పాలెం వోల్వో బస్సు ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు చేపట్టిన దాడులు మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగాయి.
పాలెం వోల్వో బస్సు ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు చేపట్టిన దాడులు మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగాయి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ సమీపంలో 5 పాఠశాల బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహాబూబ్నగర్ జిల్లాలో షాద్ నగర్ టోల్ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. అలాగే గుంటూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాల,కళాశాలలకు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు మంగళవారం కొరడా ఝుళిపించారు.
దాంతో 15 బస్సులను సీజ్ చేశారు. మరో 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా పాలెంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది మరణించారు. అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న ఆర్టీఏ ఆ ఘటనతో ఒక్కసారిగా ఉల్కిపాటుకు గురైంది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.