‘చంద్రబాబు కనీస మానవత్వం చూపలేదు’ | AP assembly: ys jagan mohan reddy reacts on agrigold issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కనీస మానవత్వం చూపలేదు: వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 23 2017 1:04 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

AP assembly: ys jagan mohan reddy reacts on agrigold issue


అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో వ్యవహరించాలని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సభలో అగ్రిగోల్డ్‌ అంశంపైబ ప్రకటన చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ’అగ్రిగోల్డ్‌ బాధితులు వెయ్యికళ్లతో చంద్రబాబు ప్రకటనపై ఆశగా ఎదురుచూశారు. కానీ ఆయన కనీస మానవత్వం కూడా చూపలేదు. 1,182 కోట్లు ఇస్తే 13లక్షల 83వేలమందికి న్యాయం జరుగుతుంది.

మేం వాయిదా తీర్మానం ఇచ్చాకే ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాగే అగ్రిగోల్డ్‌ డిపాజిటరల్లతో పాటు, బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి. అరెస్ట్‌ల విషయంలోనూ పక్షపాతం చూపారు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తో పాటు ఆయన సోదరుడిని అరెస్ట్‌ చేసి మిగతావారి జోలికి వెళ్లలేదు. డైరెక్టర్లలో ఒకరైన సీతారాం అనే వ్యక్తిని అరెస్ట్‌ చేయలేదు. సీఐడీ విచారణ ప్రారంభించాక అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందులో మంత్రి ప్రత‍్తిపాటి పుల్లారావు సతీమణి ఉన్నారు.’  అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని... తాము కొన్న భూములు అగ్రిగోల్డ్‌కు సంబంధించినవి కావన్నారు. అగ్రిగోల్డ్‌ భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ తాను రుణమాఫీ అంశంపై మాట్లాడితే...అగ్రిగోల్డ్‌ అంశం పక్కదారి పడుతుందని అన్నారు. అందుకే దాని జోలికి పోదల్చుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదు అయ్యాకే తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్లు మంత్రి పుల్లారావే స్వయంగా అంగీకరించారన్నారు. అగ్రిగోల్డ్‌ డైరెక‍్టర్ సీతారాం తిరుపతిలోని ఓ హోటల్‌ను రూ.14కోట్లకు అమ్మారని, ఆయన భార్య పుష్పలత 31 ఎకరాలు, కుమార్తె 8 ఎకరాలు ఇటీవల విక్రయించారన్నారు.

అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మంత్రి కొన్న భూములు కొన్న దినకరన్‌... అగ్రిగోల్డ్‌ గ్రూప్‌కు చెందిన హాయ్‌లాండ్‌కు సీఈవో, డైరెక్టర్‌ అని, అయితే మంత్రి మాత్రం దినకరన్‌కు అగ్రిగోల్డ్‌ సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటున్నారన్నారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement