రచ్చబండ సమీక్షా..? పార్టీ సమావేశమా..?
Published Fri, Nov 22 2013 3:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ :రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రచ్చబండను జిల్లా మంత్రి బొత్స తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రచ్చబండ ఫలాల పేరిట పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో నిర్వహించిన రచ్చబండ సమీక్ష ఆ దిశగానే సాగించారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో అందించాల్సిన సేవల నిర్వహణపై సమీక్షించాల్సి ఉండగా దానిని కాదని కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో పార్టీ కేడర్ పని చేయూల్సిన విధి విధానాలపై సమీక్షించారు.
వార్డుల వారీగా బాధ్యతలను నిర్దేశించారు. వార్డుల్లో ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను చల్లార్చి తిరిగి కాంగ్రెస్ వైపు ఓటర్లను ప్రభావితం చేసేలా పని చేయూలని పరోక్షంగా ఉపదేశించారు. అసంతృప్తితో ఉన్న దిగువ స్థారుు కేడర్‌ను వలలో వేసుకునేందుకు రచ్చబండ విన తుల స్వీకరణ, మంజూరైన సౌకర్యాలను లబ్ధిదారులకు వార్డుల్లో నేరుగా పంపిణీ చేయూల్సిన బాధ్యతలను అప్పగించేలా చర్యలు తీసకున్నారు. తద్వారా వార్డుల్లో ప్రజలను తిప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో పలువురు మాజీ కౌన్సిలర్లు తమ వార్డుల పరిధిలోని సమస్యలను మంత్రి బొత్సకు విన్నవించుకున్నారు. ఇలా సమస్యలు చెప్పిన వారిలో 14, 15, 16, 35 వార్డుల మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే రచ్చబండ సమీక్ష సమావేశం పేరిట పిలిపించి కాంగ్రెస్ నేతలతో సమీక్షించడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఏమి చేయూలో పాలుపోని పరిస్థితుల్లో అసంతృప్తిగానే ఉండాల్సి వచ్చింది. చేసేది లేక మంత్రి మాటలకు అధికారులు తలలూపాల్సి వచ్చింది.
Advertisement