బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా ఉంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపాలెం వద్ద రెండు బోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న 16 మందిని రక్షించేందుకు కోస్ట్గార్డ్స్ రంగంలోకి దిగారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు.
కృష్ణపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి.