గోవాడ సుగర్స్‌లో క్రషింగ్‌కు అంతరాయం
చోడవరం : గోవాడ సుగర్స్ క్రషింగ్‌కు ఆదిలోనే అంతరాయం కలిగింది. బాయిలర్‌కు కావలసిన నంత బెగాస్ లేకపోవడంతో 24గంటల పాటు క్రషింగ్ నిలిచిపోయింది. తిరిగి సోమవారం సాయంత్రం క్రషింగ్ ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులు, కార్మికుల సమ్మెలతో ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించడమే ఆలస్యంగా జరిగింది. రోజువారీ క్రషింగ్ 2500 టన్నులకు జరుగుతుందని, అంతా బాగుందనే సమయంలో బెగాస్ కొరత ఏర్పడింది. గత సీజన్‌కు సంబంధించిన బెగాస్ కొంత ఉండడంతో క్రషింగ్, కో జనరేషన్ ఒకేసారి ప్రారంభించిన యాజమాన్యం అందుకు తగ్గట్టుగా కావలసినంత బెగాస్ సమకూర్చుకోకపోవడంతో రెగ్యులర్ క్రషింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఫ్యాక్టరీకి గేటు, కాటాల నుంచి పెద్దసంఖ్యలో చెరకు సరఫరా అయిపోవడంతో ఫ్యాక్టరీ వద్ద రెండు యార్డులు చెరకు బళ్లతో నిలిచిపోయాయి. బాయిలర్ ఆగిపోవడం వల్ల క్రషింగ్ జరగక చెరకు బళ్లతో ఫ్యాక్టరీ ఆవరణ అంతా నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, టిల్లర్లతో చెరకు తెచ్చిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వంట చెరకు, వరి ఊకను సమకూర్చి బాయిలర్‌కు అందించడంతో క్రషింగ్ తిరిగి ప్రారంభమైంది.
24గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన క్రషింగ్
బెగాస్ కొరతతో నిలిచిపోయిన బాయిలర్
Comments
Please login to add a commentAdd a comment