సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మరో మూడు ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో, ల్యాబొరేటరీల నిర్వాహణాధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే..
► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయి.
► శనివారం నుంచి కడప, గుంటూరులలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
► ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం ల్యాబొరేటరీని కూడా సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం.
► ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 450 కోవిడ్–19 టెస్టులు జరుగుతుండగా, ఈ కొత్త ల్యాబులు అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 570 టెస్టులకు పెరుగుతుంది.
► స్థానికంగా టెస్టులు చేయడం వల్ల నమూనాలను తరలించేందుకు అయ్యే రవాణా వ్యయం తగ్గుతుంది.
► రవాణా సమయం కూడా తగ్గడం వల్ల తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరో మూడు కోవిడ్ ల్యాబొరేటరీలు
Published Fri, Apr 3 2020 5:03 AM | Last Updated on Fri, Apr 3 2020 5:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment