'స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు' | speaker will act in accordance with the rules, says JC diwakar reddy | Sakshi
Sakshi News home page

'స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు'

Published Wed, Nov 20 2013 2:53 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

'స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు' - Sakshi

'స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు'

హైదరాబాద్ : అసెంబ్లీని హుందాగా నడిపిన స్పీకర్ను ముఖ్యమంత్రి వర్గమే అభిశంసించడం వెధవ బుద్ధికి నిదర్శనమని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ అసెంబ్లీ ప్రొరోగ్కు, తెలంగాణ బిల్లుకు సంబంధం లేదని అన్నారు. స్పీకర్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అటార్నీ జనరల్ ఇచ్చిన అభిప్రాయాన్ని కేంద్రం పాటిస్తుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే.. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేనివిధంగా ఈ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 371డీని ముందుగా తొలగించాల్సిందేనని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న కేంద్ర హోంశాఖకు నోట్ సమర్పించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement