
ఆర్థిక సదస్సులో పాల్గొన్న చంద్రబాబు
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వ్యవసాయంలో కొత్త ధృక్కోణం, నవీన కార్యాచరణ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
దావోస్: స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వ్యవసాయంలో కొత్త ధృక్కోణం, నవీన కార్యాచరణ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన మార్పులను చంద్రబాబు వివరించారు. భూగర్భ జలాల పెంపుదలకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, తీసుకుంటున్న చర్యలపై ప్రసంగంలో పేర్కొన్నారు.
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ఉత్తమ పద్ధతుల అధ్యయానానికి సబ్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయించింది. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అపార ఖనిజ సంపదతో పాటు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, నైపుణ్యం గల మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పెట్టుబడులు పెట్టాలంటూ ఆర్థిక సదస్సుకు హాజరైన దేశాధినేతలను చంద్రబాబు ఆహ్వానించారు.