పాతపట్నం (శ్రీకాకుళం): పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఒక పెళ్లికి బ్యాండ్ వాయించి మరొక పెళ్లికి హాజరయ్యేందుకు వ్యానులో వెళుతుండగా... డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పది మంది బ్యాండ్ బృంద సభ్యులు సహా 12 మంది గాయపడగా వారిని పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని ప్రాథమికంగా తెలుస్తోంది.
పెళ్లి బ్యాండ్ బృందం వ్యాను బోల్తా
Published Sun, May 10 2015 7:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement
Advertisement