ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్‌కో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. నేపాల్‌ను కుదిపివేసిన భూకంపం ప్రభావం జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఈ కేంద్రానికి అవసరమైన నీరు సముద్రం నుంచి పైపుల ద్వారా సరఫరా చేసుకుంటారు.
భూకంప ప్రకంపనల కారణంగా సముద్ర జలాలు కలుషితం కావడంతో మూడు రోజుల క్రితం సరఫరా నిలిపివేసినట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. సముద్ర జలాలు పూర్వ స్థితికి చేరుకోగానే రెండు, మూడు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి.