ప్రభుత్వం నుంచి తాజాగా ఆదేశాలు వస్తే వసతిగృహాల్లో రాత్రి బసపై నిర్ణయం తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
సాక్షి, కరీంనగర్ : ప్రభుత్వం నుంచి తాజాగా ఆదేశాలు వస్తే వసతిగృహాల్లో రాత్రి బసపై నిర్ణయం తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు వారానికో రోజు హాస్టళ్లలో బస చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని గతంలో ప్రభుత్వం ఆదేశించగా, జిల్లాలో కొంతకాలంగా అమలుకు నోచుకోవడం లేదు.
దీనిపై సమరసాక్షి శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. గ్రామ సందర్శనలో ప్రతివారం వసతిగృహాలను మండల అధికారులు తనిఖీ చేస్తున్నారని, ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వరకు హాస్టళ్లలో కనీస సదుపాయాలను కల్పించామని అన్నారు. మండల అధికారులు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం రూ.కోటితో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన లాంటి పనులు చేపడుతున్నామని వివరించారు. గతంలో ఉన్న కలెక్టర్ సన్నిహత పేరిట జిల్లా అధికారులకు వసతిగృహాల బాధ్యతలు అప్పగించారని, అప్పట్లోనే చాలావరకు సమస్యలను తీర్చామన్నారు.