
కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు
చిత్తూరు : సినీ హీరో అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం ఉదయం శిరీష్, తన స్నేహితుడితో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. కాగా స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన శిరీష్... మీడియా ప్రతినిధులకు సారీ చెప్పాడు. తెలియక అలా జరిగిందని వివరణ ఇచ్చాడు.