హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు కేబినెట్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం.... ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియాను రంగంలోకి దించింది. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో రామచంద్రన్ కుంతియా ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీధర్ బాబు వ్యవహారాన్ని చక్కదిద్దే పనితో పాటు రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు బస్సుయాత్రలో ఆయన పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా రామచంద్రన్ కుంతియా మీడియాతో మాట్లాడుతూ మంత్రుల శాఖలు మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని అన్నారు. అయితే ఏ సందర్భంలో శాఖ మార్చారో తెలుసుకుంటానని, వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో శాఖల మార్పు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఎంతో పాటు, తెలంగాణ మంత్రులు, శ్రీధర్ బాబుతో సమావేశం కానున్నట్లు రామచంద్రన్ కుంతియా తెలిపారు. శాఖ మార్పుపై అసంతృప్తిగా ఉన్న శ్రీధర్ బాబు నేడు తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
అధిష్టానం దూతగా రామచంద్రన్ కుంతియా
Published Thu, Jan 2 2014 10:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement