
సాక్షి, కర్నూలు: విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ సంజీవ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో రాయలసీమలో ప్రముఖ ఆసుపత్రిగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని తెలిపారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు నిధులు విడుదల చేసిందని వెల్లడించారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ)