచే రూ.56 వేల 500 కోట్లు ఎగుమతులు జరిగాయి. విభజన సమయంలో అధికార, పత్రిపక్ష పార్టీలు పార్లమెంట్లో చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. విభజన హామీలు నెరవేర్చకపోవడం వల్లే.. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సామాజిక, దుస్థితికి దారి తీసింది. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం.. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు మేరకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం. నిజం ఏమిటన్నది అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం గౌరవ సభ్యులు ప్రొఫెసర్ అభిజిత్ సింగ్ లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరి హోదా రద్దుకు సిఫారసు చేయలేదని, ఫ్రొఫెసర్ అభిజిత్ సింగ్ స్పష్టంగా వివరించారు. పరిశీలించడానికి సభ సమక్షంలో నేను ప్రవేశపెడుతున్నాను. 2014 మార్చి 20న ప్రత్యేక హోదా మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తు చేస్తున్నాను. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఆ మంత్రి మండలి ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హోదా అమలు కాలేదు. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి.. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి. జాప్యం లేకుండా హోదా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నా. ఇదే కాపీని నీతిఅయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో చదివి వినిపించాను. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కావాలని చెప్పడం కోసం ఈ తీర్మానం పెడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించారు. ఆ హామీని నిలబెట్టుకోలేని పార్లమెంట్‌కు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండటం న్యాయమేనా? యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా.. ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఫైవ్ స్టార్ హోటల్స్, ఉత్పత్తి రంగంలో పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యా సంస్థలు వస్తాయి. ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.’ అని వైఎస్ జగన్ ప్రకటన చేశారు. అనంతరం ఈ తీర్మానంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. -
ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్ ప్రకటన
-
నేడు అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానం
-
కేంద్రానికి సహకరిస్తూనే ‘హోదా’ కోసం పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే, ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు. అఖిలపక్ష భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రిని కోరామని చెప్పారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. సభా సమయం వృథా కాకుండా చూడాలి ‘‘వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాం. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అవసరమైతే దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరాం. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని విన్నవించాం. గతంలో పార్లమెంట్ సమావేశాల్లో సభా సమయం ఎక్కువగా వృథా అయ్యేది. ఎలాంటి చర్చలు, నిర్ణయాలు లేకుండా ఆటంకాలతో సభా సమయం ముగిసేది. ఇప్పుడు అలా జరగకుండా ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏడాదికి ఇన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశం కావాలని, ఎవరైతే హాజరు కారో, ఎవరైతే సమావేశాలకు ఆటంకాలు సృష్టిస్తారో అలాంటి వారికి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు అందకుండా చూడాలని సూచించాం. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అన్ని రాజకీయ పక్షాలు మహిళా రిజర్వేషన్లను కోరుకున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అఖిలపక్ష సమావేశంలో కోరాయి’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే తమ ప్రధాన ఎజెండా అని తేల్చిచెప్పారు. బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం పెరగాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా ఆలోచించి, బీసీలకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. -
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
-
‘హోదా అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తాం’
-
‘రాష్ట్ర హోదానే మా ప్రధాన ఎజెండా’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరు అయ్యారు. భేటీ అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సమావేశంలో లేవనెత్తామన్నారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. గతంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టామని, అవసరమైతే రాజ్యాంగం లోని 9 షెడ్యూల్ సవరించాలని కోరామన్నారు. అవసరాన్ని బట్టి దేశానికి, విశాల ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ప్రత్యేక హోదానే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని, అది వచ్చిన తర్వాతే మిగిలిన అంశాల గురించి పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల అధ్యక్షులకు మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ ఈ నెల 19న ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. ఐదు అంశాలపై ఈ సమావేశంలో చర్చింస్తామని చెప్పారు. వివిధ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చర్చించనున్న ఐదు అంశాలు.. పార్లమెంట్ పనితీరు, మెరుగుదల ఒకే దేశం..ఒకే పన్ను అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృది 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు, నవభారత నిర్మాణం కోసం సంకల్పం మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల పై చర్చ -
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లారు. కాగా వైఎస్ జగన్ నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో విభజించిన రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నీతి ఆయోగ్ సమావేశంలో కోరారు. -
హోదా ఇవ్వండి!
-
రాజీలేని పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు, హామీల సాధనకు ఎంపీలే కళ్లు, చెవుల లాంటివారని అభివర్ణించారు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం తొలిసారి సమావేశమైంది. సమావేశంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, విప్ మార్గాని భరత్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, గొడ్డేటి మాధవి, బెల్లాని చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, వెంకట సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ, రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేశ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, నల్లకొండగారి రెడ్డప్ప పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో సమావేశమైన ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. మన బలాన్ని సమర్థంగా వినియోగించుకుందాం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎంపీలతో సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్లో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. దీన్ని ఒక అవకాశంగా భావించాలి. మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై రాజీలేని పోరాటం చేసి ఫలితాలు రాబట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీల గౌరవం పెరిగేలా హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీలో ఎక్కువ శాతం మంది యువకులు, విద్యావంతులు ఉన్నందున భాషాపరమైన సమస్య ఉండదు. శాఖలవారీగా ఎంపీలు కమిటీలు ఏర్పాటు చేసుకుని నిధులు రాబట్టటంపై కృషి చేయాలి. నియోజకవర్గ అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ఎంపిక చేసుకోవాలి. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా మిథున్‌రెడ్డి ఇచ్చే సలహాలు, సూచనలు అనుసరించి సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఎంపీలను సబ్ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తాం. తరచూ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల సాధనపై దృష్టి సారించాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో పార్లమెంట్లో వ్యవహరించాలి’ అని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అనంతరం రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రాధాన్య అంశాలను ఆయన ఎంపీలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కలసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ప్రత్యేక హోదాతోపాటు నియోజకవర్గాలవారీగా సమస్యల గురించి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించాం. పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంపై సీఎంతో చర్చించా. కదిరి నుంచి కొంతమంది పేదలు భిక్షాటన కోసం కేరళ వెళుతున్నారు. అక్కడ ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లా. ధర్మవరం, హిందూపురంలో చేనేత కార్మికుల కోసం క్లస్టర్ల ఏర్పాటుపై చర్చించా. ఇక రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత దేశంలోని కరువు పీడిత ప్రాంతాల్లో అనంతపురం జిల్లానే రెండో స్థానంలో ఉంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అదనపు నిధులు సాధించడం, ఉద్యాన సాగును ప్రోత్సహించడంపై చర్చించా. ముద్దనూర్, చిక్‌బళ్లాపూర్ రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించా. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎంపీలంతా కలసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో కేంద్రం మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. – గోరంట్ల మాధవ్, హిందూపురం ఎంపీ చివరిదాకా పోరాడుతూనే ఉంటాం.. పార్లమెంట్లో కలసికట్టుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంపీలను బృందాలుగా ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం. ఏ సమస్య ఉన్నా పార్లమెంటరీ పార్టీ నేత, ఫ్లోర్ లీడర్ల ద్వారా చర్చించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉండాలని ఆదేశించారు. – డా. సంజీవ్‌కుమార్, కర్నూలు ఎంపీ వైఎస్ జగన్‌ను కలిసిన కర్ణాటక సీఎం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం నంబర్ 1 జన్‌పథ్‌కు వచ్చిన ఆయన వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు. మామిడి ఎగుమతులకు రైల్వే సహకరించాలి.. ప్రత్యేక హోదా మన నినాదం, దాన్ని సాధించే క్రమంలో ఫ్లోర్ లీడర్ల సూచనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. మా జిల్లాలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్టేషన్లు, రైల్వే షెడ్లు, యార్డుల గురించి సభలో ప్రస్తావిస్తా. మా ప్రాంతం నుంచి మామిడి ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా రైల్వే ఏర్పాట్లు చేయాలి. తాగునీరు, సాగునీటి సమస్యలతోపాటు గిరిజన యూనివర్సిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ తదితర అంశాలపై కృషి చేస్తా. – బెల్లాని చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ హామీ మేరకు సహకరించాలని కోరతాం.. ఎంపీల సంఖ్యలో వైఎస్సార్ సీపీ దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అంతా కలసికట్టుగా పనిచేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ఉంది కాబట్టి మానవతా దృక్పథంతో సాయం చేయమని అడుగుతాం. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు సహకరించమని అడుగుతూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని కోరా. నా సూచన బాగుందని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. యువతకు శిక్షణ, అవగాహన, ఉపాధి కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పలు పథకాలున్నాయి. వాటి కింద 50 శాతం వరకు సబ్సిడీ కూడా వస్తోంది. పన్ను రాయితీలు కూడా ఉన్నాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి. వీటిని వినియోగించుకుంటే యువతకు స్వయం ఉపాధి లభిస్తుంది. – మార్గాని భరత్, రాజమండ్రి ఎంపీ ఏపీ భవన్ వద్ద ఘన స్వాగతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఢిల్లీ వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ భవన్ వద్ద పలువురు నేతలు, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి రెహమాన్, పార్టీ ఎంపీలు వంగా గీత, సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డిశాంతి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్.. ఏపీ భవన్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
మాట నిలబెట్టుకోండి
రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. 2018–19కి ఆ అప్పులు రూ.2,58,928 కోట్లకు చేరాయి. ఈ అప్పులపై ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ, రూ.20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఇంతటి బాధాకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అసమానతలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక హోదా ఎంతో అవసరం. అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కలసి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ.. విభజన తర్వాత అమలు కాకపోవడం వల్ల రాష్ట్రంలో పరిస్థితి సామాజిక, ఆర్థిక అసమానతలకు దారి తీసింది. సాక్షి, న్యూఢిల్లీ : అన్యాయమైన విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అసమానతల తొలగింపునకు, పారిశ్రామికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ వేదికపై గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో విభజించిన రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఐదో పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో స్పష్టంగా వివరించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో నిర్లక్ష్యపూరిత పాలన, వ్యవస్థీకృత అవినీతి వల్ల రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోయిందో వివరించారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదార స్వభావంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఇతర రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్‌ను కోల్పోవడంతో భారీ నష్టం ‘రాష్ట్రంతో ముడిపడి ఉన్న జాతీయ ఆకాంక్షలతో కూడిన కొన్ని సలహాలు, ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ తరఫున సమర్పించాలనుకుంటున్నా. మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా అన్యాయమైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఆ వేళ పూర్తిగా విస్మరించారు. 2015 – 20 మధ్య ఏపీ రెవెన్యూ లోటును రూ.22,113 కోట్లుగా 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షా 18 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు. కొన్ని దశాబ్దాల కాలంలో హైదరాబాద్ నగరం ఆర్థికంగా సూపర్ పవర్ హౌస్‌గా అభివృద్ధి చెందింది. 2013 – 14 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.57,000 కోట్లుగా నమోదైతే.. అందులో ఒక్క హైదరాబాద్ నుంచే రూ.56,500 కోట్లు. తీవ్రమైన ఆర్థిక లోటుతో ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలింది. 2015 – 16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414 కాగా, ఏపీలో రూ.8,397 మాత్రమే ఉండటం ఇందుకు ఉదాహరణ. ఇంతటి దీనావస్థను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విభజనకు ముందు.. విడిపోనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని దేశానికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు గతంలో పార్లమెంట్ హామీ ఇచ్చింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా ఉంటుందని, ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు సమకూరుతాయని పేర్కొన్నా, ఆచరణలో అది అమలు కాలేదు. ఆర్థిక నష్టాన్ని పూడ్చేది హోదా మాత్రమే ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాలు వస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఒక వైపు తీవ్ర నష్టం వాటిల్లితే.. గత ఐదేళ్ల కాలంలో అధికార దుర్వినియోగం, వ్యవస్థీకృత అవినీతితో కూడిన నిర్లక్ష్యపూరిత పాలన వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింత క్షీణించాయి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు లేకుండా పోయాయి. విద్య, ఆరోగ్య వ్యవస్థలు క్షీణించసాగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాధారమైంది. అయితే ఈ క్రమంలో కొన్ని పుకార్లు, హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలంటూ జరిగిన కొంత ప్రచారం మరింత బాధించింది. హామీని నెరవేర్చే ఉదార స్వభావం చూపండి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా హోదా కోరుతాయంటూ ప్రచారం చేశారు. ఆర్థిక అసమానతలను తొలగించుకొనేందుకు ప్రత్యేక హోదా ముందస్తు హామీతో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర విభజన జరగలేదన్నది అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అప్పటి అధికార, ప్రతిపక్షాలు రెండూ అంగీకరించాయి. అత్యధిక రెవెన్యూ ఉత్పాదకతకు కేంద్రమైన రాజధాని ప్రత్యేక రాష్ట్రం కోరిన ప్రాంతానికి దక్కడం కూడా ఇదే మొదటిసారి. అందువల్ల రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని కోరుతున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. బీజేపీ కూడా ఈ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుతున్నాను’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు.. 14వ ఆర్థిక సంఘం వల్ల ఏపీకి హోదా ఇవ్వడం లేదంటూ కొన్ని పుకార్లు సృష్టించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొ.అభిజిత్ సేన్ లేఖ రాశారు. ఇదిగో ఆ లేఖ మీ ముందు ఉంచుతున్నా. 2014, మార్చి 2న సమావేశమైన అప్పటి కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా తీర్మానం చేసింది. అంతేకాకుండా దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ప్లానింగ్ కమిషన్‌ను ఆదేశించింది. అయితే దీన్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏపీకి హోదా అమలు చేయాలని అప్పటి కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం ఫైలు ప్లానింగ్ కమిషన్ రద్దయ్యే వరకు (2015, జనవరి 1) అక్కడే ఉండిపోయింది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. -
హోదాను రద్దు చేయలేదు.. ఇదిగో ఆధారం : సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఐదో సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించారు. (చదవండి : ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ కీలక భేటీ) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. గతంలో బీజేపీ తన మేజిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిని విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తూ గత కేబినెట్ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ.. ప్లానింగ్ కమిషన్ అబిజిత్ సేన్ లేఖను జతచేశారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చగలదు విభజనలో ఏపీకి తీవ్ర నష్టం కలిగింది. 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారు. అత్యంత ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువ. ఈ నష్టాన్ని పూడ్చడానికి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. విభజన నాటికి రూ.97 వేల కోట్లుగా ఉన్న మా అప్పు నేటికి రూ.2.59 లక్షల కోట్లకు చేరింది. అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏడాది రూ. 40 వేల కోట్ల భారం మా రాష్ట్రంపై పడుతోంది. ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయి. మా యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హోదా ప్రస్తావన ఉంది గత ఐదేళ్లలో అవినీతితో కూడిన దుష్పరిపాలన, చిత్తశుద్ధిలేని పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే మా జీవధారగా మిగిలింది. ప్రత్యేక హోదాపై అనేక అపోహలు కూడా ప్రచారంలో కొనసాగుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 2014 మార్చి 2న అప్పటి కేంద్ర కేబినెట్ ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు చేస్తూ తీర్మానించింది. అప్పటి నుంచి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే నాటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా హోదా ఇవ్వాలని అడుగుతాయన్న వాదన కూడా ప్రచారంలో ఉంది. రాష్ట్ర విభజన జరగడానికి ముందస్తు షరతుగా మాకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాకి అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంటులో ఉన్నారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
హోదాపై మోదీని ఒప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయి, ఇబ్బందులు పడుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ముందుగా విజయవాడ నుంచి సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికారిక నివాసమైన నంబర్ 1, జన్‌పథ్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ఉన్నారు. హోదా ఆవశ్యకతను వివరించాం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన ఆవశ్యకతను అమిత్ షాకు వివరించినట్టు సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. అమిత్ షాతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటివి కేంద్ర హోం శాఖ పరిధిలోనే ఉన్నాయి. వీటి అమలుకు సంబంధించి అమిత్ షాకు ఒక లేఖ సమర్పించాం. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేశాం. హోదా అవసరం రాష్ట్రానికి ఎంత ఎక్కువగా ఉందో వివరించాం. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్ర సాయం కావాలని అభ్యర్థించాం. ఏపీకి ప్రత్యేక హోదా అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలుకు సానుకూల ప్రతిపాదన చేయాలని అమిత్ షాను కోరాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఊహాగానాలు అనవసరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. ఈ ఊహాగానాలు అనవసరం అని వైఎస్ జగన్ బదులిచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గానీ, తాము గానీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని అన్నారు. అమిత్ షాతో సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్లో జరుగుతుందని పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ఎంపీలందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తారన్నారు. శుక్రవారం రాత్రి సీఎంను ఆయన బస చేసిన నంబర్ 1, జన్‌పథ్ నివాసంలో పలువురు నేతలు కలిశారు. శనివారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొంటారు. ప్రత్యేక హోదానే మా అజెండా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రత్యేక హోదానే తమ ప్రధాన అజెండా అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో వివరిస్తామన్నారు. దేవుడి దయతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామన్నారు. -
హామీ ఇచ్చారు..‘హోదా’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఐదో సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించనున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరనున్నారు. పరిపాలనలో అన్ని స్థాయిల్లో పారదర్శకత పెంచడానికి, అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించనున్నారు. తలసరి ఆదాయంలో వెనుకబాటే విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరమని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. విభజన తరువాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని, ప్రగతి పరుగులో వెనుకంజలో ఉందని తెలియజేస్తారు. తలసరి ఆదాయంలోనూ బాగా వెనుకబడిందని వెల్లడిస్తారు. 2015–16లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,397 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411 అని సీఎం వివరించనున్నారు. అక్షరాస్యతలో, మాతా శిశు మరణాలను నియంత్రించడంలోనూ ఏపీ వెనుకబాటులో ఉందని సీఎం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించండి గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పంటల బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్న సొమ్ము పరిహారంగా ఇస్తున్న సొమ్ము కంటే ఎక్కువగా ఉంటోందని, దీన్ని సరిచేయడానికి కేంద్రం చెల్లించే ప్రీమియం వాటాను రాష్ట్రానికి గ్రాంట్‌గా ఇచ్చేస్తే రాష్ట్ర సర్కారు రైతులకు న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తరువాత ఆ పంటల ప్రొక్యూర్మెంట్లో ఆంక్షలు విధించరాదని, మొత్తం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి విన్నవించనున్నారు. రైతుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసే సొమ్మును పాత బకాయిల కింద బ్యాంకులు సర్దుబాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరనున్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తారు. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ సగటు వాటాతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉందని గుర్తుచేస్తారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల అమలుకు తీసుకున్న చర్యలను నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించనున్నారు. పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అవినీతి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. టెండర్లలో పారదర్శకతకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు సీబీఐకి అనుమతి వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. -
ప్రత్యేక హోదా ఏపీ జీవనాడి
రెండో మాట ఏపీ అభివృద్ధి ఎజెండా కేవలం ఎన్నికల ఫలితాలకు అతీతమైందని బీజేపీ నాయకత్వం గ్రహించి తీరాలి. ‘ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిపోయిన అధ్యాయం’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదా నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓటమి తర్వాత కూడా ‘దండోరా’ వేస్తున్నారంటే ప్రధాని మోదీ, లేదా బీజేపీ నాయకత్వపు సంకుచిత ఆలోచనా ధోరణి స్పష్టాతిస్పష్టం. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని గురించిన ప్రతిపాదన సాధించేంతవరకు జగన్ నిరంతరం జాగరూకతతో ఆందోళన చేయడం అనివార్యమవుతుంది. కేంద్రం తక్షణం ‘జాతీయాభివృద్ధి మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యేక ప్రతిపత్తి వైఎస్ జగన్‌కు కాదు... అది ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. మన దేశంలో కులాలు, మతోన్మాదం ప్రజల మనస్సులపైన, ప్రజల నైతికతపైన చాలా విచిత్రమైన ప్రభావం కలిగిస్తున్నాయి. బహుళ సంఖ్యాక ప్రజలను బాధిస్తున్న దారిద్య్రాన్ని తదితర ఈతి బాధలను గురించి దేశంలో ఎవరూ ఆలోచించి బాధపడుతున్నట్లు తోచదు. నిజమే.. దారిద్య్రబాధల్లో ఉంటూ దుఃఖితులుగా ఉన్న వారికి వ్యక్తిగత స్థాయిలో కొందరు సాయపడటానికి ముందుకు వస్తూ ఉండ వచ్చు గాక. కానీ ఆ సహాయాన్ని అందించే దాతలు మాత్రం తమ సొంత కులంలోని వారికో లేదా సొంత మతస్థులలోని వారికి మాత్రమే సాయ పడుతున్నారని మరవరాదు. ఈ ధోరణి నిజమైన నైతిక ప్రమాణాలకు పరమ విరుద్ధమైన నీతి, ‘ఉల్టా’ నైతికత! దురదృష్టవశాత్తూ మన దేశంలో అమలు జరుగుతున్నదే ఈ ‘ఉల్టా’ నీతి! – డా. బి. ఆర్. అంబేడ్కర్ ‘ఏది విమోచన మార్గం‘ (విచ్ వే టు ఎమాన్సిపేషన్) అస్పృశ్యులన్నపేరిట వేలాదిమంది దళితులు హాజరైన బహిరంగ సభలో మరాఠీలో చేసిన ప్రసంగం: ‘‘అంబేడ్కర్ స్పీక్స్’’ వాల్యూమ్ 1, పేజీ 182, ఎడిటర్ ప్రొఫెసర్ నరేంద్రయాదవ్ (2013) ‘‘దారిద్య్రం అనేది మానవుడు కల్పించిందే అయితే, అదే మానవుడు ఆ దారిద్య్రాన్ని రూపుమాపడమూ సాధ్యమే. ఈ ప్రాపంచిక దృక్పథమే నాకు జీవితపాఠమై నా కళ్లు తెరిపించింది.’’ – టిటో టోనీ, సుప్రసిద్ధ ఫిలిప్పీన్స్ సామాజిక కార్యకర్త, వందలాది గ్రామాల్లో పెనుమార్పులకు ఆద్యుడైన వాడు (5–10–2017, రూరల్ ఇండియా కథనం) ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ యువజన పార్టీ అధి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలో తన పాలనారథానికి, రథికులకు విధా నపరమైన దశా, దిశా నిర్దేశం చేశారు. సుమారు 14 మాసాలపాటు సుదీర్ఘ రాష్ట్ర పాదయాత్ర సందర్భంగా ఆయన రూపొందించి, కోట్లాది మంది ప్రజలతో ముఖాముఖిగా సమస్యలను శ్రద్ధతో విన్న అనుభ వంతో ఆచరణలోకి తాను తేనున్న నవరత్నాల సంక్షేమపథకానికి వెంటనే శ్రీకారం చుట్టడం రాష్ట్రచరిత్రలోనే కాదు, స్వాతంత్య్రానంతర భారత దేశ మంత్రివర్గాల ఆచరణ చరిత్రలోనే ఒక అపురూప పరిణా మంగా భావించాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని అర్ధంతరంగా చీల్చడానికి, ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడిన చంద్రబాబు అనర్థదాయక పాలనా వారసత్వాన్ని ప్రజాబాహుళ్యం అండదండలతో పాతిపెట్టి జగన్ ప్రజాపక్షపాతిగా రూపొందారు. ఇందుకు ప్రధాన కారణం గతిం చిన రాచరిక పాలనల్లో కొనసాగుతూ వచ్చిన కుల, వర్గ, వర్ణ, మత వివక్షలకు దూరంగా కేవలం సకలమతాల ‘సారమతి’గా జగన్ తనకు తాను సంస్కరించుకున్న ఫలితంగా బైబిల్–ఖురాన్–భగవద్గీతల సారాన్ని రంగరించుకుని నూతన దృక్పథానికి అంకురార్పణ చేశారు. ఇది పాలకులకే కాదు, పాలితులయిన విభిన్న స్రవంతులకు చెందిన ప్రజలకూ పాఠమే! జడత్వంలో మగ్గుతున్న తెలుగు సమాజాన్ని మన్నుతిన్న పింజే రులా పడి ఉండక కొంతైనా చైతన్యం పొందడానికి జగన్ ప్రయత్నం, ప్రణాళిక ఉషోదయం ముందు తొలికోడి కూతలాంటి మేలుకొలుపుగా భావించాలి! అలాంటి మేలుకొలుపులకు ఆద్యులు దేశ చరిత్రలోనూ, రాష్ట్రాల చరిత్రల్లోనూ, కొన్ని రాచరిక పాలనా వ్యవస్థల్లో కూడా లేక పోలేదు. అలాగే జగన్ మనస్సులో నైలునది పొత్తిళ్లలో ఎదిగిన ఈజిప్టు, నదీ సంగమాల మధ్యన రూపుదిద్దుకున్న మెసపటోమియా నాగరికతల వైభవ ప్రాభవాలు మొదలవకపోవు. ఆ సంస్కృతిలోనే కృష్ణా, గోదావరి, పెన్నా నదీతీరాలలో తెలుగు మాగాణాలు సుక్షేత్రాలుగా అవతరించడా నికి ఎలా దోహదం చేశాయో ఆయన మనస్సులో ఆలోచనలను కుదిపి ఉండవచ్చు. క్రీ.పూ 594 నాటి ఏ«థెన్సులో ధనికులకు పేదలకు మధ్య జాంబవంతుడి అంగలతో పంగలతో పెరిగిపోయిన అసమానతలు, దారిద్య్రం గురించిన చరిత్ర వైఎస్ జగన్‌కు తెలియకపోదు. ఆ క్రమంలో ధనిక వర్గ శక్తులు తమ తమ ఆస్తిపాస్తులకు ఎదురైన సవాళ్లను కర్క శంగా ఎదుర్కొనడంలో ఎన్నివేలమంది పేదల్ని, వారి జీవితాలను నాశ నం చేశారో కూడా జగన్‌కి తెలుసు. ఈ దుర్మార్గాలకు, దుర్మార్గులకు కోర్టులు కూడా వత్తాసు పలికి అవినీతికి వత్తాసు పలికి సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలను ఎలా నట్టేట ముంచడానికి వెరవలేదో ప్లూటార్క్ మహాశయుడు రోమన్ చరిత్రలో భావితరాలకు గుణపాఠంగా లిఖించిన సంగతీ జగన్‌కు గుర్తుండే ఉండాలి. చంద్రబాబు అరాచక పాలన ఫలితంగా రుణ బాధలలో కూరుకు పోయిన ఆంధ్రప్రదేశ్ వేగాతివేగంగా బయట పడేందుకు యువనేత జగన్‌వైపు మోరలెత్తుకుని చూస్తోంది. ఇందుకు, అగమ్య గోచరంగా తెలుగు ప్రజల్ని విభజించి సరైన రాజధానిని, దానికి మౌలిక సదుపా యాలను సమకూర్చగల శక్తిగా పునాది బలంలేని రాజధానిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నెత్తిపైన ఆకస్మికంగా రుద్ది, ‘మీ చావు మీరు చావండ’ని అర్ధంతరంగా వదిలేసిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేదోడు కాగలిగేది –ప్రత్యేక ప్రతిపత్తి ‘హోదా’ మాత్రమేగానీ కేవలం ‘వాదోడు’ కాదు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా లేదా ‘ప్రత్యేక తరహా ప్రతిపత్తి’ ప్రతి పాదన ఎందుకు తలెత్తవలసి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కృత్రిమ పద్ధతుల్లో విభజించినందుకు.. అందుకు కారకులు కాంగ్రెస్, బీజేపీ నాయకులు. చట్టం చేయకుండా బిల్లు రూపంలో (కాంగ్రెస్) నాటకం ఆడి, చట్టం కాకుండా శాసనవేదిక తలుపులు మూసి ‘చీకట్లో చిందులాట’తో కాంగ్రెస్ ‘తూ.నా. బోర్డు’ చెప్పగా, ఇక ‘మేం అధికారం లోకి ఎలాగూ వస్తున్నాం కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి మేమిస్తాం’ అన్న మిష పైన బీజేపీ వ్యవహరించి ‘దుస్తులు దులుపుకుంది’. నాటి రాజ్యసభలో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు కాంగ్రెస్ సభ్యు లతో కలిసి సంతోషంగా చేతులూపుకుంటూ ఆడిన నాటకాన్ని తెలుగు ప్రజలు మరచిపోరు, మరచిపోరాదు. తీరా జరిగిందేమిటి? కాంగ్రెస్ నుంచి తనకు అధికారాన్ని బీజేపీ గుంజుకున్నదేగానీ, విడగొట్టిన ఏపీకి మాత్రం బాబు చాటున దాగి, అతనితో పరస్పరం లాలూచీ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని ‘ప్రత్యేక ప్యాకేజీ’గా మార్చి ప్రత్యేక ప్రతిపత్తికే ఇప్పటికీ ఎగనామం పెడుతూనే వచ్చారు. నిన్నగాక మొన్న (9–6–19) తిరుపతి సభలో కూడా మోదీ ఎంతసేపూ ‘ఏపీలో నూతన ప్రభుత్వం అభివృద్ధిని సా«ధించాలన్న’ నోటిమాటతోనే సరిపెట్టారు, లేదా ‘జగన్ అభివృద్ధి సాధించాలి’ అన్న పదాల చాటున దాగుతూ ‘కేంద్రం అండగా ఉంటుందన్న’ తడిలేని ‘పొడి పొడి’ మాట లేగానీ 2014 నాటి విభజన చట్ట నిబంధనలను సహితం పాటిస్తామన్న మాట మోదీ నోట రాలేదు. ఇంతకూ మోదీ నాన్పుడు ధోరణి వెనుక బీజేపీకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. జగన్ నిరం తర పోరాటం ద్వారా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని మరి ఐదేళ్లపాటు వాయిదా వేస్తూ జగన్ ప్రభు త్వాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రజలలో వ్యతిరేకత పెరగడం కోసం ‘గుంట కాడ నక్కల’ మాదిరిగా ఎదురుచూస్తూ మళ్లీ ఎన్నికల సంతర్పణ నాటికి, రాష్ట్రంలో స్థానభ్రష్టత పొందిన బీజేపీకి ఎలాగోలా ప్రాణం పోయాలన్న తపన ఆ పార్టీ నాయకత్వానికి ఉందనిపిస్తోంది. కేంద్ర 5వ ఆర్థిక సంఘం ‘ప్రత్యేక తరహా ప్రతిపత్తి’ (స్పెషల్ క్యాటగిరీ స్టేటస్)ని ముందు మూడు రాష్ట్రాలకు (అస్సాం, నాగాలాండ్, జమ్ము–కశ్మీర్లు) కల్పించి తరువాత మరో ఎనిమిది రాష్ట్రాలకు విస్తరిం చింది. అలా వాటి సంఖ్య మొత్తం 11 రాష్ట్రాలకు పెరిగింది. అయితే, ఆ తర్వాత ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని మాత్రం ఐదు సూత్రాలపై ఆధారపడి అస్సాం, నాగాలాండ్, జమ్మూ–కశ్మీర్లకు మంజూరు చేశారు. నిజానికి ఇవన్నీ కృత్రిమ విభజన ద్వారా ఏర్పడిన రాష్ట్రాలే, పన్ను రాయితీలకు, రాష్ట్ర ఆదాయం హెచ్చుతగ్గుల నిష్పత్తిపైన ఆధారపడి ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్నవే. అయితే ఇక్కడ ఎంత మాత్రం విస్మరిం^è కూడని అంశం ఏదంటే– ఆంధ్రప్రదేశ్ విభజన, స్థిరమైన రాజధాని లేని విభజన ద్వారా, ఐదేళ్ల తర్వాత కూడా కోలుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రమనీ, అందుకే ప్రత్యేక ప్యాకేజీ కాకుండా, ‘ప్రత్యేక ప్రతిపత్తి’ గల రాష్ట్రంగానే పారిశ్రామిక, విద్యా, ఆరోగ్యరంగాల సత్వర ఆర్థికాభివృద్ధికి అవసర మని గుర్తించాలి. ఏపీ అభివృద్ధి ఎజెండా కేవలం ఎన్నికల ఫలితాలకు అతీతమైందని బీజేపీ నాయకత్వం గ్రహించి తీరాలి. ‘ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిపోయిన అధ్యాయం’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదా నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓటమి తర్వాత కూడా ‘దండోరా’ వేస్తున్నారంటే ప్రధాని మోదీ, లేదా బీజేపీ నాయకత్వపు సంకుచిత ఆలోచనా ధోరణి స్పష్టాతిస్పష్టం. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని గురించిన ప్రతిపాదన సాధించేంత వరకు జగన్ నిరంతరం జాగరూకతతో ఆందో ళన చేయడం అనివార్యమవుతుంది. తక్షణం ‘జాతీయాభివృద్ధి మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్రతిపత్తి వైఎస్ జగన్‌కు కాదు, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. ఇంతకూ చంద్రబాబును ఇంతకాలంగా అంట కాగుతూ వచ్చిన బీజేపీ అగ్రేసర నాయకత్వం బాబు బహిర్గత అక్ర మాలపై, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి, శిక్షాపాత్రుణ్ణి చేయడానికి ఎందుకు వెనుకాడుతుందో, రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలి. ‘పరోపదేశ పాండిత్యం’ ఇక చెల్లదుగాక చెల్లదు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హోదా సాధన దిశగా...
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రతిపక్షంలో ఉండగా హోదా కోసం అన్ని వేదికలపైనా పోరాడిన వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తోంది. ఏపీకి సంజీవని లాంటి హోదా ఆవశక్యతను ప్రస్తావిస్తూ అధికారులను సైతం ఈ దిశగా కార్యోన్ముఖులను చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల ఎదుట సమర్థ వాదన వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాయత్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలపై నివేదిక రూపొందించండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదనను సమర్థవంతంగా వినిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి ప్రత్యేక హోదా ఎంత అత్యవసరమో కేంద్రానికి నివేదించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ రెవెన్యూ లోటులో కొనసాగుతున్న రాష్ట్రానికి మరో ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీ చేసేలా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, ఆర్జన స్థితిగతులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సామాన్యులపై భారం లేకుండా ఆదాయ మార్గాలపై అన్వేషణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, హంగు ఆర్భాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సామాన్యులపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంపై ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కోరారు. హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు లాంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచడంపై కసరత్తు చేయాలని సూచించారు. పన్నేతర ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నిర్దేశించారు. దారి మళ్లిన అప్పులు.. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో పలు కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో విచ్చలవిడిగా అప్పులు తీసుకుని దారి మళ్లించిన వైనాన్ని చూసి ముఖ్యమంత్రి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో అస్తవ్యస్థంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని అధికారులను సీఎం కోరారు. అవినీతిపై ఉపేక్షించేది లేదు.. రెవెన్యూ శాఖలో ఎక్కడా అవినీతికి తావులేకుండా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని, ఈ విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇది ప్రాథమిక సమీక్ష మాత్రమేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం తగిన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరాడంబర నేత.. విలువల కలబోత
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన.. పరిపాలనా పరమైన అంశాలపై నిండైన పరిజ్ఞానం.. మూర్తీభవించిన మంచితనం, నిరాడంబరత.. దేవుడు, ప్రజలపై సంపూర్ణ విశ్వాసం.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదల... విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం.. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డిలో తాము గమనించిన లక్షణాలని పలువురు ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇబ్బందులతో పాటు సాగునీటి రంగంపై జగన్‌కు ఉన్న అవగాహన చూస్తే ఆశ్చర్యం వేసిందని, ఎంతో అనుభవం గల నాయకుడి లక్షణాలు ఆయనలో కనిపించాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత ఐదు రోజులుగా జగన్మోహన్రెడ్డిని పలువురు ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై జగన్‌లోని పట్టుదల, ఆరాటం దీన్నిబట్టి తేటతెల్లమవుతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రగతికి తొలి అడుగు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉంటే ఒకరినొకరు దూషించుకోవడం, రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పరితపించిన నాయకులను తమ ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఐఏఎస్‌లు పేర్కొంటున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధానమంత్రిని కలిసి, రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సంప్రదింపులు జరపడం ప్రశంసనీయమని, రాష్ట్ర ప్రగతి దిశగా తొలి అడుగు పడినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రధానమంత్రికి జగన్మోహన్రెడ్డి 55 నిమిషాల పాటు వివరించారని, లోతైన అవగాహన ఉంటే తప్ప అది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై ప్రధానమంత్రి స్పందించిన తీరు సైతం బాగుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రధానికి వినతిపత్రం సమర్పించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ను కూడా భాగస్వామిని చేయడం జగన్మోహన్రెడ్డిలోని ప్రత్యేకతను చాటిం దని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీకి పునర్వైభవం తథ్యం ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్మోహన్రెడ్డిని ఏపీ భవన్లో రిటైర్డ్ ఐఏఎస్‌లతో పాటు కేంద్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికార దర్పం చూపించకుండా జగన్ తమను ఆప్యాయంగా పలుకరించారని, ఆయన ఇంత నిరాడంబరంగా ఉంటా రా? అని పలువురు అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ఢిల్లీలో కేంద్ర సర్వీసులో ఉన్న తమను ఏపీకి వచ్చేయాల్సిందిగా జగన్మోహన్రెడ్డి ఆహ్వా నించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర సర్వీలో ఉన్నంత కాలం రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న పట్టుదల పెరిగిందని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. జగన్ వ్యవహారశైలి మన రాష్ట్రానికి మేలు చేస్తుందని, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందడానికి వీలుంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం ఏపీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్మోహన్రెడ్డి ఎలాంటి సందేహాలకు తావులేకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారని ఐఏఎస్‌లు కొనియాడుతున్నారు. ఆయన వ్యవహార సరళి చూస్తే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని, ఫలితంగా రాష్ట్రానికి పునర్వైభవం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవి విప్లవాత్మక చర్యలు జగన్ నిష్కల్మషంగా, ఆత్మీయంగా తమతో మాట్లాడారని పలు జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఏయే జిల్లాల్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారంటూ సర్వీసు వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా పాదయాత్రతో పాటు వివిధ సందర్భాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలంటూ జగన్ సూచించారని గుర్తుచేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఆయనలో ఉందని చెబుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డికి కూడా సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి పరిజ్ఞానం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సాగునీటి రంగంలో అవినీతి చోటుచేసుకున్న టెండర్ల రద్దు, టెండర్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని జగన్ చెప్పారని, నిజంగా ఇవన్నీ విప్లవాత్మకమైన చర్యలను అధికారులు ప్రశంసిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న తపన ఆయనలో కనిపించిందని, అంతేకాకుండా రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాలను ప్రజల వద్దకు చేర్చాలన్న తపన జగన్‌లో ఉందని, భిన్నమైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చూస్తారని మరో సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే జగన్మోహన్రెడ్డి పరిపాలనకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించారని, ఏ అధికారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై ఆయనలో స్పష్టత ఉందని తెలిపారు. పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం, పారదర్శకతకు పెద్దపీట వేయడం, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం తన ధ్యేయమన్న సంకేతాలను జగన్ ఇప్పటికే ఇచ్చారని ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. -
జగన్‌కు నెటిజన్ల జేజేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం మాట్లాడుతున్నారు...? ఏం చేస్తున్నారు...? ఏ సమస్యపై ఎలా స్పందిస్తున్నారు..? ఇలాంటి ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రజలే కాదు నెటిజన్లూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోదిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తర్వాత జగన్ కొన్ని జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని చూసిన నెటిజన్లు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటల్లో ఎంతో పరిణతి కనిపిస్తోందని, జగన్ మంచి పోరాటయోధుడని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నేతనా కాంగ్రెస్ వదులుకున్నది అని ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో అనేక ముఖ్యమైన అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండడం అరుదైన విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లే కాదు కామెంట్లూ కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి ఇంత స్థాయిలోచర్చ జరగడం, సామాజిక మాధ్యమాలలో సానుకూల స్పందనలు కనిపించడం అరుదని విశ్లేషకులంటున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని.. వైఎస్ జగన్ ‘టైమ్స్ నౌ’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతో ఆకట్టుకుంది. ఆయన మాటల్లో పదును, పరిణతి, చిత్తశుద్ధి కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు సమ ఉజ్జీ ఇప్పుడు దొరికాడు. ఇలాంటి రాజకీయ నాయకులు అరుదు. జగన్‌ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది. – సందీప్ ఘోష్, రచయిత గతంలో ఎప్పుడూ ఇంత అద్భుతమైన యువ నాయకుడిని చూడలేదు. చాలా ప్రశాంతంగా, నిజాయతీగా కనిపించడమే కాదు శక్తిమంతంగా మాట్లాడుతున్నారు. – మధుకర్ ఉపాధ్యాయ, రచయిత కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలిచి ఎన్నోసార్లు అధికార అందలాన్ని ఎక్కించిన ఆంధ్రప్రదేశ్‌ను ఆ పార్టీ విభజించి ఉండకూడదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి శక్తిమంతమైన నాయకుడిని వదలుకోకుండా ఉండాల్సింది. వీటి వల్ల కాంగ్రెస్‌కి జరిగిన నష్టం అపారం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. – సాధ్వి కోశల, సామాజిక కార్యకర్త ఆంధప్రదేశ్ విభజన, జగన్ మోహన్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ ఎవరి సలహాలు తీసుకుందో విస్మయంగా ఉంది. జగన్‌ను అవమానించి పార్టీ నుంచి గెంటేశారు. వైఎస్సార్ కుమారుడు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. జగన్ ఒక రాజు. స్ఫూర్తి ప్రదాత. – మాలిని అవస్తి, గాయని జగన్ ముక్కుసూటి మనిషి. ఆయన బహిరంగంగానే చెబుతున్నారు ఏది చెయ్యగలనో, ఏది తన చేతుల్లో లేదో. చంద్రబాబులా ఊసరవెల్లిలా రంగులు మార్చడం, అమలు కాని హామీలు ఇవ్వడం చేయడం లేదు. తను అనుకుంటున్నదేమిటో స్పష్టంగా చెబుతున్నారు. జగన్ ఒక లీడర్. – పింకీ, ఫ్యాషన్ డిజైనర్ ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. జగన్ గారు చేసింది పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన యోధుడు. హేట్సాఫ్ టూ యూ జగన్ మోహన్ రెడ్డి. – పూరీ జగన్నాథ్, దర్శకుడు వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను చూడండి. మార్పు కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో అర్థమవుతుంది – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కలుసుకొని వైఎస్ జగన్ ఎంతో అనుకూల వాతావరణం సృష్టించారు. కానీ మూడు సార్లు సీఎం పీఠం ఎక్కిన మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడూ ఘర్షణ వాతావరణం, శత్రుత్వాన్నే అందరిపై పెంచుకున్నారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. ఎంత ఎదిగినా మీరు ఒదిగిపోయే కనిపిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కష్టపడతారని ఆశిస్తున్నాము. – బ్రిడ్జింగ్ ది గ్యాప్, సామాజిక అధ్యయన సంస్థ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఆయనలో దమ్ము, మానసిక పరిణతి కనిపించాయి. కృతనిశ్చయంతో, అహం లేకుండా మాట్లాడిన మాటలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. చంద్రబాబులో ఉండే అహం జగన్‌లో మచ్చుకైనా కనిపించలేదు. ప్రధాని మోదీ కూడా ఆయనను మనఃçపూర్వకంగా అక్కున చేర్చుకోవడం ఆనందం కలిగించింది. – తరుణ్ భట్నాగర్, డాక్టర్ జగన్‌ని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదం – స్వాతి చతుర్వేది, జర్నలిస్టు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జగన్ సర్ని చూశాను. విమానం ఎక్కడానికి నేను బస్సులో వెళుతుంటే, ఆయన తన కారులో వెళుతున్నారు. జగన్ సర్ని చూసి నేను చిరునవ్వు నవ్వితే.. ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్లారు. ఇంతటి మర్యాదపూర్వకమైన సీఎంని ఎప్పుడూ చూడలేదు. వైఎస్ జగన్ సర్కి ప్రణామాలు – అమిత్ డోక్వాల్, నెటిజన్ వైఎస్సార్ మృతి తర్వాత జరిగిన ఒక సంఘటన నాకు ఇంకా కళ్ల ముందే ఉంది. మా నాన్న నన్ను జగన్ దగ్గరకి తీసుకువెళ్లి ఆయనను సీఎం అని పిలవమని అన్నారు. అప్పుడు నేను జగన్‌తో మిమ్మల్ని సీఎం అని పిలవాలా అంకుల్ అని అడిగాను. దానికి జగన్ పిలుద్దువులేమ్మా దానికి ఇంకా టైమ్ ఉంది అని బదులిచ్చారు. – ఎల్.ప్రేమ్‌చంద్ రెడ్డి, నిర్మాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమని ప్రజలు నిరూపించారు. జగనన్నకి అభినందనలు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఇన్నాళ్లకు ప్రభుత్వం ఏర్పడింది. – మంచు విష్ణు, నటుడు జగన్ మోహన్ రెడ్డికి సోనియా చేసిన అవమానం, ఏపీకి శాపంగా మారిన కాంగ్రెస్ పార్టీ, జగన్ పోరాట పటిమతో మళ్లీ ఎదిగిన తీరు. కలా నిజమా? ఇదంతా ఒక సినిమాను తలపించేలా ఉంది. – ప్రియా రమణి, నెటిజన్ -
కేంద్రంలో హంగ్ రావాలని దేవుణ్ణి ప్రార్థించా
‘ఏ జాతీయ పార్టీకి అయినాసరే దేశం మొత్తమ్మీద 250 లోక్‌సభ స్థానాలకంటే ఎక్కువ రాకూడదని భగవంతుని ప్రార్థించా. అలా అయితేనే ప్రాంతీయ పార్టీల అవసరం జాతీయ పార్టీలకు తెలిసి వచ్చి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశించాను’ అని సీఎన్ఎన్ న్యూస్ 18’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇలా.. సీఎన్ఎన్: హోదా ఇవ్వడం కుదరదని, రాజ్యాంగం అనుమతించదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మరి ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? వైఎస్ జగన్ : ప్రభుత్వం ఆ మాట చెప్పడం గతం. అవసరం అన్నీ నేర్పుతుందని అంటారు. ఈ ఎన్నికల్లో అదే జరుగుతుందని మేము ఆశించాము. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత సంఖ్యలో సీట్లు రాకపోతే ఎవరైనా సరే మాకు ప్రత్యేక హోదా ఇస్తారని మేము అనుకున్నాం. ఇలాగే జరగాలని నేను దేవుడిని ప్రార్థించాను కూడా. దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. కేంద్రం కూడా తగు విధంగా ప్రతిస్పందించలేదు. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకున్నాం. నరేంద్ర మోదీని కలసి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశాము. రాష్ట్రం పరిస్థితి ఏమిటి, ప్రత్యేక హోదా అవసరం అన్నది వివరించాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంకెలన్నీ వివరించి మీ సాయం కావాలని కోరాను. సీఎన్ఎన్: మరి ఆయన స్పందన ఏమిటి? వైఎస్ జగన్ : ఆయన అన్ని అంశాలను ఓపికగా విన్నారు. సానుకూలంగా స్పందించారు కూడా. నేను ఇంకో అడుగు ముందుకేసి.. ఈ రోజు మీకు మా అవసరం లేకపోవచ్చు. కానీ.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మీరు మీ ఔదార్యాన్ని చాటుకోవచ్చునని చెప్పాను. అధికారంలో ఉన్న మీరు ఈ సాయం చేయగలిగితే ఈ దేశ ప్రజలకు, ఏపీ ప్రజలకూ ఓ చక్కటి సందేశం అందుతుందని తెలిపాను. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ ఆ డిమాండ్‌ను కొనసాగిస్తాం. ప్రధానిని నేను కలవడం ఇదే మొదటిసారి. ఇకపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సాయం కోరుతూ బహుశా ప్రతి నెల కలుస్తానేమో. ఇలా కలిసిన ప్రతిసారి ఆయన్ను ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటా. ఏదో ఒకరోజు ఆయన ఒప్పుకునేంత వరకూ అడుగుతూనే ఉంటా. -
హోదాతోనే ప్రగతి..
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఎలాంటి ప్రయోజనం కలగదు. హోదా ఇస్తేనే ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు అందించగలం. దాంతోనే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్టీఎన్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ బర్ఖాదత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై స్పందించారు. బర్ఖాదత్: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకుంటారా? వైఎస్ జగన్: ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో వంద శాతం ఆదాయ పన్ను, జీఎస్టీ మినహాయింపులున్నాయి. అలాంటి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు లభించకపోతే.. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోటల్ ఎందుకు కడతారు? పరిశ్రమ ఎందుకు పెడతారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్ –1 నగరాలతో పోటీపడాలంటే.. టైర్ –2 నగరాలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యం కాదు కాబట్టి మాకు ప్రత్యేక హోదా అవసరం. బర్ఖాదత్: ఫలితాలు వెలువడేంత వరకూ కూడా చంద్రబాబు ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలతో సమావేశాలు జరిపారు. రాష్ట్రంలోనే కాదు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించగల స్థాయిలో విజయం సాధిస్తామని ఆయన భావించారు. అయనకు అంత విశ్వాసం ఎలా ఏర్పడిందంటారు? వైఎస్ జగన్: ఆ సమావేశాలన్నీ గెలుస్తామన్న విశ్వాసంతో చేసినవని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అదో డ్రామా. తాను ఓడిపోతున్నానని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉందన్న విషయాన్ని ఆయన ముందుగానే గుర్తించారు. అందుకే రాజకీయంగా జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించుకునే ఉద్ధేశంతో తనను తాను ఓ సంధానకర్తగా, అన్ని పార్టీల వారికి ఇష్టుడిగా చూపించుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే కలిసి ఉన్న వారిని చంద్రబాబు కొత్తగా కలిపేదేముంటుంది? శరద్ పవార్, రాహుల్‌గాంధీ మాట్లాడుకోకుండా ఉన్నారా? కుమారస్వామికి, రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు లేవా? యూపీఏ కూటమిలో భాగంగా ఉన్న వారిని మళ్లీ కలుపుతానని బాబు వెళ్లడం ఏమిటి? బర్ఖాదత్: ఏపీలో కాంగ్రెస్ ఓట్లు రెండు శాతం కంటే తక్కువకు పడిపోయాయి. మీ తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు. మీకు చేసిన అన్యాయానికి శిక్షపడిందని అనుకుంటున్నారా? వైఎస్ జగన్: ఈ విషయాలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఆ విషయాలను అలా వదిలేద్దాం. ఇప్పుడు వాటి గురించి మరిన్ని వ్యాఖ్యలు చేయడంలో అర్థం కూడా లేదు. ఓటర్లు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. వ్యక్తిగా నేను చేసిందేమీ లేదు. నన్ను విమర్శించిన వారికి ఓటర్లు సమాధానం చెప్పారు. బర్ఖాదత్: విజయం సాధించిన తరువాత ఉదాత్తంగా ఉండాలని అనుకుంటున్నారా? వైఎస్ జగన్: వాస్తవం ఏమిటంటే.. నాకు కక్షలు, కార్పణ్యాలపై నమ్మకం లేదు. మనుషులుగా మనకు ఏ అంశంపై కూడా అధికారం లేదన్నది నా నమ్మకం. అవన్నీ దేవుడి నుంచి వచ్చేవి. ఏ చర్య తీసుకోవాలన్నా అది దేవుడి వల్లే సాధ్యం. బర్ఖాదత్: ఓట్లకు కోట్లు కేసు ఏమవుతుంది? వైఎస్ జగన్: చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకేమీ కక్ష, పగ లేదు. అయితే కొన్ని స్కాములు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ వాటిని ఎలా విస్మరించగలం. వాటన్నింటినీ వెలికితీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా నామీద ఉంది. ఇందుకోసం ఓ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాజధాని భూ సేకరణ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ డబ్బు అంతా ప్రజలది. ఈ అక్రమాలను వెలికితీయాలి. ఆయా పనులకు వాస్తవంగా ఖర్చయ్యేది. ఎంత అన్నది ప్రజలకు చెప్పాలి. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడతాం. ఆరు నెలల్లో ఈ దేశానికి, ప్రపంచానికి ఈ ప్రభుత్వం అవినీతి రహితమన్నది చూపుతాం. బర్ఖాదత్: తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర పన్ని మీమీద పెట్టాయని చెబుతున్న కేసుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్: ప్రజాక్షేత్రంలో 50 శాతం ఓట్లతో ఇచ్చిన విజయం.. నాపై కుట్రలు ఇకనైనా ఆపండి అనేందుకు నిదర్శనం. కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పెట్టిన కేసుల్లో డొల్లతనం ఏమిటో ఈ తీర్పుతోనే అర్థమవుతుంది. ఏపీలో నేను ఎలాంటివాడినో, నా తల్లిదండ్రులు ఎలాంటివారో అందరికీ తెలుసు. నా తండ్రి మరణించేంత వరకూ నాపై కేసుల్లేవని, కాంగ్రెస్‌ను వదిలిన తరువాతే ఈ కేసులు వచ్చిపడ్డాయనీ అందరికీ తెలుసు. -
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడమే ధ్యేయం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించడమే నా లక్ష్యం. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ సహకారం, ఆశీస్సులు అవసరం. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రిని కోరాను. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలతో అవినీతిరహిత పాలన అందిస్తాం. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం’ అని ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘టైమ్స్ నౌ చానల్’ మేనేజింగ్ ఎడిటర్ నావికా కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ సంగ్రహంగా... - నావికా కుమార్: ముఖ్యమంత్రి స్థానానికి మీ ప్రస్థానం మీరు ఆశించిన విధంగానే ఉందా? వైఎస్ జగన్: భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులతో మాకు ఘన విజయం దక్కింది. 14 నెలలపాటు 3,600 కిలోమీటర్లకు పైగా నేను చేసిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించింది. ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రెండు మూడురోజులకు నేను నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు భారీగా పోటెత్తారు. ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుందని అప్పుడే స్పష్టమైంది. - నావికా: 303 సీట్లతో దేశం మొత్తం నరేంద్ర మోదీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీలో మోదీ మ్యాజిక్ పనిచేయలేదు కదా.. జగన్: ఏపీ ప్రజలు తమను మోసం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని విభజించాయి. హోదా ఇస్తామనే హామీతోనే 2014లో బీజేపీ పోటీ చేసింది కూడా. కానీ హోదా ఇవ్వకుండా మోసం చేయడంతో ప్రజలు ఆగ్రహించారు. - నావికా:మోదీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల మీరు నిస్పృహ చెందారా? జగన్: నాకు 22 సీట్లు ఇచ్చారు. ఈ తీర్పుతో మేము ప్రత్యేక హోదా తెస్తామని భావించాను. జాతీయస్థాయిలో సమీకరణలు అనుకూలించలేదు. ఆయన ప్రధాని, నేను ముఖ్యమంత్రిగా సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు మాకు కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను. - నావికా: ప్రధాని సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా! జగన్: అవును. ఆయన మాటలు సంతోషం కలిగించాయి. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అని ఇది వరకు అన్నారు. ఇప్పుడు ‘సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్’ అని అన్నారు. మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాం. - నావికా: 30న మీ ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారా? జగన్: ఆహ్వానించాను. నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి మీరు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే మా రాష్ట్రం పట్ల గొప్ప ఔదార్యం కనబర్చినట్లు అవుతుందని చెప్పాను. మీరు వస్తామంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం.. నా ప్రమాణ స్వీకారం కంటే కూడా రాష్ట్రానికి మీరు చేసే ప్రకటనే ప్రధాన అంశమవుతుందని చెప్పాను. కానీ అదే రోజు ఆయన తన ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్ణయించారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని కోరుతూనే ఉంటాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను. - నావికా: 2014–19 మధ్య ప్రధాని పాలనను చూసి మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారని భావిస్తున్నారు? జగన్: ఇంత భారీ మెజార్టీ వచ్చిన తరువాత మైనార్టీలు నరేంద్ర మోదీకి ఓటు వేయలేదని ఎవరూ చెప్పలేరు. అలా విభజించడం సరికాదు. అందరి నమ్మకాన్ని గెల్చుకుంటేనే ఇంత భారీ మెజార్టీ వస్తుంది. - నావికా: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చేయాలంటారా? జగన్: అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించారంటే వాళ్లు ఆత్మ విమర్శ చేసుకుని సమీక్షించుకోవాలి. నాయకత్వ మార్పా, విధానాల మార్పా అన్నది వారి నిర్ణయం. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితాలు కూడా వారే భరించాలి. - నావికా: గాంధీ కుటుంబ నాయకత్వంలేని కాంగ్రెస్ పార్టీ సాధ్యమా? జగన్: అది కుటుంబం పార్టీ. ఆ పార్టీలో మరొకరికి నాయకత్వం వచ్చే అవకాశం రాదు. అది అంతే. - నావికా: కుటుంబ వారసత్వ ఓటు బ్యాంకులకు ఈ ఎన్నికల్లో దెబ్బ తగిలింది. అమేథీలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. జ్యోతిరాదిత్య సింథియా, బుపిందర్ హుడా, సుస్మితా దేవ్, మిలింద్ దియోరా ఇలా ఎంతోమంది ఓటమి చెందారు. కానీ వైఎస్సార్ కొడుకుగా మీరు ఘన విజయం సాధించారు. కుటుంబ వారసత్వాల పట్ల వచ్చిన వ్యతిరేకత ప్రభావం మీపై చూపించలేదు... జగన్: అదంతా ప్రజల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి బాగా పని చేస్తే కొడుకు, కూతురు, కుటుంబ సభ్యులకు ఓటేసి ప్రజలు కృతజ్ఞత చూపిస్తారు. ప్రజల ఆదరణను నిలుపుకోవడం, కొనసాగించడం అన్నది పూర్తిగా వారసుల మీద ఆధారపడి ఉంటుంది. కొందరు నిరూపించుకుంటారు. కొందరు నిరూపించుకోలేరు. - నావికా: 2018 మే 23న కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మహాకూటమి నేతలు చేతులు కలిపారు. కుమారస్వామి, చంద్రబాబు, మాయావతి, అఖిలేశ్, మమతాబెనర్జీ.. ఇలా అందరూ వేదికపై కనిపించారు. కానీ వారు మోదీని ఎందుకు ఓడించలేకపోయారు? జగన్: ఆ నేతలెవ్వరికీ అఖిల భారత స్థాయి లేదు. మోదీకి వ్యతిరేకంగా ఓట్లు కూడగట్ట గలిగే సామర్థ్యం లేదు. మోదీకి ప్రత్యమ్నాయంగా వాళ్లు నిలబడలేదు. సమర్థ ప్రత్యామ్నాయ నేతగా ఎవరినీ చూపించలేకపోయారు. మోదీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీల సమూహాన్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించారు. దాన్ని ప్రజలు విశ్వసించలేదు. - నావికా: కౌంటింగ్ ముందు రోజు కూడా చంద్రబాబు ఢిల్లీలో అందరి తలుపులు తట్టి ఈవీఎంల మీద సందేహాలు లేవనెత్తారు. మీరు ఈవీఎంల మీద ఏమనుకుంటున్నారు? జగన్: చంద్రబాబు తన పరువు కోల్పోయారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలి అని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. అసలు ఈ వ్యవహారానికి చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. ఆయన తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. ప్రజలు నన్ను వేరే కారణంతో గెలిపించారని నమ్మించాలనుకున్నారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. ఆయన దేశాన్ని తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రుజువైంది. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు రాష్ట్రానికి కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను. – వైఎస్ జగన్ చంద్రబాబు తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. అందుకే చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్డు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. – వైఎస్ జగన్ -
జగన్ @ ఢిల్లీ
-
ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూనే ఉంటా
-
మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు. బాబు పాలనలో రూ.2లక్షల 57 వేలకోట్ల అప్పులు రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. హోదా గురించి అడుగుతూ ఉంటా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు చాలావరకూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే...హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. అందుకే ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మద్యపాన నిషేధంపై స్పష్టంగా చెప్పామని అన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంధం ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు. వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామన్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఫలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. ప్రకటనకు ముందు రాజధాని వేరేచోట వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్ కంపెనీ సైతం 14 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. ల్యాండ్ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు. ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డాడరు. ఇదంతా మామూలు స్కామ్ కాదు. సంచలనాత్మకమైన కుంభకోణం. వ్యక్తిగతంగా చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నెల 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ తెలిపారు. డే వన్ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ చేసి గతంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అలాగే చేస్తాం. సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. అప్పట్లో ఏ మంత్రికిగాని, అధికారులకు ఫోన్ చేయలేదు. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. అమ్మానాన్నలను చూసేందుకు మాత్రమే హైదరాబాద్ వచ్చేవాడిని. నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. నాన్న చనిపోయాక కాంగ్రెస్‌ను వ్యతిరేకించాకే నాపై టీడీపీ ప్రోద్భలంతో కేసులు పెట్టారని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూ ఉంటా -
ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వీలైనంత ఎక్కువ సాయం ఉదారంగా అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన (డిజిగ్నేటెడ్ సీఎం) వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీలో ప్రధానికి వినతిపత్రం అందజేస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించడంతో పాటు కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆదివారం ఢిల్లీకి వెళుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పటిష్టమైన కార్యాచరణతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ను కోరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జగన్‌కు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ‘విభజన’ హామీలు అమలు చేయాలి రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి జగన్మోహన్రెడ్డి తెలియజేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విభజన సమస్యలు, హామీలపై జగన్ ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంలో ఇంకా రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా, దాని ఆవశ్యకత గురించి మోదీకి వివరిస్తారు. గత ఐదేళ్లుగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేస్తారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, దుగ్గరాజపట్నం పోర్టు, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తదితర విభజన హామీలను అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రం అన్ని విధాలా కష్టాల్లో కూరుకుపోయిందని, అభివృద్ది చెందాలంటే విభజన చట్టంలోని హామీలను నేరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు, చేయూత అవసరమని విన్నవిస్తారు. గతంలో పరిపాలన లోపభూయిష్టంగా జరిగిందని, దానిని గాడిలో పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందని ప్రధానికి వివరించనున్నారు. రూ.30 వేల కోట్లు వెంటనే అవసరం ప్రజలు ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించడం లేదని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మీ తోడ్పాటును, ఆర్థిక సాయాన్ని అర్థిస్తోందని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్రం ఆర్థికంగాను, ఇతరత్రా పూర్తి సహకారం అందించాలని కోరనున్నారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను మనసులో పెట్టుకోకుండా ఏపీకి సంపూర్ణ సహకారం అందించాలని విన్నవించనున్నారు. ఇప్పటికే రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో రూ.30 వేల కోట్లు వెంటనే అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఉదారంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రధానమంత్రికి విజ్ఞాపన అందజేస్తారు. -
‘హోదా’కు తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి : అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. జగన్ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వేచి చూడకుండా ఈమేరకు ముందే కసరత్తు ప్రారంభించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడం, రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ఆయన కార్యాచరణకు సంసిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసిన పలువురు సీనియర్ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాల గురించి ప్రాథమికంగా వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. రెవెన్యూలోటు భారీగా ఉందని వివరించారు. రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ కావడంతో రూ.15 వేలకోట్ల బిల్లులు పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. శుక్రవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిసిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ నెలలో ఇక అప్పులు చేయడానికి వీల్లేకుండా దిగిపోయే ముందు టీడీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదని జగన్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జూన్ 1వతేదీన జీతాలివ్వాలంటే తక్షణం రూ.4,500 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు వైఎస్ జగన్‌కు తెలిపారు. కేంద్రం తక్షణం ఆర్థిక సాయాన్ని ప్రకటించకుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడంతోపాటు ప్రత్యేక హోదా సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా రెండోసారి గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోదీకి అభినందనలు తెలిపేందుకు ఆదివారం ఢిల్లీ వెళుతున్న వైఎస్ జగన్ తన పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అస్తవ్యస్తంగా అర్థిక పరిస్థితి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర నిధులు రాబట్టడం, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం అనే ద్విముఖ వ్యూహంతో కార్యాచరణకు సిద్ధమయ్యారు. శుక్రవారం వైఎస్ జగన్‌ను కలసిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర పరిస్థితిని సంక్షిప్తంగా నివేదించారు. రాష్టఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం తక్షణం ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు నివేదించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఇంతగా కుదేలవడానికి దారితీసిన పరిస్థితులపై వైఎస్ జగన్ అధికారులను ఆరా తీశారు. చంద్రబాబు సర్కారు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు గుర్తించారు. ప్రాధాన్య క్రమంలో సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఐదేళ్లుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, దుర్వినియోగం చేసిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కూడా అదే విధంగా వ్యవహరించడం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు రోజే ఏకంగా రూ.2,325 కోట్ల బిల్లులు అస్మదీయులకు అడ్డగోలుగా చెల్లించేశారు. ఈ నెలలో ఇక అప్పు చేయడానికి కూడా వీలులేకుండా టీడీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా రాష్ట్రానికి ఎక్కడా కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి తక్షణం కేంద్ర ఆర్థిక సహాయం పొందడం మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం జగన్ గుర్తించారు. అందువల్లే రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హోదా సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ దిశగా యోచించారు. మోదీతో భేటీని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీని వైఎస్ జగన్ ఆదివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియచేయనున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతూ ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలన్నది ఆయన ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ నిర్ణయించారు. నరేంద్రమోదీతో మర్యాదపూర్వక సమావేశంలో రాష్ట్ర పరిస్థితిని ఆయనకు వివరిస్తారని తెలుస్తోంది. గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రధానికి వివరిస్తారు. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా వైఎస్ జగన్ కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా వివరిస్తారని తెలుస్తోంది. హోదా సాధనకే ప్రథమ ప్రాధాన్యం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని ఆయన మొదటి నుంచి ఆధారసహితంగా చెబుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా సాధన కోసం ఐదేళ్లు అలుపెరగని పోరాటం చేశారు. హోదా సాధనే తన విధానమని ఎన్నికల్లో ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కేంద్ర బిందువుగానే ఢిల్లీతో తమ విధానాలు ఉంటాయని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా సాధనకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ జగన్ నిశ్చయించుకున్నారని సమాచారం. నేడు గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ శనివారం తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ వెళతారు. సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలసి శాసనసభాపక్ష తీర్మానాన్ని అందచేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్‌తో కూడా వైఎస్ జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పంపే నివేదికల్లో ఈ అంశాల ప్రాధాన్యతను వివరించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. గవర్నర్‌తో సమావేశం అనంతరం వైఎస్ జగన్ తెలంగాణా సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశక్యత గురించి చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, ఇతర ప్రయోజనాలను సాధించడంలో తెలంగాణా ప్రభుత్వ సహకారాన్ని కోరతారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల సాధన దిశగా వైఎస్ జగన్ కార్యాచరణకు ఉపక్రమించడంపట్ల అధికారవర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. -
మా ముందున్న లక్ష్యం అదే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురువారం ‘టైమ్స్ నౌ’ తో మాట్లాడారు. ప్రజలు, దేవుడు వైఎస్సార కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్న వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడేది లేదని అన్నారు. -
అక్కసుతో స్వతంత్ర సంస్థలపై బాబు దాడి
రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అభద్రతాభావానికి గురై ప్రభుత్వ సంస్థలు, అధికారులపై దాడి మొదలుపెట్టారు. తనకు వత్తాసు పలికే అధికారుల బదిలీలు, ఈవీఎంలు పనిచేయకపోవడంపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. దీనికి మహాకూటమి మద్దతు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక, వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఆయనపై బురద జల్లుతోన్న ఈ మహాకూటమి నేతలంతా ఇప్పుడు ఎన్నికలను వేది కగా చేసుకుని చిందులు తొక్కుతున్నారు. మే 23 తర్వాత అబద్ధాల చక్రవర్తులకు కాలం చెల్లుతుంది. పాలనావైఫల్యం, అవినీతితో ప్రజల మద్దతు కోల్పోయిన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయలేదని అసత్య ప్రచారం చేశారు. కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించి తెలుగు తమ్ముళ్లు పంచుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని విపక్షాల ఒత్తిడిని ఎదుర్కోలేక తిరిగి హోదా కావాలంటూ యూటర్న్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని భాజపా సమ ర్థవంతంగా తిప్పికొట్టింది. చంద్రబాబు అవినీతి, అరాచకాలను ప్రజలకు వివరించింది. బాబు నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు తెదేపాను ఎప్పుడు గద్దె దింపుదామా అని ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన బాబు పసుపుకుంకుమ వంటి పథకాలతో ఓటర్లను ప్రలోభానికి గురిచేశారు. పోలింగ్ సరళి తెలిసిపోవడంతో తను ఓడిపోతాననే భయంతో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. కోడెల శివప్రసాదరావు చేసిన హంగామా ఈ నాటకంలో భాగమే. తనకు 150 సీట్లు గ్యారంటీ అని బీరాలు పలుకుతున్న బాబు మరో వైపు ఈవీఎంలు పనిచేయలేదని, టాంపరింగ్‌కు గురిచేశారని కొత్త నాటకం ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం తనకు అనువుగా ఉండే అధికారులను నియమించుకున్నారు. ఎన్నికల్లో ఆయనకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ వెంకటేశ్వరరావుతోపాటు కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీచేయడంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పోశాయి. ఈవీఎం ఓటింగ్ మెషీన్లు పనిచేయలేదని మొదలుపెట్టి, ఏ ఓటు వేసినా భాజపాకే పడుతోందని, వీవీప్యాట్లలో ఓటర్ల ఓటు నమోదైందీ లేనిదీ నిర్థారించుకోవడానికి ఆ వీవీప్యాట్స్‌లో నమోదైన వోటర్లకు చెందిన 50 శాతం చీటీలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మహాకూటమి కూడా గొంతుకలిపింది. ఇవే ఈవీ ఎంలు, వీవీప్యాట్లు వాడుకుని 2014లో చంద్రబాబు అధికారంలోకి రాలేదా? రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర చోట్ల గెలిచిన కాంగ్రెస్ అప్పుడెందుకు బ్యాలెట్లను డిమాండ్ చేయలేదు. పోనీ అధికారంలో ఉన్న ఈ అయిదేళ్లలో తెదేపా ఎంపీలు ఏనాడైనా ఈవీఎంలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో మాట్లాడారా? పెద్దఎత్తున సొమ్మును ఎన్నికల్లో పంచడానికి ప్రధాని మోదీ హెలికాప్టర్లో తరలిస్తున్నట్లు కర్ణాటక, తమిళనాడుల్లో బాబు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. పైగా ఎన్నికల సమయంలోను, అది కూడా తెదేపా, విపక్షాల అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల సంఘం, ఆదాయపుపన్ను శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ, సీబీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలకు తెదేపా, కాంగ్రెస్ అయినా భాజపా అయినా ఒక్కటే. తెదేపా, విపక్షాల అభ్యర్థులు ఇళ్లలో అవినీతి సొమ్ము ఉంటే పట్టుబడతారు. లేకుంటే క్లీన్ చీట్ వస్తుంది కదా? ఓటమి భయంతో బాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అంతేకాదు తన ప్రలోభాలకు లొంగని అధికారులపై ఆరోపణలు చేస్తూ, వారిలో ఆత్మసై్థర్యాన్ని దిగజారుస్తున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను కాలరాచిన బాబు ప్రజాదరణ కోల్పోయారు. తాను ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణమని ముందుగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఐటీ, ఈడీ, సీబీఐ ఇలా అన్ని సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వాటి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వతంత్ర సంస్థలపై చంద్రబాబు పనిగట్టుకుని చేస్తున్న వరుస ఆరోపణలకు ఓటమి తప్పదనే అక్కసు తప్ప మరొకటి కారణం కాదనిపిస్తోంది. వ్యాసకర్త రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ తురగా నాగభూషణం -
ఓటరన్నా.. రాక్షస పాలనపై గురిపెట్టు ఆయుధం
సాక్షి, అమరావతి : ఏపీ ఓటరు విజ్ఞతతో ఓటెయ్యాల్సిన సమయమిది. మీట నొక్కేముందు భావితరాల భవిష్యత్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరమిది. విభజన గాయం సలపరింతలోనూ.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన గుండెకోత ఇంకా గుర్తుంది. ఐదేళ్ల అరాచక పాలన మళ్లీ మాయమాటల ముసుగేసుకుని మన ముందుకొస్తోంది. మేకవన్నె పులి అవతారమెత్తి.. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ 40 ఏళ్ల అనుభవం నక్క వినయాలు ప్రదర్శిస్తోంది. నమ్ముదామా ఈ మాటలు? వెన్నుపోటు రాజకీయాలను ఔపోసన పట్టిన చంద్రబాబుతో రాష్ట్రభవిష్యత్ సాధ్యమేనా? ఏ రోజుకారోజే మాట మార్చే అవకాశవాద రాజకీయ దురంధరుడు చంద్రబాబు వలలో పడితే రాష్ట్రమేమవుతుంది? ఓటేసే ప్రతి వ్యక్తి మనస్సాక్షి వేసే ప్రశ్నది. ఐదేళ్ల అరాచక అనుభవాలను నెమరు వేసుకుంటున్న తరుణమిది. రెప్పపాటు ఆలోచనలో సవాలక్ష ప్రశ్నలు.. సమాధానం లేని ప్రశ్నలు. హామీలు.. మోసాలు.. పదవి కోసం దిగజారే చంద్రబాబు ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలు 600 పైమాటే. ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదనేది జనమెరిగిన సత్యం. కులానికో పేజీ.. మతానికో మాట.. ఇదే ఎన్నికల మేనిఫెస్టోగా చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. అవినీతిలో మునిగితేలే బాబు హామీల మాటే మరిచిపోయారు. జనంలోకెళితే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోనే తన వెబ్సైట్ నుంచి మాయం చేసిన ఘనుడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి రూ.కోట్లు తెస్తానన్నాడు. ఓటుకు నోటు కేసు వెంటాడుతుంటే ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో రాష్ట్రం బాగుపడుతుందా? దగా.. నయవంచన బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. పొలిటికల్ ఎంట్రన్స్ కూడా పాసవ్వని కొడుక్కు ఏకంగా మంత్రి పదవే ఇచ్చాడు. ఎన్నో అర్హతలున్న నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని వ్యక్తి చంద్రబాబు. ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఆందోళన కలిగించే అంశం. ప్రైవేటీకరణ మంత్రం జపించే బాబు జమానాలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండమే. ఇలాంటి వ్యక్తి మనకు భరోసా ఇస్తాడా? ఇతని వల్ల మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? పచ్చి అవకాశవాదం రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబు లక్ష్యం. దీనికోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం ఆయనది. బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని డైలాగ్ చెప్పిందాయనే. మోదీ రాష్ట్రానికొస్తే ఖైదు చేస్తానందీ ఆయనే. ఈ మాటలెటుపోయాయో? బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. అదే మోదీని వీరుడు ధీరుడంటూ ఆకాశానికెత్తారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. జనం ఛీ కొడుతున్నారని ప్లేటు ఫిరాయించారు. మోదీ రాక్షసుడంటూ మాట మార్చాడు. రాష్ట్రంపై కక్ష కట్టాడని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగారా? ఆ గర్భ శత్రువైన కాంగ్రెస్‌ను ఏ స్థాయిలో దుయ్యబట్టారో జనానికి తెలుసు. ఆ పార్టీ అధినేత్రి సోనియానూ ఇటలీ రాక్షసి అన్నారు. రాహుల్ పనికిమాలిన వాడన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలన్నారు. అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగారు. ఇంతకు మించిన అవకాశవాదం ఉంటుందా? ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కోరుకుంటాడా? ఉద్యోగుల ఆత్మాభిమానంపై దెబ్బ ఈ ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగి ఏనాడైనా గౌరవంగా ఉన్నారా? ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారి వనజాక్షిని సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే దుర్భాషలాడిన వైనం చూశాం. దేవాలయ భూముల పరిరక్షణ కోరుకున్న భ్రమరాంబను ఇబ్బందులు పెట్టింది ఈ సర్కారే. ఉద్యోగులను 50 ఏళ్లకే పదవీ విరమణ ఇచ్చి ఇంటికి పంపాలన్న కుయుక్తులు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతం. రాష్ట్రవ్యాప్తంగా పచ్చచొక్కా నేతల ఆదేశాలే శిరసావహించాలన్న రీతిలో ఉద్యోగులపై గుత్తాధిపత్యం చెలాయించడాన్ని ఏ ఉద్యోగి ఇంకా మరిచిపోలేదు. ఇలాంటి నియంత పాలకులకు ఇంకా అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమవుతుంది? హోదాను అమ్మేశాడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇదే మాట చెప్పారు. బీజేపీతో అంటకాగిన తర్వాత మాట మార్చారు. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దన్నారు. అందులో లంచాలు బొక్కచ్చనుకున్నాడు. ప్యాకేజీ ఇచ్చిన మోదీని ఆకాశానికెత్తారు. జైట్లీకి సన్మానం చేశారు. అసెంబ్లీలో ఆవేశంగా ప్రశంసిస్తూ తీర్మానం చేశారు. ఇదెక్కడి అన్యాయమని ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తే.. మీకేం తెలుసు అని తోసిపుచ్చారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బావుకున్నాయని ఎదురుదాడి చేశారు. కేంద్రం మనకన్నా ఇంకే రాష్ట్రానికైనా మేలు చేసిందా చెప్పమని సవాల్ విసిరారు. హోదానే కావాలంటూ ఉద్యమించిన విపక్షంపై కత్తికట్టారు. ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు పెట్టారు. లాఠీలు విరగొట్టాడు. నాలుగేళ్లు హోదాను బతికించి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కదిలిస్తూ అవిశ్వాస తీర్మానం పెడితే.. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్యాకేజీకి ఒప్పుకన్న చంద్రబాబు రూటు మార్చి హోదాపై ఉద్యమం అంటూ రకరకాల కలరింగులు ఇచ్చారు. పూటకో వేషం వేసే ఇలాంటి వ్యక్తిని ఇంకా ఉపేక్షిద్దామా? ఇలాంటి వాళ్లవల్ల రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందా? తప్పులు చేసేది తను.. నింద ఇంకొకరిపై.. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అనేక మంది అంటారు. నిజమేనని ఆయన రాజకీయ నైజమే చెబుతోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎంతో ఒకసారి మిత్రత్వం. ఇంకోసారి శతృత్వం. రాష్ట్ర ప్రయోజనాలను టీఆర్ఎస్ అడ్డుకుంటుందంటాడు. హోదా ఇవ్వకుండా తెలంగాణ అడ్డుపడుతోందంటాడు. ఆ పార్టీతో వైఎస్సార్ సీపీ అంటకాగుతోందనే కలర్ ఇస్తాడు. కేసీఆర్ యాగాలకు వెళ్లింది ఆయనే.. కేసీఆర్‌ను ఏపీకి రప్పించి మర్యాదలు చేసిందీ ఆయనే. బావమరిది హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్‌తో పొత్తుల రాజకీయం చేసిందీ చంద్రబాబే. ఇన్ని చేసిన ఆయన నింద మాత్రం వైఎస్ జగన్‌పై వేస్తానంటారు. మోదీ, జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి వేడుక చూస్తారు. ఇసుమంతైనా నిజాయితీ లేని ఈ వ్యక్తి పాలనలో రాష్ట్రం ఏమాత్రమైనా బాగుపడుతుందా? అవినీతి సూత్రం.. అన్యాయ గోత్రం అత్యంత ఖరీదైన నాయకుల్లో చంద్రబాబే ముఖ్యుడని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. రాజకీయ నాయకులు అవినీతి చేయడమెలా అనే దానిపై ఆయన పీహెచ్డీ చేసి ఉండొచ్చు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి కథలు కుప్పలు తెప్పలు. ఇసుక, మట్టి, కరెంట్ కొనుగోళ్లు, పేదల భూముల దురాక్రమణ, దేవుడు, దేవుడి భూముల కబ్జా, కాంట్రాక్టుల్లో ముడుపులు.. ఇలా ఒకటేమిటి అవినీతి ఆరోపణలు ఎన్నో.. ఎన్నెన్నో. అడ్డొచ్చిన అధికారులను జుట్టుపట్టి ఈడ్చేసినా అడిగే దిక్కేలేని పాలన చూశాం. ప్రశ్నిస్తే కేసులు. ప్రతిఘటిస్తే జైళ్లు. కిందస్థాయి ఉద్యోగి నుంచి కలెక్టర్ల వరకూ.. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, చినబాబు, పెదబాబు వరకూ ముడుపులు. ఏ ఒక్కదానిపై విచారణలు లేవు. ఇలాంటి అవినీతి పాలనను ఏ ప్రజాస్వామ్య వాదైనా స్వాగతిస్తారా? పోలవరాన్ని మింగేశారు రాష్ట్రానికి జీవనాడి పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం మన అదృష్టం. కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అడ్డగోలుగా అంచనాలు పెంచేసి నిలువునా దోచుకున్నాడు. కేంద్రం లెక్క అడిగితే దబాయించే ప్రయత్నం చేశారు. పునాది రాయి కూడా దాటని పోలవరం ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ప్రచారం చేసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా మార్చి.. ఊరూరా బస్సులు పెట్టి ప్రజలను తరలించారు. ఇదిగో అభివృద్ధి.. అంతా అయిపోయిందని చెబుతున్నారు. మరోపక్క ఈ ప్రాజెక్టును తెలంగాణ, జగన్, మోదీ అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. అసలు పనులే అయిపోనప్పుడు ఎవరు అడ్డుకోగలరు? ఈ ప్రశ్నకు మాత్రం చంద్రబాబు సమాధానం చెప్పరు. వ్యవసాయమే దండగని భావించే చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్లే చూసుకుంటారు తప్ప.. ప్రాజెక్టులు పూర్తవ్వాలని కోరుకుంటారా? ఇలాంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందా? వ్యవస్థలు ధ్వంసం ‘చంద్రబాబు ఏదైనా చెయ్యగలరు’ ఆయన అనుచరులు గర్వంగా చెప్పుకునే మాటిది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. మేధావులు రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు. చంద్రబాబు మాత్రం దీనికి భిన్నమన్నట్టు వ్యవహరిస్తారు. అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినా.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోగా.. అందులో కొందరికి మంత్రి పదవులే ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్‌ను ఆకాంక్షిస్తారా? విపక్షం లేకుండానే ఏకపక్షంగా చట్టసభలను నడిపిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఏ ప్రజాస్వామ్యవాది ఈ పరిణామాలను స్వాగతిస్తారు? అవినీతి ఆరోపణలొస్తే ధైర్యంగా ఎదుర్కొన్న దాఖలా ఆయనకు లేనేలేదు. అన్నింటిపైనా స్టే తెచ్చుకుని తప్పించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి వ్యక్తి ఉంటే ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయా? అరచేతి వైకుంఠమే.. రాష్ట్ర రాజధాని అమరావతిపై ఆయన రంగుల సినిమా చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం నిజమన్న రీతిలో ప్రచారం సాగుతోంది. 33 వేల ఎకరాల పంట భూములను లాక్కున్న ఈ సర్కారు ఇప్పటికీ శాశ్వత భవనం ఒక్కటీ కట్టలేదు. చిన్న వర్షానికే నీళ్లు కారే తాత్కాలిక భవనాల నిర్మాణంలోనూ పచ్చిదోపిడీ. రాజధాని నిర్మాణం చుట్టూ బినామీల భూములకు రక్షణ కల్పించి రూ.కోట్లు దండుకునే వ్యూహాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి మోసగాడి వల్ల రాష్ట్రం ముందుకెళ్తుందా? అమ్మకూ రక్షణ లేదే! రాజధాని సాక్షిగా కలవరం పుట్టించిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలే ముద్దాయిలు. ఆడపడుచుల జీవితాలతో ఆడుకున్న రాక్షసులను ఏ ప్రభుత్వమైనా ఎంతమాత్రం ఉపేక్షించదు. కానీ.. చంద్రబాబు పాలన ఇందుకు భిన్నం. ‘అన్యాయం జరిగింది మహాప్రభో’ అంటూ వచ్చిన అతివలపై కాల్‌మనీ రాక్షసులు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకే వెనుకాడారు. ఐదేళ్లుగా ధృతరాష్ట్ర పాలన కొనసాగింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఎదురు దాడి చేశారు. ఏకంగా ఆమెను సభ నుంచే బహిష్కరించారు. మహిళలపై ఏమాత్రం గౌరవమే లేని ఇలాంటి వ్యక్తిని ఇంకా క్షమించాలా? స్వప్రయోజనాల కోసం ఎంతకైనా... విభజన జరిగినా పదేళ్ల పాటు హైదరాబాదే మన రాజధాని. అక్కడి మన ఆస్తులపై చెయ్యేసే అధికారం ఎవరికీ లేదు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి తట్టాబుట్టా సర్ధుకుని విజయవాడ కరకట్టకొచ్చారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆస్తులను పొరుగు రాష్ట్రం పాల్జేశాడు. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కును విడిచిపెట్టాడు. కేసులో చిక్కుకోకుండా తానైతే రాజీపడ్డాడు. ప్రజల ప్రయోజనాలు మాత్రం కాలరాశాడు. ఇలాంటి వ్యక్తిని ఇంకా రాజకీయాల్లో ఉండనిద్దామా? ఒక్క క్షణం ఆలోచించండి రాక్షసుడికి బలమెక్కువ. నేల కూలే రోజొచ్చే వరకూ వేచి చూడటం తప్ప ఏమీ చెయ్యలేం. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. ఓటు అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. ఐదేళ్ల కష్టాలు.. కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. కర్తవ్యాన్ని, భావితరాల భవిష్యత్‌ను గుర్తుకు తెచ్చుకుంటే.. ఆయుధ ప్రయోగం మరింత పదునెక్కుతుంది. మిమ్మల్ని ఏడిపించిన శత్రువు రుధిరంలోంచి చీల్చుకెళ్తుంది. గుర్తుంచుకోండి. ఒక్క ఓటు.. మీ ఒక్క ఓటుతో ఈ దురాగతాల్ని కూల్చేద్దాం.. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి వెళదాం.. ఓటేద్దాం. ఈ దురాగతాలన్నీ కూల్చేద్దాం. -
బాబు, పవన్‌లపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పదించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేసీఆర్ మద్దతునిస్తా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి చెవిలో చెప్పారా? అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబునాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా ఉందని కేసీఆర్ చెప్పారు. గతంలో పార్లమెంట్ లోనూ స్పష్టంగా చెప్పామని, ఇప్పుడూ చెబుతున్నామని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ నాయకుడు కేశవరావు రాజ్యసభలోనే స్పష్టంగా చెప్పారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 16 టీఆర్ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపుఖాయమని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి టీఆర్ఎస్ విధానపరంగా మద్దతునిస్తుందని, సహకరిస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి తన వద్ద లేటెస్ట్ సర్వే వివరాలు కూడా ఉన్నాయని చెబుతూ తాము ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ప్రయత్నిస్తామన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ కేసీఆర్ తమ అభిప్రాయాన్ని విడమరిచి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ పార్టీ అడ్డుపడటంలేదని స్పష్టం చేశారు. మా మేలు కోరుకుంటూ ఇతరుల మేలు కోరుకుంటామని, చెవుల్లో చెప్పుకుని చీకటి పనులు చేస్తూ కుట్రలు చేసే అలవాటు తమకు లేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కట్టుకోమని చెప్పాం. మా వాటా మాకు కావాలన్నామే తప్ప పోలవరం కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, ఎన్నో టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయని, పోలవరం కట్టుకోవాలనే తాము కోరుతున్నామని కుండబద్ధలు కొట్టారు. ఈ ఏడాది కూడా 2600 టీఎంసీల నీరు వృథాగా పోయిందని తెలిపారు. ఇకపోతే చంద్రబాబులాంటి కొందరు కిరికిరీ పెట్టే వాళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తమకు ఎలాంటి పంచాయితీ లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచివారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఏపీ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా అంశం లేవనెత్తారు. ప్రత్యేక హోదాకు మద్దతునిస్తారని జగన్ కు కేసీఆర్ చెవిలో చెప్పారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాటన్నింటికీ సమాధానంగా కేసీఆర్ ఆ విషయంపై మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. పైగా తెరవెనుక లాలూచీ వ్యవహారాలు, చెవుల్లో చెప్పుకోవడాలు, కుట్రలు పన్నడాలు తమకు రావంటూ చంద్రబాబు, పవన్ తీరుపై విరుచుకుపడ్డారు. -
ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ సహకరిస్తుంది: కేసీఆర్
-
‘ఎలాంటి హోదా ఇస్తారో రాహుల్ చెప్పాలి’
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఎలాంటి హోదా ఇస్తారో చెప్పడంలేదని బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ ఛీప్ మాయావతి పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తారా రాయితీలు లేని హోదా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు రాయితీలు లేని ప్రత్యేక హోదా ఇస్తే దాని కంటే ప్యాకేజీ బెటరన్నారు. చంద్రబాబు హోదాపై మాట్లాడి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మేనిఫేస్టో విడుదల చేయని చంద్రబాబు ఓట్లు ఎలా అడుతారని ప్రశ్నించారు. పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వల్పకాలిక ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని కోరారు. కులాలు వారిగా ఏర్పాటు చేసిన కొర్పొరేషన్లను భవిష్యత్తులో ఉంచుతారనే నమ్మకం లేదన్నారు. ఏపీ ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు.. అలా చేస్తే బీజేపీకి 50 సీట్లు ఎక్కువే వస్తాయన్నాని ఎద్దేవా చేశారు. -
బాబు బూటకపు హామీలు..పడకేసిన పరిశ్రమలు
సాక్షి,అమరావతి : గడిచిన ఐదేళ్లలో కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ఐదేళ్లలో ఒక్క భారీ తయారీ రంగ పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడ్డ పరిస్థితి. కనీసం విభజన హామీలో పేర్కొన్న భారీ కేంద్ర ప్రాజెక్టులను ఒక్కదాన్ని కూడా సాధించలేదు. కేంద్రంలో అధికారం పంచుకున్నంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను గాలికొదిలేయడంతో రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. విభజన సమయంలో ప్రత్యేక హోదా ప్రకటించడంతో హైదరాబాద్‌కు చెందిన ఒక ఇన్ఫ్రా కంపెనీ నెల్లూరు వద్ద యూనిట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంది. రెండేళ్లు ఎదురుచూసినా ముఖ్యమంత్రి ధోరణి చూసి ఆ కంపెనీ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పే యత్నాన్ని మానుకుని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిపోయింది. హోదా వస్తే హైదరాబాద్‌లో యూనిట్లు ఉన్న చాలా సంస్థలు ఇక్కడ కూడా యూనిట్లు నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. చివరకు ముఖ్యమంత్రి హోదా కంటే ప్యాకేజే ఉత్తమం అంటూ చెప్పడంతో ఆయా కంపెనీలు తమ ప్రతిపాదనలను విరమించుకున్నాయి. ఇలాంటి సంఘటనలకు అనేక దాఖలాలున్నాయి. టీడీపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్నా ఒక్క భారీ ప్రాజెక్టును తీసుకురాకపోగా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ కూడా అటకెక్కింది. ప్రచార పాలసీలు–బూటకపు ఒప్పందాలు గడిచిన ఐదేళ్లుగా పెట్టుబడుల ఆకర్షణ కోసం అనేక పారిశ్రామిక పాలసీలు, భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ రియాల్టీ షోలను నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా 22కు పైగా పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. పరిశ్రమల రంగంలో 12 పాలసీలు, ఐటీ రంగంలో 9 పాలసీలు, పర్యాటక రంగంలో ఒక పాలసీని విడుదల చేసింది. అదే విధంగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)తో కలిసి వైజాగ్ వేదికగా భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు. ఇలా మూడు భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం రూ.19.6 లక్షల కోట్ల విలువైన 1,761 ఒప్పందాలు కుదిరినట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. టీ కొట్లో పనిచేసేవారు, రాజకీయ నాయకుల కారు డ్రైవర్లకు సూటు బూటు తొడిగి పారిశ్రామికవేత్తలుగా వేషాలు వేయించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని శ్వేతపత్రం సాక్షిగా బయటపడింది. భాగస్వామ్య సదస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు స్వతహాగానే పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాగా, మరికొన్ని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 2,622 ఒప్పందాలు ద్వారా రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబడులు 32.35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ గత మూడు భాగస్వామ్య సదస్సుల్లోనే రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినట్టు చెప్పగా ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15.48 లక్షలకు తగ్గించేశారు. విభజన హామీల అమల్లో విఫలం రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం అనేక భారీ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ముఖ్యమైనది కాకినాడ వద్ద భారీ పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మాణం. 2014 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో గెయిల్–హెచ్‌పీసీఎల్ కలిసి రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఈ ప్రాజెక్టు లాభదాయకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీ రూ.5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) అవసరమవుతుందని తేల్చిచెప్పింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నాయి. కానీ ఈ మొత్తం కేటాయించడానికి నిరాకరిస్తూ ఈ మొత్తం కూడా కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలే వీజీఎఫ్ భరించాయని కేంద్రం చెప్పింది. కానీ దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు రూ.12,578 కోట్ల రాయితీలను ఇచ్చి హల్దియా సంస్థ చేత పెట్రో కెమికల్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. అదే విధంగా కడప వద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చేత భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ఉక్కు లభ్యత గురించి వివరాలను ఇవ్వబోమని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపెట్టి ఎన్నికల ముందు తామే నిర్మిస్తామంటూ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎన్నికల తర్వాత నెమ్మదిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. అదే విధంగా దుగరాజుపట్నం వద్ద ఓడ రేవు ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది. దుగరాజపట్నం వద్ద ఏర్పాటుకు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు రావడంతో మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించమన్నా చూపించకుండా రామాయపట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మైనర్ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. పేరుకు రాష్ట్ర ప్రభుత్వమే అయినా ఇందులో 8 బెర్తులను అప్పుడే ప్రైవేటు సంస్థల సొంత వ్యాపారాల కోసం విక్రయించేసింది. కనీసం రామాయపట్నం ఓడరేవును తాము నిర్మిస్తామంటూ కేంద్రం ముందుకు వచ్చినా అనుమతులు ఇవ్వడం లేదు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఈ కేంద్ర సంస్థలను తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారంటున్నారు. ఈ ఐదేళ్లలో బందరు ఓడరేవు, భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు వంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తిరోగమనానికి గణాంకాలే సాక్ష్యం ఓ పక్క పారిశ్రామిక రంగం తిరోగమన దశలో నడుస్తోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. వేగంగా దూసుకుపోతోందంటూ అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది. 2015–16లో 13.89 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధిరేటు 2017–18 నాటికి 8.36 శాతానికి పడిపోయింది. అలాగే పారిశ్రామిక వృద్ధిరేటు 9.61 శాతం నుంచి 8.49 శాతానికి పడిపోయింది. వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే చెబుతుంటే.. ముఖ్యమంత్రి ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయంటున్నారు. అందులో రూ.1.77 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్పత్తి కూడా ప్రారంభించేశాయని, మరో రూ.5.27 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయంటున్నారు. నిజంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే పారిశ్రామిక వృద్ధిరేటు రెట్టింపుపైగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి భిన్నంగా వృద్ధిరేటు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వచ్చింది రూ.32,803 కోట్లే లక్షల కోట్ల పెట్టుబడులంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రచారంలోని డొల్లతనాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీఐపీపీ) బయటపెట్టింది. దేశంలో పెట్టుబడి చేసే ప్రతీ పైసా డీఐపీపీ వద్ద నమోదు కావాల్సిందే. డీఐపీపీ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1,26,512 కోట్ల విలువైన 733 ఒప్పందాలు మాత్రమే జరిగాయి. అంటే చంద్రబాబు చెబుతున్న రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు జరగలేదన్నది స్పష్టమవుతోంది. అలాగే గత ఐదేళ్లలో ఈ ఒప్పందాల్లో కేవలం రూ.32,803 కోట్ల విలువైన 293 ప్రాజెక్టులు మాత్రమే అమల్లోకి వచ్చినట్టు డీఐపీపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఈ ఐదేళ్లలో రూ.1.77 లక్షల కోట్ల విలువైన 810 ప్రాజెక్టులు ప్రారంభమైపోయాయని, వీటి ద్వారా 2.51 లక్షల మందికి ఉపాధి లభించిందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు కుదేలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గడచిన ఐదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమాలు, విద్యుత్ కోతలతో అనేక కష్టానష్టాలు ఎదుర్కొన్న ఈ రంగం టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత అధికమమాయ్యియి. లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 25.96 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నట్లు ఒక అంచనా కాగా , గడిచిన ఐదేళ్లలో 10.38 లక్షలకు పైగా యూనిట్లు మూతపడినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో మూడో స్థానంలో ఉన్న ఈ యూనిట్లు మూతపడటం వల్ల 10.38 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఎంఎస్ఎంఈ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, విజయనగరం వంటి జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఐదు నెలల కిందట మూతబడిన విజయనగరంలోని ఫెర్రోఅల్లాయిస్ యూనిట్ కర్నూలులో 2 లక్షల మంది ఉపాధికి గండి కర్నూలు జిల్లాలో నూనె మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, సున్నపు బట్టీలు, గ్రానైట్, క్వారీ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, పత్తికొండలలో నూలు, జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, ఆదోనిలోని పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ ప్రోత్సాహం కరువై అనేక చిన్న పరిశ్రమలకు తాళాలు వేశారు. వీటిద్వారా దాదాపు 5 లక్షల మంది ఉపాధి పొందేవారు. ప్రభుత్వం రాయల్టీ రూపంలో చిన్న పరిశ్రమల నుంచి భారీగా వసూలు చేయడం, విద్యుత్ చార్జీల పెంపు వల్ల కుదేలయ్యాయి. పెట్టుబడి నిధి సమకూర్చడం, బ్యాంకుల నుంచి రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలంకావడంతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిద్వారా ఉపాధి పొందే వేలాది మంది రోడ్డున పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే ఐదేళ్ల టీడీపీ పాలనలో 6 వేల పరిశ్రమలు మూతపడి రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారు. పెరిగిన వలసలు విజయనగరం జిల్లాలో స్టీల్, ఫెర్రో ఎల్లాయిస్, ఫార్మా, చక్కెర, జూట్¯Œ, కెమికల్, జీడి రంగాలకు చెందిన అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో సుమారుగా 4,288 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే అందులో 40 శాతం మూతపడ్డాయి. ఈ కారణంగా విజయనగరం జిల్లా వాసులు విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 1,200 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలున్నాయి. తిరుపతి, మదనపల్లి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. 860 చిన్న పరిశ్రమలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కోలుకోలేని స్థితిలో పడ్డాయి. రాజశేఖరరెడ్డి హయాంలో చిన్న పరిశ్రమలకు విద్యుత్, వ్యాట్‌లపై సబ్సిడీ ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్‌పై రాయితీ ఎత్తివేయడంతోపాటు అప్పటికే ఉన్న చార్జీలను భారీగా పెంచారు. ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న పరిశ్రమలపై విద్యుత్ చార్జీల పెంపు గుదిబండలా మారింది. దీంతో అనేక పరిశ్రమలు నష్టాలు భరించలేక మూతపడ్డాయి. బంగారు పాళ్యంలోని గోమతి స్పిన్నింగ్ మిల్స్ లాంటి పరిశ్రమలు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఒక్క నగరిలోనే టీటీకే, ప్రశాంత్ స్పిన్నింగ్ వంటి మిల్లులు మూతపడ్డాయి. ఈ రెండు మిల్లుల్లోనే 900 మంది పని చేసేవారు. చిన్నతరహా పరిశ్రమలన్నీ పడకేయడంతో వాటిలో పనిచేసే 7 వేల మంది కార్మికులు పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టారు. ఎంఎస్ఎంఈ పార్కులెక్కడ? చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ప్రస్తుత ఎన్నికల్లోగా కనీసం 45 పార్కులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పినా.. వాస్తవంగా ఇంతవరకు ఒక్క పార్కు కూడా ప్రారంభం కాలేదు. పెద్ద పరిశ్రమలకు కారు చౌకగా భూములిస్తున్న ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు మాత్రం అధిక ధరను కేటాయిస్తున్నాయని, ఎంఎస్ఎఈ పార్కుల్లో ధరలు కూడా అదే విధంగా ఉన్నాయంటూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలువాపోతున్నారు. -
ఆంధ్రప్రదేశ్ బాధలను అర్థం చేసుకున్నాను
సాక్షి ప్రతినిధి, అనంతపురం/ అమరావతి/గన్నవరం : ‘ఆంధ్రప్రదేశ్ బాధలను అర్థం చేసుకున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని విశ్వసిస్తున్నాను. 2014 ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని మోదీ చెప్పారు. హోదా ఇవ్వడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం ఇస్తామన్నారు. కానీ, ఆయన ఏదీ చేయలేకపోయారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీ అమలు జరిగి తీరాలి. కాంగ్రెస్ ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’.. అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంతోపాటు విజయవాడలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఐదేళ్లలో నరేంద్ర మోదీ చాలా కష్టపడ్డారు. దేశాన్ని రెండుగా విభజించారు. నీరవ్ మోదీ, అంబానీ, విజయ్మాల్యాల కోసం ఒక భారత్ ఏర్పాటుచేశారు. సామాన్య యువకులు, మహిళలు, రైతులను మరో పేద దేశంగా విభజించారు. కానీ, ఇలాంటి రెండు రకాల దేశాలను చూసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. తిరిగి ఒకే దేశాన్ని నిర్మించడమే లక్ష్యం’.. అన్నారు. ‘న్యాయ్’తో పేదల రాతను మారుస్తాం ‘మేం ‘న్యాయ్’ అనే పేరుతో ఒక పథకం తీసుకొస్తున్నాం. దీంతో కోట్లాది మందికి ఆర్థిక తోడ్పాటు జరుగుతుంది. నెలకు రూ.12వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న 5 కోట్ల మంది పేదవారిని ఎంపికచేసి ఏటా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.72వేలు వేస్తాం. ఇతర దేశాల మీద యుద్ధం ఎలా ప్రకటిస్తామో ‘న్యాయ్’ ద్వారా పేదరికంపై కూడా యుద్ధం చేస్తాం.. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం. మన దేశానికి సంబంధించి రాఫెల్ డీల్‌లో అంబానీతో కలిసి రూ.35వేల కోట్లు మోదీ దోచేశారు. దేశానికి తాను కాపలాదారు అని ప్రధాని అన్నారు. రూ.35వేల కోట్లు దోపిడీ చేసే వారిని కాపలాదారుడంటారా? కాపలాదారు పేరు చెప్పుకుని ప్రధాని దొంగలకు దోచిపెడుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ సొమ్మును పేదలకు పంచుతుంది’.. అని రాహుల్ భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం ‘కేంద్ర ప్రభుత్వ సాయం లేక రైతులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యనే మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రుణమాఫీ చేశాం. మా హయాంలోనే ఆహార భద్రత హక్కును తెచ్చాం. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతాం. భూ సేకరణ చట్టం ద్వారా గిరిజనులు, దళితుల భూముల కోసం పేదలకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా చట్టం తెస్తే.. వాటికి తూట్లు పొడుస్తూ ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను గెలిపించండి, ఆ మూడు రాష్ట్రాల్లోలాగే ఇక్కడా రెండ్రోజుల్లో రైతుల రుణాలు పూర్తిగా మాఫీచేస్తాం. ఇక్కడ 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయానికి దన్నుగా నిలుస్తాం. మోదీ రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేశారు. ఈ చర్యతో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. ఎక్కడా ఉద్యోగ అవకాశాల్లేవు. కానీ, ప్రతీ యువకునికి ఉపాధి ఉండాలనేది కాంగ్రెస్ లక్ష్యం. కోటీశ్వరులు మాత్రమే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది. మేం అధికారంలోకి వస్తే అతి సామాన్య యువత కూడా ఏ అనుమతుల్లేకుండానే మూడేళ్లు వ్యాపారాలు చేసుకునేలా చట్టం తీసుకొస్తాం. మోదీ రిజర్వ్ బ్యాంకు తాళాలను నీరవ్ మోదీ, అంబానీ చేతికి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ తాళాలు సామాన్యుల చేతికి ఇవ్వబోతున్నాం’.. అని రాహుల్ హామీ ఇచ్చారు. సామాన్యులకూ విలువైన విద్య అందిస్తాం ‘లక్షలాది స్కూళ్లు, వేలాది కాలేజీలు ఈ ఐదేళ్లలో మూతపడ్డాయి. అది రాజ్యాంగంపై జరిగిన దాడి అని చెబుతున్నా. అందుకోసమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని ఆలోచిస్తున్నాం. మనకు వచ్చే ఆదాయంలో ఆరు శాతం విద్యాలయాలయాలకు ఖర్చు పెడతాం. నేను ప్రధాని అయితే వాల్మీకులను ఎస్టీలుగా, వడ్డెరలను ఎస్సీలుగా మారుస్తా. అదే విధంగా దళితుల వర్గీకరణ సమస్యనూ సామరస్యంగా పరిష్కారిస్తాం. సురక్షిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది’.. అని రాహుల్‌గాంధీ అన్నారు. అంతకుముందు, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి ఉదయం 11గంటలకు పార్టీ నేతలు ఉమెన్‌చాందీ, కేవీపీ, రఘువీరారెడ్డి, జేడీ శీలం తదితరులు స్వాగతం పలికారు. -
వైరల్ : ఎన్డీ టీవీతో వైఎస్ జగన్ ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం తాము ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మద్దతు తెలుపుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కృష్ణాజిల్లా నందిగామ బహిరంగ సభలో (గురువారం) పాల్గొన్న ఆయన ఆ తర్వాత ఎన్డీ టీవీతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చంద్రబాబు పాలనపై ఆగ్రహంతోనే ప్రజలు తన సభలకు అధిక సంఖ్యలో వస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనుభవం, ఆయన చేసే జిమ్మిక్కులకు తాను ఆందోళన చెందడం లేదని, దేవుడిని, ప్రజలను నమ్ముతున్నాని ఎన్డీ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఎవరిస్తే వారికే మా మద్దతు ఉంటుందని తాము తొలి నుంచి చెబుతున్నామని, మా స్టాండ్‌ను ప్రజలకు స్పష్టంగా తెలియజేశామన్నారు. తాము ఇప్పటి వరకు ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఎవరు హోదా ఇస్తే వారికే మద్దతిస్తామన్నారు. చంద్రబాబును ఓడించడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నాడన్న ఆరోపణలను వైఎస్ జగన్ కొట్టిపారేశారు. తనకు డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు చూశారా? లేక కేసీఆర్ ఫోన్ చేసి ఏమైనా చెప్పాడంటనా? అని వైఎస్ జగన్ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని అన్నారు. తనపై ఉన్న కేసుల గురించి ప్రజలందరికి తెలుసన్నారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం జగన్ మంచోడు.. ఎప్పుడైతే పార్టీలో నుంచి బయటకు వచ్చాడో అప్పుడే చెడ్డోడయ్యాడని, చంద్రబాబు, కాంగ్రెస్‌లు కుమ్మక్కై తనపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాన్ని విడగొట్టి రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారని, వారి ప్రభావం రాష్ట్రంలో ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేప్లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
బాబు బాటలో పవన్..!
సాక్షి,అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా సాధించడానికి టీఆర్ఎస్ సహకారం తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను’.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలవి. రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ‘యూటర్న్’ తీసుకోవడానికి అనుగుణంగానే పవన్‌కల్యాణ్ ఇప్పుడు తన మాట మార్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మూడు నెలల కిత్రం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిరాకరించి ఒంటరి పోరుకు సిద్ధపడిన నాటి నుంచి చంద్రబాబు ఆ పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ప్రతీ బహిరంగ సభలోనూ విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతీఎన్నికల సభలో చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సీఎంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుండకపోయినా.. పవన్‌కల్యాణ్ తెలుగుదేశం పార్టీ రహస్య మిత్రుడేనని ప్రచారం జరుగుతున్నట్లుగానే.. జనసేన పార్టీ అధినేత కూడా అచ్చం చంద్రబాబు మాదిరే ఇప్పుడు ప్రతీ ఎన్నికల సభలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అచ్చం చంద్రబాబు నోటి వెంట వచ్చే మాటలనే ఆయన వల్లె వేయడంపై సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి. కాగా, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలని ఎనిమిది నెలల కిత్రం పవన్‌కల్యాణ్ మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మన ఊపిరి.. ప్రత్యేక హోదా
సాక్షి, విజయవాడ : ‘అధికారంలోకి రాగానే ఐదేళ్లు, పదేళ్లు కాదు...15 ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం..’ ఇదీ గత ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ కలిసి ఇచ్చిన హామీ. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రంలోని యువతకు తీరని ద్రోహం చేసింది. పరిశ్రమలు లేక, ఉన్నత చదువులు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో ఎంతో విలువైన యువశక్తి వృథా అవుతోంది. ప్రత్యేకహోదా కోసం గత నాలుగేళ్లుగా అనేక పోరాటాలు, ఉద్యమాలు, యువభేరి కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళనలు, రిలేదీక్షలు, ఆమరణ దీక్షలు ఇలా అనేక రూపాలలో పోరాటం చేసి చివరకు ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజీనే మిన్న అని చెప్పిన చంద్రబాబు చేత కూడా ప్రత్యేకహోదా కావాలని చెప్పించిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే మద్దతు తెలుపుతానని జగన్ జాతీయ పార్టీలకు స్పష్టం చేయడాన్ని బట్టే రాష్ట్రాభివృద్ధి పట్ల, యువత పట్ల ఆయనకు ఎంత నిబద్ధత ఉందో అర్ధమవుతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్ సీపీ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మహోద్యమాన్ని నడిపింది. ఈ ఉద్యమాలకు కృష్ణాజిల్లా కూడా వేదికైంది. ధర్నాలు, రాస్తారాకోలు, రైల్‌రోకోలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, కలెక్టరేట్ ముట్టడి వంటి విభిన్న మార్గాల్లో గత ఐదేళ్లుగా నిరసనలు తెలియచేస్తోంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదని, హోదా గురించి ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయిస్తామని చంద్రబాబు బెదిరించినా ఏ మాత్రం బెదరకుండా ఉద్యమాన్ని జిల్లా వాసులు నడిపారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే 12వ రాష్ట్రమయ్యేది. మరో ఐదు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీతో పాటు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ హామీ ప్రకారం మార్చి 2,2014 పార్లమెంట్ చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమాన్ని ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు చేపట్టినా ఐదేళ్లు దీన్ని సజీవంగా నిలబెట్టింది మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. హోదా.. లాభాలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నిధులు 90 శాతం గ్రాంటుగానూ, 10 శాతం అప్పుగానూ ఇస్తుంది. గ్రాంటుగా వచ్చే సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేదు. పరిశ్రమలకు భారీగా రాయితీలు వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం ట్యాక్స్ 100 శాతం పన్ను రాయితీ వస్తుంది. ప్రైట్ రీయింబర్స్ మెంట్ దక్కితే పరిశ్రమలు వస్తాయి. మనం కొనుగోలు చేసే అనేక వస్తువులు సగం ధరకే వస్తాయి. కరెంటు చార్జీలు భారీగా తగ్గుతాయి. కృష్ణాజిల్లాలో పారిశ్రామికవేత్తలకు కొదవలేదు. ఈప్రాంతానికి చెందిన లగడపాటి రాజగోపాల్, కావూరు సాంబశివరావు తదితర పారిశ్రామికవేత్తలు కృష్ణాజల్లా కంటే ఇతర రాష్ట్రాల్లోనే పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందిన కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ లేదు. గత ఐదేళ్లలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేయడమే తప్ప ఒక చెప్పుకోదగిన పరిశ్రమ రప్పించడం కాని ప్రారంభించడం కాని లేనేలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పారిశ్రామికవేత్తలు ఇక్కడికే వలస వచ్చేవారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 2వేల పరిశ్రమలు వచ్చాయి. వెనుకబడిన రాష్ట్రంలోనే అన్ని పరిశ్రమలు వస్తే.. బందరు వంటి ఓడరేవు ఉండి పరిశ్రమలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్న కృష్ణాజిల్లాకు ఈ ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చేవని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం,ఉపాధి కరువైంది! పరిశ్రమలు లేకపోవడంతో ఆరున్నర లక్షల కుటుంబాలు వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. విద్యావంతులైన యువకులు ఉద్యోగఅవకాశాలు లేక హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుతో తదితర నగరాలతో పాటు విదేశాలకు వలసపోతున్నారు. లక్షల మంది ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఉత్తరాఖండ్‌లో 490 శాతం ఉద్యోగ అవకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. మన జిల్లాలో పరిశ్రమలు వచ్చి ఉంటే కనీసం ఆరేడు వందల శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు ఉద్యోగాల కోసం వలసలు వచ్చేవారు. అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలు! ప్రత్యేక హోదా మనకు వచ్చి ఉంటే కృష్ణాజిల్లాలోని యువతీ యువకులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తగా పరిశ్రమలకు అనుబంధంగా పరిశ్రమల్ని పెట్టుకునేందుకు అవకాశం ఉండేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్, ఇంకంట్యాక్స్లో 100 శాతం పను రాయితీలు ఇచ్చి, బ్యాంకులు యువతకు సబ్బీడీలోలోన్లు ఇచ్చి ఉంటే జిల్లా వ్యవసాయపరంగానే కాకుండా పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందిన మరొక హైదరాబాద్‌గా మారేదని విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార సంస్థలు ఏడెనిమిది రెట్లు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. హోదాను బతికించింది జగనే రాష్ట్రంలో ప్రత్యేకహోదా నినాదాన్ని బతికించింది వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి మాత్రమే. ఈ విషయం అన్ని పార్టీలతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రత్యేకహోదా ఉపయోగంలేదు అన్న ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకుని హోదా కావాలని నాటాకాలు ఆడుతున్నారు. ఉద్యోగం రాలేదు! చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము రత్తయ్య, సరోజనీలు కూలీ పనులకు వెళ్లి కొడుకు కొమ్ము వీర వెంకట సత్యనారాయణను ఇంజనీరింగ్ చదివించారు. 2012 ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. అప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. హోదా వచ్చి ఉంటే కొలువు దక్కేదని భావిస్తున్నాడు. ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి సంజీవని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదా కల్పించాలని మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్. హోదా వల్ల రాష్ట్రానికి రాయితీలు వస్తాయని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడతారని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయని గళమెత్తి నినదించిన నాయకుడు ఆయనే. హోదా ఉద్యమంలో గణనీయమైన పాత్ర పోషించటంతో పాటు గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి వేదికపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఒకసారి హోదా కావాలని, మరోసారి ప్యాకేజీ అని, హోదా అంటే అరెస్టులు చేయించి, మరలా ఇప్పుడు హోదా కోసం పాటు పడుతున్నామంటూ రంగులు మార్చే ఊసర వెల్లులకు తగిన గుణపాఠం ఈ ఎన్నికలలో చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. రాయితీలు లేక అనేక పరిశ్రమలు మూతపడటంతో పాటు, నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఆదుకోవడానికి ప్రత్యేక హోదా సంజీవని. తప్పక హోదా ఇవ్వాలి. - షేక్ మున్ని–ముస్తాబాద, గన్నవరం చేజేతులా నాశనం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాలుగేళ్లపాటు మిత్రత్వం నెరపి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ప్యాకేజీ కోసం పాకులాడడం వల్లే నేడు రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టింది. హోదా వచ్చి ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఎంతో ప్రగతి సాధించే వారం. ప్యాకేజీలకు తలొగ్గారు. హోదా కోసం ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయం ఈ సార్వత్రిక ఎన్నికలతో నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది. –చిట్టూరి నాంచారయ్య, చినకామనపూడి, ముదినేపల్లి హోదాతో వ్యవసాయానికి మరింత లాభం ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరికరాల తయారీ కంపెనీల ఏర్పాటు రాష్ట్రంలోనే జరుగుతుంది. తద్వారా పరికరాలు తక్కువ ఖర్చుకే దొరుకుతాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే బియ్యం, మినుములు వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడే నెలకొల్పడంతో రైతులు ఆశించిన దానికంటే ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది. విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యవసాయానికి ఎక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తారు. వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. హోదా వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభం ఎక్కువగా ఉంటుంది. –పంచకర్ల విష్ణువర్ధన్, అభ్యుదయ రైతు, అరిసేపల్లి, మచిలీపట్నం హోదా నిలిచింది టీడీపీ వల్లే! రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణం. ముఖ్యమంత్రి ఒకసారి ప్రత్యేక హోదా సంజీవనా అంటారు. ప్రత్యేక హోదా ఉన్న చత్తీస్‌గఢ్ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ పరిశ్రమలొచ్చాయి. మన ముఖ్యమంత్రి హోదాపై డ్రామాలు ఆడటం బాధాకరం. –అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, మైలవరం ఉద్యోగాలు, పరిశ్రమలొస్తాయి ప్రత్యేకహోదా రాష్ట్రానికి చాలా అవసరం. అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే హోదా కావాలి. పన్ను రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయి. పేరున్న విద్యాసంస్థలు, ఉన్న త ప్రమాణాలతో కూడిన విద్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. రాయితీలు ఉన్నప్పుడు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కేంద్రానికి చెల్లించే సొమ్ము 10 శాతమే ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో ప్రగతి వేగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. – ఆర్. వసంత్‌కుమార్, విద్యావేత్త, కంకిపాడు హోదా వస్తే ఉద్యోగాలొచ్చేవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈప్రాంతంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. హోదా రాకపోవటం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఆక్వా పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉన్న గుడివాడ ప్రాంతానికి ఆక్వా హబ్ రావటంతో పాటు ఆ రంగంలో పరిశ్రమలకు అవకాశం పెరిగేది. పరిశ్రమలు రాయితీ ఉంటేనే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. హోదా ఈ రాష్ట్రానికి, యువతకు అవసరం. ఈసారైనా హోదా సాధించే వారికే మద్దతు ఉండాలి. – టి సీతారామయ్య, ఉపాధ్యాయులు, గుడివాడ ప్యాకేజీలకు తలొగ్గారు ప్రత్యేక హోదాలో ఏముంది, ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి తేడా లేదన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం హాస్యాస్పదం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. కేంద్రానికి పన్నులు చెల్లించే ఆవశ్యకత ఉండదు. టాక్స్ ఫ్రీ స్టేట్ అవుతుంది. కొత్త పారిశ్రామికవాడలు, కంపెనీల స్థాపనకు దోహదమవుతుంది. పారిశ్రామికీకరణ ద్వారా రహదారులు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాభివృద్ధి ఇతోధికంగా జరిగి ఆర్ధికాభివృద్ధి వేగంగా జరుగుతుంది. –పుప్పాల శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది సంజీవని కాదన్నారు నాడు సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హోదాపై డ్రామాలాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మొదట నుంచి హోదా సాధనే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నారు. – కంభపు రాంబాబు, మంటాడ, పామర్రు హోదా రాక.. చాలా నష్టపోయాం రాష్ట్రం అన్యాయంగా విభజనకు గురైంది. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. అధికారంలో ఉండి, నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు హోదా సాధించలేకపోయారు. దీని అవసరం ఎంతో తెలిసి కూడా హోదాను పక్కన పెట్టేశారు. దీనివల్ల పరిశ్రమలు రాలేదు. అసలే నందిగామ ప్రాంతం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది. –పింగళి లక్ష్మీ నరసింహారావు, న్యాయవాది -
హోదాతోనే నవోదయం.!
అడ్డగోలు విభజనతో చితికిపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సంజీవనే అంటున్నారు జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకహోదా లభిస్తే రాష్ట్రానికి అనేక రాయితీలతో పాటు పన్నుల్లో మినహాయింపు లభిస్తుందంటున్నారు. పెద్దసంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. జిల్లాతో పాటు రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నారు.. ప్రత్యేకహోదా అంశం నేటికీ సజీవంగా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లేనని.. హోదా కోసం జాతీయస్థాయిలో పోరాటం చేసిన హోదా యోధుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని.. హోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా విడిచి రాజీనామాలు చేసిన హోదా వీరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని జనం ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. సాక్షి, వైవీయూ : తల్లిని చంపి బిడ్డను బతికించిన తీరున ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారు. 5 కోట్ల ఆంధ్రప్రజల విన్నపాలను పట్టించుకోకుండా పార్లమెంట్ తలుపులు మూసి మరీ రాష్ట్ర విభజన చేశారు. హైదరాబాద్ కాదు.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తాం.. అన్న వారు ఆనక మాట తప్పారు. ఇస్తామన్న ప్రత్యేకహోదాకు మంగళం పాడారు. హోదా పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు కేసులకు భయపడి కేంద్రానికి వంతపాడారు. హోదాతో ఏమొస్తుంది..? హోదా ఏమైనా సంజీవనా..? అంటూ ప్యాకేజీనే ముద్దంటూ కేంద్ర ఆర్థికమంత్రికి లేఖసైతం రాశారు. అయితే తొలినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదాపై ఒకేమాట.. ఒకే బాటగా వ్యవహరిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలో సజీవంగా ఉండేలా ఎన్నో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. యువభేరి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతలో చైతన్యం రగిలించారు. హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలియజెప్పారు. ప్రత్యేకహోదా అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు దేశరాజధాని ఢిల్లీలో సైతం ధర్నా చేపట్టారు. చివరి అస్త్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారు. జాతీయస్థాయిలో ప్రత్యేకహోదా అంశాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, హోదా ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని,యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని వైఎస్ జగన్ చెప్పిన మాటలను ప్రజలంతా విశ్వసిస్తున్నారు. ప్రత్యేకహోదా వస్తే జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలు.. ప్రత్యేకహోదా వస్తే ఖనిజాల ఖిల్లా అయిన వైఎస్ఆర్ జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉక్కుపరిశ్రమతో పాటు, దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపుతో పాటు పలు రాయితీలు కల్పించడం ద్వారా లభించే అవకాశం ఉండటంతో కడప నగర సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు పరుగులు తీస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్థానికులకు వారి సమీప గ్రామాల్లోనే ఉద్యోగాలు లభిస్తాయి. హార్టికల్చర్ హబ్‌గా రూపొందించే అవకాశం ఉండటంతో పాటు ఉద్యాన ఉప పరిశ్రమలు, అరటి, మామిడి పల్ఫ్, జ్యూస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని మంగంపేటలోని బెరైటీస్, పుల్లరిన్ తదితర ఖనిజ సంపదకు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ముగ్గురాళ్ల ఉప పరిశ్రమలు ఏర్పాటవుతాయి. సిరామిక్, టైల్స్ తదితర పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీంతో పాటు ఎర్రచందనం అధికంగా లభిస్తుండటంతో రెడ్‌శాండల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. అదే విధంగా మూతబడిన ఆల్విన్ ఫ్యాక్టరీ లాంటివి తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటాయి. -
చంద్రబాబు దొంగాట బట్టబయలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న దొంగాట బట్టబయలైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసి కేంద్రానికి లేఖ రాశారని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తాజాగా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఆ లేఖ ప్రతులను ఆయన బయట పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని నిధుల ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు వేసి, కేంద్రానికి ప్రతిపాదించిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి తలూపిన చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాను పోరాడుతున్నానంటూ ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. హోదా మాట ఎత్తితే జైలుకేనట! పార్లమెంట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గత ఐదేళ్లుగా వివిధ రూపాల్లో హోదా కోసం ఉద్యమించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. హోదా అనే మాట మాట్లాడితే అరెస్టు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించింది. అయినా వైఎస్ అన్నింటినీ తట్టుకుని హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టారు. హోదా బదులు ప్రత్యేక ఆర్థిక సహాయం(ప్యాకేజీ) ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం కూడా చేశారు. కేంద్ర మంత్రులను రప్పించి, సన్మానాలు చేశారు. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దంటూ చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు చివరకు ప్రజాగ్రహానికి తలొగ్గి, యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ రాసి, ఇప్పుడు హోదా కావాలని డిమాండ్ చేస్తుండటం తమను ఇరకాటంలోకి నెట్టిందని టీడీపీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. హోదా సంజీవని కాదంటూ అవహేళన విభజన వల్ల నష్టపోయే ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జట్టుకట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన సభలో ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, 15 ఏళ్లు కల్పించాలంటూ ఏన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీని కోరుతున్నానని చంద్రబాబు చెప్పారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చాయి. పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని 2014 జూన్ 12న కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని.. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయో చెప్పాలంటూ చంద్రబాబు హేళన చేస్తూ వచ్చారు. కేంద్ర సాయాన్ని స్వాగతించిన బాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్రంపై.. శాసనసభ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని 2016 జూలై 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడడం రాష్ట్రాన్ని కుదిపేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా 2016 ఆగస్టు 2న వైఎస్సార్సీపీ రాష్ట్ర బంద్ చేపట్టింది. 2016 ఆగస్టు 8న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. అటు పార్లమెంట్.. ఇటు శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ నిలదీస్తుందని భావించిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. విభజన చట్టంలోని హామీలకే సహాయం ముసుగేసి 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు దాన్ని స్వాగతిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. నాడొక మాట.. నేడొక మాట ప్రత్యేకసహాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 2016 సెప్టెంబరు 10న వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో జరిగిన చర్చలో వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తామెలాంటి ప్రతిపాదన చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు గోవిందరావు తెలిపారని గుర్తుచేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం నిర్ణయం తీసుకుందని, హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వచ్చే అవకాశం లేని.. ఒకవేళ రాయితీలు వస్తాయని ఏదైనా జీవో ఉంటే చూపించాలని.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక సహాయం వల్లే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని సెలవిచ్చారు. ప్రత్యేక సహాయాన్ని ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ అక్టోబర్ 24న సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక సహాయం కింద ఏడాదికి రూ.3,500 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.17,500 కోట్లు వస్తాయని.. వాటిని ఈఏపీ ప్రాజెక్టులకు విడుదల చేయాలని ఆ లేఖలో ప్రతిపాదించారు. దీన్నిబట్టి ప్రత్యేక సహాయం ప్రతిపాదనలను రూపకల్పన చేసింది సీఎం చంద్రబాబే అన్నది స్పష్టమవుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన పోరాటాల వల్ల హోదా ఉద్యమం ఉధృతం కావడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన పేరిట ఎన్నికల ముందు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని.. హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయని.. భారీ ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొడుతుండడం గమనార్హం. -
బాబు ‘ప్యాకేజీ లేఖ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్యాకేజీకి అంగీకారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర సర్కారుకు చంద్రబాబు రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. చంద్రబాబే స్వయంగా సంతకం చేసి ఆ లేఖను పంపారని పేర్కొన్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తూ 2016 అక్టోబర్ 24న రాసిన లేఖతోపాటు ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చాక కూడా ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2018 జూలై 5న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన మరో లేఖను కూడా పీయూష్ గోయెల్ మీడియా ముందు పెట్టారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తమ అధికారుల ద్వారా లెక్కించి, ఆ వివరాలను కేంద్రానికి నివేదించిందని వెల్లడించారు. ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి పీయూష్ గోయెల్ మంగళవారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ కింద రూ.17,500 కోట్లు ఇవ్వాలన్నారు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదని.. ప్యాకేజీగా రూ.17,500 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబే తన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా లెక్కలు వేయించి పంపారని పీయూష్ గోయెల్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది, ప్రత్యేక హోదా ఉంటే 90 శాతం నిధులను కేటాయిస్తుంది. హోదా ద్వారా 90 శాతం నిధులు రాష్ట్రానికి వస్తే ప్రతిఏటా ఏపీకి రూ.3,500 కోట్లు అదనం వస్తాయని కేంద్రానికి నివేదించారని పేర్కొన్నారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాలేనని, కావాలంటే లేఖలో చూసుకోవచ్చంటూ ఆ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అనంతరం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులను రెవెన్యూ లోటు భర్తీ రూపంలో అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు అందజేస్తుందని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ.22,113 కోట్లు ఇస్తూనే, ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉండడం వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.17,500 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని వివరించారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. ప్రత్యేక హోదా అంశంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన సంస్థల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు నిధుల గురించి అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నానని, బహిరంగ చర్చకు ఆయన ఎప్పుడైనా ఢిల్లీకి రావచ్చని, చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘ఏపీ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఏం చేశారో దేశ ప్రజలందరికీ తెలియాలి. బహిరంగ చర్చకు రండి’’ అని పీయూష్ గోయెల్ సవాల్ విసిరారు. రాజధానిలో అంతా అవినీతే.. ఐదేళ్లలో కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా ఇచ్చే రూ.2.42 లక్షల కోట్లకు తోడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరో రూ.5 లక్షల కోట్ల విలువైన పనులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిందని పీయూష్ గోయెల్ చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్లు మంజూరు చేసి, అందులో రూ.2,500 కోట్లు విడుదల చేసినప్పటికీ అమరావతిలో ఇప్పటిదాకా ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదన్నారు. రాజధానిలో చిన్న వర్షానికే లీకయ్యే తాత్కాలిక భవనాలను చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు పెట్టి నిర్మించారని ఆక్షేపించారు. అంతా అవినీతేనని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో కొత్త రైల్వేజోన్‌తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల రైల్వేలో తెలుగువారికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర పథకాలకు బాబు స్టిక్కర్ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఎంతో చేసిందని, రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని పీయూష్ గోయెల్ డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి అవి చంద్రన్న పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉందంటే.. అది కేంద్రం సహకారం వల్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న సహాయంపై చంద్రబాబు ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ అబద్ధపు ప్రచారం సాగిస్తున్నాయని తప్పుపట్టారు. దుగరాజపట్నం పోర్టు బదులు మేజరు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం చూపాలని అడిగితే.. రామాయపట్నంలో మైనర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే శంకుస్థాపన చేసుకుని ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో మరో నాటకం మొదలుపెట్టి, శంకుస్థాపన చేశారని అన్నారు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేయడానికి ఆడుతున్న డ్రామాలని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ను కూలదోసిన వారితో దోస్తీనా? బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నా లేకున్నా 2019లో కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతోందని పీయూష్ గోయెల్ చెప్పారు. పార్టీలను మార్చడంలో చంద్రబాబు గత చరిత్రను అందరూ గమనించాలని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసిన పార్టీతో, అందుకు కారణమైన కుటుంబ వ్యక్తులతోనే ఇప్పుడు చంద్రబాబు దోస్తీ చేస్తూ, కౌగిలింతలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటివి చంద్రబాబుకు కొత్త కాదన్నారు. వాజ్‌పేయ్‌తో చేతులు కలిపి మోసం చేశారని, మోదీతో జట్టుకట్టి మోసం చేశారని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌తో జత కలిశారని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ పార్టీ స్థాయి నుంచి ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాయికి పడిపోయిందన్నారు. పార్టీ ద్వారా పదవులు సంపాదించుకుంటున్నారని, అవినీతి చేసి లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, బావమరిది బాలకృష్ణ, బావమరిది చిన్న అల్లుడితోపాటు ఆ కుటుంబం నుంచి ఇంకెంత మంది పోటీ చేస్తున్నారో తనకు తెలియదని పీయూష్ గోయెల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిగినా చంద్రబాబు భయపడుతున్నారంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చని చెప్పారు. దేశ భద్రతను కాపాడే ప్రభుత్వం అవసరమని, నరేంద్ర మోదీతోనే ఇది సాధ్యమని పునరుద్ఘాటించారు. ఏపీలో అవినీతి రహిత పాలనకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం 2016 అక్టోబర్ 24న అరుణ్ జైట్లీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖ ఎన్ని హామీలు అమలు చేశావు బాబూ: కన్నా రాష్ట్రంలో గత ఐదేళ్లలో తాను చేసింది ఏమిటో చెప్పుకోలేక సీఎం చంద్రబాబు రోజూ ఎవరో ఒకరిని తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన ప్యాలెస్‌ను హైదరాబాద్‌లో నిర్మించుకొని, ఇంకెవరినో హైదరాబాద్‌లో ఉంటున్నారని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పీయూష్ గోయెల్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ఐవైఆర్ కృష్ణారావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్, సహ ఇన్చార్జి సునీల్ దియోధర్, కేంద్ర సంఘటనా కార్యదర్వి సతీష్జీ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, దాసరి శ్రీనివాస్, విజయబాబు, తురగా నాగభూషణం, సుధీష్ రాంబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
‘హోదాకు ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా తీసుకుంటాం’
-
ఇప్పుడు ఫరూఖ్ అబ్దుల్లాను తీసుకొస్తే ఓట్లు వేస్తారా?
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చిన తీసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్యాకేజీ కావాలని గోల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని హోదా అని నాటకాలు ఆడితే ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తామంటే..నిరసనలు చేయమని చెబుతారా అని మండిపడ్డారు. టీడీపీ నిరసనలకి ప్రజలు ఎవరు రాలేదన్నారు. హోదాకు పక్కరాష్ట్రాలు మద్దతు ఇస్తే తప్పేంటేని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వంతోనే వైఎస్సార్సీపీ కలిసి వెళ్తుందని స్పష్టం చేశారు. ‘ప్రత్యేక హోదా మీకు(చంద్రబాబు నాయుడు) అవసరం లేదేమో కానీ.. మాకు మా రాష్ట్ర ప్రజలకు హోదా అవసరం. మీరు(చంద్రబాబు), మీ కొడుకు(లోకేష్) నల్ల చొక్కాలు వేసుకుంటే అది హోదా కోసం పోరాటం చేసినట్లా? నాలుగేళ్లు మతతత్వ బీజేపీ పార్టీతో జత కట్టి ముస్లింల మనోభావాలు దెబ్బతీసి..ఇప్పుడు ఫరూఖ్ అబ్దుల్లాను తీసుకొస్తే ముస్లింలు ఓట్లు వేస్తారనుకోవడం చంద్రబాబు భ్రమ. ఇకనైనా ఈ జిమ్మిక్కులు ఆపండి. దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి చేసారో శ్వేతపత్రం విడుదల చేసి దానిపై ప్రచారానికి వెళ్లండి. అంతే కానీ రాజకీయాలు మాట్లాడి ప్రజలని మభ్య పెట్టి, ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించకండి’ అని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని, సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడమే వైఎస్సార్సీపీ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. -
నీతిమంతులకు ఓట్లు వేయండి: చలసాని
ఏలూరు: నీతిమంతులకు ఓట్లు వేయాలని, అవసరం అయితే స్వతంత్ర్యంగా పోటీ చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చలసాని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. వేల సంవత్సరాల విశిష్టత కలిగిన హేలాపురి(ఏలూరు)లో ప్రజలను చైతన్యం చేయడానికే వచ్చామన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం, నయవంచన చేస్తే అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. ఎవరూ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని కోరారు.1200 మంది విద్యుత్ ఉద్యోగులను హింసించింది ఎవరని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసులు వేయించారని తెలిపారు. తెలుగు జాతి సమైక్యత, భావజాల సమైక్యతగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే వారిలో ఒక్కరూ కేంద్ర మంత్రి లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రా ద్రోహులను ఢిల్లీకి పంపడం వల్ల ఏపీకి ఈ గతి పట్టిందన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ఓటర్లు ప్రశ్నించాలన్నారు. అవినీతి పరులను ఎన్నుకోవద్దని సూచన చేశారు. -
తాడిపత్రి బహిరంగ సభలో వైఎస్ జగన్
-
కేసీఆర్ వెయ్యి కోట్లు ఇవ్వడం చంద్రబాబు చూశారా?
సాక్షి, తాడిపత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనే అసత్య ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మద్దతిచ్చింది వైఎస్సార్సీపీకా లేక ప్రత్యేక హోదాకా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నిలదీశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చాడని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం చంద్రబాబు చూశారా నిలదీశారు. కేసీఆర్ చంద్రబాబుకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా అని ప్రశ్నించారు. నిసిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ రాకతో తాడిపత్రి జనసంద్రంగా మారింది. మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా అక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర జరిగినప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలు గుర్తున్నాయి. కరువు వచ్చినప్పటికీ రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్లుగా ఎలాంటి సాయం అందించడం లేదు. కొద్దో గొప్పో పంట పండిచిన దానికి గిట్టుబాటు ధర ఉండదు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే చాగల్లు ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే జరగలేదు. నాన్నగారి హయంలోనే హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపే ఆనకట్టు పనులు 55 శాతం పూర్తైతే.. ఈ ఐదేళ్లలో మిగిలిన 45 శాతం పూర్తికాలేదు. పెండేకల్లు ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ హయంలో యూనిట్ కరెంట్ ఛార్జీ 3.70 రూపాయలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ. 8.70కి పెరిగింది. కరెంట్ ఛార్జీల పెరుగుదలతో గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీని ద్వారా 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. మీ ప్రతి కష్టాన్ని నేను విన్నాను.. మీకు నేనున్నానని మాట ఇస్తున్నాను. అంతా అసత్యపు ప్రచారం.. చంద్రబాబు నాయుడు పార్టనర్, ఓ యాక్టర్ ఉన్నారు.. ఆయన ఎమంటున్నారో వింటున్నారు. చంద్రబాబు నాయుడు కొత్త పార్టీలు పుట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలిన కండువాలు, గుర్తులు ఇప్పిస్తారు. వీరందరు కూడా రోజు ఏమి మాట్లాడుతున్నారో మీ అందరికి తెలుసు. రోజంతా వీరు అనేది ఒకటే జగన్.. జగన్.. జగన్... దీనికి ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే పండ్లు ఉన్న చెట్టు మీదే రాళ్లు పడతాయనే సామెత గుర్తొస్తోంది. మనం గెలుస్తామని వారికి తెలుసు కాబట్టే ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించినా విషయాన్ని గుర్తులేదా? కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధులు సాధించుకునేలా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేపడుతుంటే.. చంద్రబాబు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తారు. పక్క రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపితే.. చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతారు. గతంలో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టనర్ కేసీఆర్‌ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుతెచ్చుకోవాలి. ఓట్లకు కోట్లతో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి వచ్చారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్లను బెదిరింపులకు గురిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కేసీఆర్ బెదిరించారా?. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆస్తులను ఏమైనా కేసీఆర్ లాక్కున్నారా?. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే జ్ఞానం లేకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో ఉన్న మన ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. రోజుకో కట్టుకథ తాను చేసిన అభివృద్దిని చూపి ఓట్లు అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. వైఎస్ జగన్ అధికారంలో వస్తే ఏదో జరుగుతోందని కట్టుకథలు చెబుతున్నారు. ఓ రోజు తెలంగాణ అంటాడు. మరో రోజు తానే మా చినాన్న చంపించి.. దాన్ని ఎల్లో మీడియా ద్వారా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నది చంద్రబాబు పోలీసులే.. ఇలా చేస్తే న్యాయం జరుగుతుందా?. చంద్రబాబు కుట్రలను ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డిని, ఎంపీ అభ్యర్థి రంగయ్యను ఆశీర్వదించాల్సింది’గా కోరారు. -
ఆ స్వరం...హోదాగ్ని రగిలించిన భాస్వరం
అదరకుండా... బెదరకుండా... దారుణ నిర్బంధానికి ఎదురొడ్డి... రీతి లేని సర్కారును నిలదీస్తూ... ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకగా... హోదానే హద్దంటూ ఎలుగెత్తి నినదిస్తూ... దీక్షబూని సాగుతూ... సింహంలా గర్జిస్తూ... పౌరుషాగ్ని రగిలిస్తూ... నిశ్చయంగా, నిర్భయంగా జనాకాంక్షను చాటారు వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఈ అలుపెరగని పోరులో ఎన్నో ఆటంకాలు.... అంతకుమించి తెరవెనుక కుయుక్తులు... వీటిని తట్టుకుంటూనే ఉద్యమ వేడి రగిలించారు... ఆ క్రమం ఎలా సాగిందంటే....! సాక్షి, అమరావతి : ఉక్కుపాదం మోపితే మొక్కవోని దీక్షతో బదులిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేస్తే.. ఇది మాకు జీవన్మరణం అంటూ గళమెత్తుతూ ప్రత్యేక హోదా కోసం ఐదేళ్లు పట్టువదలకుండా సమరం సాగించారు.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనని ఆయన మొదటినుంచి నమ్మారు. పోరాటాల ద్వారానే దానిని సాధించగలమని విశ్వసించారు. ఈ దిశగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువభేరి సదస్సులు నిర్వహించి హోదా ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అణచిచేయాలని చంద్రబాబు సర్కారు అడుగడుగునా ప్రయత్నించినా తదేక దీక్షతో ముందుకెళ్లారు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు తన కేసుల కోసం హోదాను తాకట్టు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. హోదా కంటే ప్యాకేజీనే ముద్దంటూ ముఖ్యమంత్రి తలూపినా, జగన్ మాత్రం జనాన్ని ఏకం చేసి ఉద్యమ వేడిని రగిలించారు. చిట్టచివరగా ఎంపీల రాజీనామాస్త్రాలు, ఏపీ భవన్లో దీక్షలు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం యావత్ దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. హోదా ఊపిరిగా ఆంధ్ర ప్రజలు రణనినాదానికి సిద్ధమయ్యేలా చేయడం చంద్రబాబు వెన్నులోనూ చలి పుట్టించింది. హోదా సమర హోరు సజీవంగా నిలబెట్టిన జగన్ ఐదేళ్ల పోరాట చరిత్ర ఏ ఊరెళ్లినా ప్రజలు గుర్తుచేస్తున్నారు. విభజన నాటి నుంచే... రాష్ట్ర విభజన తర్వాత నుంచే జగన్ హోదా కోసం ఢిల్లీపై ఒత్తిడి తేవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన 9 నెలల్లోపే అంటే 2015 మార్చి 30న తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 2017 మే 10న మరోసారి హోదా కోసం మరోసారి విన్నవించారు. 2015 జూన్ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయినా, 2016 ఏప్రిల్ 26న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వెళ్లినా జగన్ స్వరంలో హోదా నినాదమే మార్మోగింది. రాష్ట్రంలో టీడీపీని గుప్పిట పెట్టుకున్న ఎన్డీఏ సర్కారు... హోదాపై కదలకపోవడాన్ని కూడా వైసీపీ నిలదీసింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు మూడుసార్లు (జూన్ 9, 2015, ఫిబ్రవరి 23, 2016, ఆగస్టు 8, 2016) వెళ్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యువభేరిలో ప్రసంగిస్తున్న జగన్ కదిలించిన ఆందోళనలు... హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుక్షణం పోరాడుతూనే ఉంది. ధర్నాలు, ఆందోళనలతో దద్దరిల్లేలా చేసింది. హోదా ప్రయోజనాలేంటో ఇంటింటికీ చెప్పగలిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన ఆరు నెలల్లోపే... అంటే 2014 డిసెంబర్ 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు తొలిసారిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. విశాఖలో జరిగిన ధర్నాలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. 2015 జూన్ 3న మంగళగిరిలో రెండు రోజుల సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీలో తొలిసారిగా జగన్ ఒక రోజు ధర్నా చేపట్టారు. ఆగస్టు 29న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న వేళ రాష్ట్ర ఆకాంక్షను గ్రహిస్తారని... విపక్ష నేత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 2015 అక్టోబర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కానీ, ఏడో రోజున రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేసింది. అనంతరం జగన్ పిలుపుతో అక్టోబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేశాయి. మలిదశ పోరులో భాగంగా 2016, మే 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు. కాకినాడలో జరిగిన నిరసనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టు 2న, సెప్టెంబర్ 10న రాష్ట్ర బంద్ నిర్వహించారు. హోదా అవసరం గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్న వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలు హోదా కోసం పదవుల త్యాగం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు పార్లమెంటులో జరిగిన చర్చల్లో హోదా ఆకాంక్షను గట్టిగా వెలిబుచ్చారు. 2014 జూన్ 12న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో హోదా ఇవ్వాల్సిందేనన్నారు. 2015 ఫిబ్రవరి 16న బడ్జెట్‌పై జరిగిన చర్చల్లోనూ ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు. 2016 జూలై 23న ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రతిపాదించారు. 2017 మార్చిలో మరోసారి ప్రైవేటు బిల్లు పెట్టారు. 2017 మార్చి 28న ఎన్‌ఐటీపై, 30న ఆర్థిక బిల్లుపై, ఏప్రిల్ 6న జీఎస్టీపై జరిగిన చర్చల్లో హోదాను డిమాండ్ చేశారు. జూలైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అంశం లేవనెత్తారు. ఆఖరుకు హోదా ఇవ్వని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్సార్సీపీ ఎంపీలు, కేంద్రాన్ని కదిలించేందుకు తమ పదవులకే రాజీనామా చేశారు. ఏపీ భవన్ సాక్షిగా ఆమరణ దీక్ష చేశారు. జాతీయ స్థాయిలో చలనం అటు ఎన్నికల్లో బీజేపీతో, ఇటు ప్రభుత్వంలో ఎన్డీఏతో అంటకాగిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు స్వప్రయోజనాలే చూసుకున్నారు. రాష్ట్రానికి హోదా తెచ్చేందుకు ఏనాడూ కృషి చేయలేదు. ఈ నేపథ్యంలో జగన్ 2018 మార్చి ఒకటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. కలెక్టరేట్ల ముట్టడితో హడలెత్తించారు. ఆయన పిలుపుతో మార్చి 5న ఢిల్లీలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. జగన్ సూచనల మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మార్చి 15న అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలని అన్ని పార్టీల నేతలకు జగన్ లేఖలు రాశారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు హోదా పోరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశారు. కానీ సభ సజావుగా లేదన్న సాకుతో స్పీకర్ అవిశ్వాస నోటీసులను అనుమతించలేదు. ఈ తంతు ఏప్రిల్ 6 వరకు కొనసాగింది. ప్రతి రోజూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, సభలో గందరగోళాన్ని సాకుగా చూపుతూ స్పీకర్ వాయిదా వేయడం షరామామూలుగా మారింది. వైఎస్సార్సీపీ ఎంపీలు మొత్తం 13 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. చివరికి చర్చ జరగకుండానే సభ నిరవధికంగా వాయిదా పడడంతో ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. యువతను పరుగులు పెట్టించి.. ‘హోదా ఎందుకు దండుగ... ప్యాకేజీ ఉండగ’ అధికార తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లు ఇదే ప్రచారం చేసింది. హోదా ప్రయోజనాలపై యువతను పక్కదారి పట్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే... ముఖ్యమంత్రి మాయోపాయం నుంచి యువతను ఉద్యమబాట పట్టించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వాటంతటవే తరలివస్తాయని జగన్ యువతకు తెలిసేలా వివరించారు. ముఖ్య పట్టణాలన్నిటిలోనూ యువభేరి సదస్సులు నిర్వహించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను పంపితే అరెస్టులు చేయిస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. పీడీ యాక్టులు పెడతామన్నారు. అయినా వెరవక యువత భారీ స్థాయిలో యువభేరి సదస్సులకు పోటెత్తింది. సజీవంగా నిలిపింది జగనే ఒక్కరే... రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, పెట్టుబడులు కావాలన్నా.. ప్రత్యేక హోదాతోనే సాధ్యమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇందుకోసం పోరాటాలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచింది ఆయన ఒక్కరే. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఢిల్లీలో నిరాహార దీక్షలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రజలను నిలువునా ముంచేశాయి. చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్ తీసుకుని హోదా కావాలి అంటున్నారంటే దానికి కారణం వైఎస్ జగనే. రాష్ట్రానికి హోదా కావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. – పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరు మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రమే. అప్పుడు, ఇప్పుడు ఒకే మాట మీద ఉన్న నాయకుడాయన. హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పదవులను కూడా త్యాగం చేశారు. చంద్రబాబు హోదా వద్దని, ప్యాకేజీయే ముద్దని పలుమార్లు మాటలు మార్చి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరు. – వలేటి శ్రీనివాసరావు, గంగవరం, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా -
హోదాను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు
-
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రత్యేక హోదా ఇస్తాం
సాక్షి, తిరుపతి/తిరుమల: ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. ప్రత్యేక హోదాను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకున్న సందర్భంగా తారకరామ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో హామీలిచ్చారని, ఒక్కటి కూడా అమలు చేయలేదని, అవన్నీ అబద్ధపు హామీలేనని మండిపడ్డారు. మంచిరోజులు తీసుకొస్తానని చెప్పి రాఫెల్ యుద్ధ విమానాల్లో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రిని కాదు, కాపలాదారుడినని చెప్పుకుంటూ చివరకు దొంగయ్యాడని మోదీపై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాటపై నిలబడడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతన్నారు. ప్రధాని మోదీ సిగ్గుపడాలి ‘‘40 మంది భారత జవాన్లు ఉగ్రదాడిలో చనిపోయి రక్తపు మడుగులో పడివుంటే.. ప్రధానమంత్రి మోదీ తన సెల్ఫ్ సినిమా షూటింగ్లో మూడున్నర గంటలు గడిపారు. ఇలాంటి వ్యక్తులు దేశ భక్తులా? మరణించిన జవాన్ల కుటుంబాల్ని ఓదార్చాలన్న స్పృహ కూడా లేని వ్యక్తి మోదీ. దేశంకోసం ప్రాణం వదిలిన సైనికుల కుటుంబాల వేదన ఆయనకు పట్టలేదు. సైనికుల సంతాప సమయంలోనూ మోదీ చిరునవ్వుతోనే కనిపించారు. ఇది ఆయన సిగ్గుపడాల్సిన విషయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆయన సిగ్గుపడాలి. హోదా కోసం ఎవరూ ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మేము హోదా ఇచ్చితీరుతాం. ఇది మా భరోసా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తాం’’ అని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కారు ‘‘కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ అమలు చేసింది. కూలీలు వలసలు వెళ్లకుండా ఉండడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. రైతులకు మేలు చేసేలా భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రూ.లక్ష విలువ చేసే భూమికి రూ.4 లక్షలు ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కారు. ఒకే రోజులో రూ.75 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. నరేంద్ర మోదీ సూటుబూటు వేసుకున్నవారి రూ.3.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారే తప్ప రైతుల రుణాలను మాఫీ చేయలేదు. నాపై రాష్ట్రం చూపిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. అందుకే మరోసారి భరోసా ఇస్తున్నా. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి తీరుతాం’’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఊమెన్‌చాందీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, మాజీ ఎంపీలు కనుమూరి బాపిరాజు, టి.సుబ్బరామిరెడ్డి, చింతామోహన్ తదితరులు పాల్గొన్నారు. సభకు జనం కరువు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించారు. తెరచాటుగా తెలుగుదేశం పార్టీ సహకారం కూడా తీసుకున్నారు. తిరుపతిలో జరిగే కాంగ్రెస్ సభకు జనాన్ని తరలించాలని సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలిచ్చారు. రెండు పార్టీల నేతలు జన సమీకరణకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 చొప్పున ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. 30 వేల మందితో సభ నిర్వహించాలని భావించినా.. 5 వేల మంది కూడా హాజరు కాకపోవటం రాహుల్‌ను నిరుత్సాహానికి గురిచేసింది. ఆయన తన ప్రసంగాన్ని కుదించి హడావుడిగా ముగించి ఢిల్లీ వెళ్లిపోవడం గమనార్హం. శ్రీవారిని దర్శించుకున్న రాహుల్‌గాంధీ ఇదిలా ఉండగా, రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన కాలినడకన తిరుపతిలో 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒకటిన్నరకు తిరుమల చేరుకున్నారు. మేనల్లుడు రైహాన్ వాద్రాతో కలిసి నడిచారు. వడివడిగా మెట్లు ఎక్కుతూ గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని 3.13 గంటలకు వైకుంఠం–1 ద్వారా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు రాహుల్‌గాంధీకి శ్రీవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ: రఘువీరారెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రానికి హోదా ఇస్తారని చెప్పారు. -
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హోదా ఇస్తాం
-
శివాజీ నిజస్వరూపం బట్టబయలు
న్యూఢిల్లీ: ‘చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికో, వారి పార్టీకి సపోర్ట్ చేయడానికో నేను ఇక్కడకు రాలేదు. వీళ్లందరి కన్నా ఆంధ్రప్రదేశ్ నాకు ముఖ్యమ’ని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం టీడీపీ నిర్వహించిన ధర్మాపోరాట దీక్షలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి చెందనివాడినని చెప్పుకుంటూనే మా బాబు మహోన్నతుడు అంటూ స్తోత్రం చేశారు. పచ్చ పార్టీ అధినేతను మించినవారు లేరని ప్రశంసలు కురిపించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతానంటూ వేదికనెక్కి చంద్రబాబు, లోకేశ్బాబులను ఆకాశానికెత్తారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టిన ఈ ‘మహానటుడు’ చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారని ఢిల్లీ వేదికగా మరోసారి రుజువైంది. బాబు దృష్టిలో పడేందుకు ప్రధాని, ఇతర నాయకులపై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ఒక్కరే హోదా కోసం పోరాడుతున్నారంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా శివాజీకి కనబడకపోవడం విడ్డూరం. (చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’) నాలుగు రోజులుగా హడావుడి చేస్తున్న చంద్రబాబుకే జై కొడుతూ తాను టీడీపీ గూటి చిలకనేనని రుజువు చేసుకున్నారు శివాజీ. పైకి మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు చేతిలో చేయి వేసి నడుస్తారు. ఆయనతో పాటు వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారు. బాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెబుతారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధిస్తామని దీమా వ్యక్తం చేస్తారు. చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి రాకపోతే ఈ మాటలన్నీ ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తారు. నిజ జీవితంలోనూ నటిస్తున్న శివాజీ నిజస్వరూపం బట్టబయలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ప్రభుత్వ కోరిక మేరకే.. ప్యాకేజీలో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిందని, రాష్ట్రం కోరిన మీదటే ప్రత్యేక ప్యాకేజీలో పలు మార్పులు చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఒప్పుకుంది? ప్యాకేజీకి ఒప్పుకోవడానికి ఏ కారణాలు చెప్పింది? ప్యాకేజీని అంగీకరించాక ఈ ప్యాకేజీని సస్పెండ్ చేయాలని గానీ, తొలగించాలని గానీ, రద్దు చేయాలని గానీ, నిలుపుదల చేయాలని గానీ కోరిందా? అందుకు కారణాలు ఏం చెప్పింది? ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయడంపై ప్రస్తుత స్థితి ఏంటి?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి గోయల్ సమాధానం ఇచ్చారు. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం ప్రత్యేక హోదా ఉనికిలో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణలో నిబంధనల మేరకు నీతి ఆయోగ్ ఏపీ అభివృద్ధికి నివేదిక సమర్పించింది. ఈ సిఫారసుల మేరకు ప్రత్యేక హోదాకు దీటుగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2016, అక్టోబర్ 24న సీఎం చంద్రబాబు లేఖ ద్వారా ప్యాకేజీని సమ్మతించారు. తదుపరి కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిన సందర్భంలోనూ 2017, మే 2న కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు. ప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఐదు ప్రధాన మార్పులను మంత్రి వివరించారు. -
ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?
సాక్షి, హైదరాబాద్ : దేశరాజధానిలో ధర్మపోరాట దీక్షతో సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, తెలుగు తమ్ముళ్లపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. గత నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘నవనిర్మాణ దీక్షలు’ చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్‌తో జతకట్టి అదే బీజేపీపై ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని, జస్ట్ పార్టీలు అటు ఇటు మారాయి కానీ చంద్రబాబు ధోరణి మాత్రం మారలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు చేసిన దీక్షలతో రాష్ట్రానికి, జనాలకు ఒరిగిందేమి లేదని, అనవసరంగా ప్రజాధనం వృథా తప్ప.. ఎలాంటి ప్రయోజనం లేదని నిట్టూరుస్తున్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో తానా అంటే తందాన అన్నట్టు వ్యవహరించిన చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు హోదాపై యూటర్న్ తీసుకొని..దీక్షల పేరిట హడావిడి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. (చదవండి : చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’) పోనీ ఆ దీక్షనైనా సరిగ్గా చేస్తున్నారా అంటే అది లేదని, అది ధర్మపోరాటం లెక్క లేదని సెల్ఫీల కోసం ఆరాటంలా ఉందని కామెంట్ చేస్తున్నారు. నల్ల దుస్తులేసుకొని ఫొటోలకు పొజివ్వడం తప్ప.. తెలుగు తమ్ముళ్లలో చిత్తశుద్ధి కనిపించడం లేదంటున్నారు. నిజంగా ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేయాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఆంధ్రా ప్రజల ఆవేదన బలంగా కేంద్రానికి వినిపించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేసిన ప్రతీ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆనాడే చిత్తశుద్ధితో హోదా పోరాటంలో ప్రతిపక్ష పార్టీతో కలిసి వస్తే.. హోదా వచ్చి ఉండేదని, హోదా రాకపోవడానికి చంద్రబాబు, టీడీపీయే కారణమని మండిపడుతున్నారు. అప్పుడు ప్యాకేజీయే ముద్దు.. హోదా సంజీవినా? ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని ఊదరగొట్టిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో వెన్నులో వణుకుపుట్టి.. ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతోందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. పోనీ ఆ పోరాటమైనా.. కొత్తగా చేస్తున్నారా అంటే అది లేదని, ప్రతిపక్ష నేత గత నాలుగేళ్లుగా హోదా కోసం చేసిన ఒక్కో కార్యక్రమాన్ని ఎన్నికల ముందు బాబుగారు కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా బాబూ.. ఈ పోరాటాలతో ఒరిగేది ఏం లేదని, తమ డబ్బులు అనవసరంగా తగలెయ్యవద్దని వేడుకుంటున్నారు. (చదవండి: అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా?) తూ మీ బ్రతుకు చెడ..... pic.twitter.com/tgbprO5Tzy — Akshithguptha (@akshithguptha) February 11, 2019 pic.twitter.com/hZFCusB5wF — vishnu var (@vishnu966609) February 11, 2019 pic.twitter.com/q0rBI9db0u — A.Murali Mohan (@muralicherry) February 11, 2019 రాబోయే ఎన్నికల రోజుల్లో ఓటమి భయంతోనే దేశ వ్యాప్తంగా ప్రజల్లో సానుభూతి కోసం. చేసిన అసంతృప్తి పాలన, రాష్ట్రం లోని ప్రజల వ్యతిరేకతను కప్పిపుచ్చటానికి, ఢిల్లీ దేశరాజకీయాలు అంటూ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేస్తున్నారు. పచ్చ పార్టీ నాయకులకు మరియు దౌర్భాగ్య AP CM చంద్రబాబు గారు 😭😭😭 — shaik mabu shareef (@shaikmabushare6) February 11, 2019 దీక్ష చేస్థామని వెల్లి భజన చెస్తున్నారెంటి స్వామి? దీనికి 100 కోట్లు ప్రజల సొమ్ము బొక్క. అదేదొ ఇక్కడకె వాల్లని రమ్మనివుంటె సరిపొయెదిగదా? @JanaSenaParty @YSRCParty — PROUDINDIAN (@PROUDIN93059145) February 11, 2019 Adhi yenti 6 months back Rahul gandhi special status meedha saba pedithe mee party vaalu nalla zenda laa tho goback annaru eppudu delhi velli malla adhe rahul tho draamalu.. Mee vesaalu chusi ఉసారవిల్లి కుడ సిగ్గు పడతాది pic.twitter.com/pSCowb136p — siva (@siva198001) February 11, 2019 pic.twitter.com/oVivUHORDE — Kondal Chary R (@chary081) February 12, 2019 అరేయ్ ఆంబోతు పంది తిన్నట్టు తినడం కాదు ఇక్కడ దేకు pic.twitter.com/ZarJAL2ugz — BANDLA GANESH (@MzqbsBomFfNVOGL) February 12, 2019 -
చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ‘నారా’వారి నాటకం కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన నారా బాబు నేడు హస్తిన నడివీధుల్లో వేస్తున్న నాటకాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. ‘నవ్వి పోదురు నాకేటి సిగ్గు’ తరహాలో చంద్రబాబు సాగిస్తున్న శీలహీన రాజకీయాల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోదీతో అంటకాగినప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. కేంద్ర సర్కారులో టీడీపీ కొనసాగినప్పుడు ఏం చేశారని సూటిగా అడుగుతున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదా ఊసెత్తని ఏపీ సీఎం ఇప్పుడు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదా జపం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో నడిపించిన డ్రామాను ఢిల్లీ వీధులకు చేర్చారు. ధర్మాట పోరాట దీక్ష పేరుతో వందిమాగధులను హస్తినకు తరలించి బలప్రదర్శనకు దిగారు. ప్రజలు గమనిస్తున్నారన్న కనీసం విచక్షణ కూడా లేకుండా పచ్చ మీడియా అండతో ప్రత్యేక హోదా అంశాన్ని హైజాక్ చేసేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేసేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వడానికి చంద్రబాబు చేసిన స్టంట్ జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పని ఎప్పుడో చేశారు. అంతేకాదు పలుమార్లు రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖలు రాశారు. ఏకంగా తమ పార్టీ చెందిన లోక్‌సభ ఎంపీలతో రాజీనామా చేయించి దేశమంతా ప్రత్యేక హోదా గురించి చర్చింకునేలా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా చేసిన రాజీలేని పోరాటం దేశం యావత్తు పరికించింది. నిరాహారదీక్షలు, యువభేరిలు, ధర్నాలతో హోదా ఉద్యమాన్ని జననేత ఉరకలెత్తించారు. ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేస్తామని ఆనాడే జగన్ ప్రకటించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటిదాకా ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని హోదా రాగం అందుకున్నారు. జగన్ గతంలో చేసేసిన కార్యక్రమాలను ఇప్పుడు హడావుడిగా మొదలు పెట్టి తన దుర్బద్ధిని చాటుకున్నారు. అంతేకాదు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాపీ రాయుడి అవతారం ఎత్తేశారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ఆదరాబాదరా అమలు చేసేసి ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. టక్కుటమారాలతో ప్రజలను తక్కువ అంచనా వేస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదంటున్నారు విశ్లేషకులు. -
డ్రామా సేమ్.. యాక్టర్స్ ఛేంజ్!
-
హోదా పేరుతో చంద్రబాబు డ్రామా : ఆనం
సాక్షి, నెల్లూరు : ప్రత్యేక హోదా సంజీవని కాదని , హోదా కలిగిన రాష్ట్రాలు ఏం సాధించాయని గతంలో ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు నల్లదుస్తులతో ఢిల్లీలో హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ప్యాకేజీతోనే ప్రయోజనమని చెప్పి కమీషన్ల కోసం కక్కుర్తిపడిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహారదీక్ష చేస్తుంటే మోదీ అమరావతికి వస్తున్నారని దీక్షను భగ్నం చేశారన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు బుడబుక్కల జాతరలాగా ఢిల్లీలో హోదా పేరుతో హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర సమస్యలను మాత్రం ప్రస్తావించలేదు. హౌసింగ్ స్కీం పెద్ద స్కామ్ అనీ, ఇందులో మంత్రి నారయణ దళారీ కాగా, లోకేష్‌కు వాటాలు దక్కుతున్నాయని ఆనం ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్ బాటలోకి వచ్చిన చంద్రబాబు
-
ఐ వాన్నా ఫాలోఫాలో ఫాలో యూ.!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతా అంటున్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే నవరత్నాలను కాపీ కొట్టి సరిగ్గా ఎన్నికల ముందు అమలు పేరిట హడావిడి చేస్తున్న సీఎం సారు.. ప్రత్యేక హోదా పోరాట విషయంలోనూ ప్రతిపక్ష నేతనే అనుసరిస్తున్నారు. నాలుగేళ్లు కేంద్రం ప్రభుత్వంతో అంటకాగి హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు.. హోదాతో ఏం వస్తుందని దబాయించిన చంద్రబాబు.. హోదా కోసం వైఎస్సార్సీపీ ఉవ్వెత్తున ఉద్యమించడంతో యూటర్న్ తీసుకున్నారు. హోదా విషయంలో యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్న ఆయన సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ ప్రశ్నించి.. ప్యాకేజీతోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని బుకాయించిన చంద్రబాబే.. తాజాగా సభలో నల్లచొక్కాలతో నిరసన కాన్సెప్ట్‌ను కూడా కాపీ కొట్టారు. హోదా కోసం గతంలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనేకసార్లు నల్లచొక్కాలతో సభలో నిరసన తెలుపుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రతివిషయంలో ‘ఐ వాన్నా ఫాలో ఫాలో యూ జగన్’ అన్నట్టుగా సాగుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు వేస్తున్న ఈ వేషాలను నమ్మబోమని ప్రజలు అంటున్నారు. -
వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు
-
బడ్జెట్‌పై విజయసాయి రెడ్డి అసంతృప్తి
-
బడ్జెట్‌పై విజయసాయి రెడ్డి అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో శుక్రవారం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. బడ్జెట్ సమావేశం అనంతర పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావనే లేదు. పోలవరానికి అదనపు నిధులు ప్రకటించలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోవడం బాధకరమ’ని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. -
గత నాలుగేళ్లుగా బడ్జెట్లో ఏపీకి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంలో సీఎం చంద్రబాబు నాయుడు పాపం కూడా ఉందని విమర్శించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినదించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏపీకి చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి చేసిన అన్యాయానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ చంద్రబాబు కొత్త పాట బందుల వల్ల రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని గతంలో చంద్రబాబు ప్రకటనలు చేశారని.. కానీ ఈ రోజు ఆయన బందుకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈవీఎంలు వద్దని చంద్రబాబు కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ పార్టీ కూడా తిరిగి బ్యాలెట్లు కావాలని కోరలేదని, ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఏమైనా అనుమానాలు కలిగినప్పుడు మాత్రమే వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరారని తెలిపారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తిరోగమనంలో ప్రయణిస్తున్నారని, అభివృద్దికి నిరోధకులుగా మారుతున్నారని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.