‘మా పరిధిలో లేని విషయం’ | Joint high court refused on sadavarthi lands issue | Sakshi
Sakshi News home page

‘మా పరిధిలో లేని విషయం’

Published Wed, Jan 24 2018 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 5:33 PM

Joint high court refused on sadavarthi lands issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత వివాదాస్పదమైన సదావర్తి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ వివాదాన్ని తమిళనాడు ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ వద్ద తేల్చు కోవాలని సూచించింది. సదావర్తి భూములపై తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న 83 ఎకరాల భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం వాటి ల్లిందని.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో గతేడాది పిల్‌ దాఖలు చేశారు. అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఇదిలా ఉండగానే వేలం వేసిన సదావర్తి సత్రం భూముల్లో తమ భూములున్నాయంటూ కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం సదావర్తి భూములు తమవేనంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement