విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల విజయనగరం, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. గురువారం విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించి ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌పై నెడ్‌క్యాప్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయగా.. మిగిలిన రూ.42 లక్షలను మున్సిపాలిటీ పెట్టుకుందన్నారు.
తద్వారా నెలకు రూ.67, 500 విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, ఇప్పటికే వేసిన ఎల్‌ఈడీల వినియోగం ద్వారా 54శాతం విద్యుత్ ఆదా అవుతున్నట్లు చెప్పారు. ఓ వైపు అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తూనే మరో వైపు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడంపై కేంద్రమంత్రిని ప్రశ్నించగా.. జర్మనీ మినహా మిగిలిన అన్ని దేశాలు అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.
అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అడిగిన మరో ప్రశ్నకు ఆయన మాటదాటవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ జి.నాగరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.
మున్సిపాల్టీల్లో సోలార్ విద్యుత్
Published Thu, Jul 14 2016 11:20 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement