సాక్షి, విశాఖ : జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులకు గురవతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజనులు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. లోగిలి గెడ్డ, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ డుంబ్రిగుడ మండలంలో ఈదురు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.
ఏజెన్సీ మండలంలోని మారుమూల గ్రామాలల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా కించుమండ పంచాయతీ పరిధిలోని గిరిజనుల ఇళ్లు కూలిపోయాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడ ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నష్ట పరిహారమిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వరద కష్టాలు
Published Wed, Aug 7 2019 7:04 PM | Last Updated on Wed, Aug 7 2019 7:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment