ఈ ఫొటోలో ఎస్‌ఐ ఓ యువకుని పీక బలంగా నొక్కుతున్నాడు. ఆ యువకుడేమీ దేశ ద్రోహ నేరానికి పాల్పడలేదు. పేరు మోసిన ఉగ్రవాది అసలే కాదు.
ఈ ఫొటోలో ఎస్‌ఐ ఓ యువకుని పీక బలంగా నొక్కుతున్నాడు. ఆ యువకుడేమీ దేశ ద్రోహ నేరానికి పాల్పడలేదు. పేరు మోసిన ఉగ్రవాది అసలే కాదు. తెలుగుజాతిని నిట్ట నిలువునా చీలుస్తున్న పాలకుల తీరుపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సహచర విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్దకు వచ్చాడు.
జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే.. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ రంగనాయకులుకు కోపం కట్టలు తెంచుకుంది. యువకుడి గొంతు అదిమి పట్టుకున్నాడు. ఆ యువకుడు కేకలు వేస్తున్నా సదరు ఎస్‌ఐ ఏమాత్రం వినిపించుకోలేదు. బలవంతంగా గొంతు అదిమి పట్టి అరెస్టు చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఇదేం దారుణం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
-ఫొటోలు: రమేష్, న్యూస్‌లైన్, కడప