జూలై 31కి ఉద్యోగులంతా అమరావతికి
ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
అనంతపురం న్యూసిటీ: ఏపీ ఉద్యోగులంతా జూలై 31నాటికి రాజధాని అమరావతికితరలివెళ్తారని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ఎన్‌జీవో హోంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 15 నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులు, జూలై 31కల్లా వివిధ విభాగాల హెచ్‌వోడీలు రాజధానికి వెళ్తారని చెప్పారు. అయితే 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వారంలో 5 రోజులే పనిదినాలుండాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై జాతీయస్థాయిలో ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. 30న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.