
సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలంటూ నినాదాలు చేశారు.
విజయవాడ: వాక్ ఫర్ పెన్షన్..వోట్ ఫర్ పెన్షన్ నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ నగరంలో ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్ నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ తీశారు. సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ తీర్మానం పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1980 పెన్షన్ రూల్స్‌ను పునరుద్దరిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2లోగా పరిష్కరించపోతే అక్టోబర్ 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.