పట్టణంలోని నెహ్రునగర్‌లో హోటల్ నిర్వహించే కుమారి రూ.10 వేలు వడ్డీకి ఇచ్చి రూ.70 ....
విలేకరులతో బాధితురాలి ఆవేదన
మాచర్ల: పట్టణంలోని నెహ్రునగర్‌లో హోటల్ నిర్వహించే కుమారి రూ.10 వేలు వడ్డీకి ఇచ్చి రూ.70 వేలు క ట్టాలని వేధిస్తోందని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని బాధితురాలు పోతునూరి వెంకటమ్మ చెప్పారు. ఆమె బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
కూలి చేసుకునే తాను నాలుగేళ్ల కిందట కుమారి వద్ద పది రూపాయల వడ్డీకి రూ.పదివేలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. రోజుకు రూ.100 చొప్పున కొంతకాలం చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత చెల్లించలేకపోవడంతో కొన్ని రోజుల కిందట తనతో రూ.70 వేలు కట్టాలని నోటు రాయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ రూ.70 వేలు కట్టాలని రోజూ కూమారి తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు.