నేరాల అదుపునకు సహకరించాలి | Cooperate for control of crime | Sakshi
Sakshi News home page

నేరాల అదుపునకు సహకరించాలి

Published Fri, Dec 13 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

Cooperate for control of crime

ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ :  శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తోందని, నేరాలు అదుపునకు ప్రజలు కూడా సహకారం అందించాలని ఎస్పీ ఎన్.హరికృష్ణ  విజ్ఞప్తి చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్లు అద్దె భవనంలో నడుస్తున్నాయని, వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు చెప్పారు. ఉండి పోలీస్‌స్టేషన్ సొంత భవన నిర్మాణానికి స్థలం ఉన్నా నిధుల కొరత ఉండటంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, సీఐలు నక్కా సూర్యచంద్రరావు, విజయ్‌పాల్, శివాజీరావు, సుభాకర్, ఎస్సైలు కె.నాగేంద్రకుమార్, కిషోర్‌బాబు, శ్రీనివాస్, రజనికుమార్, జోషఫ్‌రాజ్, వన్‌టౌన్ ఏఎస్‌ఎస్‌ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
 పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు
 16న హాజరు కావాలి
 ఏలూరు (ఫైర్‌సేటషన్ సెంటర్) : హైదరాబాద్‌లో పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలలో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజనల్ సిర్టిఫికెట్లతో ఈ నెల 16న ఏలూరులోని పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో హాజరు కావాలని ఎస్పీ హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్‌సీటీ పీసీ (సివిల్) అభ్యర్థులు 24 మంది, ఏఆర్ కు ఐదుగురు, ఏపీఎస్‌పీకి ముగ్గురు, ఎస్‌పీఎఫ్‌కు ఇద్దరు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement