రెండోసారి కలిసిన చంద్రబాబు, కేసీఆర్
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం రాజ్భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను తనకు ఇరువైపుల కూర్చొబెట్టుకుని వారితో గవర్నర్ చర్చలు జరిపారు.
రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. పలువురు నాయకులు, ఉన్నత అధికారులు కుటుంబ సభ్యులతో సహా విందులో పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్, డి.శ్రీనివాస్, వి. హనుమంతరావు, బండారు దత్తాత్రేయ, జయప్రకాశ్ నారాయణ, హైదరాబాద్ నగర్ మేయర్ మాజిద్ తదితరులు విందుకు హాజరయ్యారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తొలిసారిగా చంద్రబాబు, కేసీఆర్ చేతులు కలిపారు. ఇప్పుడు రెండోసారి గవర్నర్ విందులో కలుసుకున్నారు.