కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఇందిర జలప్రభ లక్ష్యాల సాధనలో ఏ స్థాయిలో కూడా నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందిర జలప్రభ ప్రగతిపై డ్వామా ఇతర శాఖల అధికారులతో మంగళవారం కాన్ఫరెన్స్ హాలు కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సక్సెస్ అయిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖకు అంచనాల మేరకు డబ్బులు కట్టినా ఇంత జాప్యం జరిగితే ఎలా అంటూ సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిర జలప్రభ కింద వేసిన బోర్లలో 560 సక్సెస్ అయ్యాయని, ఇందులో 238 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్, పంపుసెట్లు అమర్చామన్నారు.
మిగతావాటికి కనెక్షన్ ఎంతకాలానికి ఇస్తారని ప్రశ్నించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పండ్ల తోటలకు డ్రిప్ సౌకర్యం కల్పన, పెండింగ్ భూముల్లో గ్రౌండ్ వాటర్ సర్వే , ఫీజుబులిటీ ఇచ్చిన పాయింట్లలో బోర్లు వేయడం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన పెంచి వాటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డ్వామా అదనపు పీడీ విశ్వనాథరెడ్డి, ఎంఈ నాగసులోచన, ఏపీడీలు లక్ష్మన్న, అబ్దుల్ కలామ్, అరుణకుమారి, అరుణలత, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జలప్రభపై నిర్లక్ష్యం తగదు : కలెక్టర్
Published Wed, Nov 20 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement