నాగార్జున సాగర్ : టూరిజం అతిథి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ టూరిజం గెస్ట్‌హౌస్ విజయ్ విహార్‌లో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన మహిళలు హైదరాబాద్‌కు చెందిన వారిగా ... యువకులను ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడినవారు వేరువేరు సమయాల్లో రూంలు పొందినట్టు నిర్వాహకులు తెలియజేశారు. పోలీసులకు అనుమానం రాకుడదనే పర్యాటక అతిథి గృహాలను ఎంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.