చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అనారోగ్యంతో వృద్ధురాలు శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా... స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు సోమవారం తేలింది. దీంతో ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.