శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 3,71,000.... కాగా అవుట్ ఫ్లో 3,08,000 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతో పాటు, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి నీటి ప్రవాహం వస్తుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావటంతో ఆరు గేట్లు ఎత్తివేసి 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని, వరద ఉధృతి కొనసాగితే సాయంత్రానికి 18 గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సీఈ ఎల్లారెడ్డి తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
Published Wed, Aug 7 2013 8:28 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement