డీఎడ్ ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్ షురూ
బోయపాలెం(యడ్లపాడు) : డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ తొలి సంవత్సరం ప్రవేశాలకు సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం అయింది. గతేడాది నవంబర్, డిశంబర్ నెలల్లో రెండు విడతలు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. చివరి విడతగా మొదటి రెండు దశల్లో డీఎడ్ కళాశాలల్లో సీట్లు లభించని వారికి ప్రభుత్వం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తోంది.
ఈ కౌన్సిల్‌కు రెండోదశలో వెబ్ ఆప్షన్లు చేసుకుని సీట్లు లభించని వారికి నేరుగా వారి సెల్‌ఫోన్లకే సమాచారం డైట్‌సెట్ కన్వీనర్ నుంచి అందింది. సోమవారం డైట్‌లో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు 29 మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించి వివిధ కళాశాలల్లో చేరినట్లు ప్రిన్సిపాల్ ఎన్.రఘుకుమార్ తెలిపారు. కౌన్సెలింగ్ నిమిత్తం డైట్‌లో రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మంగళ, బుధ వారాల్లో కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు.