రైతుల్ని నమ్మించి నట్టేట ముంచిన బాబు | chandrababu naidu cheats farmers, says ysrcp leaders | Sakshi
Sakshi News home page

రైతుల్ని నమ్మించి నట్టేట ముంచిన బాబు

Published Wed, Oct 29 2014 2:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

chandrababu naidu cheats farmers, says ysrcp leaders

తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను నమ్మించి నట్టేట ముంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.  చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో పార్టీ నేతలు విజయ సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా  పార్టీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల పక్షాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని,  నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలుపుతామని పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీకి మంచి భవిష్యత్ ఉందని వారు ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement