ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలపాలని అధికారులకు ఉద్బోధించారు. 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అధికారులు, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకు ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.
6588 ఎకరాల భూమి పంపిణీ:
జిల్లాలో ఏడో విడత భూ పంపిణీ కింద 4400 కుటుంబాలకు 6588 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరో 1364 కుటుంబాలకు 1028 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో 6 లక్షల 69 వేల 972 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటి వరకు 6 లక్షల 66 వేల 516 హెక్టార్లలో సాగైనట్లు తెలిపారు.
గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 25,642 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని, 25.14 కోట్ల రూపాయల నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో రూ 206 కోట్లతో 2.6 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ30.50 కోట్లతో 68,427 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో 6 లక్షల 15 వేల 330 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
17,424 మందికి రూ 450.39 కోట్ల రుణాలు:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 24,476 గ్రూపులకు రూ 604.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 17,424 మందికి రూ450.39 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 40,459 మందికి రూ41.7 కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,750 మందికి రూ41.25 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.
డీఆర్‌డీఏ ద్వారా స్త్రీ నిధి కింద 2 లక్షల 89 వేల 260 మందికి రూ 106.99 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు లక్షా 43 వేల 179 మందికి రూ 70.98 కోట్లు అందించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 1055 మందికి రూ 1.49 కోట్ల విలువైన పరికరాలు ఇచ్చినట్లు తెలిపారు.
7556 పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం:
విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలో 16343 పంపుసెట్లకు రూ 81.72 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 7556 పంపుసెట్లకు రూ37.78 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 157.79 కోట్లతో 50 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ53.31 కోట్లతో 24 సబ్‌స్టేషన్లు నిర్మించినట్లు తెలిపారు. గృహనిర్మాణ శాఖ ద్వారా 23,132 ఇళ్లను రూ183.47 కోట్లతో నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ70.41 కోట్లతో 8710 గృహాలు నిర్మించినట్లు తెలిపారు. వివిధ రకాల సహకార సంస్థల ద్వారా 24, 512 మందికి రూ 72.67 కోట్లు అందించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 6,125 మందికి రూ 7.08 కోట్లు అందించినట్లు చెప్పారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా 6లక్షల 21 వేల 153 మందికి 728 కోట్లు ఉపకార వేతనాలు, తదితరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల 135 మందికి రూ270.65 కోట్లు అందించినట్లు వివరించారు.
రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల రోడ్లు: రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల మేర 122 రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ132.31 కోట్లతో 79 పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. రూ56.71 కోట్లతో 24 భవనాలు, వంతెనలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.80 కోట్లతో 7 భవనాలు నిర్మించినట్లు చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 504 కిలోమీటర్లను 259.67 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటి వరకు రూ79.43 కోట్ల విలువైన 159 పనులు చేపట్టారన్నారు. రూ 56.90 కోట్లతో 458 భవనాలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 భవనాలు నిర్మించినట్లు వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ49.70 కోట్లతో 413 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 పనులు చేసినట్లు వివరించారు.
గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా రూ541.49 కోట్లతో 3039 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ166.05 కోట్ల విలువైన 2201 పనులు చేపట్టారన్నారు. తాగునీరు, పారిశుధ్యంకు సంబంధించి రూ8.06 కోట్లతో 2022 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ4.90 కోట్లతో 1675 పనులు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
రూ 949.22 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు
జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా రూ949.22 కోట్లతో 28 పనులు చేయాలని నిర్ణయించగా, రూ487.21 కోట్లతో 28 పనులు పూర్తిచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో నాగార్జునసాగర్ కాలువలు, మధ్యతరహా ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూ 476.22 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ313.71 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు రూ 473 కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ173 కోట్ల విలువైన పనులు జరిగినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి రూ39.18 కోట్ల విలువైన 459 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ 13.10 కోట్లతో 149 పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయకుమార్ వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్పీ ప్రమోద్‌కుమార్, జిల్లా జడ్జి రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశంను ప్రగతి పథాన నడిపిద్దాం
Published Mon, Jan 27 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement