ఏ పార్టీతో పొత్తులేదు: బొత్స | No alliance with Any party: Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

ఏ పార్టీతో పొత్తులేదు: బొత్స

Published Mon, Mar 3 2014 8:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బొత్స సత్యనారాయణ - Sakshi

బొత్స సత్యనారాయణ

హైదరాబాదు: మునిసిపల్ ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. మునిసిపల్ ఎన్నికలపై గాంధీభవన్‌లో అందుబాటులో ఉన్న నేతలతో  బొత్స కసరత్తు చేస్తున్నారు. అన్ని మున్సిపల్ స్థానాలకు పోటీ చేస్తామని  బొత్స చెప్పారు. కార్పోరేటర్, కౌన్సిలర్ల ఎంపిక బాధ్యత స్థానిక నాయకత్వానిదేనన్నారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ విధానం అనుసరిస్తామని చెప్పారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పథకాలే ఎన్నికల ఎజెండా అన్నారు.  

టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆవిర్భవించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీగా మారాలా? వద్దా? అనేది ఆ పార్టీ నేతలు నిర్ణయించుకోవాలన్నారు.  విలీనం అంశం హైకమాండ్ పరిధిలోనిదని చెప్పారు.  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు ముందు తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్షించడంలో తప్పేంలేదన్నారు.  ప్రభుత్వం ఏదైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుందా? లేదా? అనేది  సమీక్షించడం సబబేనని బొత్స అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement