'రాష్ట్ర విభజన అంశంపై నచ్చకే కాంగ్రెస్ గుడ్ బై'
గుంటూరు: కాంగ్రెస్ పార్టీ వీడటంపై మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్ర విభజన అంశంలో యూపీఏ ప్రభుత్వ తీరునచ్చకే కాంగ్రెస్ పార్టీని వీడటం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి వల్ల సీమాంధ్రకు ఒరిగిందేమి లేదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
రాజ్యసభలో సంఖ్యాబలం ఉండటం వల్లే సీమాంధ్రకు కొంతైనా మేలు కలిగిందని ఆమె అన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఎక్కడ్నుంచి పోటీచేయమంటే అక్కడ్నుంచే పోటీచేస్తానని బీజేపీలో చేరిన పురంధేశ్వరి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని పురంధేశ్వరి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.