
సాక్షి, అమరావతి: రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, సీఆర్‌డీఏ పరిధిలోని మిగిలిన గ్రామాలు, పురపాలక సంఘా లు, నగరాల పరిధిలో ఇష్టానుసారం నిర్మాణాలు చేయడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ సమావేశంలో పలు అంశాలను ఆయన సమీక్షించారు.
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించాలని, దీనికోసం కొంత భూమిని కేటాయిస్తామన్నారు. అమరావతి నిర్మాణంలో పనిచేస్తున్న కన్సల్టెంట్లతో ఈ నెలాఖరున కార్యగోష్టి నిర్వహించాలని ఆదేశించారు.కాగా అమరావతిలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు రూ.9,190 కోట్ల విలువైన పనులను చేపట్టి నట్లు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్థసారథి తెలిపారు.