సుల్తానాబాద్ మండలం సుగులాంపల్లిలోని సురభి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.