
జీవం లేదు
* నిర్జీవంగా మారిన పశు సంవర్ధక శాఖ
* వైద్యులు, సిబ్బంది, నిధులు లేక నిర్వీర్యం
ఏలూరు (టూ టౌన్) : కీలకమైన శాఖల్లో పశు సంవర్ధక శాఖ ఒకటి. ప్రతి గ్రామంలోనూ పశువులకు వైద్యసేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యత దీనిపై ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రె లు, పందులు వంటి జీవాలు 15,03,807 ఉన్నాయి. కోళ్లు, శునకాలను లెక్కిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా పశు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సేవ లు ప్రశ్నార్థకంగా మారారుు. జిల్లాలో 100 పశు వైద్యశాలలు, వాటి పరిధిలో 93 సబ్ సెం టర్లు ఉన్నాయి.
వీటికి 106 మంది పశు వైద్యు లు అవసరం కాగా, ప్రస్తుతం 65 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 41 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 201 మంది కాంపౌండర్లు, ఇతర సిబ్బందికి గాను 129 మంది మాత్రమే ఉన్నారు. 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో మూగ జీవాలకు సరైన వైద్య సేవలు అందటం లేదు. ఆసుపత్రులు, సబ్ సెంటర్లలో తగిన సదుపాయూలు సైతం లేవు.
జీవాల సంఖ్య ఇలా
జిల్లాలో మొత్తం 6,71,303 గేదెలు, 1,97, 303 ఆవులు, ఎద్దులు, 4,38,281 గొర్రెలు, 1,86,887 మేకలు, 10,033 పందులు ఉన్నాయి. ఇవి అధికారిక లెక్కలు కాగా, అనధికారికంగా వీటి సంఖ్య ఎక్కువేనని చెబుతున్నారు. వీటికి సీజనల్‌గా వచ్చే వ్యాధులను ఎప్పటికప్పుడు గుర్తించి వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. 185 మంది గోపాల మిత్రలను నియమించటంతో కొంతమేర ఉపశమనం కలుగుతున్నప్పటికీ, పశువులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.
దీనికి తోడు ఏలూరు, భీమవరం, పెంటపాడు, నిడదవోలు డివిజన్ల పరిధిలోని పశువుల ఆసుపత్రుల్లో మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండ టం లేదు. దీంతో పశు పోషకులు మందుల్ని బయట కొనుగోలు చేయూల్సి వస్తోంది. ప్రభుత్వం తగిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.