‘పొత్తుపై పునరాలోచన’
అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన పక్షంలో అప్పుడు జరిగే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే విషయంపై బీజేపీ పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధించడంపై స్పందించేందుకు ఆమెతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య, అధికార ప్రతినిధి శ్రీనివాసరాజులు విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంజాబ్ ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మీకు ప్రమాదమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. ఏపీ విషయంలో తమ జాతీయ అధ్యక్షుడు, ఇతర జాతీయ నాయకులు ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మేం మిత్రపక్ష ధర్మాన్ని కచ్చితంగా నిర్వహిస్తున్నాం. రాబోయే కాలం విషయానికి వస్తే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తమ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాం... రెండున్నర ఏళ్లుగా పలు ఎన్నికల్లో బీజేపీ సాధిస్తున్న విజయాలు, తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై జాతీయ పార్టీ దృష్టి సారించిందని పురందేశ్వరి తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని జాతీయ అధ్యక్షుడు తమకు దిశానిర్దేశం చేశారన్నారు. బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు.
కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంక్షేమ పథకాలకు సింహభాగం నిధులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని పురందేశ్వరి తెలిపారు. ఏపీలో జరగుతున్న ప్రతి ఒక్క అభివృద్ది, మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్లు, నీరు-చెట్టు కార్యక్రమాలు, పంట సంజీవని, ఉపాధి హామీ పథకాలు ఏది తీసుకున్నా వాటికి ఎక్కువ భాగం నిధులను కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కారు మిత్రపక్ష ధర్మాన్ని పాటించాలన్నా