తవ్విన కొద్దీ బయట పడుతున్నాయ్..! | ACB attacks on DPO L.sridhar bank accounts | Sakshi
Sakshi News home page

తవ్విన కొద్దీ బయట పడుతున్నాయ్..!

Published Sat, Dec 5 2015 12:37 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB attacks on DPO L.sridhar bank accounts

అక్రమ ఆస్తుల కేసులో పట్టుబడిన పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి ఎల్. శ్రీధర్ బినామీ ఆస్తులపై ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన బినామీ పేరు మీద ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాకర్‌పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.


ఏలూరు రామచంద్రరావు పేటలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులు అందులోంచి బయటపడుతున్న నగలను చూసి అవాక్కయ్యారు. ఇప్పటికే లాకర్‌లోనుంచి అర కిలోకి పైగా బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఆభరణాలతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మరెన్ని లాకర్లు ఉన్నాయో, వాటిలో ఏవేం ఉన్నాయోనని ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement