ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: మారుతున్న కాలానికి అనుగుణంగా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషియాలజీ ఏపీకాన్ 2013 సెమినార్ ఆదివారం ముగిసింది.
ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైద్యరంగం ఇంత అభివృద్ధి చెందడానికి అనస్తీషియాదే ప్రధాన పాత్ర అని అన్నారు. మత్తుమందు లేకుండా ఆపరేషన్లు సాధ్యం కావని, అందులో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ఉపయోగించుకుని రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ వైద్యంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు నిపుణులైన వైద్యులు సెమినార్ ద్వారా వివరించడం ద్వారా తెలియని అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి సదస్సును ఖమ్మంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈసమావేశంలో మమత విద్యాసంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీసియాలజీ ఏపీకాన్ నేషనల్ అధ్యక్షుడు చక్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దయాల్‌సింగ్, ఉపాధ్యాక్షుడు బి.దామోదర్‌రావు, కార్యదర్శి దామోదర్, రాజగోపాలరావు, మమత కాలేజి ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు, మూర్తి, సెమినార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భాగం కిషన్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ ఖాజా, అనాటమి విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బండారుపల్లి నవీన్‌కుమార్, నాగేంద్ర, భార్గవ్ పాల్గొన్నారు.
ఐఎన్‌ఏ ఖమ్మం నూతన కమిటీ ఎన్నిక
ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీసియాలజీ ఖమ్మం నగర బ్రాంచి నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్‌జికే మూర్తి, కో-చైర్మన్‌గా చందుబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భాగం కిషన్‌రావు, సహాయకార్యదర్శిగా జి.వెంకటేశ్వర్లు, కో-ఆర్డినేటర్‌గా రమణారావు, కోశాధికారిగా ఎస్.కిరణ్‌కుమార్, వీఎస్ లావణ్య, సైంటిఫిక్ సావనీయర్ కమిటీ చైర్మన్‌గా గ్రీష్మా, వర్కుషాప్ కమిటీ అధ్యక్షుడుగా జి.భార్గవ్, రవాణా, అతిథ్య అధ్యక్షుడుగా ఎస్.సాయిబాబాలను నియమించినట్లు చైర్మన్ మూర్తి తెలిపారు.
కాలానుగుణంగా వైద్యం అందించాలి
Published Mon, Oct 28 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement