గర్జించిన రైతులు
Published Fri, Oct 11 2013 3:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమం విజయవంతమైంది. అన్ని మండలాల్లో రైతులు దీక్షలు చేపట్టి సమైక్య నినాదాలు వినిపించారు. తుఫాన్ సందర్భంగా కొన్ని శాఖల ఉద్యోగులు తాత్కాలికంగా విధుల్లో చేరినా మిగిలినవారు నిరాహార దీక్షలు కొనసాగించారు. సింగుపురం రైతులు జాతీయరహదారిపై ఎడ్లబళ్ల ర్యాలీ నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ కూడలి వద్ద ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. జేఏసీ ప్రతినిధులు సోనియా సమాధిని నిర్మించి సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయ కర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, దుప్పల రవీంద్ర, ధర్మాన ఉదయ్‌భాస్కర్ , అందవరపు సూరిబాబు తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.
రాజాం, రేగిడి, వంగర మండలాల్లో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి వైఎస్సార్ సీపీ పాలకొండ, రాజాం నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, పి.ఎం.జె.బాబు లు సంఘీభావం తెలిపారు.
పాలకొండలో సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరుతూ ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖలు రాశారు. సీతంపేట పీఎంఆర్‌సీలో ఏపీఓ నాగోరావు నేతృత్వంలో ప్రారంభమైన వాటర్‌షెడ్ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలనను సమైక్యవాదులు అడ్డుకున్నారు.
ఆమదాలవలస రామమందిరం సమీపంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహ నరావు, పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షలో కూర్చున్నవారికి కూన మంగమ్మ, డి.శ్యామలరావు, కె.లక్ష్మణరావు, కె.అప్పలనాయుడు, ఎస్.శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.
టెక్కలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం మండల కేంద్రాల్లో సుమారు 70 మంది రైతులు దీక్షలు చేపట్టారు. వీరికి పార్టీ నేతలు దువ్వాడ వాణి, కోత మురళీధర్, చింతడ గణపతి, కుర్మాన బాలకృష్ణ, బాడాన మురళి తదితరులు సంఘీభావం తెలిపారు. టెక్కలిలో మైన్స్, ట్రెజరీ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు.
నరసన్నపేటలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వహక పాలక మండలి సభ్యురాలు ధర్మాన పద్మ ప్రియ ఆధ్వర్యంలో రైతు గర్జన జరిగింది. దీక్షలో కూర్చున్న రైతు నాయకులు కొర్ను సత్యం, కొత్తకోట అప్పలనాయడు, వాన అప్పారావు, వాన రాజు, సోమినేని లక్ష్మీనారాయణలకు ఆమె సంఘీభావం తెలిపారు.
ఎచ్చెర్లలో ఉపాధ్యాయ జేఏసీ సంఘ సభ్యులు జాతీయ రహాదారిపై రాస్తారోకో నిర్వహించారు. బి.సుందరరావు, కె.అచ్యుతరావు, జి.దామొదరరావు, బీహెచ్ ఉమామేహ శ్వరరావు, తిరుమలరావు తదితరులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. చిలకపాలెంలో చేపట్టిన రైతు దీక్షలో బల్లాడ జనార్దనరెడ్డి, పేడాడ చిన్నాదినారాయణ, డొంక పోలయ్య, కిల్లి రఘురాం, బెవరగణేష్, డొంక భూలోకడు, బగ్గు రాజారావు, పొందూరు అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని సుభద్రాపురం జంక్షన్ వద్ద కూడా రైతు దీక్ష శిబిరం ప్రారంభించారు.
ఇచ్చాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
పాతపట్నంలో చేపట్టిన రైతు దీక్ష శిబిరంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, పరశురాంపురం సర్పంచ్ సవర లింగరాజు, ఎల్.సంజీవరావు, మండల యూత్ అధ్యక్షుడు బి.కృష్ణారావు, మా జీ సర్పంచ్ ఢిల్లీరావు, వి.సుధాకర్, శ్యాం సుం దరరావు, భుజంగరావు, రామారావు, జయకృష్ణ, సుబ్బారావు, రమణయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement