
అర్థవంతమైన చర్చ జరగాలి: కోటంరెడ్డి
అమరావతి: నూతన అసెంబ్లీలోనైనా అర్థవంతమైన చర్చ జరగాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ ప్రసారాలకు అన్ని చానళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
గతంలో జరిగిన సమావేశాల్లో మంత్రులకు, అధికార పార్టీ నేతలకే మాట్లాడటానికి అవకాశం ఇచ్చారని కోటంరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాల వారు ఎంత కోరినా మైక్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. సభలో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా.. అధికారం ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కొవద్దని కోటంరెడ్డి అన్నారు. ఈ సమావేశాల నుంచి అయినా సభాసాంప్రదాయాన్ని గౌరవించాలని కోరారు.